prakash naidu
-
అనంతపూర్ లో టీడీపీ నేత రౌడీయిజం
-
చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అరెస్ట్
సాక్షి, అనంతపురం: మహిళలపై దౌర్జన్యం చేసిన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పుట్లూరు మండలం ఏ.కొండాపురం లో సోమశేఖర్ నాయుడుపై ఇటీవల హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై ప్రకాష్ నాయుడు, అతని సోదరులపై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తనపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ప్రకాశ్ నాయుడు మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పుట్లూరు పోలీసులు టీడీపీ నేత ప్రకాష్ నాయుడుపై హత్యాయత్నం, దౌర్జన్యం కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు దౌర్జన్యం..) -
అనంతపురం: చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు దౌర్జన్యం
-
టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు దౌర్జన్యం.. మహిళను పబ్లిగ్గా బూతులు తిడుతూ
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికి.. పచ్చ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదు. తాజాగా టీడీపీ నేత ఒకరు మహిళపై బెదిరింపులకు దిగారు. ఆ వివరాలు.. చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మహిళపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వీడియో ఒకటి శనివారం వెలుగులోకి వచ్చింది. (చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్) అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల సోమశేఖర్ నాయుడును కారుతో గుద్ది చంపేందుకు యత్నించారంటూ ప్రకాశ్ నాయుడి సోదరులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలో ప్రకాశ్ నాయుడు బాధితుల ఇంటికెళ్లి బెదిరించాడు. తనపైనే కేసు పెడతారా అంటూ ప్రకాశ్ నాయుడు ఓ మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెకు వార్నింగ్ ఇచ్చి పబ్లిగ్గా బూతులు తిట్టాడు ప్రకాశ్ నాయుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది. చదవండి: ‘పట్టాభి ఓ గే’.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ -
చంద్రదండు అధ్యక్షుడిపై వేధింపుల కేసు
-
‘చంద్రదండు’ అధ్యక్షుడిపై భార్య ఫిర్యాదు
సాక్షి, అనంతపురం : టీడీపీ నేత, చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుడుపై కేసు నమోదు అయింది. ప్రకాష్ నాయుడు వేధిస్తున్నారంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు ఆదివారం ఆయనపై 498, 323, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2004లో ప్రకాష్ నాయుడు చంద్రదండును ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఏపీ మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. (‘నేను పాతిన బండలనే తొలగించే దైర్యం మీకుందా’) -
‘నేను పాతిన బండలనే తొలగించే దైర్యం మీకుందా’
అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని ఆక్రమించి చుట్టూ పాతిన బండలను అధికారులు తొలగించారని చంద్రదండు నేత ప్రకాష్‌నాయుడు కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి దౌర్జన్యకాండ సాగించాడు. విధులకు భంగం కలిగించడమే కాక నోటికొచ్చినట్లు అధికారులను దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని స్టేషన్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలో మారుతీనగర్ శివారులోని కేశవరెడ్డి స్కూల్ వెనుక వైపు మున్సిపల్ ఓపెన్ స్థలాన్ని చంద్రదండు ప్రకాష్‌నాయుడు ఆక్రమించాడు. అక్కడ సెంటు స్థలం రూ.లక్షల్లో ఉంది. గతంలో కూడా ఓసారి ఆక్రమించి నర్సరీ చేపట్టాలని చూడటంతో అధికారులు స్పందించి అడ్డుకోవడంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు. ఎలాగైనా ఆ విలువైన స్థలాన్ని చేజిక్కించుకోవడానికి ఈసారి చుట్టూ బండలతో ఫెన్సింగ్ వేయించాడు. స్థలం ఆక్రమణపై ఫిర్యాదు అందుకున్న నగర పాలకసంస్థ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఏప్రిల్ 29న అక్రమంగా పాతిన బండలను తొలగించారు. లాక్డౌన్ కారణంగా కొద్దిరోజులు పట్టించుకోని ప్రకాష్‌నాయుడు నిబంధనల సడలింపుల అనంతరం శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చాడు. నేరుగా టౌన్‌ప్లానింగ్ సెక్షన్లోకి చొచ్చుకుపోయిన అతను టీపీఓ వినయ్‌ప్రసాద్‌పై నోరుపారేసుకున్నారు. ‘నేను పాతిన బండలనే తొలగించే దైర్యం మీకుందా’ అంటూ బెదిరించాడు. అధికారిని దుర్భాషలాడుతుండటంతో నగరపాలక సంస్థ సిబ్బంది మొత్తం గుమిగూడారు. దీంతో కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ హుటాహుటిన వచ్చి చంద్రదండు ప్రకాష్‌నాయుడును అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
మాట వినకుంటే.. ‘దండు’యాత్రే!
- రెచ్చిపోతున్న ‘చంద్రదండు’ - అధికారులపై తరచూ దౌర్జన్యాలు అనంతపురం న్యూసిటీ : అనంతపురంలో ‘చంద్రదండు’ నాయకులు చెలరేగిపోతున్నారు. అసలే ‘అధినేత’ పేరుతో పుట్టుకొచ్చిన ‘దండు’. ఆపై అధికార అండా ఎటూ ఉంది. ఇక తమకు అడ్డెవరన్న ధోరణితో రెచ్చిపోతున్నారు. అధికారులంటే లెక్కే లేదు. తాము చెప్పినట్లు వినకపోతే కొట్టడానికీ వెనుకాడరు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని సీఎం చంద్రబాబు తరచూ వల్లె వేస్తుంటారు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వెళ్తుంటారు. చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు తాను చెప్పినట్టు వినకపోతే ఎంతటి స్థాయి అధికారినైనా, ప్రజాప్రతినిధిని అయినా బండబూతులు తిడుతుంటాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అతని దౌర్జన్యాలు నగర పాలక సంస్థలో పెరిగిపోయాయి. అతని తీరుతో అధికారులు, చివరకు సొంత పార్టీ నేతల బెంబేలెత్తిపోతున్నారు. కమిషనర్‌పై ఆగ్రహం - బిల్లులు చెల్లించాలంటూ ప్రకాష్‌నాయుడు సోమవారం తన అనుచరులు, కాంట్రాక్టర్లతో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలో హల్చల్ చేశారు. కమిషనర్ సత్యనారాయణ చాంబర్‌ను ముట్టడించి ‘బిల్లులు చేస్తావా..చస్తావా’ అన్న రీతిలో కమిషనర్ సత్యనారాయణను బెంబేలెత్తించారు. అలాగే అతని అనుచరులు ఈలలు వేస్తూ, కార్యాలయమంతా కలియదిరుగుతూ ఉద్యోగులను భయాందోళనకు గురి చేశారు. - 2015 డిసెంబర్లో అప్పటి కమిషనర్ చల్లా ఓబులేసుపై ప్రకాష్‌నాయుడు రెచ్చిపోయారు. అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా అని ఓబులేసు అప్పట్లో ప్రశ్నించగా.. ‘ ఏం..మా ప్రభుత్వంలో మా పనులే చేయరా..?’ అంటూ శివాలెత్తారు. అక్కడే ఉన్న రికార్డులను కూడా చించేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కమిషనర్ చెప్పడంతో కాస్త వెనక్కుతగ్గారు. - గతేడాది ఏప్రిల్‌లో టీపీఎస్‌గా ఉన్న రఘురాంపై ప్రకాష్‌నాయుడు నోరుపారేసుకున్నారు. ‘చంద్రప్రియ అపార్ట్మెంట్ వారితో డబ్బులు వసూలు చేయడానికి వెళ్లావంట. వాళ్లు మా వాళ్లని నీకు తెలియదా?ఉద్యోగం చేయాలని లేదా? తలతిరుగుతోందా?’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతటితో ఆగకుండా అధికారులు లంచం తీసుకుంటున్నారంటూ నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ ముందు నానా బీభత్సం సృష్టించాడు. ఇతని తీరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే.. టీపీఎస్ రఘురాంకు ప్రకాష్ నాయుడు క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయింది. ఈఈ సురేంద్రబాబుపైనా ఓ సారి విరుచుకుపడ్డాడు. తమ పనులకు అభ్యంతరం తెలుపుతున్నారంటూ నానా హంగామా చేశాడు. - గతేడాది జూన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు ముందు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంలో వారిపై ‘చంద్రదండు’ కార్యకర్తలు దాడి చేశారు. ఓ కార్యకర్తను తీవ్రంగా గాయపరిచారు. అడ్డుకట్టేదీ? ‘చంద్రదండు’ నగరంలో అలజడి సృష్టిస్తున్నా టీడీపీ జిల్లా నాయకత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. బడా నాయకులే వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే ఇటువంటి వారికి అడ్డుకట్ట ఎవరు వేస్తారో అర్థం కావడం లేదని అధికారులు, ప్రజలు నిట్టూరుస్తున్నారు. -
బ్యాంకు అధికారుల తీరుపై వ్యాపారి నిరసన
తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తానన్నా వినకుండా అధికారులు ఆస్తి జప్తునకు యత్నిస్తున్నారంటూ ఓ వ్యక్తి అర్థనగ్నంగా నిరసన తెలిపాడు. గన్‌ఫౌండ్రిలో ఎస్బీహెచ్ శాఖలో ప్రకాశ్‌నాయుడు అనే వ్యాపారి రుణం తీసుకున్నారు. రుణం చెల్లింపు ఆలస్యం కావటంతో బ్యాంకు అధికారులు అతని ఆస్తుల జప్తునకు పూనుకున్నారు. దీంతో ప్రకాశ్‌నాయుడు గురువారం మధ్యాహ్నం బ్యాంకు వద్దకు చేరుకుని షర్టు విప్పి నిరసన తెలిపారు. కాస్త గడువిస్తే రుణం చెల్లిస్తానన్నా వినకుండా అధికారులు జప్తునకు పూనుకున్నారని ఆరోపించారు.