
విజయవాడ: రాహుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాహుల్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ కారు వెనుక నిందితులు ఫాలో అయ్యారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 76 సీసీ కెమెరాల ఫుటేజ్‌లను సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు.
విజయ్‌తో పాటు మరో పది మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రాహుల్ రెండ్ ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. హత్య తర్వాత రాహుల్ రెండు ఫోన్లలో ఒక ఫోన్ మాయమైనట్లు తెలిపారు. మాయమైన ఫోన్‌కు విజయ్, గాయత్రి ఫోన్ చేసినట్లు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
చదవండి: చార్టర్డ్ అకౌంటెంట్ సింధు అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment