Hookah centers
-
హుక్కా సెంటర్లు బ్యాన్.!
కర్ణాటక: యువత, పిల్లల ఆరో గ్యానికి అపాయకరంగా ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా హుక్కా బార్లను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరులో లైసెన్స్ ఉన్న హుక్కా సెంటర్లతో పాటు వందలాది అక్రమ కేంద్రాలు నడుస్తుండడం తెలిసిందే. వీటిలో స్కూలు పిల్లలు, మైనర్లు చేరి హుక్కా సేవనానికి అలవాటు చేసుకుంటున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే ధూమపానం, మద్యపానం వంటి దుర్వ్యసనాల పాలవుతున్నట్లు ఆరోపణలు ఉండడం తెలిసిందే. శాశ్వతంగా అడ్డుకట్ట హుక్కా సెంటర్ల బెడదపై వివిధ వర్గాలు గళమెత్తిన నేపథ్యంలో మంగళవారం వికాససౌధలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్‌గుండూరావు, క్రీడా యువజన మంత్రి బీ.నాగేంద్ర నేతృత్వంలో జరిగిన సమావేశంలో హుక్కా బార్ల నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి దినేశ్ మాట్లాడుతూ నేటిరోజుల్లో యువత, పిల్లలపై హుక్కాబార్ల ప్రభావం అధికమైంది. ఇందుకు శాశ్వతంగా అరికట్టేందుకు నిషేధమే ఏకై క మార్గం. ఈ దిశలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ భేటీలో హుక్కా సెంటర్ల రద్దుపై తీవ్ర చర్చలు జరిపి అధికారుల నుంచి సాధక బాధకాలపై అభిప్రాయాలను తీసున్నాం, ఏ కారణానికీ హుక్కా బార్‌కు అవకాశం ఇవ్వరాదని యోచించాం. ఇప్పటివరకు హుక్కాబార్ల నిషేధం సాధ్యపడలేదు. చివరకు వాటికి చరమగీతానికి సిద్ధమయ్యామని మంత్రి తెలిపారు. వాటిని చట్టపరిధిలోనే నియంత్రించాలి, ఇందుకు ఎవరూ వ్యతిరేకించలేదు, అయితే కొందరు తాము చట్టం అమల్లోకి తీసుకొచ్చిన తరువాత న్యాయస్థానంలో ప్రశ్నిస్తారు. అందుకే నిషేధానికి వీలుగా చట్టం జారీ చేస్తామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులకు కళ్లెం ఇకపై దేవాలయం, చర్చ్, మసీదు, ఆసుపత్రుల చుట్టుపక్కల పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధిస్తాం. దీనిపై అనేక రోజుల నుంచి ప్రజలు, సంఘాల డిమాండ్ ఉంది, ప్రజల భావాలను ఆమోదిస్తామని మంత్రి చెప్పారు. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లు పైబడినవారు కొనుగోలు చేయవచ్చు, రాబోయే రోజుల్లో ఈ నిబంధనను 21 సంవత్సరాలకు పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. యువజనుల హితదృష్టితో ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిపారు. -
దమ్ మారో దమ్! సిగరెట్ కంటే హుక్కా ప్రమాదకరం..
► ఈ నెల 2న... గోల్కొండలోని ది పాన్ హౌస్ అండ్ మోర్ ► ఈ నెల 13న... టోలిచౌకిలోని ది సీషా ఫ్యాక్టరీ కేఫ్ ► ఈ నెల 17న... మాసబ్‌ట్యాంక్‌లోని రెస్టో లాంజ్ కేఫ్ ► తాజాగా మంగళవారం... హబీబ్‌నగర్‌లోని దుబాయ్ సీషా లాంజ్... హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందాల దాడుల్లో వెలుగులోకి వచ్చిన హుక్కా పార్లర్లు/కేఫ్‌లు ఇవి. నిషేధం ఉన్నా నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న హుక్కా సెంటర్లు బార్లు, పబ్బులను మించిపోతున్నాయి. వినోదం, హెర్బల్ ఉత్పత్తుల ముసుగులో అనుమతులు తీసుకుంటున్న ఈ సెంటర్లు మాయమాటలతో యువతకు వల వేస్తూ వారి జీవితాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇక్కడ వివిధ ఫ్లేవర్ల పేరుతో పొగాకు, రసాయనాలతో పాటు గంజాయి కూడా వినియోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... వీటి నిర్వాహకులు మైనర్లను కూడా అనుమతిస్తుండటం. అక్రమంగా పదుల సంఖ్యలో... రాజధానిలో అనేక హుక్కా సెంటర్లు అక్రమంగా నడుస్తున్నట్ల అనుమానాలున్నాయి. రిక్రియేషన్ సెంటర్లు, స్నూకర్ పార్లర్లు, హెర్బల్ ఉత్పత్తుల పేరుతో అనుమతులు, ఉత్తర్వులు తీసుకుంటున్న ఈ కేంద్రాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. కేవలం యాపిల్, మింట్, పాన్ మసాలా, చాకో, బెర్రీస్ ఇలాంటి రకాలైన ఫ్లేవర్లను మాత్రమే హుక్కాల్లో వినియోగిస్తామంటున్న వీటి నిర్వాహకులు కస్టమర్లను బట్టి ‘మెనూ’ మారుస్తున్నారు. వివిధ రకాలైన పొగాకు ఉత్పత్తులను వాడేస్తున్నారు. ఇవి ఎవరి కంటా పడకుండా పార్లర్లలోని రహస్య ప్రాంతాల్లో దాస్తున్నారు. నిబంధనలను సైతం తుంగలో తొక్కి మైనర్లు, యువతులను అనుమతిస్తూ వారినీ బానిసలుగా మారుస్తున్నారు. ఈ హుక్కా కిక్కుకు అలవాటు పడిన యువత రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోతున్నారు. మరికొన్ని సెంటర్లలో ‘అదనపు సౌకర్యాలు’ కల్పిస్తున్నారు. మాయమాటలతో యువత ఆకర్షణ... లేటెస్ట్ అడెక్షన్గా పిలిచే హుక్కాకు బానిసవుతున్న వారిలో సగానికి సగం మైనర్లే ఉంటున్నారు. మేజర్లు మద్యం తదితరాల కోసం బార్లు, పబ్బులకు వెళ్తుండటంతో ఆ అవకాశం లేని మైనర్లు హుక్కా దారి పడుతున్నారు. ఈ కారణంగానే నిషేధం ఉన్నప్పటికీ నిర్వాహకులు రహస్యంగా ఈ సెంటర్లు నడుపుతున్నారు. ఈ హుక్కా పైపుల్లో పొగాకు వాడకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నా ఫ్లేవర్ల కంటే నికోటిన్ కూడిన వాటికే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు వీటినే వాడుతున్నారు. హుక్కా ద్వారా వచ్చే పొగ నీటిలో నుంచి శుద్ధి అవుతూ పైపు ద్వారా నోటిలోకి వస్తుందని, దీని వల్ల నికోటిన్ వంటివి శరీరంలోకి చేరవని, ఎలాంటి హానీ ఉండదనీ మాయమాటలు చెబుతూ సెంటర్ల నిర్వాహకులు యువతను ఆకర్షిస్తున్నారు. ఈ మాటల వల్లో పడిన మైనర్లు ఆయా సెంటర్ల మెట్లు ఎక్కుతున్నారు. ఇవన్నీ వాస్తవదూరాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సిగరెట్ కంటే హుక్కా ప్రమాదకరం.. సిగరెట్ కన్నా హుక్కా ప్రమాదకరమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని పీల్చడం ద్వారా పొగ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని వివరిస్తున్నారు. నికోటిన్ కన్నా అధికమొత్తంలో కార్బన్‌మోనాకై ్సడ్ శరీరంలోకి చేరుతుందని, ఈ కారణంగానే హుక్కా అనేది సిగరెట్ కన్నా ఎన్నో రెట్లు హానికరమని చెబుతున్నారు. ఒకే హుక్కా గొట్టాన్ని అనేక మంది వాడటం, పూర్తిస్థాయిలో శుభ్రం చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్తో పాటు నోటి సంబంధ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశామని, అక్రమ దందాలపై చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
హుక్కా ఆన్ వీల్స్!
సాక్షి, సిటీబ్యూరో: హుక్కా పార్లర్లపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ దందా చేసేవాళ్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ వాటిని అనుసరిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకులు, హుక్కా పీల్చే వారితో కలిపి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, వీరి నుంచి ఓమ్నీ వాహనంతో పాటు రూ.2 లక్షల విలువైన హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి గురువారం వెల్లడించారు. పాతబస్తీలోని మచిలీ క కమాన్ ప్రాంతానికి చెందిన అలీ, అబ్దుల్ కరీం గతంలో రఫీఖ్ ట్రేడర్స్ పేరుతో హుక్కా వ్యాపారం నిర్వహించారు. సిటీలో హుక్కా పార్లర్స్ ను నిషేధించడం, అక్రమ వ్యాపారంపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ ద్వయం కొత్త మార్గాలు అన్వేషించింది. కొన్ని నెలల క్రితం ఓ ఓమ్మీ వ్యాన్ ఖరీదు చేసిన వీరు అందులో కొన్ని మార్పులు చేసి తెరలు ఏర్పాటు చేశారు. అనేక ప్రాంతాల నుంచి అక్రమంగా సేకరించిన హుక్కా పాట్స్, మెటీరియల్, వివిధ ఫ్లేవర్లు అందులో పెట్టుకుంటున్నారు. ఈ వాహనంతో సహా వీరిద్దరూ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. పరిచయస్తులు, వారి సిఫార్సుతో వచ్చిన వారికి ఆయా ఫ్లేవర్లకు చెందిన హుక్కా పాట్స్ అందిస్తున్నారు. దీనికి వారి నుంచి నిర్ణీత మొత్తం వసూలు చేస్తూ తమ వాహనం చాటునే కూర్చుని హుక్కా పీల్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా పాతబస్తీలో అనేక మంది కస్టమర్లను ఏర్పాటు చేసుకున్న ఈ ద్వయం వారి వద్దకే వెళ్తూ వారికి హుక్కా పీల్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు కొందరికి పాట్స్, హుక్కా ఫ్లేవర్స్ విక్రయిస్తోంది. కొన్నాళ్ళుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేత్రుత్వంలో రంగంలోకి దిగిన టీమ్ వలపన్ని మీర్‌చౌక్ ప్రాంతంలో వాహనాన్ని పట్టుకుంది. అందులో ఉన్న ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురిని పట్టుకుంది. తదుపరి చర్యల నిమిత్తం వీరిని మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించింది. -
‘స్మోకింగ్ జోన్ల’పై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తమ రెస్టారెంట్లలోని స్మోకింగ్ జోన్లలో మాత్రమే హుక్కా సేవలను అందిస్తుంటే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు పోలీసుల వివరణను కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ రెస్టారెం ట్లలోని స్మోకింగ్ జోన్లో మాత్రమే హుక్కా సేవలను అందిస్తున్నామని.. అయినా పోలీసులు దీనిపై జోక్యం చేసుకుంటున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన అర్బన్ గ్రిల్ డైన్ అండ్ కాఫీ షాప్, మరో సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. స్మోకింగ్ జోన్లలో హుక్కా సేవలపై ఎటువంటి నిషేధం లేదని విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. -
హుక్కా సెంటర్లపై దాడులు
బంజారాహిల్స్ : నిర్దేశిత సమయానికి మించి పబ్‌లు, హుక్కా సెంటర్లు, కాఫీషాపులు తెరుస్తున్నారన్న సమాచారంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి స్నిప్పర్ డాగ్స్‌తో జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్‌లు, హుక్కా సెంటర్లు, కాఫీ షాపుల్లో సోదాలు జరిపారు. నిబంధనలు ఉల్లంఘించిన హుక్కా సెంటర్లపై కేసులు నమోదు చేశారు. -
హుక్కా సెంటర్లపై విస్తృత దాడులు
హైదరాబాద్ : హుక్కా సెంటర్లలో నిబంధనల అతిక్రమణలపై పోలీసులు కొరడా ఝళిపించారు. శుక్రవారం నారాయణగూడ, అబిడ్స్, రాంగోపాల్‌పేట్ పోలీస్స్టేషన్ల పరిధిలోని హుక్కా సెంటర్లపై దాడులు చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టుబడిన మైనర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయి. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి
హైదరాబాద్ : మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో పలు హుక్కాసెంటర్లపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హుక్కా మత్తులో జోగుతున్న తొమ్మిది మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు హుక్కా సెంటర్ల యజమానులపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐ గంగారెడ్డి మాట్లాడుతూ...హుక్కా సెంటర్లు రికార్డులు నిర్వహించని కారణంగా కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
హుక్కా.. లేదు లెక్క!
బార్లను మించిపోతున్న ‘సెంటర్లు’ మైనర్లపైనే గురి నిబంధనలు గాలికొదిలి ‘పొగాకు, గంజాయి సరఫరా? సరైన ‘సెక్షన్లు’ లేకపోవడంతో పోలీసులకు తలనొప్పులు సిటీబ్యూరో: నగరంలోని హుక్కా సెంటర్లు బార్లు, పబ్బులను మించిపోతున్నాయి. వినోదం ముసుగులో అనుమతులు తీసుకుంటున్న ఈ సెంటర్లు మాయమాటలతో యువతకు వల వేస్తూ వారి జీవితాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇక్కడ వివిధ ఫ్లేవర్ల పేరుతో పొగాకు, గంజాయి తదితరాలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ మించి ఈ సెంటర్లలోకి మైనర్లను విచ్చలవిడిగా అనుమతిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న పశ్చిమ మండల పోలీసులు శనివారం అర్దరాత్రి వరుసదాడులు చేశారు. కమిషనరేట్ పరిధిలో హుక్కా సెంటర్లు వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. బిలియడ్స్ తరహా ఆటలు నిర్వహిస్తామంటూ రిక్రియేషన్ సెంటర్ల పేరుతో అనుమతులు తీసుకుంటున్న ఈ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. కేవలం యాపిల్, మింట్, పాన్ మసాలా, చాకో, బెర్రీస్ ఇలాం టి రకాలైన ఫ్లేర్లను మాత్రమే హుక్కాల్లో వినియోగిస్తామంటున్న నిర్వాహకులు వినియోగదారులు అవసరా న్ని బట్టి ‘మెనూ’ మారుస్తున్నారు. పొగాకుతో పాటు గంజాయి, మాదకద్రవ్యాలు సైతం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలను సైతం తుంగలో తొక్కి మైనర్లు, యువతులను అనుమతిస్తూ వారినీ బానిసలుగా మారుస్తున్నారు. ఈ మత్తుకు అలవాటు పడినయువత రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోతున్నారు. బానిసల్లో మైనర్లే ఎక్కువ ... చట్ట ప్రకారం హుక్కా పీల్చడం తప్పుకాదనే విషయాన్ని అడ్డం పెట్టుకుని నగరంలోని హుక్కా సెంటర్లు చేస్తున్న ఉల్లంఘనలు అన్నీ ఇన్నీ కావు. హుక్కాకు బానిసవుతున్న వారిలో సగానికి సగం మైనర్లే ఉంటున్నారు. మేజర్లు మద్యం కోసం బార్లు, పబ్బులకు వెళ్తుండగా ఆ అవకాశం లేని మైనర్లు హుక్కా దారి పడుతున్నారు. ఈ హుక్కా పైపుల్లో పొగాకు వాడకూడదని నిబంధనలు చెప్తున్నా ఫ్లేవర్ల కంటే నికోటిన్ కూడిన వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. హుక్కా ద్వారా వచ్చే పొగ నీటిలో శుద్ధి అవుతూ పైపు ద్వారా నోటిలోకి వస్తుందని, దీని వల్ల నికోటిన్ వంటిని శరీరంలోకి చేరవని, ఎలాంటి హానీ ఉండదనీ మాయమాటలు చెప్తూ సెంటర్ల నిర్వాహకులు యువతను ఆకర్షిస్తున్నారు. ఈ మాటలు నమ్మి మైనర్లు ఆయా సెంటర్ల మెట్లు ఎక్కుతున్నారు. సిటిరెట్ కన్నా హుక్కా ప్రమాదకరమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని పీల్చడం ద్వారా పొగ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందంటున్నారు. అధికమొత్తంలో కార్బన్‌మోనాక్సైడ్ శరీరంలోకి చేరుతుందని, సిగరెట్ కన్నా ఎన్నో రెట్లు ఇది హానికమని చెప్తున్నారు. ఒకే హుక్కా గొట్టాన్ని అనేక మంది వాడటం, పూర్తిస్థాయిలో శుభ్రం చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్తో పాటు నోటి సంబంధ వ్యాధులు వస్తామని హెచ్చరిస్తున్నారు. ఏ చట్టం కింద కేసు పెట్టాలి..? హుక్కా సెంటర్ల ఉల్లంఘనలు, కల్పిస్తున్న అదనపు సౌకర్యాల విషయం తెలిసిన పోలీసు అధికారులు ఇటీవల దాడులు ముమ్మరం చేశారు. వెస్ట్‌జోన్ పోలీసులు శనివారం రాత్రి హుక్కా సెంటర్ల మీద వరుస దాడులు చేశారు. వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా... ఎక్సైజ్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పశ్చిమ మండల అధికారులు శనివారం చేసిన దాడుల్లో అనేక సెంటర్ల నుంచి నమూనాలు సేకరించారు. ఇతర వరకు బాగానే ఉన్నా... నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్వాహకులు, అక్కడకు వస్తున్న మైనర్లపై ఏ చట్టం కింద, ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలన్నది అంతు చిక్కట్లేదు. సదరు సెంటర్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తుంటే ఆ చట్టం కింద కేసులు పెట్టచ్చు. అయితే మైనర్లను అనుమతిస్తున్నారనో, మరో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనో తేలితే ఎలాంటి కేసులు పెట్టాలి? ఏ చర్యలు తీసుకోవాలి అనే విషయంపై స్పష్టత లేక పోలీసులే తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీసీలోని సెక్షన్ 188తో (ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడం) పాటు సీఆర్పీసీ, సీపీ యాక్ట్ల్లోని సెక్షన్లతో సరిపెట్టాల్సి వస్తోంది. ఇవేవీ కఠిన శిక్షలు, చర్యలకు ఉపకరించే కాకపోవడం గమనార్హం. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి
హైదరాబాద్ : పాతబస్తీ ఫలక్‌నుమా ఏరియాలోని హుక్కా సెంటర్లపై గురువారం ఉదయం పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 15 మంది కాలేజి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన విద్యార్థుల తల్లిదండ్రులను, వారు చదువుతున్న కళాశాలల యాజమాన్యాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు సౌత్‌జోన్ అడిషనల్ డీసీపీ బాబూరావు తెలిపారు. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు
హైదరాబాద్ : శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ పోలీసులు నగరంలోని పలు హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనర్లతో పాటు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని 44 సెంటర్లలో ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. కాగా పట్టుబడిన మైనర్ యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు
-
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి
హైదరాబాద్ : హైదరాబాద్ నేరేడ్మెట్ పరిధిలోని హుక్కా సెంటర్లపై సోమవారం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓటీ) పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.45 వేల నగదు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి
మలక్‌పేట: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న హుక్కాసెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఐదు హుక్కా సెంటర్లపై శనివారం ఈస్ట్ జోన్ పోలీసులు దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న హుక్కాసెంటర్ల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.