వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్‌ షా | Waqf Bill Discussion In Lok Sabha NDA-INDIA Live Updates In Telugu, Mithun Reddy Says We Oppose The Muslim Waqf Amendment Bill | Sakshi
Sakshi News home page

Waqf Bill In Lok Sabha: లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లుపై వాడీవేడి చర్చ

Published Wed, Apr 2 2025 9:23 AM | Last Updated on Wed, Apr 2 2025 7:41 PM

Waqf Bill Discussion In Lok Sabha NDA-INDIA Live Updates

Waqf Bill In Lok sabha Updates..

వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్‌ షా

  • వక్ఫ్ సవరణ బిల్లు 2025 గురించి కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. వక్ఫ్ చట్టం, బోర్డు 1995లో అమల్లోకి వచ్చింది.

  • వక్ఫ్‌ బోర్డ్‌పై అనేక అపోహలున్నాయి.

  • ముందుగా ముస్లిమేతరులు ఎవరూ వక్ఫ్‌ పరిధిలోకి రారు.

  • వక్ఫ్‌ నిర్వహణలో ముస్లిమేతరులను చేర్చాలనే నిబంధనల లేదు.

  • మేం ఆ పనిచేయాలనుకోవడం లేదు.

  • ఈ చట్టం ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటుందని, వారు విరాళంగా ఇచ్చిన ఆస్తిల్లో జోక్యం చేసుకుంటుందనేది ఓ అపోహ.

  • మైనారిటీలలో వారి ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ ఈ తరహా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.  

మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు: గౌరవ్‌ గొగొయ్‌

  • దేశ ప్రజల్లోని సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నమిది
  • రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని నియమాలను సృష్టించుకునే అధికారం వక్ఫ్‌ బోర్డుకు ఉంది
  • దానిని పూర్తిగా తొలగించాలని చూస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్‌ ఎంపీ

 

వక్ప్‌ భూములపై కిరణ్‌ రిజుజు కీలక వ్యాఖ్యలు..

  • వక్ఫ్‌ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరిస్తున్న కిరణ్‌ రిజుజు
  • ఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.
  • బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇది తెలుసుకోవాలి.
  • మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదు.
  • వక్ఫ్‌ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడింది.
  • పార్లమెంట్‌ భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్‌ బోర్డు అన్నది.
  • వక్ప్‌ వాదనను ప్రధాని మోదీ అడ్డుకున్నారు.
  • యూపీఏ అధికారంలో ఉండి ఉంటే ఢిల్లీలో 23 కీలక స్థలాలు వక్ఫ్‌ సొంతం అయ్యేవి.
  • 123 విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్‌ వక్ఫ్‌కు కట్టబెట్టింది.
  • 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌కు ఆస్తులు కట్టబెట్టారు.
  • దేశంలో మూడో అత్యధిక ల్యాండ్‌ బ్యాంక్‌ వక్ఫ్‌ దగ్గర ఉంది.
  • భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్‌ ఉంది.
  • ఆ భూమిని భారతీయులుంతా వినియోగించుకుంటున్నారు.
  • రెండో స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్‌ బ్యాంక్‌ ఉంది.
  • మూడో స్థానంలో ఉన్న వక్ఫ్‌ భూములను భారతీయులంతా వినియోగించుకోలేరు.
  • ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్‌ బ్యాంక్‌ వక్ఫ్‌ బోర్డు దగ్గర ఉంది.
  • మసీదుల నిర్వహణపై ఈ చట్టం​ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.
  • కిరణ్‌ రిజుజు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం.
  • కేంద్రమంత్రి మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను హెచ్చరించిన స్పీకర్‌ ఓం బిర్లా..

  •   

అమిత్‌ షా కామెంట్స్‌..

  • జేపీసీ నివేదికలో ఇచ్చిన సవరణలతో వక్ఫ్‌ బిల్లు ప్రవేశపెట్టాం.
  • జేపీసీ వేయాలని కాంగ్రెస్‌ సహా విఫక్షాలు కోరాయి.
  • విపక్షాల డిమాండ్‌ మేరకే జేపీసీ వేశాం.
  • ప్రభుత్వం తెచ్చిన బిల్లులో జేపీసీ సవరణలు సూచించింది.
  • మేము కాంగ్రెస్‌ లాగా జేపీసీ సవరణలను పట్టించుకోకువడా బిల్లును యథాతథంగా తీసుకురాలేదు.  

 

కిరణ్‌ రిజుజు కామెంట్స్‌..

  • ఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.
  • అన్ని వర్గాల సలహాలను తీసుకున్నాం.
  • మైనార్టీల్లో అనవసర భయాలను సృష్టిస్తున్నారు.
  • బిల్లుపై విస్తృత చర్చ జరిపాం.
  • గతేడాది వక్ఫ్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.
  • జేపీసీ నివేదిక తర్వాత వక్ఫ్‌ బిల్లులో​ సవరణలు చేసిన ప్రభుత్వం 

 

లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు..

  • వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో ప్రారంభమైన చర్చ
  • లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు
  • చర్చ అనంతరం ఓటింగ్‌ చేపట్టే అవకాశం

 

వక్ఫ్‌ బిల్లుకు ఢిల్లీ మహిళల మద్దతు..

  • ఢిల్లీలో పలువురు ముస్లిం మహిళలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు.
  • వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఇస్తూ ప్రకటన.
  • మోదీకి మద్దతు తెలుపుతూ ఫ్లకార్డుల ప్రదర్శన 

కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు కామెంట్స్‌..

  • కొంతమంది మత పెద్దలు సహా కొందరు నాయకులు అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. 
  • అలాంటి కొందరు వ్యక్తులే సీఏఏ.. ముస్లింల పౌరసత్వ హోదాను తొలగిస్తుందని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. 
  • చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు అవసరమని వ్యక్తిగతంగా చెబుతున్నారు. 
  • కానీ, వారి ఓటు బ్యాంకు కోసం దానిని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.


రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్‌ కామెంట్స్‌..

  • దేశంలో లౌకిక పార్టీ ఎవరో ఈరోజే నిర్ణయించబడుతుంది.
  • బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి.
  • జేడీయూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, వారు ఎన్నికల్లో ఓడిపోతారు.
  • బీజేపీ దానిని ఆమోదించే అవకాశం పొందడానికి వారు వాకౌట్ చేసే అవకాశం ఉంది.
  • చిరాగ్ పాస్వాన్ కూడా అదే చేయగలరు.
  • ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓటు వేస్తారో చూడాలి

కాంగ్రెస్‌ ఎంపీ నిరసన.. 

  • లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన 
  • కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు.

 

వైఎస్సార్‌సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్‌..

  • ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
  • లోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం
  • మైనారిటీ సమాజానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్‌ ప్రకటించారు
  • ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు  
  • చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారు
  • అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి
  • ముస్లింల ఆస్తుల  విషయంలో ప్రభుత్వాల  జోక్యం అనవసరం
  • వక్ఫ్‌ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉంది
  • ఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది

 

👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్‌(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్‌(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు.

👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. 

👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్‌(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్‌ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.

👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్‌ జారీ చేశాయి. వక్ఫ్‌ (సవరణ) బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.

👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.
 
ఏమిటీ వివాదం? 
👉వక్ఫ్‌ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్‌ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.

👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్‌ ఆస్తినీ సెంట్రల్‌ పోర్టల్లో విధిగా నమోదు చేయించాలి.

👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్‌ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement