
సాక్షి, అనంతపురం : టీడీపీ నేత, చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుడుపై కేసు నమోదు అయింది. ప్రకాష్ నాయుడు వేధిస్తున్నారంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు ఆదివారం ఆయనపై 498, 323, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2004లో ప్రకాష్ నాయుడు చంద్రదండును ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఏపీ మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. (‘నేను పాతిన బండలనే తొలగించే దైర్యం మీకుందా’)
Comments
Please login to add a commentAdd a comment