ఎస్‌బీహెచ్‌లో చోరీకి యత్నం
Published Mon, Dec 28 2015 12:33 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ ఎస్‌బీహెచ్ శాఖలో ఆదివారం రాత్రి చోరీ యత్నం జరిగింది. నాలుగు రోజులుగా బ్యాంకుకు సెలవులు కావటంతో సోమవారం ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బంది విషయాన్ని గుర్తించారు. దుండగులు షట్టర్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించగా అది తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Advertisement
Advertisement