విశేష స్పందన వచి్చంది: రిజిజు
పుణె: వక్ఫ్ (సవరణ) బిల్లు–2024పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీకి ఏకంగా 1.2 కోట్ల ఈ మెయిల్స్ వచ్చాయని సోమవారం వెల్లడించారు.
75,000 మంది తమ వాదనలకు మద్దతుగా డాక్యుమెంట్లను కూడా సమరి్పంచారని తెలిపారు. బిల్లు సమర్థకులు, వ్యతిరేకులు ఇందులో ఉన్నారన్నారు. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును ఈ ఏడాది ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో జేపీసీకి పంపిన విషయం తెలిసిందే. బిల్లుపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం లాగేసుకుంటుందని దుష్రచారం చేస్తున్నారని రిజిజు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సక్రమంగా జరగాలనేదే ఈ బిల్లు ఉద్దేశమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment