మలక్‌పేట: ఓ ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకెళ్లిన సంఘటన మంగళవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు, కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని శోభా నిలయంలో ఉంటున్న బాదీ సురేష్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఇటీవల అతడి కుమారుని పెళ్లి నిశ్చయం కావడంతో ఈనెల 7న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ షిర్డికి వెళ్లారు.
మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా అల్మారా ఉన్న గది తలుపులు తీసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న రూ.16 లక్షల నగదు, 30 తులాల బంగారు అభరణాలు కన్పించలేదు. అగంతకులు వంటగది వైపు నుంచి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిరు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌రెడ్డి, టాస్క్‌ఫోర్ అడిషన్ డీసీపీ చైతన్య, మలక్‌పేట ఏసీపీ సుదర్శన్, మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తులు విదేశీ కరెన్సీ సుమారు 200 డాలర్ల ఇంటి మెట్లపై వదిలి వెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment