కొత్త ఉచిత ఈ-మెయిల్ సర్వీసు ప్రారంభం
వాషింగ్టన్: నెటిజన్ల ఈ-మెయిళ్లపై అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్‌ఎస్‌ఏ నిఘా పెట్టిన నేపథ్యంలో.. ఇతరులు చూసేందుకు వీలులేని కొత్త ఎన్‌క్రిప్ట్ ఈ-మెయిల్ సర్వీసు ‘ప్రోటాన్‌మెయిల్’ను శుక్రవారం ఓ కంపెనీ ప్రారంభించింది. ఈ ఉచిత సర్వీసుతో ఈ-మెయిళ్లకు కొత్త ఎన్‌క్రిప్షన్ పద్ధతితో పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. ఎంఐటీ, సెర్న్ శాస్త్రవేత్తలతో కలిసి తాము ప్రోటాన్‌మెయిల్‌ను రూపొందించినట్లు ఈ-మెయిల్ సర్వీసు కో-డెవలపర్ జాన్ స్టాక్‌మన్ వెల్లడించారు. దీని సర్వర్లు స్విట్జర్లాండ్‌లోనే ఉంటాయన్నారు. ఇందులో ఎలాంటి ఇన్‌స్టాల్స్ లేకుండా అన్ని పనులూ పరోక్షంగానే జరుగుతాయని, అందువల్ల అమెరికా సంస్థలు వీటిలోకి చొరబడటం అంత సులభం కాదన్నారు.
అమెరికా నిఘాకు చిక్కని ‘ప్రోటాన్‌మెయిల్’!
Published Mon, May 19 2014 2:01 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement