Emails
-
వక్ఫ్ జేపీసీకి 1.2 కోట్ల మెయిల్స్
పుణె: వక్ఫ్ (సవరణ) బిల్లు–2024పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీకి ఏకంగా 1.2 కోట్ల ఈ మెయిల్స్ వచ్చాయని సోమవారం వెల్లడించారు. 75,000 మంది తమ వాదనలకు మద్దతుగా డాక్యుమెంట్లను కూడా సమరి్పంచారని తెలిపారు. బిల్లు సమర్థకులు, వ్యతిరేకులు ఇందులో ఉన్నారన్నారు. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును ఈ ఏడాది ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో జేపీసీకి పంపిన విషయం తెలిసిందే. బిల్లుపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం లాగేసుకుంటుందని దుష్రచారం చేస్తున్నారని రిజిజు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సక్రమంగా జరగాలనేదే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. -
అంబానీని బెదిరించింది తెలంగాణ కుర్రాడే! ఏం జరిగిందంటే..
Threat emails to Mukesh Ambani: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్‌లు పంపిన వ్యక్తిని ముంబై గాందేవి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించిన పోలీసులు అతడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించినట్లు తెలిపారు. గత వారంలో ముఖేష్ అంబానీకి ఐదు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయని, కోట్ల కొద్దీ డబ్బు డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని పోలీసులు తెలిపారు. “ఇది కొంతమంది టీనేజర్లు చేసిన అల్లరి పనిగా తెలుస్తోంది. మా దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం ” అని ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ‘బిజినెస్‌మేన్’ సినిమాలో మాదిరిగా.. 2012లో వచ్చిన మహేష్‌బాబు సినిమా ‘బిజినెస్‌మేన్’ను నిందితుడు ఫాలో అయినట్టున్నాడు. అందులో హీరో ముంబైలో బడా వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు సంపాదిస్తాడు. అచ్చం అలాగే ఈ నిందితుడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ఈమెయిల్స్ ద్వారా రూ.కోట్లు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు. మా దగ్గర మంచి షూటర్లున్నారు.. గత అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే పేరుతో ముఖేష్ అంబానీకి మొదటి బెదింపు ఈమెయిల్ వచ్చింది. “మీరు (అంబానీ) మాకు రూ. 20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం. మా వద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్లు ఉన్నారు” అని అందులో పేర్కొన్నారు. తర్వాత మరొక ఈమెయిల్ వచ్చింది. అందులో మొదటి ఈమెయిల్ స్పందించనందుకు రూ. 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. "డిమాండ్లు నెరవేర్చకపోతే, డెత్ వారెంట్ (అంబానీకి) జారీ అవుతుంది" అని బెదిరించారు. అక్టోబర్ 31న అంబానీ అధికారిక ఈమెయిల్ ఐడీకి మూడో ఈమెయిల్ పంపించిన నిందితుడు ఈ సారి రూ.400 కోట్లు డిమాండ్ చేశాడు. నవంబర్ 1, 2 వ తేదీల్లో కూడా అలాంటి మరో రెండు ఈమెయిల్‌లు వచ్చాయి. ఈమెయిల్స్‌లోని ఐపీ అడ్రస్‌లను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
మస్క్ ఏం చేసినా మామూలుగా ఉండదు.. ఆఫీస్‌కి రానక్కరలేదని అర్ధరాత్రి మెయిల్స్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఏం పని చేసినా మామూలుగా ఉండదు. లేఆఫ్స్ దగ్గర నుంచి బ్లూ టిక్స్ వరకూ ప్రతీదీ వివాదాస్పదం, చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆయన ట్విటర్ ఉద్యోగులకు అర్ధరాత్రి ఈమెయిల్ పంపడం చర్చనీయాంశం అయింది. ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... మస్క్ ఇలా ఉద్యోగులకు అర్ధరాత్రి మెయిళ్లు పంపడం కొత్తేమీ కాదు. కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఆయన ఉద్యోగులతో పంచుకుంటారు. అయితే ఉద్యోగులు ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదంటూ అర్ధరాత్రి ఈమెయిల్ పంపడమే అసాధారణంగా ఉంది. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ఇంతకీ ఏం జరిగిందంటే.. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ట్విటర్ కార్యాలయం ఉద్యోగులు లేక దాదాపు సగం ఖాళీగా ఉండటాన్ని గమనించిన మస్క్ ఆ మరుసటి రోజు నుంచి ఉద్యోగులు ఆఫీస్ రావటం వారి ఇష్టమని, తప్పనిసరేమీ కాదని ఉద్యోగులకు అర్ధరాత్రి 2:30 సమయంలో ఈమెయిల్స్ పంపారు. ఈ మేరకు Fortune.com నివేదించింది. మస్క్ ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో అనేక మార్పులు చేశారు. 7,500 ఉన్న ఉద్యోగుల సంఖ్యను ఒకేసారి 2,000లకు తగ్గించారు. కొత్తగా వెరిఫైడ్ అకౌంట్లకు సబ్క్రిప్షన్ చార్జీలు ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? -
Air India Urination Case: వెలుగులోకి కీలక ఈమెయిల్స్
ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన కేసులో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎయిర్‌లైన్ ఆ ఘటన జరిగిన రోజే అధికారులకు ఈమెయిల్స్ పంపినట్లు తేలింది. వాస్తవానికి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, త్వరితగతిన స్పందించకపోవడం, నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోకపోవడం తదితర విషయాల్లో జాప్యం గురించి సర్వత్ర పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రశ్నించగా ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వలేదని ఎయిర్ ఇండియాలోని టాప్ మేనేజ్మెంట్ గతంలో సమర్థించుకుంది. ఐతే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తోసహా ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులకు ఈమెయిల్స్ వెళ్లాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా క్యాబిన్ సూపర్వైజర్ నవంబర్ 27న మధ్యాహ్నం 1 గంట సమయంలో బేస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్(ఐఎఫ్‌సీడీ), హెచ్ఆర్ హెడ్‌కి ఈమెయిల్ పంపినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే కస్టమర్ కేర్ ఫిర్యాదులు గురించి ఉన్నతాధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్‌కి ప్రత్యుత్తరాలు కూడా అదే రోజు 3.47 గంటలకు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆరోజు టెలిఫోన్ చర్చల అనంతరం ఈమెయిల్స్ పంపించినట్లు కూడా పేర్కొంది. అంతేగాదు అదే రోజు రాత్రి 7.46 గంటలకు ఈమెయిల్ కస్టమర్స్ విభాగం ఇన్‌ఫ్లైట్ సర్వీస్ హెడ్లకు ఈమెయిల్స్ పంపించినట్లు తేలింది. పైగా అదేరోజు సాయంత్రం బాధితురాలి అల్లుడు నుంచి ఈ మెయిల్ అందుకున్న విల్సన్ కస్టమర్ కేర్ ఆ మెయిల్స్ ఫార్వర్డ్ చేసి తనకు వచ్చిన మెయిల్స్‌పై దృష్టిపెట్టినట్లు కమ్యూనికేషన్లు చూపిస్తున్నాయి. అయితే ఎయిర్ ఇండియా మేనేజింగ్ డ్రైరెక్టర్(సీఎండీ) క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ..ఎయిర్‌లైన్ తన సిబ్బందిలోని లోపాలను విచారించడానికి, ఎందుకు ఆల్యసంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో విచారించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఘటన గురించి విమానంలో ల్యాండింగ్ అయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించినట్లు తేలింది. ఐతే పైలట్ నిందితుడు శంకర్ మిశ్రా స్ప్రుహ లేనప్పుడూ చేసిన ఘటనగానే భావించాడు. బాధితురాలి పట్ల జరిగిన వికృత ఘటనగా సీరియస్ భావించకపోవటం, పైగా ఇరువురు మధ్య రాజీ కుదిర్చి సర్థి చెప్పేందుకు యత్నించాడమే గాక గొడవ రాజీ అయినట్లుగా ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దీంతో ఆరోజు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శంకర్ విశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మిశ్రా కూడా కామ్‌గా ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి నిష్క్రమించినట్లు తేలింది. ఎప్పుడైతే బాధితురాటు ఎయిర్ ఇండియా చైర్మన్‌కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్స్ అధికారులకు ఇరువురు మధ్య ఆర్థిక రాజీ కుదరిందని అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏకి ఫిర్యాదు చేయడం జాప్యం అయ్యిందని తదుపరి విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ విమానయాన సంస్థ మరియు దాని చీఫ్‌లకు మాత్రమే కాకుండా మొత్తం విమాన సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే డీజీసీఏ ఈ ఘటనపై ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా, పైలెట్ ఇన్ కమాండ్ లైసెన్స్ మూడు నెలలపాటు సస్పెన్షన్ తోపాటు ఎయిర్ ఇండియా డైరెక్టరేట్ ఇన్‌ఫ్లైట్ సర్వీస్‌కు కూడా సుమారు రూ. 3 లక్షల జరిమాన విధించి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
హాలిడేస్‌లో వర్క్ చేయమంటున్నారా..? ఇలా చేస్తే బాస్‌కు భారీ జరిమానా!
మీరు ఎంతో ఇష్టపడి ఓ జాబ్ చేస్తున్నారు. అలా అని హాలిడేస్‌లో కుటుంబ సభ్యులతో గడిపే సమయంలో ఆఫీస్‌లో ఆ వర్క్ ఉంది.. ఈ వర్క్ ఉంది అని కొలీగ్స్ నుంచి లేదంటే బాస్ నుంచి పొద్దస్తమానం ఫోన్స్, ఈమెయిల్స్, ఫోన్ నోటిఫికేషన్లు వస్తుంటే చిరాకుగా ఉంటుంది కదా. ఇదిగో ఇకపై ఉద్యోగుల్ని ఇలాంటి ఇబ్బందులు పడకుండా.. తోటి సహచర ఉద్యోగులు ఇబ్బంది పెట్టకుండా ఉండేలా సంస్థలు కొత్త కొత్త పాలసీలను అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ పాలసీ ఏంటని అనుకుంటున్నారా? సెలవుల్లో ఉన్న ఉద్యోగికి.. తోటి సహచర ఉద్యోగులు ఆఫీస్ వర్క్ విషయంలో ఇబ్బంది పెట్టకూడదు. అలా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకునేందుకు పాలసీలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్ 11 కొత్త పాలసీని తన సంస్థ ఉద్యోగులకు అమలు చేసింది. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే?.. ఆఫీస్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆఫీస్ నుంచి అతని కొలీగ్స్ కానీ, బాస్‌లు కానీ ఎవరైనా సరే ఆఫీస్ వర్క్ అని ఇబ్బంది పెట్టకూడదు. ఒక వేళ ఇబ్బంది పెడితే డిజిగ్నేషన్‌తో సంబంధం లేకుండా బాస్‌తో సహా అందరికి లక్షరూపాయిలు జరిమానా విధిస్తున్నాం’ అంటూ కొత్త పాలసీ గురించి లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా డ్రీమ్ 11 కంపెనీ ఫౌండర్ హర్ష్ జైన్, భవిత్ శేట్లు మాట్లాడుతూ..లీవ్‌లో ఉన్న ఉద్యోగికి వారం రోజుల పాటు ఆఫీస్‌తో సంబంధం ఉండకూడదు. మెయిల్స్, మెసేజెస్, వాట్సాప్ గ్రూప్ మెసేజెస్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసలు ఇంట్లో ఉంటే ఆఫీస్ వర్క్ అనే మాటే ఊసెత్తకూడదు. ఇలా కొత్త పాలసీని అమలు చేయడం వల్ల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విశ్రాంతి తీసుకోవచ్చు. తద్వారా మానసిక స్థితి, జీవన ప్రమాణాల నాణ్యత, వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని అర్ధం చేసుకున్నాం. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. -
రూ.13 వేలు కడితే అమెరికా హెజ్1బీ వీసా..! ఇలాంటి స్కామర్లతో జర భద్రం..
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలతో మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ లింక్డ్ఇన్ యూజర్ స్కామర్లు వీసాలు ఇప్పిస్తామని రూ.లక్షలు కాజేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. అమెరికా హెచ్1బీ వీసా ఇప్పిస్తామని 160 డాలర్లు(రూ.13వేలు) కడితే దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడుతామని సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నాడు. ఓ టాప్ సోడా కంపెనీల పేరుతో ఈ ఆఫర్ లెటర్ పంపుతున్నారని చెప్పాడు. మొదట రూ.13వేలే అని చెప్పినా ఆ తర్వాత ఆశావాహుల నుంచి లక్షలు కాజేస్తున్నారని వివరించాడు. ఈ స్కామర్లు పంపే ఈ-మెయిళ్లు ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల పేరుతో కూడా ఉంటాయని సదరు వ్యక్తి వివరించాడు. మీకు నమ్మకం కల్పించేందుకు వాళ్లు డమ్మీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నాడు. ఇలాంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నిజంగా జాబ్ ఆఫర్ ఇచ్చే ఏ సంస్థ అయినా డబ్బులు వసూలు చేయదు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని లింక్డ్ఇన్ యూజర్ సూచించాడు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: కంప్యూటర్లు వాడే భారతీయులకు షాకింగ్ న్యూస్. మన కంప్యూటర్లలోని ప్రయివేటు మెసేజ్‌లుకు, ఈమెయిల్స్ ఇక నిఘా నీడలోకి వెళ్లబోతున్నాయి. హోం శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం దేశంలో ప్రతీ ఒక్కరు వాడే కంప్యూటర్ల పై భారత ప్రభుత్వం డేగ కన్ను వేయనుంది. ఈ మేరకు 'సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ' డివిజన్ గురువారం రాత్రి 10 సెంట్రల్ ఏజన్సీలకు అనుమతినిచ్చేశారు హోం శాఖ సెక్రటరీ రాజీవ్ గుబాబా. అంటే అనుమతి లేకుండానే కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడి మొత్తం సమాచారాన్ని పరిశీలించేందుకు,అవసరమైతే అడ్డుకునేందుకు పూర్తి అధికారాన్ని కల్పించిందన్నమాట. ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహా 10 దర్యాప్తు సంస్థలకు అనుమతి అంశంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. “కంప్యూటర్ లలో ఉన్న సమాచారంతో పాటు సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న సమాచారంపై నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. అవసరమైతే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకుంటాయని కూడా హోంశాఖ తెలిపింది. ఐటీ చట్టం 2000 సెక్షన్ 69 కింద ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, క్యాబినెట్ సెక్రటేరియేట్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్( జమ్ము అండ్ కశ్మీర్, నార్త్ ఈస్ట్, అసోం) , ఢిల్లీ పోలీస్ తదితర సంస్థలు ఉన్నాయి. విచారణ ఎదుర్కొనే వారు దర్యాప్తు సంస్థలకు అన్ని విధాల సహరించాల్సి ఉంటుంది. సహకరించకపోతే 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానాను, ఎదుర్కోవాల్సి ఉంటుంది. మండిపడుతున్న ప్రతిపక్షాలు ప్రభుత్వం చర్యను కాంగ్రెస్, సీసీఎం, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదల్, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఇది రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులపై దాడి అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కుకు వ్యతిరేకం అని విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల తరుణంలో ఇలాంటి ఎత్తుగడలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. Why is every Indian being treated like a criminal? This order by a govt wanting to snoop on every citizen is unconstitutional and in breach of the telephone tapping guidelines, the Privacy Judgement and the Aadhaar judgement. https://t.co/vJXs6aycP0 — Sitaram Yechury (@SitaramYechury) December 21, 2018 The sweeping powers given to central agencies to snoop phone calls and computers without any checks is extremely dangerous. This step is a direct assault on civil liberties in general and fundamental right to privacy of citizens in particular, guaranteed by Indian constitution. — N Chandrababu Naidu (@ncbn) December 21, 2018 India has been under undeclared emergency since May 2014, now in its last couple of months Modi govt is crossing all limits by seeking control of even the citizens computers. Can such curtailment of fundamental rights be tolerated in world's largest democracy? — Arvind Kejriwal (@ArvindKejriwal) December 21, 2018 మరోవైపు ఆయా ఏజెన్సీలకు డాటా ఎన్క్రిప్షన్ అధికారం గతంనుచీ ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధించుకున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిన నియమాల ప్రకారమే ఉందని చెప్పుకొచ్చారు. తాము కొత్తగా జారీ చేసిన ఆదేశాలేవీ లేవని, 2009 నుంచే ఇవి ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
ప్రియాంక చోప్రా మొబైల్ చూస్తే.. షాకింగే!
పరిచయం అక్కర్లేని పేరు... ప్రియాంక చోప్ర. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ అందాల తార, హాలీవుడ్ హాట్ స్టార్, ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా తిరుగులేని ఐడెంటిటీ ప్రియాంక సొంతం. హాలీవుడ్లో నటించిన క్వాంటికో సీరియల్లో అమెరికన్ల మనసును కొల్లగొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకు.. ఫోన్‌కు మెసేజ్‌లు, ఈ మెయిల్స్ ఎన్ని వస్తుంటాయనే దానిపై చాలామందికి సందేహాలు ఉండడం సహజం. అదే సమయంలో ఎన్నింటికి ప్రియాంక రిప్లై ఇస్తుందనేది కూడా ఆసక్తికరం. ప్రియాంకు సంబంధించిన ఈ ఆసక్తిర విషయంపై ఆమె సహచర నటుడు అలన్ పావెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. ప్రస్తుతంఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రా ఫోన్ ఈ మెయిల్స్ ఇన్‌బాక్స్‌లో.. అక్షరాలా 2 లక్షల 57 వేల 623 చదవని మెయిల్స్ ఉన్నాయి. ఈ సంఖ్య చుట్టూ రెడ్‌మార్క్ వేసి మరీ అలెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Guys ... guys ... don't ever email @priyankachopra ... she apparently NEVER reads it! This is is the record ... I defy anyone to beat it. #unbelievable #ithoughtiwasbad #commaplacementconfusesme A post shared by Alan Powell (@alanpowell10) on Dec 5, 2017 at 4:17pm PST -
13 లక్షల ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ అనంతరం కేంద్ర ప్రభుత్వం అక్రమ డిపాజిట్లను వెలికి తీసే చర్యల్ని వేగవంతం చేసింది. బ్యాంకుల్లో రద్దయిన నోట్ల భారీ డిపాజిట్లను గుర్తించిన ఆదాయ పన్ను శాఖ ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో భాగంగా మరింత చురుగ్గా కదులుతోంది. 18 లక్షల ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్ము రూ.4.7లక్షల కోట్లుగా తేల్చింది. ఈ లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగింది.ఆదాయ లెక్కలతో సరిపోలని ఖాతాదారుల డిపాజిట్లపై వివరణ కోరుతూ 13 లక్షల మందికి ఎస్ఎమ్మెస్లు, ఈ మెయిల్స్ ద్వారా నోటీసులు పంపించినట్టు సీబీడీటీ అధికారి సుశీల్ చంద్ర గురువారం వెల్లడించారు. ఇది ఆపరేషన్ క్లీన్ మనీ లో ఇది మొదటి దశ అని చెప్పారు. ఈ నోటీసులకు 10 రోజుల్లోగా ఆన్ లైన్ లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 8 పెద్దనోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ క్లీన్ మనీ/స్వచ్ ధన్ అభియాన్ అనే సాఫ్ట్వేర్ ప్రాజెక్టును ఆరంభించింది. రూ.5 లక్షలకు మించిన లావాదేవీలు అన్నింటినీ అనుమానాస్పద లావాదేవీలుగానే పరిగణించిన ఐటీ శాఖ ఇ- వెరిఫికేషన్ తరువాత సంతృప్తి చెందని ఖాతాలకు నోటీసులు పంపనున్నట్టు ప్రకటించింది. ఆ డబ్బు లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమని సదరు ఖాతాదారులందరికీ ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎ్‌సలు పంపనున్నట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కోటి బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలకు మిం చి నగదు జమ అయినట్లు తేల్చిన సంగతి తెలిసిందే. -
హిల్లరీకి డిబేట్ ప్రశ్నలు ముందే తెలుసా?
-
హిల్లరీకి డిబేట్ ప్రశ్నలు ముందే తెలుసా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా వారమైనా లేదు. క్లింటన్ ఈ-మెయిల్స్ వ్యవహారం మాత్రం ముదురుతూ వస్తోంది. ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడక వ్యవహారంలో ఇప్పటికే తలమునకలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. అమెరికా ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం ఫెడ్ డిబేట్లో అడగబోయే ప్రశ్నలు క్లింటన్‌కు ముందే తెలిశాయని వికిలీక్స్ పేర్కొంది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ చైర్పర్సన్, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డోనా బ్రజిలే ఫెడ్ డిబేట్ ప్రశ్నలను క్లింటన్‌కు ముందే అందిచారని వికీలీక్స్ తెలిపింది. వికీలీక్స్ పబ్లిష్ చేసిన క్లింటన్ ఈ-మెయిల్స్ బట్టి ఇది స్పష్టమైందని రిపోర్టు చేసింది. దీంతో ఫెడ్ డిబేట్‌ను నిర్వహించిన సీఎన్ఎన్ సంస్థ, డోనా బ్రజిలేతో పూర్తిగా తెగదెంపులకు సిద్దమైంది. న్యూస్ న్యూస్ నెట్‌వర్క్‌లో ఆమె చాలాకాలంగా కంట్రిబ్యూటర్‌గా నిర్వహిస్తూ వస్తున్నారు. అక్టోబర్ 14న బ్రజిలే సమర్పించిన రాజీనామాను సీఎన్ఎన్ అంగీకరించిందని ఆ నెట్వర్క్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. డీఎన్సీ చైర్ డెబ్బీ వాసెర్మాన్ షుల్ట్ పదవికాలం ముగియడంతో, ఆ కమిటీ చైర్‌పర్సన్‌గా బ్రజిలే బాధ్యతలు స్వీకరించారు. జూలైలో సీఎన్ఎన్ కంట్రిబ్యూటర్‌గా ఆమె వైదొలిగారు. మార్చిలో ఫ్లింట్, మిచ్‌లో జరిగిన సీఎన్ఎన్ డెమొక్రాటిక్ డిబేట్ ప్రశ్నలను, ఆ తర్వాత కోలంబస్, ఓహియో సీఎన్ఎన్ టౌన్ హాల్లో జరిగిన డిబేట్ ప్రశ్నలను బ్రజిలే క్లింటన్‌కు ముందే లీక్ చేసినట్టు తాజా ఈ-మెయిల్ వ్యవహారంలో తెలిసింది. అయితే సీఎన్ఎన్ మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తోంది. అసలు బ్రజిలేకు ముందస్తుంగా డిబేట్ ప్రశ్నలు తెలుసుకునే అవకాశం ఇవ్వలేదని తెలిపింది. మెటీరియల్ ప్రిపరేషన్ , బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, టౌన్‌హాల్ డిబేట్ మీటింగ్స్ ఇలా ఏ విషయాన్ని బ్రజిలేకు ఇవ్వలేదని సీఎన్ఎన్ అధికార ప్రతినిధి తెలిపారు. క్యాంపెయిన్ ఈవెంట్స్‌లో భాగంగా యాహు న్యూస్ లైవ్ కవరేజ్ కోసం మాత్రమే ఆమె ఈ డిబేట్‌కు అతిథిగా వచ్చారని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై బ్రజిలే స్పందించడం లేదు. -
హిల్లరీ డాక్యుమెంట్లు ఇవ్వాలంటే 75 ఏళ్లు పడుతుందట!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ దేశ విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడు అమె సహచరులు, సలహాదారుతో జరిపిన ఈ మెయిళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించి ఇవ్వడానికి 75 ఏళ్లు పడుతుందని, ఆ పాటికి కొన్ని తరాలే గడిచిపోతాయని అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. విదేశాంగ మంత్రి హిల్లరి తన సహచరులు, సలహాదారులతో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలు, ముఖ్యంగా ప్రైవేటు ఖాతా ద్వారా నెరపిన ఈ మెయిళ్ల డాక్యుమెంట్లను అందజేయాలని డిమాండ్ చేస్తూ రిపబ్లికన్ నేషనల్ కమిటీ గత మార్చి నెలలో కోర్టు కెక్కింది. దీనిపై కొలంబియా జిల్లా కోర్టు బుధవారం విచారణ జరిపింది. 75 ఏళ్లు పడుతుందని తాము కోర్టు ముందు ఆశామాషీగా చెప్పడం లేదని, రోజువారిగా ఏళ్ల తరబడి హిల్లరీ నెరపిన ఈ మెయిళ్ల తాలూకు డాక్యుమెంట్లు కోటాను కోట్ల పేజీలు అవుతాయని, వాటిన్నింటిని సేకరించి ఇవ్వడం మామూలు విషయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ మీడియాకు తెలిపారు. తమ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుందని కూడా ఆయన తెలిపారు. హిల్లరీ తన ప్రైవేటు ఖాతా ద్వారా ఈ మెయిళ్లు పంపిన వారిలో మాజీ త్రివిధ దళాల అధిపతి చెరిల్ మిల్స్, సలహాదారు జాకబ్ సులివాన్, ఐటి నిపుణులు బ్య్రాన్ పగ్లియానోలు కూడా ఉన్నారు. అధికారిక ఈ మెయిల్ సౌకర్యం ఉన్నప్పుడు హిల్లరీ ఎందుకు ఎక్కువగా ప్రైవేటు ఈ మెయిల్ ఖాతా వాడారన్నది కూడా కోర్టు ముందు వాదనకు వచ్చింది. హిల్లరి క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో ఆమెపై దాఖలైన పలు కేసుల్లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ దాఖలు చేసిన కేసు ఇదొకటి. -
ప్రజలను అప్రమత్తం చేయండి
♦ మోసపూరిత ఆఫర్ల విషయమై ♦ బ్యాంక్‌లకు ఆర్బీఐ సూచన ముంబై: ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) బ్యాంకులకు సూచించింది. ఆర్థికాంశాల పట్ల తగిన అవగాహన లేకపోవడం, జాగరూకత లేకపోవడం వల్ల అమాయకులైన ప్రజలు ఇలాంటి మోసపూరిత ఆఫర్లకు బలై నష్టపోతున్నారని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి స్కీమ్‌లు/ఆఫర్ల పట్ల ప్రజలే కాకుండా బ్యాంక్‌లు కూడా నష్టపోతున్నాయని వివరించింది. లాటరీ తగిలిందనో లేక ప్రైజ్‌లు వచ్చాయనో ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్ వస్తాయని, కొంత మొత్తం డబ్బులు డిపాజిట్ చేస్తే ఈ లాటరీ/ప్రైజ్‌లు మీకు వస్తాయని మోసగాళ్లు ప్రలోభపెడతారని పేర్కొంది. వాళ్లు చెప్పినట్లుగా డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ తర్వాత ఎలాంటి స్పందన ఉండదని వివరించింది. బ్యాంకులు తమ ఖాతాదారుల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ తరహా మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేలా పోస్టర్లు, పాంప్లెట్లు, నోటీసులు, ఇంకా ఇతర మార్గాల ద్వారా బ్రాంచ్‌లు, ఏటీఎంల్లో విస్తృతమైన ప్రచారం చేయాలని ఆర్బీఐ సూచించింది. మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలు ఆకర్షితులు కాకుండా చూడడంలో బ్యాంక్ సిబ్బంది తగిన తోడ్పాటునందించాలని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ. లక్షకు మించిన మోసపూరిత కేసులు 861 నమోదయ్యాయని, వీటి విలువ రూ.4,920 కోట్లని వివరించింది. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,651 కేసులు నమోదయ్యాయని, వీటి విలువ రూ.11,083 కోట్లని పేర్కొంది. -
ప్రభుత్వ ఈ-మెయిల్స్‌నూ కోరవచ్చు
విశ్లేషణ ప్రభుత్వ అధికారులకు విన్నపాలు ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలి? జనం తమ కష్టాలు చెప్పుకోవడానికి సులువైన పద్ధతులు అందు బాటులో ఉండాలి. కష్టాలు చెప్పుకోవడానికి వీలు కల్పించకుండా చేయగలి గిందేమీలేదు. ఈ- పాలన, డిజిటల్ ఇండియా, ఈ-కామర్స్ అని మాట్లాడుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ప్రతివారికి ఈ-మెయిల్స్ పంపే అవకాశం వచ్చింది. కాగితాలు, పోస్టల్ కవర్లు, స్టాంపులు అవసరం ఉండ కూడదు. ఈ-మెయిల్ చేసి జవాబులు పొందడానికి ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వాలు డిజిటల్ ఇండియా డిజిటల్ ప్రపంచం అంటే అర్థం లేదు. ప్రభుత్వాధి కారికి జనం చెప్పుకునేందుకు ఒక ఈ-మెయిల్ అడ్రసు ఉండడం, అది పనిచేస్తూ ఉండడం ప్రాథమిక అవసరం. ఆ ఈ-గోడు తమకు ముట్టిందని తెలియ జెప్పాలి. ఆ తరువాత ఆ గోడును పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. లేకపోతే పరిష్కరించలేక పోవడానికి కారణాలు తెలియ జేయాలి. ఇది పరి పాలనలో ముఖ్యమైన అంశం. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అధికారులకు ఈ-మెయిల్ ఐడీలను తయారు చేసిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు ఆ మొత్తం ఈ-మెయిల్ ఐడీలను ఇవ్వాలని, అవి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఒక సీడీ రూపంలో ఇవ్వాలని న్యాయవాది మణిరాం శర్మ ఆర్టీఐ కింద కోరారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) కింద ఆయా ప్రభుత్వ కార్యాలయాలు తాము జనానికి అందించే సేవలేమిటో, ఎంతకాలంలో చేస్తారో వివరిస్తూ కష్టాలు, ఫిర్యాదులు ఎవరికి, ఏ విధంగా చెప్పుకోవాలో కూడా తమంత తామే వివరించాలి. కనుక ఆ ఈ-మెయిల్ ఐడీలు ఇవ్వాల్సిందేనని వాదించారు. వివిధ విభాగాలు వారు కోరిన విధంగా వెబ్సైట్లూ, ఈ-మెయిల్ ఐడీలూ తయారుచేసి ఆ ప్రభుత్వశాఖల వారికివ్వడం వరకే తమ బాధ్యత అని, తరువాత తమ దగ్గర అవి ఉండబోవని, కనుక తాము ఇవ్వజాలమని ఎన్ఐసి ప్రజా సమాచార అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. అన్ని ఈ-మెయిల్ ఐడీలను ఒకచోట సీడీలో ఇస్తే హాకర్లకూ, సైబర్ నేరగాళ్లకూ అదొక సులువైన నేర సాధనం అవుతుందని, ప్రభుత్వ వెబ్సైట్ల సమా చారం అపహరించడానికి, వాటిని స్తంభింప చేయ డానికి, వారు దాడులు చేస్తారని సైబర్ నిపుణులు సమాచార కమిషన్‌కు వివరించారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కోసం తయారు చేసిన ఈ-మెయిల్ చిరునామాల సమాచారం మూడో వ్యక్తి సమాచారం అవుతుంది కనుక వారి అనుమతి తీసుకోకుండా తాము వాటిని ఇవ్వజాలమని, వారి అనుమతి తీసుకోవడం చాలా పెద్ద పని అవుతుందని కూడా ఎన్ఐసి వారు వాదించారు. ఈ వాదన సమంజసం కాదు. ఈ కేసు అనేక దశలు దాటి, ముగ్గురు సభ్యుల సమాచార కమిషన్ పీఠం ముందుకు వచ్చింది. సీనియర్ కమిషనర్లు బసంత్ సేథ్, యశోవర్ధన్ ఆజాద్‌తో నేను కూడా విచారణలో ఉన్నాను. ప్రజల ఫిర్యాదుల విచారణకు, నివారణకు ఈ-మెయిల్ కాంటాక్ట్‌లు ప్రజారంగంలో ఉండడం చాలా అవసరం అన్న వాదం సరైనదే. అది ప్రజాప్రయోజనకరమైన అంశమే. ఈ-మెయిల్స్‌ను తయారు చేసి, పనిచేయించే పరిజ్ఞానం, బాధ్యత ఉన్న ఎన్ఐసీ మాత్రమే ఇవ్వగలదు కనుక వారిని వివరాలు అడగడంలో కూడా తప్పులేదు. ఎన్నో ఈ-మెయిల్ ఐడీలు అసలు పనికిరావని, అవి పని చేస్తున్నాయోలేదో తెలియక జనం తమ మహజర్లు పంపుతూ ఉంటారని, కనీసం పనిచేసే ఈ-మెయిల్ ఐడీలు ఏవో చెప్పవలసిన బాధ్యత ఉందని లాయర్ ఆర్కె జైన్ గుర్తు చేశారు. ఈ-మెయిల్స్ అన్నీ టోకున ఇస్తే గుండుగుత్తగా అన్ని వెబ్సైట్ల మీద దాడిచేసే ప్రమాదాలను ఆపడం ముఖ్యమైన అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ-మెయిల్ విషయమై విధాన ప్రకటన చేసింది. ఆ విధానాన్ని అమలు చేసే బాధ్యత ఎన్ఐసీకి అప్పగించింది. ఎన్ఐసీ తయారు చేసిన ఈ-మెయిల్ ఐడీలనే వాడాలని; గూగుల్, యాహూ వంటి ప్రైవేటు సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ప్రభుత్వ అధికారులు, తమ అధికార కార్యక్రమాలకు వినియోగించకూడదని కూడా కేంద్రం నిర్దేశించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు, మొత్తం దేశానికి ఒక ఈ-మెయిల్డెరైక్టరీని తయారు చేయాలని ప్రభుత్వం ఎన్ఐసీని ఆదేశించింది. ఒకే వేదిక మీద సమాచార సంచార సమ్మేళనం కోసం కేంద్రం కృషి చేస్తున్నది. ఒక సమగ్రమైన ఈ-మెయిల్ అనుసంధానం, అన్ని ప్రభుత్వ రంగాలు, శాఖలను కలిపే ఒక వేదికను, వెబ్ డెరైక్టరీ తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రజల అభిప్రాయాలు కూడా కోరారు. కనుక పారదర్శకత్వం కోసం, పాలనను మెరుగుపరచడం కోసం, అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం సమగ్రమైన ఈ-మెయిల్ డెరైక్టరీని ఎన్ఐసీ తయారు చేయాలని, అందుకు ప్రభుత్వ విభాగాలన్నీ సహకరించాలని, సైబర్ దాడులను నివారించే కృషి చేయాలని ఎన్ఐసీ ముగ్గురు కమిషనర్లు ఆదేశించారు. (మణిరాం శర్మ వర్సెస్ ఎన్ఐసీ NIC, CIC/BS/A/2012/001725, లో ముగ్గురు సభ్యులధర్మాసనం 16 డిసెంబర్ 2015న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఈ మెయిల్స్ వల్ల 1,900 ఉద్యోగాలు గోవిందా!
సిడ్నీ: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందంటే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చాలా మంది ఆశావాహులు భావిస్తారు. కానీ, ఆస్ట్రేలియాలో మాత్రం దీనివల్ల ఏకంగా 1,900 భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ మధ్య కాలంలో ఈమెయిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఇక ఉత్తరాల బట్వాడా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పోస్ట్ అనే ఓ సంస్థ కూడా వివిధ సంస్థలు వ్యక్తులకు ఉత్తరాలు చేరవేసే సంస్థను నిర్వహిస్తుండేది. దీని ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తుండేది. అయితే, రాను రాను ఈమెయిల్స్ వాడకం ఎక్కువై ఉత్తరాలు ఉపయోగించేవారి సంఖ్య తక్కువవడంతో ఆ సంస్థ ఆదాయం పడిపోయింది. పైగా లావాదేవీలు పది శాతం తగ్గాయి. దీంతో ఉత్తరాలు చేరవేసేవారు పని లేకుండా ఖాళీగా ఉండటం, అనుకున్న లావాదేవీలు జరగకపోవడంతో మూడేళ్లలో మొత్తం 1,900 మందిని తొలగించినున్నామని ప్రకటించింది. -
ప్రతి ఇంటా ఈ-సాక్షరత
పల్లె ప్రజలకు ఐటీ పాఠాల కోసం కొత్త కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి ఇంటా ఓ వ్యక్తి సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో కనీస నైపుణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ లేదా ఏదైనా డిజిటల్ పరికరం ఉపయోగించి ఈ-మెయిల్స్ పంపడం, స్వీకరించడంతోపాటు కావాల్సిన సమాచారం కోసం ఇంటర్నెట్లో శోధించగలగాలి. జాతీయ ఐటీ విధానం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటైన ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ (ఎన్డీఎల్ఎం)ను ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రతి ఇంటా ఈ- సాక్షరత’ పేరుతో అమలు చేయనున్న ఈ పథకాన్ని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించిన పరస్పర అంగీకార పత్రంపై కేంద్ర ఐటీ శాఖ అధికారి దినేష్ కుమార్ త్యాగి, మీ సేవా తెలంగాణ రాష్ట్ర సంచాలకులు బి.శ్రీధర్ సంతకాలు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు మండలాలు ఎంపిక పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని కోసం గజ్వేల్ (మెదక్), సూర్యాపేట(నల్లగొండ), సిరిసిల్ల (కరీంనగర్), అచ్చంపేట (మహబూబ్‌నగర్) మండలాలను ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో ఎన్డీఎల్ఎం శిక్షణ ఇవ్వనున్నారు. మండలానికి 7,500 మంది చొప్పున తొలిదశ కింద నాలుగు మండలాల్లో 30 వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. -
పీసీతో ఇలా... చకచకా!
ఇంట్లో ఓ పీసీ, దానికో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం చేయలేని పనంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఈమెయిళ్లు, చాటింగ్‌లు, ఆఫీసు పనులను పక్కనబెడితే... ఏ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా ఎన్నో సరదా, సీరియస్ పనులను చక్కబెట్టుకోవచ్చు. కేవలం గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ వంటి బ్రౌజర్లతో మాత్రమే ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు... ఏయే పనులు చేయవచ్చో మచ్చుకు చూద్దామా.... జీమెయిల్ కోసం రెండు ఆప్స్... జీమెయిల్లో మెసేజ్ టైప్ చేసి... మెయిల్ ఫలానా టైమ్‌కు, ఫలానా వారికి పంపితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే బూమరాంగ్ మీకోసమే. www.boomeranggmail.com/వెబ్సైట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. మీ మెయిళ్లను మీరు అనుకున్న సమయానికి పంపేందుకు వీలు ఏర్పడుతుంది. అయితే ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్ కాకపోవడం గుర్తుంచుకోవాలి. బేసిక్ అకౌంట్ ద్వారా నెలకు 10 మెయిళ్లను ఉచితంగా షెడ్యూల్ చేసి పంపవచ్చు. అంతకంటే ఎక్కువ మెయిళ్లను పంపాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం సర్వీసులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీకు ఒకటికంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే... వాటిని ఒకేచోట చూసుకునేందుకు వీలు కల్పిస్తుంది చెకర్ ప్లస్ ఫర్ జీమెయిల్. క్రోమ్ వెబ్‌స్టోర్ ద్వారా లభించే ఈ ఎక్స్టెన్షన్లో ఒక డ్రాప్‌డౌన్ మెనూ ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్లలో చదవని మెయిళ్లు, వాటి ప్రివ్యూలు కనిపిస్తూంటాయి. ఫొటోలకు రంగులు అద్దండి... స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోలు తీయడం బాగా పెరిగిపోయింది. అయితే ఈ ఫొటోలకు సరదాగా రంగులద్దాలనుకుంటే? లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించాలను కుంటే సైకోపెయింట్ అవకాశం కల్పిస్తుంది. రకరకాల పెయింట్ శైలుల నుంచి ఆన్లైన్లోనే మీ ఫోటోలకు రంగులు అద్దవచ్చు. లేదంటే సిద్ధంగా ఉన్న కొన్ని టూల్స్‌ను వాడుకోవచ్చు కూడా. మీకు పెయింటింగ్‌తో పరిచయముంటే కొత్తకొత్త డిజిటల్ కళాఖండాలను తయారు చేసేందుకు ఈ వెబ్సైట్లో బోలెడు రకాల బ్రష్‌లు, పెయింట్ ఎఫెక్ట్లు ఇచ్చే ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం psykopaint.comవెబ్సైట్ చూడండి. ఐఫోన్ అప్లికేషన్గానూ సైకోపెయింట్ లభిస్తోంది. ఫోటోల ఎడిటింగ్... ఫోటోలకు పెయింట్ లక్షణాలను చేర్చేందుకు సైకోపెయింట్ ఉపయోగపడితే... సైజును సరిచేయడం, రంగులు నియంత్రించడం, వెలుతురును అడ్జస్ట్ చేయడం వంటి పనులకు పిక్స్‌లర్ దారి చూపుతుంది. పూర్తిస్థాయి ఫొటో ఎడిటింగ్ కోసం పిక్స్‌లర్ ఎడిటర్, ఎఫెక్ట్‌లను చేర్చేందుకు పిక్స్‌లర్ ఓ మాటిక్, వేగంగా కొన్ని అంశాలను మాత్రమే సరిచేయాలనుకుంటే పిక్స్‌లర్ ఎక్స్‌ప్రెస్.. ఇలా మూడు లేయర్లలో ఈ వెబ్సైట్ సేవలు పనిచేస్తాయి. ఒక్కో లేయర్లో ఫొటోల నాణ్యతను పెంచేందుకు కొన్ని టూల్స్ ఏర్పాటు చేశారు. ఎడిటింగ్ మొత్తం పూర్తయ్యాక మీ ఫోటోలను మళ్లీ కంప్యూటర్‌పై సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్: Pixlr.com ఈసెల్.ఎల్వై... వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక ఫొటో ద్వారా చెప్పవచ్చు. అలాంటి ఫోటోలకు అంకెలు, గ్రాఫ్‌లు కూడా కలిశాయనుకోండి... విషయాన్ని సూటిగా, వివరించవచ్చు. అచ్చంగా ఈ పనులన్నింటికీ ఉపయోగపడే వెబ్సైట్ ఈసెల్.ఎల్వై. దాదాపు 300కుపైగా ఉన్న లేఔట్లను ఉచితంగా వాడుకునే అవకాశముంది. ఆ లేఔట్లపై రకరకాల ఫొటోలు, చిత్రాలను చేర్చుకునే సౌలభ్యం ఉంది దీంట్లో. పూర్తయిన తరువాత ఇన్ఫోగ్రాఫిక్ను జెపీఈజీ, పీడీఎఫ్ ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ : www.easel.ly డెస్క్టాప్పై నోటీస్‌బోర్డు... ఏరోజుకు ఆరోజు మీరు చేయాల్సిన పనులను గుర్తు పెట్టుకునేందుకు ప్యాడ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. www.padlet.comవెబ్సైట్లో ఒకసారి ఫ్రీఅకౌంట్ను క్రియేట్ చేసుకుంటే చాలు. డెస్క్టాప్పై ఒక బ్లాంక్ నోటీస్‌బోర్డు ప్రత్యక్షమవుతుంది. మౌస్తో డబుల్‌ట్యాప్ చేయడం ద్వారా మీరు అందులో నోట్లు ఉంచుకోవచ్చు. టెక్ట్స్‌తోపాటు వెబ్‌లింక్‌లు, ఫైళ్లు, వెబ్‌క్యామ్‌తో తీసిన ఫొటోలను కూడా ఉంచుకోవచ్చు. ఇతరులతో షేర్ చేసుకునేందుకు అవకాశముంది. బ్లాంక్‌గా ఉండటం బోరు కొట్టిస్తూంటే అందమైన వాల్పేపర్లతో అలంకరించుకోవచ్చు. రకరకాల లేఔట్లతో తీర్చిదిద్దుకోవచ్చు కూడా. -
అమెరికా నిఘాకు చిక్కని ‘ప్రోటాన్‌మెయిల్’!
కొత్త ఉచిత ఈ-మెయిల్ సర్వీసు ప్రారంభం వాషింగ్టన్: నెటిజన్ల ఈ-మెయిళ్లపై అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్ఎస్ఏ నిఘా పెట్టిన నేపథ్యంలో.. ఇతరులు చూసేందుకు వీలులేని కొత్త ఎన్‌క్రిప్ట్ ఈ-మెయిల్ సర్వీసు ‘ప్రోటాన్‌మెయిల్’ను శుక్రవారం ఓ కంపెనీ ప్రారంభించింది. ఈ ఉచిత సర్వీసుతో ఈ-మెయిళ్లకు కొత్త ఎన్క్రిప్షన్ పద్ధతితో పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. ఎంఐటీ, సెర్న్ శాస్త్రవేత్తలతో కలిసి తాము ప్రోటాన్మెయిల్ను రూపొందించినట్లు ఈ-మెయిల్ సర్వీసు కో-డెవలపర్ జాన్ స్టాక్‌మన్ వెల్లడించారు. దీని సర్వర్లు స్విట్జర్లాండ్‌లోనే ఉంటాయన్నారు. ఇందులో ఎలాంటి ఇన్స్టాల్స్ లేకుండా అన్ని పనులూ పరోక్షంగానే జరుగుతాయని, అందువల్ల అమెరికా సంస్థలు వీటిలోకి చొరబడటం అంత సులభం కాదన్నారు. -
ప్రధాని, జీవోఎంకు 8,067 ఈ-మెయిళ్లు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ 8,067 ఈ-మెయిళ్లను ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రుల బృందానికి(జీవోఎం) పంపామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు 8,067 గ్రామపంచాయతీలు ఈ మేరకు తీర్మానాలు చేసి పంపాయని తెలిపారు. మైసూరా మాట్లాడుతూ.. సమైక్య తీర్మానాలు చేసిన గ్రామాలు ఇంకా ఎక్కువే ఉన్నాయని, ఈ-మెయిల్ చేయడానికి సౌకర్యం లేనందున తమకు పూర్తి సమాచారం రాలేదని చెప్పారు. ఈ నెల 7న జీవోఎం సమావేశమవుతున్నందుకు నిరసనగా 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేయాలని పార్టీ ఇచ్చిన పిలుపును ఆయన మరోసారి గుర్తు చేశారు. కేంద్రానికి ఈ-మెయిళ్లు పంపడం వల్ల ప్రయోజనముంటుందా? అని ప్రశ్నించగా.. ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రభుత్వమైతే తప్పక స్పందిస్తుందని మైసూరా వివరించారు. ప్రభుత్వమే ప్రేరేపించింది నల్లగొండ జిల్లాలో వరద బాధితులను పరామర్శించకుండా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ప్రతిఘటించడం వెనుక రాష్ట్రప్రభుత్వమే ఉందని, మంత్రులు ప్రేరేపించడంతోనే ఇలా జరిగిందని కొణతాల దుయ్యబట్టారు. మంత్రులుగా ఉన్నవారే అడ్డుకోవాలని పిలుపునివ్వడం చాలా తప్పని, ఆ నియోజకవర్గాల్లో వారి పలుకుబడి క్షీణిస్తుంటే మాత్రం ఇలా చేయాలా? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ వరద ప్రాంతాలను సందర్శించి రాజకీయాలు మాట్లాడారు కానీ విజయమ్మ తన పర్యటనలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని, అయినా ప్రభుత్వమే కావాలని అడ్డుకుందని కొణతాల విమర్శించారు. చంద్రబాబుకు మాత్రం పోలీసులు, మంత్రులే ఘనస్వాగతం పలికారన్నారు. ఖమ్మంలో విజయమ్మ పర్యటన విజయవంతంగా, ప్రశాంతంగా జరిగిందని, అందుకే నల్లగొండలో కావాలని అడ్డుకున్నారని చెప్పారు. ఇలాంటి అడ్డంకులవల్ల తమ పర్యటనలు ఆగవని, తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆయన దృఢంగా పేర్కొన్నారు.