ఎస్‌బీహెచ్ నుంచి కొత్త డిపాజిట్ పథకం | SBH launches 275 days deposit | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్ నుంచి కొత్త డిపాజిట్ పథకం

Published Tue, Sep 2 2014 12:50 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM

ఎస్‌బీహెచ్ నుంచి కొత్త డిపాజిట్ పథకం - Sakshi

ఎస్‌బీహెచ్ నుంచి కొత్త డిపాజిట్ పథకం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎస్‌బీహెచ్ వృద్ధి’ పేరుతో 275 రోజుల డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.  తొమ్మిది శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న ఈ డిపాజిట్ పథకంపై రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. డిపాజిట్ చేసిన 7 రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీలు ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ డిపాజిట్‌లో కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రూ.10,000, గరిష్ట ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ.99.99 లక్షలుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 2న ప్రారంభమయ్యే ఈ పరిమిత కాల డిపాజిట్ పథకం అక్టోబర్ 31తో ముగుస్తుంది. ఏడాదిలోపు కాలపరిమితిగల డిపాజిట్లకు సంబంధించి ఎస్‌బీహెచ్ ఈ  తాజా డిపాజిట్ పథకం కింద అధిక వడ్డీని ఆఫర్ చేస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement