తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తానన్నా వినకుండా అధికారులు ఆస్తి జప్తునకు యత్నిస్తున్నారంటూ ఓ వ్యక్తి అర్థనగ్నంగా నిరసన తెలిపాడు
తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తానన్నా వినకుండా అధికారులు ఆస్తి జప్తునకు యత్నిస్తున్నారంటూ ఓ వ్యక్తి అర్థనగ్నంగా నిరసన తెలిపాడు. గన్‌ఫౌండ్రిలో ఎస్‌బీహెచ్ శాఖలో ప్రకాశ్‌నాయుడు అనే వ్యాపారి రుణం తీసుకున్నారు. రుణం చెల్లింపు ఆలస్యం కావటంతో బ్యాంకు అధికారులు అతని ఆస్తుల జప్తునకు పూనుకున్నారు. దీంతో ప్రకాశ్‌నాయుడు గురువారం మధ్యాహ్నం బ్యాంకు వద్దకు చేరుకుని షర్టు విప్పి నిరసన తెలిపారు. కాస్త గడువిస్తే రుణం చెల్లిస్తానన్నా వినకుండా అధికారులు జప్తునకు పూనుకున్నారని ఆరోపించారు.