ఎస్‌బీెహచ్ స్వాభిమాన్ డిపాజిట్ పథకం | sbi introduces swabhiman scheme | Sakshi
Sakshi News home page

ఎస్‌బీెహ చ్ స్వాభిమాన్ డిపాజిట్ పథకం

Published Tue, Jul 1 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

ఎస్‌బీెహచ్ స్వాభిమాన్ డిపాజిట్ పథకం

ఎస్‌బీెహచ్ స్వాభిమాన్ డిపాజిట్ పథకం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ‘స్వాభిమాన్’ పేరుతో కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అధిక వడ్డీరేటుతో పాటు, వడ్డీని తిరిగి ఇన్వెస్ట్ చేయడం లేదా వెనక్కి తీసుకునే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ఎస్‌బీహెచ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఐదేళ్ల కాలపరిమితి గల ఈ డిపాజిట్ పథకంపై 9% వడ్డీరేటును ఎస్‌బీహెచ్ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఇదే కాలానికి ఎస్‌బీహెచ్ ఇస్తున్న వడ్డీరేటు 8.75తో పోలిస్తే పావు శాతం అధిక వడ్డీని అందిస్తోంది.

అదే సీనియర్ సిటిజన్లకైతే 9.30 శాతం వడ్డీని స్వాభిమాన్ ఇస్తోంది. ఈ డిపాజిట్ పథకంపై వచ్చే వడ్డీని ప్రతీ నెలా/ 3 నెలలు/ఏడాదికి ఒకసారి తీసుకోవచ్చు లేదా అందులోనే తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ పథకంలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రూ. లక్షగా నిర్ణయించారు. ఆపైన రూ.10,000 గుణిజాల్లో గరిష్టంగా రూ. కోటి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన 7 రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీలు లేకపోవడం ఈ డిపాజిట్ పథకంలోని మరో ఆకర్షణ. ఇలా వైదొలిగిన వారికి ఆ.. కాలపరిమితిని బట్టి వడ్డీరేటు నిర్ణయించడం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement