సాక్షి, బంజారాహిల్స్ : తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. రహ్మత్‌నగర్‌లో విజయదుర్గాదేవి(61), తన భర్త వెంకటేశ్వర్లుతో కలిసి ఉంటోంది. వీరికి కుమారులు సురేష్‌బాబు, శ్రీకాంత్‌తో పాటు కుమార్తె ఉందిది. ఆమె భర్త వెంటేశ్వర్లు హెచ్‌ఏఎల్‌లో పని చేసి పదవీ విరమణ పొందారు. రిటైర్‌మెంట్ సొమ్ముతో రహ్మత్‌నగర్‌లో జీప్లస్–2 ఇంటిని నిర్మించుకున్నాడు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో విజయదుర్గాదేవి దంపతులు ఉండగా, ఫస్ట్‌ఫ్లోర్‌ను కిరాయికి ఇచ్చారు. 2016 నుంచి కొడుకులతో పాటు కోడళ్లు వారిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు.
ఈ నెల 12న కుమారులు సురేష్‌బాబు, శ్రీకాంత్ తల్లిదండ్రులను కొట్టి బయటకు గెంటేసి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. తండ్రిని కొడుతుండటంతో అడ్డు వచ్చిన తల్లిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. తమకు న్యాయం చేయాలని, తమపై దాడి చేసిన కుమారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమను ఇంట్లో నుంచి తరిమేసి ఇంటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. చిన్న కొడుకు శ్రీకాంత్ సీఐఐఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్(పీసీ 819) పని చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కానిస్టేబుల్ శ్రీకాంత్‌తో పాటు సోదరుడు సురేష్‌బాబుపై క్రిమినల్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment