కర్ణాటక: యువత, పిల్లల ఆరో గ్యానికి అపాయకరంగా ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా హుక్కా బార్లను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరులో లైసెన్స్ ఉన్న హుక్కా సెంటర్లతో పాటు వందలాది అక్రమ కేంద్రాలు నడుస్తుండడం తెలిసిందే. వీటిలో స్కూలు పిల్లలు, మైనర్లు చేరి హుక్కా సేవనానికి అలవాటు చేసుకుంటున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే ధూమపానం, మద్యపానం వంటి దుర్వ్యసనాల పాలవుతున్నట్లు ఆరోపణలు ఉండడం తెలిసిందే.
శాశ్వతంగా అడ్డుకట్ట
హుక్కా సెంటర్ల బెడదపై వివిధ వర్గాలు గళమెత్తిన నేపథ్యంలో మంగళవారం వికాససౌధలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్‌గుండూరావు, క్రీడా యువజన మంత్రి బీ.నాగేంద్ర నేతృత్వంలో జరిగిన సమావేశంలో హుక్కా బార్ల నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి దినేశ్ మాట్లాడుతూ నేటిరోజుల్లో యువత, పిల్లలపై హుక్కాబార్ల ప్రభావం అధికమైంది. ఇందుకు శాశ్వతంగా అరికట్టేందుకు నిషేధమే ఏకై క మార్గం. ఈ దిశలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ భేటీలో హుక్కా సెంటర్ల రద్దుపై తీవ్ర చర్చలు జరిపి అధికారుల నుంచి సాధక బాధకాలపై అభిప్రాయాలను తీసున్నాం, ఏ కారణానికీ హుక్కా బార్‌కు అవకాశం ఇవ్వరాదని యోచించాం. ఇప్పటివరకు హుక్కాబార్ల నిషేధం సాధ్యపడలేదు. చివరకు వాటికి చరమగీతానికి సిద్ధమయ్యామని మంత్రి తెలిపారు. వాటిని చట్టపరిధిలోనే నియంత్రించాలి, ఇందుకు ఎవరూ వ్యతిరేకించలేదు, అయితే కొందరు తాము చట్టం అమల్లోకి తీసుకొచ్చిన తరువాత న్యాయస్థానంలో ప్రశ్నిస్తారు. అందుకే నిషేధానికి వీలుగా చట్టం జారీ చేస్తామని తెలిపారు.
పొగాకు ఉత్పత్తులకు కళ్లెం
ఇకపై దేవాలయం, చర్చ్, మసీదు, ఆసుపత్రుల చుట్టుపక్కల పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధిస్తాం. దీనిపై అనేక రోజుల నుంచి ప్రజలు, సంఘాల డిమాండ్ ఉంది, ప్రజల భావాలను ఆమోదిస్తామని మంత్రి చెప్పారు. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లు పైబడినవారు కొనుగోలు చేయవచ్చు, రాబోయే రోజుల్లో ఈ నిబంధనను 21 సంవత్సరాలకు పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. యువజనుల హితదృష్టితో ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment