ఎస్‌ఎస్‌ఎస్ స్కీం గడువు పెంచిన ఎస్‌బీహెచ్ | SBH the deadline increase of sss scheme | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఎస్ స్కీం గడువు పెంచిన ఎస్‌బీహెచ్

Published Sun, Feb 9 2014 3:00 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM

ఎస్‌ఎస్‌ఎస్ స్కీం గడువు పెంచిన ఎస్‌బీహెచ్ - Sakshi

ఎస్‌ఎస్‌ఎస్ స్కీం గడువు పెంచిన ఎస్‌బీహెచ్

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జీతం ఆదాయంగా ఉన్న వారి కోసం ప్రవేశపెట్టిన ఎస్‌బీహెచ్ స్మార్ట్ శాలరీ (ఎస్‌ఎస్‌ఎస్) ఖాతాల ప్రచార కార్యక్రమాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంస్థలకు, ఉద్యోగికి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన ఎస్‌ఎస్‌ఎస్ ఖాతాల ద్వారా రెండు లక్షలమందికిపైగా ప్రయోజనాలను పొందుతున్నట్లు ఎస్‌బీహెచ్ తెలిపింది.

 జీరో బ్యాలెన్స్, ఖాతాలో రూ.10,000 కంటే ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా అధిక వడ్డీ లభించే విధంగా డిపాజిట్ రూపంలోకి మారిపోవడం, ఉచిత మొబైల్ బ్యాంకింగ్, డిమాండ్ డ్రాఫ్ట్ సర్వీసులు, అధిక నగదు విత్‌డ్రాయల్ సౌకర్యాలను ఎస్‌ఎస్‌ఎస్ ఖాతాదారులకు అందిస్తోంది. ఈ ప్రచార సమయంలో ఖాతాలు ప్రారంభించిన వారికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని ఎస్‌బీహెచ్ ఆఫర్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement