
సాక్షి, అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): కండ్రిక 59వ డివిజన్‌లో జరిగిన జన్మభూమి బుధవారం రసాభాసగా జరిగింది. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐద్వా నాయకులు నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మహిళా నాయకులంతా పోలీసులు తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వారి ఆందోళనను చూసిన టీడీపీ నాయకులంతా ఎమ్మెల్యే బోండా ఉమాకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. సీపీఎం నగర కమిటీ నాయకులు అక్కడకు చేరుకుని టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సీపీఎం నాయకులను వ్యానుల్లోకి ఎక్కించారు. 19 మందిని అరెస్ట్ చేసి నున్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.