బంజారాహిల్స్ : నిర్దేశిత సమయానికి మించి పబ్‌లు, హుక్కా సెంటర్లు, కాఫీషాపులు తెరుస్తున్నారన్న సమాచారంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి స్నిప్పర్ డాగ్స్‌తో జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్‌లు, హుక్కా సెంటర్లు, కాఫీ షాపుల్లో సోదాలు జరిపారు. నిబంధనలు ఉల్లంఘించిన హుక్కా సెంటర్లపై కేసులు నమోదు చేశారు.