Waqf assets
-
వక్ఫ్ జేపీసీకి 1.2 కోట్ల మెయిల్స్
పుణె: వక్ఫ్ (సవరణ) బిల్లు–2024పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీకి ఏకంగా 1.2 కోట్ల ఈ మెయిల్స్ వచ్చాయని సోమవారం వెల్లడించారు. 75,000 మంది తమ వాదనలకు మద్దతుగా డాక్యుమెంట్లను కూడా సమరి్పంచారని తెలిపారు. బిల్లు సమర్థకులు, వ్యతిరేకులు ఇందులో ఉన్నారన్నారు. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును ఈ ఏడాది ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో జేపీసీకి పంపిన విషయం తెలిసిందే. బిల్లుపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం లాగేసుకుంటుందని దుష్రచారం చేస్తున్నారని రిజిజు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సక్రమంగా జరగాలనేదే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. -
వివాదాస్పద భూములపై... నిర్ణయాధికారం కలెక్టర్లకే
కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు తేనెతుట్టను కదిపింది. విపక్షాలు, ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబదీ్ధకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యూనల్‌కు నిర్ణయాధికారం ఉండేది. కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతోంది. వక్ఫ్ చట్టం–1995ను ఇకపై యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్‌గా మారుస్తోంది. మొత్తం 44 సవరణలను ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ అంటే ఏమిటి? ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన, ధారి్మక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్‌గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే.. ఇక అది అంతిమం. దాన్ని తిరగదోడటానికి ఉండదు. ఈ అంశంపై దృష్టి సారించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. 9 లక్షల ఎకరాలు దేశంలోని 30 వక్ఫ్ బోర్డులు 9 లక్షల పైచిలుకు ఎకరాలను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారత్‌లో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిల్లో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులు మూడోస్థానంలో ఉన్నాయి. బిల్లులోని కీలకాంశాలు → ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం– 1995. అందులోని సెక్షన్– 40 ఇందుకు వీలు కలి్పంచింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్– 40 రద్దుకు ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుల చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని లాగేసుకుంటోందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దుమారం రేగుతోంది. → కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు. కౌన్సిల్లో, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు. ముస్లిమేతరులకూ స్థానం. ఇద్దరు లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీకి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో చోటు కలి్పంచాలి. ఈ ముగ్గురు ఎంపీలు ముస్లింలే అయ్యుండాలనే నిబంధనేమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పును మార్చే అధికారాన్ని కూడా బిల్లు కేంద్రానికి కట్టబెడుతోంది. → ఒక ఆస్తి వక్ఫ్‌కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం. వక్ఫ్ చట్టం–1995 సెక్షన్– 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునళ్లు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేలి్చతే ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచొచ్చు. అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యునళ్లను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. → ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వడం. రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యూటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడం. → కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదేని వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు దఖలు పరుస్తుంది. → బోరాలు, అగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది. → తన ఆస్తిని దానంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధపడినపుడు.. అతను రాసిన చెల్లుబాటయ్యే అంగీకారపత్రాన్ని (వక్ఫ్‌నామా)ను కొత్త బిల్లు తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మౌఖికంగా కూడా తన ఆస్తిని వక్ఫ్‌కు ఇవ్వొచ్చు. → ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ.. ఆస్తిపై యాజమాన్య హక్కులున్నపుడే వక్ఫ్ ఇవ్వొచ్చు. → వక్ఫ్ బోర్డులకు వచ్చే డబ్బును వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథల సంక్షేమం కోసం వినియోగించాలి. అదీ ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో. – నేషనల్ డెస్క్, సాక్షి -
Waqf Amendment Bill 2024: జేపీసీకి వక్ఫ్ (సవరణ) బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం–1995లో పలు మార్పులు తీసుకురావడంతోపాటు చట్టం పేరును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ, డెవలప్మెంట్ యాక్ట్–1995’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాయి. సమాజంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దే వద్దంటూ నినదించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సహా అధికార ఎన్డీయే కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచి్చంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు బిల్లును పంపిస్తున్నట్లు ప్రకటించింది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే.. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు వక్ఫ్(సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ ప్రారంభించారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబి్ధకోసమే బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తున్నారని, తర్వాత క్రైస్తవులపై, జైన్‌లపై దాడి చేస్తారని ధ్వజమెత్తారు. అనంతరం విపక్ష సభ్యులు బిల్లుపై దుమ్మెత్తిపోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పారు. ఎన్డీయేలోని కొన్ని పార్టీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు ప్రకటించారు. సభలో వాడీవేడిగా జరిగిన చర్చ తర్వాత మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపారు. జేపీసీ ఏర్పాటు కోసం త్వరలో అన్ని పారీ్టల నేతలో చర్చిస్తామని వివరించారు. ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్–1923ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘‘కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులను సంతోషపర్చడానికి బిల్లును తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారా? ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా? ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు రూపొందించారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పారీ్టగా మార్చుకోవాలి. వక్ఫ్ బోర్డుల భూములను కాజేయాలని చూస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమంటూ గ్యారంటీ ఇవ్వాలి. ముస్లింల హక్కులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా అడ్డుకుంటాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ మైనారీ్టలను రక్షించుకోవడం బాధ్యత ‘‘బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందో చూడండి. మైనారీ్టలను రక్షించుకోవడం మన నైతిక బాధ్యత. బిల్లు వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి. బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందరితో చర్చించి పారదర్శకమైన బిల్లు రూపొందించాలి’’ – సుప్రియా సూలే, ఎన్సీపీ(శరద్ పవార్) పారదర్శకత కోసమే మద్దతు‘‘బిల్లుకు మద్దతిస్తున్నాం. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతకు ఈ బిల్లు దోహదపడుతుంది. ముస్లిం వ్యతిరేక చర్య అనడంలో అర్థం లేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు’’ –చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి ముస్లింలను శత్రువులుగా చూస్తున్నారు ‘‘వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడం దుర్మార్గం. ముస్లింలను శత్రువులుగా భావిస్తున్నారు. అందుకు ఈ బిల్లే నిదర్శనం. దర్గా, మసీదు, వక్ఫ్ ఆస్తులను స్వా«దీనం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ బిల్లు ద్వారా దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారా? ఏకం చేద్దామనుకుంటున్నారా? బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ 72 కింద నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలి’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ‘ముస్లిం వర్గాల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముస్లిం సమాజాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లేవనెత్తిన ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతపరమైన విభజనలను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పారదర్శకత కోసమే బిల్లు రూపొందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును ఆలయాలతో పోలుస్తున్నాయి. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలనలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇందిరా గాంధీ హత్యకు ఏ ట్యాక్సీ డ్రైవర్ కారణం? దీనిపై కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి. – రాజీవ్ రంజన్ సింగ్, జేడీ(యూ) సభ్యుడు, కేంద్ర మంత్రిరాజ్యసభలో వక్ఫ్ ఆస్తుల బిల్లు ఉపసంహరణ వక్ఫ్ ఆస్తుల(ఆక్రమణదార్ల తొలగింపు) బిల్లు–2014ను ప్రభుత్వం గురువారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. వక్ఫ్ ఆస్తుల్లో ఎవరైనా అనధికారికంగా తిష్టవేస్తే వారిని అక్కడి నుంచి తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 2014 ఫిబ్రవరి 18న అప్పటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహా్మన్ ఖాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2014 మార్చి 5న బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది.టీడీపీ మద్దతు లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు–2024కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బిల్లును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎంపీ హరీశ్ చెప్పారు. అన్ని మతాల వారు తమ మత కార్యక్రమాలకు భూములు, ఆస్తులను విరాళంగా ఇస్తుంటారని తెలిపారు. దాతల ప్రయోజనాలు కాపాడేలా సంస్కరణలు తీసుకొచ్చి ఆ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. -
‘వక్ఫ్’ ఫిర్యాదులపై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదుల పరిశీలన నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో కేంద్రం ఏక సభ్య కమిషన్‌ను నియమించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఇక్కడ జరిగిన ఆలిండియా వక్ఫ్ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలపై రాష్ట్రాలు కూడా ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మాఫియా చెర నుంచి వక్ఫ్ భూములకు విముక్తి కల్పించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను, భూములను ముస్లింల సామాజిక, ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించాలని కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 4,49,314 రిజిస్టర్డ్, అన్‌రిజిస్టర్డ్ ఆస్తులు ఉన్నాయని, వాటి వార్షిక ఆదాయం రూ.163 కోట్లు, స్థిరాస్తుల విలువ 1.2 లక్షల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వక్ఫ్ ఆస్తుల ద్వారా ఏడాదికి 12 వేల కోట్ల ఆదాయం రాబట్టవచ్చని, వాటిని ముస్లింల అభివృద్ధికి ఖర్చు చేస్తే వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు సంభవించే అవకాముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు మైనారిటీల పాఠశాలలు, కాలేజీలు, నైపుణ్య కేంద్రాలు, ఆస్పత్రుల నిర్మాణాలు చేపడితే కేంద్రం సహకరిస్తుందని మంత్రి వెల్లడించారు. -
‘వక్ఫ్’ కమిటీకి రాజకీయ గ్రహణం
► కొత్త పాలకవర్గానికి ► ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్యపోరు ► ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ ఆస్తులు మహబూబ్‌నగర్ అర్బన్ : వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. వాటిని పరిరక్షించాల్సిన జిల్లా కమిటీకి రాజకీయ గ్రహణం పట్టుకుంది. అస్తిత్వం కోసం అధికార పార్టీ నాయకులు గత వక్ఫ్ కమిటీ పాలకవర్గాన్ని రద్దు చేయించి సుమారు ఏడాదిన్నర పూర్తవుతోంది. కాంగ్రెస్ హయాంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అధ్యక్షతన జిల్లా వక్ఫ్ కమిటీని వేయగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయనపై కొన్ని ఆరోపణలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు పాలకవర్గాన్ని రద్దు చేయించారు. అనంతరం జిల్లా వక్ప్ బోర్డు సీనియర్ ఇన్స్పెక్టర్ మహ్మద్ గౌస్‌ను స్పెషల్ ఆఫీర్‌గా నియమించారు. కానీ నూతన కమిటీ వేయడంలో జాప్యం చేశారు. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యే మధ్య ఆదిపత్య పోరు నడుస్తుండటంతో ప్రక్రియ ముందుకు సాగడంలేదని మైనార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో రెండు సార్లు చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తినే తిరిగి ఆ పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ బడా నాయకుడు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కొంత మంది మైనార్టీ నాయకులు మంత్రులతో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఇప్పటిదాకా వక్ఫ్ కమిటీ చెర్మైన్‌గా పని చేసిన వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని, ఎవరైనా ముందుకొస్తే తమకూ అదే పరిస్థితి ఉంటుందన్న భయంతో ఎవరూ ముందుకు రావడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సీఎం స్వయంగా కోరినా జిల్లా నాయకులు మిన్నకుండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగి స్తోంది. పాలకవర్గం లేక జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తుల దురాక్రమణ పరంపర కొనసాగుతూనే ఉంది. 1954లో దేవాదాయ శాఖ నుంచి వక్ఫ్ బోర్డు విడిపోయినప్పుడు జిల్లాలో 11,800 ఎకరాలున్న భూములు ప్రస్తుతం నాలుగు వేల ఎకరాలకు చేరాయి. -
వక్ఫ్ భూములే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : వక్ఫ్ ఆస్తులపై జిల్లా యంత్రాంగంలో కదలిక మొదలైంది. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు వక్ఫ్ ఆస్తులను రీ సర్వే చేయడంతో పాటు ఆక్రమణదారుల పేరిట ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నారు. వీరి పేరిట ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేసి.. వక్ఫ్ బోర్డు పేరిట ఆస్తులను బదలాయించాలని కూడా జిల్లా అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కల్లూరులోని 356 సర్వే నెంబరులోని 21 ఎకరాల 79 సెంట్ల స్థలంతో పాటు సర్వే నెంబరు 124లో ఉన్న భూమి కూడా వక్ఫ్‌బోర్డుదేనని జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ మేరకు కలెక్టర్‌తో పాటు వక్ఫ్‌బోర్డు సీఈవోకు కర్నూలు జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ నివేదిక సమర్పించినట్టు సమాచారం. వక్ఫ్ భూముల ఆక్రమణలపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. పాసు పుస్తకాలు రద్దు జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను వెంటనే సర్వే చేయించడంతో పాటు ఈ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నంద్యాలలోని నూనెపల్లిలో వక్ఫ్ ఆస్తిని ఆక్రమించుకున్న వారిపై కేసులను నమోదు చేశారు. అంతేకాకుండా పై రెండు సర్వే నెంబర్లను మళ్లీ రీ-సర్వే చేయడంతో పాటు ఈ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై కేసులు కూడా నమోదు చేయనున్నారు. వీరి పాసుపుస్తకాలను రద్దు చేయనున్నట్లు తెలిసింది. ఈ ఆస్తులను వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకూ రంగం సిద్ధమైంది. మొత్తం మీద వక్ఫ్ఆస్తులు వక్ఫ్‌బోర్డుకే చెందేట్టుగా చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులపైనా చర్యలు వాస్తవానికి కల్లూరులోని సర్వే నెంబరు 124 వక్ఫ్‌బోర్డు ఆస్తి అని.. ఈ ఆస్తిని ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించవద్దని ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖకు వక్ఫ్‌బోర్డు లేఖ రాసింది. అయినప్పటికీ ఈ లేఖను పక్కన పెడుతూ 2014 ఆగస్టులో రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది వివిధ వ్యక్తుల పేర్ల మీద ముక్కలు ముక్కలు చేసి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కదులుతోంది. అదేవిధంగా కర్నూలు గ్రామంలోని సర్వే నెంబరు 62లోని 5.32 ఎకరాల భూమి కూడా వక్ఫ్‌బోర్డుదేనని అధికారులు గుర్తించారు. అయితే, ఈ సర్వే నెంబరులో రీ-సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలని వక్ఫ్‌బోర్డు సీఈవోకు స్థానిక ఇన్స్పెక్టర్ లేఖ రాశారు. అదేవిధంగా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకట్టవేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయాలని ఆయన ఈ లేఖలో కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేయాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశించాలని కూడా ఈ లేఖలో సీఈవోను ఆయన కోరినట్టు తెలిసింది. ఆస్తులు ఆక్రమిస్తే కఠిన చర్యలు వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ఎవరైనా ఆక్రమించినా...పాసు పుస్తకాలు జారీ అయినా రద్దు చేస్తాం. అవసరమైతే పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని వెంటనే వారిని ఖాళీ చేయిస్తాం. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. - సీహెచ్ విజయమోహన్, కలెక్టర్, కర్నూలు -
వక్ఫ్ ఆస్తుల బాధ్యత ప్రభుత్వానిదే: పల్లె
హైదరాబాద్: 'వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏ ఒక్కరికో చెందినవి కావు. ఇవన్నీ ముస్లిం కమ్యూనిటీవి. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే౮ అని మైనార్టీ, వక్ఫ్ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం వక్ఫ్ శాఖాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేల కోట్లు విలువ చేసే వక్ఫ్ బోర్డ్ భూములను లీజుకి ఇవ్వడంతో పాటు, కమ్యూనిటీ కాంప్లెక్స్‌లను నిర్మించి తద్వారా వచ్చే ఆదాయాన్ని మైనార్టీల సంక్షేమానికి వినియోగిస్తామన్నారు. -
కబ్జా హఠావో.. వక్ఫ్ బచావో
ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లా అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరుతూ ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మంలో శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఉర్దూఘర్ షాదీఖానా నుంచి ఈ ప్రదర్శన బయల్దేరింది. నగరపాలక సంస్థ కార్యాలయం, బస్టాండ్, వైరారోడ్డు, జెడ్పీసెంటర్ మీదుగా హజ్రత్ తాలీమ్ మస్తాన్ దర్గా వరకు కొనసాగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.అసద్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష వైఖరి వల్లే జిల్లాలో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని విమర్శించారు. వక్ఫ్చట్టం 1995ను అనుసరించి ఆక్రమణదారులను సెక్షన్ 54(1), 54(3), 55 ప్రకారం తొలగించాల్సి ఉన్నా కలెక్టర్, ఆర్డీఓలు ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఖమ్మంలోని ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న తాలీమ్ మస్తాన్ దుర్గాకు చెందిన వక్ఫ్ భూమి (సర్వే నంబర్లు 264, 265)ని 132 మంది ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా భూమిని వదిలి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. తెలియక చేసిన తప్పు క్షమార్హమని, అదే తెలిసి చేస్తే సహించరానిదని వ్యాఖ్యానించారు. మహాత్మగాంధీ తలపెట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ‘వక్ఫ్ బచావో’ పేరుతో శాంతి ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాణోతు భద్రూనాయక్, ముస్లిం మైనారిటీ ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నజీరుద్దీన్, వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ సయ్యద్ షుజా, బీసీ సంఘం నాయకురాలు షేక్ సకీనా, కాంగ్రెస్ నాయకులు అక్బర్ , రజీ మ్, దర్గా కార్యదర్శి మధా ర్, ఇన్సాఫ్ కమిటీ నాయకులు యాఖూబ్, ముజావర్ అక్బర్, జాకీర్ పాల్గొన్నారు.