ఆన్‌బోర్డింగ్ విషయంలో కాస్త ఓపిక పట్టాలని ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెషర్లను కోరింది. 2022లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపిక చేసినవారిని 2023లో ఎప్పుడైనా ఆన్‌బోర్డ్ చేయనున్నట్లు తెలియజేసింది. ఖాళీల లభ్యత ఆధారంగా ఆన్‌బోర్డింగ్ ఉంటుందని అభ్యర్థులకు సమాచారం అందించింది.
(ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!)
క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఆన్‌బోర్డింగ్‌పై స్పష్టత కోసం కంపెనీని సంప్రదించగా ఈ మేరకు బదులిచ్చింది. ఎంపికైన అభ్యర్థులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) మాత్రమే ఇచ్చామని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కంపెనీకి లేదని పేర్కొంది. దీన్ని ఆఫర్ లెటర్‌గా పరిగణించకూడదని యూనివర్సిటీ రిలేషన్స్ అండ్ టాలెంట్ హైరింగ్ టీమ్ తెలిపింది.
(తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!)
భారతదేశంలోని చాలా ఐటీ కంపెనీలు గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్‌లను ఇంకా ఆన్‌బోర్డ్ చేయలేదు. మాంద్యం సంకేతాలు ఉన్న ఉత్తర అమెరికా, యూరప్‌లో వ్యాపార అనిశ్చితి దీనికి కారణం. దీంతో సిబ్బంది వ్యయాల విషయంలో ఆయా కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు, అంచనాలు గణనీయమైన మందగమనాన్ని సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment