CapGemini
-
ఎస్‌ఏపీతో క్యాప్‌జెమినీ జట్టు.. 8,000 మందికి ట్రైనింగ్
ముంబై: ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ తాజాగా ఎస్ఏపీ ల్యాబ్స్‌తో చేతులు కలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయంగా 8,000 మంది వెనుకబడిన యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు క్యాప్‌జెమినీ–ఎస్ఏపీ డిజిటల్ అకాడెమీ ప్రోగ్రాంను అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వనరుల సమీకరణ, నెట్‌వర్క్‌లు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తాయని క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. తమ కెరియర్లలో విజయాలను అందుకునేందుకు దేశ యువతకు సాధికారత కల్పించేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా ఎండీ సింధు గంగాధరన్ పేర్కొన్నారు. -
‘పెద్ద సంఖ్యలో’.. ఐటీ ఉద్యోగులకు క్యాప్‌జెమినీ చల్లని కబురు!
ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ భారత్‌లోని ఐటీ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. దేశీయ వ్యాపారంలో వృద్ధిని అంచనా వేస్తూ 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో "పెద్ద సంఖ్యలో" ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. బిజినెస్ వార్త సంస్థ మింట్‌తో జరిగిన సంభాషణలో క్యాప్‌జెమినీ చీఫ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్ ఆఫీసర్ నిషీత్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశ్రమలోని పోటీ కంపెనీలకు అనుగుణంగా తమ కంపెనీ హెడ్‌కౌంట్ పెరుగుతుందని తెలిపారు. ఇది ఐటీ సెక్టార్లో సవాలుగా ఉన్న 2024 ఆర్థిక సంవత్సరం తర్వాత సానుకూల మార్పును సూచిస్తుంది. క్యాప్‌జెమినీకి 2024 ఫిబ్రవరి నాటికి భారత్‌లో 1,75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నాస్కామ్ ప్రకారం 253.9 బిలియన్ డాలర్లు సంచిత రాబడితో 2024 ఆర్థిక సంవత్సరం ముగియగలదని అంచనా వేస్తున్న భారత ఐటీ రంగం.. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా కాలంగా ఎదుర్కొంటున్న వ్యయ కట్టడి పరిస్థితి నుంచి పుంజుకునేలా కనిపిస్తోంది. మింట్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కంపెనీల్లో 49,936 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. మూడవ త్రైమాసిక ఫలితాలను అనుసరించి దేశీయ ఐటీ మేజర్లు వివిధ పరిశ్రమలలోని క్లయింట్ల సెంటిమెంట్‌కు అనుగుణంగా వ్యయం విషయంగా విచక్షణతో వ్యవహరిస్తున్నాయి. -
క్లౌడ్‌కు ఏఐ మద్దతు: క్యాప్‌జెమిని
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో ప్రతీ మూడు ఫైనాన్షియల్ సరీ్వసుల సంస్థలలో రెండు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని పేర్కొంది. తద్వారా పూర్తి వేల్యూ చైన్‌లో ఏఐ వినియోగం జోరందుకోనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. క్లౌడ్‌ను భారీస్థాయిలో అమలు చేస్తేనే ఏఐ పెట్టుబడుల ఫలితం లభిస్తుందని తెలియజేసింది. అయితే ఫైనాన్షియల్ సరీ్వసుల కంపెనీలు క్లౌడ్‌ను పరిమిత స్థాయిలోనే వినియోగిస్తుండటంతో ఏఐ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటున్నట్లు వివరించింది. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలలో సగంవరకూ కీలకమైన బిజినెస్ అప్లికేషన్లను క్లౌడ్‌లోకి మార్పు చేసుకోనేలేదని వెల్లడించింది. అయితే కొద్ది నెలలుగా బ్యాంకులు, బీమా సంస్థలలో 91 శాతం క్లౌడ్ సర్వీసుల వినియోగంలోకి ప్రవేశించాయని పేర్కొంది. 2020లో నమోదైన 37 శాతంతో పోలిస్తే ఇది భారీ పురోగతి అంటూ నివేదిక ప్రస్తావించింది. అయితే అధిక శాతం కంపెనీలు క్లౌడ్‌లోకి ప్రవేశించినప్పటికీ.. సర్వే ప్రకారం 50 శాతం సంస్థలు కీలక బిజినెస్ అప్లికేషన్లకు నామమాత్రంగానే క్లౌడ్ సేవలు పొందుతున్నట్లు క్యాప్‌జెమిని నివేదిక వెల్లడించింది. ఏఐకు భారీ డిమాండ్ కీలక సరీ్వసులలో ఏఐ, జెన్ ఏఐ విలువ ప్రతిబింబించాలంటే క్లౌడ్‌ను భారీ స్థాయిలో అమలు చేయవలసి ఉంటుందని క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్ అనుజ్ అగర్వాల్ తెలియజేశారు. వెరసి బ్యాంకులు క్లౌడ్‌కు ప్రాధాన్యత ఇస్తే ఫిన్‌టెక్ సరీ్వసుల్లో వృద్ధికి ఇది సహకరిస్తుందని వివరించారు. ప్రస్తుతం ఫిన్‌టెక్‌లు కొన్ని ప్రత్యేక విభాగాలలో ఏఐను వినియోగించడం ద్వారా బ్యాంకులకు భారీ విలువను చేకూర్చుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు ఆటోమేషన్, వ్యక్తిగత కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఆర్థిక నేరాల కట్టడి, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే దేశీయంగా ఏఐ నైపుణ్యం అత్యధిక స్థాయిలో విస్తరించి ఉన్నట్లు తెలియజేశారు. ఏఐలో భారీ పెట్టుబడులు నమోదుకావడంతోపాటు.. ఏఐ సొల్యూషన్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు తెలియజేశారు. డిజిటల్ ఇండియాకు ప్రభుత్వ మద్దతు, విస్తృత డేటా అందుబాటు తదితరాలు దేశంలో ఫిన్‌టెక్ విప్లవానికి తోడ్పాటునిస్తున్నట్లు వివరించారు. -
ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు
ఐటీ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికేందుకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇపుడిక విప్రో, క్యాప్‌జెమినీ LTIMindtree టాప్ కంపెనీలు వారంలో అన్ని రోజులు లేదా సగం రోజులు ఇక ఆఫీసుకు రావాలని ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు ఇక ముగిసినట్టే కనిపిస్తోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పాయి. దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన పూణె , బెంగళూరు, హైదరాబాద్‌లోని పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు మౌఖిక, అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా రిమోట్ వర్క్ ఉద్యోగాల వేటలో తలమునకలై ఉన్నారు. (మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!) కాగా గ్లోబల్‌గా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఐటీ సంస్థలను కలవరపెడుతున్నాయి. ఆదాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వందలమందిని లేఆఫ్స్ చేశాయి. కొత్త నియామకాలను దాదాపు నిలిపి వేశాయి. రానున్న కాలంలో ఇది మరింతగా ముదురుతుందనే ఆందోళనను నిపుణులువ్యక్తం చేస్తున్నారు. -
అది ఆఫర్ లెటర్ కాదు.. ఫ్రెషర్లకు షాకిచ్చిన క్యాప్‌జెమినీ!
ఆన్‌బోర్డింగ్ విషయంలో కాస్త ఓపిక పట్టాలని ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెషర్లను కోరింది. 2022లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేసినవారిని 2023లో ఎప్పుడైనా ఆన్‌బోర్డ్ చేయనున్నట్లు తెలియజేసింది. ఖాళీల లభ్యత ఆధారంగా ఆన్‌బోర్డింగ్ ఉంటుందని అభ్యర్థులకు సమాచారం అందించింది. (ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!) క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఆన్‌బోర్డింగ్‌పై స్పష్టత కోసం కంపెనీని సంప్రదించగా ఈ మేరకు బదులిచ్చింది. ఎంపికైన అభ్యర్థులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) మాత్రమే ఇచ్చామని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కంపెనీకి లేదని పేర్కొంది. దీన్ని ఆఫర్ లెటర్‌గా పరిగణించకూడదని యూనివర్సిటీ రిలేషన్స్ అండ్ టాలెంట్ హైరింగ్ టీమ్ తెలిపింది. (తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!) భారతదేశంలోని చాలా ఐటీ కంపెనీలు గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లను ఇంకా ఆన్‌బోర్డ్ చేయలేదు. మాంద్యం సంకేతాలు ఉన్న ఉత్తర అమెరికా, యూరప్‌లో వ్యాపార అనిశ్చితి దీనికి కారణం. దీంతో సిబ్బంది వ్యయాల విషయంలో ఆయా కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు, అంచనాలు గణనీయమైన మందగమనాన్ని సూచిస్తున్నాయి. -
ఈవీలపై దేశీ కార్పొరేట్ల దృష్టి
ముంబై: దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లవైపు దృష్టి సారిస్తున్నాయి. తమ ప్లాంట్లు కార్యాలయాల్లో ఉద్యోగుల రవాణాకు ఇవి అనుకూలమని భావిస్తున్నాయి. దీంతో మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కోతోపాటు ఐటీ బ్లూచిప్ కంపెనీలు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలు బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్, అలియంజ్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ వాహన పాలసీలకు తెరతీస్తున్నాయి. తద్వారా ఉద్యోగులను ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీల అమ్మకాలు ఊపందుకున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ల తాజా ప్రణాళికలు పరిశ్రమకు జోష్‌నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని సంస్థలు రెడీ బ్యాటరీ ఆధారంగా నడిచే ఈవీలు కొంతకాలంగా భారీగా విక్రయమవుతున్నాయి. మారియట్, నోవాటెల్ తదితర ఆతిథ్య రంగ కంపెనీలు సైతం ఈవీలను కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సంస్థల బాటలో హోటల్ చైన్ కంపెనీలు ఈవీలను మాత్రమే వినియోగించవలసిందిగా విక్రేతలు(వెండార్ల)కు సూచిస్తున్నాయి. ఇక మరోపక్క ఎన్ఎంసీలు తమ కార్యకలాపాలలో ఈవీల వినియోగ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈవీల వినియోగానికి మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశాయి. పర్యావరణ పరిరక్షణ బాటలో ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. డిసెంబర్లో డీలా రూ. 1,100 కోట్ల సబ్సిడీ పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో గత నెల(డిసెంబర్)లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు క్షీణించాయి. 2022 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 20 శాతం నీరసించాయి. రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం స్థానిక మార్కెట్లో నవంబర్‌లో 76,162 వాహనాలు అమ్ముడుపోగా.. డిసెంబర్లో ఇవి 59,554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన ఫేమ్–2 విధానాలలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అయితే 2022 ఏప్రిల్ నుంచి సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక విలువ జోడింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. హీరో ఎలక్ట్రిక్, ఓకినావా ఆటోటెక్, రివోల్ట్, యాంపియర్ తదితర 6 కంపెనీలకు సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టగా.. మరోపక్క సబ్సిడీలు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లోలపై ఒత్తిడి పడుతున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు. సమస్య త్వరగా పరిష్కారంకాకుంటే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోత్సాహకాలు ఇలా ప్రభుత్వం ద్విచక్ర ఈవీలకు కిలోవాట్‌కు రూ. 15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే మొత్తం వాహన వ్యయంలో 40 శాతం మించకుండా పరిమితి విధించింది. ఇందుకు స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ విలువ జోడింపును చేపట్టవలసి ఉంటుంది. ఈ విషయంలో వాహన విక్రయం తదుపరి కంపెనీలు సంబంధిత ఆధారాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఆపై 45–90 రోజుల్లోగా వాహనం రిటైల్ ధరపై ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేస్తుంది. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం అవాంతరాలు సృష్టించబోదని, దేశీయంగా పరిశ్రమలో సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తుందని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. 2023లో రెట్టింపునకు ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎలక్ట్రిక్ వాహన రిటైల్ విక్రయాలు రెట్టింపునకు జంప్‌చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి 2.2 మిలియన్ యూనిట్లకు తాకనున్నట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల సొసైటీ(ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022లో ఈవీ రిటైల్ అమ్మకాలు మిలియన్ యూనిట్లకు చేరాయి. కాగా.. గత నెలలోనే వేదాంతా గ్రూప్ ఉద్యోగులకు ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. నెట్ జీరో కర్బన విధానాలకు అనుగుణంగా తాజా పాలసీకి తెరతీసింది. -
‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు అవసరమైన ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ క్యాప్ జెమినితో కలిసి తెలంగాణ ఇన్నోవేషన్ మిషన్(టీ ఎయిమ్) ‘మొబిలిటీ ఏఐ గ్రాండ్ చాలెంజ్’ను ప్రారంభించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రత్యక్ష, ఫైల్ వీడియోల ఆధారంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన మార్గాల్లో రోడ్లపైనున్న గుంతలను గుర్తించి తీవ్రతను బట్టి వాటిని వర్గీకరించేలా పరిష్కారాన్ని ఈ చాలెంజ్‌లో ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఈ ఆవిష్కరణ ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపడతారు. చాలెంజ్ పట్ల ఆసక్తి ఉన్న ఆవిష్కర్తల నుంచి దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల పరిశీలన తర్వాత ఎంపికైన ఆవిష్కర్తలు నాలుగు వారాల్లోగా తమ ఆవిష్కరణలకు ఎలా కార్యరూపం ఇస్తారు, ఏ తరహా సాంకేతికను వినియోగిస్తారు, దాని ఫలితాలు ఎలా ఉంటాయనే అంశాలపై ఇచ్చే ప్రజెంటేషన్ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. ఈ విధంగా ఎంపికైన విజేతకు జీహెచ్ఎంసీలో తమ పైలట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు వీలుగా రూ.20 లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తారు. ఈ చాలెంజ్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన టీహాన్, ఐ హబ్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్ భాగస్వాములుగా ఉంటాయి. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు మొబిలిటీ గ్రాండ్ చాలెంజ్ వంటి వేదికల ద్వారా ప్రభుత్వాలతో ఆవిష్కర్తల భాగస్వామ్యం మరింత పెరగాల్సి ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వ్యాఖ్యానించారు. ఈ గ్రాండ్ చాలెంజ్ పట్ల ఆసక్తి ఉన్న ఆవిష్కర్తలు సెప్టెంబర్ 16లోగా https: //taim&gc.in/mobility వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ నెలాఖరులో మొబిలిటీ ఏఐ గ్రాండ్ చాలెంజ్ విజేతలను ప్రకటిస్తారు. చదవండి: టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి -
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. కాప్‌జెమినీలో 60 వేల ఉద్యోగాలు..!
ముంబై: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ కాప్జెమినీ గత ఏడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది భారత్‌లో 60వేల మందిని కొత్తగా నియమించుకొనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సరికొత్త నియామకాలతో తమ సంస్థ విలువ మరింత పెరుగుతందని కంపెనీ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్'కి డిమాండ్ పెరగడంతో ఈ నియామకాలు చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నియామకాల్లో అనుభవం ఉన్న వారితోపాటు ఫ్రెషర్లు కూడా ఉండనున్నారని కంపెనీ పేర్కొంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అశ్విన్ యార్డి మీడియాకు వెల్లడించారు. కాప్జెమినీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగం మంది భారతీయులే కావడం విశేషం. 5జీ, క్వాంటం వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై సంస్థ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. ఎరిక్సన్ భాగస్వామ్యంతో కాప్జెమినీ గత ఏడాది భారతదేశంలో 5జీ ల్యాబ్ ప్రారంభించింది అని అశ్విన్ అన్నారు. భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోని క్లయింట్లకు 5జీ రంగ సేవలు అందించేందుకు భారతీయ కంపెనీలతో కలసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్వాంటం, 5జీ, మెటావర్స్ టెక్నాలజీల్లో సేవలందించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నది. కొత్త తరం టెక్నాలజీ నైపుణ్యాలు భారతదేశంలో చాలా ఉన్నాయి అని యార్డీ తెలిపారు. అదేవిధంగా, కాప్జెమినీ క్లౌడ్ & ఏఐ కోసం ఒక అకాడమీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ముంబయిలోని ఆఫీస్‌లో భారీగా స్థలం ఉంది. ఇది కాప్జెమినీకి భారత్‌లోనే ఉన్ అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్. దీనికి తోడు మిగిలిన చోట్ల కంపెనీకి ఉన్న సెంటర్లను కూడా పెంచుతుండటంతో కొత్త ఉద్యోగుల పోస్టింగ్‌లు ఇస్తున్నామని కంపెనీ సీఈవో అశ్విన్ పేర్కొన్నారు. (చదవండి: అదిరిపోయిన హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. ధరెంతో తెలుసా?) -
టెకీలకు ఊరట: వేతనంతో కూడిన సెలవులు
భారతదేశంలోని చాలా ఐటి కంపెనీలు కోవిడ్ కేర్ సదుపాయాలను తమ ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నాయి. కరోనా సోకిన ఉద్యోగులకు 21 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను అందిస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. అలాగే, పూణే, బెంగళూరు నగరాలలో నివసిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబల కోసం కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. పూణేలోని రూబీ హాల్ ఆసుపత్రి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిని కోవిడ్ కేంద్రాలుగా మార్చింది. గ్రూప్ ఎంప్లాయి ఇన్సూరెన్స్ కింద ఉద్యోగులందరికి కొవిడ్ సంబంధిత వైద్య చికిత్సలను కవర్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్, టెస్టింగ్ ల్యాబ్స్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల చికిత్స కోసం 242 నగరాల్లోని 1,490 ఆస్పత్రులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. అలాగే, ఇన్ఫోసిస్ ప్రత్యేక బృందం వైద్య సిబ్బందితో కలిసి తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేయడం వేగవంతం చేసింది. క్యాప్ జెమిని ఇండియా కోవిడ్ సోకిన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కంపెనీ వైద్య భీమా కవరేజ్ వర్తింపచేస్తామని పేర్కొంది. ఇక మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో బెంగళూర్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ లో ఉద్యోగుల కోసం గత వారం వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించింది. చదవండి: వాట్సాప్ అడ్మిన్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు -
గుడ్‌న్యూస్: ప్రముఖ ఐటీ కంపెనీలో కొలువుల జాతర
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. 2021లో భారతదేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్టు క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియమాకలను చేపడతామన్నారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగిందని తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్కు పెరిగి భారీ డిమాండ్ తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో క్యాప్ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్‌దే కావడం గమనార్హం. కరోనానుంచి కోటుకుంటున్న సమయంలో వ్యాపారి తిరిగి పుంజుకుంటుందని, భారీ డీల్స్ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తు మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఏప్రిల్ 2020 లో, మహమ్మారి పీక్ సమయంలో కూడా తాము వేతన పెంపును ప్రకటించామని వెల్లడించారు. దేశీయంగా మొత్తం 125,000 మంది ఉద్యోగులతో ఉన్నగత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారగా పుంజుకున్నాయి. ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమింకోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోవాలని ఆశిస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. -
విప్రో కొత్త సారథిగా థియెరీ డెలాపోర్ట్
న్యూఢిల్లీ: కొంత కాలంగా వృద్ధి పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఐటీ రంగ దిగ్గజం విప్రో కొత్త సారథిని ఎంపిక చేసుకుంది. క్యాప్‌జెమినీలో సుదీర్ఘకాలం పనిచేసిన థియెరీ డెలాపోర్ట్.. నూతన సీఈవో, ఎండీగా జూన్ 6 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని విప్రో నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న అబిదాలి జెడ్ నీముచ్వాలా జూన్ 1న తప్పుకోనున్నారు. అప్పటి నుంచి డెలాపోర్ట్ బాధ్యతలు చేపట్టే వరకు రోజువారీ కార్యకలాపాలను చైర్మన్ రిషద్ప్రేమ్జీ చూస్తారని విప్రో తెలిపింది. పోటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న సలీల్ పరేఖ్ కూడా అంతకుపూర్వం క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ కావడం గమనార్హం. పోటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో పోల్చుకుంటే విప్రో వృద్ధి పరంగా వెనకబడిన తరుణంలో ఈ నూతన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. -
విప్రో సీఈవోగా క్యాప్‌జెమిని సీవోవో
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ కొత్త సీఈవోగా థియర్రీ డెలాపోర్ట్‌ను ఎంపిక చేసుకుంది. క్యాప్‌జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా ఇటీవల వరకూ బాధ్యతలు నిర్వహించిన డెలాపోర్ట్‌ను సీఈవో, ఎండీగా నియమిస్తున్నట్లు విప్రో తాజాగా పేర్కొంది. ఇప్పటివరకూ విప్రో సీఈవోగా కొనసాగుతున్న అబిదాలీ నీముచ్‌వాల ఈ నెల31కల్లా బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీంతో జూన్ 1 నుంచీ డెలాపోర్ట్ విప్రో కొత్త సీఈవోగా పదవిని చేపట్టనున్నారు. నాలుగేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీముచ్‌వాల వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. డెలాపోర్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడైన డెలాపోర్ట్ వివిధ హోదాలలో పాతికేళ్లకుపైనే కంపెనీలో పనిచేశారు. ఈ బాటలో గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యూహాత్మక బిజినెస్ యూనిట్‌కు సీఈవోగా సైతం విధులు నిర్వహించారు. గ్లోబల్ సర్వీస్ విభాగాలకు అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశీయంగా క్యాప్‌జెమిని కార్యకలాపాలను పర్యవేక్షించారు. -
ఆన్లైన్ షాపింగ్‌కే సై..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోన వ్యాప్తి, లాక్డౌన్ తదనంతరం కస్టమర్ల షాపింగ్ తీరు మారుతుందని ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని నివేదిక చెబుతోంది. ఆన్‌లైన్‌కే మొగ్గు చూపనున్నట్టు సర్వేలో వెల్లడైందని తెలిపింది. ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో చేసిన ఈ సర్వే ప్రకారం.. రానున్న 9 నెలల్లో ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్న వారి సంఖ్య 46 నుంచి 64 శాతానికి చేరనుంది. కరోనాకు ముందు దుకాణాల్లో కొనుగోలు చేసిన వారి సంఖ్య 59 శాతం ఉంటే.. లాక్డౌన్ తర్వాత ఈ సంఖ్య 46 శాతం ఉండనుంది. డెలివరీ హామీ ఇచ్చే రిటైలర్ల వద్ద నుంచి కొనుగోళ్లకు 72% మంది మొగ్గు చూపారు. స్వచ్ఛత, ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు 89 శాతం మంది తెలిపారు. డిజిటల్ పేమెంట్స్‌కు 78% మంది ఆసక్తి కనబరిచారు -
భారత టెకీలకు క్యాప్‌జెమిని శుభవార్త
న్యూఢిల్లీ : ఫ్రెంచ్ టెక్ దిగ్గజం క్యాప్‌జెమిని భారత టెకీలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారత్‌లో 30,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పటికే భారత్‌లో దాదాపు 1.15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. నూతన నియామకాలతో తమ కంపెనీ విలువ భారత్‌లో మరింతగా పెరుగుతోందని క్యాప్‌జెమిని భావిస్తోంది. అనుభవవజ్ఞులతో పాటు ప్రెషర్స్‌కు కూడా ఈ నియామకాల్లో అవకాశం కల్పించిననున్నట్టు క్యాప్‌జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ యార్డి పీటీఐకు తెలిపారు. తమ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నవారిలో భారత్‌లోనే సగం మంది ఉన్నారని చెప్పారు. తమ వ్యాపారంలో భారత్‌ది కీలకమైన భాగమని యార్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 25,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో నూతన సాంకేతికతపై నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా మారిందని అన్నారు. తమ కంపనీ ఉద్యోగుల్లో 65 శాతం కంటే ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారేనని చెప్పారు. 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న మధ్య స్థాయి ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీరిని ప్రాజెక్ట్ నిర్వాహకులుగా గానీ ఆర్కిటెక్ట్ లుగా నియమించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. -
కుబేర భారతం
ముంబై: భారత్‌లో కుబేరుల సంఖ్య, వారు కూడబెడుతున్న సంపద పెరుగుతోంది. గత ఏడాది జీఎస్టీ అమల్లోకి రావడం వల్ల దేశ ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమైనప్పటికీ, మన దేశంలో డాలర్ మిలియనీర్ల సంఖ్య 20 శాతం పెరిగిందని ఫ్రాన్స్ టెక్నాలజీ సంస్థ, క్యాప్‌జెమినీ తెలిపింది. అంతే కాకుండా ఈ డాలర్ మిలియనీర్ల సంపద కూడా 20 శాతం పెరిగిందని పేర్కొంది. 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.6.8 కోట్లు ) ఇన్వెస్ట్ చేయగల సంపద ఉన్న వారిని ఈ సంస్థ హెచ్‌ఎన్‌ఐగా పరిగణించింది. అపర కుబేరుల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ అవతరిస్తోందంటున్న ఈ సంస్థ తాజా నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... ♦ గత ఏడాది భారత్‌లో హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ) సంఖ్య 20.4 శాతం పెరిగి 2.63 లక్షలకు చేరింది. ♦ ఈ హెచ్ఎన్ఐల సంపద మొత్తం 21 శాతం పెరిగి లక్ష కోట్ల డాలర్లకు పెరిగింది. ♦ అంతర్జాతీయంగా చూస్తే, హెచ్ఎన్ఐల సంఖ్య 11 శాతం, వారి సంపద 12 శాతం చొప్పున పెరిగాయి. దీంతో పోల్చితే భారత్‌లో హెచ్ఎన్ఐల సంఖ్య 20 శాతం, వారి సంపద 21 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ♦ ప్రపంచంలో అతి పెద్ద హెచ్ఎన్ఐ మార్కెట్లుగా అమెరికా, జపాన్, జర్మనీ, చైనాలు నిలిచాయి. ఈ జాబితాలో మన దేశం 11వ స్థానంలో ఉంది. ♦ భారత్‌లో హెచ్ఎన్ఐల సంఖ్య, వారి సంపద బాగా పెరగడానికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్ బాగా పెరగడమే. గత ఏడాది స్టాక్ మార్కెట్ 50 శాతానికి పైగా వృద్ధి సాధించింది. . 73 శాతం సంపద 1 శాతం చేతిలో.. ♦ గత ఏడాది సృష్టించబడిన మొత్తం సంపదలో 73 శాతాన్ని 120 కోట్ల మొత్తం భారతీయుల్లో కేవలం 1 శాతం జనాభా మాత్రమే చేజిక్కించుకున్నారని అంతర్జాతీయ హక్కుల సంస్థ, ఆక్స్‌ఫామ్ ఈ ఏడాది జనవరిలో పేర్కొంది. మొత్తం భారతీయుల్లో సగానికి పైగా ఉన్న 67 కోట్ల మంది భారతీయుల సంపద కేవలం 1 శాతం మాత్రమే పెరిగిందని ఈ సంస్థ తెలిపింది. -
1.65 కోట్లకు పెరిగిన మిలియనీర్లు
సాక్షి,న్యూఢిల్లీః ప్రపంచవ్యాప్తంగా అసమానతలు వేగంగా పెరుగుతుంటే మిలియనీర్ల సంఖ్యా అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య 8 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1.65 కోట్లకు చేరుకుందని కన్సల్టెన్సీ సంస్థ క్యాప్‌జెమినీ నివేదిక వెల్లడించింది. 2016లో రూ 5 కోట్లు అంతకుమించి పెట్టుబడులు పెట్టగల అధికాదాయ వ్యక్తుల(హెచ్ఎన్ఐ) సంఖ్య 8.2 శాతానికి పెరిగిందని, వీరందరి ఉమ్మడి సంపద 2025 నాటికి వంద లక్షల కోట్ల డాలర్లను దాటుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది కొత్తగా 15 లక్షల మందికి పైగా మిలియనీర్ల జాబితాలో చేరారని పేర్కొంది. ఈ జాబితాలో మూడింట రెండొంతుల మంది మిలియనీర్లు అమెరికా, జపాన్,జర్మనీ,చైనాలకు చెందిన వారేనని నివేదిక తెలిపింది.మిలియనీర్ల ఆస్తుల్లో వారి నివాసాల విలువ, వారు వినియోగించే అత్యంత ఖరీదైన వస్తువుల విలువను లెక్కించలేదని తెలిపింది. -
టెకీలకు శుభవార్త: ఆ కంపెనీ 20వేల ఉద్యోగాలు
బెంగళూరు : ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల నియామకంపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ బహుళ జాతీయ కంపెనీ క్యాప్‌జెమిని గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాది భారత్‌లో 20వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అంతేకాక ఆటోమేషన్ ప్రభావం ప్రస్తుత ఉద్యోగులపై పడకుండా ఉండేందుకు మే నెల వరకు ఈ కంపెనీ 45 వేల మందికి రీస్కిల్ చేపట్టింది. ఈ ఫ్రెంచ్ ఐటీ సర్వీసు కన్సల్టెంట్ గతేడాది 33వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. 51వేల మందికి రీస్కిల్ చేపట్టింది. తాము ఎక్కువమొత్తంలో పెట్టుబడులను ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ అభివృద్ధి కోసం పెడుతున్నామని క్యాప్‌జెమిని ఆటోమేషన్, ఇండస్ట్రియలైజేషన్ హెడ్ క్రిస్టోఫర్ స్టాన్కోమ్బ్ చెప్పారు. తమ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ అవకాశాలు ఆటోమేషన్, ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ కల్పిస్తుండటంతో ట్రైనింగ్ ప్రొగ్రామ్లలో పెట్టుబడులు పెంచినట్టు తెలిపారు. క్యాప్‌జెమిని భారత కార్యకలాపాల్లో కంపెనీకి లక్ష మంది ఉద్యోగులున్నారు. అయితే అంతర్జాతీయంగా ఎంతమందిని నియమించుకుంటుంది, ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తుందో కంపెనీ బహిర్గతం చేయలేదు. ఆటోమేషన్ తమ ఉద్యోగులకు మరింత ఉత్పాదకతను అందిస్తుందని క్రిస్టోఫర్ చెప్పారు. ఆటోమేషన్ ప్రభావం ఉద్యోగులకు మరింత డిమాండ్‌ను కల్పించనుందనే ఈ కంపెనీ చెబుతోంది. అయితే ఆటోమేషన్, డిజిటైజేషన్ ప్రభావంతో చాలా ఐటీ కంపెనీలు నియామకాలను తగ్గించాయి. ఇండస్ట్రి బాడీ నాస్కామ్ సైతం ఈ ఏడాది ఉద్యోగాల వృద్ది కేవలం 5 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో ఉద్యోగ నియామకాలు 20-25 శాతం తగ్గిపోయే అవకాశముందని కూడా అంచనావేసింది. మరోవైపు ఇన్ఫోసిస్ కంపెనీ కూడా 2018 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 20వేల మందిని నియమించుకోనున్నట్టు తెలిపింది. అయితే ఆటోమేషన్తో 11వేల మంది ఫుల్-టైమ్ ఉద్యోగులను ఇంటికి పంపేసినట్టు తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. -
టెకీలకు మరో హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగ ఉద్యోగాల విషయంలో ప్రతిష్టంభన నెలకొన సంగతి తెలిసిందే. ఆటోమేషన్, కొత్త డిజిటల్ టెక్నాలజీస్ పెనుముప్పుగా విజృంభిస్తుండటంతో కంపెనీలు ఉద్యోగులపై భారీగానే వేటు వేస్తున్నాయి. అంతేకాక భవిష్యత్తులోనూ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే దానిపైన గ్యారెంటీ లేదు. ఈ సవాళ్లు భారత్ కు అతిపెద్ద సవాల్ గా ఉన్నాయని, దేశీయ ఐటీ కంపెనీలు తమ స్టాఫ్ ను రీ-ట్రైన్ చేయడం చాలా కష్టతరమని హెచ్చరికలు వస్తున్నాయి. 1.5 మిలియన్ మందిని లేదా ఇండస్ట్రీ వర్క్ ఫోర్స్ లో సగం మందిని రీ-ట్రైన్ చేయాల్సినవసరం ఉందని ఇటీవల ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. కానీ ప్రస్తుతం నాస్కామ్, కన్సల్టింగ్ సంస్థ క్యాప్‌జెమినీతో కలిసి చేసిన అంచనాల్లో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త స్కిల్-సెట్ లలో మధ్య, సీనియర్ స్థాయి దేశీయ ఐటీ కార్మికులు ఇమడలేరని తెలిపాయి. దీంతో మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో కోత ప్రభావం అధికంగా ఉంటుందని తాజాగా హెచ్చరించాయి. తాను నిరాశాపూరిత విషయాన్ని చెప్పడం లేదని, కానీ ఇది ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని క్యాప్‌జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చెప్పారు. 60-65 శాతం మంది శిక్షణ పొందలేరని పేర్కొన్నారు. వీరిలో చాలామంది మధ్యస్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకున్న వారేనని తెలిపారు. దీంతో వారు అత్యధికంగా నిరుద్యోగులుగా మారే అవకాశముందని చెప్పారు. ఐటీ కంపెనీలు కూడా మధ్యస్థాయి ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇచ్చే బదులు ఎక్కువ ప్రతిభావంతులనే తమ కంపెనీలో ఉంచుకోవడానికి మొగ్గుచూపుతాయని పేర్కొన్నారు. మధ్యస్థాయి ఉద్యోగులు కొత్త స్కిల్-సెట్లలో ఇమిడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో వారు ఉద్యోగాల కోత బారిన పడతారని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. తక్కువ స్థాయి స్టాఫ్ కు లేదా కార్మికులకు తేలికగా కంపెనీ రీట్రైన్ చేస్తాయని చెప్పాయి. -
భారీగా అక్రమాలకు తెరతీసిన ఇన్ఫోసిస్
బెంగళూరు: ఓ వైపు ముంచుకొస్తున్న ఆటోమేషన్, మరోవైపు అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ప్రభావంతో దేశీయ రెండో అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ అతిపెద్ద ఆక్రమణ యుద్ధానికి తెరతీసింది. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతూ, ప్రత్యర్థ కంపెనీలకు ఝలకిస్తున్నట్టు పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. మార్చితో ముగిసిన 2017 ఆర్థికసంవత్సరంలో ఇన్ఫోసిస్ అక్రమంగా కాగ్నిజెంట్ నుంచి 13 మంది ఎగ్జిక్యూటివ్ లను, కాప్జెమినీ నుంచి 13 మందిని, టీసీఎస్ నుంచి ఐదుగుర్ని, విప్రో, ఐబీఎం, అసెంచర్, ఐబీఎంల నుంచి 8 మందిని తన కంపెనీలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇతరులను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జెన్సార్, టెక్ మహింద్రా, ఐటీసీ ఇన్ఫోటెల్ లనుంచి నియమించుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎగ్జిక్యూటివ్ ల తీసుకోవడంపై స్పందించడానికి ఇన్ఫోసిస్ నిరాకరించింది. కాగ, మరికొన్ని రోజుల్లో ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించనుంది.టెక్ దిగ్గజాలు ఒక కంపెనీ ఉద్యోగులను మరో కంపెనీలకి తీసుకోవడం సాధారణమే. కానీ హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ వీసాలపై ప్రతిభావంతులైన ఉద్యోగులనే తమదేశ కార్యాలయాల్లోకి తీసుకోవాలంటూ హెచ్చరికలు చేయడం కంపెనీ మరికొంత ఆక్రమణకు తెరతీసినట్టు తెలిసింది. గతేడాది ఇన్ఫోసిస్ అమెరికాలో 150 మంది టాప్-పెయిడ్ ఎగ్జిక్యూటివ్ లను నియమించుకుంటే, వారిలో సగానికి పైగా వ్యక్తులు ఇన్ఫోసిస్ ప్రత్యర్థి కంపెనీ వారేనని ఈటీ డేటాలో వెల్లడైంది. మరో రెండేళ్లలో ఇన్ఫోసిస్ అమెరికాలో 10వేల మందిని పైగా నియమించుకోనున్నట్టు పేర్కొంది. ఇన్ఫోసిస్ తో పాటు మిగతా కంపెనీలు కూడా స్థానిక ఉద్యోగులను భారీగా నియమించుకోనున్నట్టు ప్రకటించాయి. ప్రతిభావంతుల్ని దక్కించుకోవాలనే యుద్ధం కొత్తది కాదని, నైపుణ్యవంతుల కోసం తాము నిరంతరం పోటీపడుతూనే ఉంటామని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు చెప్పారు. ప్రస్తుతం ఆన్ షోర్ లో గతంలో కంటే ఎక్కువగా టాలెంట్ ఉన్న ఉద్యోగులు కావాలన్నారు. ప్రతి కంపెనీ ప్రస్తుతం నియామకాలు చేపడుతుందని, ఒకవేళ ఆన్ షోర్ లో మంచిగా పనితీరు కనబరిస్తే ఇదే వారికి మంచి సమయని ఓ ఇండియన్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే తాము ప్రత్యర్థి కంపెనీల వైపు కాకుండా, క్యాంపస్ నియామకాల వైపు ఎక్కువగా మొగ్గుచూపినట్టు పేర్కొన్నారు. -
ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు
• ఏప్రిల్ నాటికి లక్షకు చేరనున్న క్యాప్‌జెమిని ఉద్యోగులు • కంపెనీ భారత్ సబ్సిడరీ చీఫ్ వెల్లడి ముంబై: ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని భారత్‌లోని ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి లక్షను చేరనున్నది. రక్షణాత్మక విధానాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ, కొత్త ఉద్యోగాలు అధికంగానే ఇస్తామని క్యాప్‌జెమిని తెలిపింది. ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు ఇస్తామని క్యాప్‌జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్య 98,800గా ఉందని, ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి ఈ సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొన్నారు. ముంబై ప్రధాన కేంద్రంగా తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో భారతీయులు ఉద్యోగులుగా ఉన్న విదేశీ ఐటీ కంపెనీల్లో ఇది మూడవది. యాక్సెంచర్, ఐబీఎమ్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ‘వీసా’ ఇబ్బందులు లేవు.. నియామకాల కోసం తాము సందర్శిస్తున్న క్యాంపస్‌ల సంఖ్య, ఇస్తున్న ఉద్యోగ ఆఫర్ల సంఖ్య పెరుగుతున్నాయని శ్రీనివాస్ చెప్పారు. రక్షణాత్మక విధానాలు తమపై ప్రభావం చూపబోవని, ఆటోమేషన్ జోరు పెరిగితేనే హైరింగ్ మందగిస్తుందని వివరించారు. తాము ఎక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తే అక్కడి వారికే ఉద్యోగాలిస్తామని, అందుకని హెచ్ 1–బి వీసా ఇబ్బందులు తమపై ఉండవని వివరించారు. వీసా ఆంక్షలు ఉన్నప్పటికీ, అత్యున్నత ప్రతిభ గల అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతామని చెప్పారు. ప్రతిపాదిత వీసా నిబంధనలపై స్పం దన అతిగా ఉందని విమర్శించారు. డిజిటల్‌కు మారడం, ఆటోమేషన్, క్లౌడ్..ఐటీ రంగంలో ప్రస్తుతమున్న పెద్ద సమస్యలని పేర్కొన్నారు. 25 వేలమంది ఉద్యోగులతో కూడిన ఐ గేట్ విలీనం విజయవంతంగా పూర్తయిందన్నారు. -
భారత్‌లో సంపన్నుల సంఖ్య 2 లక్షలు...
న్యూఢిల్లీ: అధిక నికర సంపద కలిగిన వ్యక్తుల (హెచ్ఎన్డబ్ల్యూఐలు) సంఖ్యా పరంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ నాలుగో అతిపెద్ద దేశమని క్యాప్‌జెమిని అనే సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. భారత్‌లోని హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల వద్ద 797 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్టు తెలిపింది. 2014లో భారత్‌లో వీరి సంఖ్య 1.8 లక్షలు ఉండగా గతేడాదికి ఈ సంఖ్య 2 లక్షలకు పెరిగిందని... వీరి సంపద సైతం 1.6 శాతం వృద్ధి చెందినట్టు ‘ఆసియా-పసిఫిక్ వెల్త్ రిపోర్ట్ 2016’ పేరుతో విడుదల చేసిన నివేదికలో క్యాప్ జెమినీ సంస్థ పేర్కొంది. 2015లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్యా పరంగా జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ వీరి సంఖ్య 27 లక్షలు. 10 లక్షలకు పైగా హెచ్ఎన్డబ్ల్యూఐలతో చైనా రెండో స్థానంలో ఉండగా, 2.3 లక్షల మందితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తంగా 2015లో ఈ ప్రాంతంలోని హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద 9.9% వృద్ధితో 17.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇదే సమయంలో మిగిలిన ప్రపంచ దేశాల్లో హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద 1.7 శాతమే వృద్ధి చెందినట్టు నివేదిక తెలిపింది. -
ఐగేట్ డీల్‌తో వేమూరికి జాక్‌పాట్
రూ. 120 కోట్ల ప్రయోజనం న్యూయార్క్: ఐటీ సేవల సంస్థ ఐగేట్ సీఈవో అశోక్ వేమూరికి జాక్‌పాట్ తగిలింది. ఐగేట్‌ను ఫ్రాన్స్‌కి చెందిన క్యాప్‌జెమిని కొనుగోలు చేస్తుండటంతో వేమూరికి సుమారు 19.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.120 కోట్లు) ప్రయోజనం చేకూరనుంది. 2013లో ఐగేట్ సీఈవోగా చేరిన వేమూరికి కంపెనీలో ప్రస్తుతం 4,00,000 పైచిలుకు షేర్లు ఉన్నాయి. క్యాప్ జెమిని ఆఫర్‌ను బట్టి చూస్తే ఈ షేర్ల విలువ రూ. 120 కోట్ల పైచిలుకు ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఆయన 18,750 షేర్లను గానీ విక్రయించకుండా ఉండి ఉంటే మరింత ఎక్కువగా ప్రయోజనం చేకూరేది. అప్పట్లో ఆయన ఒక్కోటి 39.01 డాలర్ల రేటు చొప్పున మొత్తం దాదాపు రూ.5 కోట్లకు వీటిని విక్రయించారు. ప్రస్తుతం ఐగేట్‌ను 4 బిలియన్ డాలర్లకు కొంటున్న క్యాప్‌జెమిని.. ఒక్కో షేరుకి 48 డాలర్లు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
క్యాప్‌జెమిని చేతికి ఐగేట్
- 4 బిలియన్ డాలర్లకు ఆఫర్ - డీల్‌కు ఇరు కంపెనీలు ఓకే న్యూయార్క్: ఫ్రెంచి ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని తాజాగా అమెరికాకు చెందిన ఐగేట్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం నగదు రూపంలో 4 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. విలీన ఒప్పందం కింద ప్రతి ఐగేట్ షేరుకి 48 డాలర్ల చొప్పున క్యాప్‌జెమినీ ఆఫర్ చేస్తుంది. ఇది శుక్రవారం ఐగేట్ షేరు క్లోజింగ్ ధర 45.85 డాలర్లతో పోలిస్తే 4.7 శాతం అధికం. ఇరు కంపెనీలు ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ రెండు సంస్థలూ కలిస్తే 14 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఐబీఎం వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే భారీ కంపెనీ ఆవిర్భవిస్తుంది. ఐగేట్కి ప్రస్తుతం జనరల్ ఎలక్ట్రిక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా తదితర భారీ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. డీల్ పూర్తయ్యాక ఇవన్నీ కూడా క్యాప్‌జెమిని ఖాతాలోకి రాగలవు. అలాగే ఇన్ఫ్రా, హెల్త్‌కేర్, రిటైల్, తయారీ తదితర రంగాల సంస్థలకూ సేవ లు అందించేందుకు వీలు పడుతుంది. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ఐగేట్.. ప్రస్తుతం నెట్వర్క్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ తదితర సేవలు అందిస్తోంది. ఇరు కంపెనీల బోర్డులు, ఐగేట్కి చెందిన మెజారిటీ షేర్హోల్డర్లు డీల్‌కు ఆమోదముద్ర వేశారు. విలీనానంతరం ఏర్పడే సంస్థలో 1,90,000 మంది ఉద్యోగులు ఉంటారని క్యాప్‌జెమిని తెలిపింది. ఇందులో 27,000 మంది ఉద్యోగులు భారత్‌లోనూ.. 50,000 మంది అమెరికాలోనూ ఉంటారు. కంపెనీ ఆదాయాల్లో 30 శాతం ఉత్తర అమెరికా నుంచి లభిస్తుంది. సొంత నగదు నిల్వలు, కొంత రుణం ద్వారా డీల్‌కు అవసరమైన నిధులను సమకూర్చుకోనున్నట్లు క్యాప్‌జెమిని సీఈవో పాల్ హెర్మిలిన్ తెలిపారు. డీల్‌తో భారత్‌లో కార్యకలాపాలకు మరింత ఊతం లభించగలదని వివరించారు. తమ ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని ఐగేట్ సీఈవో అశోక్ వేమూరి తెలిపారు. కొనుగోలుకు కారణాలు.. ⇒ క్యాప్‌జెమిని ప్రధాన ఆఫ్‌షోర్ సెంటర్లలో భారత్ కూడా ఒకటి. ఇక్కడ ప్రస్తుతం కంపెనీకి 50,000 మంది సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా సర్వీసుల వ్యయాలు గణనీయంగా తగ్గించుకునే దిశగా భారత్‌లో సిబ్బంది సంఖ్యను 2016 ఆఖరుకి 70వేలకు పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఐగేట్ కొనుగోలుతో ఉద్యోగుల సంఖ్య 1,00,000కు చేరొచ్చని అంచనా. ⇒క్యాప్‌జెమినికి ప్రస్తుతం మెజారిటీ ఆదాయాలు బ్రిటన్ మార్కెట్ నుంచి వస్తున్నాయి. ఐగేట్‌ను కొనడం ద్వారా అమెరికా మార్కెట్లో క్యాప్‌జెమినికి పట్టు లభిస్తుంది. ⇒ఐబీఎం, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ పటిష్టంగా ఉన్న ఇన్ఫ్రా వ్యాపారంలో క్యాప్‌జెమినికి అంత పేరు లేదు. ఐగేట్తో ఆ లోటు తీరిపోతుంది. ⇒భారత్‌లో వ్యాపారాన్ని మరింతగా పటిష్టం చేసుకోవచ్చు.