
భారతదేశంలో పనిగంటలపై తీవ్రమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. 90 గంటలు పనిచేయాలని ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు. ఇప్పుడు తాజాగా క్యాప్‌జెమిని సీఈఓ 'అశ్విన్ యార్డి' (Ashwin Yardi) వారానికి 47.5 గంటల పని సరిపోతుందని అన్నారు.
ఉన్నత స్థాయి అధికారులు పని గంటలు ఎక్కువ చేయాలని పిలుపునిస్తుండగా.. క్యాప్‌జెమిని సీఈఓ అశ్విన్ యార్డి వారానికి 47.5 గంటల పని సరిపోతుందని, వారాంతాల్లో ఉద్యోగులకు పనికి సంబంధించిన ఎటువంటి ఈమెయిల్‌లు పంపవద్దని పిలుపునిచ్చారు. రోజుకి 9:30 గంటలు, వారానికి ఐదు రోజులు (47:30 గంటలు) పని చేస్తే చాలని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరంలో వెల్లడించారు.
ఇదీ చదవండి: 'ఐదు రోజులే పని.. వారాంతంలో నో ఈమెయిల్స్': క్యాప్‌జెమిని సీఈఓ
నాలుగు సంవత్సరాలుగా ఇదే ఫార్ములా పాటిస్తున్నానని.. కొన్ని సార్లు తప్పనిసరి అయితే మాత్రమే తాను వారాంతంలో పనిచేసినట్లు చెప్పారు. అయితే వారాంతంలో నేను పనిచేసినప్పుడు కూడా ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపనని అని అన్నారు. అశ్విన్ యార్డి మాటలతో.. నాస్కామ్ చైర్‌పర్సన్ సింధు గంగాధరన్ కూడా ఏకీభవించారు. పని గంటల కంటే ఫలితాలు ముఖ్యమని నొక్కి చెప్పారు. మారికో సీఈఓ సౌగత గుప్తా కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు.. కానీ అప్పుడప్పుడు రాత్రి 11.00 గంటల వరకు ఈమెయిల్‌లు పంపినట్లు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment