వక్ఫ్ ఆస్తుల బాధ్యత ప్రభుత్వానిదే: పల్లె
హైదరాబాద్: 'వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏ ఒక్కరికో చెందినవి కావు. ఇవన్నీ ముస్లిం కమ్యూనిటీవి. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే౮ అని మైనార్టీ, వక్ఫ్ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం వక్ఫ్ శాఖాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేల కోట్లు విలువ చేసే వక్ఫ్ బోర్డ్ భూములను లీజుకి ఇవ్వడంతో పాటు, కమ్యూనిటీ కాంప్లెక్స్‌లను నిర్మించి తద్వారా వచ్చే ఆదాయాన్ని మైనార్టీల సంక్షేమానికి వినియోగిస్తామన్నారు.