హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి | police attack on hookah centers | Sakshi
Sakshi News home page

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి

Published Fri, Apr 29 2016 11:04 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

police attack on hookah centers

హైదరాబాద్ : మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో పలు హుక్కాసెంటర్లపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హుక్కా మత్తులో జోగుతున్న తొమ్మిది మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు హుక్కా సెంటర్ల యజమానులపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐ గంగారెడ్డి మాట్లాడుతూ...హుక్కా సెంటర్లు రికార్డులు నిర్వహించని కారణంగా కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement