‘ఎ’ డివిజన్ మూడు రోజుల సూపర్ లీగ్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) బ్యాట్స్‌మెన్ కదంతొక్కారు. దీంతో ఎన్స్‌కాన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్‌బీహెచ్ జట్టు భారీస్కోరు సాధించింది.
సాక్షి, హైదరాబాద్: ‘ఎ’ డివిజన్ మూడు రోజుల సూపర్ లీగ్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) బ్యాట్స్‌మెన్ కదంతొక్కారు. దీంతో ఎన్స్‌కాన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్‌బీహెచ్ జట్టు భారీస్కోరు సాధించింది.
మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌బీహెచ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89.5 ఓవర్లలో 6 వికెట్లకు 411 పరుగులు చేసింది. ఏకంగా ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు సాధించారు. సుమన్ (77), అనూప్ పాయ్ (86), అనిరుధ్ సింగ్ (86), అహ్మద్ ఖాద్రీ (51), సుమంత్ (68 బ్యాటింగ్) అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఎన్స్‌కాన్స్ బౌలర్లలో మెహదీ హసన్ 117 పరుగులిచ్చి 5 వికెట్లు పటగొట్టాడు.