ముద్దనూరు: పింఛన్ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పాపులమ్మ(73) అనే వృద్ధురాలు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన సంఘటన దేనేపల్లెలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో జన్మభూమి కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం పింఛన్ డబ్బు కోసం వెళ్లింది. తీసుకుని ఇంటి ముఖం పట్టింది. ఈ క్రమంలో గ్రామంలో రోడ్డు మీద ఉండగా ఎరువు లోడుతో వున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నరసింహారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.