assassination case
-
హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్లీన్చిట్
సాక్షి, విజయవాడ: సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కర్నూలు త్రిటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు 9 మందిని ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురికావడంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
ఇజ్రాయెల్ వ్యూహం బ్యాక్‌ఫైర్!
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ అధినేత యాహ్యా సిన్వర్(61) హత్య విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం వికటిస్తోంది. హమాస్ సభ్యులను భయకంపితులను చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన డ్రోన్ వీడియో దృశ్యం నిజానికి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇజ్రాయెల్‌పై భీకర పోరాటానికి పురికొల్పుతోంది. ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జవాన్లు చేసిన దాడిలో సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సిన్వర్ చివరి క్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. సిన్వర్ కుడి చెయ్యి చాలావరకు నుజ్జునుజ్జుగా మారింది. బాంబుల దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఓ భవనంలో ఒక సోఫాలో ఆయన కూర్చొని ఉన్నారు. చుట్టూ దుమ్మూ ధూళి దట్టంగా పేరుకుపోయి ఉంది. తనపై దాడి చేస్తున్న డ్రోన్‌పై ఆయన ఎడమ చెయ్యితో కర్ర లాంటిది విసురుతూ కనిపించారు. ఒకవైపు ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తున్నా, మరోవైపు శత్రువుపై పోరాటం ఆపలేదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిసింది. రక్షణ వలయం లేదు.. కవచం లేదు గాజా భూభాగంలోని భారీ సొరంగంలో సిన్వర్ తలదాచుకుంటున్నాడని, చుట్టూ బాడీగార్డులతో దుర్భేద్యమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడని, అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన వారిని రక్షణ కవచంగా వాడుకుంటున్నాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇజ్రాయెల్ అధికారులు సైతం ఇదే విషయం పదేపదే వెల్లడించారు. కానీ, వీడియో దృశ్యం చూస్తే సిన్వర్ సొరంగంలో లేడు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్నాడు. ఆయన చుట్టూ రక్షణ వలయం గానీ, రక్షణ కవచం గానీ లేదు. ఇజ్రాయెల్ చెప్పిందంతా అబద్ధమేనని ఈ దృశ్యాలు రుజువు చేశాయి. మద్దతుదారుల కంటతడిమృత్యువుకు చేరువవుతూ కూడా సిన్వర్ సాగించిన పోరాటాన్ని చూసి పాలస్తీనావాసులు, హమాస్ మద్దతుదారులు కంటతడి పెడుతున్నారు. వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఇజ్రాయెల్‌పై కసిగా మారుతోంది. సిన్వర్ హత్యకు ప్రతీకారం తప్పదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డ్రోన్ వీడియో దృశ్యం పాలస్తీనా పౌరులకు స్ఫూర్తిదాయకంగా మారడం గమనార్హం. వారంతా ఇజ్రాయెల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. సిన్వర్ త్యాగాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ ఆశించింది ఒకటి కాగా, జరుగుతున్నది మరొకటి కావడం గమనార్హం – సాక్షి, నేషనల్ డెస్క్ఇదీ జరిగిందిసిన్వర్ హత్య ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ సైనికాధికారులు కొన్ని వివరాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 828వ బిస్లామాచ్ బ్రిగేడ్ తాల్ అల్–సుల్తాన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. సైనికుల కంట పడకుండా సందులు గొందులు తిరుగుతూ తప్పించుకొనేందుకు ప్రయతి్నంచారు. వారిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఓ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ డ్రోన్లు గుర్తించాయి. దాంతో జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. యుద్ధట్యాంకుతో పేల్చివేశారు. ఈ ఘటనలో సిన్వర్ మరణించాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను కూడా సైన్యం అంతం చేసింది. అయితే, తొలుత చనిపోయిన వ్యక్తి సిన్వర్ అని ఇజ్రాయెల్ సైన్యానికి తెలియదు. అనుమానంతో మృతదేహం వేలిని కత్తిరించి, ఇజ్రాయెల్‌కు పంపించి డీఎన్ఏ టెస్టు చేశారు. సిన్వర్ డీఎన్ఏతో అది సరిగ్గా సరిపోయింది. దాంతో చనిపోయింది సిన్వర్ అని తేల్చారు. -
బురహాన్‌పల్లి మాజీ సర్పంచ్ హత్య కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సుఫారి గ్యాంగ్ సహాయంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి పథకం ప్రకారం దేవేందర్ హత్య జరిగిందని వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు.రాయపర్తి మండలం బురహాన్‌పల్లిలో గతనెల 7న మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్యకు గురయ్యాడు. భూ తగాదాలు, వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని.. ఈ హత్యలో పల్లె మల్లేశం అతడి కుమారుడు మురళి కీలకంగా వ్యవహరించి హైదరాబాద్‌కు చెందిన సుంకర ప్రసాద్, మర్నేని రాజు అనే సుపారి గ్యాంగ్ ద్వారా హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇందులో A1గా సుంకర ప్రసాద్ నాయుడు, A2 గా మర్నేని రాజు సహా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ తెలిపారు. -
కర్నూలు: టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆధిపత్యం కోసం టీడీపీ నేతలే హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. హత్యకు ఆధిపత్య పోరే కారణమని డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు.హత్య వెనకా రాజకీయ కోణం ఉంది. అందుకే అంత మొందించారు. టీడీపీకి చెందిన గుడిసె నరసింహులతో పాటు మరో ముగ్గురు హత్యకు కుట్ర పన్నారు. ఇద్దరు మైనర్లతో హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితులను పత్తికొండ కోర్టులో రిమాండ్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని జువైనల్ కోర్టుకు తరలించారు.శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. అయితే ఈ హత్యను మంత్రి నారా లోకేష్.. వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన జరిగింది. -
ప్రియుడి మోజులో.. భర్తనే కడతేర్చింది..
ఒంగోలు టౌన్: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్ ఇన్స్పెక్టర్ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసులో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆ యువకుడికి అలా దగ్గరైంది.. ఒంగోలులోని పీఎఫ్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్ఆర్ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్ నహీద్, షేక్ ఫజ్లూ, సయ్యద్ సిద్దిక్, షేక్ ముబారక్‌లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ వివరించారు. -
దోషికి ఉరిశిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో ఘాతుకానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. 2018 నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలిక లైంగిక దాడి, హత్యకు గురైంది. బాలికపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్‌కుమార్ లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు.2021లో దోషి దినేష్‌కుమార్‌కు రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. రంగారెడ్డి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. -
కూటమికి వెంటిలేటర్ తీసేసినట్లేనా?
రెండు కాళ్లూ పడిపోయి చంకల్లో కర్రలు పెట్టుకుని దేకుతూ వెళ్తున్నవాడి కర్రలు ఫాట్ మని లాగేస్తే ఏమవుతుంది? అన్ని అవయవాలూ పని చేయడం మానేస్తూ.. ఒక్కోటీ విశ్రమిస్తుంటే.. ఏదోలా ఆయువును నిలుపుతున్న వెంటిలేటర్‌ను ఆపేస్తే ఏమవుతుంది. ఏదోలా గౌరవ ప్రదమైన స్కోర్ చేస్తాడు అనుకున్న బ్యాట్స్ మ్యాన్ రెండో బంతికే అవుటైతే ఎలా ఉంటుంది.. గోల్డ్ మెడల్ తెస్తాడు అనుకున్నవాడు డోపింగ్ టెస్టులో దొరికిపోతే ఏమవుతుంది.. ఆ అందరి ఆశలూ గల్లంతవుతాయి. భవిష్యత్ అంధకారమవుతుంది.. కొన్ని జీవితాలు ముగిసిపోతాయి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామం కూడా అచ్చం అలాంటిదే. తెలుగుదేశం.. జనసేన.. బీజేపీ.. ఇంకా కాంగ్రెస్ నాయకులూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక్కటంటే ఒక్క కారణం, రాజకీయ ఆధారం కనిపించడం లేదు. గతంలో టీడీపీ- జనసేన-బీజేపీ కలిపినా ఉమ్మడి పాలనలో రాష్ట్రానికి ఏమి చేశారన్నది వాళ్లు ఒక్క ముక్కా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలను మిళితం చేసి రుచి చూపించిన పాలనకు ప్రజలు ఫిదా అయ్యారు. ఈసారి కూడా జగన్ మళ్లీ గెలవాలని రైతులు.. మహిళలు.. యువత.. పేదలు... దళితులూ.. మైనారిటీ గిరిజనవర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల జాబితా సూపర్ సిక్స్ ను ప్రజలు నమ్మడం లేదు... ఎందుకంటే బాబుకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. అందుకే సూపర్ సిక్స్ పెద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కూటమి నాయకులూ యావత్తు.. తాము మూడుసార్లు గెలిచాక ఏమి చేసాం.. మళ్ళీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తాం అనేది చెప్పకుండా ఐదేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్యకేసును ప్రచారాంశంగా మార్చుకుని పదేపదే అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. మాటిమాటికీ హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు అరుస్తూ ఆ హత్యకేసును సీఎం వైయస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డికి చుట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదే ఎజెండాను అటు వివేకా కుమార్తె సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పవన్ కళ్యాణ్, ఆఖరుకు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్రెడ్డిని దోషిగా మార్చేందుకు యాతన పడుతున్నారు. వాస్తవానికి ఈ కేసు ఇప్పటికే సీబీఐ విచారణలో ఉండగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ విచారించింది. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని పదేపదే ప్రజల్లోకి తీసుకెళ్లడం అనైతికమని చంద్రబాబుకు తెలుసు కానీ అది మినహా వేరే అంశం తనకు లేకపోవడంతో ఎంతసేపూ వివేకా హత్య అంశమే ప్రచారాంశం అవుతోయింది. దీంతో ఇక ఈ హత్య కేసును ఆ అంశాన్ని ప్రచారంలో వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను బలపర్చిన న్యాయస్థానం వైఎస్ షర్మిళ, సునీత, చంద్రబాబు, పవన్, లోకేష్.. పురందేశ్వరి ఇలా ఎవరూ ఆ హత్య కేసును ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు ఆదేశించింది. దీంతో కూటమి నాయకులకు గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. ఇన్నేళ్ల పాలనలో తాము చేసింది కానీ.. చేయబోయేది కానీ చెప్పుకునేందుకు ఒక్కటీ లేని పరిస్థితుల్లో కేవలం ఆ హత్య కేసుని పదేపదే సభల్లో ప్రస్తావించి పబ్బం గడుపుకుందాం అనుకున్న చంద్రబాబుకు ఇది షాకింగ్ వార్త.. ఇక ఈ అంశం మాట్లాడకుండా ఎన్నికల సభలు ఎలా నిర్వహిస్తారో ఆయనకు.. లోకేష్.. పవన్.. పురందేశ్వరికి తెలియాలి. ఇక చేయడానికి ఏమీ లేని తరుణంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో.. ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.. -సిమ్మాదిరప్పన్న -
బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే..
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీశ్ కుమార్‌ను ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్‌పై దాడికి పాల్పడేలా పురిగొల్పారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళిక’ అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ కుమార్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు లో ప్రధాన నిందితుడైన వేముల సతీశ్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఏ 2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్రదారుల పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో వెలికితీశారు. హత్యాయత్నానికి పాల్పడిన వేముల సతీష్‌ను ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొంటూ గురువారం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి సతీష్‌ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని ఏ 2గా పేర్కొంటూ, ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఏ2 గా ఉన్న నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్ నియోజవర్గ టీడీపీ బీసీ సెల్లో కీలక నేత. అంతేగాక సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ కీలక నేత కావడం గమనార్హం. రిమాండ్ నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ.... గతంలోనూ నేర చరిత్ర.. ముఖ్యమంత్రి జగన్‌ను హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వేముల సతీష్ కుమార్‌ను ఎంపిక చేశారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు ఏ2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్‌ను ఏ2 ప్రేరేపించాడు. ముందే చేరుకుని మాటు వేసి.. కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లోకి ప్రవేశించక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్ వద్దకు చేరుకుని మరి కొంతమందితో కలసి మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్ తన ఫ్యాంట్ జేబులోని పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసి సీఎం వైఎస్ జగన్‌పై బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సిమెంట్ కాంక్రీట్ రాయి ముఖ్యమంత్రి తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తెరవెనుక కుట్రదారులపై దృష్టి ఈ కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేíÙంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెరవెనుక ఉన్న ప్రధాన కుట్రదారులపై పోలీసులు దృష్టి సారించారు. కుట్రదారులు ప్రేరేపించడంతోనే వేముల సతీశ్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని ప్రేరేపించిన ఏ2ని కూడా గుర్తించారు. ఏ2 పాత్రకి సంబంధించి మరింత సమాచారంతోపాటు అతడి వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2 పాత్రను నిర్ధారించాయి. మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్‌ను అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లాకప్‌లో ఉంచారు. నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు సీఆర్పీసీ 50 కింద నోటీసులు కూడా జారీ చేశారు. -
సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్లో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సింగ్ నగర్‌లోని వివేకానంద పాఠశాల ప్రాంగణం నుంచే పదునైన రాయితో హత్యాయత్నానికి పాల్పడినట్టు వీడియో ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. డాబా కొట్ల జంక్షన్ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, ఆ ప్రాంతంలోని పలువురి సెల్ ఫోన్లలో వీడియో రికార్డులు, హత్యాయత్నం చేసిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు సమాచారం. దాని ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. రౌడీషి టర్లు, బ్లేడ్ బ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు పలువురు అనుమానితులను గుర్తించారు. పోలీసు రికార్డుల ప్రకారం నేర చరితులతోపాటు ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వీడియో ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా దాదాపు 60 మంది వరకు అనుమానితులను మ్యాపింగ్ చేశారు. వారిని పోలీసులు పిలిపించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలో మాజీ ప్రజాప్రతినిధి వర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించే రౌడీషిటర్లు, బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు, ఇతర అసాంఘిక శక్తులపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి వారి కాల్ డేటాను విశ్లేíÙస్తున్నారు. అనుమానితులు ఏయే ప్రాంతాల్లో సంచరించింది.. వారి ఫోన్ల నుంచి ఎవరెవరికి కాల్స్ చేశారు.. గ్రూప్ కాల్స్ ఏమైనా మాట్లాడారా అనే కోణాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు. ఆ వివరాల ఆధారంగా అనుమానితులను పలు కోణాల్లో ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానాలను కాల్ డేటా విశ్లేషణతోపాటు ఆ ప్రాంతంలోని వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెప్పిన వివరాలతో సరిపోలుస్తున్నారు. ఆ విధంగా పిలిపించి విచారించిన దాదాపు 60మందిలో ఓ పదిమంది తీరు సందేహాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు. వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. డాబా కొట్ల సెంటర్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో.. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి డాబా కొట్ల జంక్షన్ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఈ కేసును ఛేదించాలని భావిస్తున్నారు. వివేకానంద స్కూల్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో యాత్ర సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని ఆగంతుకుడికి ముందే తెలుసు. ఆ స్కూల్ ప్రాంగణంలో మాటు వేసి హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే మాకినేని బసవపున్నయ్య స్టేడియం నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉండటం వల్లే డాబాకొట్ల ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారని ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాంతంపై ఆగంతకుడికి పూర్తి పట్టు ఉండటంతో ఆ ప్రాంతానికి లేదా ఆ సమీప ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని తన ఇంటికి లేదా తనకు ఆశ్రయం ఇచ్చేవారి ఇంటికి సులువుగా చేరుకుని పోలీసుల కళ్లు కప్పవచ్చనే ధీమా కూడా ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే సింగ్ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్‌లు, ఇతర అసాంఘిక శక్తులపై పోలీసులు దృష్టి సారించారు. వారిలో రాజకీయ పారీ్టల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు, ప్రత్యర్థి పార్టీ వర్గీయులతో ఘర్షణ పడ్డ చరిత్ర ఉన్నవారు, గంజాయి తదితర వ్యసనాలకు బానిసైనవారు.. ఇలా పలు కోణాల్లో అనుమానితులను గుర్తించి విచారించే ప్రక్రియను వేగవంతం చేశారు. సమాచారమిస్తే రూ.2లక్షల బహుమతి ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆగంతుకుడి సమాచారం అందిస్తే రూ.2లక్షల నగదు బహుమతి అందిస్తామని విజయవాడ పోలీసులు సోమవారం ప్రకటించారు. అగంతకుడికి సంబంధించిన సమాచారం/వీడియో, సెల్‌ఫోన్ ఫుటేజీ అందించినా, హత్యాయత్నాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ముందుకు వచ్చి సమాచారమిచి్చనా ఈ బహుమతి అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచి్చనవారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆగంతకుడి సమాచారాన్ని నేరుగా లేదా ఫోన్/వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. సమాచారం అందించేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కంచి శ్రీనివాసరావు, డీసీపీ 9490619342 ఆర్. శ్రీహరిబాబు, ఏడీసీపీ, టాస్క్ ఫోర్స్: 9440627089 -
మాటు వేసి.. మట్టుబెట్టే కుట్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేసేందుకే పక్కా పన్నాగంతో ఆయనపై ఆగంతకుడు దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ముందుగా రెక్కీ నిర్వహించి సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు అనువుగా ఉందనే విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని డాబా కొట్ల జంక్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లు నిర్దారణ అయింది. క్యాటర్ బాల్ / ఎయిర్‌గన్ లాంటి పరికరం ద్వారా పదునైన రాయి లాంటి వస్తువుతో దాడికి పాల్పడ్డాడు. కణతపైగానీ తల వెనుక దిగువ భాగంపైగానీ తీవ్రంగా దాడి చేయడం ద్వారా ముఖ్యమంత్రిని అంతమొందించాలన్నదే దుండగుల లక్ష్యమని వెల్లడైంది. దాడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై ఆగంతకుడు ఎక్కడ నుంచి ఏ విధంగా దాడికి పాల్పడ్డాడనే దానిపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలు, టవర్ పరిధిలోని సెల్ ఫోన్ల డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. అనుమానితులపై నిఘా పెట్టడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాకు నివేదిక సమర్పించారు. హత్య చేసేందుకే పక్కాగా రెక్కీ.. ముఖ్యమంత్రి జగన్‌పై ఆగంతకుడి దాడి లక్ష్యం ఆయన్ని అంతం చేయడమేనని పోలీసులు నిర్ధారించారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలో కొనసాగే వివిధ ప్రాంతాల్లో ఆగంతకుడితోపాటు ఈ కుట్రలో ఇతర పాత్రధారులు రెక్కీ నిర్వహించారు. సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు డాబా కొట్ల జంక్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. కాస్త ఇరుకుగా ఉండే ఆ రోడ్డులో కుడివైపు ఇళ్లు, దుకాణాలున్నాయి. అక్కడ ప్రజలు భారీగా గుమిగూడతారు. ఎడమ వైపున వివేకానంద స్కూల్ భవనం ఉంది. అటువైపు జన సంచారం ఉండదు. సీఎం జగన్ తన వాహనంపై నుంచి కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వెళతారు. ఎడమ వైపు ఎవరూ దృష్టి సారించరు. అంతేకాకుండా ఆ జంక్షన్‌లోనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. సీఎం జగన్ ప్రయాణిస్తున్న భారీ ప్రచార వాహనం వెళ్లేందుకు వీలుగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని గుర్తించారు. దీంతో స్కూల్ భవనం వైపు పూర్తిగా చీకటి కమ్ముకుని ఉంటుంది. ప్రహరి లోపల స్కూల్ భవనానికి, ఆ పక్కనే ఉన్న గంగానమ్మ ఆలయానికి మధ్యలో ఖాళీ స్థలంలో నిందితులు మాటు వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. స్కూల్ ప్రాంగణం వెనుక వైపు నుంచి తూర్పు దిశలో ఉన్న చిన్న ఇనుప గేటు దాటి మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోకి వెళ్లి సులభంగా తప్పించుకునేందుకు అవకాశం ఉంది. సీఎం జగన్ యాత్రకు సంఘీభావంగా హాజరైన భారీ జనసందోహంలో కలసిపోతే ఎవరూ గుర్తించ లేరు. ఇన్ని రకాలుగా కసరత్తు చేసిన అనంతరమే వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి దాడి చేసేందుకు ఆగంతకుడు తెగబడ్డాడు. వీడియో ఫుటేజీ విశ్లేషణ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో వీడియో ఫుటేజీని పోలీసులు విశ్లేషించారు. వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి 45 డిగ్రీల కోణంలో బలమైన రాయి లాంటి వస్తువు అత్యంత వేగంగా దూసుకొచ్చి సీఎం జగన్ ఎడమ కనుబొమ్మ పైభాగంలో బలంగా తాకినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఆయనకు తగిలి అనంతరం ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా బలంగా తాకింది. సీఎం జగన్‌కు ఎడమ కనుబొమ్మ పైభాగంలో తీవ్ర గాయం కాగా ఎమ్మెల్యే వెలంపల్లి కంటికి కూడా తీవ్ర గాయమైంది. ఆ ప్రదేశంలో రోడ్డువైపు నుంచి వివేకానంద స్కూల్ ప్రహరి గోడ ఆరు అడుగుల ఎత్తు ఉంది. స్కూల్ ప్రాంగణంలో నేల ఎత్తు చేయడంతో లోపల వైపు నుంచి ప్రహరి కేవలం మూడు అడుగుల ఎత్తే ఉంది. అక్కడి నుంచి సీఎం వాహనం వచ్చే రోడ్డు కేవలం 20 అడుగుల దూరమే ఉంది. ఆ ప్రహరి లోపల ముందుగానే మాటు వేసిన ఆగంతకుడు సీఎం వాహనం అక్కడికి చేరుకోగానే బలమైన రాయిని క్యాటర్ బాల్తోగానీ ఎయిర్‌గన్ వంటి పరికరంతోగానీ బలంగా గురి చూసి కొట్టాడు. 45 డిగ్రీల కోణంలో బలంగా వచ్చిన రాయి సీఎం జగన్‌కు తగిలింది. సీఎం జగన్ రోడ్డుకు కుడివైపున ఉన్న జనసందోహాన్ని చూస్తూ అభివాదం చేస్తుండగా దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఎడమ కణతపైగానీ తల వెనుక కింద భాగంలోగానీ దాడి చేయాలన్నది ఆగంతకుడి ఉద్దేశమన్నది స్పష్టమైంది. ఎందుకంటే కణతపైగానీ తల వెనుక కింద భాగంలోగానీ బలంగా దాడి చేస్తే మెదడుకు తీవ్రగాయం /మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కణత ప్రాంతంలో మెత్తగా ఉండే ఎముక విరిగి మెదడుకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. దాంతో మెదడులో రక్తస్రావమై ప్రాణాపాయం సంభవించవచ్చు. తల వెనుక కింద భాగంలో తగిలినా, మెదడు దెబ్బతిన్నా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను అంతమొందించాలనే పక్కా ప్రణాళికతోనే ఆగంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ తలను కాస్త పక్కకు తిప్పడంతో ఆ బలమైన రాయి ఆయన కణతకు, తల వెనుక కింద భాగంలో కాకుండా ఎడమ కనుబొమ్మ పైభాగంలో తగిలింది. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కీలక ఆధారాలు లభ్యం సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. శనివారం రాత్రి నుంచి అజిత్‌సింగ్ నగర్‌లోని డాబా కొట్ల జంక్షన్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తదితర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దాడి ఎలా జరిగిందనే అంశంపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు కోసం ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదివారం ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌లో ఆరు టాస్క్‌ఫోర్స్ బృందాలున్నాయి. దాడి జరిగిన ప్రదేశాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ఆగంతకుడు ఏ మార్గాల్లో తప్పించుకునేందుకు అవకాశం ఉంది? ఎంత దూరం వెళ్లి ఉండవచ్చు? అనే కోణాల్లో విశ్లేషిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న 24 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. గంగానమ్మ గుడి ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ పరిధిలోని మొబైల్ ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక బలగాలను మోహరించి ఆ ప్రాంతంలో విస్లృతంగా తనిఖీలు చేపట్టారు. డాబా కొట్ల జంక్షన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నేర చరిత్ర ఉన్నవారి వివరాలను ఆరా తీస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ తరహా దాడులకు పాల్పడ్డ నేరగాళ్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గతంలో విజయవాడలో దాడులకు పాల్పడిన వారి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, ఇతర శాస్త్రీయ ఆధారాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి పోలీసులు ఈ కేసులో ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారి నుంచి కీలక వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కుట్ర కోణంపై దృష్టి సీఎం జగన్‌పై దాడికి పాల్పడ్డ ఆగంతకుడితోపాటు నిందితుడి వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరనే కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. ఈ కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసులు ఇప్పటికే కీలక పురోగతి సాధించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసు దర్యాప్తులో స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం అసలు కుట్రదారులెవరనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తామని చెబుతున్నారు. త్వరలోనే ఛేదిస్తాం సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్ డాటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను విశ్లేషిస్తూ దర్యాప్తు చేస్తున్నాం. కేసులో ఇప్పటికే కొంత పురోగతి సాధించాం. – కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్ కమిషనర్ -
హత్యాయత్నం కేసులో టీడీపీ నేతల అరెస్ట్
తిరుత్తణి/నగరి (చిత్తూరు జిల్లా): ఏపీ మంత్రి రోజా కార్యాలయ నిర్వాహకుడు ప్రతీష్పై ఈ నెల 2వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతల్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో ప్రతీష్ పై హత్యాయత్నం తెలుగుదేశం కుట్రేనని స్పష్టమైంది. తెలుగుయువత నాయకులైన నిందితులు టీడీపీ నగరి ఇన్చార్జి గాలి భానుప్రకాష్ అనుచరులే. వీరిని ఆదివారం నగరి, తిరుత్తణి సరిహద్దులోని తాళవేడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యాయత్నం చేసింది తామేనని చెప్పడంతో నగరి మండలం మేళపట్టుకు తెలుగుయువత మండల ఉపాధ్యక్షుడు నవీన్ అలియాస్ వెట్టు నవీన్, నాయకులు నగరి మున్సిపాలిటీ కీళపట్టు బీసీ కాలనీకి చెందిన చిరంజీవి, నిండ్ర మండలం వైఎన్ కండ్రిగకు చెందిన పరశురాం అలియాస్ మధులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. హత్యకు తెలుగు యువత మండల అధ్యక్షుడి కుట్ర ప్రతీష్ను హత్యచేసేందుకు తెలుగుయువత మండల అధ్యక్షుడు చిట్టిబాబు ప్రణాళిక రూపొందించినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ కేసు వివరాలను తిరుత్తణి సీఐ మార్టిన్ ప్రేమ్‌రాజ్ విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భానుప్రకాష్ పై ఆర్కే రోజా గెలవడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం వర్గీయులు ఆమెపై కక్షపెంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే.. రోజా తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె కార్యాలయ మేనేజర్ ప్రతీష్ను హత్యచేయాలని తెలుగుయువత నగరి మండల అధ్యక్షుడు చిట్టిబాబు కుట్రపన్నారు. అతడితో నవీన్, చిరంజీవి, పరశురాం చేతులు కలిపారు. నగరిలో హత్యచేస్తే రాజకీయరంగు పులుముకుంటుందని, అందువల్ల ప్రతీష్ను అతను ఉండే తిరుత్తణిలోనే హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ తిరుత్తణిలో బసచేశారు. ప్రతీష్ వాకింగ్ చేసే ప్రదేశాన్ని రాత్రి ఒంటిగంట సమయంలో పరిశీలించి వచ్చిన చిట్టిబాబు హత్యచేయడానికి అనువుగా ఉందని మిగిలినవారికి చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా వస్తే సమాచారం అందించడానికి నిండ్రకు చెందిన ముగ్గురు కిరాయి మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వచ్చిన ప్రతీష్పై ఇనుపరాడ్లతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తలపై కొట్టే సమయానికి ప్రతీష్ చెయ్యి అడ్డుపెట్టడంతో చేతికి బలమైన గాయమైంది. ఇంతలో సమీపంలో ఉన్న జనం కేకలు వేయడంతో ఇప్పుడు మిస్ అయింది.. మరోసారి వేసేస్తాం.. అని అరుస్తూ ముళ్లకంపల మధ్య దాచి ఉంచిన బైక్ మీద పరారయ్యారు. పార్టీ నాయకులకు సన్నిహితం హత్యాయత్నం కేసులో నిందితులు పార్టీ నాయకుడు గాలి భానుప్రకాష్తో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు లోకేశ్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సెల్ఫీ తీసుకునే చనువు కూడా వారికి ఉంది. -
జగన్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, అమరావతి: విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు విచారణను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మూడు వారాలు పొడిగించింది. తదుపరి విచారణకు ఇరుపక్షాలు వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం తెలిసిందే. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి జనుపల్లి ప్రయత్నించాడు. జగన్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఎడమ చేయికి గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేసి.. చార్జిషీట్ దాఖలు చేసింది. జగన్‌ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని చార్జిషీట్లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడికత్తి సంపాదించాడని, అదును చూసి జగన్‌పై దాడిచేశాడని వివరించింది. దీనివెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. అయితే తరువాత ఎన్ఐఏ.. కుట్రకోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడో తేల్చలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు చేసేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్‌లో విచారించిన హైకోర్టు.. విశాఖ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. -
ఆరు హత్యల కేసులో ఐదుగురు అరెస్టు
సాక్షి కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఇంటి కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులోని నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన పూనే ప్రసాద్ (36)కు భార్య శాన్విక అలియాస్ రమణి (29), కవల పిల్లలు చైత్రిక (8), చైత్రిక్ (8), తల్లి సుశీల, ఇద్దరు చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు. ఓ యువతి ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాక ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకు మకాం మార్చాడు. ఆ కేసు నిమిత్తం డబ్బులు అవసరమై గతంలో తన స్నేహితుడు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్యన ప్రశాంత్ తనకు రావాల్సిన డబ్బులను ప్రసాద్‌ను అడగగా స్వగ్రామం మాక్లూర్‌లోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రూ.25 లక్షలు విలువ చేసే ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ పథకం పన్నాడు. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్చేసిస్తే లోన్ తీసుకుని తనకివ్వాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన మొత్తం ఇస్తానని ప్రసాద్‌ను నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని రిజిస్ట్రేషన్చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోగా, చివరికి హత్య చేయాలని భావించాడు. రూ.60 వేలకు సుపారీ.. ప్రసాద్‌ను హత్య చేసేందుకు మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన బానోత్ వంశీ, గుగులోత్ విష్ణులకు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రశాంత్ ఒప్పందం చేసుకున్నా డు. గత నెల 29న మాట్లాడుకుందామని నమ్మించి ప్రశాంత్, వంశీ, విష్ణులతో కలిసి ప్రసాద్‌ను కారులో మదనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడే గోతిని తవ్వి పాతి పెట్టారు. ఈనెల 1న పోలీసుల భయంతో ప్రసాద్ ఓ చోట దాక్కున్నాడని, అతను రమ్మన్నాడని చెప్పి భార్య శాన్విక (గర్భవతి), ప్రసాద్ చెల్లెలు శ్రావణిను వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఓ చోట ఉంచి శాన్వికను బాసర బ్రిడ్జి సమీపంలోకి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి నిందితులందరూ కలిసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారు. ఆ వెంటనే శ్రావణి దగ్గరకు వెళ్లి ఆమె ను కారులో ఎక్కించుకుని చేగుంట మండలం వడియారం ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మళ్లీ పాల్వంచకు వచ్చి ప్రసాద్ తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఇద్దరు పిల్లలను ఈనెల 4 న అదే కారులో తీసుకువెళ్లి నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లి వడ్డెమ్మతో చెప్పి సహకరించాలని కోరాగా ఆమె ఒప్పుకుంది. తప్పించుకున్న తల్లి ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడని సుశీలను, స్వప్నను నమ్మించారు. సుశీల, స్వప్నలను లాడ్జిలోనే ఉంచి ఇద్దరు పిల్లలను ప్రశాంత్, అతని తమ్ముడు తీసుకుని వెళ్లారు. నిర్మల్ వెళ్లే దారిలో ఉండే సోన్ బ్రిడ్జి వద్దకు వెళ్లేలోగా కారులోనే ఇద్దరు పిల్లలను తాడుతో ఉరి బిగించి హత్య చేసి గోనె సంచుల్లో కట్టి వాగులో పడేశారు. ఈ నెల 13న లాడ్డి నుంచి స్వప్నను కారులో తీసుకువెళ్లిన ప్రశాంత్, మై నర్ బాలుడు, వంశీ కలిసి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలోని ప్రధాన రహ దారి పక్కన హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిందితులు ప్రసాద్ తల్లిని కూడా చంపేయాలని ప్లాన్ చేసినా చివరగా ఆమెకు అనుమానం వచ్చి లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయి తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల గుర్తింపు.. భూంపల్లి వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఒకే తరహా హత్యలు చేగుంట, సదాశివనగర్, మెండోరా (సోన్ బ్రిడ్జి) పీఎస్‌ల పరిధిలో వెలుగు చూడటంతో వాటి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనే కోణంలో విచారించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు. సెల్‌ఫోన్ టవర్ డంప్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని మాక్లూర్ కు చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. మంగళవారం నిందితులంతా కలిసి కారులో ప్రసాద్ తల్లిని వెతుకుతూ పాల్వంచకు వెళ్తుండగా పద్మాజీవాడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. -
డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కర్ణంగూడలోని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో నెలకొన్న భూ వివాదాలపై శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డితో పాటుగా ఖాజా మొయినోద్దీన్ , భిక్షపతిలకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు 10 ఎకరాల భూమి కొన్నారు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశారు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి సైట్ వద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 2022 మార్చి 1, మంగళవారం ఉదయం మట్టారెడ్డి ఇతరులతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, రాఘవేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య అనంతరం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు విచారణ మరింత సులువు అయ్యింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా మట్టారెడ్డే సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్ణంగూడలోని లేక్ విల్లా ఆర్చిడ్స్ లో నెలకొన్న భూ వివాదం ఈ హత్యలకు కారణమైంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలను హత్య చేయాలని సుఫారీ ఇచ్చి మట్టారెడ్డి ప్లాన్ చేశారు. వివాదంలో ఉన్న భూమి వద్దకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై కాల్పులకు దిగి హత్య చేశారు నిందితులు. ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఇబ్రహీం పట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిపై పోలీస్ శాఖ విధుల నుండి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకుంది. చదవండి: ‘మణప్పురం’లో బంగారం మాయం -
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది, కాగా 2020 అక్టోబర్18న మహబూబాబాద్‌కు చెందిన కుసుమ వసంత, రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లా.. బాలుడిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అదే రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇది జరిగిన మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన ఉదంతం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. మళ్లీ దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్‌ను చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్టైన సాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. చదవండి: హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి -
ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా
న్యూయార్క్: ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంలో భారతీయ నిఘా వర్గాల పాత్రపై అమెరికా జాతీయ భద్రతా మండలి ఉన్నతాధికారి స్పందించారు. ‘ కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యతో భారతీయ నిఘా వర్గాలకు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేస్తున్న ఆరోపణలు నిజంగా తీవ్రమైనవి. ఈ వివాదం ముగిసిపోవాలంటే సమగ్ర, విస్తృతస్థాయి దర్యాప్తు అవససరం. కెనడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఇందుకు భారత్ సైతం పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేం కూడా కోరుకుంటున్నాం’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయ కర్త(వ్యూహాత్మక సంబంధాలు) జాన్ కిర్బీ సీఎన్ఎన్ వార్తాసంస్థ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. -
ప్రియుడితో కలసి అక్కను చంపి..
కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ (25), అతడి తల్లి సయ్యద్ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్ మిత్రుడు హఫీజ్ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరూ బీటెక్ చదివారు.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్‌రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్‌ఫ్రం హోమ్ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. తన సీనియర్, హైదరాబాద్‌కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ ఒక ఏడాది డిటెయిన్ కావడంతో చందనకు క్లాస్మేట్ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే.. చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్ షేక్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్ షేక్ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్ అమలు చేసింది. సూత్రధారి చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్ షేక్ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్ షేక్ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్ ఉమర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉమర్ షేక్ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్ పరారయ్యారు. వాయిస్ మెసేజ్‌తో దారిమళ్లింపు.. అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్‌లోని తన ప్రియుడు ఉమర్ షేక్ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్‌పూర్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్లో వాయిస్ మెసేజ్ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది. నాగ్‌పూర్ వెళ్తుండగా.. చందన, ఉమర్‌షేక్ సెల్ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్‌ను నాగ్‌పూర్ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు. -
వివేకా హత్యతో లబ్ధి పొందింది సునీత, ఆమె భర్తే
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో లబ్ధి పొందింది ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ తరఫు న్యాయవాది టీఎల్ నయన్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. హత్య చేసే కారణం కూడా వారికే ఉందని వివరించారు. వివేకా హత్య వల్ల ఇతరులు పొందే ప్రయోజనం ఏమీ లేదన్నారు. వివేకా ఆస్తులన్నీ సునీత, ఆమె భర్త సొంతమయ్యాయని తెలిపారు. తండ్రి ఆస్తులను దక్కించుకున్న తరువాత సీబీఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సునీత వ్యవహరిస్తున్నారని వివరించారు. ప్రతి కోర్టులో, ప్రతి పిటిషన్లో ప్రతివాదిగా చేరుతూ (ఇంప్లీడ్) పిటిషన్ల మీద పిటిషన్లతో, అవాస్తవాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆమె వాదనలను సీబీఐ న్యాయవాదుల ద్వారా చెప్పిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో సునీత బాధితురాలు కాదని... మృతుడు వివేకానందరెడ్డే ఆమె బాధితుడని చెప్పారు. వారి బండారం బయట పడుతుందన్న భయంతోనే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ సైతం ఆ కోవలోకే వస్తుందన్నారు. అందువల్ల దాన్ని కొట్టేయాలని నయన్ కుమార్ కోర్టును కోరారు. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సహా మరికొందరిపై కడప కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు పెండింగ్‌లో ఉందన్నారు. 2021 ఆగస్టు 2 నుంచి జైలులో ఉన్నానని, చార్జిషీట్ కూడా దాఖలు చేసినందున, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్ యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు. నయన్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘వివేకా హత్య కేసులో కీలక నిందితుడు, కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి పిటిషన్‌ను తప్ప ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని సునీత కోర్టులను కోరుతూ వస్తున్నారు. వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వాంగ్మూలం ఇచ్చి, ఆయన్ని హత్య చేసిన వారిలో తానూ ఉన్నానని చెప్పిన దస్తగిరికి ఆమె సహకరిస్తున్నారు. అతనికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని, అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వడంపై సునీత నోరెత్తలేదు. ఆమె న్యాయం కోసం నిష్పాక్షికంగా వ్యవహరించడంలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సమాంతరంగా కేసులను పర్యవేక్షిస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారు. ఒక రకంగా సీబీఐని శాసిస్తున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తు సైతం పక్కదారి పట్టింది. అంతేకాకుండా కోర్టులకు నిందితులపై తీవ్ర దురభిప్రాయాన్ని కలిగిస్తూ న్యాయ విచారణ ప్రక్రియను దురి్వనియోగం చేస్తున్నారు’ అని నయన్ కుమార్ వివరించారు. ఆస్తి పోతుందన్న భయం సునీత,నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలో పెరిగిపోయింది.. ‘తన తండ్రి షేక్ షమీమ్ అనే మహిళను వివాహం చేసుకున్నారని, వారికి ఒక కొడుకు ఉన్నాడని, వారికి రూ.8 కోట్లు కూడా ఇవ్వాలని తన తండ్రి భావించారని, ఈ కారణంగానే తండ్రితో సత్సంబంధాలు లేవని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్పష్టంగా చెప్పారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఆస్తి పోతుందన్న భయం సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలలో పెరిగిపోయింది. రాజశేఖర్‌రెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి, మరికొందరు వివేకా హత్యకు కారణమంటూ మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కడప జిల్లా కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉంది. తులసమ్మ, షేక్ షమీమ్ మరికొందరు సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వివేకాను హత్య చేసే కారణం సునీతకు, ఆమె భర్తకే ఉంది. సునీల్ యాదవ్‌కు ఈ హత్యతో సంబంధం లేదు. కావాలనే అతన్ని ఇరికించారు.’ అని న్యాయవాది నయన్ కుమార్ నివేదించారు. న్యాయమూర్తిపైనే ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది.. ‘నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో ప్రతి విచారణకు ఆమె హాజరవుతున్నారు. న్యాయమూర్తి ముందు కూర్చొవడమే కాకుండా తన న్యాయవాదితో వెనక నుంచి చర్చిస్తూ, సూచనలిస్తూ, దర్యాప్తు వివరాలను తానే అందిస్తున్నా అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యల వల్ల.. ఓ వర్గం మీడియా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది. ఇదే కేసులో మరో నిందితుడి బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీబీఐ తరఫున వాదించడానికి ఢిల్లీ నుంచి సీనియర్లు వస్తున్నారు. వారికి స్థానిక న్యాయవాదులు, అధికారులు సహకరిస్తున్నారు. సునీత వాదనలు అనవసరం. హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ ఎక్కడెక్కడికి వెళ్లారో చెప్పేందుకు గూగుల్ టేక్ అవుట్, దస్తగిరి వాంగ్మూలంపై సీబీఐ ఆధారపడింది. గూగుల్ టేక్ అవుట్లో పేర్కొన్న సమయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దీనిలో తప్పు జరిగిందని సీబీఐ కూడా ఒప్పుకుంది.’ అని నయన్‌కుమార్ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయండి అజేయ కల్లం పిటిషన్‌పై సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందని, తాను చెప్పని విషయాలను చెప్పినట్టు చార్జిషీట్లో పేర్కొందని, వాటిని చార్జిషీట్ నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టు సీబీఐ తన చార్జిïÙట్లో పేర్కొన్నందున వాటిని చార్జిషీట్ నుంచి తొలగించాలంటూ అజేయ కల్లం ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ లక్ష్మణ్ ముందు విచారణకు వచ్చింది. అజేయ కల్లం తరఫున సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాది పి.వీర్రాజు వాదనలు వినిపించారు. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ కథనం -2
వివేకాను చివరిగా ఎవరు చూశారు? వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 2019 మార్చి 14 రాత్రి 12 గంటల సమయంలో వివేకా తన నివాసం నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగడం రంగన్న చూశాడు. నిందితులు కాకుండా వివేకా జీవించి ఉండగా చివరిసారిగా చూసిన వ్యక్తి రంగన్న. పోలీసు దర్యాప్తు నియమావళి ప్రకారం జీరో అవర్‌గా పిలిచే అప్పటి నుంచే దర్యాప్తు మొదలు కావాలి. అయితే 2021లో దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం గానీ అనంతరం రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలోగానీ 11.30 గంటలకు ఎర్ర గంగిరెడ్డి వివేకా నివాసానికి వచ్చారని చెప్పడం గమనార్హం. సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు ఆద్యంతం అశాస్త్రీయం, అహేతుకం, అసంబద్ధం, సందేహాస్పదంగా ఉందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ కుండబద్దలు కొట్టింది. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని చెబుతున్న సీబీఐ.. కీలకమైన ఆస్తి వివాదం కోణాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. వివేకా హత్య అనంతరం ఆయన నివాసంలో నిందితులు ఆస్తి పత్రాల కోసం వెతికారన్నది స్పష్టమవుతున్నా, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించింది. రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో కూడా ఏమీ చెప్పని వాచ్మెన్ రంగన్నకు రెండున్నరేళ్ల తర్వాత అంతా గుర్తుకు వచ్చినట్టు సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇక కీలక ఆధారంగా గొప్పగా ప్రకటించిన గూగుల్ టేక్ అవుట్ డాటా పూర్తిగా తప్పని స్వయంగా సీబీఐనే ప్రకటించడాన్ని ‘ద వైర్’ ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి రాసిన రెండు విశ్లేషణాత్మక కథనాలను ‘ద వైర్’ వెబ్సైట్ ప్రముఖంగా ప్రచురించింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట కట్టు కథలా? మొదటి కథనంలో సీబీఐ దర్యాప్తులో డొల్లతనాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రచురించిన రెండో కథనంలో మరింత లోతుగా విశ్లేషించి సీబీఐ దర్యాప్తు తీరును ఎండగట్టింది. సీబీఐ ప్రస్తావించిన ఐపీడీఆర్ డాటా కూడా హేతుబద్ధ ఆధారం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తునకు ఆధారంగా చెబుతూ సాక్షుల వాంగ్మూలాల పేరిట సీబీఐ చెబుతోంది కట్టు కథలేనని స్పష్టం చేసింది. ఏకంగా 14 మంది సాక్షులు సీబీఐ తీరును తప్పుబట్టడం.. ఏకంగా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సీబీఐపైనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఏ కోణంలో చూసినా సరే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దారి తప్పిందనే విషయాన్ని స్పష్టం చేసింది. వాచ్మెన్ రంగన్న అప్పుడలా.. ఇప్పుడిలా వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన మొదటి దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం.. వాచ్మెన్ రంగన్న 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసం వరండాలో నిద్రపోయాడు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11.30 గంటల సమయంలో వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. కారు శబ్దం వినిపించి రంగన్న నిద్ర లేచి గేటు తెరిచాడు. వివేకా ఇంటి వద్ద దిగిపోయాక.. కారు డ్రైవర్ ప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. ‘నేను నిద్రపోతాను.. నువ్వు నిద్రపో’ అని వివేకా రంగన్నతో చెప్పి తన నివాసంలోకి వెళ్లిపోయారు. నార్కో ఎనాలిసిస్ ఎందుకు బయటకు రాలేదు? ఆ తర్వాత వివేకాను ఆయన నివాసంలో ఆ రోజు రాత్రి హత్య చేస్తుంటే బయటే ఉన్న రంగన్న ఏం చేశాడనే దానిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోని పోలీసు అధికారులు విచారించనే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని వారాల తర్వాత రంగన్న పేరు కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరికొందరు అనుమానితులతోపాటు రంగన్నను కూడా అహ్మదాబాద్ తీసుకువెళ్లి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఎలాంటి విషయాన్ని రాబట్ట లేదు. మరి రంగన్నకు ఏదైనా విషయం తెలిసి ఉంటే నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో బయటపడేది కదా! రెండున్నరేళ్ల తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయా? వివేకా హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సీబీఐ రంగన్నను ప్రత్యక్ష సాక్షిగా న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ సారి రంగన్న కొన్ని కొత్త విషయాలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 2019 మార్చి 14న రాత్రి వివేకాను ఇంటి వద్ద దించేసి డ్రైవర్ ప్రసాద్ వెళ్లిపోయిన తర్వాత.. 15 నిమిషాలకు అంటే 11.45 గంటలకు వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరుకున్నాడని చెప్పాడు. దర్యాప్తులో ఇదే కీలకమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలు రెండు చోట్ల సరిపోలుతున్నాయి. వివేకా నివాసానికి ఎర్ర గంగిరెడ్డి రావడం.. వెళ్లడం అనే అంశాలు. మృతదేహాన్ని అర్ధరాత్రే చూసిన రంగన్న 2021 జూలైలో జమ్మలమడుగు న్యాయస్థానంలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా నివాసం నుంచి శబ్దాలు రావడంతో కిటికీ వద్దకు వెళ్లి లోపలికి చూశాడు. లోపల నలుగురు వ్యక్తులు హాల్, బెడ్ రూమ్‌లలో తిరుగుతూ దేని కోసమో వెతుకుతున్నారు. రంగన్న ఓ చెట్టు వెనుక దాక్కున్నాడు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి బయటకు వచ్చి గోడదూకి వెళ్లిపోవడం చూశాడు. అనంతరం ఎర్ర గంగిరెడ్డి బయటకు వచ్చి విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లాడు. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో రంగన్న వివేకా నివాసం లోపలికి వెళ్లాడు. బెడ్రూమ్లో మంచం పక్కన రక్తం పడి ఉంది. బాత్రూమ్లో వివేకా కింద పడిపోయి ఉన్నారు. ఆయన చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్లు.. సాక్షుల వాంగ్మూలాల పేరిటా సీబీఐ అడ్డదారులు తొక్కింది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్టుగా గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్ నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. కనీసం 14 మంది సాక్షులు తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఖండించారు. నలుగురు సాక్షులు రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు కూడా. వివేకా చనిపోయారనే విషయాన్ని 2019 మార్చి 15న ఉదయం 6.15 గంటలకు ఆయన పీఏ కృష్ణా రెడ్డి గుర్తించారు. చెప్పని విషయాలు ఎలా ఆపాదిస్తారు? అంతకు ముందే వివేకా మరణం గురించి ఎవరికైనా తెలుసా అనే కోణంలో సీబీఐ దృష్టి సారించింది. వివేకా హత్య గురించి గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి 2019 మార్చి 15 తెల్లవారు జామున 4 గంటలకే తెలుసని ఆయన తల్లి తమ పొరుగున ఉండే ప్రభావతి దేవికి చెప్పినట్టుగా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ మేరకు ప్రభావతి దేవి 161 వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా వెల్లడించింది. కానీ సీబీఐ వాదనను ప్రభావతి దేవి ఖండించారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తన పేరిట వాంగ్మూలం నమోదు చేసుకుందని ఆవిడ స్పష్టం చేశారు. (చదవండి : Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు') అజేయ కల్లం పేరిట తప్పుడు వాంగ్మూలం సాధారణ వ్యక్తులే కాదు.. ఏకంగా రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వక్రీకరించడం వివాదాస్పదమైంది. అజేయ కల్లం చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి చార్జ్ïÙట్లో పేర్కొంది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సీబీఐ తీరును ఎండగడుతోంది. అజేయ కల్లం చెప్పింది ఇది 2019 మార్చి 15 ఉదయం 5 గంటలకు పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం మొదలైంది. గంటన్నర తర్వాత అంటే 6.30 గంటల సమయంలో సహాయకుడు వచ్చి ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డిని పిలిచారు. ఆయన బయటకు వెళ్లారు. తర్వాత కాసేపటికి కృష్ణమోహన్‌రెడ్డి వచ్చి వైఎస్ జగన్ చెవిలో ఏదో చెప్పారు. దాంతో నిశ్చేష్టులైన వైఎస్ జగన్ వెంటనే లేచారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోయారు అని మాతో చెప్పారు. వెంటనే సమావేశాన్ని ఆపేసి బయటకు వచ్చాం’ అజేయ కల్లం చెప్పారంటూ CBI మార్చిన వాంగ్మూలం ఇది ‘2019 మార్చి 15 ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుండగా.. ఇంట్లో సహాయకుడు వచ్చి వైఎస్ భారతి పిలుస్తున్నారని వైఎస్ జగన్‌కు చెప్పారు. దాంతో లోపలికి వెళ్లిన జగన్ కాసేపటి బయటకు వచ్చి తన చిన్నాన్న వివేకానందరెడ్డి మరణించినట్టు అక్కడ ఉన్న మాకు చెప్పారు’ అని అజేయ కల్లం వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. అసలు వైఎస్ భారతి పేరును తాను ప్రస్తావించలేదని, అలాగే తాను 6.30 గంటలని చెప్పగా 5.30 గంటలుగా సీబీఐ పేర్కొందని ఆయన తప్పుబట్టారు. అయినా బయట నిద్రించిన రంగన్న! రక్తం మడుగులో తన యజమాని వివేకానందరెడ్డి చనిపోయి ఉండడాన్ని చూసిన తర్వాత రంగన్న ఏం చేశారంటే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తలుపు దగ్గరకు మూసివేసి బయటకు వచ్చి అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అక్కడే బీడీ తాగాడు. కాసేపు మెట్ల మీద కూర్చున్నాడు. కాసేపట్లో సమీపంలోని మసీదు నుంచి ఉదయం ప్రార్థనలు వినిపించాయి. దాంతో అక్కడే వరండాలో నిద్రపోయాడు. సీబీఐ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న రెండు మసీదుల్లోని మత పెద్దలతో మాట్లాడారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రోజూ ఉదయం 5 గంటలకు మసీదులో ప్రార్థనలు మొదలవుతాయి. అప్పటికి 15 నిమిషాల ముందే మసీదు మైకుల ద్వారా ఆజాన్ వినిపించడం మొదలు పెడతారు. అంటే తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.45 గంటల మధ్యలో రంగన్న తన యజమాని వివేకా మృతదేహాన్ని చూశాడు. కానీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న వివేకా వద్ద పని చేసే సిబ్బందికి గానీ.. అక్కడికి పది నిమిషాల్లోనే వెళ్లగలిగేంత సమీపంలో ఉన్న డ్రైవర్ ప్రసాద్ నివాసానికి గానీ.. మరెవరికైనా చెప్పాలనిగానీ అనుకోలేదు. ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య వివేకా పీఏ కృష్ణా రెడ్డి, వంటమనిషి లక్షి, ఆమె కుమారుడు ప్రకాశ్ వచ్చే వరకు నిద్రపోతున్నట్టు నటిస్తూ గడిపాడు. పైగా ఉదయం వివేకా నివాసం ఉత్తరం వైపు తలుపు తెరచి ఉండటాన్ని చూసిన పీఏ కృష్ణా రెడ్డి.. తనను ఇంటి లోపలికి వెళ్లి చూడమంటే రంగన్న లోపలికి వెళ్లాడు. అప్పుడు వివేకా మృతదేహాన్ని మొదటి సారి చూసినట్టుగా అందర్నీ నమ్మించాడు. ఆ విషయాన్ని 861 రోజుల తర్వాత సీబీఐ ద్వారా న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం, రంగన్న ఇచ్చిన వాంగ్మూలం తప్ప మరే ఆధారం లేదు. -
న్యాయస్థానం నిర్ణయంపైనా ‘పచ్చ’పాతమా రామోజీ?
దుష్ప్రచారం చేయడంలో తనను మించిన వారు లేరంటూ ఈనాడు రామోజీ మరో అడుగు ముందుకు వేశారు. చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా తగ్గేదే లేదని పదే పదే చాటుకుంటున్న రామోజీ.. తుదకు పాత్రికేయ విలువలకూ తిలోదకాలు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయడంతో ఈయన గారికి బీపీ పెరిగిపోయింది. న్యాయస్థానమైతే ఏంటనుకుంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ కేసును విచారిస్తోంది ఎన్ఐఏ. బదిలీ చేస్తూ తీర్పు చెప్పింది విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం. బదిలీ చేసింది విశాఖలోని ఆ కోర్టుకే. ఇందులో అభ్యంతరం ఏమిటి రామోజీ? తీర్పు ఎలా ఇవ్వాలో కూడా మీరే నిర్దేశిస్తారా? సాక్షి, అమరావతి: పచ్చ (టీడీపీ) కామెర్లు సోకిన ఈనాడు రామోజీరావు ఏనాడో పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగక ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాల నిర్ణయాలు, తీర్పులను సైతం వక్రీకరిస్తూ.. వక్రభాష్యాలు చెబుతూ.. దురుద్దేశాలు ఆపాదించేందుకూ బరితెగించారు. చంద్రబాబు కోసం ఎంతకైనా దిగజారుతామని తన దివాలాకోరుతనాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇందులో భాగంగా న్యాయ వ్యవస్థ అధికార పరిధిలోకి చొరబడి మరీ న్యాయమూర్తి నిర్ణయాలకు వక్రభాష్యం చెప్పారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై 2018 అక్టోబరు 25న విశాఖపట్నంలో జరిగిన హత్యాయత్నం కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేస్తూ విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ ‘ఈనాడు’ సొంత వ్యాఖ్యలు చేయడం న్యాయ నిపుణులను విస్మయ పరిచింది. న్యాయ వ్యవస్థను కించపరిచిన ఈనాడు ఈ కేసును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడంపై ఈనాడు పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పూర్తిగా వక్రీకరణే. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని ఈనాడు తీర్మానించేయడం న్యాయ వ్యవస్థను ప్రశ్నించడమే. రాజకీయ దురుద్దేశంతో ప్రచురించిన కథనం అది. ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ... న్యాయ వ్యవస్థను కించపరుస్తూ కథనాన్ని ప్రచురించింది. ఎన్ఐఏ కోరిక మేరకే విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను సాగదీసేందుకే విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి కేసును బదిలీ చేశారని ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు న్యాయస్థానాల్లో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతుందని హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. అందుకే రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ లేఖ ద్వారా కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ, సీబీఐలకు ఇతర రాష్ట్రాల్లో కూడా వేర్వేరు చోట్ల ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవాడతోపాటు విశాఖపట్నం, కర్నూలులో ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. అదే విధంగా ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖపట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నంలో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. ఈనాడు పైశాచిక ఆనందం ఎవరైనా బాధితునిపట్ల సానుకూలత, సానుభూతి చూపుతారు. దాడికి పాల్పడిన వారి పట్ల ఆగ్రహం ప్రదర్శిస్తారు. కానీ ఈనాడు పత్రిక అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ హత్యాయత్నం కేసులో బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయనపట్ల ఈనాడు పత్రిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని అవహేళన చేయడమే కాకుండా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కొన్నేళ్లుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. ఇలా పైశాచిక ఆనందం పొందుతోంది. నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తక్కువగా చూపేందుకు కుట్ర పన్నుతోంది. నిజాలకు పాతర.. ‘ఈనాడు’ ఎత్తుగడ! కేసులో వాస్తవాలు బయట పడకూడదనే ఈనాడు ఇలా వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడని, మెడ భాగంలో పొడిచి.. జగన్‌ను హత్య చేయాలన్నది అతని లక్ష్యమని స్పష్టం చేసింది. చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని కూడా చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంత తీవ్రమైన దాడిని తక్కువగా చేసి చూపేందుకు ఈనాడు పత్రిక దిగజారుడు కథనాలు ప్రచురిస్తోంది. కుట్ర కోణం, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కింది అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితునితో ఉన్న సంబంధం ఏమిటి? ♦ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుపై గతంలో కేసు ఉన్నా సరే విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా! ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? ♦ హర్షవర్ధన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? ♦ హర్షవర్ధన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? -
సీబీఐ ఛార్జ్‌షీట్ కల్పిత కథ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలా: సజ్జల
సాక్షి, అమరావతి: కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. ‘‘వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే మచ్చుతునక. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయింది. వ్యవస్థలో చంద్రబాబు వైరస్‌లా పాకారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసింది?. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైంది’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారు. సునీత ఇప్పటివరకు ఆరు, ఏడు స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం’’ అని సజ్జల తెలిపారు. ‘‘ఏ స్టేట్మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు మార్చారు. అవినాష్‌రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారు. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు. అవినాష్‌రెడ్డి ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా? ‘‘సునీత చెప్పినవన్నీ అబద్ధాలే.. భారతమ్మ, నేను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శించడానికి వెళ్లా. అవినాష్‌ను డిఫెండ్ చేయమని సునీతకు చెప్పలేదు. సునీతను ప్రెస్‌మీట్ పెట్టమని కూడా నేను చెప్పలేదు. గూగుల్ టేక్ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయింది. జూన్ 19న అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్మెంట్ ఇప్పించారు.’’ అని సజ్జల తెలిపారు. చదవండి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం ప్రచురించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది చార్జీషీటు తప్పల తడక అంటూ విశ్లేషించింది. కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలంతో సీబీఐ వివేకా హత్యకు సంబంధించి విచారణ ముగించిందని సీబీఐ చార్జిషీటులో అసంబద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవని ది వైర్ కథనం స్పష్టం చేసింది. వివేకా మర్డర్ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. ఇక ఈ నెల 20న వచ్చిన తుదిచార్జీ షీట్లో సీబీఐ కేవలం అసంబద్ధమైన కథనాలను వండివార్చిందని ది వైర్ ఏకిపారేసింది. వివేకా హత్యకు ప్రధాన కారణం కడప ఎంపీ సీటుపై వచ్చిన విభేదాలే అని సీబీఐ చార్జీషీటులో పేర్కొంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ వివేకా రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ చెప్పింది. ఇక కడప ఎంపీ టిక్కెట్ తనకు కానీ, వైఎస్ షర్మిలకు కానీ, వైఎస్ విజయమ్మకు ఇవ్వాలని వైఎస్ వివేకా కోరుకున్నారనేది సీబీఐ థియరీ. చదవండి: వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్! ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి బలహీనమైన అభ్యర్థి అని వివేకా వాదించనట్లు.. అందుకే అవినాష్‌రెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వకూడదని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాలని వివేకా చెప్పేవారని తన చార్జిషీటులో సీబీఐ కథనం అల్లింది. అయితే ఈ కథనానికి ఎక్కడా ఆధారం చూపలేకపోయింది. పైగా సీబీఐ చార్జిషీటులోనే ఈవాదనను వ్యతిరేకిస్తూం ఎన్నో అంశాలున్నాయి. కడప సీటుకు సంబంధించి హత్య జరిగిందని సీబీఐ చెప్తున్న మాటలకు చాలా వైరుధ్యాలున్నాయి.ఇందులో వివేకా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని సీబీఐ చెప్పిన మాటలు పూర్తి వాస్తవ విరుద్ధం. నిజానికి 2004 తర్వాత వివేకా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. అసలు తన తండ్రి రాజకీయాల్లోకి రిటైర్ అయ్యారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది. 2011 లో వైఎస్ విజయమ్మ చేతిలో ఓటమి తర్వాత మా నాన్న రాజకీయాలకు దూరంగా ఉన్నారని సునీత సీబీఐకి చెప్పింది. దీనిని పూర్తిగా పక్కన పెట్టిన సీబీఐ వివేకా యాక్టివ్‌గా ఉన్నారని చార్జిషీట్లో రాసుకొచ్చింది. ఇక కడప ఎంపీ అభ్యర్ధి విషయంలో వచ్చిన విభేదాలే హత్యకు కారణమని సీబీఐ చెప్పిన మాటలకు ఆధారాలు లేవు. పైగా ఇది పూర్తి అబద్ధం అని నిరూపించే ఆధారాలు చార్జిషీట్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా 2019 మార్చి 10న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక మార్చి 17, 2019 న ఒకేసారి అన్ని స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు రోజులు ముందుగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉన్నా.. వివేకా మరణంతో రెండు రోజులు ఆలస్యమయింది. ఇక నోటిఫికేషన్‌కంటే ముందు అంటే అధికారికంగా అభ్యర్ధుల పేర్లు ప్రకటించడం కన్నా ముందే కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాష్‌రెడ్డి పేరు ఖరారైంది. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బలహీన అభ్యర్థి అనేది వాస్తవ విరుద్ధం. 2014 లోనే కడప నుండి లక్షా 93 వేల 323 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి. 2019 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి 3,80,976 ఓట్లతో ఆదినారాయణ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత బలమైన అభ్యర్థి అనేది కడప వారినే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ఇక కడప ఎంపీ అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్వతహాగా వివేకా కూతురు, అల్లుడు స్వయంగా సీబీఐకి చెప్పారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ఎప్పుడో నిర్ణయించారని వైఎస్ వివేకానందరెడ్డి కూడా అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేశారని స్వయంగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో వెల్లడించారు. వివేకా చనిపోవడానికి ఒకరోజు ముందు వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి వివేకా జమ్మలమడుగులో ప్రచారం చేసినట్టు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటికి రెండుసార్లు చెప్పారు. అంతే కాదు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి మినహా మరెవరి పేరు చర్చకు లేదని, అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎవ్వరూ ఎన్నడూ వ్యతిరేకించలేదని వైఎస్ వివేకా సోదరి విమలమ్మ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ విషయాలేవి మాత్రం సీబీఐకి కనపడలేదు. పైగా కడప ఎంపీ విషయంలో జోక్యం చేసుకుని పెద్దగా ప్రభావం చూపగల శక్తిగాని అంత అధికారంగాని వివేకాకు లేదని కడప రాజకీయాలను గమనించేవారందరికి తెలుసు. వైఎస్ వివేకా కడప ఎంపీ అభ్యర్థి నిర్ధారించే విషయంలో వైఎస్ వివేకా ప్రభావం చాలా తక్కువ. 2011 లో వైఎస్ జయమ్మకు వ్యతిరేకంగా పోటీ చేసిన వివేకా అనంతరం వైఎస్సార్ కుటుంబానికి దూరమయ్యారు. వైఎస్ మరణం తర్వాత ఆయన తన కుటుంబంతో వెళ్లి సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా అధికారం కోసం వైఎస్ వివేకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ బయటకు వస్తే మంత్రి పదవి కోసం ఏకంగా తల్లిలాంటి వదిన విజయమ్మపై పోటీ చేశారు. 2008లో అమెరికా నుండి వచ్చినవైఎస్ వివేకా అల్లుడికి రాజకీయ కాంక్ష ఎక్కువ. ఒకటి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రయత్నించారు. 2011లో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా నర్రెడ్డి కుటుంబం ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎన్నికల్లో విజయమ్మ చేతిలో వివేకా ఘోరంగా పరాజయం పొందారు. ఇంత జరిగినా చిన్నాన్న వివేకాపై వైఎస్ జగన్ సానుభూతిగానే వ్యవహరించారు. ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, కడప జిల్లా ఇన్ ఛార్జ్‌ని చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నంత ప్రభావవంతంగా వివేకా లేరనేది చాలామంది కడప నాయకులకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే అంత ప్రభావం చూపిస్తారా ఒకవైపు తన తండ్రి రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యారని స్వయంగా వివేకా కూతురు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు అధికారిక ప్రకటన కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అన్న విషయం అందరికీ తెలుసని.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చారు. అయినా సీబీఐ మాత్రం కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందనిఛార్జ్ షీట్ లో కథ అల్లడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక కడప ఎంపీ సీటే వివేకా హత్యకు కారణం అని కథ అల్లిన సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ఇక ఈ కథనానికి బలం చేకూర్చేందుకు సీబీఐ మరో కథను సిద్ధం చేసింది. అదే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి. వివేకాను అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ద్రోహం చేశారని అందుకే ఆయన ఓడిపోయారనేది సీబీఐ కథనం. ఇక ఓటమికి కారణం అయిన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఇంటికి వెళ్లి వైఎస్ వివేక తీవ్రంగా అవమానించారనేది సీబీఐ చార్జిషీటులో చెప్పిన మాట. దీంతో వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబం వివేకాను హత్య చేసిందనిం సీబీఐ కథనం అల్లింది. అయితే అసలు వాస్తవం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. వివేకాను ఎమ్మెల్సీ చేసేందుకు వైఎస్ జగన్ ఆయనకు బీఫాం ఇచ్చారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైన గెలవడానికి స్థానిక సంస్థల సభ్యులను బెదిరించి.. ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. అయితే సీబీఐ మాత్రం ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు వివేకాకు వ్యతిరేకంగా పనిచేసినట్లు చెబుతోంది. అయితే దీనికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన 800 మంది ఓటర్లలో ఒక్కర్ని కూడా సీబీఐ విచారించలేకపోయింది. ఈ 800 మందిలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తమకు డబ్బు ఇచ్చారని ఎక్కడా చెప్పలేదు. వీరెవరి దగ్గరు సీబీఐ స్టేట్మెంట్లు రికార్డు చేయేలేదు. అంతే కాదు కనీసం వివేకాను ఓడించిన మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని కూడా సీబీఐ విచారించ లేదు. అయినా రాజకీయ కక్షతోనే హత్య జరిగిందని ఛార్జ్‌షీట్ లో కథనం అల్లేసింది. రెండేళ్ల కిందట జరిగిన గొడవకు, ఇప్పుడు జరిగిన హత్యకు సంబంధం ఎలా ఉంటుందో సీబీఐ చెప్పలేదు. ఇక సీబీఐ చార్జిషీటులో రాజకీయ కోణమే హత్యకు కారణమని తేల్చేసింది. ఎక్కడా ఆధారం లేకపోయిన కథనం అల్లేసి వండివార్చేసింది. ఇక మిగిలిన ఆధారాలను మాత్రం పక్కన పడేసింది. అందులో ముఖ్య కారణం..ఆస్తి తగాదాలు. హత్య జరిగిన సమయానికి వివేకా వయస్సు 67 సంవత్సరాలు.పులివెందులలోని తన నివాసంలో వివేకా ఒంటరిగా నివసిస్తున్నారు. వివేకాకు ఆరు నెలలకిందటే గుండె ఆపరేషన్ జరిగినా వివేకా భార్య మాత్రంం వివేకాను వదిలి తన కుమార్తె సునీత దగ్గర ఉంటున్నారు. నెలకు ఒక్కసారి మాత్రమే వివేకా దగ్గరకి ఆయన సతీమణి వచ్చి వెళ్లేవారు. వివేకా కూతురు సునీతా ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే తండ్రిని కలిసేవారు. వ్యాపార సంబంధాల కారణంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం పలు మార్లు వివేకాను కలిసేవారనేది సీబీఐ సేకరించిన వాంగ్మూలాల ద్వారా స్పష్టం అవుతోంది. వివేకా గురించి ఆయన కుమార్తె సునీత సీబీఐతో చెప్పిన విషయాలతో వారి కుటుంబం మధ్య ఉన్న గొడవలు స్పష్టంగా అర్ధం అవుతాయి. తన తండ్రి వివేకాకు షమీమ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసాక తాను తండ్రి దగ్గరకు వెళ్లే దాన్ని కాదని ఏడాదిలో ఒకటి రెండు సార్లు వెళ్లినా కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే అక్కడ ఉండే దాన్నని సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. వివేకా హత్య కంటే ముందు 2018 క్రిస్మస్ రోజున తాను చివరిసారిగా వివేకా ఇంచికి వెళ్లినట్లు సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. షమీమ్అనే మహిళతో వివాహేతర సంబంధం కారణంగా వివేకాకు మొదటి భార్య కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయనిం సీబీఐకి షమీమ్ ఇచ్చిన వాంగ్మూలం స్పష్టం చేస్తోంది. 2006లో వివేకాకు షమీమ్ అనే మహిళతో పరిచయమైంది. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం కోసం వివేకా సహాయం కావాలని షమీమ్ కోరింది. ఇక వివేకా షమీమ్ల మధ్య పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. దీంతో తన పేరును అక్బర్‌గా మార్చుకుని వివేకా షమీమ్‌ను వివాహం చేసుకున్నారు.మరణించే సమయానికి వివేకా, షమీమ్ లకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం గురించి తెలిసిన తర్వాత వివేక మొదటి భార్య కుటుంబ సభ్యులు తనను బెదిరించారని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ పలుమార్లు మనుషులను పంపి నన్ను బెదిరించారని.. తన కోసం వివేకా పలుమార్లు బావ మరుదులతో ఘర్షణకు దిగారని సీబీఐకి తెలిపిన షమీమ్. నెలసరి ఖర్చులతో పాటు వివేకా తనను అన్ని రకాలుగా చూసుకున్నారని షమీమ్ సీబీఐకి తెలిపారు. 2018లో గుండె ఆపరేషన్ తర్వాత తన ఆరేళ్ల కుమారుడి భవిష్యత్ కోసం వివేకా ఆందోళన చెందేవారని షమీమ్ సీబీఐ అధికారులకు తెలిపింది. తన కుమారుడిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించడంతో పాటు తనకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిస్తానని కొంత డబ్బు ఫిక్డ్స్ డిపాజిట్ చేయించడంతో పాటు వ్యవసాయ భూమిని కొనిస్తానని వివేకా వాగ్ధానం చేశారని సీబీఐ వాంగ్మూలంలో చెప్పిన షమీమ్. అయితే చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అన్ని కంపెనీల నుండి వివేకా చెక్ పవర్ తొలగించడంతో ఆయన తీవ్రమైన ఆందోళనకు గురైనట్లు స్టేట్మెంట్లో స్పష్టం చేసిన వివేకా రెండో భార్య షమీమ్. ఇక మరణించడానికి కొద్ది రోజుల ముందు నుంచి వివేకా తీవ్రమైన వేదనలో ఉన్నట్లు కేర్‌టేకర్ పండింటి రాజశేఖర్ సీబీఐకి తెలిపారు. డబ్బులు లేకపోవడంతో వివేకా ఆందోళనకు గురయ్యారని.. ఫలితంగా విపరీతంగా మద్యం సేవించేవారని రాజశేఖర్ చెప్పాడు. ఒకరోజు డబ్బు విషయం మాట్లాడటం విన్నట్లు త్వరలోనే డబ్బు వస్తుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో అన్నట్లు పండింటి రాజ స్టేట్ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఎర్ర గంగిరెడ్డిని బూతులు తిడుతూ వివేకానందరెడ్డి గట్టిగా అరిచేవారని అయినా ఎర్ర గంగిరెడ్డి మౌనంగా ఉంటూ తరచూ వస్తు ఉండేవాడనేది రాజా సీబీఐకి చెప్పాడు. ఇక హత్యకు కొద్ది రోజుల ముందు నుంచి వివేకా ప్రవర్తన అసాధారణంగా మారిపోయిందని.. మెట్ల మీద కూర్చుని విపరీతంగా మద్యం సేవించడం, సిగరెట్లు విపరీతంగా కాల్చేవారని రాజా సీబీఐకి పూసగుచ్చినట్లు చెప్పాడు. మెల్లమెల్లగా వివేకా ఆరోగ్యం పూర్తిగాక్షీణించడం ప్రారంభించిందని ఇది చూసి తాను ఒకరోజు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానట్లు రాజా స్టేట్మెంట్లో స్పష్టం చేశాడు. ఇంకా ఏదో ఒకపంచాయతీ విషయంలో పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని వివేకా ఎదురుచూస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డికి చెప్పానని సీబీఐ ముందు రాజా ఒప్పుకున్నాడు. ఇక వివేకా డబ్బు వ్యవహారాల గురించి పండింటి రాజశేఖర్‌తో పాటు చాలా మందికి తెలుసు.సీబీఐ వాంగ్మూలాలను పరిశీలించినా వివేకాకు దాదాపు 5 కోట్ల అప్పు ఉందని స్పష్టమౌతోంది. ఇక ఓవైపు వివేకా అప్పులతో తీవ్రమైన వేదనలో ఉంటేం సునీత రెడ్డి మాత్రం సీబీఐ వాంగ్మూలంలో మరో చెప్పింది. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రి చనిపోయే సమయానికి ఆయన పేరు మీద 50 కోట్ల ఆస్తి ఉందని సునీతరెడ్డి చెప్పింది. అయితే వివేకా చెక్ పవర్ ఎందుకు తొలగించారని అడిగిన ప్రశ్నకు సునీత రెడ్డి విచిత్రమైన సమాధానం చెప్పింది. తాము వ్యాపారం కోసం అప్పు తీసుకొడానికి ప్రయత్నించినట్టు, అయితే వివేక అప్పటికే చాలా అప్పులు చేసినందున తమ కంపెనీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించినట్లు సునీత వాంగ్మూలంలో చెప్పుకొచ్చింది. అందుకే బ్యాంకు అకౌంట్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసి వివేకా చెక్ పవర్‌ను తొలగించినట్లు సునీతారెడ్డి చెప్పింది. కేవలం కంపెనీలో అప్పుతెచ్చుకోవడానికే ఈ మార్పులు చేశామని తన తండ్రి కంపెనీలలో తాను కూడా డైరెక్టర్‌గా ఉన్నానని సునీత ఒప్పుకుంది. ఇక వివేకా మరణం తరువాత ఆయన స్థానంలో తాను డైరెక్టర్‌గా చేరిన సునీత.. తండ్రి మరణం తరువాత అప్పులన్నీ కట్టేసి కంపెనీలను లాభాలలోకి తెచ్చామని చెప్పిన సునీత. అయితే వివేకా బతికి ఉన్నప్పుడు మాత్రం కనీస ఖర్చులకు డబ్బులు లేకుండా ఆయన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ వివేకా మరణం తరువాత 2023 జనవరిలో 93 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకున్న కూతురు సునీత రెడ్డి, భార్య సౌభాగ్యమ్మ. వివేకా కుటుంబంలో ఈ స్థాయిలో ఆస్తి కోసం కుట్రలు జరిగినా సీబీఐ మాత్రం వీటిని పట్టించుకోలేదు. తన విచారణలో ఎక్కడా హత్యకు సంబంధించిన కారణాలలో ఆస్తి తగాదాలకు సంబంధించిన కోణంలో విచారణ జరప లేదు. కేవలం రాజకీయ కోణాన్నే హత్యకు కారణంగా చూపేందుకు సీబీఐ కావాలని ఆస్తి తగాదాలను చిన్నదిగా చెప్పే ప్రయత్నం చేసింది. వివేకా హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం పైన సీబీఐ పూర్తిగా విచారణ జరపలేదు.సీబీఐ విచారణ మొత్తం కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ తన విచారణను ముగించింది. వివేకా హత్యకేసులో నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న చెప్పిన మాటలే సీబీఐ విచారణకు ఆధారం. కానీవీళ్లిద్దరు నిజం చెప్తున్నారా...? అనే దానికి ఎక్కడా ఆధారం లేదు అంటూ ది వైర్ కథనంలో పేర్కొంది. -
అప్సర కేసు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?
సాక్షి, హైదరాబాద్: తన కూతురు అలాంటి అమ్మాయి కాదని.. చాలా కిరాతకంగా చంపాడంటూ కాశీ నుంచి ఇంటికి చేరుకున్న అప్సర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. తమకు, సాయికృష్ణ కుటుంబానికి ఎటువంటి రిలేషన్ లేదని, ఇలా అవుతుందనుకోలేదన్నారు. తెలిసిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చానన్నారు. పూజారి అయి ఉండి ఇలా చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని అప్సర తల్లిదండ్రులు కోరారు. కాగా, ఉస్మానియా మార్చురీలో అప్సర మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర మృతి చెందినట్లు అప్సర ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. జరిగింది ఇదే.. గుడికి వచ్చిన అప్సరతో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. చదవండి: అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా? మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్‌హోల్స్‌కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. -
సీబీఐ కోర్టులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
హైదరాబాద్: వివేకా కేసుకు సంబంధించి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈనెల9వ తేదీన తీర్పు ఇస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిలో భాగంగా తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సునీత ఇంప్లీడ్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమా మహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ని సిబిఐ అధికారులు ఆరెస్ట్ చేశారు. ఆరోపణలు మాత్రమే సిబిఐ పరిగణలోకి తీసుకుంది. భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో సీబీఐ ఇరికించింది. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి నేరం చేసాడు అనడానికి ఎక్కడ సరైన సాక్ష్యాలు లేవు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదు’ అని కోర్టుకు తెలిపారు.