హైదరాబాద్ : పాతబస్తీ ఫలక్‌నుమా ఏరియాలోని హుక్కా సెంటర్లపై గురువారం ఉదయం పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 15 మంది కాలేజి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన విద్యార్థుల తల్లిదండ్రులను, వారు చదువుతున్న కళాశాలల యాజమాన్యాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు సౌత్‌జోన్ అడిషనల్ డీసీపీ బాబూరావు తెలిపారు.