సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ పరిధిలో మహిళ హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు.
నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతుకుడు ఫ్రిడ్జ్‌లో దాచాడు. చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు.
కాగా, మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్‌లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు మృతురాలిని గుర్తించడంతో హత్య కేసును ఛేదించారు.
చదవండి: ‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’
Comments
Please login to add a commentAdd a comment