ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పోలీస్ అధికారుల పుత్నరత్నాలు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. శనివారం రాత్రి ఒమేగా ఆస్పత్రి వద్ద పోలీసులకు ఓ అడిషనల్ డీసీపీ కుమారుడు దొరికిపోయాడు. తన బ్రెజ్జా కారుకు ముందు వెనుక పోలీస్ స్టికర్లు అంటించుకొని.. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అతని కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాను పోలీసులకు చెందినవాడినని చెప్తూ.. దూసుకుపోయేందుకు ప్రయత్నించాడు.
అయినా, పోలీసులు కారును ఆపి.. తనిఖీ చేయడంతో అందులో పోలీసుల లాఠీ దొరకడంతో అవాక్కయ్యారు. దీంతో పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడంటూ పైఅధికారుల దృష్టికి ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకును ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారని తెలియడంతో సదరు అడిషనల్ డీసీపీ వెంటనే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసిందే. తన కొడుకును విడిచిపెట్టాలని ఆయన చెప్పడంతో.. మీ కొడుకు తీరు సరిగా లేదని, పోలీసు శాఖ పరువు తీసేలా ప్రవర్తిస్తున్నాడని ట్రాఫిక్ పోలీసులు ఆయనకు తెలియజేసినట్టు సమాచారం. అనంతరం అతన్ని విడిచిపెట్టినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment