SBH
-
తెలంగాణలో ఎస్బీఐ ఏటీఎంలు మూసివేత
-
ఆసరా.. ఆలస్యం
♦ రెండు నెలలుగా ఇదే పరిస్థితి ♦ ఈసారి బ్యాంకుల విలీనంతో జాప్యం సాక్షి, కొత్తగూడెం: ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది రాష్ట్రంలోని ఆసరా పింఛనర్ల పరిస్థితి. కుటుంబపరంగా ఎటువంటి ఆసరా లేని వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 పింఛన్ ప్రతినెలా ఏదో ఒక కారణంతో ఆలస్యమవుతూనే ఉంది. జూన్ 6వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని 36,37,949 మంది పింఛనర్లకు ఏప్రిల్ నెల పింఛన్ ఇవ్వకపోవడంతో తమ కుటుంబ అవసరాలు తీరక వృద్ధ పింఛనర్లు, వికలాంగులు, వితంతువులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రంలోని ఎస్‌బీహెచ్‌తో సహా ఐదు ప్రధాన బ్యాంకులు విలీనం కావడం వల్ల ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారడం, బ్యాంకుల కంప్యూటర్లపై పనిఒత్తిడి పెరగడంతో సర్వర్లు మొరాయించడం వంటి సాంకేతిక కారణాల వల్ల బ్యాంకుల్లో ఆసరా పింఛన్లు ఇంకా జమకాని పరిస్థితి నెలకొంది. ఈ సాంకేతిక సమస్యలు ఎప్పుడు తొలగుతాయో, తమ పింఛన్ ఎప్పుడు బ్యాంకులో పడుతుందో తెలియక పింఛనర్లు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో 13,59,597 మంది వితంతు, 13, 31,103 మంది వృద్ధాప్య, 4,65,047 మంది వికలాంగులు, 34,728 మంది చేనేత కార్మికులు, 58, 372 మంది గీత కార్మికులు, 3, 48, 301 మంది బీడీ కార్మికులు, 40,801 మంది ఇతర పింఛనర్లు ప్రతినెలా ఆసరా పింఛన్ అందుకుంటున్నారు. బ్యాంకుల విలీనం పేరుతో ఈసారి పింఛన్ ఆలస్యం కాగా.. గత మార్చి నెల ఆసరా పింఛన్‌ను ప్రభుత్వం నుంచి బ్యాంకుల్లో నగదు జమ కాలేదన్న కారణంతో ఆ పింఛన్ ఏప్రిల్ 20 నుంచి 22 తేదీల్లో పడాల్సిన డబ్బును మే 5వ తేదీన పంపిణీ చేశారు. ఇక ఏప్రిల్ నెల పింఛన్ మే 20 నుంచి 22వ తేదీలోగా బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా, జూన్ 5 వరకు రాలేదు. అయితే కేవలం పింఛన్‌పైనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్న లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇప్పటికీ పింఛన్ అతీగతీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల చెల్లింపులు బ్యాంకులకు అనుసంధానం చేయడంతో తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పింఛన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఆసరా’తో పింఛనర్లు తమ నెలవారీ ఖర్చులను కొంతవరకైనా తీర్చుకునే అవకాశం ఉంటుంది. నిత్యావసరాలతోపాటు ఆస్పత్రులకు ఈ పింఛన్ నుంచే ఖర్చు చేస్తుంటారు. అయితే గతంలో పింఛన్లను నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఇచ్చేవారు. కానీ గత రెండేళ్లుగా బ్యాంకు ఖాతాల్లో మాత్రమే పింఛన్లను జమ చేస్తున్నారు. దీనివల్ల అసలైన లబ్ధిదారులకే పింఛన్ లభించే అవకాశం ఉందనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్ల కోసం బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఎవరో ఒకరిని బతిమాలి వారి సహాయంతో వెళ్లి పింఛన్లు తెచ్చుకుంటున్నారు. -
నేటి నుంచి ఎస్బీహెచ్ కనుమరుగు
-
చారిత్రక సౌధం..
పేరు మారనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ భవనం ♦ నేటి నుంచి ఎస్బీహెచ్ కనుమరుగు ♦ 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్యాంకింగ్ సేవలు ♦ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏడో నిజాం ♦ అతి పెద్ద భారతీయ బ్యాంకులో విలీనమైన సేవలు సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆశల సౌధం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ బ్యాంకు ఇక కనుమరుగు కానుంది. శనివారం నుంచి ఎస్బీఐలో విలీనమవుతోంది. లక్షల మంది ఖాతాదారులతో, శాఖోపశాఖలుగా విస్తరించిన ఎస్బీహెచ్ సేవలు ఇక కొత్త రూపు సంతరించు కోనున్నాయి. ఏడున్నర దశాబ్దాల హైదరాబాద్ లోని గన్‌ఫౌండ్రిలో కట్టించిన ‘హైదరాబాద్ స్టేట్ బ్యాంక్’చారిత్రక సౌథం ఇక నుంచి ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా సేవలందజేయనుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ఎంతో ఘన చరిత్ర.. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ చట్టం కింద 1941లో గన్‌ఫౌండ్రిలో ఈ బ్యాంకును నిర్మించారు. సువిశాల ప్రాంగణం.. పెద్ద హాళ్లు.. ఇండో యూరోపి యన్ నిర్మాణ శైలిలో అత్యద్భుతంగా కట్టించిన ఈ భవనం బ్యాంకింగ్ రంగంలోనే వినూత్నంగా నిలి చింది. అప్పటి వరకు నిజాం ప్రభుత్వం లో సెంట్రల్ బ్యాంకింగ్ విధానం లేదు. ప్రజల సొమ్ముకు రక్షణ లేదు. రిజర్వ్‌బ్యాంకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలో ఉంది. ఈ క్రమంలో నిజాం సంస్థానంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంకును ఏర్పాటు చేశారు. 1942 ఏప్రిల్ 5 నుంచి ఈ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి కరెన్సీ ‘ఉస్మానియా సిక్కా’. ఈ కరెన్సీలోనే బ్యాంకు కార్యకలాపాలు కొనసాగాయి. హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమయ్యాక ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’గా పేరు పెట్టారు. 1950 నాటికి 50 శాఖలతో సేవలు అందజేసిన ఎస్బీహెచ్ ఇప్పుడు 2,000 బ్రాంచ్‌లను కలిగి ఉంది. గన్‌ఫౌండ్రి బ్రాంచ్‌లో 20 వేల మంది ఖాతాదారులున్నారు. ఆసియాలోనే అతిపెద్ద లాకర్స్ వ్యవస్థ ఇందులోనే ఉంది. 75 ఏళ్ల ఘన చరిత్రను ప్రతిబింబించేలా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఇటీవల జరిగాయి. ఈ కట్టడానికి వారసత్వ భవనంగా గుర్తింపు కూడా లభించింది. కొత్త లోగోతో ఎస్బీఐ: నేటి నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం ఇన్నేళ్ల ప్రేమతో.. దశాబ్దాలుగా ఎస్బీహెచ్ ఉద్యోగులుగా, అధికారులు గా పనిచేసిన ఎంతోమంది శుక్రవారం గన్‌ఫౌండ్రీ లోని ప్రధాన కార్యాలయం వద్ద తమ అనుభవాలను, బ్యాంకుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. ఇక నుంచి ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’ ఉండబోదనే కఠోర వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ విలీనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ‘కన్నతల్లి నుంచి దూరం చేసినట్లుగా ఉంది’అంటూ పలువురు ‘సాక్షి’తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల సేవలో.. ఎస్బీహెచ్ కార్యకలాపాలన్నీ సామాన్య, మధ్యతరగతి వర్గాలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును రైతులు, చిరు వ్యాపారులు, మధ్యతరహా వ్యాపార వర్గాలకు రుణాల రూపంలో అందజేయడం ద్వారా వారి అభ్యున్నతికి బ్యాంకు సేవలు దోహదం చేశాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నిజాం హయాంలోని తెలంగాణ, కర్ణాటక, గుల్బర్గా, మరఠ్వాడాలో ఎస్బీహెచ్ సేవలు విస్తరించాయి. ఉద్యోగుల భద్రతపై స్పష్టత లేదు.. ఉద్యోగుల భద్రతపై ఎలాంటి స్పష్టతా లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పైనా స్పష్టత ఇవ్వలేదు. పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్ విషయాల్లో ప్రస్తుతం ఎస్బీహెచ్పాలసీ వర్తించకపోతే ఉద్యోగులు చాలా నష్టపోతారు. విలీనం బాధగానే ఉంది. – శైలేంద్ర లిమాయె, బ్యాంకు ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు ఇది ప్రజల బ్యాంకు.. ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజల బ్యాంకుగా గుర్తింపు పొందింది. సేవలందజేసింది. చిన్న మొత్తాలు రుణాలు అందజేశాం. దానివల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరింది. భవిష్యత్తులో అలా ఉండకపోవచ్చేమో.. – టీవీ జయలక్ష్మి, బ్యాంకు ఉద్యోగి కన్నతల్లి నుంచి విడిపోతున్నట్లుంది 30 ఏళ్లుగా బ్యాంకులో పని చేస్తున్నా. ఇక ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండబోదంటే జీర్ణించుకోలేక పోతున్నాను. కన్నతల్లి నుంచి దూరం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక మా ఉనికిని కోల్పోయినట్లే కదా అనిపిస్తోంది. – కేకేవీ ప్రసాద్, ఉద్యోగ సంఘం నాయకుడు -
ఏటీఎం సెంటర్లో ఏ‘మార్చి’ టోకరా
తగరపువలస (భీమిలి) : పనిచేయని ఏటీఎం కార్డును బాధితుని చేతిలో పెట్టి అసలైన కార్డు ద్వారా రూ.65వేలు కాజేసిన సంఘటన సోమవారం తగరపువలసలో జరిగింది. మహరాజుపేటకు చెందిన మద్దిల అప్పలరాజు తగరపువలస ఎస్‌బీహెచ్‌ను ఆనుకుని ఉన్న ఏటీఎం సెంటర్లో కార్డు ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయడానికి వచ్చాడు. ఎంత సేపటికి ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో క్యూలో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని కోరారు. దీంతో బాధితుని వెనక ఉన్న అగంతకుడు ఆ కార్డును తీసుకుని దాని ద్వారా రూ.15వేలు విత్‌డ్రా చేసి అప్పలరాజుకు ఇచ్చాడు. తరువాత మరో ప్రయత్నం చేయగా ఏటీఎం పనిచేయలేదని చెప్పి బాధితునికి కార్డు ఇవ్వగా.. ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో ఉండగా మరో రూ.65వేలు తన ఖాతా నుంచి విత్‌డ్రా అయినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో తన వద్ద ఉన్న కార్డు చూసుకోవడంతో ఏటీఎం సెంటర్ వద్ద అగంతకుడు తన కార్డును మార్చి ఇచ్చినట్టు గ్రహించాడు. వెంటనే బాధితుడు భీమిలి పోలీసులు, బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అప్పలరాజు వెళ్లాడు. -
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 20 ఈ–శాఖలు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తాజాగా 20 ఈ–శాఖలను ప్రారంభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఎండీ మణి పాల్వేశన్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 4,885 స్వయం సహాయక బృందాలకు రూ. 160.34 కోట్ల రుణ వితరణకు సంబంధించిన చెక్కును గ్రూప్‌ల సమన్వయకర్తలకు అందజేశారు. ప్రస్తుతం తెలంగాణలోని 18 జిల్లాల్లో 388 శాఖలు ఉన్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ్ తెలిపారు. డిపాజిట్లు రూ. 6,818 కోట్లు కాగా అడ్వాన్స్‌లు రూ. 4,755 కోట్లు, మొత్తం వ్యాపార పరిమాణం రూ. 11,573 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 12 శాఖలు ప్రారంభించనున్నామని, దీంతో మార్చి ఆఖరు నాటికి మొత్తం బ్రాంచీల సంఖ్య 400కి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
మీరు చౌదరీ.. నేను చౌదరీ అంటూ బురిడీ!
కాచిగూడ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాచిగూడ బ్రాంచి మేనేజర్‌ను ఓ వ్యక్తి తన వాక్చాతుర్యంతో మాయమాటలు చెప్పి అతని వద్దనుంచి డబ్బులు తీసుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఎస్బీహెచ్ కాచిగూడ మేనేజర్‌గా పనిచేస్తున్న దాసరి అమృతయ్య చౌదరి వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి తన పేరు యలమంచలి మహేష్ చౌదరి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. మీరు చౌదరీ.. నేను చౌదరీ ఇద్దరం ఒకే వర్గానికి చెందిన వారమని మాయమాటలు చెప్పి మేనేజర్‌తో స్నేహంగా నటించాడు. తాను హుడా ఆఫీసులో పనిచేస్తున్నానని చెప్పి తనకు వివిధ ప్రాంతాల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాడు. గచ్చిబౌలిలో బ్యాంకు వేలం పాటలో తక్కువ ధరకే ఓ ప్లాట్ వస్తుందని, ప్రస్తుతం రూ.86వేలు చాలన్ కడితే సరిపోతుందని నమ్మబలికి బ్యాంకు మేనేజర్ వద్ద రూ.86వేలు తీసుకుని వెళ్లాడు. ప్లాట్‌కు సంబంధించిన పేపర్లను చూపించి నమ్మించాడు. పేపర్లను టెబుల్పైన పెట్టి వెళ్లండని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. బ్యాంకుకు వచ్చిన వ్యక్తి ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టకుండానే డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి వరకు బిజీగా ఉన్న బ్యాంకు మేనేజర్ తన టేబుల్‌పైన ప్లాట్‌కు సంబందించిన డాక్యుమెంట్స్ కోసం చూడగా అక్కడ ఏమి లేవు. దీంతో మోసపోయానని గ్రహించిన మేనేజర్ దాసరి అమృతయ్య చౌదరి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అడ్మిన్ ఎస్ఐ యు.శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దేశాన్ని చులకన చేస్తే సహించలేను
వాయుసేన వైస్ చీఫ్ ఎస్.బి.దియో సాక్షి, హైదరాబాద్: భారతదేశాన్ని ఎవరైనా చులకన చేస్తే సహించలేని తత్వం తనదని వాయుసేన ఉప అధిపతి ఎయిర్ మార్షల్ ఎస్బీ దియో పేర్కొన్నారు. గతంలో రక్షణ రంగంలోని కొన్ని పద్ధతుల వల్ల సమస్యలు ఎదురైనా ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయిందని, దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులకు ప్రథమ ప్రాధా న్యం లభిస్తోందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఏరోనాటికల్ సొసై టీ ఆఫ్ ఇండియా సమావే శంలో ఆయన పాల్గొన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేందుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తన వంతు ప్రయత్నాలు చేస్తోందని సొసైటీ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు, రక్షణ మంత్రి సలహాదారు డాక్టర్ సతీశ్‌రెడ్డి తెలిపారు. -
మొత్తం నాణేలే..!
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండలం కనుకుల ఎస్బీ హెచ్ లో శనివా రం కరెన్సీ కొరతతో పూర్తిగా రూ.10 నాణేలనే పంపిణీ చేశారు. బ్యాంకులో నోట్లు కాకుండా రూ.33 లక్షల విలువైన రూ.10 నాణేలే వచ్చా యి. దాదాపు రూ.2.50 లక్షలను నాణేలుగానే ఇవ్వడంతో ఖాతాదారులు బ్యాంకు ముందు కూర్చొని ఇలా లెక్కించుకుంటున్నారు. పోలీసులు నాణేల పంపిణీని నిలిపివేయించడంతో సిబ్బందితో వాగ్వాదం సద్దుమణిగినిగింది.. -
ఎస్బీహెచ్ ఎదుట ఖాతాదారుల ఆందోళన
మోత్కూరు : నల్గొండ జిల్లా మోత్కూరు మండలంలోని ఎస్బీహెచ్ ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఒక్కో ఖతాదారుడికి బుధవారం బ్యాంకు సిబ్బంది రూ. 4 వేలు ఇస్తున్నారు. తమకు రూ.10 వేలు ఇవ్వాలని ఖతాదారులు డిమాండ్ చేశారు. దీంతో ఖాతాదారులు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. -
రూ.20వేలు..అన్నీ రూ.10 నాణేలే
జడ్చర్ల టౌన్: డబ్బుల కష్టాలు అన్నీఇన్నీ కావు. గురువారం డబ్బుల కోసం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి ఎస్‌బీహెచ్‌కు వెళ్లిన సంతోశ్ అనే ఖాతాదారుడికి దిమ్మ తిరిగేలా రూ.10 నాణేలతో కూడిన రూ.20వేల సంచిని అందించారు బ్యాంకు అధికారులు. గురువారం బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులకు నగదు ఇస్తున్నామని చెప్పారు. దీంతో ఖాతాదారులు పెద్ద క్యూ కట్టారు. దాదాపు 100 మందికిపైగా రూ.20 వేలు విలువ చేసే నాణేలను తీసుకెళ్లారు. కొందరికీ రూ.2 వేల నోట్లు వస్తే వాటిని మార్చుకుని చిల్లర తీసుకునేందుకు ఇబ్బంది రాగా, మరికొందరికి చిల్లర ఉండి నోట్లుగా మార్చుకునేందుకు ఇబ్బంది వచ్చింది. -
ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా
- విజయ డెయిరీ ఖాతా నుంచి తీసిన వైనం... - పెద్దనోట్లు రద్దు చేసిన రెండు రోజులకే వ్యవహారం - కొత్త రూ.2 వేల నోట్లు, వందనోట్లు ఇచ్చిన ఎస్బీహెచ్ - నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు అందజేసిన వైనం - బ్యాంకు అధికారుల తీరుపై పలు అనుమానాలు సాక్షి, మెదక్: పెద్దనోట్ల రద్దుతో దేశం అంతా ఇబ్బందులు పడుతోంది. ఒక్కోవ్యక్తికి రూ.4 వేలు మార్చుకోవాలని, రూ.10 వేలకు మించి నగదు డ్రా చేయవద్దని కేంద్రం నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు మెదక్ పట్టణంలోని ఎస్‌బీహెచ్‌కు ఏమాత్రం పట్టలేదు. పెద్దనోట్లు రద్దు చేసి రెండురోజులు కూడా కాలేదు. బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలు, అధికారులు, సిబ్బంది బిజీబిజీ. అపుడు మెదక్ ఎస్బీహెచ్ అధికారులు విజయ డెయిరీ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో రూ.1.20 కోట్ల డబ్బు డ్రా చేసుకునేందుకు అనుమతించిన విషయం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు తోసిరాజని రూ.1.20 కోట్లు అందజేత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయ డెయిరీ పాడిరైతుల నుంచి సేకరించిన పాలకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయ డెయిరీ పాడి రైతులకు డబ్బుల చెల్లింపులు చేయలేదు. దీనికితోడు నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించవద్దని నిబంధనలను విధించారు. ప్రభుత్వ నిబంధనలను తోసిరాజని మెదక్ ఎస్బీహెచ్ అధికారులు 11వ తేదీన విజయ డెయిరీ ఖాతా (ఎండీటీఎస్డీడీసీఎఫ్ లిమిటెడ్- 0000006221219 2509) నుంచి ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రాకు అనుతించారు. సుమారు 13 సొసైటీ చెక్కులతో ఒకేరోజు ఇంతమొత్తం డ్రా చేసినట్లు తెలుస్తోంది. రూ.1.20 కోట్లలో అధికమొత్తం కొత్త రూ.2 వేల నోట్లు ఇచ్చినట్లు సమాచారం. 11వ తేదీన మెదక్ ఎస్బీహెచ్ బ్యాంకులో ఖాతాదారులు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నోట్ల మార్పిడి కోసం గొడవలు పడుతున్నారు. అలాంటి సమయంలో సైతం ఎస్బీహెచ్ అధికారులు ఒకేరోజు రూ.1.20 కోట్ల నగదు విజయ డెయిరీ సొసైటీకి ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. పొరుగునే ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకు అధికారులు విజయ సొసైటీ సభ్యులకు అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతించలేదు. అయితే మెదక్ ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ మాత్రం ఒకేరోజు రూ.1.20 కోట్ల డబ్బులు డ్రా చేసేందుకు అనుమతించటంతోపాటు రూ.2 వేల నోట్లు పెద్దమొత్తంలో ఇవ్వటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. ఇదిలా ఉంటే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిన సొసైటీ సభ్యులు పాడి రైతులకు పూర్తిస్థాయలో డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. బ్యాంకు అధికారులు, విజయసొసైటీ సభ్యులు కుమ్మక్కై నల్లధనం తెలుపుగా మార్చారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్బీహెచ్ బ్యాంకు అధికారులు ఒకేరోజు రూ.1.20 కోట్లు నగదు ఇవ్వటంపై ఆ బ్యాంకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. డబ్బులు డ్రా చేశాం మెదక్ ఎస్బీహెచ్ విజయ డెయిరీ ఖాతా నుంచి 11వతేదీన రూ.1.20 కోట్లు డబ్బులు డ్రా చేశాం. జారుుంట్ అకౌంట్ ఖాతా ఉన్నందున చెక్కులపై నా సంతకం, సొసైటీ చైర్మన్ల సంతకాలు చేసి ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా చేశాం.కొత్త రూ.2వేల నోట్లు ఇచ్చారు.13 సొసైటీల్లోని పాడి రైతులకు ఇవ్వాల్సిన బకారుులు చెల్లించాం. - రంజిత్, విజయ డెయిరీ మేనేజర్ డ్రా చేయడం నిజమే విజయ డెయిరీ ఖాతా నుంచి 11 వతేదీన రూ.1.20 కోట్లు డ్రాకు అనుమతించింది నిజమే నని మెదక్ ఎస్బీహెచ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. డబ్బులు డ్రా చేసిన విజయ డెయిరీ సొసైటీ వారికి కొత్త రూ.2వేలనోట్లతోపాటు వందనోట్లు ఇచ్చాం. ప్రభుత్వం ఖాతాల నుంచి డబ్బులు డ్రాకు అనుమతించవద్దన్న నిబంధన మరుసటి రోజు తెలిసింది. అరుుతే ఒకేరోజు రూ.1.20కోట్లు ఒకే ట్రాన్జాక్షన్‌లో ఎలా అనుమతిస్తారన్న దానిపై ఆయన సమాధానం ఇవ్వలేదు. - శ్రీనివాస్‌రావు, ఎస్బీహెచ్ మేనేజర్ -
ఎస్బీహెచ్ ఎదుట భారీ ధర్నా
తిరుపతి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ముద్రించిన రూ. 2 వేల రూపాయల నోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. పెద్ద నోట్లతో తిప్పలు పడుతున్న ప్రజలకు వందనోట్లు అందించాలని.. ఏటీఎంలు 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తిరుపతిలోని ఎస్బీహెచ్ ఎదుట బుధవారం ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. -
ఎస్‌బీహెచ్‌కు రూ.776 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రూ.776.64 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో సంస్థ రూ.375 కోట్ల నికర లాభం ఆర్జించింది. నిర్వహణ లాభం 36 శాతంపైగా వృద్ధిచెంది రూ.1,101 కోట్లుగా ఉందని ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ తెలిపారు. వసూలు కాని మొండి బకాయిలకు చేసిన కేటాయింపులు రూ.2,258 కోట్లు ఉం డడం వల్లే నష్టం వాటిల్లినట్టు చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 1.38 శాతం తగ్గి రూ.1,111 కోట్లు నమోదు చేసింది. బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.2,53,411 కోట్లు ఉంది. మొత్తం అడ్వాన్సులు 6.6 శాతం అధికమై రూ.1,12,249 కోట్లకు చేరాయి. మొత్తం డిపాజిట్లు 7.20 శాతం పెరిగి రూ.1,40,489 కోట్లుగా నమోదయ్యాయి. రుణ రేటు తగ్గింపు.. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేటును 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తున్నట్లు ఎస్బీహెచ్ ప్రకటించింది. నవంబర్ ఒకటవ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో ఏడాది కాలానికి రేటు 9.55 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గింది. హౌసింగ్ రుణ రేటు వార్షికంగా 9.45 శాతానికి తగ్గుతుంది. -
ఎస్బీహెచ్ ఏటీఎం ధ్వంసం
నాయుడుపేట టౌన్ : నెల్లూరు జిల్లా నాయుడుపేట టౌన్‌లోని ఎస్బీహెచ్ ఏటీఎంను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏటీఎం గదిలోని సీసీ కెమెరా వైర్లను కూడా కత్తిరించిన దుండగులు ఏటీఎం ధ్వంసం చేసి క్యాష్ లాకర్‌ను తెరిచేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమైనట్లుగా తెలుస్తోంది. స్థానికులు ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక సీఐ రత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. -
ఎస్బీహెచ్లో రూ. 2.65 కోట్లు మాయం
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్ బీహెచ్) బ్యాంకులో రూ.2.65 కోట్లు మాయమయ్యాయి. కాగా బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగే డబ్బును దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడు. బ్యాంకు మేనజర్ సత్యానందం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు పరిధిలో ట్రెజరీ ద్వారా నిర్వహించే నిధులు, లావాదేవీలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఆర్ధిక కార్యకలాపాలన్నీ ప్రత్తిపాడు ఎస్ బీహెచ్ ద్వారానే జరుగుతాయి. అయితే ఈ లావాదేవీల్లో పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లినట్లు ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకూ నిర్వహించిన లెక్కల్లో తేలిందని చెప్పారు. దీంతో ట్రెజరీ, ఇతరత్రా బ్యాంకు కార్యకలాపాల్లో చురుకుగా ఉండే బ్యాంకు సబ్ స్టాఫర్ ఎడ్ల ఉషా సత్య సూర్య వెంకట రాకేష్ అలియాస్ చిన్నాపై అనుమానం వచ్చినట్లు తెలిపారు. అతని అకౌంట్ లావాదేవీలను పరిశీలించి చూడగా రూ.2.65కోట్లను బినామీల ఖాతాలకు దారి మళ్లించినట్లు తేలిందని చెప్పారు. అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో 29 బినామీ ఖాతాలు తెరిచినట్లు పేర్కొన్నారు. వాటిలోకి డబ్బును జమ చేసినట్లు చెప్పారు. ఒక్కో ఖాతాకు లక్ష రూపాయలకు పైనే జమ చేసినట్లు తెలిపారు. కాగా దారి మళ్లించిన సొమ్మును వెనక్కు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ రూ.1.38కోట్ల నిధులు వెనక్కురాబట్టుకున్నట్లు పేర్కొన్నారు. ట్రెజరీస్ డీడీ విచారణ నిధుల గోల్మాల్ వ్యవహారంలో ట్రెజరీ ఉద్యోగుల పాత్రపై ట్రెజరీ జిల్లా స్ధాయి అధికారి డీడీ భోగారావు శుక్రవారం విచారణ జరిపారు. స్థానిక సబ్ ట్రెజరీలోని ఖాతాలను, సబ్ ట్రెజరీ ద్వారా బ్యాంక్‌లో జరిగిన లావాదేవీలను లోతుగా పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్‌ను కలిసి ఖాతాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. సబ్ ట్రెజరీ నిధుల్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదని చెప్పారు. సబ్ ట్రెజరీ నిధులు, వోచర్లు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆయన వెంట సబ్ ట్రెజరీ అధికారులు జగదీశ్వరి, సోమయాజులు, జహిరుద్దీన్ తదితరులున్నారు. -
ఎస్బీహెచ్లో రూ.కోట్ల మాయం?
ప్రత్తిపాడు : ప్రత్తిపాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో కోట్ల రూపాయల్లో వ్యత్యాసం జరిగినట్టు తెలుస్తోంది. బ్యాంకు వ్యవహారాలన్నీ చక్కబెట్టే ప్యూన్ చేతి వాటం ప్రదర్శించి, సొమ్ము కాజేసినట్టు సమాచారం. గత నెలలో జరిగిన బ్యాంక్ ఆడిట్ ద్వారా సుమారు రూ. 2 కోట్లు తేడా జరిగినట్టు గమనించిన బ్యాంకు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సమాయత్తమవుతున్నారు. స్థానిక ట్రెజరీ ద్వారా వివిధ శాఖలను చెందిన సొమ్మును వేర్వేరు ఖాతాలకు ఈ బ్యాంకు ద్వారానే జమ అవుతాయి. నిధులు కాజేసేందుకు లేని ఖాతాలను ఫ్యూన్ సృష్టించినట్టు సిబ్బంది భావిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ కొప్పిశెట్టి సత్యానందం గురువారం రాత్రి ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణను కలిసి పరిస్థితిని ప్రాథమికంగా వివరించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తామని బ్యాంక్ మేనేజర్ తెలిపినట్టు స్థానిక ఎస్సై ఎం.నాగదుర్గారావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఎస్బీహెచ్లో మరో ఇద్దరు జీఎంలకు బాధ్యతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) కొత్తగా జనరల్ మేనేజర్లుగా నియమితులైన ఎం.ఎ. సమద్, రవీందర్ కుమార్ అగ్నిహోత్రి బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంలో రికవరీ అండ్ ప్లానింగ్ విభాగం జీఎంగా సమద్, విజయవాడ శాఖలో జీఎంగా (ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్) అగ్నిహోత్రి బాధ్యతలు చేపట్టారు. 1977లో ఎస్బీహెచ్లో చేరిన సమద్.. బ్రాంచ్ మేనేజర్, డిప్యుటీ జీఎం, జీఎం తదితర హోదాల్లో పనిచేశారు. మరోవైపు, అగ్నిహోత్రి.. 1986లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. ఆ తర్వాత బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్ తదితర హోదాల్లో పనిచేశారు. -
సీకేఎం ఆస్పత్రికి ఎస్బీహెచ్ రూ.3.35లక్షల వితరణ
ఎంజీఎం : వరంగల్ సీకేఎం ఆస్పత్రికి గురువారం ఎస్బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శంతన్ముఖర్జీ రూ.3లక్షల 3500 చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సీకేఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్బీహెచ్ అందించిన సాయంతో ఆస్పత్రికి కావాల్సిన సర్జికల్ ఆటోక్లేవ్ పరికరాన్ని కొనుగోలు చేసి గర్భిణులకు మెరుగైనా సేవలందిస్తామన్నారు. ఎస్బీహెచ్ జనరల్ మేనేజర్లు హరిహరరావు, మణికందన్, డీజీఎంలు నారాయణ, బహార, బర్దన్ పాల్గొన్నారు. -
మిస్టరీగా మారిన నగల గల్లంతు
వరంగల్ : హన్మకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నక్కలగుట్ట బ్రాంచి లాకర్లోని బంగారు ఆభరణాలలు మాయమైన ఘటన మిస్టరీగా మారింది. భీమారం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఆంజనేయులుకు బ్యాంక్‌లో లాకర్ ఉంది. ఈ లాకర్లో పెట్టిన ఆభరణాలు మాయమైనట్లు ఆయన సుబేదారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు స్పందించి బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు బుధవారం మళ్లీ విచారణ చేపట్టారు. ఈలోగా బాధితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. లాకర్లో పెట్టిన నగలు సుమారు రూ.15లక్షల విలువ చేస్తాయని బాధితుడు చెప్పడంతో బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు లాకర్లో పెట్టిన నగల పూర్తి బాధ్యత వినియోగదారుడికే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే తాను నగలు బ్యాంకు లాకర్లో పెట్టినా, అందులో లేవని బాధితుడు వాపోతుండడం గమనార్హం. -
ఫోన్ కాల్‌తో రూ. 25 వేలు మాయం
బ్యాంకు అధికారినంటూ మోసం దుబ్బాక: ఒక్క ఫోన్ కాల్‌తో రూ. 25 వేలు మాయమైన సంఘటన మండలంలోని రఘోత్తంపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్ల నర్సవ్వ–ఆంజనేయులు దంపతుల కుమారుడు మురళికి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో 7546922653 మొబైల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం లాకవుతోంది. మీ ఏటీఎం పిన్, బార్ కోడ్, ఆధార్ నెంబర్ చెబితే లాకవుతోన్న ఏటీఎంను సరి చేస్తామని చెప్పడంతో ఆ యువకుడు నమ్మాడు. బ్యాంకు అధికారి అడిగిన నంబర్లు చకచకా చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన యువకుడు గురువారం తన ఎస్బీహెచ్ దుబ్బాక శాఖలోని ఎస్బీ అకౌంట్లో డబ్బులను సరిచూసుకోగా అందులో నుంచి రూ. 25 వేలు డ్రా చేసినట్లు ఉంది. డ్రా చేసిన డబ్బులు కూడా ఏటీఎం ద్వారా ఒకే రోజు ఆరు సార్లు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో కంగుతిన్న యువకుడు లబోదిబోమంటూ బ్యాంకు అధికారుల ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు. -
బ్యాంకు లాకర్ తెరిచిచూసిన మహిళకు షాక్
15 తులాల బంగారు అభరణాలు మాయం హైదరాబాద్: భద్రతకు మారుపేరు బ్యాంకు లాకర్ అంటారు. ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకెళుతారన్న భయంతో చాలామంది బ్యాంకు లాకర్లలో బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, పత్రాలను దాచిపెడుతుంటారు. ఇదేవిధంగా ఎస్బీహెచ్ బ్యాంకు లాకర్ లో 15 తులాల బంగారు అభరణాలను పెట్టిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. లాకర్ ఉంచిన బంగారం మాయమైంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన అస్నా ఫర్ఖుందా తాజ్ అనే మహిళ అబిడ్స్ గన్ ఫౌండ్రీలోని ఎస్బీహెచ్ లాకర్లో కొన్ని రోజుల క్రితం 15 తులాల బంగారు ఆభరణాలను ఉంచింది. మంగళవారం ఆమె లాకర్ తెరిచి చూడగా.. అందులో ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె అబిడ్స్ పోలసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకుల విలీనం ప్రమాదకరం!
సందర్భం ఇవాళ విలీనం సమస్య ఎస్‌బీహెచ్‌కు ఎదురవ్వొచ్చు. రేపు అది ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులకు కూడా జరిగే ప్రమాదముంది. ఒక పెద్ద బ్యాంకు నష్టపోయిం దంటే కోట్లాది కస్టమర్లు ఉన్నఫళాన కుప్పకూలిపోతారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) తోపాటు మరో నాలుగు ఇతర అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో విలీనం చెయ్యాలనే ప్రతిపాదన గత కొన్ని సంవత్సరాలుగా చర్చనీయాం శంగా ఉంటోంది. అయితే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగులు దాన్ని వాయిదా పడేలా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఉన్నట్లుండి మే 17న ముంబైలో అయిదు బ్యాంకుల బోర్డు సమావేశా లకు పిలుపునివ్వడమే కాకుండా ఎస్బీఐలో విలీనం కావడా నికి ఒక ‘అభ్యర్థన’ను వాటిచేత ఆమోదింపజేసింది. కంపెనీ తరఫున బోర్డు డెరైక్టర్లు దీన్ని వ్యతిరేకించగా, ప్రభుత్వం నామినేట్ చేసిన బోర్డ్ డెరైక్టర్లు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని తమ బాస్ ఆదేశానుసారం ఆ అభ్యర్థనను ఆమోదించారు. బ్యాంకు విలీనాల్లో కొత్త అంశమేదీ లేదు. అయితే సాధారణంగా వ్యాపారాన్ని సరిగా నిర్వహించని లేదా దివాలా తీసిన బ్యాంకులను కాపాడటానికి ఆర్థిక పటిష్టత ఉన్న బ్యాంకులోకి విలీనం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. దాదాపు 2 వేల బ్రాంచీ లను కలిగి ఉన్న ఎస్బీహెచ్ ప్రతి సంవత్సరం రూ. 2,50,000 కోట్ల బిజినెస్ చేస్తోంది, ఈ సంవత్సరం బ్యాంకు రూ. 1,065 కోట్ల లాభాన్ని ఆర్జించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్- కొచ్చిన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ - బికనూర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాదీ ఇదే పరిస్థితే. ఈ బ్యాంకులన్నీ లాభాల్తో ఉన్నాయి. పైగా రైతులకు, స్వయంఉపాధి కలవారికి, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ఇవి ముందస్తు రుణాలు కల్పించడం ద్వారా సామాజిక బాధ్య తను కూడా నెరవేరుస్తున్నాయి. బడా కార్పొరేట్ కంపెనీలకు ఒకటి నుంచి పది లక్షల కోట్ల రుణాలను అందించగలిగే ప్రపంచ బ్యాంకు స్థాయి బ్యాంకులను భారత్ కలిగి ఉండాలన్నది కొందరు ఆర్థిక సలహాదారులు, వాణిజ్య సంస్థల భావన. అందుకే ఇదొక ఆర్థిక భావనకూడా అయింది. ప్రపంచంలోని పదిమంది అగ్రశ్రేణి సంపన్నులలో నలుగురు భారత్‌కి చెందినవారు ఉన్నట్లయితే ఆ స్థాయిని చూసి సంతోషపడేవారు కూడా ఉన్నారు. మీరు నిండు దారిద్య్రంతో ఉన్నా సరే సంపదను చూసి గర్విస్తుంటారంతే. జాతీయ సంపద పెరుగుతు న్నట్లయితే ఏ బ్యాంకు అయినా సరే పెద్ద బ్యాంకుగా మారుతుంది. పెద్ద చేప చిన్న చేపను మింగేలా ఇతర చిన్న చిన్న బ్యాంకులను మింగడం ద్వారా కాకుండా ఎస్బీఐ తన సొంత వ్యాపారం ద్వారానే పెద్ద బ్యాంకు కావాలి. విషాద మేమిటంటే, అన్ని అనుబంధ బ్యాంకులను విలీనం చేసు కున్నప్పటికీ మన ఎస్బీఐ ప్రపంచంలోని 100 అగ్రశ్రేణి బ్యాంకుల్లో కూడా ఒకటి కాలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇతర అనుబంధ బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు. వీటిని మునుపటి నవాబులు, సంస్థానాధిపతులు స్థాపించారు. ఇవి ప్రాం తీయ బ్యాంకులుగా ఆవిర్భవించాయి. నిజాం నవాబు 19 41లో నిజాం స్టేట్ రైల్వేస్, రోడ్‌వేస్, అజాంజాహి మిల్స్ వంటి కొన్ని పరిశ్రమలు, ఉస్మానియా యూనివర్సిటీ వగైరా లతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను కూడా స్థాపిం చారు. మొదట హైదరాబాద్ స్టేట్ బ్యాంకుగా, తర్వాత తెలంగాణ గర్వించే ఆర్థిక చిహ్నంగా ఎస్బీహెచ్ విజయ వంతమైన బ్యాంకుగా అద్వితీయ వృద్ధితో పెరుగుతూ వచ్చింది. ఉద్యోగులు చెమట కష్టంతో, కస్టమర్ల సహకా రంతో ఇది బడా ఆర్థిక సంస్థగా మారింది. చార్మినార్లాగే ఎస్బీహెచ్ తెలంగాణా చిహ్నంగా ఉంది. ప్రాంతీయ సొబ గులతో హైదరాబాద్ వారసత్వాన్ని గర్వింపజేసే ప్రతీకగా ఉంటోంది. అలాంటి ఎస్‌బీహెచ్‌ను ఎస్బీఐలో విలీనం చేస్తే మూడు పెద్ద సమస్యలు ఎదురవుతాయి. 1. మునుపటి ఏపీలో ఆంధ్రా బ్యాంకు లాగే, తెలంగాణలో ఎస్బీహెచ్ ప్రధానమైన బ్యాంకు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సీజన్లలో రైతులకు రుణ సౌక ర్యాలను కల్పించాలని ప్రతిపాదించింది. ప్రధాన బ్యాం కులు వీటిని అనుసరిస్తాయి కూడా. స్థానిక వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందిన వారికి కూడా ఎస్బీహెచ్ ప్రాధాన్యమిస్తుంటుంది, కానీ విలీనం తర్వాత ఇది పూర్తిగా కనుమరుగై పోతుంది. తెలంగాణ ప్రజల అవసరాలను నెరవేర్చవలసిన బాధ్యత ఎస్బీఐకి లేదు. ప్రజలు, పాల కులు తమ సొంత బ్యాంకు ఉండాలని కోరుకుని దాన్ని స్థాపించారు. అలాంటి బ్యాం కును మింగేయడానికి అసలు మీరెవ్వరు? 2. ప్రాంతీయ బ్యాంకులు తమ లాభాల్లోని కొంత శాతం వాటాను వాటిని స్థాపించిన రాష్ట్రాలకు అందిస్తుంటాయి. ఎస్బీఐ రిజిస్టర్డ్ ఆఫీసు ముంబైలో ఉంది కాబట్టి ఎస్బీ హెచ్ విలీనం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన వాటాను కోల్పోనుంది. తెలంగాణకు రావ లసిన వాటా ఇక నుంచి మహారాష్ట్రకు వెళ్లనుంది. 3. విలీనం తర్వాత ఎస్బీహెచ్ ఉద్యోగులకు కూడా కొన్ని సర్వీస్ ప్రయోజనాలు లభించవు. పీఎఫ్, ఎస్బిఐ పెన్షన్ స్కీమ్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఎస్బీహెచ్ ఉద్యోగులకు వర్తించవు. వారు ఇకనుంచి ఎస్బీఐలో రెండో తరగతి ఉద్యోగులుగా ఉండాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్లే ఏ పరిస్థితుల్లోనూ ఎస్‌బీహెచ్‌ను ఎస్బీఐలో విలీనం చేయడాన్ని మనం వ్యతిరేకించాలి. ఇది ఉద్యోగులు, అధికారుల సమస్య కాదు. ఇది ప్రమాదంలో పడిన తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన సమస్య. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్య. ఇవాళ విలీనం సమస్య ఎస్‌బీహెచ్‌కు ఎదురవ్వొచ్చు. రేపు అది ఆంధ్రాబ్యాంకు, తదితర బ్యాంకులకు కూడా జరిగే ప్రమాదముంది. దేశంలోని అన్ని బ్యాంకులను 5 పెద్ద బ్యాంకులుగా మార్చాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒక పెద్ద బ్యాంకు నష్టపోయిం దంటే కోట్లాది కస్టమర్లు కుప్పగూలిపోతారు. రాష్ట్రం మరిన్ని జిల్లాలుగా, మండలాలుగా కానున్న సందర్భంలో ఇప్పుడు జరగాల్సింది బ్యాంకుల కేంద్రీకరణ కాదు, మరింత వికేంద్రీ కరణ కావాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తోపాటు మరో నాలుగు ఇతర అనుబంధ బ్యాంకులకు చెందిన 50 వేలమంది ఉద్యోగులు బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా మే 20న సమ్మె చేశారు. జూలై 28, 29 తేదీల్లో మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు, వ్యాపారస్తులకు, ఎస్బీహెచ్ కస్టమర్లకు, తెలంగాణ ప్రజ లకు కూడా మేము విన్నవిస్తున్నదొక్కటే-ఎస్బీహెచ్ ఉద్యో గుల పక్షాన నిలిచి, ఎస్బీహెచ్ని అన్యాయంగా విలీనం చేయడానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఈ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చండి. సురవరం సుధాకరరెడ్డి వ్యాసకర్త గౌరవాధ్యక్షులు ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య మొబైల్ : 94400 66066 -
ఎస్బీహెచ్ విలీనాన్ని నిలిపేయాలి: సీపీఎం
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) విలీన ప్రక్రియను నిలిపివేయాలని సీపీఎం.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఏడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రజల బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన ఎస్‌బీహెచ్‌ను విలీనం చేయకుండా కాపాడుకోవడం అత్యంత అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అనుబంధ బ్యాంకులను విలీనం చేసే కీలక నిర్ణయానికి ముందు బ్యాంకు లాభ-నష్టాలు, రుణాల వసూళ్లు, బలహీనతలు, ప్రజాభిప్రాయం తదితర అంశాలపై లోతుగా చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఎలాంటి ముందస్తు నోటీసు, ఎజెండా లేకుండా ఒకే రోజు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అనేక శాఖలు మూతపడి లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. -
బ్యాంకు అధికారుల తీరుపై వ్యాపారి నిరసన
తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తానన్నా వినకుండా అధికారులు ఆస్తి జప్తునకు యత్నిస్తున్నారంటూ ఓ వ్యక్తి అర్థనగ్నంగా నిరసన తెలిపాడు. గన్‌ఫౌండ్రిలో ఎస్బీహెచ్ శాఖలో ప్రకాశ్‌నాయుడు అనే వ్యాపారి రుణం తీసుకున్నారు. రుణం చెల్లింపు ఆలస్యం కావటంతో బ్యాంకు అధికారులు అతని ఆస్తుల జప్తునకు పూనుకున్నారు. దీంతో ప్రకాశ్‌నాయుడు గురువారం మధ్యాహ్నం బ్యాంకు వద్దకు చేరుకుని షర్టు విప్పి నిరసన తెలిపారు. కాస్త గడువిస్తే రుణం చెల్లిస్తానన్నా వినకుండా అధికారులు జప్తునకు పూనుకున్నారని ఆరోపించారు. -
ఎస్బీహెచ్ ఏటీఎం చోరీకి విఫలయత్నం
పెబ్బేరు: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలకేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంలో చోరీ చేయడానికి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం మెషిన్‌ను ధ్వంసం చేసి అందులో నగదును ఎత్తుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించారు. నగదు ఉన్న లాకర్ తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఏటీఎంలో నగదు డ్రా చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఏటీఎం మెషిన్ పగలగొట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ రమేశ్, బ్యాంక్ మేనేజర్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ-చలాన్లతో రిజిస్ట్రేషన్ ఇబ్బందులకు చెక్
ఈ-స్టాంప్స్ మాడ్యూల్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, బ్యాంకుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించే పనిలేకుండా ఈ-చలాన్లతో విని యోగదారులు ఎంచక్కా తమ రిజిస్ట్రేషన్లను పూర్తిచేసుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ అన్నారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ నూతనంగా రూపొందించిన ఈ-స్టాంప్స్ (ఈ-స్టాంప్ డ్యూటీ ఇన్ తెలంగాణ తెలంగాణ అసెస్మెంట్, మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ సిస్టమ్)మాడ్యూల్‌ను సోమవారం సచివాల యంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించడం వల్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2014-15లో కన్నా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 24% పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్లైన్ సేవలతో పాటు త్వరలోనే ప్రభుత్వ భూములు, లిటిగేషన్లో ఉన్న భూముల వివరాలనూ ఆన్లైన్లో పెడతామన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు వీలుగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో షిఫ్ట్ పద్ధతిని అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, రెండు వారాల్లోగా అర్హులైన సిబ్బందికి పదోన్నతులు, ఉన్నత స్థాయిలో పూర్తిస్థాయి అధికారులను నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు గంటల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతంలో ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలంటే రెండు మూడు రోజులు పట్టేదని, రిజిస్ట్రేషన్ల శాఖలో పూర్తిస్థాయి కంప్యూటరైజేషన్ ఫలితంగా ఆయా దశలన్నీ రెండు గంటల్లో పూర్తిచేసేందుకు వీలు కానుందని రిజిస్ట్రేషన్ల విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ చెప్పారు. ఆన్లైన్లోనే వినియోగదారుడు స్వయంగా డాక్యుమెంట్‌ను తయారు చేసుకోవడంతో పాటు స్టాంప్ డ్యూటీ అసెస్మెంట్నూ చేసుకోవచ్చన్నారు. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాక, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ-చలాన్ల నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)తో ఎంవోయూ కుదుర్చుకున్నామని, రిజిస్ట్రేషన్ కోరుకునే విని యోగదారుడు ఆన్లైన్(ఇంటర్నెట్ బ్యాంకిం గ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా)తో పాటు ఆఫ్లైన్లోనూ ఏ ఎస్బీహెచ్ శాఖ నుంచైనా స్టాంప్‌డ్యూటీ చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ సీజేఎం విశ్వనాథన్, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి తదితరులు పాల్గొన్నారు. -
దొరికితే దొంగ.. దొరక్కపోతే..
దొరికితే దొంగ.. దొరక్కపోతే పోలీస్.. సారీసారీ దొర.. ఒక గ్రామంలో నిత్యం కోడి పందాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆ వ్యవహారాన్ని ‘మామాళ్లు’గానే పట్టించుకోవడం లేదు. అయితే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు (ఎస్బీ) విషయం తెలిసి దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మన పోలీసులకు దాడులు చేయక తప్పింది కాదు. ఆ దాడుల్లో 10 మందిని అరెస్టు చేసి సుమారు రూ.3 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో అలవాటులో పొరపాటుగా ఏదో అటూఇటూగా రూ.2 లక్షల పైగా సొమ్ము తక్కువ చూపారు. ఈ విషయం డిపార్టమెంట్లో ఆ నోట ఈ నోట.. నాని.. చివరకు ఎస్పీకి చెవికి చేరింది. దీంతో ఆయన సీరియస్ అయ్యి ఎస్బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన మన పోలీసులు తెగులు సోకిన కోడిలా విలవిల్లాడిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వివరాలేంటో చూద్దామా? ఏలూరు (సెంట్రల్) : చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలోని ఒక కోడి పందాల శిబిరంపై ఇటీవల పోలీసులు ఆకస్మిక దాడిలో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో సొమ్మును పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పెషల్ బ్రాంచ్ అధికారులను(ఎస్బీ) విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొద్దికాలంగా వెంకటాపురంలో రోజూ కోడి పందాలు నిరాటంకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పందాలపై అక్కడి పోలీసులు ఎటువంటి దాడులు నిర్వహించకపోవడంతో విషయం ఎస్బీ అధికారులకు తెలిసింది. వెంటనే దాడులు నిర్వహించాలని చింతలపూడి పోలీసులను ఆదేశించారు. ఆ సొమ్ములు కోళ్లు ఎత్తుకుపోయాయా? ఈ క్రమంలో ఈ నెల 23న చింతలపూడి పోలీసులు వెంకటాపురం గ్రామంలో కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.66,750, రెండు కార్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో చూపించారు. అయితే ఈ దాడుల్లో 10 మంది దగ్గర నుంచి రూ.మూడు లక్షలు వరకు స్వాధీనం చేసుకుని రూ. 66,750 మాత్రమే లెక్కల్లో చూపించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు లెక్కల్లో తేడాలు ఉన్నాయని అక్కడి నిఘా వర్గాలు ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన చింతలపూడి పోలీసులు అధికారులపై ఎస్బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. పోలీసులు నిర్వహించిన దాడిలో దొరికిన ఓ కాంట్రాక్టరు దగ్గర నుంచే పోలీసులు రూ.లక్ష వరకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఎస్పీ ఈ విషయంపై సీరియస్‌గా ఉండడంతో సదరు కాంట్రాక్టరుకు తిరిగి డబ్బులు ఇచ్చేందుకు అక్కడే ఓ అధికారి వద్ద పంచాయతీ పెట్టారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై జిల్లా పోలీసు బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి. -
ఎస్బీహెచ్ ‘ప్లాటినమ్’ డిపాజిట్ పథకం
♦ 75 వారాలకు 7.95% వడ్డీ ♦ ఈ ఏడాది ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలు ♦ ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఖాతాదారులకు ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఎస్బీహెచ్ ప్లాటినమ్ డిపాజిట్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ డిపాజిట్ పథకంపై అధిక వడ్డీని అందిస్తున్నట్లు ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ తెలిపారు. 75 వారాల (525 రోజులు) కాలపరిమితి గల ఈ డిపాజిట్‌పై 7.95% వడ్డీని.. అదే సీనియర్ సిటజన్లకయితే 8.45% వడ్డీని అందిస్తున్నట్లు తెలిపారు. ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలను ఈ ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుదీర్ఘకాలంగా బ్యాం కుతో అనుబంధం ఉన్న ఖాతాదారులను, పూర్వ ఉద్యోగులను ఏప్రిల్3న ఘనంగా సన్మానించనున్నామని, అలాగే ఏప్రిల్ 5న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ముఖర్జీ తెలిపారు. 1941లో ప్రారంభమైన ఎస్బీహెచ్ ప్రస్థానం ఇప్పుడు రూ. 2.55 లక్షల కోట్ల వ్యాపారం చేసే స్థాయికి చేరుకుందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది 20 శాతం వృద్ధిరేటును అంచనా వేస్తున్నట్లు తెలిపారు. -
ఎస్‌బీహెచ్‌కు ఉన్నత విద్యామండలి తాఖీదు
- సుప్రీంకోర్టు ఉత్తర్వుల ధిక్కరణ - తెలంగాణ ఉన్నత విద్యామండలికి నిధుల విడుదల హైదరాబాద్ : ఏపీ ఉన్నత విద్యామండలి హైదరాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాంతినగర్ బ్రాంచికి నోటీసులు జారీచేసింది. తమ బ్యాంకు ఖాతాల నుంచి నిధులను తెలంగాణ ఉన్నత విద్యామండలికి విడుదల చేయడంపై ఈ నోటీసులు ఇచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వడంతో పాటు తప్పును సరిదిద్దుకోకపోతే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి లేఖలతో ఎస్బీహెచ్ ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తెలంగాణ ఉన్నత విద్యామండలికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. ఈలోగానే ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలను ఎస్బీహెచ్ అధికారులు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి పేరిట మార్పు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరిస్తూ ఆ ఖాతాలు ఏపీ ఉన్నత విద్యామండలికే చెందుతాయని, రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాలని సూచించింది. ఈ తీర్పుననుసరించి ఏపీ ఉన్నత విద్యామండలి తమ ఖాతాలను ఏపీ కార్యదర్శి పేరిట మార్పు చేయాలని ఆయా ఎస్బీహెచ్తోపాటు అన్ని బ్యాంకులకు లేఖలు రాసింది. ఆ లేఖలతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను జతపరిచింది. ఇలా లేఖలు రాశాక కూడా ఎస్బీహెచ్ శాంతినగర్ బ్రాంచి అధికారులు ఖాతాలను మార్పు చేయకపోవడమే కాకుండా ఆ ఖాతాలోని రూ.15 లక్షలను తెలంగాణ ఉన్నత విద్యామండలికి విడుదల చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్ ద్వారా ఎస్‌బీహెచ్‌కు నోటీసులు జారీచేశామని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి సాక్షికి వివరించారు. -
రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ-చలాన్లు
- ఎస్‌బీహెచ్‌తో ఎంవోయూకు ఏర్పాట్లు - ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో స్టాంప్ డ్యూటీ చెల్లించే సదుపాయం - మార్చి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు అధికారుల సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో మరో వినూత్న ప్రక్రియను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపునకు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత చలానా పద్ధతికి స్వస్తి పలికి, దాని స్థానంలో ఈ-చలాన్ల ప్రక్రియను ప్రవేశపెట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వివిధ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం సొమ్ము చెల్లింపులో వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలను నివారించే దిశగా అధికారులు ఈ-చలానా ప్రక్రియను రూపొందిస్తున్నారు. పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ కావడంతో వినియోగదారులతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇకపై బ్యాంకులు, ట్రెజరీల చుట్టూ తిరిగే పని ఉండదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ అమలు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)తో రిజిస్ట్రేషన్ల శాఖ త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఎస్ఎస్ఎల్ బ్యాంకుల తో ఆన్లైన్ లావాదేవీలను నిర్వహించేందుకు అవసరమైన సెక్యూరిటీ సాకెట్ లేయర్ (ఎస్ఎస్ఎల్) సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ శాఖకు లభించింది. దీంతో ఎస్బీహెచ్ ఇంట ర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా సొమ్ము చెల్లింపు, స్వీకరణ సేవలను వినియోగించుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మార్గం సుగమమైంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న బ్యాంకు శాఖలో మాత్రమే వినియోగదారులు చలాన్లు చెల్లించవలసి వచ్చే ది. ఈ-చలాన్ల ప్రక్రియ అందుబాట్లోకి వస్తే బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే ఆన్లైన్ లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 950 ఎస్బీహెచ్ శాఖల్లో ఎక్కడైనా ఆఫ్లైన్లోనూ స్టాంప్ డ్యూటీ చెల్లించవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ల ఖాతాలను రద్దు పరిచి కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ పేరిట ఒకే ఖాతా నెంబరుకు సొమ్ము జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దొంగ చలాన్లకు చెక్... ఏదైనా బ్యాంకులో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా స్టాంప్ డ్యూటీ చెల్లించిన వినియోగదారులకు రశీదుతో పాటు 12 అంకెలు కలిగిన కోడ్ నెంబరును బ్యాంకు అందిస్తుంది. వినియోగదారులు తమవద్ద ఉన్న ర శీదు, బ్యాంక్ ఇచ్చిన కోడ్ నెంబరును సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తే సరిపోతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు వివరాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న డాక్యుమెంట్‌పై ముద్రించేలా అధికారులు చర ్యలు చేపట్టారు. దీంతో దొంగ చలాన్లను అరికట్టడంతో పాటు తాము చెల్లించిన మొత్తానికి వినియోగదారులకు భరోసా కల్పించినట్లవుతుందని శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎస్‌బీహెచ్‌తో ఎంవోయూకు అంతా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మార్చి 1 నుంచి ఈ-చలాన్ల ప్రక్రియను అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని..
కోదాడరూరల్: బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని ఓ బిజినెస్ కరస్పాండెంట్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధి అనంతగిరి చౌరస్తాలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖానాపురం గ్రామానికి చెందిన సముద్రాల సాయికుమార్ అనంతగిరి ఎస్బీహెచ్ బ్యాంకు పరిధిలో బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్‌గా (బీసీఏ) ఉంటూ తన ఏరియాలో జీరో అకౌంట్లో తీసుకున్నాడు. ఇతడికి జీరో అకౌంట్లు తీసేందుకు ఎస్బీహెచ్ బ్యాంకు వారే ఎక్యుప్మెంట్స్ ఇచ్చారు. గత మే నెలలో 92 మంది ఖాతాలు తీసేందుకు సంబంధిత డాక్యుమెంట్స్‌ను బ్యాంకులో ఇచ్చి అప్లోడ్ చేయమన్నాడు. ఈ సమయంలో బ్యాంకు మేనేజర్ బదిలీపై వెళ్లాడు. అప్పటి నుంచి సాయికుమార్ ఖాతాల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. ఇటీవల కాలంలో ఖాతా కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు సాయికుమార్‌ను బ్యాంక్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. అతను కొద్ది రోజుల క్రి తం బ్యాంకుకు వెళ్లి తాను తెచ్చిన జీరో అకౌంట్ తె రవాలని ప్రాథేయపడ్డాడు. కొత్తగా వచ్చిన మేనేజర్ బ్యాంకు అకౌంట్లు తెరవకుండా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తెలిపాడు. ఈ విషయంపై ఈ నెల 1న సాయికుమార్ సూర్యాపేటలోని ఎజీఎంకు ఫిర్యాదు చేశాడు. అక్కడ ఆయన 3న బ్యాంకుకు వెళ్లి అకౌంట్లు తీసుకోవాలని సూచించాడు. బ్యాంకుకు వెళితే మేనేజర్ నా మీద ఎంజీఎంకు ఫిర్యాదు చేస్తావానీపై ఎస్టీ కేసు పెడతానని సాయికుమార్‌ను వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ అనంతగిరి చౌరస్తాలో పురుగు మందు తాగా డు. బ్యాంక్‌కు వెళ్తుండగా మార్గ మధ్యలో ఆటో డ్రైవ ర్లు గమనించి అతడిని కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్ర స్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని రెండురోజులు గడిస్తేగాని ఎం చెప్పలేమని వైద్యుడు తెలిపారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై వేధింపులకు గురి చేసిన బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య వినీత కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
బ్యాంక్ పై నుంచి పడి వ్యక్తికి గాయాలు
ధారూర్: ఉపాధి కూలీ పనులు తీసుకోవడానికి బ్యాంక్‌కు వచ్చిన వ్యక్తి బ్యాంక్ మొదటి అంతస్థు పై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ ఎస్బీహెచ్లో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్బీహెచ్లో శనివారం ఉపాధి హామీ పథకం డబ్బులు ఇస్తున్నారనే సమాచారంతో 12 గ్రామాలకు చెందిన కూలీలు బ్యాంక్ ఎదుట బారులు తీరారు. దీంతో బ్యాంక్ సిబ్బంది బ్యాంక్‌కు తాళాలు వేసి కిటికి ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. పలుమార్లు తోపులాట జరిగింది. రేలింగ్‌కు ఆనుకొని నిలబడి ఉన్న దోర్నాల్ తండాకు చెందిన హరిచంద్ అనే వ్యక్తి అక్కడి నుంచి కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ఎస్బీహెచ్లో చోరీకి యత్నం
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ ఎస్బీహెచ్ శాఖలో ఆదివారం రాత్రి చోరీ యత్నం జరిగింది. నాలుగు రోజులుగా బ్యాంకుకు సెలవులు కావటంతో సోమవారం ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బంది విషయాన్ని గుర్తించారు. దుండగులు షట్టర్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించగా అది తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
ఏపీపీసీబీ నిధులు మాయం!
♦ రూ. 6.9 కోట్ల ఎఫ్డీల్ని ఎస్బీహెచ్ ప్రైవేటు సంస్థలకు బదలాయించిందన్న పీసీబీ ♦ మెహిదీపట్నం బ్రాంచి అధికారులపై ఎస్బీహెచ్ డీజీఎంకు ఫిర్యాదు ♦ ఎస్బీహెచ్ అధికారులు ఫోర్జరీ సంతకాలతో ఈ మొత్తాల్ని బదిలీ చేశారన్న పీసీబీ ♦ ఏపీలోని రెండు పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు..డీజీపీ దృష్టికీ ఈ వ్యవహారం.. సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)కి చెందిన రూ.6.9 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాలు మాయమయ్యాయి. ఎస్బీహెచ్ అధికారులు ఫోర్జరీ చేసి ఈ మొత్తాల్ని ప్రైవేటు సంస్థలకు బదలాయించారని పేర్కొన్న పీసీబీ ఈ మేరకు హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ఎస్బీహెచ్ బ్రాంచి అధికారులపై ఎస్బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్(డీజీఎం)కు శనివారం ఫిర్యాదు చేసింది. ఫోర్జరీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తమ ఫిక్స్డ్ డిపాజిట్లను థర్డ్‌పార్టీలకు బదలాయించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని పలు పోలీస్స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేసినట్టు పీసీబీ అధికారులు తెలిపారు. అంతేగాక ఈ వ్యవహారాన్ని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. వివరాలివీ.. ఏపీపీసీబీ ముఖ్య గణాంక అధికారి(సీఏఓ) పేరుతో మెహిదీపట్నం ఎస్బీహెచ్లో రూ.6.9 కోట్ల విలువైన ఏడు ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీలు) చేసింది. ఏడాది కాలవ్యవధిగల ఈ ఎఫ్డీలను నెలకూడా గడవకముందే మెహిదీపట్నం ఎస్బీహెచ్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్ జిల్లాలోని రాజంపేట, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తమిళనాడు ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థలకు బదలాయించారని పీసీబీ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఎఫ్డీలను గడువు తీరాక యజమాని (పీసీబీ సీఏఓ)కే చెల్లిం చాలి. చెక్కుల్లాగా ఎఫ్డీలను వేరేవారికి బదిలీ చేయడానికి వీలులేదు. ఇందుకు భిన్నంగా ఈ మొత్తాలను ఫలానా సంస్థలకు బదలాయించాలంటూ ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలు పెట్టుకుని బ్యాంకు సిబ్బంది బదిలీ చేసేశారని పీసీబీ ఉన్నతాధికారులు చెప్పారు. ‘‘ఎవరు సంతకం చేసినా ఫిక్స్డ్ డిపాజిట్లను వేరేవారి పేరుతో బదిలీ చేయరాదు. ఈ నిబంధనను కాలరాసి ఎలా బదిలీ చేశారు?’’ అని ఎస్బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇతర అధికారుల్ని ప్రశ్నించగా.. నిజమే, తమ సిబ్బంది తప్పుచేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని డీజీఎం పేర్కొన్నట్లు పీసీబీ అధికారులు తెలిపారు. ఈ బ్యాంకు నుంచి నిధులు రాజంపేట, తిరుపతి, తమిళనాడు ప్రాంతాల్లోని సంస్థలకు వెళ్లినందున ఆయా ప్రాంతాల్లోని(రాజంపేట, తిరుపతి) పోలీస్స్టేషన్లలోనూ సంబంధిత సంస్థలపై ఫిర్యాదు చేసినట్లు పీసీబీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు పీసీబీ నుంచి బ్యాంకుకు ఎలా వెళ్లాయనేది తేలట్లేదు. -
ఎస్బీహెచ్ డిపాజిట్ల కుంభకోణంపై సీబీ‘ఐ’
- హైకోర్టు ఆదేశంతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు - సైబరాబాద్ పోలీసుల నుంచి వివరాలు సేకరణ - కీలక సూత్రధారి దామోదర్ గాలింపునకు ప్రత్యేక బృందం సాక్షి, హైదరాబాద్: ఎస్బీహెచ్ బ్యాంకు శాఖల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల డిపాజిట్ల సొమ్ము పక్కదారి పట్టిన వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, అన్నోజీ గూడలోని సింగపూర్ టౌన్షిప్, ఘట్కేసర్ ప్రాంతాల్లోని ఎస్బీహెచ్ బ్యాంకు శాఖల నుంచి దాదాపు రూ. 30 కోట్లకుపైగా పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. స్వయంగా హైకోర్టు స్వాధీనంలోని సొమ్ము మాయమవడాన్ని న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. ఈ అవకతవకల వ్యవహారాన్ని ఛేదించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు శనివారమే సీబీఐ కార్యాచరణ ప్రారంభించింది. బ్యాంకు ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు కోసం ఒక బృందాన్ని, ఈ కేసులో కీలకమైన దామోదర్‌ను గాలించేందుకు మరో బృందాన్ని ఏర్పాటు చేసింది. బ్యాంకు అధికారుల పాత్రపైనా.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీసులు సేకరించిన ఆధారాలు, సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు. ఖాయిలా పడిన పరిశ్రమల బకాయిల సెటిల్మెంట్ కోసం హైకోర్టు లిక్విడేటర్ అధీనంలో ఉన్న సొమ్ము పక్కదారి పట్టడంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలం పాటు డిపాజిట్ చేసిన సొమ్మును కేవలం 15 రోజుల వ్యవధిలో తిరిగి ఇచ్చేయడంలో ఉన్న మతలబుపై దృష్టి సారించారు. ఆ సొమ్మును ముంబై, గుజరాత్, రాజ్‌కోట్ తదితర ప్రాంతాల్లోని 13 ఖాతాలకు బదిలీ చేయడంపై ఆరా తీస్తున్నారు. పైగా ఇంత పెద్ద వ్యవహారాన్ని బ్యాంకు మేనేజర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంపై సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా పలువురు బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకోవాలని సీబీఐ యోచిస్తున్నట్లు సమాచారం. గాలింపు ముమ్మరం.. ఈ కుంభకోణం సూత్రధారిగా భావిస్తున్న దామోదర్ కోసం సీబీఐ అధికారులు గాలింపు మొదలు పెట్టారు. అతను చెన్నైకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తుండటంతో అక్కడికి ఒక ప్రత్యేక బృందాన్ని పంపారు. అలాగే దామోదర్ ఎక్కడా తన పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించకుండా తెలివిగా వ్యవహరించిన తీరును అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దామోదర్‌తో బ్యాంకు అధికారులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. తెరమీదకు మరికొన్ని పేర్లు.. మల్కాజిగిరి ఎస్బీహెచ్లో డిపాజిట్ కుంభకోణంలో కొత్త పేర్లు వినబడుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వెంకటరమణారావుకు మల్కాజిగిరికి చెందిన కొందరు నేతలు.. మాజీ కౌన్సిలర్ వెంకటేష్, అతని సోదరుడు లక్ష్మణ్, దామోదర్‌లను పరిచయం చేసినట్లు తెలిసింది. ఆ పరిచయంతో బ్యాంక్‌లో ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తే కొంత మొత్తం ఇస్తామని చెప్పారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించేం దుకు వెంకటరమణారావు ఒప్పించారు. వెంకట రమణారావుకు వచ్చిన కమిషన్ రూ.5 లక్షల్లో... ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి తెలియజేసిన నేత రూ. లక్ష వరకు తీసుకున్నట్లు తెలిసింది. కుంభకోణంలో కీలక వ్యక్తులుగా ఉన్న వారిని వెంకట రమణారావుకు పరిచయం చేసిన నేతను విచారిస్తే నిజాలు తె లుస్తాయని అంటున్నారు. -
కోరుట్ల ఎస్బీహెచ్లో చోరీకి యత్నం
కోరుట్ల: కరీంనగర్ జిల్లా కోరుట్లలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ శాఖలో దుండగులు చోరీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి షట్టర్ల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు లాకర్లను తెరిచేందుకు ప్రయత్నించారు. వారివల్ల కాకపోవడంతో వెళ్లిపోయారు. తిరిగి వెళుతూ సీసీ కెమెరాల పరికరాలను ఎత్తుకుపోయారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి శనివారం కేసు నమోదు చేశారు. -
‘ఫిక్స్’ చేసేశారు
కోర్టు లిక్విడేటర్నే బురిడీ కొట్టించిన వైనం మల్కాజిగిరి ఎస్బీహెచ్ నుంచి తొమ్మిది కోట్లు గల్లంతు అన్నోజిగూడలోనూ రూ.18 కోట్ల మోసం ఇతర ప్రభుత్వ ఖాతాల డబ్బులపై పోలీసుల ఆరా సిటీబ్యూరో/మల్కాజిగిరి : బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ విభాగాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లపై మాయగాళ్లు కన్నేశారు. గతంలో ఇంటర్మీడియట్ బోర్డుకు చెందిన రూ. మూడు కోట్ల ఫిక్స్డ్ డబ్బులను కాజేసిన తరహలోనే తాజాగా మల్కాజిగిరిలోని ఎస్బీహెచ్లో ఖాయిలాపడ్డ పరిశ్రమలకు సంబంధించిన దాదాపు రూ.తొమ్మిది కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను తన్నుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. ఖాయిలాపడ్డ పరిశ్రమలకు సంబంధించిన ఓ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుండంతో కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు లిక్విడేటర్ ఇందుకు సంబందించిన లావాదేవీలు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా నగరంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో సదరు శాఖకు సంబంధించిన దాదాపు రూ.తొమ్మిది కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్యాంక్ మాజీ ఉద్యోగి రమణ కోర్టు లిక్విడేటర్‌ను కలిసి, మల్కాజిగిరిలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నమ్మించాడు. ఆ తర్వాత రమణ మల్కాజిగిరి ఎస్బీహెచ్ బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లి ఫలానా వ్యక్తిని కలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు వస్తాయని చెప్పాడు. దీంతో ఆ తర్వాత రమణ కోర్టు లిక్విడేటర్‌ను కలవడంతో ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్లు ఇచ్చాడు. వాటిని తీసుకొని బ్యాంక్ మేనేజర్‌కు ఇవ్వగా ఖాతాలో డిపాజిట్ చేశారు. అందుకు అతను ఇచ్చిన రసీదులను కలర్ జిరాక్స్ తీయించి, నకిలీవి కోర్టు లిక్విడేటర్‌కు ఇచ్చి అసలువి తన దగ్గరే ఉంచుకున్నాడు. పది రోజుల తర్వాత మల్కాజిగిరి ఎస్బీహెచ్ బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి డబ్బులను ఇతర బ్రాంచ్‌లకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పి ఖాతాదారుల తరఫున లెటర్ రాసి ఇచ్చాడు. దీంతో మేనేజర్ రమణ సూచించినట్లుగానే బాంబే, రాజ్‌కోట్, చెన్నై తదితర నగరాల్లోని బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. ఇలా వెలుగులోకి వచ్చింది... ఇదిలా ఉండగా ఖమ్మంలో ప్రభుత్వ విభాగానికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో మోసం జరిగిందని బయటపడటంతో అనుమానం వచ్చిన కోర్టు లిక్విడేటర్ మల్కాజిగిరి ఎస్బీహెచ్ బ్యాంక్ అధికారులకు ఫోన్ చెయ్యగా ఇప్పటికే ఆ డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిపారు. దీంతో అతను మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించడంతో సూత్రధారి రమణను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్నోజిగూడలోనూ... ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అన్నోజిగూడ సింగపూర్ టౌన్షిప్ ఎస్బీహెచ్ బ్యాంక్‌లో రూ. 18 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర ఖాతాలకు మళ్లినట్లు తెలిసింది. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందినవిగా గుర్తించారు. ఇవేకాక ఇతర బ్యాంక్‌ల్లోనూ ప్రభుత్వ విభాగాల ఫిక్స్డ్ ఖాతాలు తరలించి ఉంటారని భావిస్తున్న పోలీసులు కేసును సీఐడీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
రూ.8 కోట్లు కాజేసిన దుండగులు
హైదరాబాద్: మల్కాజ్‌గిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) లో రూ.8 కోట్ల డిపాజిట్లను దుండగులు కాజేశారు. బ్యాంక్ లిక్విడేటర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.8 కోట్లు స్వాహా చేసిన మేనేజర్
-
ఎస్బీహెచ్ లాభం 375 కోట్లు
క్యూ2లో 21% వృద్ధి * ఈ ఏడాది వ్యాపారంలో 10 శాతం వృద్ధి అంచనా * మార్చిలోగా మరోసారి వడ్డీరేట్లు తగ్గొచ్చు * ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ద్వితీయ త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 21 శాతం, ఆదాయంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 311 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ. 375 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 3,675 కోట్ల నుంచి రూ. 3,945 కోట్లకు చేరింది. ట్రెజరీ విభాగంలో లాభాలు, ఇతర ఆదాయాలు పెరగడం, వ్యయాలు తగ్గించుకోవడం నికర లాభం పెరగడానికి ప్రధాన కారణాలుగా ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ పేర్కొన్నారు. బుధవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమీక్షా కాలంలో కాస్ట్ టు ఇన్కమ్ (ఆదాయంలో వ్యయం చేసే శాతం ) 3.28 శాతం తగ్గి 47.78 శాతం నుంచి 44.50 శాతానికి చేరిందన్నారు. మొత్తం వ్యాపారం 8 శాతం వృద్ధితో రూ. 2.36 లక్షల కోట్లు దాటింది. కార్పొరేట్ రుణాలకు ఇంకా డిమాండ్ పెరగకపోవడంతో ఈ ఏడాది మొత్తం మీద వ్యాపారంలో 10 శాతానికి అటుఇటుగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సమీక్షా కాలంలో ఇతర ఆదాయం 47 శాతం పెరిగి రూ. 224 కోట్ల నుంచి రూ. 329 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికంతో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు స్వల్పంగా పెరిగినా గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గాయన్నారు. గతేడాది సెప్టెంబర్ నాటికి 5.73 శాతంగా ఉన్న స్థూల ఎన్పీఏ తొలి త్రైమాసికానికి 4.59 శాతానికి తగ్గినా, ద్వితీయ త్రైమాసికానికి స్వల్పంగా 4.92 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు 2.87 శాతం నుంచి 2.39 శాతానికి తగ్గాయి. తొలి త్రైమాసికంతో పోలిస్తే నికర వడ్డీ లాభదాయకత (నిమ్) 3.08 శాతం నుంచి 3.05 శాతానికి తగ్గింది. వడ్డీరేట్లు తగ్గొచ్చు.. వచ్చే మార్చిలోగా ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలున్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. వడ్డీరేట్ల తగ్గింపుపై ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు వంటి నిర్ణయాలు ప్రభావం చూపుతాయని, వీటిపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ ఏడాదిలోగా ఒకసారి వడ్డీరేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరిగితే టైర్-2 బాండ్ల ద్వారా నిధులు సేకరించే అంశాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఎస్బీహెచ్ ఏటీఎం చోరీకి విఫల యత్నం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఏటీఎం చోరీకి దుండగులు విఫల యత్నం చేశారు. జిల్లాలోని గంగాధర క్రాస్ రోడ్డు లో ఉన్న ఎస్బీహెచ్ ఎటీఎంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చొరబడ్డారు. చోరీకి ప్రయత్రించగా సాధ్యం కాకపోవడంతో ఏటీఎం ను ధ్వంసం చేసి పారిపోయారు. గురువారం గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం సమీపంలోని సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. -
ఎస్బీహెచ్లో దోపిడికి విఫలయత్నం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని ఎస్బీహెచ్ బ్రాంచ్‌లో చోరీకి దుండగులు మంగళవారం అర్థరాత్రి యత్నించారు. ఆ క్రమంలో బ్యాంక్ గ్రిల్స్ తొలగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆ విషయాన్ని గమనించి... దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై... దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
రూ. 100 కోట్లతో ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం
-
ఆర్బీఐ బేస్‌రేటు ఫార్ములాతో రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయ్
రూ. 100 కోట్లతో గచ్చిబౌలిలో ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం - ఎస్బీహెచ్ సైబరాబాద్ జోన్ ప్రారంభం - అందుబాటులోకి మొబైల్ యాప్ ‘ఎస్బీహెచ్ టచ్’ - ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి ఆర్బీఐ పరపతి సమీక్షతో సంబంధం లేకుండా బేస్ రేటు తగ్గే అవకాశం ఉందని ఎస్బీహెచ్ పేర్కొంది. బేస్‌రేటు నిర్ణయించడానికి ఆర్బీఐ నిర్దేశించిన కొత్త ఫార్ములా ప్రకారం దాదాపు అన్ని బ్యాంకులు బేస్ రేటును తగ్గించాల్సి వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేస్ రేటు తగ్గించడం వల్ల ఇతర బ్యాంకులపై ఎటువంటి ఒత్తిడి లేదని, త్వరలోనే మా బ్యాంక్ అసెట్ లయబిలిటీ కమిటి సమావేశమై బేస్‌రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటందన్నారు. సోమవారం హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డీరేట్లు తగ్గుతున్నా ఇంకా కార్పొరేట్ రుణాల్లో ఎటువంటి వృద్ధి కనిపించడం లేదన్నారు. డిమాండ్ ఉన్న రిటైల్, ఎస్ఎంఈ రంగాలపై తాము అధికంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఎస్బీహెచ్ 17వ జోనల్ ఆఫీసు ‘సైబరాబాద్జోన్’ను ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించారు. దీంతోపాటు మొబైల్ యాప్ ‘ఎస్బీహెచ్ టచ్’ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్ మీద మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే ఐవోస్ ఫ్లాట్‌ఫామ్ మీద కూడా దీన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏడాదిన్నరలో సిద్ధం గచ్చిబౌలి ఆర్థిక జిల్లాలో ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం ఏడాదిన్నరలో సిద్ధమవుతుందన్నారు. ప్రస్తుత పాత కార్యాలయం ఇరుకుగా ఉండటంతో రూ. 100 కోట్ల అంచనాతో కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు ముఖర్జీ తెలిపారు. ప్రస్తుత కార్యాలయం విస్తీర్ణం 1.3 లక్షల చదరపు అడుగులు ఉంటే కొత్త కార్యాలయంలో 2.28 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తుందన్నారు. -
బ్యాంక్ ఆవరణలో రైతు ఆత్మహత్యాయత్నం
గంగధార (కరీంనగర్) : వ్యవసాయ రుణం ఇవ్వడం లేదని బ్యాంక్ ఆవరణలోనే ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గంగధార మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతు చిలమల నర్సయ్య(54) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడులకు డబ్బులు లేక వ్యవసాయ రుణం కోసం మండలంలోని ఎస్‌బీహెచ్‌కు వెళ్లాడు. అయితే వ్యవసాయ రుణం ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆయన బ్యాంక్ ఆవరణలోనే ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన తోటి వినియోగదారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై బ్యాంక్ అధికారులను వివరణ కోరగా.. ఐదేళ్ల కిందట గృహ నిర్మాణం కోసం రూ.6 లక్ష ల75 వేలు ఇంటి రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి నయా పైసా కూడా తిరిగిచెల్లించలేదు. అందుకే రుణం నిరాకరించామని తెలిపారు. -
ఎస్బీహెచ్లో అగ్నిప్రమాదం
అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్ మండల కేంద్రంలోని ఎస్బీహెచ్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం విధుల్లోకి వచ్చిన సిబ్బంది కంప్యూటర్ ఆన్ చేయడంతోనే కేబుల్ వైర్ ద్వారా షార్ట్‌సర్క్యూట్ అయి అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకు అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో బ్యాంక్ సిబ్బంది స్థానికులతో సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం వల్ల ఈ రోజు బ్యాంకు లావాదేవిలకు అంతరాయం కలగనుందని ఎస్బీహెచ్ మేనేజర్ వెల్లడించారు. -
ఎస్బీహెచ్ ‘శుభ్‌లాభ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) చిన్న, మధ్యస్థాయి వ్యాపారుల కోసం ‘శుభ్ లాభ్’ పేరుతో ప్రత్యేక రుణ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం ‘ఎస్బీహెచ్ ఎంఎస్ఎంఈ మార్టిగేజ్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. -
ఎస్బీహెచ్ ఉద్యోగి మోసం
ఖాతాదారు నుంచి రూ.22 వేలు కాజేసి వైనం ఆలస్యంగా వెలుగులోకి ఏటూరునాగారం : ఓ వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు కాజేసిన ఎస్బీహెచ్ ఉద్యోగి వ్యవహారం గురువారం వెలుగుచూసింది. ఏటూరునాగారం మండలంలోని ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన అటిక కృష్ణ వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో కృష్ణకు మంగళవారం ఒక ఫోన్‌కాల్ వచ్చింది. నేను బ్యాంకు ఎంప్లారుుని ‘నీ ఏటీఎం పిన్ నంబర్ బ్లాక్ అరుుంది. మీ పిన్ నంబర్, కార్డుపై ఉన్న 11 అంకెల నంబర్, అకౌంట్ నంబర్ చెప్పాలని కాల్చేసిన వ్యక్తి కృష్ణను కోరాడు. నమ్మిన ఆయన అన్ని వివరాలు తెలిపాడు. బుధవారం రోజు కృష్ణ అకౌంట్లోని రూ.22 వేలు డ్రా అయ్యూరుు. గృహ ఉపకార సామగ్రి కొనుగోలు చేసినట్లుగా సెల్‌కు ఎస్ఎంఎస్ వచ్చింది. ఇది చూసి కృష్ణ ఖంగుతిన్నాడు. ‘ నేను గృహానికి కావాల్సిన ఫర్నిచర్ ఎందుకు కొన్నాను’అని పునరాలోచనలో పడ్డాడు. వెంటనే ఎస్‌బీహెచ్‌కు వెళ్లి తన ఖాతా నుంచి రూ.22 వేలు డ్రా అయ్యూయని బ్యాంకు అధికారులకు తెలిపాడు. వివరాలు సేకరించగా ఎస్బీహెచ్ ఉద్యోగి రావుల్శర్మ డబ్బులు డ్రా చేసినట్లు తేలింది. దీంతో బాధితుడు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు ఉద్యోగి ఆచూకీ దొరకలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చూపు మళ్లించి.. నోట్లు కొట్టేసి
అంతా చూస్తుండగానే చోరీ.. రూ.1.8 లక్షలు మాయం జహీరాబాద్ టౌన్ : అంతా చూస్తుండగానే బ్యాంక్ నుంచి డ్రా చేసుకొస్తున్న డబ్బులను కొట్టుకెళ్లిపోయాడో వ్యక్తి. గురువారం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మూసనగర్కు చెందిన మక్సూద్‌అలీ(55) స్థానిక మహీంద్ర కర్మాగారంలో కాంట్రాక్టర్. కాంట్రాక్టుకు సంబంధించిన రూ.1.80 లక్షల చెక్కును పట్టణంలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌లో డ్రా చేశాడు. డబ్బులను చేతి రుమాలలో చుట్టుకుని బ్యాంక్ బయట పార్కింగ్ చేసిన టీవీఎస్ మోపెడ్ కవర్లో పెట్టాడు. అంతలో నేలపై పడి ఉన్న పది రుపాయల మూడు కట్టలు మీవా! అంటూ వెనుకాల నుంచి ఓ వ్యక్తి అడగడంతో మక్సూద్‌అలీ వాటిని చూశాడు. తనవి కావని, ఎవరైన వస్తే ఇవ్వాలంటూ పక్కనే ఉన్న టీ కొట్టు నిర్వహకుడుకి చెబుతుండగా... అంతలో సదరు వ్యక్తి మోపెడ్‌లో దాచిన డబ్బులను తీసుకుని పరారయ్యాడు. కళ్లముందు జరిగిన ఈ ఘటనతో అంతా విస్తుపోయారు. వెంటనే తేరుకున్నా... వెంటనే తేరుకున్న మక్సూద్‌అలీ జహీరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఎస్ఐలు శివలింగం, సుభాష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతం జరిగిన తీరు తెలుసుకున్నారు. బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడారు. బ్యాంక్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. అలాగే పక్కనే మరో దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలించారు. కానీ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్బీహెచ్ లాభం 11% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికరలాభం 10.6 శాతం వృద్ధితో రూ. 251 కోట్లకు చేరింది. ఇదే సమయంలో మొత్తం వ్యాపారం 9 శాతం పెరిగి రూ. 2.40 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఎస్బీహెచ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 998 కోట్ల నుంచి రూ.1,107 కోట్లకు చేరింది. నికరవడ్డీ లాభదాయకత (నిమ్) 3.02 శాతం నుంచి 3.08 శాతానికి పెరిగింది. గతేడాదితో పోలిస్తే నికర నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. గతేడాది జూన్‌లో రూ. 6,174 కోట్లు(6.26%)గా ఉన్న స్థూల ఎన్పీఏలు ఇప్పుడు రూ. 5,482 కోట్లు(5.14%) తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఆర్థిక ఫలితాలకు ఆమోదం తెలిపారు. జూన్ చివరి నాటికి ఎస్బీహెచ్ మొత్తం శాఖల సంఖ్య 1,824 ఉంటే అందులో 741 శాఖలు తెలంగాణలో, 400 శాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. -
సీఎం భార్య.. సాధారణ మహిళలా..!
సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సతీమణి శోభ బుధవారం తమ సొంతూరు మెదక్ జిల్లా చింతమడకలో సాధారణ మహిళలా కలియతిరిగారు. కనిపించిన వారినల్లా ఆత్మీయంగా పలకరించారు. వారితో పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆమె తీరుతో గ్రామస్తులు పులకించిపోయారు. చింతమడక గ్రామానికి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శోభ.. తమ బంధువులతో కలసి గతంలో ఉన్న ఇంటిని, తమకున్న స్థలాలను పరిశీలించారు. గ్రామంలో కేసీఆర్‌కు ఉన్న స్థలాల్లో ఎస్బీహెచ్ బ్యాంక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పశువైద్యశాలలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇంటి స్థలంలో ప్రస్తుతం ఉన్న ఎస్బీహెచ్ బ్యాంక్‌లోకి శోభ వెళ్లగానే అక్కడే గోడకు ఉన్న అత్తమామలైన కల్వకుంట్ల వెంకటమ్మ, రాఘవరావుల చిత్రపటానికి దండం పెట్టారు. బ్యాంక్‌లో ఉన్న గదులు చూస్తూ.. అందులో ఉన్నప్పుడు ఏ గదిలో ఏముండేదో గుర్తు చేసుకుంటూ పక్కనే ఉన్న బంధువులకు చెప్పారు. అదే విధంగా గ్రామంలోని ఆయా స్థలాల్లో ఎవరు ఉంటున్నారని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కేసీఆర్ తల్లిదండ్రుల స్మారకార్థ్ధం నిర్మించిన కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణను పరిశీలించారు. మధ్యాహ్న భోజన వంటలు చేస్తున్న లక్ష్మిని పేరు పెట్టి పిలిచి బాగున్నారా అని పలకరించారు. ‘మంగమ్మ లేదా?’ అంటూ ఆరా తీశారు. పాఠశాలలో నీళ్ల వసతి ఉందా? కేసీఆర్ సతీమణి శోభ కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోకి వెళ్లి పాఠశాలలో నీళ్ల వసతి ఉందా అని పాఠశాలలో వంట చేసేవారిని అడిగారు. ఈ సందర్భంగా వారు నీళ్లు సరిగ్గా రావడంలేదు.. బయట నుంచి పైపులైన్ ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పారు. పాఠశాల ఆవరణలో నీళ్ల ట్యాంక్ ఉందనగా, దానికి కనెక్షన్ లేదని వారు బదులిచ్చారు. గ్రామంలో కనిపించిన వృద్ధులను, తెలిసిన వారిని పేరు పెట్టి పలకరించడంతో వారంతా సంతోషంలో మునిగారు. దశ దినకర్మలో.. సిద్దిపేట మండలం చింతమడకలో కేసీఆర్ వదిన సుభద్ర మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం దశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబీకులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. దశ దినకర్మ కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఆమె సుమారు ఐదు గంటల పాటు గ్రామంలోనే ఉన్నారు. -
ఎస్బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము
- శ్రీకాళహస్తిలో అధికారుల నిర్వాకం శ్రీకాళహస్తి : సాధారణ అవసరాలు, ఉత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయ సొమ్మును రూ.2కోట్ల వరకు సేవింగ్స్ (ఎస్బీ)ఖాతాలో ఆలయాధికారులు ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువయితే బ్యాంకులో ఫిక్సె డ్ డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా రూ.20కోట్లను ఎస్బీ ఖాతాలో అధికారులు ఉంచేశారు. దాదాపు ఏడు నెలలుగా ఈ మొత్తానికి వడ్డీ లేకుండాపోయింది. భక్తులు ఆలయ హుండీల్లో వేసిన కానుకలు భద్రపరచి సద్వినియోగం చేయాల్సిన బాధ్యత అధికారులదే. అయితే శ్రీకాళహస్తీశ్వరాల యంలో భక్తులు హుండీల్లో వేసిన డబ్బుతో పాటు ఆలయంలో రాహుకేతు పూజలు, ఇతర అభిషేకాల ద్వారా వచ్చిన రూ.20కోట్లు బ్యాంక్‌లో ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఎస్బీ అకౌంట్లో జమచేశారు. ఏటా దేవాదాయశాఖకు జూన్ చివరికల్లా సుమారు రూ.10కోట్లు ఆలయం నుంచి చెల్లించాల్సి ఉంటుం ది. అయినా అదనంగా మరో రూ.10కోట్లు ఉంచుకోవాల్సిన అవసరమం ఏమిటనేది ప్రశ్న. గతంలో ఎన్నడూ ఈవోలు ఇలా ఇంత పెద్ద మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఉంచిన సందర్భం లేదు. దేవాదాయశాఖకు చెల్లించడం కోసమే : ఈవో దేవాదాయశాఖకు ప్రతి ఏటా జూన్ చివరికల్లా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఆదాయాన్ని బట్టి కొంతమొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. గత ఏడాది రూ.10కోట్ల వరకు ఆలయానికి చెందిన డబ్బును దేవాదాయశాఖకు చెల్లించాం. ఈసారి ఆలయ ఆదాయం పెరగడంతో రూ.12కోట్ల వరకు చెల్లించాలి. ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే దేవాదాయశాఖకు వెంటనే చెల్లించాలంటే ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్ధేశంతో రూ.20కోట్లు ఎస్బీలో ఉంచాం. పుష్కరాల వల్ల చెల్లించలేకపోయాం. పుష్కరాలు తర్వాత చెల్లిస్తాం. అంతే తప్ప పైసా తిన్నా.. ఇబ్బందులు తప్పవు. - బి.రామిరెడ్డి,ఈవో -
ఎస్బీహెచ్ జీఎంగా గున్విర్ సింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) జనరల్ మేనేజర్(కమర్షియల్ బ్యాంకింగ్)గా గున్విర్ సింగ్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 1983లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలలో ఆఫీసర్‌గా వృత్తిని ప్రారంభించిన సింగ్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికినీర్ అండ్ జైపూర్ బ్యాంకులల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. -
ఏటీఎం చోరికి విఫలయత్నం
-
మియాపూర్ ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీకి యత్నం
హైదరాబాద్ : మియాపూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి తీవ్ర ప్రయత్నం చేశారు. ఏటీఎం పగులకొట్టి డబ్బు తస్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. -
గతవారం బిజినెస్
నియామకాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) చీఫ్ జనరల్ మేనేజర్‌గా డి.వి.సురేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1985లో ఎస్బీహెచ్లో ఆఫీసర్ హోదాలో వృత్తిని ప్రారంభించిన సురేష్ కుమార్ ఎస్బీఐ చికాగో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో పనిచేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సిమెంట్ కంపెనీ లఫార్జ్ భారత కార్యకలాపాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియా నియమితులయ్యారు. ఇది వరకు కంపెనీ భారత కార్యకలాపాలను మార్టిన్ రిగ్నర్ పర్యవేక్షించేవారు. ఉజ్వల్ భర్తియా గత 16 ఏళ్లుగా కంపెనీలోనే పనిచేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించనుంది. వచ్చే నెల ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో(ఈటీఎఫ్) ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తామని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ కె.కె.జలాన్ చెప్పారు. తొలి ఏడాది రూ.5,000 కోట్ల వరకూ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలోకి హీరో గ్రూప్ పారిశ్రామిక దిగ్గజం హీరో గ్రూప్ తాజాగా ఎలక్ట్రానిక్స్ రంగంలోకి ప్రవేశించింది. హీరో ఎలక్ట్రానిక్స్ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించింది. రాబోయే రోజుల్లో సుమారు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు హీరో ఎలక్ట్రానిక్స్ సంస్థ చైర్మన్ సుమన్ కాంత్ ముంజల్ వెల్లడించారు. రిలయన్స్ జియోకి ఎంఎస్ఓ అనుమతి డిజిటల్ కేబుల్ టీవీ విభాగంలో మల్టీ సర్వీస్ ఆపరేటర్‌గా (ఎంఎస్ఓ) వ్యవహరించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియోకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ అనుమతితో రిలయన్స్ జియో ఇక నుంచి ఐఎంసీఎల్, సిటీ కేబుల్ నెట్వర్క్, డెన్ నెట్వర్క్ వంటి వాటికి పోటీ ఇవ్వనుం ది. ఇంటిగ్రేటెడ్ బిజినెస్ కేబుల్ రూపంలో టెలికం, హైస్పీడ్ డాటా, డిజిటల్ కామర్స్, మీడియా, పేమెంట్ సర్వీసులను అందించే జియో బ్రాండ్‌ను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తోంది. టెక్ మహీంద్రాకు రూ.500 కోట్ల ప్రాజెక్ట్ వైద్య సేవల రంగానికి సంబంధించి ‘ఎన్త్డెమైన్షన్’ పేరిట ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. బ్రిటన్‌కు చెందిన సర్కిల్ హెల్త్ సంస్థకి టెక్నాలజీ సర్వీసులు అందించేందుకు ఈ కొత్త కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల డీల్‌ను దక్కించుకుంది. అదనంగా పేషెంట్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఎంఆర్ఐ అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి, డాక్టర్లు మొబైల్ పరికరాల్లోనే స్కానింగ్ రిపోర్టులు చూడటానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా టెక్ మహీంద్రా అందించనుంది. భారత సాఫ్ట్వేర్ మార్కెట్ వృద్ధి 10% గతేడాది రెండో అర్ధ భాగంలో భారతీయ సాఫ్ట్వేర్ మార్కెట్ వృద్ధి 10 శాతంగా నమోదైంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి టాప్ ఐటీ కంపెనీలు స్థిరంగా రెండంకెల వృద్ధిని నమోదు చేయడమే దీనికి కారణమని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తన నివేదికలో తెలిపింది. భారతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో ప్రాథమికంగా ఉన్న అప్లికేషన్ డెవలప్మెంట్ డిప్లాయ్‌మెంట్, అప్లికేషన్స్, సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్(ఎస్ఐఎస్) అనే మూడు విభాగాలు దాదాపుగా రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఆర్బీఐ అనుమతి అవసరం లేదు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండానే నిధులు సమీకరించవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సడలించింది. భారత ప్రభుత్వం ఒక వాటాదారుగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు/మల్టీలేటరల్ ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకులు రుణాలు తీసుకోవచ్చని, దీనికి తమ నుంచి ఎలాంటి అనుమతులూ అక్కర్లేదని ఆర్బీఐ పేర్కొంది. చిన్న సంస్థలకు ఈపీఎఫ్ఓ ఊరట ఉద్యోగుల భవిష్య నిధికి తమ వంతుగా కట్టాల్సిన మొత్తాన్ని జమ చేసే విధానం విషయంలో చిన్న సంస్థలకు ఈపీఎఫ్ఓ కొంత వెసులుబాటు కల్పించింది. ఇంతకు ముందు లాగానే సుమారు రూ. 1లక్ష కన్నా తక్కువగా జమ చేయాల్సిన మొత్తాన్ని చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా చెల్లించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జమ చేయాల్సి ఉంటుంది. ఉల్లి కనీస ఎగుమతి ధర పెంపు దేశీయంగా ధరలను కట్టడి చేసేందుకు, తగినంత సరఫరా ఉండేలా చూసేం దుకు ఉల్లి కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) కేంద్రం ఏకంగా టన్నుకు 175 డాలర్ల మేర పెంచింది. దీంతో ఇది 425 డాలర్లకు చేరింది. ఇంతకన్నా తక్కువ ధరకు ఉల్లిని ఎగుమతి చేయకూడదు. కోల్ పీఎఫ్ నిధుల నిర్వహణకు 2 సంస్థలు బొగ్గుగని కార్మికుల ప్రావిడెండ్ ఫండ్ నిధులను నిర్వహించడానికి రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఆర్క్యామ్), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్ సంస్థలు ఎంపికయ్యాయి. ఈ రెండు సంస్థలు కోల్‌మైన్స్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(సీఎంపీఎఫ్‌ఓ)కు చెందిన రూ.60,000 కోట్ల పీఎఫ్ నిధుల నిర్వహణ బాధ్యతను చూసుకోనున్నాయి. కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పెంపు 2005కు ముందున్న కరెన్సీ నోట్ల మార్పిడి గడువును భారతీయ రిజర్వు బ్యాంక్ మరింత పొడిగించింది. సాధారణంగా ఈ గడువు జూన్ 30 నాటితో ముగుస్తుంది. కానీ ఆర్బీఐ ఆ గడువును డిసెంబర్ చివరిదాకా పొడిగించింది. ప్రజలు బ్యాంక్ శాఖల్లో వెంటనే మార్పు చేసుకోవచ్చు. 6 రోజుల్లోనే లిస్టింగ్ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పలు కీలక సం స్కరణలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఐపీఓ ప్రక్రియను ఇప్పుడున్న 12 రోజుల నుంచి 6 రోజులకు కుదించింది. ఇన్వెస్టర్ల నిధు లు ఎక్కువ రోజుల పాటు లాక్ కాకుండా.. అదేవిధం గా కంపెనీల లిస్టింగ్‌ను వేగవంతం చేయడం కోసం సెబీ ఈ మార్పులు చేసింది. అంటే ఇకపై ఐపీఓ ముగింపు తేదీ నుంచి ఆరు రోజుల్లోగా కంపెనీ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కావాల్సి ఉంటుంది. తాజా మార్పులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐక్సిగోలో మైక్రోమ్యాక్స్ పెట్టుబడులు మొబైల్ ఫోన్లు తయారు చేసే మైక్రోమ్యాక్స్ సంస్థ ఐక్సిగో(మొబైల్ ట్రావెల్ సెర్చ్ అండ్ మార్కెట్ ప్లేస్)లో పెట్టుబడులు పెట్టింది. ఏడాదిలో 20 స్టార్టప్‌ల్లో 2 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలో భాగంగా ఐక్సిగోలో పెట్టుబడులు పెట్టినట్లు మైక్రోమ్యాక్స్ తెలిపింది. డీల్స్.. దేశీయంగా భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్, జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. ఈ జాయింట్ వెంచర్ సంస్థ కంపెనీ సౌర విద్యుత్ రంగంలో దాదాపు 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. భారత్‌లో 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. బ్లూ డార్ట్ ఏవియేషన్‌లో 21 శాతం వాటా కొనుగోలు చేశామని బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. దీంతో తమ మొత్తం వాటా 49 శాతం నుంచి 70 శాతానికి పెరిగిందని పేర్కొంది. దీంతో బ్లూ డార్ట్ ఏవియేషన్ తమ అనుబంధ సంస్థగా మారిందని వెల్లడించింది. అమెరికాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ సంస్థ మార్కెట్ మోటివ్ను భారత్‌కు చెందిన ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ సింపుల్ లెర్న్ కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే మార్కెట్ మోటివ్ను కోటి డాలర్లకు కొనుగోలు చేసినట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సింపుల్ లెర్న్ తెలిపింది. -
ఏటీఎంల దొంగ దొరికాడు
హైదరాబాద్: కొత్తపేటలో దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శరవేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకొని కటకటాల్లో పెట్టేశారు. కొత్త కోటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇండిక్యాష్ ఏటీఎంలను ధ్వంసం చేసి అందులోని డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి అతడివల్ల కాకపోవడంతో అలాగే వదిలివెళ్లాడు. ధ్వంసం అయిన ఏటీఎంలను పరిశీలించిన పోలీసులు వాటిల్లోని సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని నిందితుడిని గుర్తించారు. ఆ వెంటనే రంగంలోకి అరెస్టు చేశారు. -
ఎస్బీహెచ్లో చోరీకి యత్నం
కంప్లి: పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో చోరీ ప్రయత్నించిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. డీఎస్పీ లావణ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంక్ భవనానికి పక్కన నిచ్చెన వేసి ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరా వైర్లను కత్తరించి తాళాలను పగలగొట్టి దోపిడీకి ప్రయత్నం చేశారన్నారు. ఘటన స్థలానికి సీఐ లింగనగౌడ, ఎస్ఐలు నాగరాజు, జితేంద్రలతో చేరుకొని పరిశీలించి బళ్లారి నుంచి వేలి ముద్రల నిపుణులను, జాగిలాలను రప్పించుకున్నారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వేసవిలో సాధారణంగా మేడలు, మిద్దెలపై నిద్రించడం సహజం అదను చూసుకొని దొంగలు దొంగతనాలు చేస్తుంటారు. గత వారం కంప్లి-కొట్టాల మార్గానగల ఓ దుకాణం షెట్టర్లకు వేసిన తాళాలను పగులగొట్టి దొంగతనం చేస్తున్న సందర్భంలో అలికిడితో దొంగలు పరారైన ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 6వ వార్డులోని వెంకయ్య అనే ఓ ఇంటి యజమాని ఇంట్లోని మోటార్‌ను ఎత్తుకెళ్లిన ఘటన కూడా జరిగింది. -
బేస్ రేట్ తగ్గించిన ఎస్బీహెచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కనీస రుణ రేటును (బేస్ రేటు) 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పటి వరకు 10.2 శాతంగా ఉన్న బేస్ రేటును 10.05 శాతానికి తగ్గించామని, ఈ తగ్గిన వడ్డీరేట్లు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఎస్బీహెచ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. బేస్ రేటు ఆధారంగా ఫ్లోటింగ్ రేటుపై రుణాలు తీసుకున్న వారికిది ఉపశమనం కలిగిస్తుందని, అలాగే కొత్తగా తీసుకునే వారికి ఈ తగ్గింపు రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. దీంతో పాటు హోమ్‌లోన్స్‌పై వడ్డీరేట్లను ఎస్బీహెచ్ తగ్గించింది. రూ.75 లక్షల వరకు గృహరుణాలను 101.10 శాతానికి, అంతకంటే ఎక్కువ మొత్తానికి తీసుకునే గృహ రుణాలను 10.15 శాతానికి తగ్గించింది. గతంలో ఎస్బీహెచ్ 10.25 శాతం వడ్డీని వసూలు చేసేది. ఈ తగ్గిన గృహరుణాల రేట్లు సోమవారం (మే 4) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
ఏటీఎమ్ చోరీకి విఫలయత్నం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో ఎస్బీహెచ్ ఏటీఎమ్ చోరీకి దుండగులు గురువారం అర్థరాత్రి విఫలయత్నం చేశారు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఎటీఎం కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు పరారైయ్యారు. దాంతో పోలీసులు వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించి... కేసు నమోదు చేశారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వంద నోటుకు ఎన్ని వంకలో..
హన్మకొండ: వరంగల్ జిల్లా నర్సంపేట ఎస్బీహెచ్ ఏటీఎంలో వింత వంద నోటు వచ్చింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డ్రైవర్‌గా పని చేస్తున్న లైన్ వెంకటేశ్వర్లు స్వగ్రామం నర్సంపేట. అయితే బుధవారం నర్సంపేటలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయగా, అందులో ఈ వంద నోటు వచ్చింది. దీనికి రెండు సిరీస్ నంబర్లు ఉన్నాయని, 4యూఎల్ 266626, 4యూఎల్ 266726 నంబర్లు ముద్రించి ఉన్నాయని చెప్పాడు. రెండు నంబర్ల మధ్య తేడా 101 సంఖ్యగా ఉందని, ముద్రణలో లోపం వల్ల ఇలా వచ్చినట్లుంద ని తెలిపాడు. -
ఏటీఎం..
తిమ్మాజీపేట మండలం ఆవంచకు చెందిన మన్సూరు అవసరానికి డబ్బులు తీసుకునేందుకు ఫిబ్రవరి ఏడో తేదీన జడ్చర్లలోని ఎస్బీహెచ్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతని వెంట కొందరు కేంద్రంలోకి వెళ్లి మాటల్లో పెట్టారు. అతని వద్దనుంచి ఏటీఎం కార్డు దొంగిలించారు. అనంతరం అతని ఖాతానుంచి 30వేల రూపాయలు కాజేశారు... జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో జరుగుతున్న మోసాలకు ఒక ఉదాహారణ మాత్రమే.. ప్రతి రోజూ ఇలాంటి వారు ఎందరో మోసాలకు బలవుతూ.. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఏటీఎం సెంటర్ల నిర్వహణ అత్యంత దారుణంగా తయారైంది. ఎక్కడా సెక్యూరిటీ గార్డులు ఉండడం లేదు. వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఇదే అదునుగా భావించి మోసకారులు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో అమాయకులను బుట్టలో వేసుకొని ఏటీఎం కార్డులను మార్చేసి... వేల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లాలో ప్రతినెల నాలుగైదు దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా బ్యాంకులనే లూటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఆర్థిక నేరాలు రోజురోజుకు శృతిమించుతున్నా బ్యాంకు యాజమాన్యాలు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంకులు పోటాపోటీగా ఆటోమెటిక్ టెల్లర్ మిషిన్ (ఏటీఎం)లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని ఆర్భాటంగా ప్రారంభిస్తున్నా... రక్షణ చర్యలు మాత్రం విస్మరిస్తున్నారు. నిత్యం లక్షలాది రూపాయలు డ్రా చేసే ఈ కేంద్రాల వద్ద కనీసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయలేకపోవడంతో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం 210 ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటి నుంచి ప్రతిరోజూ కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు నగదు డ్రా చేస్తున్నట్లు సమాచారం. అయితే వీటివద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకుల పైనే ఉంటుంది. కానీ ఏ ఒక్క కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డులుండటం లేదు. పైగా ఏటీఏం కేంద్రాల లోపల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీని కారణం చాలా వరకు బ్యాంకులు ఆర్థికభారం పడుతుందనే ఉద్దేశంతో నియమించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఒకటి, రెండు ముఖ్యమైన పాయింట్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డులను నియమించి చేతులు దులుపుకుంటున్నాయి. ముఖ్యంగా పట్టణ, మండల కేంద్రాల్లో ఉండే ఏటీఎం సెంటర్ల వద్ద భద్రత ఉండడం లేదు. ఏటీఎం సెంటర్లకు ఆటోమెటిక్‌గా మూసుకునే గ్లాస్ డోర్ ఉండాలి. జిల్లాలో ఇలాంటివి ఎక్కడా కనిపించవు. ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటున్నాయి. దీంతో ఆగంతకులు నేరుగా లోనికి ప్రవేశించి డబ్బులు డ్రా చేసే సమయంలో మిస్‌గైడ్ చేయడంతో పాటు వారి ఏటీఎం కార్డులను తస్కరిస్తున్నారు. జిల్లాలో ఇలాంటివి ఎన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నా వాటి కేసుల్లో పురోగతి ఉండడం లేదు. మూతపడే దర్శనం... జిల్లాలోని ఏటీఎం సెంటర్ల భద్రత ఒక ఎత్తయితే... వాటి నిర్వహణ వినియోగదారులకు మరింత చికాకు కల్పిస్తున్నాయి. చాలా వరకు సెంటర్లు ఎప్పుడు చూసినా ‘‘సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా పనిచేయడం లేదు’’ అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల కేంద్రాల్లో అవసరం మేరకు నగదు నిల్వ ఉంచడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ పరిస్థితి నెల మొదటి వారంలో మరింత జఠిలంగా మారనుంది. ఏటీఎంలలో డబ్బుల నిల్వకు సంబంధించి బ్యాంకులు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తాయి. డబ్బుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సరిపడా నిల్వ ఉండేలా సంబంధిత ఏజెన్సీ నిర్వహించాలి. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకులకు, ఏజెన్సీలకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఏటీఎంలలో డబ్బులు లేకుండా రోజుల తరబడి ఉండిపోతున్నాయి. బ్యాంకులను హెచ్చరిస్తున్నాం: మల్లారెడ్డి, అడిషనల్ ఎస్పీ, మహబూబ్‌నగర్ ఇటీవల బ్యాంకు దోపిడీలు, ఏటీఎం సెంటర్ల వద్ద అంగతకుల మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా బ్యాంకులను పదే పదే హెచ్చరిస్తున్నాం. అంతేకాదు సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని, వాటి రికార్డింగ్ ఒక రహస్య ప్రదేశంలో నిల్వ ఉండేట్లుగా చూడాలని సూచించాం. మా సిబ్బంది కూడా బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నారు. బ్యాంకుల వద్ద పాయింట్ బుక్‌లు ఏర్పాటు చేశాం. -
ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
వరంగల్: జిల్లాలోని మహబూబాబాద్ ఇల్లందు రోడ్డులో రాత్రి దోపిడీ దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఎస్బీహెచ్ ఏటీఎంలో నగదు చోరీకి యత్నించారు. నగదు దొంగలించేందుకు ప్రయత్నించినా తలపులు తెరుచుకోకపోవడంతో దుండగులు ఏటీఎం మిషన్‌ను పగులుగొట్టి వెళ్లినట్టు సమాచారం. -
ఎస్బీహెచ్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 క్రికెట్లో ఎస్బీహెచ్ జట్టు 8 వికెట్ల తేడాతో వాల్యూ ల్యాబ్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. సాషా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన వాల్యూ ల్యాబ్స్ 18.4 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటైంది. రాహుల్ (35 బంతుల్లో 48, 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఎస్బీహెచ్ బౌలర్లలో శ్రీధరన్, పవన్ చెరో 3 వికెట్లు తీశారు. అనిరుధ్ సింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత 108 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఎస్బీహెచ్ కేవలం 9.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకట్ (32 బంతుల్లో 68 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో జట్టును గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు మై హోమ్: 174/9 (అశ్విన్ 64, అంకుర్ 34; జర్కాశ్ 3/13, నాగరాజు 3/37), అమెజాన్: 153/9 (అర్చిత్ 31, చరణ్ 23, సందీప్ పటేల్ 23; సత్య 4/19) గ్రాన్యుల్స్ ఇండియా: 147/7 (మదుమ్ 50 నాటౌట్, రాజశేఖర్ 35, పెంచయ్య 22; ఇర్ఫాన్ 3/28), బకార్డి: 125/8 (ఇర్ఫాన్ 60; డేవిడ్ 2/19) ఇనెసిస్: 142/8 (బి.వి.రావు 28, లాయిడ్ 26, సంతోష్ 22; రాజేశ్ 3/19, కిరణ్ 3/25), సేల్స్ ఫోర్స్: 97/9 (ఆశిష్ 31; అశ్విన్ 3/21). -
ఫైనల్లో ఆంధ్రాబ్యాంక్, ఎస్బీహెచ్
కిషన్ పర్షాద్ నాకౌట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: కిషన్ పర్షాద్ వన్డే నాకౌట్ టోర్నీలో ఆంధ్రాబ్యాంక్ 153 పరుగుల తేడాతో ఏఓసీ జట్టుపై ఘన విజయం సాధించింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జట్లు మాత్రమే తలపడే ఈ టోర్నీలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ బౌలర్ లలిత్ మోహన్ (5/23) ఏఓసీ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్రాబ్యాంక్ 276 పరుగులు చేసి ఆలౌటైంది. డీబీ రవితేజ (87), అమోల్ షిండే (72 నాటౌట్), అభినవ్ కుమార్ (54) అర్ధసెంచరీలతో రాణించారు. ఏఓసీ బౌలర్ దివేశ్ పథానియా 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఏఓసీ 123 పరుగులకే ఆలౌటైంది. లలిత్ ధాటికి ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. విష్ణు తివారి చేసిన 35 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్ కాగా మిగతా వారు చేతులెత్తేశారు. మరో మ్యాచ్‌లో ఎస్బీహెచ్ జట్టు 7 వికెట్ల తేడాతో బీడీఎల్‌పై గెలిచింది. తొలుత బీడీఎల్ జట్టు 198 పరుగుల వద్ద ఆలౌటైంది. కె.సుమంత్ (50) అర్ధసెంచరీ చేయగా, చైతన్య రెడ్డి 41, యతిన్ రెడ్డి 35 పరుగులు చేశారు. ఆకాశ్ భండారి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఎస్బీహెచ్ 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి గెలిచింది. అహ్మద్ ఖాద్రీ (62 నాటౌట్), అనూప్ పాయ్ (52), డానీ డెరిక్ ప్రిన్స్ (51) చక్కని ప్రదర్శనతో జట్టును గెలిపించారు. -
200 డ్రా చేస్తే 24 లక్షలు వచ్చాయి
హైదరాబాద్: లక్షల రూపాయిలు చేతి దాకా వచ్చినా ఆ డబ్బు తమది కాదంటూ పోలీసులకు అప్పగించారు ముగ్గురు యువకులు. ఉద్యోగ వేటలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా నిజాయితీతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. నగరంలోని ఎస్ఆర్నగర్లో ఓ హాస్టల్లో ఉంటున్న లతీఫ్, హరిప్రసాద్, శివ దుర్గాప్రసాద్‌లు శుక్రవారం రాత్రి డబ్బులు డ్రా చేసేందుకు సమీపంలోని ఎస్బీహెచ్ ఏటీఎంకు వెళ్లారు. లతీఫ్ తన కార్డు నుంచి రూ. 200 డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా డబ్బుల ప్రవాహం పోటెత్తింది. క్యాష్డోర్ ఆటోమెటిక్‌గా తెరుచుకొని రూ. 24 లక్షలు బయటకొచ్చాయి. ఇది చూసి అవాక్కైన ఆ ముగ్గురూ వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేంత వరకు ఏటీఎం వద్దే డబ్బులకు కాపలా ఉన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఏటీఎంలో డబ్బులు పెట్టిన అధికారులు క్యాష్ డోర్‌కు లాక్ వేయడం మరిచిపోయినట్లు గుర్తించారు. యువకులు సమాచారం ఇవ్వడం వల్లే లక్షల రూపాయలు కాపాడగలిగామని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని నగర కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు అవార్డులు ఇప్పిస్తామన్నారు. నిరుద్యోగంలోనూ నిజాయితీగా .. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడే నికి చెందిన లతీఫ్ (22), మహబూబ్‌నగర్‌కు చెందిన హరిప్రసాద్ బీటెక్ గ్రాడ్యుయేట్లు. ఇక శివ దుర్గాప్రసాద్ సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ముగ్గురూ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. అక్కడే స్నేహితులయ్యారు. లతీఫ్, హరిప్రసాద్‌ల తండ్రులిద్దరూ టీచర్లు. శివ దుర్గాప్రసాద్ కుటుంబం మహబూబ్‌నగర్‌లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాలనే తపనతో ఈ ముగ్గురు చదువుకుంటూనే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏటీఎం సెంటర్లో లక్షల రూపాయలు కనిపించి, తీసుకునేందుకు అవకాశాలున్నా నిజాయతీతో మెలిగారు. తాము చేసిన పనికి పోలీసులు, స్థానికులు అభినందిస్తుంటే అదే కోట్ల రూపాయలు సంపాదించినంత ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. -
ఎస్బీహెచ్లో చోరీకి విఫలయత్నం
- కిటికిలోంచి దూరి బ్యాంక్‌లోకి.. - పగలని లాకర్.. జరగని నష్టం వాంకిడి : మండల కేంద్రంలోని ఎస్బీహెచ్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు ప్రహరీ దూకి కిటికీ అద్దాలు పగులగొట్టి ఉండడంతో కిటికీ ద్వారా లోనికి వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకులో గల అల్మారా, లాకర్ గది తాలాలు పగులగొట్టి లాకర్ గదిలోని దూరి లాకర్ పగులగొట్టడానికి యత్నించిన పగులకపోవడంతో చోరీకి విఫలయత్నం జరిగింది. కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, ఆసిఫాబాద్ సీఐ వెంకటేశ్, వాంకిడి సీఐ మోహన్‌రావు కథనం ప్రకారం.. శనివారం బ్యాంకు వేళ అనంతరం సిబ్బంది తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం సెలవు దినం. సోమవారం ఉదయం బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసే విజయ్ బ్యాంకు గేటు తాళం తీసి లోనికి వెళ్లాడు. లోపల గల లాకర్, రికార్డులు పెట్టె అల్మారాల తాళాలు పగిలి కింద పడి ఉండడంతో బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించాడు. దాంతో బ్యాంకు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్బీహెచ్ నుంచి కొత్త డిపాజిట్ పథకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎస్బీహెచ్ వృద్ధి’ పేరుతో 275 రోజుల డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొమ్మిది శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న ఈ డిపాజిట్ పథకంపై రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. డిపాజిట్ చేసిన 7 రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీలు ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ డిపాజిట్లో కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ.10,000, గరిష్ట ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ.99.99 లక్షలుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 2న ప్రారంభమయ్యే ఈ పరిమిత కాల డిపాజిట్ పథకం అక్టోబర్ 31తో ముగుస్తుంది. ఏడాదిలోపు కాలపరిమితిగల డిపాజిట్లకు సంబంధించి ఎస్బీహెచ్ ఈ తాజా డిపాజిట్ పథకం కింద అధిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. -
కేంబ్రిడ్జ్ ఎలెవన్ 154 ఆలౌట్
నిప్పులు చెరిగిన ఖాద్రీ ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎస్బీహెచ్ బౌలర్లు సమష్టిగా విజృంభించడంతో కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా చేతులెత్తేశారు. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో గురువారం రెండో రోజు ఆటలో కేంబ్రిడ్జ్ తొలి ఇన్నింగ్స్‌లో 49.3 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. మీర్ జావిద్ అలీ (75 బంతుల్లో 60, 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఎస్బీహెచ్ బౌలర్లలో అహ్మద్ ఖాద్రీ (3/7) నిప్పులు చెరిగాడు. ఆకాశ్ భండారి, అశ్విన్ యాదవ్, రవికిరణ్ తలా 2 వికెట్లు తీశారు. దీంతో ఎస్‌బీహెచ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత ఫాలోఆన్ ఆడిన కేంబ్రిడ్జ్ జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు ఆడి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. అంతకుముందు 290/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఎస్బీహెచ్ 74 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అర్ధసెంచరీలు చేసిన ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఖాద్రీ (66), ఆకాశ్ భండారి (58) త్వరగా ఔటైనప్పటికీ కేఎస్కే చైతన్య 37 పరుగులు చేశాడు. కేంబ్రిడ్జ్ బౌలర్ తనయ్ త్యాగరాజన్ 4 వికెట్లు తీశాడు. రెండో రోజూ వర్షార్పణం ఆంధ్రాబ్యాంక్, దక్షిణ మధ్య రైల్వే జట్ల మధ్య రెండో రోజు ఆట కూడా వర్షం వల్ల పూర్తిగా రద్దయింది. మైదానం ఆటకు ప్రతికూలంగా ఉండటంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈఎంసీసీ, ఫలక్‌నుమా జట్ల మధ్య రెండో రోజు ఆటసాగలేదు. తొలి రోజు కేవలం 32 ఓవర్లపాటు ఆట జరిగిన సంగతి తెలిసిందే. ఫలక్‌నుమా వికెట్ కోల్పోకుండా 99 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 221 (మోహిత్ మన్ 53; శబరీష్ 4/53, శివశంకర్ 2/18, రజత్ రమేశ్ 2/78), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 35/2 కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 447/3 (శాండిల్య 123, ఆరోన్ పాల్ 124 బ్యాటింగ్, వైభవ్ 75 బ్యాటింగ్) ఆర్.దయానంద్‌తో మ్యాచ్ ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 139/7 (అరుణ్ దేవా 58; అన్వర్ అహ్మద్ ఖాన్ 3/36, పాండే 2/54) ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 69/1 (మహంతి 33 బ్యాటింగ్) -
ఆంధ్రాబ్యాంక్ 166 ఆలౌట్
రవికిరణ్‌కు 4 వికెట్లు ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎస్బీహెచ్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. రవికిరణ్ (4/66), అబ్సొలెమ్ (3/32), అశ్విన్ యాదవ్ (2/23) ఆంధ్రాబ్యాంక్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 216/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 84.2 ఓవర్లలో 251 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆంధ్రాబ్యాంక్ బౌలర్లు ఖాదర్, కనిష్క్నాయుడు చెరో 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్రాబ్యాంక్ జట్టులో ఒక్క రోనాల్డ్ రోడ్రిగ్వెజ్ (31) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఎస్బీహెచ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి జట్టుకు 85 పరుగుల ఆధిక్యాన్ని అందించారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 289 (నకుల్ వర్మ 142, పెంటారావు 76; రామకృష్ణ 4/61), ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 13/0 ఆర్.దయానంద్: 105/3 (నవీన్ కుమార్ 53; సుధాకర్ 2/28), దక్షిణ మధ్య రైల్వే జట్టుతో మ్యాచ్ ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 116, డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 276/9 (సి.వి. మిలింద్ 68, అక్షత్ రెడ్డి 60; చాంద్‌పాషా 6/99) చైతన్యకృష్ణ సెంచరీ ఈఎంసీసీతో జరుగుతున్న మ్యాచ్‌లో కాంటినెంటల్ బ్యాట్స్‌మన్ చైతన్యకృష్ణ (147 బంతుల్లో 125, 23 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కడంతో జట్టుకు 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈఎంసీసీ 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఆలౌటైంది. వంశీవర్ధన్ వీరవిహారం వంశీవర్ధన్ రెడ్డి (319 బంతుల్లో 163 బ్యాటింగ్, 22 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహన్ యాదవ్ (260 బంతుల్లో 101, 13 ఫోర్లు) శతకాలు సాధించడంతో హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 355 పరుగులు చేసింది. బీడీఎల్‌పై ఇప్పటికే 213 పరుగుల ఆధిక్యంలో నిలిచిన జట్టుకు ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. బీడీఎల్ తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులకే ఆలౌటైంది. -
గ్రేటర్ బాస్‌కు కోపమొచ్చింది
ఈఎస్ఐ నిధులు తెచ్చిన తంటా ఎస్బీహెచ్ అధికారుల తీరుపై గుర్రు చెప్పకుండానే మా నిధులు మళ్లిస్తారా? హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ కాళ్లబేరానికి వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్న సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ కమిషనర్‌కు ఒక్కసారిగా కోపమొచ్చింది. తమ కార్యాలయ ఆవరణలోని ఎస్బీహెచ్ శాఖ అధికారుల తీరుతో చిర్రెత్తిపోయారు. తమకు తెలియకుండా తమ నిధులను ఈఎస్ఐకి ఎలా మళ్లిస్తారంటూ మండిపడ్డారు. పక్కనే ఉంటూ తమను ఖాతరు చేయకుండా రూ.2 కోట్లను ఎలా బదిలీ చేశారంటూ ఏకంగా హైకోర్టుకెక్కారు. తప్పును తెలుసుకున్న బ్యాంకు అధికారులు కాళ్లబేరానికి వచ్చినా ససేమిరా అంటూ... తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే దిశగా సాగుతున్నారు. వివరాలు ఇలా.. జీహెచ్ఎంసీ కార్మికులకు చెందిన నిధుల (2010 సంవత్సరానివి) చెల్లింపులో జాప్యం జరిగిందంటూ ఈఎస్ఐ అధికారులు గత జనవరిలో జీహెచ్ఎంసీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈఎస్ఐ చెల్లింపుల్లో జాప్యం జరిగితే సదరు సంస్థ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే అధికారం ఈఎస్ఐకి ఉంది. అయితే ఇది ప్రైవేటు సంస్థలకు వర్తిస్తుంది తప్ప జీహెచ్ఎంసీకి వర్తించద ని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెబుతున్నారు. ఈఎస్ఐకి చెల్లించాల్సిన నిధుల్లో జాప్యానికి సంబంధించి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తే.. సదరు సంస్థ కోర్టు ద్వారా తిరిగి ఖాతాల పునరుద్ధరణకు ప్రయత్నం చేస్తుంది. లేదా నిధులు చెల్లిస్తుంది. జీహెచ్ఎంసీ కొన్ని సర్కిళ్ల పరిధిలో ఈఎస్ఐ చెల్లింపుల్లో జాప్యం జరిగిందంటూ ఈఎస్ఐ అధికారులు జీహెచ్ఎంసీ ఖాతా ఉన్న ట్యాంక్‌బండ్ శాఖ(ఇది జీహెచ్ఎంసీ కార్యాలయ ఆవరణలోనే ఉంది) అధికారులను సంప్రదించారు. సదరు బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే ఈనెల 2న సదరు బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసరావు ఈఎస్ఐకి రూ. 2కోట్ల పే ఆర్డర్ ఇచ్చారు. సదరు చెల్లింపులు జరిపినట్టు మరుసటి రోజు బ్యాంకు అధికారులు జీహెచ్ఎంసీ ఆర్థిక విభాగానికి తెలియజేశారు. ఆ విభాగం అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన కమిషనర్ తమ సొమ్మును తమకు తెలియకుండా ఇతరులకు ఎలా చెల్లిస్తారంటూ మండిపడ్డారు. ‘బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్’ అంటూ ఎస్బీహెచ్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దాంతో బ్యాంకు ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులతో గురువారం రాత్రి కమిషనర్ వద్దకు చేరుకున్నారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. అందుకు శాంతించని కమిషనర్ శుక్రవారంలోగా తమ సొమ్ము తిరిగి తమకు చేరాలన్నారు. లేనిపక్షంలో క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, జరిగిన విషయాన్ని వివరిస్తూ శుక్రవారం లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఈఎస్ఐకి జారీ అయిన సదరు ‘పే ఆర్డర్’ చెల్లింపులు నిలివేయాల్సిందిగా ఆదేశిస్తూ మూడు వారాల వరకు స్టే ఇచ్చింది. ఎస్బీహెచ్ అధికారులు కమిషనర్‌తో కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ ఆవరణలోనే బ్యాంకు శాఖ ఉన్నా తమ దృష్టికి తేకుండానే సొమ్మును బదిలీ చేయడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. జీహెచ్ఎంసీ గౌరవానికి భంగం కలిగించిన ఎస్బీహెచ్ అధికారుల తీరును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కార్యాలయ ఆవరణలోని ఈ బ్యాంక్ శాఖను తరలించే యోచనతోపాటు.. తమ డిపాజిట్లను అక్కడి నుంచి వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. సదరు బ్యాంక్‌లో జీహెచ్ఎంసీకి చెందిన దాదాపు రూ.వెయ్యికోట్లకు పైగా డిపాజిట్లున్నాయి. మరో రూ.200 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ అవసరాల కోసమే ఆవరణలోనే బ్యాంకు బ్రాంచీని ఏర్పాటు చేశారు. ఇతర ఖాతాదారులు స్వల్పంగానే ఉంటారు. గ్రేటర్ కమిషనర్ నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. -
ఎస్‌బీెహచ్ స్వాభిమాన్ డిపాజిట్ పథకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ‘స్వాభిమాన్’ పేరుతో కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అధిక వడ్డీరేటుతో పాటు, వడ్డీని తిరిగి ఇన్వెస్ట్ చేయడం లేదా వెనక్కి తీసుకునే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ఎస్బీహెచ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఐదేళ్ల కాలపరిమితి గల ఈ డిపాజిట్ పథకంపై 9% వడ్డీరేటును ఎస్బీహెచ్ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఇదే కాలానికి ఎస్బీహెచ్ ఇస్తున్న వడ్డీరేటు 8.75తో పోలిస్తే పావు శాతం అధిక వడ్డీని అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకైతే 9.30 శాతం వడ్డీని స్వాభిమాన్ ఇస్తోంది. ఈ డిపాజిట్ పథకంపై వచ్చే వడ్డీని ప్రతీ నెలా/ 3 నెలలు/ఏడాదికి ఒకసారి తీసుకోవచ్చు లేదా అందులోనే తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ పథకంలో కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ. లక్షగా నిర్ణయించారు. ఆపైన రూ.10,000 గుణిజాల్లో గరిష్టంగా రూ. కోటి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన 7 రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీలు లేకపోవడం ఈ డిపాజిట్ పథకంలోని మరో ఆకర్షణ. ఇలా వైదొలిగిన వారికి ఆ.. కాలపరిమితిని బట్టి వడ్డీరేటు నిర్ణయించడం జరుగుతుంది. -
సివిల్ సాధ్యమే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ప్రకటన విడుదలైంది. మీరూ ఐఏఎస్, ఐపీఎస్ కావొచ్చు. నిండైన ఆత్మవిశ్వాసం, సాధించగలమనే తపన, ఓటమికి బెదరని వ్యక్తిత్వం, పరిపూర్ణ విషయ పరిజ్ఞానం ఉంటే లక్ష్య సాధన పెద్ద సమస్యే కాదంటున్నారు సివిల్స్‌లో విజయం సాధించిన పలువురు. మరి ఎందుకాలస్యం.. దరఖాస్తు నింపేయండి.. పరీక్షకు సిద్ధం కండి.. కొలువు కొట్టేయండి.. యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహణ జాతీయస్థాయిలో హోదాపరంగా ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి 20కిపైగా సర్వీసుల్లో నియామకానికి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రకటన మే 31న వెలువడింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 30. ఆగస్టు 24న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ఎస్బీఐ శాఖలో రూ.100 ఫీజు చెల్లించాలి లేదా ఎస్బీh/ఎస్బీఐ గ్రూప్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్)ల్లో నెట్ బ్యాంకింగ్ /డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఫీజు చెల్లించొచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ ఏడాది మొత్తం పోస్టుల సంఖ్య 1291. అర్హతలివీ.. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు అర్హులు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. వీరు మెయిన్స్ నాటికి తమ ఉత్తీర్ణతా సర్టిఫికెట్లు చూపాలి. వివిధ యూనివర్సిటీలు దూరవిద్యా విధానం ద్వారా అందించే బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైనవారు సివిల్స్ రాసేందుకు అర్హులే. అయితే ఆ కోర్సుకు సంబంధిత అధీకృత సంస్థల (యూజీసీ/డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో/ఏఐసీటీఈ తదితర) గుర్తింపు ఉండాలి. వయోపరిమితి నిబంధన కూడా ఉంది. ఆగస్టు 1, 2014 నాటికి అన్ని వర్గాల అభ్యర్థులకు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు.. ఓబీసీలకు 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏళ్లు. అంధులు, బధిరులు, శారీరక వికలాంగులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు. ఎన్నిసార్లు రాయొచ్చు.. గతేడాది వరకు సివిల్స్ పరీక్షలను జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు మాత్రమే రాసుకునే వీలుండేది. ఈ ఏడాది నుంచి దాన్ని ఆరుసార్లకు పెంచారు. ఓబీసీలకు ఇప్పటివరకు ఏడుసార్లు సివిల్స్ రాసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి తొమ్మిదిసార్లు రాసుకునే వీలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్ (అంధ, బధిర, వికలాంగులు) గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన పీహెచ్ అభ్యర్థులు తొమ్మిదిసార్లు మాత్రమే రాసుకునే వీలుంది. దరఖాస్తు చేయండిలా.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఠీఠీఠీ.ఠఞటఛిౌజ్ఛీ.జీఛి.జీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ‘ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ’ అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్, చివరి తేదీ, పార్ట్-1, పార్ట్-2 రిజిస్ట్రేషన్స్ కనిపిస్తాయి. ముందుగా పార్ ్ట-1 రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, జాతీయత, వివాహ స్థితి, విద్యార్హతలు, చిరునామా వంటివి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పూర్తి చేయాలి. మీ పేరు, పుట్టిన తేదీ పదోతరగతి సర్టిఫికెట్లో ఎలా ఉందో అలానే రాయాలి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మరిన్ని వివరాలు వస్తాయి. వీటిని కూడా పూర్తి చేస్తే పార్ట్-1 రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ వివరాలు అన్నీ సరిచూసుకున్నాక ‘యూ అగ్రి’ బటన్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ, పుట్టిన తేదీతో పార్ట్-2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ముందుగా నిర్దేశించిన సైజ్‌లో మీ ఫొటో, సంతకం స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫొటో, సంతకం అప్లోడ్ చేశాక మిగిలిన వివరాలు నింపాలి. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేసే పోస్టులివీ.. 1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2. ఇండియన్ ఫారెన్ సర్వీస్ 3. ఇండియన్ పోలీస్ సర్వీస్ 4. ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్- గ్రూప్-ఏ 5. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ - గ్రూప్-ఏ 6. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)- గ్రూప్-ఏ 7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ 8. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్-ఏ 9. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, గ్రూప్-ఏ (అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్) 10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్-ఏ 1 1. ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ 12. ఇండియన్ ైరె ల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్-ఏ 13. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఏ 14. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ - గ్రూప్-ఏ 15. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ - గ్రూప్-ఏ 16. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్-ఏ 17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్), గ్రూప్-ఏ 18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్-ఏ, (గ్రేడ్-3) 19. ఇండియన్ కా్ఘూరేట్ లా సర్వీస్, గ్రూప్-ఏ, 20. ఆర్మ్డ్ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, (సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్) 21. ఢిల్లీ, అండమాన్-నికోబార్ ఐస్లాండ్స్, లక్షద్వీప్, డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలి సివిల్ సర్వీస్-గ్రూప్-బి 22. ఢిల్లీ, అండమాన్-నికోబార్, లక్షద్వీప్, డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్-గ్రూప్-బి 23. పాండిచ్చేరి సివిల్ సర్వీస్ - గ్రూప్-బి పరీక్షలు ఇలా... సివిల్స్ ఎంపిక మూడు దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు, పేపర్-2లో 85 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత విధిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు). ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్ష ఇలా.. మెయిన్సలో ఆప్షనల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పరీక్ష వ్యవధి మూడు గంటలు. అభ్యర్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ఆప్షనల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నలో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రశ్నలు కూడా పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. సివిల్స్ సాధనలో కోచింగ్ పాత్ర కీలకం.మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. పలువురు అభ్యర్థులు ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లలో సైతం శిక్షణ తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ప్రధాన కోచింగ్ సెంటర్లలో లక్ష రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో లక్షన్నర రూపాయల వరకు ఉంటుంది. కోచింగ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు శిక్షణనిస్తారు. కోచింగ్ వ్యవధి దాదాపు పది నెలలు. హాస్టల్ వసతి, భోజన ఖర్చుల కింద నెలకు మరో రూ.5000 వ రకు అవుతాయి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం. సివిల్స్‌లో ఇంటర్వ్యూ కీలకమైన ఘట్టం. ఇందులో నిజాయతీగా ఉండాలి. తెలియని విషయాలను తెలియదని చెప్పాలి. ఎక్కువ శాతం ప్రశ్నలు వర్తమాన వ్యవహారాలపై అడుగుతారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మెయిన్స్ : అందుబాటులో ఉన్న పోస్టుల్లో.. ఒక్కో పోస్టుకు 12 లేదా 13 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్ల (ఇంగ్లిష్ మినహాయించి)ను తెలుగు మాధ్యమంలో కూడా రాసుకోవచ్చు. ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ కన్వెన్షనల్ (వ్యాస రూప) విధానంలో ఉంటాయి. ఇందులో 300 మార్కులకు పేపర్-ఏ ఉంటుంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సంబంధిత మాతృభాషల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్-బి : ఇంగ్లిష్ (300 మార్కులు). ఇంగ్లిష్‌లో అభ్యర్థికి సాధారణ పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. పేపర్-ఏ, పేపర్-బి రెండు పదో తరగతి/మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉంటాయి. వీటి మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే అభ్యర్థులు పేపర్-ఏలో 30 శాతం, పేపర్-బిలో 25 శాతం మార్కులు సాధించాలి. మౌఖిక పరీక్ష: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పోస్టుకు ఇద్దరు చొప్పున మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపిక అవుతామనే నమ్మకం ఉండాలి.. డాక్టర్ గజరావు భూపాల్, జిల్లా ఎస్పీ ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యేవారు ఒక ప్రణాళిక రూపొందించుకొని చదవాలని సూచిస్తున్నారు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్. సివిల్స్‌కు ప్రిపేర్‌పై ఆయన ఏమంటున్నారంటే.. నేను వారం రోజుల ప్రణాళికను ముందే తయారు చేసుకుని చదివాను. ఇతరులకు ఏదో సబ్జెక్టులో ఎక్కువ మార్కులువచ్చాయని ఆ సబ్జెక్టును చదవకుండా.. మనము దేనినైతే ఎక్కువగా ఇష్టాపడుతామో అదే సబ్జెక్టు చదవాలి. ముఖ్యంగా ఐపీఎస్‌కు ఎంపిక అవుతాననే నమ్మకం అందరిలోనూ ఉండాలి. చదివే సమయంలో అలసటగా ఉన్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో మంచి వాతావరణంలో గడుపుతూ స్నేహితులతో ఉండేలా ప్రయత్నించాలి. నేను ఏ వృత్తిలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా చదువుకున్నాను. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అమ్మానాన్నలు అనురాధ, సీతారామస్వామి ఇద్దరూ వైద్యులే. డిగ్రీ వరకు కాకినాడలోనే చదువుకున్నాను. మెడికల్ విద్య అభ్యసించాను. 2006లో ఐపీఎస్ కోసం ఢిల్లీలోని వాజిరాం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. శిక్షణ సమయంలో ఒకసారి ఐపీఎస్ రాసినా ఎంపిక కాలేదు. శిక్షణ ముగిసిన అనంతరం 2007లో కాకినాడలోని శంకవరం పీహెచ్సీలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేశాను. అక్కడ విధులు నిర్వర్తిస్తూనే మళ్లీ ఐపీఎస్‌కు సిద్ధమయ్యాను. 2008లో ఎంపికయ్యాను. వైద్యుడిగా కాకుండా ఏ వృత్తిలోనైనా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించాను. శిక్షణ అనంతరం 2010-13 వరకు భద్రచలం ఏఎస్పీగా, 2013-అక్టోబర్ వరకు మెదక్ అడిషనల్ ఎస్పీగా, ఆ తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా పదోన్నతిపై వచ్చాను. మొదటి నుంచీ నేను ఐపీఎస్ కావాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సంతోష పడ్డాను. వైద్యునిగా రోగులకు, ఎస్పీగా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. - ఆదిలాబాద్ క్రైం వారి ప్రోత్సాహం మరువలేనిది.. జోయేల్ డేవిస్, ఆదిలాబాద్ ఏఎస్పీ ఎలాగైనా ఐపీఎస్‌కు ఎంపికవుతాననే లక్ష్యంతో చదవాలి. అప్పుడే మన ఆశయం నెరవేరుతుంది. నేను ఐపీఎస్ అయ్యేందుకు ఎంతో కష్టపడ్డాను. మాది తమిళనాడు రాష్ట్రం, జిల్లా కన్యాకుమారి గ్రామం కొట్టికోడు. వ్యవసాయ కుంటుంబం. మా అమ్మానాన్నలు డేవిడ్సన్, రీబీలు నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. అప్పులు చేసి మరీ నన్ను ఐపీఎస్ చదివించారు. డిగ్రీ వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. డిగ్రీ చదివే సమయంలో ఉదయం, మధ్యాహ్నం మాకున్న అరటితోటలో నావంతుగా పనిచేసేవాన్ని. డిగ్రీ తర్వాత 8 నెలలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. అసలు నేను ఐపీఎస్ చదువుతానని అనుకోలేదు. అప్పటి వరకు మా గ్రామానికే పరిమితమైన నన్ను మా బావ డిస్పన్రాయ్ (ప్రధానోపాధ్యాయుడు) ఐపీఎస్ చదివేంచేందుకు సహాయపడ్డారు. ఆ తర్వాత చెన్నైలో మా అక్కాబావ ఇంట్లో ఉండి ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. చెన్నైలోని అకాడమిక్ ప్రభా ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. 8 గంటలు నిర్విరామంగా చదివేవాన్ని. ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా నా చదువుకు ఆటంకం రావొద్దని మా కుటుంబ సభ్యులు ఆ విషయం నాకు తెలియనీయకుండా దాచేవారు. అప్పు చేస్తూ చదివిస్తున్నారనే విషయం కూడా నాకు తెలీదు. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఐపీఎస్ అవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాను. 2010లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. ఐపీఎస్‌కు ఎంపిక కావడంపై మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వలేదనే సంతోషం కూడా నాలో కలిగింది. ఒక అర్థవంతమైన జీవితం లభించిందనుకున్నాను. నన్ను ప్రోత్సహించిన మా నాన్న, బావ, మా కోచింగ్ సెంటర్ డెరైక్టర్ ప్రభాకర్‌లో ప్రోత్సాహం చాలా వరకు ఉంది. మొదటగా వరంగల్‌లోని జనగంలో ఏఎస్పీగా, ఆ తర్వాత ఉట్నూర్, ఆదిలాబాద్ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాను. - ఆదిలాబాద్ క్రైం సివిల్ సర్వీసెస్ స్పెషల్ వెబ్ పోర్టల్ కోసం.. www.sakshieducation.com లాగిన్ అవ్వండి.. -
ఎస్బీహెచ్ భారీ స్కోరు
సాక్షి, హైదరాబాద్: ‘ఎ’ డివిజన్ మూడు రోజుల సూపర్ లీగ్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) బ్యాట్స్‌మెన్ కదంతొక్కారు. దీంతో ఎన్స్కాన్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్బీహెచ్ జట్టు భారీస్కోరు సాధించింది. మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్బీహెచ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89.5 ఓవర్లలో 6 వికెట్లకు 411 పరుగులు చేసింది. ఏకంగా ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు సాధించారు. సుమన్ (77), అనూప్ పాయ్ (86), అనిరుధ్ సింగ్ (86), అహ్మద్ ఖాద్రీ (51), సుమంత్ (68 బ్యాటింగ్) అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఎన్స్‌కాన్స్ బౌలర్లలో మెహదీ హసన్ 117 పరుగులిచ్చి 5 వికెట్లు పటగొట్టాడు. -
ఎస్బీహెచ్ 110 వారాల డిపాజిట్ స్కీమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) అధిక వడ్డీ, లిక్విడిటీతో కూడిన కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 110 వారాల కాలపరిమితి ఉండే ఈ డిపాజిట్‌పై 9.11 శాతం వడ్డీని, అదే సీనియర్ సిటిజన్స్ అయితే 9.41 శాతం వడ్డీని ఎస్బీహెచ్ ఆఫర్ చేస్తోంది. డిపాజిట్ చేసిన ఏడు రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందుగానే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీ లేకపోవడం ఈ డిపాజిట్ పథకంలోని ప్రధాన ఆకర్షణ. మార్చి 10 నుంచి ప్రారంభమైన ఈ డిపాజిట్ పథకం ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని ఎస్బీహెచ్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.99 లక్షలు వరకూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. -
ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీయత్నం
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్ :ఖమ్మంనగరంలోని బైపార్ రోడ్డులో ఉన్న బ్యాంక్ కాలనీ ఎస్బీహెచ్ ఏటీఎంలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి చోరీ చేసేందుకు యత్నించాడు. ఏటీఎం మెషిన్ డోర్ తెరుచుకోకపోవడంతో దానిని ధ్వంసం చేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఏటీఎంలో కారం చల్లి వెళ్లాడు. పోలీసుల కథ నం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంనగరంలోని బైపాస్‌రోడ్డులో బ్యాంకు కాలనీ ఎస్‌బీహెచ్‌కు చెందిన ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంకు శ్రీనివాసరావు అనే వ్యక్తి షాపు అద్దెకు ఇచ్చాడు. సోమవారం ఉదయం అతను అందులోకి వెళ్లి చూడగా ఏటీఎం మెషిన్ పగులగొట్టడంతో పాటు కారం చల్లి ఉంది. దీంతో అతను వెంటనే ఏటీఎంలో నగదు పెట్టే రైటర్ సేఫ్ గార్డు కంపెనీ జిల్లా అధికారి పుంపాని రాజశేఖరరెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన ముంబైలోని టాటా కమ్యూనికేషన్ ఆఫ్ పేమెంట్ సొల్యుషన్ ఇన్చార్జ్కు సమాచారం అందించారు. స్థానికులు టూటౌన్ సీఐ సారంగపాణికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ విచారణ చేపట్టి క్లూస్ టీంను పిలిపిం చారు. అలాగే టాటా కమ్యూనికేషన్ ఆఫ్ పేమెంట్ సొల్యుషన్ సిబ్బందిని, రైటర్ సేఫ్ గార్డు సిబ్బందిని పిలిపించి వి చారణ చేపట్టారు. ఈ ఏటీఎంలో రెండు రోజుల క్రితమే రూ. 18 లక్షల నగదు పెట్టినట్లు వారు సీఐకి తెలిపారు. ఏటీఎంలో కారంపొడి చల్లడం, సీసీ కెమేరా వైర్లు కట్ చేయడం తో నిందితుడి వివరాలు తెలియరాలేదు. దీంతో పోలీసులు సీసీ కెమేరా హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ధ్వంసమైన ఏటీఎం మెషిన్ ఖరీదు సుమారు రూ.1.70లక్షల ఉం టుందని పోలీసులు తెలిపారు. టాటా కమ్యూనికేషన్ ఆఫ్ పేమెంట్ సొల్యుషన్ సంస్థ జిల్లా ఇన్చార్జ్ హర్షవర్ధన్ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పని చేయని సీసీ కెమేరాలు...... ఈ ఏటీఎంలోని సీసీ కెమేరాలో గత ఏడాది డిసెంబర్ వరకు మాత్రమే వివరాలు నమోదయ్యాయని, రెండు నెలల నుంచి అవి పని చేయడం లేదని తెలుస్తోంది. సీసీ కెమేరా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే హార్డ్ డిస్క్‌లోని డేటా మొత్తం పోయే అవకాశం ఉంది. కానీ టాటా కంపెనీ సిబ్బంది మాత్రం ఒక్కనెల డేటా మాత్రమే పోయిందని చెబుతుండడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 2014 నుంచి సీసీ కెమెరా పని చేయడం లేదని తెలుస్తోంది. సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చాం : టూటౌన్ సీఐ సారంగపాణి బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన నోటీసులు జారీ చేశారు. సీసీ కెమెరా స్టోరేజీ పెంచుకోవాలని, నిత్యం పని చేసే విధంగా చూడాలని, ప్రతీ రోజు సెక్యురిటీ గార్డులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేశారు. కానీ ఇంత వరకు ఎవరూ స్పందించలేదు. -
ఎస్ఎస్ఎస్ స్కీం గడువు పెంచిన ఎస్బీహెచ్
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జీతం ఆదాయంగా ఉన్న వారి కోసం ప్రవేశపెట్టిన ఎస్బీహెచ్ స్మార్ట్ శాలరీ (ఎస్ఎస్ఎస్) ఖాతాల ప్రచార కార్యక్రమాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంస్థలకు, ఉద్యోగికి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన ఎస్ఎస్ఎస్ ఖాతాల ద్వారా రెండు లక్షలమందికిపైగా ప్రయోజనాలను పొందుతున్నట్లు ఎస్బీహెచ్ తెలిపింది. జీరో బ్యాలెన్స్, ఖాతాలో రూ.10,000 కంటే ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా అధిక వడ్డీ లభించే విధంగా డిపాజిట్ రూపంలోకి మారిపోవడం, ఉచిత మొబైల్ బ్యాంకింగ్, డిమాండ్ డ్రాఫ్ట్ సర్వీసులు, అధిక నగదు విత్‌డ్రాయల్ సౌకర్యాలను ఎస్ఎస్ఎస్ ఖాతాదారులకు అందిస్తోంది. ఈ ప్రచార సమయంలో ఖాతాలు ప్రారంభించిన వారికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని ఎస్బీహెచ్ ఆఫర్ చేస్తోంది. -
బేస్ రేటుకే ఎస్బీహెచ్ గృహ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ‘అప్నా ఘర్, అప్నా కార్’ పేరుతో పరిమిత కాలానికి ఈ తగ్గింపు రేట్లను అందిస్తున్నట్లు ఎస్బీహెచ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రూ.75 లక్షల లోపు గృహరుణాలను బేస్ రేటు 10.20 శాతం వడ్డీకే ఇస్తుండగా, ఆ పై మొత్తం రుణాలకు 10.30% వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రోజువారీ తగ్గింపు విధానంలో వడ్డీని లెక్కించడం జరుగుతుందని, లక్ష రూపాయల రుణాన్ని 30 ఏళ్లకు తీసుకుంటే నెలకు రూ. 892 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. గృహ రుణాల ప్రాసెసింగ్ ఫీజుపై 75 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. అలాగే కార్ లోన్స్‌పై వడ్డీరేట్లను 10.60 శాతం నుంచి 10.40 శాతానికి తగ్గించామని, గరిష్టంగా రూ.1,000 వరకు ప్రోసెసింగ్ ఫీజులో మినహాయింపు ఇస్తున్నట్లు ఎస్బీహెచ్ పేర్కొంది. ఈ రేట్లు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. -
షార్ట్‌సర్క్యూట్‌తో ఎస్బీహెచ్ బ్యాంక్ దగ్ధం
నర్సంపేట, న్యూస్‌లైన్ : షార్ట సర్క్యూట్‌తో ఎస్బీహెచ్ బ్యాంక్ దగ్ధమైన సంఘటన పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మేనేజర్ అవుర్కువూర్ కథనం ప్రకారం.. బ్యాంక్ పునఃనిర్మాణంలో భా గంగా ఇటీవల కార్యాలయంలో రెండు నూతన గదుల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇందులో ఒక గది ఇటీవల పూర్తి కావడంతో పాత గదుల్లో ఉన్న రికార్డులను తీసి సిబ్బంది అందులో భద్రపర్చారు. ఈ క్రమంలో రెండో గదిలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా ప్రవూదవశాత్తు తెల్లవారుజామున 3 గంటలకు విద్యుత్ వైర్లు షార్ట్‌సర్క్యూట్‌కు గురయ్యాయి. గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్‌స్టేషన్‌కు సవూచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వుంటలు ఆర్పే ప్రయుత్నం చేసినప్పటికీ గదిలో ఉన్న రికార్డులు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. కాగా, ఈ సంఘటనలో భవనం ధ్వంసమై సువూరు 30 లక్షల నష్టం జరిగినట్లు మేనేజర్ పేర్కొన్నారు. ఖాతాదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, బ్యాంక్‌లో పనులు కార్యకలాపాలు యుథావిధిగా కొనసాగుతాయుని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలాన్ని ఎస్బీహెచ్ డీజీఎం వూర్చ్ ఫుటీ, ఏజీఎం పటేల్, డీఎస్పీ కడియుం చక్రవర్తి, టౌన్ సీఐ వాసుదేవరావు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.