హైదరాబాద్ : హుక్కా సెంటర్లలో నిబంధనల అతిక్రమణలపై పోలీసులు కొరడా ఝళిపించారు. శుక్రవారం నారాయణగూడ, అబిడ్స్, రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని హుక్కా సెంటర్లపై దాడులు చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టుబడిన మైనర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయి.