malakpet
-
మలక్‌పేట్ మెట్రో వద్ద అగ్ని ప్రమాదంలో కుట్ర.. స్పాట్లో పెట్రోల్ డబ్బాలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. మంట్లలో ఐదు బైకులు కాలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో, చాదర్ ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్, కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల ప్రకారం.. మలక్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైకుల వద్ద మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో, ఐదు బైకులు మంటల్లో కాలిపోయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.ఇక, మలక్‌పేట్ మెట్రో వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఉందని పోలీసులు గుర్తించారు. బైకులు మంటల్లో కాలిపోయిన స్థలంలో పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈ క్రమంలో మెట్రోస్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
కన్సల్టెన్సీ ఆఫీస్‌లో లా విద్యార్థిని ఆత్మహత్య
మలక్‌పేట: ఎల్ఎల్బీ చదువుతున్న ఓ గిరిజన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్‌పేట పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం తక్రాజ్‌గూడ తండాకు చెందిన ఇస్లావత్ రమేశ్– కంసీ దంపతులకు శ్రావ్య(20), శ్రుతి, సాయికిరణ్ సంతానం. శ్రావ్య ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఎన్టీఆర్నగర్ మహాత్మాగాంధీ లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. మలక్‌పేటలోని నందిని రెసిడెన్సీలో నవీన్, విజయ్‌లు జయదుర్గా ఎడ్యుకేషన్స్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శ్రావ్య మూడు నెలలుగా నవీన్ వద్ద పనిచేస్తోంది. ఆదివారం కన్సల్టెన్సీకి వెళ్లిన శ్రావ్య సాయంత్రం తన తమ్ముడు సాయికిరణ్‌కు ఫోన్ చేసి రూ.20 వేలు ఫోన్ పే చేయాలని కోరింది. సాయికిరణ్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత శ్రావ్యకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు.దీంతో అతను హాస్టల్లో శ్రావ్యతోపాటు ఉంటున్న శిరీషకు ఫోన్ చేశాడు. దీంతో శిరీష తన స్నేహితురాలైన సోనికి విషయం చెప్పింది. దీంతో సోనీ తన స్నేహితుడైన కార్తీక్‌తో కలిసి కన్సల్టెన్సీకి వెళ్లింది. పక్క ఫ్లాట్‌లో ఉన్న రవీందర్, గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న మరో మహిళతో కలిసి ఆఫీస్‌రూమ్ వద్దకు వెళ్లారు. ఆఫీసురూమ్ బయట శ్రావ్య చెప్పులు ఉండటం గమనించారు. వారు తలుపులు తీసి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో అది సాధ్యం కాలేదు. కిటికీలో నుంచి చూడగా శ్రావ్య సీలింగ్ ఫ్యాన్‌కు స్కార్ఫ్‌తో ఉరేసుకొని కనిపించింది.దీంతో తలుపులు పగులగొట్టి శ్రావ్యను కిందకు దించారు. రవీందర్ కారులో మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, శ్రావ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎస్సై సురేశ్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆందోళనకు దిగిన గిరిజన సంఘాలు శ్రావ్య మరణవార్త తెలుసుకున్న గిరిజన సంఘాలు, మృతురాలి బంధువులు సోమవారం పెద్ద సంఖ్యలో మలక్‌పేట పీఎస్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. అనంతరం కన్సల్టెన్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివారం సెలవురోజు కన్సల్టెన్సీ నిర్వాహకుడు నవీన్ కార్యాలయానికి శ్రావ్యను ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. శ్రావ్యపై అత్యాచారం చేసి హత్య చేశారని, చున్నీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారన్నారు. కన్సల్టెన్సీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ కొనసాగుతోంది గిరిజన విద్యార్థి మృతి చెందిన విషయంపై ఆదివారం రాత్రి మలక్‌పేట పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఇన్స్పెక్టర్ నరేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు నవీన్, విజయ్‌ని అదుపులోకి తీసుకున్నాం. శ్రావ్యను ఆస్పత్రికి తరలించిన కార్తీక్, సోనిలను కూడా విచారిస్తాం. క్లూస్ టీమ్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది.నిçష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుంది. – శ్యామ్‌సుందర్, మలక్‌పేట ఏసీపీ -
రెడ్ రోజ్ బేకరిలో అగ్ని ప్రమాదం
-
ఫ్రీ హలీమ్ ఎఫెక్ట్: భారీ జనంతో గందరగోళం
హైదరాబాద్: మలక్పెట్లో ఫ్రీగా హలీమ్ అంటూ హోటల్ ప్రకటించడంతో వందలాదిగా జనాలు రావటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భారీ జనాలతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మలక్‌పేటలో ఓ హోటల్లో హలీమ్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో వందలాదిగా జనాలు ఎగబడ్డారు. ఒకేసారి వందలాదిగా జనాలు తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వందలాదిమందిని అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక.. హోటల్ వద్దకు భారీగా జనం గుమిగూడటంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. Chaos over free #Haleem in #Hyderabad, police used mild force to disperse the crowd. Marking the first roza of holy #Ramadan month, a famous eatery announced #FreeHaleem for 1 hour today. Hundreds of people gathered outside their outlet, which led to #TrafficJam.#Ramadan2024 pic.twitter.com/NlFYSkSkPL — Surya Reddy (@jsuryareddy) March 12, 2024 -
ట్రోల్ బంక్ పక్కనే పేలిన విద్యుత్ ట్రాన్సఫార్మెర్
-
ఢిల్లీ లీడర్లకు కేసీఆర్ భయం
సాక్షి, కామారెడ్డి/అబిడ్స్/మలక్‌పేట: ‘కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్‌లోని గోషామహల్, మలక్‌పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గల్ఫ్ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. రేవంత్ కొడంగల్‌లో చెల్లని రూపాయి... ‘2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. హైదరాబాద్ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్‌లు జరిగేవని... కానీ కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్‌పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ధూల్‌పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. ‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్ అర్హత కటాఫ్ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు. -
వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మదలంగి సురేష్ (50) వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన సురేష్ 2000 సంవత్సరం బ్యాచ్ కానిస్టేబుల్. నగరంలోని సంతో‹Ùనగర్ ఈస్ట్‌మారుతినగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు వాకింగ్ చేస్తున్న సురేష్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి వాకర్స్ వెంటనే కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కోవిడ్ నుంచి ఆయన రెండుసార్లు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న సౌత్ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగం చంద్రశేఖర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్
మలక్‌పేట: బీఆర్ఎస్ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలోనే ఉందని, ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలోనే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం వ్యాపారవేత్త అదానీ చేతిలో ఉందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. ప్రధాని మోదీ చేతుల్లో ఏమీ లేదని, అదానీ చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు. మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మలక్‌పేటలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్‌ను నిర్మించనున్నామని, దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో తొలి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో 21 అంతస్తులతో 15లక్షల చదరపు అడుగుల ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. ఒకప్పుడు మలక్‌పేట అంటే టీవీ టవర్ గుర్తుకువచ్చేదని.. ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్ మారుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోందని, వరుసగా రెండేళ్లపాటు బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలను కల్పిస్తోందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నాయన్నారు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారని.. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి అద్దం పట్టారని పేర్కొన్నారు. కాగా.. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన సారథ్యంలో తెలంగాణ, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని ఎంపీ అసదుద్దీన్ చెప్పారు. -
మలక్‌పేట అనురాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట అనురాధ మృతి కేసు మరో మలుపు తిరిగింది. అనురాధ మృతి కేసు రాచకొండ పోలీసులకు బదిలీ అయింది. చంద్రమోహన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 15 ఏళ్లుగా చంద్రమోహన్, అనురాధల సహజీవనం చేస్తున్నారు. చంద్రమోహన్‌తో అనురాధకు గత కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. విభేదాల కారణంగా పెళ్లి చేసుకోవాలని అనురాధ ప్లాన్ చేసింది. పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోబోతున్నానని డబ్బు, నగలు తిరిగివ్వాలని చంద్రమోహన్‌ని డిమాండ్ చేసింది. రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగివ్వాలన్న అనురాధను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని హత్య చేసినట్లు తేలింది. అనురాధతో గొడవపడి 15 కత్తిపోట్లు పొడిచి చంపిన చంద్రమోహన్.. ఒక రోజు పాటు మృతదేహాన్ని బయటే పెట్టాడు.. అనురాధ గది పక్కన అద్దెకు ఉన్నవారు ఊరికెళ్లాక ముక్కలు చేశాడు. మరుసటిరోజు స్టోన్ కట్టర్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో దాచాడు. 5 రోజుల తర్వాత తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. చదవండి: ఆరుగురు పిల్లల తల్లి ఎంతటి దారుణానికి పాల్పడిందంటే... యూట్యూబ్‌లో చూసి మృతదేహాన్ని ముక్కలు చేసిన చంద్రమోహన్.. మృతదేహం నుంచి వాసన రాకుండా కెమికల్స్ వాడాడు. కూతురితోపాటు బంధువులెవరితోనూ అనురాధకు సంబంధాలు లేకపోవడంతో ఆమెను చంపితే బంధువులెవరూ రారని గుర్తించిన చంద్రమోహన్.. అనురాధ చార్ధామ్ యాత్రకు వెళ్తున్నట్లు సృష్టించాడు. అనుమానం రాకుండా అనురాధ కూతురుతో చంద్రమోహన్ చాటింగ్ చేశాడు. అనురాధ సెల్‌ఫోన్‌ను చార్‌ధామ్‌కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని చంద్రమోహన్ ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
Hyderabad: మొండెం లేని మహిళ తల ఎవరిదో తెలిసింది..
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ పరిధిలో మహిళ హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు. నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతుకుడు ఫ్రిడ్జ్‌లో దాచాడు. చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. కాగా, మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు మృతురాలిని గుర్తించడంతో హత్య కేసును ఛేదించారు. చదవండి: ‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’ -
హైదరాబాద్ మలక్ పేట్ పీఎస్ పరిధిలో దారుణం
-
HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్యాడ్తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎక్కడో హత్య చేసి, ఇక్కడ తల తెచ్చి పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమీర్‌పేటలో దారుణం.. భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య -
గైనకాలజిస్ట్‌గా నాకు ఎన్నో ప్రశ్నలున్నాయి: గవర్నర్ తమిళి సై
-
మలక్‌పేట ఘటనపై స్పందించిన తమిళిసై.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్!
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతి బాధాకరమని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తనకు ప్రశ్నలు ఉన్నాయంటూ ట్విస్ట్ ఇచ్చారు. కాగా, రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతి బాధాకరమన్నారు. గైనకాలజిస్ట్‌గా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వైద్య రంగంలో వసతులు మరింత మెరుగుపరచాలి. బిల్లులు పెండింగ్ కాదు.. పరిశీలనలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలి. వైద్యరంగం మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు.. కానీ ఇంకా మెరుగు పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. వివాదాలతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. యూజీసీ కొన్ని అంశాలను ప్రస్తావించింది, న్యాయ చిక్కులు లేకుండా చూసుకోవాలి అని అన్నారు. -
Hyderabad: మలక్‌పేట హోటల్లో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేటలోని అక్బర్‌బాగ్ డివిజన్ నల్గొండ చౌరస్తాలోని సొహైల్ హోటల్లో శుక్రవారం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈఘటనలో హోటల్లో పనిచేస్తున్న కారి్మకుడు మృతిచెందాడు. చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హోటల్ వంటగదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న షాబుద్దీన్ అనే కారి్మకుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని రాజకీయ ఒత్తిళ్లతో లీజుకు తీసుకొని హోటల్ ఏర్పాటు చేయడమే కాకుండా...నిర్లక్షంగా వ్యవహరించడం వల్లే ఓ నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హోటల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. గతంలో హోటల్ లీజు అగ్రిమెంట్‌ను రద్దు చేసి ఒక భవనం నిర్మించి ఆసుపత్రి రోగులకు బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు అనుకున్నారు. తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు హోటల్ భవనాన్ని ఖాళీ చేయించలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక హోటల్ లీజును పొడిగించారు. ఇక హోటల్‌కు దగ్గరలోనే అగ్నిమాపక కేంద్రం ఉండటం వల్ల పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
హైదరాబాద్: మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసులో డాక్టర్ శ్రావణి మృతి
-
హిట్&రన్ కేసు: డాక్టర్ శ్రావణి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ.. మూడు రోజులుగా ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. ఇక నిందితుడిని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. అంతేకాదు.. నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు సైతం లేవని వెల్లడించారు పోలీసులు. శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్‌గా విధులు నిర్వహించేవారు. ఇదిలా ఉంటే.. నెల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇది రెండో విషాదం. సుమారు 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండెపోటుతో కన్నుమూయడం గమనార్హం. దీంతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. సెప్టెంబర్ 21వ తేదీన ఓలా బైక్ బుక్ చేస్కొని శ్రావణి వెళ్తుండగా.. గుర్తు తెలియని కారు ఒకటి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, శ్రావణి గాయపడగా.. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆమె తుది శ్వాస విడిచింది. ఇక సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఇబ్రహీంను గుర్తించారు పోలీసులు. ఇదీ చదవండి: న్యూడ్ కాల్స్‌తో ఆమె నన్ను వేధిస్తోంది సార్.. -
హైదరాబాద్ మలక్ పేటలో దారుణం
-
బాయ్‌ఫ్రెండ్ అని పొరపాటు.. నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులివ్వాలని..
సాక్షి, హైదరాబాద్: నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ యువకుడ్ని షీటీమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. గురువారం ఇన్స్పెక్టర్ కసపరాజు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శివరామ్పల్లికి చెందిన మహమ్మద్ మోసిన్(22) పెయింటర్. దిల్సుఖ్నగర్ హాస్టల్లో ఉంటూ ఎమ్మెస్సీ చదువుతున్న ఓ యువతికి తన సెల్‌ఫోన్ నుంచి కాల్ చేసి తన పేరు రాజు అని పరిచయం చేసుకున్నాడు. అయితే కొంత కాలం క్రితం తనతో విడిపోయిన తన బాయ్‌ఫ్రెండ్ రాజు అని నమ్మిన ఆమె అతనితో సంభాషించడం మొదలు పెట్టింది. అతని అభ్యర్థన మేరకు తన నగ్న చిత్రాలను పంచుకుంది. అయితే ఇద్దరు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు అతడు బాయ్ ఫ్రెండ్ రాజు కాదని తెలిసి షాక్‌కు గురైంది. తన చిత్రాలు తొలగించాలని అతడిని కోరింది. ఫొటోలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వాటిని వైరల్ చేస్తానని బెరింపులకు దిగాడు. దీంతో యువతి షీటీమ్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన షీటీమ్ పోలీసులు అతడిని పట్టుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. చదవండి: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు -
Hyderabad: మలక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరహత్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో భవనంలోకి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. చదవండి: (పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ) -
ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’
గచ్చిబౌలి: ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం లాల్గాడి మలక్‌పేట్‌లోని జినోమ్ వ్యాలీ, ఫార్మా లైఫ్ సైన్సెస్ నుంచి అల్వాల్ వరకు ఎస్సీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చిన 3వ షీ షటిల్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే భద్రత వ్యవస్థలో మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం అల్వాల్ నుంచి లాల్‌గడీ మలక్‌పేట్, తుర్కపల్లి నుంచి జనోమ్ వ్యాలీ వరకు నడుస్తుందన్నారు. ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ... ఐటీ, ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇప్పటి వరకు 12 షీ షటిల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరంలోని మలక్ పెట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చంపా పేట్, ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్, జూపార్క్, ఫలక్‌నూమా, బహదూర్ పురా, పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నగర శివారులోని దుండిగల్, సూరారం, దూలపల్లి, బహదూర్ పల్లి, పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో నగరవాసులకు ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగింది. -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతిపై రగడ
Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్‌నగర్ రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మలక్‌పేట్ మెట్రోస్టేషన్ పైనుంచి దూకి..
సాక్షి, మలక్‌పేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి మెట్రోస్టేషన్ పైనుంచి దూకిన ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చత్తీస్ఘడ్, కువకొండ, పుల్పహడ్, దంతేవాడకు చెందిన భీమా(45) ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్నాడు. దిల్సుఖ్నగర్ బస్టాప్ వైపు నుంచి మెట్రో స్టేషన్ మొదటి ఫ్లోర్ ఎక్కి అక్కడ నుంచి దూకాడు. చదవండి: అత్యాచార ఘటన చాలా బాధాకరం: ఎమ్మెల్సీ కవిత అతడి తల, ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీఫుటేజ్‌లు పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
3.46లక్షల ఫాలోవర్స్..‘మీ డై హార్ట్ ఫ్యాన్’ అంటూ
సాక్షి, హిమాయత్‌నగర్: ఇన్ఫ్లూ్యన్సెర్కు మీ డై హార్ట్ ఫ్యాన్ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడు. మలక్‌పేటకు చెందిన ప్రియారెడ్డికి ఇన్‌స్ట్రాగామ్‌లో 3.46లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే వీడియోలు, డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్ వంటి వీడియోస్‌కు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి ఇటీవల ‘మీ డైహార్ట్ ఫ్యాన్’ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో కొన్ని ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత నుంచి ప్రియారెడ్డిని డబ్బు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఫ్యాన్ అని ఇలా బ్లాక్మెయిల్ చేస్తావా అని ప్రశ్నించినందుకు ఆమె వీడియోస్‌కు పోర్న్‌స్టార్స్ బాడీని ఎటాచ్ చేసి యూట్యూబ్, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేశాడు. తన కుమారుడు, కుటుంబ సభ్యులపై కూడా అశ్లీల మెసేజ్‌లను ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లోని అందరికీ పంపించాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ప్రియారెడ్డి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. ఈ వ్యవహారంపై మే 16వ తేదీన సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కొన్ని వీడియోస్‌ను, అకౌంట్స్‌ని డిలీట్ చేయడం జరిగింది. మరికొన్ని వెబ్‌సైట్స్, ఇన్‌స్టా, యూట్యూబ్‌ల్లో అసభ్యకర రీతిలో పోస్టులు, కామెంట్స్ పెట్టిన వారిపై సైతం చర్యలు తీసుకోవాలని మంగళవారం మరోమారు ప్రియారెడ్డి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బ్లేడుతో గొంతుకోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
మలక్‌పేట: ఓ కానిస్టేబుల్ బ్లేడుతో గొంతుకోసుకుని ఆతహ్మత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం, బాలాజీనగర్‌కు చెందిన బానోత్ భిక్షం, రేణుక దంపతులకు అభిలాష్ నాయక్(33), ప్రభునాయక్ ఇద్దరు కుమారులు. భిక్షం ఆటోడ్రైవర్. 40 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మూసారంబాగ్ డివిజన్ బాలదానమ్మబస్తీలో స్థిరపడ్డారు. గవర్నమెంట్ క్వార్టర్స్‌లో కింది పోర్షన్లో అభిలాష్ భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఉంటుండగా.. రెండో ఫ్లోర్లో చిన్నకుమారుడు ప్రభునాయక్ ఉంటున్నాడు. అభిలాష్ నాయక్‌కు 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. భార్య ఇంద్రజ్యోతి, ధీరజ్, హేమంత్ ఇద్దరు సంతానం. ఆరేళ్లుగా మాదన్నపేట పీఎస్‌లో విధులు నిర్వహిస్తుండగా.. చిన్నకుమారుడు ప్రభునాయక్ జీహెచ్ఎంసీ డిజాస్టర్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిలాష్ తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలను శుక్రవారం కోదాడకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. పడుకుంటానని చెప్పి.. సోమవారం ఉదయం విధులకు వెళ్లి మధ్యాçహ్నం 3 గంటలకే ఇంటికి వచ్చాడు. అన్నం తిన్న తర్వాత పడుకుంటానని చెప్పి రెండోఫ్లోర్ ఉన్న గదికి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. సాయంత్రం తల్లిదండ్రులు పిలిచినా పలకలేదు. నిద్రపోయాడని వారు భావించారు. రాత్రి 10 గంటలకు ప్రభునాయక్ ఇంటికి వచ్చాడు. అభిలాష్‌ను తీసుకువచ్చేందుకు పైకి వెళ్లాడు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో పక్కంటి వారి సహాయంతో ఇంటి తలుపు పగులగొట్టి చూడగా రక్తం మడుగులో మంచం పక్కన పడిఉన్నాడు. మిత్రుడి లోన్ కోసం ష్యూరిటీ.. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని చూడగా బ్లేడుతో గొంతు, చేతి మణికట్టు కోసుకున్నాడు. అభిలాష్ నాయక్ తన మిత్రుడి లోన్ కోసం ష్యూరిటీ ఇచ్చిన కారణంగా చేతికి జీతం రావడం లేదు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నాడు. దీంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నట్లు పోలీసులు తెలిపారు. అభిలాష్ గొంతుపై మూడుగాట్లు, ఎడమ చేతి మణికట్టుపై రెండు గాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సుభాష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అంత్యక్రియల కోసం తల్లిదండ్రులు అభిలాష్ మృతదేహాన్ని సొంతూరు కోదాడకు తీసుకెళ్లారు. చదవండి: సీఎం వీడియో మార్ఫింగ్ ట్యాబ్‌పై స్పష్టత ఇవ్వని ఉమా -
నగ్నంగా కవ్వించి...ఆపై రికార్డు చేసి
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ఆ తర్వాత వాట్సాప్ ద్వారా నగ్నంగా వీడియో కాల్ చేసి కవ్వించి తనను కూడా రెచ్చ గొట్టి నగ్నంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన ఓ యువతి రూ.2 లక్షల వరకు వసూలు చేసిందని మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం...మలక్‌పేట్‌కు చెందిన వ్యక్తికి ఫేస్బుక్లో రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి ఇటీవల ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత మెసేంజర్‌లో నాలుగు రోజులు చాట్ చేసిన అనంతరం వాట్సాప్ నంబర్ అడిగితే ఇచ్చాడు. ఆ తర్వాత మూడు రోజులు వాట్సాప్‌కాల్‌లో మాట్లాడిన సదరు యువతి ఓ రోజు నగ్నంగా వీడియోకాల్ చేసింది. బాధితుడిని కూడా నగ్నంగా ఉంటే చూడాలని ఉందని కవ్వించి ఆ దృశ్యాలను స్క్రీన్ రికార్డు చేసింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో సేవ్ చేసిన ఆ వీడియో లింక్‌ను బాధితుడి వాట్సాప్ నంబర్‌కు పంపింది. దీంతో బాధితుడు ఆమెకు ఫోన్ చేయగా రూ.50వేలు ఇస్తే తొలగిస్తానని చెప్పడంతో నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నట్లుగా గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసి ఓ యువతి మీ పైనా ఫిర్యాదు చేసిందని, నగ్నంగా ఉన్న ఆమె వీడియోను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని, మీపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. దీంతో భయపడిన బాధితుడు వారు అడిగినట్లు రూ.1.5 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసి కేసు నమోదు కాకుండా చూడాలని కోరాడు. ఆ తర్వాత కూడా ఆ యువతి నుంచి మళ్లీ వేధింపుల కాల్స్ వస్తుండడంతో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మలక్‌పేట్‌లో కారు బీభత్సం.. వృద్దుడిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మలక్ పేట్ డీమార్ట్ ఎదురుగా కారు బీభత్సం సృష్టించింది. 72 ఏళ్ల వృద్ధుడు హోండా సిటీ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సమీపంలోని ఓ టీ కొట్టులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవింగ్ చేసిన వృద్ధుడు రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
చాదర్‌ఘాట్ వద్ద మూసీ నది ఉధృతి
-
ఈసారైనా పట్టాలెక్కేనా?
సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘ కాలంగా ప్రతిపాదనల రూపంలో పెండింగ్‌లో ఉండిపోయిన మలక్‌పేట రైల్ అండర్ బ్రిడ్జ్‌కి (ఆర్యూబీ) మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) కింద మరికొన్న పనులతో పాటు దీన్నీ చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికోసం రూ. 18.14 కోట్లు కేటాయించడానికి సిద్ధమైంది. అయితే గతంలో మాదిరిగా ఇది ప్రతిపాదనల స్థాయిలోనే అటకెక్కకూడదని నగర వాసులు కోరుతున్నారు. సాధారణ రోజుల్లో ఓ స్థాయిలో, వర్షం కురిస్తే తీవ్రంగా ట్రాఫిక్ ఇబ్బందుల్ని సృష్టిస్తున్న ఈ ప్రాంతంలో సమస్యలు తీరాలంటే ఆర్‌యూబీతో పాటు నాలాపై రోడ్డు నిర్మాణం కావాలని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. ఈ రూట్ ఎంతో ఇంపార్టెంట్... నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ మధ్యలోనిది ఒకటి. ఈ మార్గంలో అంతర్గత వాహనాలే కాకుండా అంతరాష్ట్ర, అంతర్ జిల్లాలవీ నడుస్తుంటాయి. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్, వాటర్ లాగింగ్ ఏరియా కలిసి ఈ రూట్లో తిరిగే వాహన చోదకులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ స్టేషన్ కూడా రావడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలుబారులు తీరుతున్నాయి. అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండగల సీజన్లో నరకం చవిచూడాల్సిందే. నాలుగేళ్ల క్రితం నుంచీ... ప్రస్తుతం మలక్‌పేట రైల్ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్ వైపు, మరోటి మలక్‌పేట వైపు వెళ్లే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. ఇవి రద్దీకి పట్టుకోలేకపోవడంతో మూడో మార్గం అందుబాటులోకి తీసుకురావాలని 2016లో తొలిసారిగా నిర్ణయించారు. ఇది అందుబాటులోకి వస్తే ఆ రూట్లను డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్ లైన్ ట్రాఫిక్ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావించారు. అంటే ఈ మార్గాలను పూర్తి స్థాయిలో వన్ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆర్‌యూబీతో పాటు మలక్‌పేట వైపు నాలాపై రోడ్డు సైతం నిర్మించాల్సి ఉంది. అప్పుడే పూర్తి ఉపయోగం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. రెండుసార్లు ప్రతిపాదనల వద్దే... మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్ పాస్ ఏర్పాటుకు సహకరించడానికి 2018లో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ ప్రారంభించడానికి ముందే రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టింది. ఈ మొత్తం చెల్లించేందుకు హెచ్ఎంఆర్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత గత ఏడాది ఓ సందర్భంలో ఈ ‘మూడో మార్గం’ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది. అయితే అదీ ప్రతిపాదన స్థాయిలోనే ఆగిపోయంది. ఇటీవల నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇక ఇప్పట్లో ఈ ఆర్యూబీ అందుబాటులోకి రావడం అసాధ్యమని అందరూ భావించారు. అయితే గ్రేటర్ వ్యాప్తంగా అనేక ఆర్‌యూబీలు, ఫ్లై ఓవర్లు, మార్గాల అభివృద్ధి చేపట్టిన జీహెచ్ఎంసీ ఈ ఆర్‌యూబీకి రూ. 18.14 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో ఈ సారైనా ఇది అమలులోకి రావాలని, ప్రతిపాదనల స్థాయిలోనే ఆగిపోకూడదని నగరవాసులు కోరుతున్నారు. -
మూగబోయిన బహుజన గళం
హైదరాబాద్: అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన దళిత, బహుజన, ఉద్యమ మేధావి ఉ.సా. (ఉప్పుటూరి సాంబశివరావు) కరోనా కాటుకు బలయ్యారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఆయన మలక్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆయనకు వారం క్రితం విరేచనాలయ్యాయి. ఎంతకూ తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. అదే రోజు అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భార్య పద్మావతి ప్రసూనాంబ గతంలోనే మృతిచెందారు. కుమార్తె హిమబిందు ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అలుపెరగని పోరాటయోధుడు ► గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో పుట్టిన ఉ.సా. ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (డీఎస్వో), యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ నాయకులు దేవులపల్లి, తరిమెల నాగిరెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ► తూ.గో. జిల్లా దేవీపట్నం ప్రాంతంలో గిరిజన హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో పార్టీలో మహిళా విభాగంలో పనిచేస్తున్న పద్మావతిని కులాంతర వివాహం చేసుకున్నారు. ► గోదావరి జలాలను నల్లగొండ జిల్లాకు తీసుకు రావాలని కోరుతూ జరిగిన పోరాటంలో, అమరావతి ప్రాంతంలోని పొన్నెకల్లులో రైతాంగ సమస్యలపైన జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. ►మోత్కూర్‌లో విద్యుత్ అంతరాయంతో కాలిపోయిన మోటార్లను వేలాది ఎడ్లబండ్లపై పెట్టుకొని ఉ.సా. ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ► కారంచేడు, చుండూరు దళిత ఉద్యమాల్లో చురుకైనపాత్ర పోషించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. ► మహబూబ్‌నగర్‌లో ఆకలిచావులకు చలించి తన తోటి మేధావులతో కలిసి భోజన కేంద్రాలను నాలుగేళ్ల పాటు నాలుగు గ్రామాల్లో నిర్వహించారు. ► జోలాలి పాడాలి అనే పాటను, కరువుపై అనేక పాటలను, పుస్తకాలను, బుర్రకథను, పోచంపాడు కుంభకోణంపై ఓ పుస్తకాన్ని, నల్లగొండ వరదకాలువ అనే మరో పుస్తకాన్ని రచించారు. ► అనంతరం పార్టీ నుంచి దూరమై అంబేడ్కర్, పూలే ఆలోచనా విధానాలతో బహుజనుల కోసం పనిచేశారు. కంచె ఐలయ్యతో కలిసి నలుపు పత్రికను, ఆ తరువాత ఎదురీత పత్రికను నడిపారు. -
ముందుకు సాగని ‘మూడో దారి’
సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’ వ్యాప్తంగా ఎక్కడిక్కడ కొత్త మార్గాల అభివృద్ధి, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే ఏళ్ళుగా మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జ్ వద్ద మూడో అండర్ పాస్ కట్టాలనే ప్రతిపాదనలకు మాత్రం మోక్షం లభించట్లేదు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు అనునిత్యం నరకం చవి చూస్తున్నారు. సిటీ బస్సులు నడవని, ‘కరోన ఫీవర్’ తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లోనే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయంటే... రేపు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరిస్థితి వేరుగా చెప్పక్కర్లేదు. ‘డైనమిక్’గా వాడుకోవచ్చని భావించారు... ప్రస్తుతం మలక్‌పేట రైల్ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్ వైపు, మరోటి మలక్పట వైపు వెళ్ళే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. మూడో మార్గం అందుబాటులోకి వస్తే దాంతో సహా అన్నింటినీ డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్ లైన్ ట్రాఫిక్ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిప్రకారం ఓ మార్గాన్ని పూర్తి స్థాయిలో వన్ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పీక్ అవర్స్‌లో వన్‌వేగా ఉన్న మార్గం ఆపై టూ వేగా మారిపోతుంది. తిరిగి సాయంత్రం పీక్ అవర్స్ ప్రారంభమైనప్పు ఉదయం నడిచిన దిశకు వ్యతిరేకంగా వన్‌వేగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావించారు. ఈ వన్‌వేలు, వాటి సమయాలపై పూర్తి స్థాయి ప్రచారం కల్పిండంతో ప్రతి వాహనచోదకుడికీ అవగాహన కల్పిస్తే ఫలితాలుంటాయని అంచనా వేశారు. హెచ్ఎంఆర్ అప్పట్లో ముందుకు వచ్చినా... మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్ పాస్ ఏర్పాటుకు సహకరించడానికి అప్పట్లో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ ప్రారంభించడానికి ముందే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టింది. దాదాపు రెండేళ్ళ క్రితం జీహెచ్ఎంసీ కార్యాలయంలో బల్దియా నేతృత్వంలో జరిగిన వివిధ శాఖల ఉమ్మడి కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని హెచ్ఎంఆర్ ప్రకటించింది. ఇప్పటికీ మోక్షం లభించలేదు. మూసీ వెంట మార్గాన్నీఅన్వేషించినా... మరోపక్క మలక్‌పేట సమీపంలో ఉన్న మూసీ నది వెంబడి మరో రహదారి అభివృద్ధి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు తమ అధ్యయనంలో గుర్తించారు. చాదర్‌ఘాట్ కాజ్వే దాటిన తర్వాత మూసీ వెంట ప్రస్తుతం ఓ మార్గం ఉంది. ఇది ఓల్డ్ మలక్‌పేట మీదుగా వెళ్తుంది. అయితే అనేక చోట్ల పూర్తిస్థాయిలో నిర్మాణం లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అనువుగా లేదు. మరోపక్క ఈ రూట్‌ను అభివృద్ధి చేయాలంటే అనే చోట్ల అడ్డంగా ఉన్న హైటెన్షన్ వైర్లకూ పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది. దీన్ని వాహనచోదకులకు అందుబాటులోకి తీసుకువస్తే చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట వెళ్ళాల్సిన అవసరం లేకుండా మూసరామ్‌బాగ్ సమీపంలోని అంబర్పేట్ కాజ్ వే వరకు ట్రాఫిక్‌ను మళ్ళించవచ్చు. ఫలితంగా ఇరుకుగా ఉన్న మలక్‌పేట రహదారిపై రద్దీ తగ్గుతుంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మూసీ రహదారి అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి బల్దియాకు పంపాలని భావించారు. మలక్‌పేటలో మూడో అండర్ పాస్‌తో పాటు వీటికీ మోక్షం కలగకపోవడంతో వాహనచోదకుడిని నిత్యం నరకం తప్పట్లేదు. అత్యంత కీలక రహదారుల్లో ఒకటి... నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ మధ్యలోనిది ప్రధానమైంది. ఈ రూట్లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వేళ్లేవీ నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్లో తిరిగే వాహనచోదకులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ స్టేషన్ కూడా రావడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గాన్ని అనుసరించాలంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన అటు–ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్లో నరకం చవిచూడాల్సిందే. -
చెప్పినా వినలేదు.. గాంధీ ఆస్పతికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా కొంత మంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. స్వీయనిర్బంధం పాటించాలని చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. అలాంటి ఓ వ్యక్తిపై మలక్‌పేట పోలీసులకు స్థానికులకు ఫిర్యాదు చేశారు. క్వారంటైన్లో ఉన్న ఓ వ్యక్తి అపార్ట్మెంట్ బయట తిరుగుతున్నాడు. అపార్ట్మెంట్ వాసులు ఇలా తిరగొద్దని చెప్పినా వినకపోవడంతో ఆందోళన చెందిన ఆపార్ట్మెంట్ వాసులు మలక్‌పేట పోలీసులను ఆశ్రయించారు. (కోవిడ్ ఎఫెక్ట్: వారి కోసం ‘క్రౌడ్ ఫండింగ్’) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం దుబాయి నుంచి వచ్యిన ఓ వ్యక్తి సలీంనగర్‌లోని విజేత సఫైర్ అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో ఉంటున్నాడు. అతనికి మెడికల్ అధికారులు ముద్ర వేసి క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అయితే ఆ వ్యక్తి లిఫ్ట్‌లో తిరగడం గమనించిన అపార్ట్మెంట్ వాసులు కుటుంబ సభ్యులకు, అతనికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. కార్పొరేటర్ తీగల సునరితరెడ్డి, ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు స్థలానికి చేరుకుని అతనికి అవగాహన కల్పించి, బయటకురావద్దని సూచించారు. అయినా తీరుమార్చుకోక పోవడంతో అపార్ట్మెంట్ వాసుల కోరిన మేరకు మెడికల్ సిబ్బంది పిలిచి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. (అత్యవసర సేవలకు పాసుల జారీ) స్వీయ నియంత్రణ పాటించండి అంబర్‌పేట: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు క్రమశిక్షణతో స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బుధవారం అంబర్‌పేట, గోల్నాక, బాగ్ అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ ప్రజలకు సూచించారు. కరోనా పట్ల ప్రభుత్వం తీసుకున్న ఆదేశాలను ప్రజలు పాటించాలని కోరారు. అలాగే కొందరు వ్యాపారులు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారని గమనించి అలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్ తదితరులు ఉన్నారు. అలాగే బాగ్ అంబర్‌పేటలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.దుర్గాప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యవహరించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. (రానున్న మూడు వారాలే అత్యంత కీలకం) -
పేలిన గ్యాస్ సిలిండర్..నలుగురికి గాయాలు
-
గ్యాస్ సిలిండర్ పేలుడు; నలుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్ : మలక్‌పేటలోని వెంకటాద్రినగర్‌లో ఒక ఇంట్లో ఆదివారం అర్థరాత్రి సిలిండర్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. కాగా సిలిండర్ పేలుడు దాటికి ఇళ్లుతో పాటు పలు వాహనాలు దగ్దమయ్యాయి. సిలిండర్ పేలి ఒక్కసారిగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదానికి గురైన మరో ఆర్టీసీ బస్సు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ప్రైవేటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. మలక్‌పేట్ మెయిన్ రోడ్డుపై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వెనుక నుంచి వేగంగా బస్సు రావడంతో డ్రైవర్ కంట్రోల్ చేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికి ఏ హాని జరగలేదు. అయితే తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ఇక ఈ రోడ్డు ప్రమాదం కారణంగా మలక్‌పేటలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. -
మలక్‌పేటలో భారీ చోరీ
మలక్‌పేట: ఓ ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకెళ్లిన సంఘటన మంగళవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు, కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని శోభా నిలయంలో ఉంటున్న బాదీ సురేష్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఇటీవల అతడి కుమారుని పెళ్లి నిశ్చయం కావడంతో ఈనెల 7న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ షిర్డికి వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా అల్మారా ఉన్న గది తలుపులు తీసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న రూ.16 లక్షల నగదు, 30 తులాల బంగారు అభరణాలు కన్పించలేదు. అగంతకులు వంటగది వైపు నుంచి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిరు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌రెడ్డి, టాస్క్ఫోర్ అడిషన్ డీసీపీ చైతన్య, మలక్‌పేట ఏసీపీ సుదర్శన్, మలక్‌పేట ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తులు విదేశీ కరెన్సీ సుమారు 200 డాలర్ల ఇంటి మెట్లపై వదిలి వెళ్లడం గమనార్హం. -
ఆస్థి కోసం అక్కను చంపిన తమ్ముడు
-
ఆస్తి కోసం అక్కని చంపి బాత్రూమ్లో పడేసి..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మలక్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత తమ్ముడే అక్కను చంపాడు. అక్కను చంపి శవాన్ని బాత్రూమ్లో పెట్టి, మిస్సింగ్ కేసు కూడా పెట్టాడు. ఈస్ట్ ప్రశాంత్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
పోయిన పర్సు ఇంటికే వచ్చింది!
సాక్షి, హైదరాబాద్: సొమ్ములు పోగొట్టుకున్న ఓ మహిళ ఇంటికి చేరేలోపే ఆమె సొమ్ములు భద్రంగా ఉన్నట్లు పోలీసులు సమాచారం అందించడమేగాక బాధితురాలిని పిలిపించి వాటిని అప్పగించిన సంఘటన బుధవారం అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మలక్‌పేట ఏసీ పీ నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన అలివేలు సొదరుని వైద్యం కోసం తన రెండు తులాల పుస్తెల తాడు, వెంటి పట్టీలను తనఖా పెట్టేందుకు మార్వాడీ దుకాణానికి వెళ్లింది. మార్వాడి ఇస్తానన్న డబ్బులు సరిపోకపోవడంతో ఆమె మరో ఫైనాన్స్ సంస్థకు వెళ్తుండగా శ్రీరమణ చౌరస్తా వద్ద ఆమె పర్స్ పడిపోయింది. ఫైనాన్స్ సంస్థ వద్దకు వెళ్లి చూసుకున్న అలివేలు ఆందోళనకు గురైంది. అదే సమయంలో శ్రీరమణ చౌరస్తా మీదుగా వెళ్తున్న జైస్వాల్ గార్డెన్‌కు చెందిన బుచ్చిబాబుకు రోడ్డుపై దొరికిన పర్సును అంబర్‌పేట పోలీసులకు అప్పగించాడు. పర్సును పరిశీలించిన పోలీసులు అందులో ఉన్న రసీదు ఆధారంగా మార్వాడి దుకాణాన్ని సంప్రదించి అలివేలు అడ్రస్ తెలుసుకున్నారు. పోచమ్మబస్తీలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లేలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరాశగా ఇంటికి చేరుకున్న అలివేలు వద్ద వివరాలు తీసుకుని స్టేషన్‌కు పిలిపించి పర్సును అప్పగించారు. ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పర్స్ అప్పగించిన బుచ్చిబాబును ఏసీపీ అభినందించారు. అలివేలుకు పర్సు అందజేస్తున్న ఏసీపీ నర్సింగరావు -
దారుణం.. హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
-
మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
-
భార్య,ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపేశాడు
-
కేటీఆర్ సీరియస్: ఆ ముగ్గురికి ఫైన్
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలక్‌పేటలోని నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో దివ్యాంగుల జాతీయ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో శుక్రవారం పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ఫ్లెక్సీలు పెట్టడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు స్థానిక కార్పొరేటర్ సునీతా రెడ్డికి రూ. 50 వేలు, నేతలు అస్లాం, నివాస్‌లకు ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఫ్లెక్సీల నిషేదం ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. -
మలక్ పేటలో అంధుల కోసం పార్క్
-
భార్యను చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హతమార్చాడో భర్త. అనంతరం ఉరి వేసుకొని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ముసారాంబాగ్‌లో బుధవారం వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ కు చెందిన శుభాష్ రెడ్డి(42) నగరంలోని ఓ హోటల్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య శోభ(35) గృహిణి. వీరి మధ్య గతకొంతకాలంగా కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం శుభాష్ భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రేసింగ్‌తో రెచ్చిపోయిన విద్యార్థులు
హైదరాబాద్: మలక్‌పేట-దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై యువకులు బైక్ రేస్‌తో రెచ్చిపోయారు. ఓ బుల్లెట్ వాహనం, మరో ద్విచక్రవాహనంపై కొందరు విద్యార్థులు ట్రిపుల్ రైడింగ్‌తో రేస్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మరో ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో ఆ వాహనంపై ఉన్న వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయాడు. విద్యార్థులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించచారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. -
విలేకరిపై అర్థరాత్రి పోలీసుల థర్డ్ డిగ్రీ
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ పోలీసుల దౌర్జన్యం మరోసారి బయటపడింది. అర్ధరాత్రి వేళ ఓటీవీ విలేకరిపై తమ లాఠీ జులుం చూపారు. విలేకరి నాగరాజును పోలీసులు అర్ధరాత్రి నిర్బంధించి అత్యంత దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వివరాల్లోకి వెళ్తే మహా న్యూస్ టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న నాగరాజు ఆదివారం తన స్నేహితుడి తండ్రి చనిపోవడంతో అతన్ని పరామర్శించడానికి చుడిబజార్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆ ప్రాంతంలో కొంతమంది మద్యం సేవించి ఘర్షణ పడుతున్నారు. పోలీసులు రావడాన్ని గమనించి వారంతా అక్కడ నుంచి పారిపోయారు. కొద్ది దూరంలో నాగరాజు దిల్సుఖ్నగర్ రావడానికి వేచి ఉండగా షాయినాత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు అతని దగ్గరికి వచ్చి ఎవరు నీవు అని నాగరాజును ప్రశ్నించారు. తాను మహా టీవీ రిపోర్టర్నని చెప్పినా ముందు స్టేషన్‌కు పద అంటూ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా లాఠీలతో విచక్షణా రహితంగా చితక బాదడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే బాధితుడిని ఆస్పత్రి చేర్చారు. నాగరాజుపై అకారణంగా దాడి చేసిన ఎస్సై రాజుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. -
టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై లైంగికదాడి
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ కామంధుడు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాలివీ.. అక్బర్‌బాగ్ డివిజన్ ప్రొఫెసర్స్కాలనీలోని ఓ ఇంట్లో కింది పోర్షన్లో కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన దంపతులు అద్దెకు ఉంటున్నారు. వారి కుమార్తె(9) రెండో తరగతి చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజవరం మండలం కోటనందూరు గ్రామానికి చెందిన కాకేటి దేవుడు అలియాస్ రాజు (40) కుటుంబంతో కలిసి అదే ఇంట్లో రెండో అంతస్తులో ఉంటున్నాడు. బుధవారం రాత్రి బాధితురాలు టీవీ చూడటానికి రాజు ఇంటిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మద్యం మత్తులో ఉన్న రాజు బాలికపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలు రాత్రి 11 గంటలకు తల్లికి ఈ విషయం తెలిపింది. ఈ మేరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మలక్‌పేట్ మార్కెట్లో రైతుల ఆందోళన
-
నకిలీ కొబ్బరినూనె తయారీ కేంద్రంపై దాడి
మలక్‌పేట: నకిలీ కొబ్బరినూనె తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మలక్‌పేట ఏసీపీ సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయొ..రాజస్థాన్‌కు చెందిన మహావీర్ జైన్(34) నగరానికి వలస వచ్చి చైతన్యపురి ఫణిగిరి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతను జీడిమెట్లలోని ఐరన్ కంపెనీలో లేబర్‌గా, ఆ తరువాత ఢిల్లీనలోని ఓ ఫినారుుల్ కంపెనీలో పని కుదిరి కిరాణ వస్తువులను మార్కెటింగ్ చేయడంలో అనుభవం సంపాదించాడు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో 2016లో నగరానికి వచ్చి చైతన్యపురిలో మకాం పెట్డాడు. గతనెలలో సలీంనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ’మరికో లిమిటెడ్’ పేరుతో కల్తీ కొబ్బరి నూనె తయారు చేసేవాడు, బేగంబజార్, సికింద్రాబాద్ ప్రాంతాలనుంచి నాసిరకం కొబ్బరినూనె తీసుకొచ్చి ప్యారచూట్ కంపెనీ డబ్బాలలో నింపి తక్కువ ధరకు పాతబస్తీ, నగరశివారు ప్రాంతాల్లోని దుకాణాలకు సరఫరా చేసేవాడు. ప్యారాచూట్ కంపెనీ ప్రతినిధి సదానందం ఫిర్యాదు మేరకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అతడి స్థావరంపై దాడులు నిర్వహించి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రూ. 3 లక్షల విలువైన నకిలీ కొబ్బరి నూనె (750 లీటర్లు), ప్యారచూట్ ఆయిల్‌డబ్బాలు, ఫిల్లింగ్ మిషన్, వెయొటింగ్ మిషన్, కంపెనీ లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఏడుకొండలు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
మలక్‌పేటలో భారీ చోరీ
హైదరాబాద్: మలక్‌పేటకు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక ప్రొఫెసర్స్ కాలనీకి చెందిన ప్రదీప్ జైన్ కుటుంబసభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి బీరువాలో ఉంచిన 40 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ. 80 వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం గమనించిన వ్యాపారి కుటుంబసభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు క్లూస్‌టీంను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. -
మలక్‌పేట్‌లో ఎన్ఫీల్డ్ బైక్ షోరూం ప్రారంభం
-
రేపటి నుంచి మలక్‌పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు
హైదరాబాద్ : మలక్‌పేటలోని రైలు వంతెన వద్ద మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర సమస్యలు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో శాశ్వత బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ మళ్లింపునకు నిర్ణయించారు. శనివారం మూడు నెలలపాటు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్ ఎం.మహేందర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు రావాల్సిన ఆర్టీసీ బస్సుల్ని దిల్సుఖ్నగర్ బస్టాప్‌లో ఆపేస్తారు. -
మలక్ పేటలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని మలక్‌పేట్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే బాంటియా ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి
హైదరాబాద్ : మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో పలు హుక్కాసెంటర్లపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హుక్కా మత్తులో జోగుతున్న తొమ్మిది మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు హుక్కా సెంటర్ల యజమానులపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐ గంగారెడ్డి మాట్లాడుతూ...హుక్కా సెంటర్లు రికార్డులు నిర్వహించని కారణంగా కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
యువకుడిపై ఎంఐఎం కార్యకర్తల దాడి
హైదరాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసారాంబాగ్ శ్యాం హోటల్ వద్ద గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంఐఎం కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు ఒక యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఉస్మానియాకు తరలించారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. -
ఫ్యాన్సీ నంబర్ రూ. 4.8 లక్షలు
హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం వినియోగదారులు పోటీపడి మరి భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంటున్నారు. తమకు నచ్చిన నంబరు కావాలనుకున్న వారు.. ఎంత రేటు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా గురువారం టీఎస్ 11 ఈఎఫ్ 9999 నంబర్ రూ. 4.8 లక్షల ధర పలికింది. మలక్‌పేట్ ఆర్టీవో పరిధిలో వెంకట్‌రెడ్డి అనే వ్యాపారి ఈ నంబర్‌ను దక్కించుకున్నాడు. మలక్‌పేట్ పరిధిలో ఇంత మొత్తానికి నంబర్ అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి అని ఆర్టీవో అధికారులు తెలిపారు. గత వారంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.10 లక్షలు వెచ్చించిన విషయం తెలిసిందే. -
మలక్‌పేట ఎమ్మెల్యే అరెస్టు
మలక్‌పేట: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అక్బర్‌బాగ్ ఎన్నికల అభ్యర్థిపై ఎంఐఎం నాయకులు దాడి చేసిన ఘటనలో మలక్ పేట ఎమ్మెల్యేను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరిగిన ఫిబ్రవరి 2న మలక్‌పేట ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్ద పరీశీలిస్తున్న ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్‌పై స్థానిక ఎమ్మెల్యే బలాల, కార్పొరేటర్ మినాజుద్దీన్తోపాటు మరో నలుగురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై అంజదుల్లాఖాన్ మలక్‌పేట పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటీవల నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, షకీర్‌లను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ గంగారెడ్డి తెలిపారు. గతంలో అరెస్ట్ చేసిన వారందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. -
కార్డన్ సెర్చ్‌లో 48 వాహనాలు సీజ్
మలక్‌పేట్: మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ ప్రాంతాలో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు బలగాలతో జల్లెడ పట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా... సరైన పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలు, రెండు సిలీండర్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేట ఏసీపీ సుధాకర్, సీఐ గంగారెడ్డి, డీఐ గుజ్జ రమేష్, డీఎసై ్స నరేష్, ఎస్సైలు రమేష్, రంజిత్‌కుమార్, వెంకట్రామ్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం ఇలాకాలో పతంగి పాగా
మలక్‌పేట... దిల్సుఖ్నగర్: మలక్‌పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం మరోసారి పట్టు నిలుపుకొంది. మొత్తం 6 డివిజన్లకుగాను నాలుగు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గత బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం మూడు డివిజన్లు సాధించగా ఈ సారి మరో సీటును అదనంగా గెలుపొందడం విశేషం. కాగా ఇదే నియోజకవర్గ పరిధిలోని ఆజంపురా డివిజన్‌లోనే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసం ఉంది. ఆయన తన సొంత ఇలాకాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. గత బల్దియా ఎన్నికల్లో మూడు డివిజన్లలో ఎంఐఎం, మూడు డివిజన్లలో టీడీపీ, ఒక స్థానంలో ఎంబీటీ గెలుపొందింది. ఈసారి పునర్విభజనతో డివిజన్ల సంఖ్య ఆరుకు తగ్గినా ఎంఐఎం తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కాగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. మూసారాంబాగ్‌లో తీగల సునారితారెడ్డి, సైదాబాద్ నుంచి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి టీఆర్ఎస్ తరఫున ఘన విజయం సాధించడం విశేషం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11378 ఓట్లు సాధించగా, తాజా ఎన్నికల్లో 26 వేల పైచిలుకు ఓట్లు సాధించి ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకోగలిగింది. గతంలో నియోజకవర్గంలో తిరుగులేని తెలుగుదేశం పార్టీ ఈ సారి తుడుచుపెట్టుకుపోవడం గమనార్హం. పార్టీ తరఫున హేమాహేమీలు బరిలోకి దిగినా పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో అజాంపురా నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్ ఈ సారి అక్భర్భాగ్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. -
ఎస్బీహెచ్లో చోరీకి యత్నం
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ ఎస్బీహెచ్ శాఖలో ఆదివారం రాత్రి చోరీ యత్నం జరిగింది. నాలుగు రోజులుగా బ్యాంకుకు సెలవులు కావటంతో సోమవారం ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బంది విషయాన్ని గుర్తించారు. దుండగులు షట్టర్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించగా అది తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
నగలు దొంగిలించిన బస్సు మెకానిక్ అరెస్ట్
మలక్‌పేట (హైదరాబాద్) : బస్సు ప్రయాణికుని బ్యాగులోని ఆభరణాలను అపహరించిన ఓ మోకానిక్‌ను మలక్‌పేట పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన సయ్యద్ హఫీజుల్లాహ(39) నగరంలోని అత్తాపూర్‌లో నివాసం ఉంటూ కార్వాన్ మొగల్ఖాన్లో ధనుంజయ ట్రావెల్స్‌లో బస్సు మోకానిక్‌గా పనిచేస్తున్నాడు. ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లింది. అక్కడ మరమ్మతులకు గురికావటంతో హఫీజుల్లాహను అక్కడికి పంపించారు. అతడు బస్సును రిపేర్ చేసి అదే బస్సులో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. కాగా తిరుపతిలో హైదరాబాద్‌కు చెందిన రమేష్‌రెడ్డి ఆ బస్సు ఎక్కి తన బ్యాగును డ్రైవర్ వెనుక క్యాబిన్లో ఉంచాడు. అయితే, అక్కడే పడుకున్న మోకానిక్ హఫీజుల్లాహ ఆ బ్యాగులో ఉన్న 57 గ్రాముల బంగారు నగలు, 40 గ్రాముల వెండి పట్టీలను తస్కరించాడు. రమేష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న తర్వాత బ్యాగులో నగలు కనిపించలేదు. ఈనెల 17వ తేదీన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం హఫీజుల్లాహ నుంచి నగలను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. -
జనపథం-మలక పేట్
-
‘గోల్డ్’ ట్విస్ట్ !
మలక్‌పేటలోని ఓ సంస్థలో భారీ స్కామ్ కేసు.... వివిధ ప్రాంతాల నుంచి 12.5 కేజీల బంగారం రికవరీ అది మాదంటే మాదంటూ కోర్టుకెక్కిన బాధితులు హైదరాబాద్: పోలీసులు రికవరీ చేసిన బంగారం మాదంటే.. మాదంటూ బాధితులు సీసీఎస్ అధికారులను ఆశ్రయించారు... ఆ బంగారాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక అధికారులు చేతులెత్తేశారు. దీంతో రికవరీ చేసిన పసిడిని తమకు అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కొందరు నాంపల్లి కోర్టును, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ‘ఇంటి దొంగల’తోనే అసలు స్కామ్... మలక్‌పేటలో ఉన్న బంగారం తాకట్టు పెట్టుకునే ఓ సంస్థలో ‘ఇంటి దొంగలు’ భారీ స్కామ్‌కు తెరలేపారు. బంగారు ఆభరణాలపై అప్పులు ఇచ్చే ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులే ముఠాగా ఏర్పడి గోల్మాల్ చేశారు. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల్ని నిర్వాహకులు వస్త్రం/కాగితంతో చేసిన చిన్న సంచుల్లో ప్యాక్ చేసి, వాటిపై తాకట్టు పెట్టిన వారు, బంగారం వివరాలు రాసిన స్లిప్పులతో లాకర్లలో భద్రపరుస్తారు. ఇలా లాకర్లలో ఉన్న ఆభరణాలను బయటకు తీసిన ‘ఇంటి దొంగలు’ ఆ ప్యాకెట్లను టాబ్లెట్లు నింపారు. నగలు వేరే చోట తాకట్టు... మలక్‌పేటలోని సంస్థ నుంచి కాజేసిన నగలను ‘ఇంటి దొంగలు’ వేర్వేరు ప్రాంతాల్లో తాకట్టు పెట్టడంతో పాటు విక్రయించారు. నగలను ఎక్కడైనా తాకట్టు పెట్టడానికి వ్యక్తిగత, నివాస గుర్తింపులు అవసరం. దీని కోసం తమకు పరిచయస్తుల నుంచి వాటిని సేకరించి ‘పని’ పూర్తి చేశారు. ఎట్టకేలకు తమ సంస్థలో జరుగుతున్న స్కామ్‌ను గుర్తించిన మలక్‌పేటలోని సంస్థ యాజమాన్యం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అప్పటి ఏసీపీ రామారావు నిందితుల్ని అరెస్టు చేయడంతో పాటు రెండు జ్యువెలరీ షాపులు, మరికొన్ని ప్రాంతాల నుంచి 12.5 కేజీల బంగారం రికవరీ చేశారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలతో నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. బంగారం కోసం ‘పోటాపోటీ’... ఇక్కడి వరకు కథ సజావుగానే సాగినా... రికవరీ బంగారం దగ్గరే చిక్కు వచ్చింది. ఆ 12.5 కేజీల బంగారం తమ సంస్థకు చెందినదని, కొందరు చేసిన స్కామ్ వల్లే బయటకు వెళ్లిందంటూ మలక్‌పేట సంస్థ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. రికవరీ చేసిన బంగారాన్ని సేఫ్ కస్టడీ నిమిత్తం తమకు అప్పగించాలని కోరింది. ‘ఇంటి దొంగలు’ కొందరి గుర్తింపు పత్రాలనైతే సేకరించి, వేర్వేరు చోట్ల ఈ బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఆ గుర్తింపు పత్రాలు ఇచ్చిన వారిలో కొందరు బంగారం మాదేనంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు బంగారంలో కొంత రికవరీ అయిన రెండు జ్యువెలరీ దుకాణాలూ అది తమకు చెందిన పసిడేనంటూ కోర్టుకెక్కాయి. హైకోర్టుకు చేరిన వివాదం.. సాధారణంగా నేరగాళ్ల నుంచి పోలీసులు రికవరీ చేసిన సొత్తును తమకు అప్పగించాల్సిందిగా కోరుతూ బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సేఫ్ కస్టడీ నిమిత్తం వారికే ఇస్తుంది. అయితే ఈ కేసులో మాత్రం ఒకే బంగారాన్ని పలువురు తమదంటే తమదని పోటీపడుతుండటంతో నాంపల్లి కోర్టు ఎవరికీ ఇచ్చేందుకు అంగీకరించలేదు. వివాదం తేలే వరకు ఎవరికీ అప్పగించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది. బంగారం విషయంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీసీఎస్ అధికారులు చెప్తున్నారు. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
మలక్‌పేట: హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అస్మాన్ఘడ్లోని అంజనాద్రి అపార్ట్మెంట్ ప్లాట్ నెం. 301లో భారీ ఎత్తున మంటలు రావడంతో స్థానికులు ఫైర్‌స్టేషన్, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్లాట్‌లో రిటైర్డ్ ఉద్యోగి అంజయ్య కుటుంబం నివాసం ఉంటున్నారు. అంజయ్య కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం సైదాబాద్‌లో గుడికి వెళ్ళారు. వెళ్ళిన కొద్దిసేపటికి ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో వాచ్మెన్ వెంటనే పోలీసులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వంటగదిలో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్థమైంది. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. గ్యాస్ స్టౌవ్ ఆన్ చేసి కట్టివేయడం మరచిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర
* హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం * రూ.7.25 కోట్లతో సబ్సిడీ ఉల్లి సేకరణ సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎగబాకి చుక్కలను తాకిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో శనివారం కిలో గరిష్టంగా రూ. 67 పలికిన ఉల్లి ధర మంగళవారం రూ. 60కి తగ్గింది. కర్నూలు, కర్ణాటక ఉల్లి రకాలు రెండు రోజుల వ్యవధిలోనే కిలోకు రూ. 10 చొప్పున తగ్గినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ లాసల్గావ్ (మహారాష్ట్ర) నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఉత్తర భారతదేశంలో ఉల్లికి డిమాండ్ పెరగడంతో మహారాష్ట్ర రైతులు, వ్యాపారులు అటువైపు దృష్టి సారించారు. గతంలో రోజుకు మహారాష్ట్ర నుంచి 5వేలకు పైగా ఉల్లి బస్తాలు రాగా, ప్రస్తుతం రెండు వేల బస్తాలకు మించి రావడం లేదు. ఇదే సమయంలో కర్ణాటక, కర్నూలు నుంచి ఉల్లి నిల్వలు పెద్దమొత్తంలో రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే హోల్‌సేల్ మార్కెట్లో ధరలు కిలోకు రూ. 10 మేర తగ్గడంతో రైతులు అమ్మకాలపై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నా రు. మార్కెట్‌కు సరుకు చేరుకున్నా లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలకు ఉల్లి ఎగుమతి ధరలు భారీ గా పెంచడం, విదేశాల నుంచి 10 వేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించడం, నల్లబజారుకు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం, సబ్సిడీ ధరలపై విక్రయాలు వంటి కారణాలతో ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లలో పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే.. ధరలు అదుపులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 88 సబ్సిడీ విక్రయ కేంద్రాలకు సరఫరా చేసేందుకు రూ. 7.25 కోట్లతో 1737.29 టన్నుల ఉల్లిని సేకరించింది. విక్రయాల ద్వారా తిరిగి రూ. 3.47 కోట్లు వచ్చినట్లు మార్కెటింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. -
ఎలుకలమందు తాగి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మృతి
మలక్‌పేట (హైదరాబాద్) : ఎలుకల మందు తాగి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన జోసఫ్ (37) సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం ముసారంబాగ్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. వచ్చిన కొద్దిసేపటికే స్పృహ తప్పి కిందపడిపోయాడు. అతడు విషం తాగి ఉన్నట్లు గమనించిన బంధువులు హూటాహూటిన మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా విషం తాగడానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా మృతునికి భార్య, కూతురు ఉన్నారు. పని చేస్తున్న సంస్థ యాజమాన్యం ఒత్తిడి వలనే విషం తాగాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
తొమ్మిదేళ్ల పాపకు పట్టా..
మలక్‌పేట: సరూర్‌నగర్ మండల పరిధిలో బైరామల్‌గూడ్ పాత విలేజ్ సర్వేనంబర్ 11లో 90 గజాల ప్రభుత్వం స్థలంలో ( ఇంటినెంబర్ 7-2-74) పెర్రోజు కుమారస్వామి, భార్య లలిత, కుమార్తె నాగేశ్వరీదేవి(9) తో కలిసి నివాసం ఉంటున్నారు. 58 జీవో కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా అధికారులు కుమారస్వామి కుమార్తె నాగేశ్వరిదేవి పేరున పట్టా జారీ చేశారు . ఈ విషయంపై తహశీల్ధార్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టా గృహిణి పేరుమీదనే జారీ చేస్తున్నాం. అయితే ఆ కుటుంబానికి చెందిన మహిళ లేకపోవడం, లేదా ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పాప ఆధార్‌కు లింక్ అవ్వడంతో పట్టా నాగేశ్వరీదేవి పేరు మీద పట్టా వచ్చి ఉంటుందన్నారు. -
రేస్‌క్లబ్ కథ కంచికేనా ?
-
మలక్‌పేటలో కలకలం రేపిన టిఫిన్‌బాక్స్ బాంబు వదంతి
హైదరాబాద్: మలక్‌పేటలో టిఫిన్ బాక్సులో బాంబు ఉందన్న వదంతులు కలకలం రేపింది. బీహార్ రాజధాని పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. టిఫిన్ బాక్సులో బాంబు వదంతులతో మలక్ పేటవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా, సనత్‌నగర్‌లో సైబరాబాద్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక రివాల్వర్, మూడు తపంచాలు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రాంతాలు, లాడ్జిలు, సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్ వద్ద పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మోకాల్లోతున మహానగరం
-
మోకాల్లోతున మహానగరం
రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం కాలనీలు జలమయం.. ట్రాఫిక్ జామ్‌తో ఇక్కట్లు సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెగని వర్షం కురిసింది. రాజేంద్రనగర్, మలక్‌పేట్, గోషా మహల్, పాతబస్తీలోని పలు ప్రాంతాలను, కాలనీలను వరదనీరు ముంచెత్తింది. రాజేంద్రనగర్‌లోని పలు అపార్ట్మెంట్లలోకి వర్షపు నీరు చేరింది. సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో ఒక మోస్తరు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు జనం అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి మూసీలో వరదనీరు పోటెత్తింది. చాదర్‌ఘాట్ మినీ కాజ్‌వేపై వరదనీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లో స్వల్పంగా వరదనీరు చేరింది. మలక్‌పేటలో కుంగిన రోడ్డు భారీ వర్షాలతో రోడ్డుపై పోటెత్తిన వరదనీటితో మలక్‌పేట వద్ద రోడ్డు కుంగిపోరుుంది. వులక్‌పేట గంజ్ వద్ద మెట్రోరైల్ వూర్గం పిల్లర్ల నిర్మాణాల చుట్టూ ట్రాఫిక్ రక్షణార్థం ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్లు, పిల్లర్ల కోసం తవ్విన లోతైన గుంతల్లో కుంగిపోయాయి. అదే ప్రాంతంలో డ్రైనేజీ పనులకోసం తవ్విన గోతుల్లోకీ వర్షపు నీరు చేరడంతో రోడ్డు ఏదో, గొయ్యి ఏదో తెలియని ప్రమాదకర పరిస్థితి ఏర్పడి, ఆ ప్రాంతంలో రాకపోకలు భారీగా స్తంభించాయి. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింది భాగంలో నడుములోతు వరద నీరు చేరి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో,.. కోఠీ నుంచి వచ్చే వాహనాలను నల్లగొండ క్రాస్‌రోడ్ నుంచి పల్టాన్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌కు మళ్లించారు. చాదర్‌ఘాట్ నుంచి దిల్సుఖ్నగర్ మధ్య రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి వాహనాలకు రెండు గంటలు పట్టింది. -
మలక్‌పేట ఆంధ్రాబ్యాంక్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ మలక్‌పేటలోని ఆంధ్రాబ్యాంక్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, పైళ్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు బ్యాంక్ అధికారులు ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు.