Freshers
-
ఇన్ఫోసిస్‌లో 300 మంది ఫ్రెషర్ల తొలగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించింది. మైసూరులోని క్యాంపస్‌లో వీరికి ప్రాథమిక శిక్షణ ఇవ్వగా, అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియల్లో మెరుగైన పనితీరు చూపించలేకపోయినట్టు, మూడు విడతలు అవకాశం ఇచ్చినప్పటికీ ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ, వాస్తవానికి ఇలా తొలగించిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని ఐటీ ఉద్యోగుల సంఘం నైటెస్ తెలిపింది. కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కంపెనీపై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై మీడియా సంస్థలు వివరణ కోరగా.. ‘‘ఇన్ఫోసిస్‌లో కఠినమైన నియామక ప్రక్రియను అనుసరిస్తాం. మైసూరు క్యాంపస్‌లో విస్తృతమైన ప్రాథమిక శిక్షణ అనంతరం అంతర్గత మదింపు ప్రక్రియల్లో ఫ్రెషర్లు (ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందిన వారు) విజయం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి ఒక్కరి మూడు విడతలుగా అవకాశం కల్పిస్తాం. అయినప్పటికీ విఫలమైతే వారు సంస్థతో కలసి కొనసాగలేరు. ఉద్యోగ కాంట్రాక్టులో ఈ నిబంధన కూడా ఉంటుంది. రెండు దశాబ్దాల నుంచి ఇదే ప్రక్రియ అమల్లో ఉంది. మా క్లయింట్ల అవసరాలను తీర్చే అత్యుత్తమ నైపుణ్యాలు ఉండేలా చూడడమే ఇందులోని ఉద్దేశ్యం’’అని ఇన్ఫోసిస్ సంస్థ వివరణ ఇచ్చింది. మూడు నెలల క్రితమే చేరిక తాజాగా తొలగింపునకు గురైన వారి సంఖ్య గణనీయంగా ఉంటుందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (నైటెస్) పేర్కొంది. వీరిని 2024 అక్టోబర్‌లో నియమించుకున్నట్టు తెలిపింది. ‘‘ఆఫర్ లెటర్లు అందుకున్న తర్వాత వీరంతా రెండేళ్లపాటు నిరీక్షించారు. నైటెస్, బాధిత అభ్యర్థులు కలసి చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాతే వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు’’అని ప్రకటించింది. -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంత దారుణమా?
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.అధిక అట్రిషన్ రేట్లు, తక్కువ ఆన్-సైట్ అవకాశాలు వంటి సవాళ్లను ఐటీ (IT) రంగం ఎదుర్కొంటోంది. ఇది వేతన పరిహారాలపై ప్రభావం చూపుతోంది. సీఈవోల జీతాలు గ్లోబల్ బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వ్యత్యాసం అసమానతలను మరింత పెంచుతోందని, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఉద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెషర్ల జీతాలను కనీసం రూ. 5 లక్షలకు పెంచాలని, ఈ లాభదాయక సంస్థలకు ఇది సాధ్యమేనని విమర్శకులు పేర్కొంటున్నారు. -
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ 'టీసీఎస్' కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు.వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ అన్నారు. అంతే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం. సుమారు ఏడాది తరువాత కంపెనీ నియమాలను గురించి వెల్లడించింది. కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీలు పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు.. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకువారానికి ఐదు రోజులుకరోనా తరువాత ఉద్యోగులందరూ ఆఫీసు నుంచే పనిచేయాలని, వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్ కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి.. కంపెనీ ప్రోత్సాహకాలతో ముడిపెట్టింది. కార్యాలయ సంస్కృతిని బలోపేతం చేయడానికి, సహకారాన్ని మెరుగుపరచడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ మొదలుపెట్టింది. -
అనుభవానికే ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ నియామకాల్లో ఐటీ ఉద్యోగం సంపాదించాలనేది దాదాపు అందరు విద్యార్థుల కోరిక. కానీ 2025లో క్యాంపస్ నియామకాలు అరకొరగానే ఉంటాయని స్కిల్ ఇండియా రిపోర్ట్–2025 అంచనా వేసింది. ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఐటీ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. సంస్థలు గతంలో కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకుని, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదని పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ ఈ రిపోర్ట్స్పష్టం చేసింది. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగంవైపు కంపెనీలు మొగ్గుచూపటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో అనుభవం ఉన్నవాళ్లకే ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. 2025లో 33 శాతం కంపెనీలు ఏఐ టెక్నాలజీపై పట్టున్న నిపుణులనే ఉద్యోగాల్లోకి తీసుకొంటాయని అంచనా వేశారు. ఐటీ రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి మంచి అవకాశాలుంటాయని నివేదికలో పేర్కొన్నారు.ఫ్రెషర్స్‌లో నైపుణ్యం కొరతకొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులను ఏ ప్రశ్న వేసినా.. చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తున్నారని ప్రధాన కంపెనీలు పేర్కొంటున్నాయి. స్వతహాగా ఆలోచించే శక్తి వారిలో కన్పించడం లేదని అంటున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య, పలు యూనివర్సిటీలు, ప్రముఖ ఐటీ కంపెనీలు కలిసి నూతన ఇంజనీరింగ్ పట్టభద్రుల నైపుణ్యాలను పరీక్షించాయి. 86 శాతం విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం అవసరాలకు తగ్గట్టుగా లేదని గుర్తించాయి. 2025లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు 14 శాతానికి మించి ఉండకపోవచ్చని అంచనా వేశాయి. ఇంజనీరింగ్ సిలబస్‌లో ప్రస్తుత తరానికి పనికివచ్చే అంశాలు ఉండటం లేదని నిపుణులు గుర్తించారు. వీరికన్నా ఏఐ టెక్నాలజీ పది రెట్లు ఎక్కువ ఉపయోగపడుతుందని పలు సంస్థలు అంటున్నాయి. అయితే, ఐటీ సంస్థల్లో ఫ్రెషర్స్‌కు అవకాశం వస్తే మాత్రం.. వారికి వేతనాలు భారీగానే ఉండొచ్చని నివేదిక వెల్లడించింది. మెరుగు పెట్టేందుకు మండలి కృషిప్రాంగణ నియామకాలు తగ్గిపోయే పరిస్థితి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నైపుణ్య కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వారి స్కిల్స్‌ను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. జేఎన్టీయూహెచ్ ఇన్చార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ముందుగా ఆ వర్సిటీ నుంచే ఈ ప్రయోగం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉండటంతో ఇందుకు సంబంధించిన కొత్త కోర్సులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. -
ఎల్&టీ టెక్నాలజీలో 2000 ఫ్రెషర్ జాబ్స్
ముంబై: ఇంజనీరింగ్ సర్వీసుల ఐటీ కంపెనీ ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలె–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 320 కోట్లకు చేరింది. లాభాల మార్జిన్లు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 8 శాతం ఎగసి రూ. 2,573 కోట్లను తాకింది.యూరోపియన్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్, సస్టెయినబిలిటీ సొల్యూషన్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు తోడ్పాటునిచ్చింది. వాటాదారులకు షేరుకి రూ. 17 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌కాగా.. ఈ ఏడాది 2,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ చద్దా పేర్కొన్నారు. ఈ కాలంలో 121 మందిని చేర్చుకోవడంతో సిబ్బంది సంఖ్య 23,698కు చేరింది.అమ్మకాలు, టెక్నాలజీలపై అధిక వ్యయాలతో నిర్వహణ లాభ మార్జిన్లు 17.1 శాతం నుంచి 15.1 శాతానికి బలహీనపడ్డాయి. 8–10 శాతం వృద్ధి ప్రస్తుత ఏడాది ఎల్అండ్టీ టెక్నాలజీ ఆదాయంలో 8–10 శాతం వృద్ధి నమోదుకానున్నట్లు అమిత్ చద్దా పేర్కొన్నారు. వార్షికంగా 2 బిలియన్ డాలర్ల ఆదాయ మార్క్‌ను అందుకోగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇకపై మార్జిన్లు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడాది చివరికల్లా ఆదాయంలో 16 శాతం పురోగతిని అందుకోగలమని అంచనా వేశారు. ప్రస్తుత సమీక్షాకాలంలో 2 కోట్ల డాలర్ల విలువైన 2 డీల్స్తోపాటు కోటి డాలర్ల విలువైన 4 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. -
ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయ్..
చాలాకాలం తర్వాత ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం అనంతరం కంపెనీలు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల కోసం కాలేజీ క్యాంపస్‌లకు వస్తున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపడం, ప్రత్యేక సాంకేతిక ప్రతిభకు డిమాండ్ పెరగడంతో క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెట్టాయి.అయితే గతంలో మాదరి ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్దమొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి.క్యాంపస్‌ల బాటలో కంపెనీలుఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్‌లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది విరామం తర్వాత విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలతో తిరిగి క్యాంపస్‌ల బాట పట్టనుంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!మరింత కఠినంగా ఎంపికక్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది. అధిక కట్-ఆఫ్ స్కోర్లు, ప్రత్యేక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లకు ప్రాధాన్యం పెరిగింది. అభ్యర్థులను అంచనా వేయడానికి సాంప్రదాయ కోడింగ్ పరీక్షలే కాకుండా వారి నైపుణ్యాలు, నేపథ్యంపై సంపూర్ణ అవగాహన పొందడానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్, సంబంధిత సర్టిఫికేషన్లను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో హై-డిమాండ్ నైపుణ్యాలపై కంపెనీలు దృష్టి కేంద్రీకరించడం వల్ల క్లౌడ్, డేటా, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టక్నాలజీలలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడింది. -
ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ నియామక పత్రాలు
న్యూఢిల్లీ: క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్ సెపె్టంబర్ చివర లేదా అక్టోబర్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. 2022 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీరిలో ఉన్నారని ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) వెల్లడించింది. రెండేళ్లుగా వీరంతా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ‘మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైనా, చేరే తేదీని ఉల్లంఘించినా ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడానికి వెనుకాడము’ అని హెచ్చరించారు. 2022–23 రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేసినందుకు ఇన్ఫోసిస్‌పై కార్మి క, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఎన్ఐటీఈఎస్ గతంలో ఫిర్యాదు చేసింది. ఫ్రెషర్లకు ఇచి్చన ఆఫర్ లెటర్లను కంపెనీ గౌరవిస్తుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవలే స్పష్టం చేశా రు. ‘కొన్ని నియామక తేదీలను మార్చాం. అందరూ ఇన్ఫోసిస్‌లో చేరతారు. ఆ విధానంలో ఎటువంటి మార్పు లేదు’ అని వెల్లడించారు. -
ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్‌న్యూస్
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్ అసోసియేట్స్ (ఫ్రెషర్స్)ని ఆన్‌బోర్డ్ చేశామని పేర్కొంది.టెక్ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్ ఆఫర్లు పొందిన ఎన్‌జీఏలను (ఫ్రెషర్స్) ఆన్‌బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్‌జీఏలను ఆన్‌బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్-ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్‌లైన్‌ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది. -
ఆ తక్కువ జీతం ఐటీ వాళ్లకు కాదు: కాగ్నిజెంట్ క్లారిటీ
ఫ్రెషర్లకు అత్యల్పంగా రూ. 2.52 లక్షల వార్షిక జీతం ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ దానిపై స్పష్టత ఇచ్చింది. ఆ వేతనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కాదని, సాధారణ డిగ్రీ హోల్డర్లకు మాత్రమేనని తాజాగా పేర్కొంది.తాము ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు రూ. 4-12 లక్షల వేతనాన్ని అందిస్తున్నట్లు కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది. దీంతోపాటు తమ సంస్థలో ఉద్యోగులకు శాలరీ హైక్ మరీ తక్కువగా 1 శాతమే ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఎగతాళిపైనా కాగ్నిజెంట్ స్పందించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్లలో 1-5 శాతం అనేది కనిష్ట బ్యాండ్ అని వివరించింది.కాగ్నిజెంట్ ఏటా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్/ఐటీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లను విభిన్న పాత్రల కోసం నియమించుకుంటుంది. ఈ రెండు రిక్రూట్మెంట్లు దాదాపు సమాంతరంగా నడుస్తుండటంతో మూడేళ్ల నాన్-ఇంజనీరింగ్/ఐటీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ల నియామకానికి సంబంధించిన ఫ్రెషర్ల శాలరీ ప్యాకేజీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది."నాన్ ఇంజినీరింగ్ నేపథ్యాల నుంచి 3-సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ప్రతిభావంతుల కోసం చేసిన మా ఇటీవలి జాబ్ పోస్టింగ్ వక్రీకరణకు గురైంది. ఈ జాబ్ పోస్టింగ్‌లో ఉన్న రూ. 2.52 లక్షల వార్షిక పరిహారం మూడేళ్ల సాధారణ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు మాత్రమే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కాదు. ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మా వార్షిక పరిహారం హైరింగ్, స్కిల్ సెట్, అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేషన్ల కేటగిరీని బట్టి సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది" అని కాగ్నిజెంట్ అమెరికాస్ ఈవీపీ, ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్‌కౌంట్‌లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్‌సీఎల్‌టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
నాడు ఏడాదికి 2 లక్షలు.. ఇప్పుడు 60 వేలు
సాక్షి, హైదరాబాద్: భారత సాఫ్ట్వేర్ కంపెనీలు గత రెండు దశాబ్దాల్లోనే అత్యల్పంగా... 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ సేవల ఆర్డర్లు తగ్గుదలతో దేశీయ ఐటీ రంగం ఇప్పటికే ఇబ్బందుల్లో పడగా, తాజా పరిణామాలు మరింత ఆందోళన పరుస్తున్నాయి.కోవిడ్‌కు ముందు ఏడాదికి 2 లక్షల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను సాఫ్ట్వేర్ కంపెనీలు హైర్ చేయగా.. ఇప్పుడది 60–70 వేలకు పడిపోయింది. ఇదేకాకుండా వివిధ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 10 వేల మందికి పైగా విద్యార్థులు ఆఫర్లెటర్స్తో ఉద్యోగాల్లో చేరేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీలతో సహా ప్రతిష్టాత్మక కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కు ప్లేస్‌మెంట్స్ గణనీయంగా తగ్గాయి. ఈ హైరింగ్‌లకు పెద్ద ఐటీ కంపెనీలు దూరంగా ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు సైతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, విద్యార్థులు ఐటీ వైపే మొగ్గు చూపడం ఓ చిక్కుముడిగా మారుతోంది. ఇదీ వాస్తవ పరిస్థితి... దేశంలో ఐటీ రంగంలో ఫ్రెషర్స్ అవకాశాల కల్పన తగ్గుదలకు సంబంధించి ఎక్స్–ఫెనో అనే హెచ్ఆర్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. క్యాంపస్ ప్లేస్మెంట్లకు సంబంధించి గతేడాది నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు వివిధ కాలేజీల యాజమాన్యాలు చెప్పాయి. పెద్ద కంపెనీలు మార్చి, ఏప్రిల్‌లో ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా అంతకు ముందు ఏడాది జూలై, ఆగస్టుల నుంచే డిగ్రీ పూర్తిచేయబోయే విద్యార్థులకు ట్రయల్స్ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. అయితే ఈసారి క్యాంపస్‌లకు వచ్చేందుకూ కంపెనీలు సుముఖతను వ్యక్తంచేయకపోవడం యాజమాన్యాలు, విద్యార్థులను కలవరపరుస్తోంది. దాదాపు 70 శాతం విద్యార్థులు ఐటీ ఉద్యోగాలనే కోరుకుంటున్నా.. అందుకు తగ్గట్లు రిక్రూట్మెంట్ జరగకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. 2023లో కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులను కూడా కొన్ని కంపెనీలు ఇంకా ప్లేస్‌మెంట్స్‌కు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 70–80 శాతం దాకా ఆన్‌క్యాంపస్ హైరింగ్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వస్తున్న అవకాశాల్లో 85 శాతం దాకా ఏడాదికి రూ.3–6 లక్షల లోపు ప్యాకేజీల్లోనే వస్తున్నాయని చెబుతున్నారు. మరో 6 నెలలు ఇలాగే ఉండొచ్చు.. కనీసం వచ్చే ఆరునెలల దాకా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెషర్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశాలపై ఇప్పుడే చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగయ్యే అవకాశముంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింపు, ఇజ్రాయెల్– హమాస్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగడం, వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, యూఎస్, ఇతర దేశాల్లో వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం అనే అంశాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అదీగాక, ఉద్యోగాలపై కృత్రిమమేథ (ఏఐ) పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. 2008లోనూ ఇదే విధమైన గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. సాంకేతికంగా సమూలమార్పులు వస్తుండటంతో, అప్‌గ్రేడేషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమేషన్ పెరుగుదలతో క్లౌడ్, అనలిటిక్స్ తదితరాలకు గణనీయంగా డిమాండ్ పెరిగింది. –వెంకారెడ్డి, వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్‌లు కష్టమే.. ఫ్రెషర్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా నాన్‌ఐటీ ప్రాజెక్టులు, హెల్త్‌కేర్ సర్విసెస్, హాస్పిటల్ ఇన్సూరెన్స్ కలెక్షన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. కంటెంట్ మోడరేషన్, మ్యాపింగ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఫ్రెషర్స్ 2025 సంవత్సరమంతా కూడా లర్నింగ్ జాబ్‌గా చూసుకుని, ఇండియాలోనే ఎంబీఏ, డేటా/బిజినెస్ అనలిటిక్ వంటి కోర్సులు చేస్తే మంచి అవకాశాలు వస్తాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాక... వడ్డీరేట్లు తగ్గించడం మొదలుపెడితే అక్కడ ఆర్థిక మాంద్యం మొదలయ్యే సూచనలున్నాయి. అందువల్ల మరో 6 నుంచి 9 నెలల దాకా అక్కడి నుంచి కొత్త ప్రాజెక్టులు రాకపోవచ్చు. ప్రస్తుతం దేశీయ సర్విస్ ప్రొవెడర్ సంస్థలు ‘డేటా మైగ్రేషన్’ ప్రాజెక్ట్‌లపై ఆధారపడుతున్నాయి. రాబోయేరోజుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. –ఎన్.లావణ్యకుమార్, సహ వ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్ -
ఐటీ కంపెనీలు ఇంతపని చేస్తున్నాయా?.. రోజులు గడుస్తున్నా..
అసలే ఉద్యోగాలు దొరక్క యువత అల్లాడిపోతుంటే.. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగాలు కల్పించడంలో జాప్యం చేస్తున్నాయి. భారతదేశంలోని ఐటీ దిగ్గజాలు సైతం ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది.గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడిన వ్యాపార అనిశ్చితి కారణంగా ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం జరుగుతుందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. వ్యాపార అవసరాలను బట్టి ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడం జరుగుతుందని, ఉద్యోగంలో చేర్చుకోవాలనుకున్నప్పుడు వారికి ముందుగానే సమాచారం తెలియాజేస్తామని ఇన్ఫోసిస్ మెయిల్స్ పంపినట్లు సమాచారం.విప్రో కూడా రెండేళ్ల క్రితం అభ్యర్థులకు అందించిన క్యాంపస్ ఆఫర్లను ఆన్‌బోర్డ్ చేయలేదు. గత సంవత్సరం ముందు, మేము క్యాంపస్‌కి వెళ్లి చాలా ఆఫర్లు చేసాము. వారందరిని ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్న తరువాత కొత్త ఫ్రెషర్లను తీసుకుంటామని విప్రో సిహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.తగ్గిన ఐటీ ఉద్యోగుల సంఖ్యభారతదేశంలో కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఐటీ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా ప్రభావం తగ్గినా తరువాత కూడా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే వచ్చాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు విడుదల చేసిన డేటా ప్రకారం.. 20236-24 ఆర్ధిక సంవత్సరంలో 63759 మంది ఉద్యోగులు తగ్గిపోయారని తెలిసింది. -
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి. -
టాప్ టెక్ ఇన్స్టిట్యూట్కి ఎంతటి దుస్థితి! ప్లేస్మెంట్ల కోసం దీనంగా..
ఉద్యోగుల కోసం టాప్ కంపెనీలు క్యూకట్టే ప్రతిష్టాత్మక టెక్ ఇన్స్టిట్యూట్ అది. కానీ ఫ్రెష్ గ్యాడ్యుయేట్ల ప్లేస్మెంట్ల కోసం పూర్వ విద్యార్థుల సాయం కోరాల్సివచ్చింది. ఐటీ, సర్వీస్ రంగాల్లో నియామకాల మందగమనం ఇటీవలి బ్యాచ్ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్ల కోసం దేశంలోని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు తమ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లను సంప్రదించాల్సి వస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నోకి ఈ దుస్థితి పట్టగా ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ (BITS) 2023 బ్యాచ్ విద్యార్థుల ప్లేస్మెంట్ కోసం పూర్వ విద్యార్థుల నెట్వర్క్ నుంచి మద్దతును కోరుతోంది. దేశంలోని మొదటి ఐదు బిజినెస్ స్కూల్స్‌లో ఒకటిగా నిలిచిన ఐఐఎం లక్నో ఇటీవలి బ్యాచ్ గ్రాడ్యుయేట్ల విద్యార్థుల కోసం ప్లేస్మెంట్లను పొందేందుకు తమ పూర్వ విద్యార్థులను సాయం కోరింది. ''దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ విధమైన తిరోగమనాన్ని చవిచూడలేదు. జనవరి 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులను తొలగించడంతో సాంకేతిక రంగం తీవ్రంగా ప్రభావితమైంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖలో అలుమ్ని రిలేషన్స్ డీన్ ఆర్య కుమార్ తెలిపారు. బిట్స్ 2022-23 విద్యా సంవత్సరానికి 89.2 శాతం ఆరోగ్యకరమైన ప్లేస్మెంట్ శాతాన్ని సాధించగలిగిందని, అయితే నియామకాల మందగమనం అప్పటి నుండి మరింత దిగజారిపోయందని బిట్స్ ఆల్ముని డీన్ తన లేఖలో తెలిపారు. "ప్లేస్మెంట్ టీమ్‌లు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ, ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడంలో మన పూర్వ విద్యార్థుల మద్దతును కోరుతున్నారు" అని ఆర్య కుమార్ తన లేఖలో పేర్కొన్నారు, దీనిని మొదట ఎక్స్‌లో ఎడ్టెక్ వ్యవస్థాపకుడు రవి హండా షేర్ చేశారు. అయితే ఈ విషయంలో బిట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. First IIM Lucknow, now BITS Pilani asking alumni to help out with placements. This is the first time I am seeing such groveling after 2008. "help them tide through current crisis" "gentle request to please keep this in mind" "Thanking you very much in advance" pic.twitter.com/TI27X7THk6 — Ravi Handa (@ravihanda) February 22, 2024 -
హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..!
ఐటీ పరిశ్రమలలో ప్రస్తుతం లేఆఫ్‌లు బెంబేలెస్తున్నాయి. కొత్త నియామకాలు తగ్గిపోయాయి.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో తమ పరిస్థితి ఏంటని ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో వారు ఎగిరి గంతేసే ఓ నివేదిక వెల్లడైంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ప్రముఖ ఐటీ దిగ్గజాలు రాబోయే ఆరు నెలల్లో 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోందని రిక్రూట్మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ విశ్లేషిస్తోంది. "జెనరేటివ్ ఏఐ ఆటోమేషన్‌కు అనుగుణంగా వర్క్‌ఫ్లో మారబోతోంది. ఈ ఏఐ సిస్టమ్‌లతో సమర్థవంతంగా సహకరించడానికి ఫ్రెషర్లు సిద్ధంగా ఉండాలి" అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. "ఎంప్లాయర్లు కొంతకాలంగా సంప్రదాయవాద అడుగులు వేశారు. ప్రపంచ గందరగోళాల మధ్య నియామకం మందగించింది. అయితే మా ఇటీవలి సర్వే భారతదేశ వృద్ధి కథనంపై ఎంప్లాయర్ విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. సంస్థలు తమ భవిష్యత్తు మార్గాలపై మరింత నమ్మకంగా ఉన్నాయి" టీమ్‌లీజ్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎడ్టెక్ శంతను రూజ్ తెలిపారు. గతేడాది కంటే తక్కువే.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకం ఉద్దేశం 2024 తొలి ఆర్నెళ్లలో 42 శాతానికి తగ్గింది. 2023లో ఇదే కాలంలో ఇది 49 శాతంగా ఉండేది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్ కోసం నియామక ఉద్దేశం గత ఏడాది ఇదే కాలంలో 62 శాతం నుంచి ప్రస్తుత ప్రథమార్ధంలో (జనవరి-జూన్ 2024) అన్ని రంగాలలో 68 శాతానికి స్వల్పంగా మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉన్న మొదటి మూడు పరిశ్రమలు ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు (55%), ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (53%), టెలికమ్యూనికేషన్స్ (50%) అని నివేదిక విశ్లేషించింది. -
క్యాంపస్ రిక్రూట్మెంట్లపై ఫ్రెషర్స్‌లో కంగారు
-
TS: సీనియర్లకు ఫ్రెషర్ల ఛాలెంజ్
ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర ఎంతో కీలకమైనది. యువత ముందుకొచ్చి ఓటు వేయడమే కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించాలన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నదే. అయితే ఈసారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల యువరక్తం.. పైగా కొత్త ముఖాలు.. అందునా సీనియర్లతో పోటాపోటీకి సిద్ధం కావడం గమనార్హం. కార్నె శిరీష(బర్రెలక్క) : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్నె శిరీష(బర్రెలక్క) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో చిన్నవయస్కురాలైన అభ్యర్థిగా ఈమెకు ఓ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా బాగా పాపులర్ అయిన శిరీష.. నామినేషన్ మొదలు నుంచి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార సమయంలో ఆమె వర్గం దాడి జరిగాక.. ఆ చర్చ తారాస్థాయికి చేరింది. చివరాఖరికి హైకోర్టు సైతం ఆమెకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ సుధాకర్ లాంటి సీనియర్లను ఈమె ఢీ కొడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! మామిడాల యశస్వినీరెడ్డి: ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో అత్యంత యువ అభ్యర్థి యశస్విని కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీ(26) పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. అత్త ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ విషయంలో పౌరసత్వ అభ్యంతరాలు తలెత్తడంతో.. కోడలు యశస్వినీకి ఆ అవకాశం దక్కింది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. నాన్ లోకల్ అనే ప్రత్యర్థి ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. పాలకుర్తిలో గెలుపుపై యశస్విని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ మైనంపల్లి రోహిత్‌రావు: మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్(27). మెదక్ జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తిచెసిన రోహిత్ తన తండ్రి.. ఆయన అనుచర గణం అండతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్’ పేరిట కరోనా టైంలో అందించిన సేవలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి లాంటి సీనియర్‌తో పోటీకి రోహిత్ సిద్ధం అయ్యారు. ఇదీ చదవండి: మెదక్‌లో మళ్లీ పాతయుద్ధమేనా? ఉషా దాసరి: ఐఐటీ గ్రాడ్యుయేట్ ఉషా దాసరి (27).. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు. కలెక్టర్ కావాలనే కలని సైతం పక్కన పెట్టి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ నెలకొల్పి.. ఉచిత ట్యూషన్లతో స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారీమె. దాసరి మనోహర్‌తో పాటు చింతకుంట విజయరమణారావులాంటి సీనియర్ల నడుమ పోటీకి నిలిచారు. ఇదీ చదవండి: ఐఐటీ స్టూడెంట్... పొలిటికల్ ఎంట్రీ వీళ్లేకాదు.. మిరియాల రామకృష్ణ(28) జనసేన అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల.. పువ్వాడ అజయ్లాంటి వారితో పోటీ పడుతుండగా.. అలాగే ములుగు నుంచి సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతి(29) ఎన్నికల బరిలో దిగి యువసత్తా చాటాలని చూస్తున్నారు. -
వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్
భారతదేశం ఇతర దేశాలతో పోటీపడాలన్నా, ప్రగతి సాధించాలన్నా.. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాటలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఏఎస్ 'అశోక్ ఖేమ్కా' (Ashok Khemka) తాజాగా ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అశోక్ ఖేమ్కా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఐటీ కంపెనీలలో పనిచేసే ఫ్రెషర్స్, సీఈఓల శాలరీలలో వ్యత్యాసం చూడవచ్చు. దీని ప్రకారం.. 2012లో రూ. 2.75 లక్షల వేతనం పొందే ఇన్ఫోసిస్ ఫ్రెషర్ శాలరీ 2022 నాటికి రూ. 3.6 లక్షలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాల్లో ఒక ఫ్రెషర్ జీతం కేవలం రూ. 85,000 మాత్రమే పెరిగింది. అయితే 2012లో రూ. 80 లక్షల వేతనం తీసుకునే సీఈఓ శాలరీ 2022 నాటికి రూ. 79.75 కోట్లకు చేరింది. దశాబ్ద కాలంలో పెరిగిన ఫ్రెషర్ వేతనం, సీఈఓ వేతనాల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, L & K ఇన్ఫోటెక్, హెచ్‌సీఎల్, మీడియన్ (Median) సంస్థల్లో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. సీఈఓల జీతాలు భారీగా పెరుగుతున్నాయి, ఫ్రెషర్ల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదీ చదవండి: రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం.. అశోక్ ఖేమ్కా ఈ పోస్ట్ షేర్ చేస్తూ.. ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఫ్రెషర్ వేతనానికి 2,200 రెట్లు ఎక్కువ. సీఈఓ, ఫ్రెషర్ వరుసగా వారానికి ఎన్ని గంటలు పని చేస్తారు? వారానికి 168 గంటలు మాత్రమే ఉంటాయని అని వెల్లడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Infosys CEO's pay 2,200 times a fresher's pay. How many hours of work a week does the CEO and a fresher put in respectively? There are only 168 hours in a week. pic.twitter.com/DP1C4ODkAt — Ashok Khemka (@AshokKhemka_IAS) October 29, 2023 -
ఐటీ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? ఈ 6 నెలలూ అంతే!
ఐటీ ఉద్యోగార్థులకు గత కొన్ని నెలలుగా గడ్డుకాలమే నడుస్తోంది. రానున్న ఆరు నెలలు మరింత గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది. అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని మందగించాయి. ప్రస్తుత స్థూల ఆర్థిక అనిశ్చితులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత తక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. (టీసీఎస్‌కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..) క్లయింట్లు కూడా ఖర్చులను తగ్గించుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తూ విధుల్లోకి తీసుకోవాలని, ప్రస్తుతం బెంచ్‌లో ఉన్నవారిని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో చాలా ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఇప్పటికే తమ వద్ద ఎక్కువమందితో కూడిన ఫ్రెషర్ బెంచ్ ఉందని ఇన్ఫోసిస్ చెబుతోంది. "ప్రస్తుతం మేము ఇంకా క్యాంపస్‌లకు వెళ్లడం లేదు" అని కంపెనీ క్యూ2 ఆదాయాల సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నిలంజన్ రాయ్ అన్నారు. గత ఏడాది కంపెనీ దాదాపు 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. విప్రో తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తామని చెబుతూ ఫ్రెషర్ల నియామకాలపై చేతులెత్తేసింది. అయితే స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫినో 2024 ఆర్థిక సంవత్సరం ఔట్లుక్ హెడ్‌కౌంట్‌లో 2023 ఆర్థికేడాది ముగింపు కంటే 2.4 శాతం నికర వార్షిక వృద్ధి ఉందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెడ్‌కౌంట్ సుమారు 2 లక్షలు పెరుగుతుందని అభిప్రాయపడింది. 2023 మార్చిలో 66 లక్షలు ఉన్న ఐటీ సెక్టార్ హెడ్‌కౌంట్ రానున్న మార్చి నాటికి 68 లక్షల మార్క్ కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. ఈ సంవత్సరం ఐటీ రంగం గణనీయమైన మార్పునకు గురైంది. ఇది ఎంట్రీ-లెవల్ స్థానాలకు డిమాండ్‌లో సుమారుగా 25-30 శాతం క్షీణించిందని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. -
గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్: టెకీలకు భారీ ఊరట
TCS will hire 40,000 freshers ఐటీ దిగ్గజ సంస్థలు క్యాంపస్రిక్రూమెంట్లు దాదాపు లేనట్టే నని తేల్చి చెప్పిన నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మాత్రం శుభవార్త అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా క్యాంపస్ రిక్రూట్మెంట్లను చేపట్టనుంది. దాదాపు 40 వేల మంది ఫ్రెషర్ల నియామకాలకు సిద్దమవుతున్నట్టు ప్రకటించింది. తద్వారా ఫ్రెషర్ల నియామకాల్లో మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ సరసన టీసీఎస్ కూడా నిలిచింది. సాధారణంగా ప్రతీ ఏఏటా 35 నుంచి 40వేల మంది దాకా కొత్తవారిని తీసుకుంటుందనీ ఈ క్రమంలోనే 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా 40 వేల ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు టీసీఎస్ సీవోవో గణపతి సుబ్రమణియన్ తెలిపారు. అంతేకాదు ఇకపై ఎలాంటి కోతలు ఉండవని కూడా స్పష్టం చేశారు. డిమాండ్‌లో ఎలాంటి హెచ్చుతగ్గులనైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ఇటీవల ప్రకటించి టీసీఎస్ తాజాగా టెకీలకు ఈ తీపి కబురు చెప్పడం విశేషం. అక్టోబర్ 11న కంపెనీ ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం దాదాపు 9శాతం పెరిగి రూ.11,342 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం రూ.59,692 కోట్లుగా ఉందని సీఈవో కె కృతివాసన్ తెలిపారు. అలాగే ఒక్కో షేరుకు రూ.9 మధ్యంతర డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించింది. కాగా దేశీయ రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల నియమాకలపై చాలామందిని నిరాశపర్చిన సంగతి తెలిసిందే. -
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్: 10,000 ఉద్యోగాలు ప్రకటించిన ఐటీ సంస్థ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం పుంజుకుని రూ. 3,833 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 3,487 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 24,686 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కొత్త కాంట్రాక్టులు 67 శాతం జంప్‌చేసి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఇతర విశేషాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల పనితీరు నేపథ్యంలో పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 5–6 శాతానికి తగ్గించింది. తొలుత 6–8 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికి సిబ్బంది సంఖ్య 1% తగ్గి 2,21,139కు చేరింది. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు కంపెనీ సీపీవో రామచంద్రన్ సుందరరాజన్ వెల్లడించారు. గతేడాది 27,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించారు. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఉద్యోగులు!
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఆఫర్ లెటర్లు తీసుకొని జాయినింగ్ తేదీల కోసం పడిగాపులు కాస్తున్న ఫ్రెషర్స్‌కు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. జులై1, 2023 నుంచి జూన్ 30, 2024 మధ్య కాలానికి ఫ్రెషర్స్ నియమకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో ఐటీ రంగంలో నియమకాలు, ఫ్రెషర్స్ జాయినింగ్ తేదీలపై మరింత సందిగ్ధత నెలకొంది. కోవిడ్-19 సమయంలో అన్నీ రంగాలు కుదేలవుతుంటే ఒక్క ఐటీ రంగం భారీ లాభాల్ని గడించింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే.. టెక్కీలు మాత్రం రోజుకి రెండు, మూడు జాబులు చేస్తూ రెండు చేతులా సంపాదించారు. ఒకనొక సమయంలో అంటే 2021 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2022 మధ్య కాలంలో టెక్ కంపెనీలు టీసీఎస్, విప్రో,హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా,యాక్సెంచర్‌తో పాటు పలు కంపెనీలు అవసరానికి మించి ఫ్రెషర్స్‌ను నియమించుకున్నాయి. ముఖ్యంగా, ఆయా టెక్నాలజీ కంపెనీలు 2022- 2023 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్ధులకు ఆఫర్ లెటర్లను అందించాయి. ఏడాది క్రితం వారికి ఆఫర్ లెటర్లను అందించినా జాయినింగ్ డేట్ ఎప్పడనేది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ప్రతి రెండు-మూడు నెలలకు కంపెనీల్లో చేరే తేదీలను పొడిగిస్తున్నాయి. మరికొందరు తమ ఆఫర్ లెటర్ల గడువు ముగియడంతో అదనంగా శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. మరికొందరు వారి ఆఫర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో జాబ్ మార్కెట్లో ఫ్రెషర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా అంచనా ప్రకారం.. గత రెండు బ్యాచ్‌లలో 20,000-25,000 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు పొందారు. కానీ సంస్థలు ప్రాజెక్ట్‌లలో తీసుకునే విషయంలో జాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదు అందాయి. బిజినెస్ తగ్గిపోతుంటే ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లను సంస్థలు ఎందుకు జారీ చేస్తున్నాయని ఐటీ రంగ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నాసెంట్ ప్రశ్నిస్తోంది. తాజాగా, టీమ్ లీజ్ నివేదిక సైతం రానున్న రోజుల్లో ఫ్రెషర్ల నియామకం భారీగా తగ్గిపోతుందని తన నివేదికలో హైలెట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నియమించుకున్న ఫ్రెషర్స్ చేరే తేదీలు, నియమాకాల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. -
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్..
దేశీయ ఐటి సేవల దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ ఆఫర్ లెటర్లు పొందిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. టెక్ పరిశ్రమలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, టీసీఎస్ మాత్రం ఫ్రెషర్లను నియమించుకోవడానికి, వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని మనీకంట్రోల్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్కడ్ చెప్పారు. ఇదీ చదవండి: పనిచేయడానికి ఇదే బెస్ట్ కంపెనీ.. కెరియర్ గ్రోత్ సూపర్! జూనియర్ ఉద్యోగుల జీతాలు డబుల్! ఉద్యోగుల వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి టీసీఎస్ ప్రయత్నాలను ప్రకటించింది. జూనియర్ ఉద్యోగులు తమ నైపుణ్యం పెంచుకుని జీతాలను రెట్టింపు చేసుకునే అవకాశాలను కల్పించనున్నట్లు మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకుని తమ కెరీర్లో ముందుకు సాగేలా అంతర్గత శిక్షణ అందిస్తామన్నారు. ఈ శిక్షణలో వివిధ స్థాయిల నుంచి వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ శిక్షణలో ప్రతిభ చూపి అసెస్మెంట్లను క్లియర్ చేసిన ఉద్యోగులు తమ జీతాలను రెట్టింపు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ అసెస్మెంట్లలో సంవత్సరానికి కేవలం 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 100 శాతం వేరియబుల్ పే టీసీఎస్ ఫ్రెషర్లకు వేతనాలను పెంచడంతోపాటు జూనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు 100 శాతం త్రైమాసిక వేరియబుల్ వేతనం అందించడాన్ని కూడా పరిశీలిస్తోందని లక్కడ్ పేర్కొన్నారు. అయితే ఈ జీతాల పెరుగుదల ఎప్పటి నుంచి ఉంటుందో ఆయన వెల్లడించలేదు. ఒకేసారి ఉద్యోగుల జీతాలు పెంచడం కన్నా శిక్షణ కార్యక్రమాలు అమలు చేసి ప్రతిభావంతులకు జీతాలు పెంచడం మెరుగైన వ్యూహమని పేర్కొన్నారు. 44,000 జాబ్ ఆఫర్లు 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం.. టీసీఎస్ 44,000 మంది ఫ్రెషర్లకు జాబ్ ఆఫర్లను అందించింది. ఈ జాబ్ ఆఫర్లను అన్నింటినీ తాము గౌరవిస్తామని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. తాము అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తున్నామని, 2023 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రాతిపదికన 22,600 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని లక్కడ్ చెప్పారు. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో తీరు టెక్నాలజీ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం ముందస్తు భయాలు వంటి కారణాలతో ఆయా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో విప్రో ఫ్రెషర్స్ నియామకాల్ని 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలుగా నిర్ణయించింది. కొద్ది రోజులకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ భారీ ఎత్తున జీతాల కోత విధించింది. దీనిపై టెక్నాలజీ రంగ నిపుణులు, ఫ్రెషర్స్ విప్రో తీరును తప్పుబట్టారు. ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడం లేదు దీనిపై అయితే, ప్రొడక్ట్‌లు, అవకాశాలు వంటి విషయాల్లో టెక్నాలజీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, కాబట్టే ఫ్రెషర్స్‌కు ఇచ్చే వేతనాల్ని తగ్గించి విధుల్లో తీసుకోవాల్సి వచ్చినట్లు విప్రో ఓ ప్రకటనలో తెలిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ తామెవరినీ తక్కువ ప్యాకేజీలకు ఉద్యోగంలో చేరాలని బలవంతం చేయలేదని, సంస్థ అందించే వేతనం కావాలనుకుంటే ఇప్పటికీ విప్రోలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కంపెనీ ఆఫర్‌కే అంగీకారం తాజాగా, సంస్థలోని ఫ్రెషర్ల నియామకాలు, వారికి అందించే జీతభత్యాలపై విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విప్రోలో 92 శాతం మంది ఫ్రెషర్లు తాము అందించే ఆఫర్‌కు అంగీకరించి ఆయా ప్రాజెక్ట్‌లలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఫ్రెషర్లకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి న్యాయంగా, పారదర్శకతతో తీసుకుంటున్నట్లు జతిన్ దలాల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఫ్రెషర్స్‌ను ఏడాది పొడవునా సంబంధిత ప్రాజెక్ట్‌లలో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్లు మాత్రమే ఇస్తాం.. ఉద్యోగులదే తుది నిర్ణయం ఉద్యోగులకు మేం ఆప్షన్లు మాత్రమే ఇస్తాం. కంపెనీలో చేరుతారా? లేదా అనేది వాళ్లు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు సైతం ఉద్యోగుల శ్రేయస్సు కోరే విధంగా ఉంటాయి. కాబట్టే, ఫ్రెషర్లు ఎక్కువ ప్యాకేజీలు తీసుకొని ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూడకుండా.. కంపెనీ ఆఫర్ చేసిన జీతానికి కంపెనీలో చేరాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్రెషర్స్ వేతనాల తగ్గింపు ఈ ఏడాది మార్చి నెలలో విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కు ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత రూ.6.5 లక్షల ప్యాకేజీని కాస్త రూ.3.5లక్షలకు కుదించింది. దీనిపై మేం ఇచ్చే ఆఫర్‌కు ఒప్పుకోవాలని ఫ్రెషర్స్‌పై ఒత్తిడి తేవడం లేదు. తక్కువ ఆఫర్‌తో ఆన్‌బోర్డ్‌లోకి బోర్డులోకి వెళ్లాలనుకుంటున్నారా? అని నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్ల అవసరాల్ని గమనిస్తున్నాం మా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగానే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేస్తున్నాం. ఇది మా నియామక ప్రణాళికలకు కారణమవుతుంది. ప్రస్తుతం, మాకు రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో విధులు నిర్వహించే ఇంజినీర్లు అందుబాటులో పొందిన ఫ్రెషర్లకు పంపిన ఇమెయిల్‌లో కంపెనీ పేర్కొంది. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?
సాక్షి,ముంబై: ఐటీ కంపెనీల్లో ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్ ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 15 నెలలకు పైగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు మరో పరీక్ష విధించనుంది. ఇలాంటి శిక్షణను ఇప్పటికే పూర్తి చేసినప్పటికీ, మరోసారి ప్రాజెక్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్ (పీఆర్పీ) శిక్షణ అంటే.. ఈ సాకుతో కొంతమంది ఫ్రెషర్స్‌ను తొలగించేందుకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వేతనాల్లో సగం కోతం విధించిన తరువాత కూడా ఆన్‌బోర్డింగ్ కష్టాలకు తెరపడటం లేదు. (ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్) ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెషర్ల వేతనాలను రూ.6.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తాజా పరీక్షలో ఫ్రెషర్స్ కనీసం 60 శాతం ఓవరాల్ స్కోర్‌తో, పీఆర్పీ శిక్షణను ఉద్యోగులు క్లియర్ చేయకపోతే, వారు వెంటనే తొలగించబడతారని వారికి పంపిన సూచనలలో కంపెనీ పేర్కొన్నట్టు సమాచారం. అయితే దీనిపై విప్రో అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఐటీ మేజర్ తీసుకుంటున్న చర్యలు అనైతికం, అన్యాయమని, ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. కంపెనీ పాలసీలో ఆకస్మిక మార్పులు ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని వ్యాఖ్యానించారు. (ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైనా చార్జీలు!) -
అది ఆఫర్ లెటర్ కాదు.. ఫ్రెషర్లకు షాకిచ్చిన క్యాప్‌జెమినీ!
ఆన్‌బోర్డింగ్ విషయంలో కాస్త ఓపిక పట్టాలని ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెషర్లను కోరింది. 2022లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేసినవారిని 2023లో ఎప్పుడైనా ఆన్‌బోర్డ్ చేయనున్నట్లు తెలియజేసింది. ఖాళీల లభ్యత ఆధారంగా ఆన్‌బోర్డింగ్ ఉంటుందని అభ్యర్థులకు సమాచారం అందించింది. (ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!) క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఆన్‌బోర్డింగ్‌పై స్పష్టత కోసం కంపెనీని సంప్రదించగా ఈ మేరకు బదులిచ్చింది. ఎంపికైన అభ్యర్థులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) మాత్రమే ఇచ్చామని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కంపెనీకి లేదని పేర్కొంది. దీన్ని ఆఫర్ లెటర్‌గా పరిగణించకూడదని యూనివర్సిటీ రిలేషన్స్ అండ్ టాలెంట్ హైరింగ్ టీమ్ తెలిపింది. (తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!) భారతదేశంలోని చాలా ఐటీ కంపెనీలు గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లను ఇంకా ఆన్‌బోర్డ్ చేయలేదు. మాంద్యం సంకేతాలు ఉన్న ఉత్తర అమెరికా, యూరప్‌లో వ్యాపార అనిశ్చితి దీనికి కారణం. దీంతో సిబ్బంది వ్యయాల విషయంలో ఆయా కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు, అంచనాలు గణనీయమైన మందగమనాన్ని సూచిస్తున్నాయి. -
ఐటీ ఉద్యోగులకు చేదువార్త: వేరియబుల్ పే కట్స్, హైరింగ్‌పై నిపుణుల వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: రెసిషన్ లేదా ఆర్థిక మాంద్యం వచ్చిందంటే చాలు..ముందుగా ప్రభావితమయ్యేది ఐటీ రంగం. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక మందగమనంనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగాపలు దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులను నిరుద్యోగం లోకి నెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీరంగం, వాటి ఆదాయాలపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు) ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న ఆదాయాల సీజన్ అగ్నిపరీక్షగా మార నుంది. ప్రస్తుత ప్లేస్మెంట్ సెషన్లో తమ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్‌లో అంత యాక్టివ్‌గా లేవు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది నియామకాలు మందగించాయి. ఫ్రెషర్ ఆన్‌బోర్డింగ్ , వేరియబుల్ చెల్లింపులలో కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రానున్న (కనీసం స్వల్పకాలమైనా) ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేరియబుల్ పే చెల్లింపుల్లో ఉద్యోగులకు నిరాశే ఎదురుకానుందని అంనా వేస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వేరియబుల్ చెల్లింపులు దాదాపు లేనట్టేనని HR సంస్థ అసోసియేట్ శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యలనుబిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. దిగువ-బ్యాండ్ ఉద్యోగులు కోతల పరిమిత ప్రభావాన్ని ఎదుర్కొంటారని, అయితే వ్యాపార యూనిట్ పనితీరును బట్టి మధ్య నుండి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లార్జ్ క్యాప్ ఐటి కంపెనీలలో ఇది 85-100 శాతం వరకు ఉండవచ్చు. ఇది వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. టీసీఎస్ లాంటి ప్రధాన కంపెనీల్లోతొలి క్యూ3లో హెడ్‌కౌంట్ తగ్గిందని ఇది పరిస్థితి సూచిస్తోంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) అలాగే ఉద్యోగ నియామకాల మందగింపు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత మందగమనం నియామకాలు, విస్తరణపై ఖచ్చితమైన ప్రభావం చూపింది. ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా, కంపెనీలు నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించడంతో హెడ్‌కౌంట్ వృద్ధి మందగించిందని ఫోర్కైట్స్ (APAC) హెచ్ఆర్ డైరెక్టర్, కళ్యాణ్ దురైరాజ్ తెలిపారు. పరిశ్రమ విస్తృత తొలగింపుల కారణంగా అవకాశాలు లేకపోవడం వల్ల స్వచ్ఛంద అట్రిషన్ మధ్యస్తంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) కోవిడ్ తర్వాత ఎంట్రీ-లెవల్ టాలెంట్లను నియమించుకున్న కంపెనీలు, ఎంట్రీ లెవల్ టాలెంట్ హైరింగ్స్ పెరిగాయి, కానీ ఖచ్చితంగా ఫ్రెషర్ హైరింగ్, క్యాంపస్ హైరింగ్‌లో తగ్గుదల, ఒత్తిడిని చూస్తామన్నారు క్వెస్ ఐటి స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్. కానీ ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. -
తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!
గత ఏడాదే కోర్సులు పూర్తి చేసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఎంపికైనా ఉద్యోగాలు మాత్రం ఇంకా చేతికి అందలేదు. ఏడాది కింద కాలేజీలకే వెళ్లి, మెరిట్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకున్న కొన్ని కంపెనీలు ఇప్పటికీ ‘ఆన్ బోర్డింగ్ (ఉద్యోగాల్లో చేర్చుకోవడం)’ప్రక్రియను మొదలుపెట్టలే దు. పైగా మళ్లీ కొత్తవారి కోసమంటూ పలు కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపడుతుండటం.. చిన్న కంపెనీలే కాకుండా బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ)లు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఉద్యోగం వస్తుందా, రాదా? భవిష్యత్తు ఎలా ఉంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్/డిగ్రీ చదువు ముగియగానే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపిక కావడంతో.. తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే ఊహలు తలకిందులు అవుతున్నాయని వాపోతున్నారు. – సాక్షి, హైదరాబాద్ నిరుద్యోగుల వెతలెన్నో.. ఇటీవల ‘ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఫైట్)’చేసిన అధ్యయనంలో ‘ఆఫర్ లెటర్ల’తో అభ్యర్థు లు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తూ ఆఫర్ లెటర్లు (లెటర్ ఇంటెంట్) ఇచ్చిఏడాది దాటుతున్నా ఆన్ బోర్డింగ్ సమాచారం ఇవ్వడం లేదు. దీనితో చాలా మంది ఆందోళనలో పడిపోతున్నారు. ఇక కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నా యి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరేందుకు నిర్ణీతకాలానికి బాండ్లు సమర్పించాలని, ఒరిజి నల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కొర్రీలు పెడుతు న్నా యి. అభ్యర్థులు ఇతర కంపెనీల్లో మంచి ఉద్యో గాలు, ఆఫర్లు వచ్చినా వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తాము శిక్షణ, ఇతరాల కోసం వెచ్చించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తే ఇతర కంపెనీలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాయి. ఫైట్ నిర్వహించిన సర్వేలో వేయి మందికి పైగా ఆఫర్ లెటర్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇన్ఫోసిస్, ఎంఫసిస్, విప్రో, క్యాప్‌జెమిని వంటి ప్రధాన కంపెనీలు కూడా ఇందులో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆందోళన వద్దు.. ఐటీరంగంలో ఒడిదుడుకులు సహజమేనని, యువత తమ నైపుణ్యాలు, నాలెడ్జ్‌ను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం కొన్నినెలల నిరీక్షణ ఫరవాలేదని, అది ఎక్కువ కాలమైతేనే సమస్యగా మారుతుందని చెప్తున్నారు. రెండు, మూడేళ్లకోసారి కరెక్షన్ వస్తుందని, అది ఆయా రంగాలకు మంచిదే తప్ప హానికరం కాదని పేర్కొంటున్నారు. ముందే స్పష్టత తీసుకోవాలి.. ఎంఎన్‌సీలు సహా వివిధ ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చినప్పుడే ఏ తేదీ లోగా ‘ఆన్ బోర్డింగ్’చేస్తారనే దానిపై కాలేజీ యాజమాన్యాలు స్పష్టత తీసుకోవాలి. లేకుంటే కంపెనీలు తమకు నచ్చినట్టు చేస్తూ.. అవసరముంటే నెలలోనే జాయినింగ్ ఇస్తూ, లేకుంటే నెలల తరబడి జాప్యం చేస్తూ వెళుతున్నాయి. ఈ విషయంలో అటు కాలేజీలు, ఇటు కంపెనీల తప్పిదాలు ఉన్నాయి. ఐటీ కంపెనీ లు వెంటనే ఉద్యోగం ఇవ్వకపోయినా శిక్షణ ఇవ్వొ చ్చు. ఇంటర్న్‌షిప్, ట్రైనింగ్ ప్రాసెస్‌తో నడిపించవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఒక కంపెనీ ఆఫర్‌కే పరిమి తం కాకుండా మరో కంపెనీలో ప్రయత్నించొచ్చు. ఆన్‌బోర్డింగ్ వచ్చేలోగా చిన్న కంపెనీలు, స్టార్టప్‌లలో చేరి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆఫర్ లెటర్లు ఇచ్చినా జాయినింగ్ తేదీపై కంపెనీలు స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించాలి. ఆఫర్ లెటర్లను గౌరవించని సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వపరంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇటీవల మా సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లకు అందజేశాం.. – సి.వినోద్‌కుమార్, కన్వీనర్, ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆర్థిక మాంద్యం తొలగితే చక్కబడొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాస్తవ పరిస్థితి ఏమిటనేది మరో మూడు నెలల్లో స్పష్టత వస్తుంది. కంపెనీలు మంచి ఉద్ధేశంతోనే ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేపట్టాయి. కంపెనీ బిజినెస్ అవసరాలను బట్టి ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారిని ఆన్‌బోర్డింగ్‌కు పిలుస్తుంటాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి పిలవనంత మాత్రాన అది నేరమేమీ కాదు. ఎకానమీ వృద్ధి చెంది పరిశ్రమకు సానుకూల పరిస్థితులు ఏర్పడితే అన్నీ సర్దుకుంటాయి. గత వందేళ్లలో ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగి ఎక్కువ ప్రచారం జరగడం తప్ప ఇది కొత్తగా వచ్చిన సమస్యేమీ కాదు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్కిల్స్ పెంచుకోవాలి. – కోఫోర్జ్ వెంకా రెడ్డి, సీనియర్ హెచ్ఆర్ లీడర్ -
అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సహా అనేక టెక్ కంపెనీలు గత కొన్ని నెలలుగా ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 2001 నాటి గడ్డు పరిస్థితి తాము ఎలా ఎదుర్కొన్నదీ, ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడానికి ఏం చేసిందీ తెలియజేశారు. ఆ సమయంలో తమ కంపెనీ దాదాపు 1,500 మంది ఫ్రెషర్లకు ఆఫర్లు ఇచ్చిందని మూర్తి చెప్పారు. కానీ పరిస్థితి ప్రతికూలంగా మారడంతో ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ల ప్రకారం వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కంపెనీలో పైస్థాయిలో తామంతా భారీగా జీతాలు తగ్గించుకున్నట్లు మనీ కంట్రోల్ వార్తా సంస్థకు వివరించారు. అప్పట్లో బోర్డు డైరెక్టర్లు అంతా కూర్చుని మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకుని ఆ 1500 మంది ఫ్రెషర్లను అనుకున్నట్లుగా ఆన్‌బోర్డింగ్ చేయగలిగామని గుర్తు చేసుకున్నారు. అలా చేసిన ఏకైక సంస్థ ఇన్ఫోసిస్ అని, ఈ చర్య పట్ల తాను చాలా గర్విస్తున్నానని మూర్తి అన్నారు. కృత్రిమ మేధతో ముప్పు లేదు చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ (AI) సాధనాలు మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపవని నారాయణమూర్తి అన్నారు. 1977-78లో కూడా ‘ప్రోగ్రామ్ జనరేటర్’ ఆవిర్భావం సందర్భంగా ఇటువంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. చాట్‌జీపీటీ వంటివి కోడర్(ఉద్యోగి)పై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. మానవ మేధస్సు అత్యంత శక్తివంతమైనదని, దేన్ని అయినా తనకు అనువుగా మలుచుకోగలదని చెప్పారు. మానవులు ఈ కృత్రిమ మేధ సాధనాలను సృజనాత్మకంగా, తెలివిగా వాడుకోగలరని ఆయన పేర్కొన్నారు. -
ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..? ఐటీ కంపెనీ ఫ్రెషర్ల ఆవేదన
ఐటీ కంపెనీ ఎంఫసిస్ తమను ఆన్‌బోర్డింగ్ చేయించకుండా తీవ్ర జాప్యం చేస్తోందని ఆ సంస్థ ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు ఫ్రెషర్లు ట్విటర్ వేదికగా తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నుంచి తాము అందుకున్న అంగీకార పత్రాల గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో తమను ఉద్యోగంలోకి తీసుకుంటారో లేదో అని భయాందోళన చెందుతున్నారు. తాను కంపెనీ నుంచి 2021 అక్టోబర్‌లో అంగీకార పత్రం అందుకున్నానని, అప్పటి నుంచి జాయినింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నానని నితిన్‌రాకేష్ అనే అభ్యర్థి తెలియజేశారు. కంపెనీ నుంచి అంగీకార పత్రం అందుకున్నప్పుడు తాను కూడా ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగి కాబోతున్నానని ఎంతో సంతోషించానని, కానీ తనను ఆన్‌బోర్డ్ చేయకుండా ఎంఫసిస్ కంపెనీ నిరాశకు గురిచేస్తోందని వాపోయాడు. ఇప్పటికైనా ఆన్‌బోర్డ్ చేయాలని వేడుకుంటున్నాడు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) తౌహీద్ అనే మరో అభ్యర్థి.. తనుకు 2022 జూన్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారని, 2023 మార్చికి దాని గడువు ముగిసిపోతుందని, ఆన్‌బోర్డింగ్‌పై సమాచారం ఇవ్వాలని అభ్యర్థించారు. నిక్కీ అనే అభ్యర్థి అయితే తాను 16 నెలలుగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్నాని, ఈ కంపెనీలో చేరాలనే ఉద్దేశంతో ఇతర కంపెనీల వచ్చిన ఆఫర్లను కూడా వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక) -
సగం జీతానికి పనిచేస్తారా.. ఫ్రెషర్స్‌కు విప్రో ఝలక్!
కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు ఐటీ సంస్థ విప్రో ఝలక్ ఇచ్చింది. మొదట్లో ఆఫర్ చేసిన జీతంలో సగానికి పనిచేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని కోరింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్‌లను టేకప్ చేస్తారా అని యాజమాన్యం ఈ-మెయిల్స్ ద్వారా అడిగింది. (ఇదీ చదవండి: ఓలా, ఉబర్, రాపిడోలకు భారీ షాక్, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు) పరిశ్రమలో ఇతరుల మాదిరిగానే తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా నియామకాలు చేపడుతుంటామని విప్రో పేర్కొంది. ప్రస్తుతం తమకు రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో పనిచేసే ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులకు పంపించిన ఈ-మెయిల్లో వివరించింది. 2023 బ్యాచ్‌లోని వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ కేటగిరీ అభ్యర్థులకు కంపెనీ ఈ ఆఫర్ చేసింది.ఇది కూడా ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులను బోర్డింగ్‌లోకి తీసుకునే కసరత్తు మార్చి నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ కాలం తర్వాత అసెస్మెంట్లలో పేలవమైన పనితీరు కనబరిచిన 425 మంది ఫ్రెషర్లను తొలగించిన నేపథ్యంలో ఈ సగం ఆఫర్ విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: Layoffs: ట్విటర్లో మరిన్ని కోతలు.. ఈసారి వారి వంతు!) -
నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల తొలగింపు.. ఐటీ రంగంలో వీళ్లకి తిరుగులేదు!
ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు తక్కువ స్థాయిలో ఉండనున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఆ రంగానికి చెందిన సీనియర్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి దిగజారిపోతుందన్న భయాలు నెలకొన్న తరుణంలో చిన్న చిన్న కంపెనీల నుంచి బడా కంపెనీల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో మిగిలిన రంగాల పరిస్థితులు ఎలా ఉన్న టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో ఈ లేఆఫ్స్ భయాలు ఎక్కువగా ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రముఖ దేశీయ ఎంప్లాయిమెంట్ సంస్థ నౌకరీ.. 1400 మంది రిక్రూట్లు, జాబ్ కన్సల్టెన్సీలతో సర్వే నిర్వహించింది. ఆ అధ్యయనంలో 20 శాతం మంది రిక్రూటర్లు సీనియర్ ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఫ్రెషర్ల నియామకం ముమ్మరంగా కొనసాగనుందని, లేఆఫ్స్ .. ఫ్రెషర్ల రిక్రూట్ మెంట్‌పై తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఐటీ రంగంలో 6 నెలలు పాటు అట్రిషన్ రేటు అధికంగా 15 శాతం ఉండనుందని, అదే సమయంలో గ్లోబుల్ మార్కెట్లో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కొత్త రిక్రూట్మెంట్ భారీగా ఉంటుదని రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందికి పైగా 29 శాతంతో కొత్త ఉద్యోగాల రూపకల్పనలో నిమగ్నం కాగా.. 17 శాతం ఉద్యోగులు సంఖ్యను అలాగే కొనసాగించాలని భావిస్తున్నారు. 2023 మొదటి అర్ధభాగంలో (6 నెలలు) నియామక కార్యకలాపాలపై ఆశాజనకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నందున .. భారతీయ ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్లను పొందవచ్చని అంచనా. సర్వే చేసిన మొత్తం రిక్రూటర్లలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సగటు పెరుగుదలను 20 శాతానికి పైగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో నియామకాల ట్రెండ్లపై ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా క్యాంపస్ సెలక్షన్లు ఎక్కువ జరుగుతాయని సమాచారం. -
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్: రానున్న ఆరు నెలల్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఫ్రెషర్లకు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఫ్రెషర్లను నియమించుకోవాలని అనుకుంటున్నట్టు ఎక్కువ కంపెనీలు సర్వేలో వెల్లడించినట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ సంస్థ ఓ నివేదిక రూపంలో తెలిపింది. తొలి ఆరు నెలలకు సంబంధించి కెరీర్ అవుట్‌లుక్‌పై నివేదిక విడుదల చేసింది. బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు వచ్చే ఆరు నెలల్లో ఇతర రంగాల కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకుంటాయని స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ గురువారం ప్రచురించిన కొత్త నివేదిక తెలిపింది. భారత కంపెనీల ఫ్రెషర్ల నియామకాల ఉద్దేశ్యం 3 శాతం పెరిగి 62 శాతానికి చేరింది. 2022 జూలై-డిసెంబర్ కాలానికి ఇది 59 శాతంగా ఉంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ 874 భారీ, మధ్య, చిన్న తరహా కంపెనీల అభిప్రాయాలను 2022 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సమీకరించి ఈ వివరాలను వెల్లడించింది. ప్రెషర్లను నియమించుకోనున్నట్టు ఐటీ కంపెనీల్లో అత్యధికంగా 67 శాతం చెప్పాయి. ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లలో ఇది 52 శాతంగా ఉంటే, టెలికమ్యూనికేషన్స్‌లో 51 శాతంగా ఉంది. ఫ్రెషర్ల నియామకాల పరంగా 75 శాతంతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై 56 శాతం, ఢిల్లీ 47 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటికి డిమాండ్... ‘‘అంతర్జాతీయంగా నియామకాల పట్ల స్తబ్ధత నెలకొన్నప్పటికీ.. భారత కంపెనీల్లో అధిక శాతం ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు చెప్పాయి. కొన్ని దీర్ఘకాల మానవ వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ప్రస్తుతం భారంగా మారిన మానవ వనరుల స్థానంలో తాజా శిక్షణ పొందిన నైపుణ్యాలను (తక్కువ వేతనాలపై) సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నాయి’’అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతనురూజ్ తెలిపారు. క్లౌడ్ డెవలపర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అసోసియేట్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, మార్కెటింగ్ అనలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, కంటెంట్ రైటర్, కాంపెయిన్ అసోసియేట్, మైక్రోబయాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్‌లకు ఫ్రెషర్ల నియామకాల్లో డిమాండ్ నెలకొంది. ‘‘నియామకాల పట్ల ఆశావహంగా ఉన్న రంగాలను గుర్తించి, భవిష్యత్తులో డిమాండ్ ఉండే నైపుణ్యాల పట్ల ఉద్యోగార్థులు దృష్టి సారించాలి. ప్రస్తుత మార్కెట్ ధోరణలను అర్థం చేసుకుని, సరైన నైపుణ్యాలను నేర్చుకోవడంపై, తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే వాటిపై దృష్టి పెట్టాలి’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెంట్ నీతి శర్మ సూచించారు. కార్పొరేట్ ఫైనాన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రాజెక్ట్‌మేనేజ్‌మెంట్ నైపుణ్యాలకు సైతం డిమాండ్ ఉన్నట్టు టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉంటే జాబ్ నైపుణ్యాల ధ్రువీకరణ సర్టిఫికేషన్ ఉంటే ఉద్యోగాల్లో రాణించొచ్చని 91 శాతం మంది భారత విద్యార్థులు భావిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉద్యోగం సంపాదించేందుకు ఈ సర్టిఫికేషన్ సాయ పడుతుందని 96 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్ ఫామ్ ‘కోర్సెరా’ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో కంపెనీలు ఉద్యోగుల నియామకాల సమయంలో ప్రొఫెషనల్ సర్టిఫికేషకు ఎక్కువ విలువ ఇస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉద్యోగార్థుల అర్హతలను పెంచుతుందని భారత్‌లో 92 శాతం కంపెనీలు తెలిపాయి. -
హైదరాబాద్ లో TSQS హైరింగ్ స్టార్ట్
హైదరాబాద్: తమ టాలెంట్ స్ట్రాటజీలో భాగంగా మరియు యుఎస్‌లో వృద్ధి చెందుతున్న వ్యాపారానికి మద్దతు అందిస్తూ , డల్లాస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సాఫ్ట్వేర్ టెస్టింగ్ సేవల సంస్థ TSQS ఇంక్, తమ హైదరాబాద్ ఆఫ్‌షోర్ కేంద్రంలో 15 మంది ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలలో నియమించుకున్నట్లు వెల్లడించింది. ఔత్సాహిక టెకీలతో కూడిన బృందం ప్రారంభించిన ఈ సంస్థకు అపూర్వమైన ఐటీ అనుభవం ఉంది. పలు ఇంప్లిమెంటేషన్స్పై, విభిన్నమైన డొమైన్స్‌లో పనిచేస్తోన్న టీఎస్‌క్యుఎస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో క్వాలిటీ ఇంజినీరింగ్ ప్రాముఖ్యతను గుర్తించింది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్‌ను సైతం గుర్తించింది. ఇవి క్లయింట్స్ అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు అందించేందుకు సహాయపడతాయి అని TSQS ఇంక్ వైస్ ప్రెసిడెంట్ (క్వాలిటీ ఇంజినీరింగ్) శ్రీధర్ బొజ్జా అన్నారు. ‘‘టీఎస్‌క్యుఎస్ ఇంక్ పలువురు యువ ఇంజినీర్లను గుర్తించడంతో పాటుగా వారికి అవసరమైన టూల్స్‌పై శిక్షణ అందించి, యుఎస్‌లోని ప్రాజెక్టులలో నియమించింది. ఇప్పటికే చక్కటి ఫలితాలనూ పొందుతుంది. ప్రస్తుత ద్రవ్యోల్భణం, క్లయింట్స్ బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకుని, భారతదేశంలో కూడా అదే తరహా టాలెంట్ వ్యూహం ప్రతిబింబించనున్నాము’’ అని శ్రీధర్ అన్నారు. సాఫ్ట్వేర్ టెస్టింగ్ బృందాలను నాణ్యమైన ఇంజినీరింగ్ బృందాలుగా మార్చడం ద్వారా సాఫ్ట్వేర్ డెలివరీ లైఫ్ సైకిల్ వ్యాప్తంగా తమ నైపుణ్యం మరియు సమస్యా పూరణ అనుభవాన్ని పొందుపరచాలనే లక్ష్యంతో , తగ్గించబడిన సమయం, వ్యయాల వద్ద టెస్టింగ్‌ల నకలు తొలగించడం, ఆటోమేషన్ వృద్ధి చేయడం, పునర్వినియోగం చేసేందుకు సంస్థ యొక్క సామర్థ్యం పెంచుకోవాలని టీఎస్‌క్యుఎస్ ఇంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘ప్రస్తుత తమ ప్రాజెక్టులతో పాటుగా రాబోతున్న వాటిని పరిగణలోకి తీసుకుంటే మాకు నాణ్యతకు భరోసా అందించే ఇంజినీర్ల అవసరం భారీగా ఉంది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొనడంతో పాటుగా పక్క రాష్ట్రాల్లో కూడా మా ఆఫ్‌షోర్ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నాము. 2023లో 100కు పైగాఆఫ్షోర్ రిసోర్శెస్కు విస్తరించాలన్నది మా ఆలోచన. అలాగే 2024 క్యాలెండర్ సంవత్సరాంతానికి ఈ సంఖ్యను 250కు వృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని శ్రీధర్ అన్నారు మార్కెట్ శోధన మరియు కన్సల్టింగ్ సంస్ధ గ్లోబల్ మార్కెట్ ఇన్సైట్స్ (జీఎంఐ) ఉటంకించిన శ్రీధర్ మాట్లాడుతూ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మార్కెట్ ప్రస్తుతం 40 బిలియన్ డాలర్ల మార్కెట్ గా ఉంది. ఇది 2030 నాటికి 70 బిలియన్ డాలర్లు చేరుకోవచ్చని అంచనా. ఇది సీఏజీఆర్ 6%తో వృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా ఆటోమేటింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రక్రియ కోసం డిమాండ్ పెరుగుతుండటం, నాణ్యత హామీ కోసం చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం దోహదపడుతున్నాయన్నారు. చదవండి: చాట్‌జీపీటీకి అంత క్రేజ్ ఇందుకే..! -
వందల మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన విప్రో!
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. (ఇదీ చదవండి: మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం) ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై విప్రో స్పందించింది. ‘విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు గర్వపడుతున్నాం. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ - లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన వర్క్ ప్లేస్‌లో నిర్దిష్టమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము. వ్యాపార లక్ష్యాలు, క్లయింట్ల అవసరాలు ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మానిటరింగ్, రీట్రైనింగ్ వంటి ప్రక్రియల్లో భాగంగా కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగుల విభజన చేయాల్సి ఉంటుంది. కాబట్టే ట్రైనింగ్ తర్వాత పేలవంగా రాణిస్తున్న ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపింది. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) -
ఫ్రెషర్ల నియమాకాలపై కంపెనీల్లో సానుకూలత
ముంబై: ఫ్రెషర్లకు ఉపాధి కల్పించే విషయంలో కంపెనీల్లో సానుకూల ధోరణి 61 శాతానికి పెరిగింది. టెక్నాలజీ, డిజిటల్ సేవలకు డిమాండ్‌తో సంస్థలు మరింత మంది ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ కెరీర్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దీంతో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలు గతేడాది జూన్–డిసెంబర్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలానికి మూడు రెట్లు అధికంగా ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయ భాగం ఆరంభంలో నిపుణులను ఆకర్షించడం ప్రముఖ కంపెనీలు, వ్యాపారవేత్తలకు ప్రాధాన్య అంశంగా మారినట్టు తెలిపింది. 865 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలపై టీమ్‌లీజ్ ఈ సర్వే నిర్వహించింది. ఐటీ 34 శాతం, ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లు 23 శాతం, టెలీ కమ్యూనికేషన్స్ 22 శాతం, ఇంజనీరింగ్ రంగం 20 శాతం మేర గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ద్వీతీయ ఆరు నెలల కాలంలో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాల పరంగా.. బెంగళూరు 25 శాతం, ముంబై 19 శాతం, ఢిల్లీ 18 శాతం వృద్ధిని చూపించనునన్నట్టు అంచనా వేసింది. -
ఫ్రెషర్లకు గుడ్ లక్: ఐటీలో లక్ష జాబ్స్,అంతేనా...ఇంకా చాలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రెషర్ల నియామకానికి కంపెనీలు సై అంటున్నాయి. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. 2022 జూలై–డిసెంబర్లో ఫ్రెషర్లను చేర్చుకునేందుకు 59 శాతం కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ ఏడాది జనవరి–జూన్‌తో పోలిస్తే ఇది 12 శాతం అధికం కావడం విశేషం. ఐటీలో 65 శాతం, ఈ-కామర్స్ 48, టెలికమ్యూనికేషన్స్‌లో 47 శాతం సంస్థలు ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఐటీలో లక్ష మంది ఫ్రెషర్ల నియామకాలు ఉండే అవకాశం ఉంది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్స్ నియామకాల చుట్టూ ఉన్న సెంటిమెంట్ భారతదేశంలో గణనీయంగా మెరుగుపడుతోంది. ఎక్కువ కంపెనీలు ఫ్రెషర్స్‌ను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా దేశంలోని యువత ఉపాధి సామర్థ్యం విలువతో కూడిన మార్పుకు గురైందనడానికి ఈ ధోరణి నిదర్శనం. ఒక ఏడాదిలోనే ఫ్రెషర్స్ హైరింగ్ సెంటిమెంట్ 42 శాతం పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇది వేగంగా అధికం అవుతుంది. 14 ప్రాంతాల్లోని 18 రంగాలకు చెందిన 865 కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికవెల్లడైంది. -
రిలయన్స్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు! జీతం..కోటి రూపాయలు పైనే
ప్రముఖ దేశీయ దిగ్గజ సంస్థ రియలన్స్ ఇండస్ట్రీస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలో మొత్తం 60వేల మంది ఉద్యోగుల్ని నియమిచుకోనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ కంపెనీలతో జత కట్టిన నేపథ్యంలో భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రియలన్స్ ఇండస్ట్రీస్ రీటైల్ విభాగంగా 200 సీనియర్ ఎగ్జిక్యూటీవ్‌లను ఎంపిక చేసుకోనుంది. వైస్ ప్రెసిడెంట్ లెవల్ పై స్థాయి ఉద్యోగులకు ఏడాదికి రూ.కోటి పైగా వేతనం చెల్లించనుంది. వీరితో పాటు వేలల్లో జూనియర్, మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లను, వచ్చే మూడు క్వార్టర్స్‌లో మొత్తం 60వేల మంది జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లను హయ్యర్ చేసుకుంటామని రిలయన్స్ వెల్లడించింది. అంతర్జాతీయ కంపెనీలతో జత రిలయన్స్ సంస్థ గ్లోబల్ బ్రాండ్లతో జత కట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొత్త అవుట్‌లెట్‌ను తెరిచింది. రానున్న నెలల్లో వాటిని పెంచేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో రిలయన్స్ రిటైల్ కోసం 150-200 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవడంతోపాటు వైస్ ప్రెసిడెంట్, అంతకంటే పై స్థాయిలో ఉన్న వారిని నియమించుకోనుందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని 6 నెలల పాటు ఒప్పందం మీద తాత్కాలిక సిబ్బంది నియమించుకోనుంది. అలా కాకుండా, కొత్త స్టోర్ల కోసం ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్‌ను హయ్యర్ చేసుకోనుందని, జూనియర్ స్థాయిలలో నియమించుకోనున్న ఉద్యోగులకు వారి ప్రారంభ జీతం రూ.25,000- రూ.30,000 వరకు ఉండనున్నట్లు సమాచారం. -
సాఫ్ట్వేర్ బూమ్..బూమ్,ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..!
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2022) దేశీయంగా 50,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనుంది. కంపెనీ తొలి క్వార్టర్(జనవరి–మార్చి) ఫలితాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఏడాది 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని అంచనా వేసింది. క్యూ1లో నికర లాభం 11 శాతంపైగా బలపడి 56.3 కోట్ల డాలర్లను తాకింది. 2021 క్యూ1లో 50.5 కోట్ల డాలర్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా డిజిటల్ విభాగం వృద్ధి సహకరించినట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. కంపెనీ కేలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. క్యూ1లో మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 4.82 బిలియన్ డాలర్లకు చేరింది. యూఎస్ కేంద్రంగా ఐటీ సేవలందించే కంపెనీ ఉద్యోగుల్లో 70 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహించే సంగతి తెలిసిందే. 20 బిలియన్ డాలర్లకు: సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది 19.8–20.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకోగలమని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫైర్స్ అభిప్రాయపడ్డారు. ఇది 9–11 శాతం వృద్ధికి సమానమని తెలియజేశారు. వెరసి తొలిసారి 20 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించే వీలున్నట్లు పేర్కొన్నారు. -
ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..!
భారత కంపెనీలు భారీ ఎత్తున ఫ్రెషర్ల నియామాకాలను చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెద్ద ఎత్తున్న నియామాకాలను జరిపేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ సర్వే వెల్లడించింది. 38 శాతంపైగా..! వచ్చే మూడు నెలల్లో 38 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయని సర్వేలో తేలింది. సుమారు 3090 కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే మాత్రం నియామకాలు 11 శాతం క్షీణించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో తమ ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని 55 శాతం, తగ్గొచ్చని 17 శాతం, నియామాకాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చునని 36 శాతం కంపెనీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. మొత్తంగా చూస్తే 38 శాతం కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తేలింది. వీడని భయాలు..! కరోనా రాకతో పలు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కోవిడ్ ఉదృతి కాస్త తగ్గడంతో కంపెనీలు కొత్త ఉద్యోగుల నియమాకాలపై దృష్టి సారించాయి. అయినప్పటీకి తాజా పరిస్థితులు కంపెనీల్లో భయాలను సృష్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వార్, అధిక ద్రవ్యోల్భణాల నుంచి కంపెనీలకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటి తెలిపారు. బలంగా భారత స్టార్టప్ వ్యవస్థ..! భారత్‌లో స్టార్టప్ వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది. స్టార్టప్ కంపెనీలకు భారత్ అనువైన దేశంగా మారినట్లు సందీప్ గులాటీ అభిప్రాయపడ్డారు. బలమైన స్టార్టప్ వ్యవస్థను రూపొందించేందుకు గాను కేంద్రం కూడా భారీ ఫండ్‌ను కేటాయిస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో సుమారు రూ.283.5 కోట్ల "స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఉద్యోగాల్లో మహిళల వాటా ఇంకా ఆందోళకరంగానే ఉందని సర్వే తెలిపింది. అత్యధికంగా ఐటీ, సాంకేతికరంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండగా, తరువాత రెస్టారెంట్లు-హోటళ్లు, విద్య, వైద్యం, సామాజిక-ప్రభుత్వ రంగాల్లో నియామాకాలు అధికంగా ఉంటాయని మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే వెల్లడించింది. చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే? -
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. కాప్‌జెమినీలో 60 వేల ఉద్యోగాలు..!
ముంబై: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ కాప్జెమినీ గత ఏడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది భారత్‌లో 60వేల మందిని కొత్తగా నియమించుకొనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సరికొత్త నియామకాలతో తమ సంస్థ విలువ మరింత పెరుగుతందని కంపెనీ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్'కి డిమాండ్ పెరగడంతో ఈ నియామకాలు చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నియామకాల్లో అనుభవం ఉన్న వారితోపాటు ఫ్రెషర్లు కూడా ఉండనున్నారని కంపెనీ పేర్కొంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అశ్విన్ యార్డి మీడియాకు వెల్లడించారు. కాప్జెమినీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగం మంది భారతీయులే కావడం విశేషం. 5జీ, క్వాంటం వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై సంస్థ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. ఎరిక్సన్ భాగస్వామ్యంతో కాప్జెమినీ గత ఏడాది భారతదేశంలో 5జీ ల్యాబ్ ప్రారంభించింది అని అశ్విన్ అన్నారు. భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోని క్లయింట్లకు 5జీ రంగ సేవలు అందించేందుకు భారతీయ కంపెనీలతో కలసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్వాంటం, 5జీ, మెటావర్స్ టెక్నాలజీల్లో సేవలందించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నది. కొత్త తరం టెక్నాలజీ నైపుణ్యాలు భారతదేశంలో చాలా ఉన్నాయి అని యార్డీ తెలిపారు. అదేవిధంగా, కాప్జెమినీ క్లౌడ్ & ఏఐ కోసం ఒక అకాడమీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ముంబయిలోని ఆఫీస్‌లో భారీగా స్థలం ఉంది. ఇది కాప్జెమినీకి భారత్‌లోనే ఉన్ అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్. దీనికి తోడు మిగిలిన చోట్ల కంపెనీకి ఉన్న సెంటర్లను కూడా పెంచుతుండటంతో కొత్త ఉద్యోగుల పోస్టింగ్‌లు ఇస్తున్నామని కంపెనీ సీఈవో అశ్విన్ పేర్కొన్నారు. (చదవండి: అదిరిపోయిన హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. ధరెంతో తెలుసా?) -
బంపరాఫర్!! మీ కోసమే..ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఊహించని శాలరీలు!!
నిరుద్యోగులకు శుభవార్త!! అధిక సంఖ్యలో ఐటీ కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులకు భారీ ఎత్తున శాలరీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, తద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఫ్రెషర్లకు ఊహించిన జీతాల కంటే ఎక్కువగా శాలరీలు పొందవచ్చని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ కంపెనీలకు వచ్చి పడుతున్న ప్రాజెక్ట్‌లు, ఐటీ కంపెనీల్లో మిడ్, సీనియర్ స్థాయి విభాగాల్లో పెరుగుతున్న అట్రిషన్ల కారణంగా టెక్ విభాగంలో రికార్డ్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు పేర్కొన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, క్యాప్‌జెమినితో సహా ఐటి కంపెనీలు 2022 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2.3 లక్షల మంది కొత్తగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ప్రస్తుతం ఈ నియామకం రికార్డ్ స్థాయిలో ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీలు నియామకాల్ని మరింత పెంచేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రీసెర్చ్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ ఇటీవలి నివేదికలో 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలు 3.5 నుంచి 3.6 లక్షలకు పెంచనున్నాయి. -
ఫ్రెషర్లకు కొలువుల పండగ!
న్యూఢిల్లీ: కాలేజీల నుంచి పట్టాలు పుచ్చుకుని కొలువుల కోసం చూస్తున్న ఫ్రెషర్లకు తీపికబురు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో కంపెనీలు ఫ్రెషర్లను అధికంగా తీసుకోనున్నాయి. టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ‘కెరీర్ అవుట్‌లుక్ రిపోర్ట్’ ఈ వివరాలు వెల్లడించింది. క్రితం ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది అర్ధ భాగంలో ఫ్రెషర్లను నియమించుకోవాలన్న ఉద్దేశం కంపెనీల్లో 30 శాతం ఎక్కువగా కనిపించినట్టు వివరించింది. 47 శాతానికి పైగా కంపెనీలు జూన్‌లోపు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు తెలిపాయి. గతేడాది ఇది 17 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకం పట్ల సానుకూలత పెరగడం సంతోషాన్నిస్తోంది’’ అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీఈవో శంతనురూజ్ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వృద్ధిపై దృష్టి సారించడం ఈ సానుకూల ధోరణికి కారణాలుగా తెలిపారు. ఫ్రెషర్లతోపాటు అన్ని రకాల ఉద్యోగాలకు కలిపి చూస్తే నియామకాల ఉద్దేశం 50 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఫ్రెషర్లకు ఐటీ, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో అధిక కొలువులు రానున్నట్టు పేర్కొంది. వీటికి అధిక డిమాండ్ ‘‘డేటా అనలైటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్/వీఆర్, కంటెంట్ రైటింగ్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టిíఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, టెక్నికల్ రైటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సప్లయ్ చైన్ అనలిస్ట్ ఉద్యోగాలకూ డిమాండ్ ఉంటుంది. ఫ్రెషర్ల విషయానికొస్తే విశ్లేషణా సామర్థ్యాలు, ఇన్నోవేషన్, ఒత్తిడిని నియంత్రించుకోగలగడం, సమాచార నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి’’ అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెండ్, సహ వ్యవస్థాపకుడు నీతి శర్మ తెలిపారు. ఐటీలో 3.6 లక్షల కొలువులు ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 3.6 లక్షల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పిస్తుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అన్ఎర్త్ ఇన్సైట్’ సంస్థ పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 22.3%గా ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 19.5% నుంచి పెరిగినట్టు పేర్కొంది. జనవరి–మార్చి త్రైమాసికంలో 24%కి పెరగొచ్చని.. వచ్చే ఏడాది (2022–23)లో ఇది 16–18%కి తగ్గుతుందని అంచనా వేసింది. -
ఐటీ ఫ్రెషర్స్‌కు శుభవార్త.. రెండు నెలల్లో 55 వేల ఉద్యోగాల నియామకం!
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సంస్థ ఐటీ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 55 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్నట్లు సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. "మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 55,000 కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోబోతున్నాము. ఈ ప్రక్రియ 2 నెలల్లో ముగుస్తుంది. మేము వచ్చే సంవత్సరంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నాము" అని పరేఖ్ నేడు(ఫిబ్రవరి 16న) నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ ఫోరం 2022(ఎన్టిఎల్ఎఫ్)లో అన్నారు. ఈ ఎన్టిఎల్ఎఫ్ ఫోరం ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జరగనుంది. కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఆరు నుంచి 12 వారాల మధ్య కాలంలో కంపెనీ సమగ్రమైన శిక్షణా అందిస్తుంది అని అన్నారు. ఈ ఏడాది కంపెనీ నియమించుకొనే 55,000 ఉద్యోగులలో 52000 మంది భారత దేశం నుంచి అయితే, మరొక 3,000 మ౦దిని బయట నుంచి నియమించుకొనున్నట్లు పరేఖ్ తెలిపారు. విద్యార్ధులు క్లౌడ్, డేటా అనాలిసిస్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటి వంటి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని పరేఖ్ సూచించారు. వ్యాపార పరంగా, పెద్ద క్లౌడ్ & డిజిటల్ సంస్థలు ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి అని అన్నారు. ఫ్రెషర్స్ నియామకం పెరుగుతున్నప్పటికీ కంపెనీలలో అట్రిషన్ రేటు పెరుగుతుంది. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సంస్థలో అట్రిషన్ రేటు 25.5 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. (చదవండి: గూగుల్ పే సూపర్ ఆఫర్.. నిమిషాల్లో లక్ష రూపాయల లోన్!) -
విప్రో.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం యథాతథంగా రూ. 2,969 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,968 కోట్లు ఆర్జించింది. అయితే క్యూ2తో పోలిస్తే 1.3 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం దాదాపు 30 శాతం ఎగసి రూ. 20,314 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 15,670 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 19,667 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 3.2 శాతం వృద్ధి సాధించింది. 2–4 శాతం మధ్య ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్వీసుల ఆదాయం 2–4 శాతం మధ్య పుంజుకోనున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 269.2–274.5 కోట్ల డాలర్ల మధ్య టర్నోవర్ నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. త్రైమాసికవారీగా తాజా గైడెన్స్‌ను ప్రకటించింది. కాగా.. క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధితో దాదాపు 264 కోట్ల డాలర్లకు చేరింది. జీతాల పెంపు నేపథ్యంలోనూ పటిష్ట నిర్వహణ మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 30,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాలలోకి తీసుకునే వీలున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► క్యూ3లో 10,306 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► డిసెంబర్‌కల్లా ఐటీ సర్వీసుల మొత్తం సిబ్బంది సంఖ్య 2,31,671కు చేరింది. ► వార్షికంగా 41,363 మందికి ఉపాధి కల్పించింది. ► షేరుకి రూ. 1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ► క్యూ3లో 80 శాతంమంది రెండోసారి ఉద్యోగులకు జీతాల పెంపు ► గత 12 నెలల్లో 80 శాతంమంది సిబ్బందికి మూడు విడతల్లో ప్రమోషన్లు ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 691 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. పటిష్ట పనితీరు ఆదాయం, మార్జిన్లలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. ఆర్డర్ బుకింగ్స్ సైతం ఊపందుకున్నాయి. గత 12 నెలల్లో 10 కోట్ల డాలర్ల ఆదాయ లీగ్‌లో 7 సంస్థలను(క్లయింట్లు) జత చేసుకున్నాం. క్యూ3లో ఎడ్జైల్, లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్ కొనుగోళ్లను పూర్తిచేశాం. తద్వారా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోగలిగాం. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో లిమిటెడ్ -
ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు..!
ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు అందించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం(ఎఫ్వై23)లో కూడా 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు విప్రో బుధవారం తెలిపింది. కోవిడ్ ఓమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కంపెనీ 'చాలా అప్రమత్తంగా' ఉన్నట్లు సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే తెలిపారు. రాబోయే నాలుగు వారాలపాటు ప్రపంచవ్యాప్తంగా తన కార్యాలయాలను మూసివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. ''ప్రపంచవ్యాప్తంగా మా ఉద్యోగుల్లో 90 శాతం మంది ఇప్పుడు ఒక ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మాకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, 65 శాతం మందికి పైగా సెకండ్ డోస్ వేసుకున్నట్లు" సంస్థ తెలిపింది. "రెండు డోసుల టీకాలు వేసుకున్న ఉద్యోగులను హైబ్రిడ్ మోడల్లో భాగంగా కార్యాలయానికి తిరిగి రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో ఓమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. మా ఉద్యోగుల భద్రత, క్లయింట్ ప్రాధాన్యతలు రెండింటినీ దృష్టిలో ఉంచుకొని 4 వారాలు కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించినట్లు" 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న తరుణంలో సీఈఓ పేర్కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.2,969 కోట్లుగా నమోదయ్యింది. (చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..!) -
మీదే ఆలస్యం..ఐటీ కంపెనీల్లో లక్ష పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్
నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో భారీగా ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు ప్రకటించాయి. మన దేశంలో ఐటీ సెక్టార్ తో పాటు డిజిటల్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో టీసీఎస్,ఇన్ఫోసిస్,విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 1,20,000 ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగుల నియామకం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. టీసీఎస్ టీసీఎస్ గత ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో 43,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాల్ని కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలో మరో 35,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను ఎంపిక తీసుకోన్నట్లు చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 78,000 మందిని నియమించుకున్నట్లు అవుతుందని అన్నారు. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ని ఉద్యోగుల అట్రిషన్ రేటు తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 45 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది.ఇక సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో జూన్ చివరినాటికి 13.9 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 20.1 శాతానికి పెరిగింది. విప్రో విప్రోసైతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను ఎంపిక చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో తన రెండవ త్రైమాసిక ఆదాయాల ప్రకటన సందర్భంగా రెట్టింపు స్థాయిలో ఫ్రెషర్ల నియామకాలు చేపట్టినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ థియరీ డెలాపోర్టే తెలిపారు. హెచ్‌సీఎల్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది 20వేల నుంచి 22వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసుకుంది. వచ్చే ఏడాది 30,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని హెచ్‌సీఎల్ తెలిపింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) కాగ్నిజెంట్ సంస్థ భారీ స్థాయి అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సమస్యను ఎదుర్కొంటుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 33శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకొచ్చినట్లు తెలుస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 11.9%, ఇన్ఫోసిస్ 20.1%,విప్రో 20.5శాతం, టెక్ మహీంద్రా 21శాతంతో ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఫ్రెషర్స్‌ను నియమించుకునే పనిలో పడ్డాయి. చదవండి: తాత్కాలిక పనివారికి డిమాండ్ ! -
ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసీస్ గుడ్‌న్యూస్!
బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు భారీగా నియామక ప్రక్రియ చేపట్టాయి. బెంగళూరు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించిన తర్వాత ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది. అంతే స్థాయిలో అట్రిషన్ స్థాయి(ఉద్యోగుల వలస రేటు) పెరిగింది. ఇంతకు ముందు లక్ష్యం 35,000తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 45,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకొనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. "మార్కెట్ పట్టు సాధించడం కోసం మేము మా కళాశాల గ్రాడ్యుయేట్ల నియామక ప్రక్రియ కింద 45,000కు నియమించుకొనున్నాం" అని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు అన్నారు. జూన్ త్రైమాసికం చివరిలో ఇన్ఫోసీస్ 35,000 కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది. "డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడం, పరిశ్రమలో అట్రిషన్ రేటు పెరగడం వల్ల సవాళ్లు ఎదురు అవుతున్నాయి" అని సీఓఓ ప్రవీణ్ రావు ఇంతకు ముందు చెప్పారు. సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరిలో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల అట్రిషన్ రేటు గత ఏడాది 12.8%తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది 20.1% వద్ద ఉంది. సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి ఇన్ఫోసిస్‌లో 2,79,617 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.(చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..!) -
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు.. ..
మీరు చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారా ! అయితే మీకో గుడ్‌న్యూస్. పలు దిగ్గజ ఎంఎన్సీ కంపెనీలు ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్,పీడబ్ల్యూసీ,టాటా కన్సల్టెన్సీ సర్వీస్,బైజూస్,టాటా స్టీల్,ఇన్ఫోసిస్ కంపెనీలు ఆఫ్ క్యాంపస్‌లో భారీ ఎత్తున ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సుమారు 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కాగ్నిజెంట్ 2022( వచ్చే ఏడాదికి ) గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్ధులకు 45 వేలు ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ సైతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించనుంది. 2021-22 ఆర్థిక ఆర్ధిక సంవత్సరంలో ఇండియాకు చెందిన టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,విప్రోలు సుమారు లక్షా 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను మాట్లాడుతూ.. ఫుల్ స్టాక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్,ఏల్/ఎంఎల్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ కోసం అధునాతన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ సైతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి),నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) నుండి ఇంజనీరింగ్ విద్యార్ధుల్ని ఎంపిక చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా 'ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్' పేరిట క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల నియమాకం కోసం ఇండియాలో మొత్తం 600 ఇంజనీరింగ్ క్యాంపస్‌లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హ్యూమన్ కేపిటల్ మేనేజ్మెంట్ అధికారిణి దీపికా బెనర్జీ చెప్పారు. ఈ నియామకాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీర్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.కాగా, స్టార్టప్‌లు,ఐటీ/ టెక్నాలజీ ఔట్సోర్సింగ్స్ సంస్థలు,స్టార్టప్‌లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు, కన్సల్టెన్సీలలో డిమాండ్ పెరగడంతో తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్ధులను నియమించుకునేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో! -
1,800 మంది ఫ్రెషర్లను నియమించుకున్న ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) 1,800 మందికిపైగా ఫ్రెషర్లను నియమించుకుంది. ప్రాంగణ నియామకాల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టు వెల్లడించింది. 300లకుపైగా కళాశాలల నుంచి 36,000ల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని వివరించింది. 8,000 ఇంటర్వ్యూలు వర్చువల్ విధానంలో కంపెనీ నిర్వహించింది. ఎల్అండ్టీ అనుబంధ కంపెనీలైన లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వేర్వేరుగా ఫ్రెషర్లను నియమిస్తున్నాయి. -
ఫ్రెషర్లకు ఎల్టీఐలో 4,500 కొలువులు
ముంబై: లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) ఈ ఏడాది సుమారు 4,500 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. భారీ స్థాయి అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సమస్యను అధిగమించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్టీఐ గతేడాది 3,000 మందిని రిక్రూట్ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 18.3%గా ఉన్న అట్రిషన్ రేటు హైరింగ్ పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.2%కి తగ్గింది. అయితే, సీక్వెన్షియల్‌గా మార్చి త్రైమాసికంలో నమోదైన 12.3%తో పోలిస్తే మాత్రం పెరిగింది. కంపెనీ సీఈవో సంజయ్ జలోనా ఈ విషయాలు తెలిపారు. ఐటీ రంగంలో మార్కెట్ దిగ్గజం టీసీఎస్‌లో అట్రిషన్ రేటు క్యూ1లో అత్యల్పంగా 8.6%గా (మార్చి క్వార్టర్లో 7.2 %) నమోదైంది. అటు ఇన్ఫోసిస్‌లో 13.9% (మార్చిలో 10.9%), విప్రోలో 15.5% (మార్చి త్రైమాసికంలో 12%)గా అట్రిషన్ రేటు ఉంది. జూన్ త్రైమాసికంలో కాగ్నిజెంట్‌లో అత్యధికంగా 31 శాతంగా నమోదైంది. -
ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్ బంపర్ ఆఫర్..!
రానున్న రోజుల్లో హెచ్‌సీఎల్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిమాండ్ తగ్గట్టుగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2023 వరకు సుమారు 30 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకొనున్నట్లు కంపెనీ హూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావ్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం కంపెనీలో సుమారు 40 నుంచి 50 శాతం మేర ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రకటనలో వీవీ అప్పారావు పేర్కొన్నారు. గత సంవత్సరంలో హెచ్‌సీఎల్ సుమారు 14 వేల మంది ఫ్రెషర్లను నియామకం చేసింది. 2021 సంవత్సరానికిగాను సుమారు 20 వేల నుంచి 22 వేల మంది ప్రెషర్లను తీసుకోవాలని హెచ్‌సీఎల్ భావిస్తోందని వీవీ అప్పారావు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 40-50 శాతం కొత్త నియామాకాలతో 2023 ఆర్థిక సంవత్సరానికి సుమారు 30 వేల మంది కొత్త వారికి ఉద్యోగాలను హెచ్‌సీఎల్ కల్పించనుందని వీవీ అప్పారావు తెలిపారు. కంపెనీలో ప్రస్తుతం సుమారు 1.76లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం హెచ్‌సీఎల్ 35 శాతం కొత్త వారిని, 65 శాతం అనుభవం కల్గిన ఉద్యోగులను నియమిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఫ్రెషర్ల సంఖ్యను 70 శాతానికి పెంచాలని కంపెనీ భావిస్తోందని వీవీ అప్పారావు తెలిపారు. తాజాగా కంపెనీలో అట్రిషన్‌ను ఎదుర్కోవడం కోసం కంపెనీలోని ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను ఇవ్వాలని హెచ్‌సీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రసిద్ధ కాలేజీల నుంచి హెచ్‌సీఎల్ ఎక్కువ ఫ్రెషర్లను నియామాకం చేసుకోనుంది. ఈ ఏడాది ఐఐటీల నుంచి సుమారు 206 మందిని నియమించుకుంది. గత ఏడాది ఐఐటీలనుంచి ఫ్రెషర్ల భర్తీ సంఖ్య 134 గా ఉంది. కాగా దేశవ్యాప్తంగా పలు టాప్ 200 కాలేజీల నుంచి ఫ్రెషర్లను నియమించుకోవడానికి హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోందని హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావు పేర్కొన్నారు. -
Persistent Systems: ఫ్రెషర్లకు భారీగా కొలువులు
ముంబై: ఐటీ రంగ సంస్థ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. వ్యాపార అవసరాన్నిబట్టి అనుభవజ్ఞులను సైతం కొత్తగా చేర్చుకోనుంది. గత 9 నెలల్లో 4,200 మందిని కంపెనీ చేర్చుకుంది. వీరిలో 700 మంది ఫ్రెషర్లు. జూన్ నాటికి సంస్థలో మొత్తం 14,904 మంది ఉద్యోగులు ఉన్నారని పెర్సిస్టెంట్ సిస్టమ్స్ చీఫ్ ఫైనా న్షియల్ ఆఫీసర్ సునిల్ సప్రే వెల్లడించారు. -
ఫ్రెషర్స్‌కి గోల్డ్‌మాన్ సాక్స్ గుడ్‌న్యూస్
హైదరాబాద్: గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్‌మాన్ సాక్స్‌కి సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌కి ప్రాధాన్యత పెరగనుంది. హైదరాబాద్ క్యాంపస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రాబోయే రెండేళ్లలో ఇక్కడ కొత్త నియమకాలు చేపడతామని ప్రకటించింది. ఫైనాన్షియల్ సెక్టార్లో గోల్డ్‌మాన్ సాక్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ. 2021 మార్చిన హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థలో కేవలం 250 మంది ఉద్యోగులే పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ కార్యాలయంలో 2,000 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి 700ల మంది ఉద్యోగులను నియమిస్తామని, ఇందులో 70 శాతం కొత్త వారికే అవకాశాలు కల్పించబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2023 నాటికి హైదరాబాద్ ఆఫీస్‌లో 2500ల మంది ఉద్యోగులు పని చేసే విధంగా తమ కార్యకలాపాలు విస్తరిస్తామని గోల్డ్‌మాన్ సాక్స్ తెలిపింది. రాబోయే రోజుల్లో తాము నిర్వహించే అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలకి హైదరాబరాద్ ఆఫీస్ కీలకంగా మారబోతుందని గోల్డ్‌మాన్ సాక్స్ చైర్మన్ డేవిడ్ ఎం సాల్మోన్ తెలిపారు. -
ఫ్రెషర్లకు దేశీయ ఐటీ దిగ్గజాలు గుడ్‌న్యూస్..!
కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడటంతో దేశీయ ఐటీ సంస్థలు నియామక ప్రక్రియను వేగవంతం చేశాయి. ఐటీ సంస్థలకు కొత్త కాంట్రాక్టులు వస్తుండటంతో డిమాండ్ తగ్గట్టుగా నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసీస్, విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షకు పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. టీసీఎస్ దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని అన్నీ క్యాంపస్ ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనుంది. 5 లక్షల మందికి పైగా ఉద్యోగులతో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అవతరించిన టీసీఎస్ 2020లో క్యాంపస్‌ల నుంచి 40,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. "భారతదేశంలోని క్యాంపస్ ల నుంచి మేము గత సంవత్సరం 40,000 నియమించుకున్నాము. ఈ ఏడాది 40,000 లేదా అంతకంటే ఎక్కువ మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు" ఆ కంపెనీ ప్రపంచ మానవ వనరుల చీఫ్ మిలింద్ లక్కడ్ గత వారం చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి సంబంధిత ఆంక్షలు ఈ నియామకాల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవని ఆయన అన్నారు. గత ఏడాది, మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఇన్ఫోసీస్ ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ వై22 ఆర్ధిక సంవత్సరంలో 35,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియాయమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తున్నట్లు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు క్యూ1 సంపాదన ప్రకటనలో తెలిపారు. ఇన్ఫోసిస్ 2022 జూన్ త్రైమాసికం చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.67 లక్షలు, 2021 మార్చి త్రైమాసికంలో ఈ సంఖ్య 2.59 లక్షలు. "ఇటీవలి కాలంలో డిజిటల్ సంస్థలకు డిమాండ్ పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 35,000 కాలేజీ గ్రాడ్యుయేట్ల నియామక ప్రక్రియ ద్వారా ఈ డిమాండ్ ను తీర్చాలని మేం యోచిస్తున్నాం'' అని ఆయన తెలిపారు. విప్రో విప్రో ఐటీ ఉద్యోగుల సంఖ్య 2,00,000 మైలురాయిని దాటింది. విప్రో సంస్థ ఈ ఏడాది తన మొదటి త్రైమాసిక సమావేశంలో ఉద్యోగుల సంఖ్య 2,09,890కకు చేరుకున్నట్లు తెలిపింది. మొదటి త్రైమాసికంలో 10,000 కంటే ఎక్కువ ఇతర నియమకాలతో పాటు 2,000 కంటే తక్కువ ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 6,000 ఫ్రెషర్లను నియమించికొనున్నట్లు విప్రో తెలిపింది. వచ్చే ఏడాది ఎఫ్ వై23లో 20,000కి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తుంది. అయితే, విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే పెద్ద సంస్థల నుంచి కాంట్రాక్టులు రావడంతో అధిక ఒత్తిడిని నివారించడానికి విప్రో భారీ మొత్తంలో నియామక చేపట్టనున్నట్లు తెలిపారు. -
టీసీఎస్‌లో భారీగా ఫ్రెషర్ల నియామకాలు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టనుంది. సుమారు 40 వేల మంది పైచిలుకు ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది. కంపెనీ గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ విభాగం చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం ఈ విషయాలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపరమైన ఆంక్షల కారణంగా హైరింగ్‌లో ఎలాంటి సమస్యలూ ఉండవని, గతేడాది 3.60 లక్షల మంది ఫ్రెషర్లు వర్చువల్‌గా ఎంట్రన్స్ టెస్టులో పాల్గొన్నారని ఆయన వివరించారు. ‘దేశీయంగా క్యాంపస్‌ల నుంచి గతేడాది 40,000 మందిని రిక్రూట్ చేసుకున్నాం. ఈసారి కూడా అదే స్థాయిలో లేదా అంతకు మించి నియామకాలు చేపడతాం‘ అని మిలింద్ వివరించారు. క్యాంపస్ రిక్రూట్మెంట్తో పాటు ఇతరత్రా నియామకాలు కూడా భారీగానే ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది అప్పటికప్పుడు చేపట్టేది కాదని, దీని వెనుక చాన్నాళ్ల ప్రణాళిక ఉంటుందన్నారు. ప్రస్తుతం అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) అత్యంత కనిష్టంగా 8 శాతంగా ఉన్నప్పటికీ.. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇది మళ్లీ సాధారణ స్థాయి అయిన 11–12 శాతానికి పెరిగే అవకాశం ఉందని మిలింద్ చెప్పారు. అయితే, అట్రిషన్ పెరిగినా కూడా విధులు, మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడని విధంగా సంస్థ నిర్వహణ విధానం ఉంటుందన్నారు. టీసీఎస్‌లో ప్రస్తుతం 5 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను టీసీఎస్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిరుద్యోగులకు ఐటీ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్..!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని క్యాంపస్‌ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. గత ఏడాది 40,000 మందిని నియమించుకున్న కంపెనీ తాజాగా మరింత మందిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రపంచ మానవ వనరుల చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం వెల్లడించారు. భారత్‌లో నైపుణ్యాలకు కొదవలేదని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నైపుణ్యాలతో కూడిన మానవ వనరులు భారత్‌లో ఉన్నట్లు టీసీఎస్ సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షలు వల్ల ఈ నియామకాల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగదు అని ఆయన అన్నారు. గత ఏడాది మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు ప్రవేశ పరీక్షకు హాజరు అయినట్లు పేర్కొన్నారు. అదే విధంగా, గత ఏడాది అమెరికన్ క్యాంపస్‌ల నుంచి 2,000 మంది ఫ్రెషర్స్ నియమించికున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో ప్రతిభకు కొరత లేదని, భారత్‌లో టెకీల వేతనాలు హేతుబద్ధంగా ఉన్నాయని, అందుకే దేశీ ట్యాలెంట్‌పై గ్లోబల్ కంపెనీలు దృష్టిసారించాయని ఎన్జీ సుబ్రమణ్యం తెలిపారు. భారతీయల ప్రతిభ "అసాధారణమైనది" అని ఆయన అన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 20,409 నిమయించుకున్నట్లు తెలిపింది. దీంతో దేశంలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగుల కలిగిన అతిపెద్ద ఐటీ కంపెనీగా టీసీఎస్ అవతరించింది. -
కాగ్నిజెంట్ తీపికబురు : భారీ ఉద్యోగావకాశాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఐటీ కన్సల్టింగ్ రంగంలో ఉన్న యూఎస్ సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది భారత్‌లో 23,000 పైచిలుకు ఫ్రెషర్లను నియమించుకోనుంది. 2020 ఏడాదితో పోలిస్తే ఇది 35 శాతం పైగా ఎక్కువ అని సంస్థ సీఎండీ రాజేశ్ నంబియార్ తెలిపారు. 2020 సంవత్సరంలో కంపెనీ 17,000 మందికి పైగా కొత్తగ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్టు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు అత్యంత ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులతోపాటు ఇతర నిపుణుల నియామకాలను దేశంలో పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని నంబియార్ చెప్పారు. గతేడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 17 వేల ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను సంస్థలో చేర్చుకున్నట్టు వెల్లడించారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో భారత్ ఒకటిగా ఉంటుందని అన్నారు. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చిలో పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయని వివరించారు. 18 నెలల్లో 1.3 లక్షల మంది ఉద్యోగులకు డిజిటల్ నైపుణ్యాలను కల్పించామన్నారు. కాగ్నిజెంట్‌లో గతేడాది 5,000 మంది ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. 2020లో 10,000 మందికి అవకాశం కల్పిస్తారు. కాగ్నిజెంట్‌కు ఇప్పటికే భారత్‌లో సంస్థకు 2.04 లక్షల ఉద్యోగులు ఉన్నారు. -
గుడ్ న్యూస్.. ఫ్రెషర్స్ కోసం 3.5 లక్షల ఉద్యోగాలు
ముంబై: కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన నియామక ప్రక్రియలో కదలిక మొదలైంది. ప్రస్తుతం వివిధ జాబ్ పోర్టల్స్‌లో 3.5 లక్షల ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రెషర్ జాబ్స్‌లో జూన్ నుంచి వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ఈ ధోరణి ఈ ఆర్ధిక సంవత్సరం చివరి వరకు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడ్టెక్, ఈ–లెరి్నంగ్, హెల్త్‌కేర్, హెచ్ఆర్, ఫిన్‌టెక్ విభాగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయని టీమ్‌లీజ్, ఫ్రెషర్వరల్డ్.కామ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ కౌషిక్ బెనర్జీ తెలిపారు. ఐటీఈఎస్, తయారీ రంగం, బీఎఫ్ఎస్ఐ, టెలికం, సెమికండక్టర్ల పరిశ్రమలోనూ వృద్ధి నమోదవుతుందన్నారు. అడ్మిని్రస్టేషన్లో 14 శాతం, సాఫ్ట్‌వేర్‌లో 10 శాతం, కస్టమర్ సరీ్వసింగ్లో 8 శాతం, మార్కెటింగ్‌లో 5 శాతం, సేల్స్‌లో 4 శాతం ఫ్రెషర్స్ జాబ్స్ పెరిగాయని ఇన్‌డీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ తెలిపారు. (చదవండి: 14 వేల మందిని నియమించుకుంటాం...) క్యాంపస్ జాబ్స్ వేతనాల్లో 10 శాతం క్షీణత.. లాక్డౌన్ ఎత్తేసిన నాటి నుంచి నియామకాల్లోనూ కదలిక మొదలైంది. మే– సెపె్టంబర్ మధ్య ఆఫర్ లెటర్స్ హోల్డింగ్‌లో ఉన్న 65 శాతం మంది నియామకం పూర్తయింది. వచ్చే ఏడాది జనవరి–మార్చి కాలంలో ప్రీ–కోవిడ్ స్థాయికి నియామకాలు చేరుకుంటాయని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆదిత్య మిశ్రా తెలిపారు. ఆఫ్క్యాంపస్ నియామకాలను పరిశీలిస్తే.. గత ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది 75 శాతం పూర్తయ్యాయన్నారు. అయితే ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉద్యోగుల వేతనాలు 10 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కంపెనీలు ఉద్యోగుల శిక్షణ కోసం సెల్ఫ్ లెరి్నంగ్, వీడియో ఆధారిత శిక్షణ, బోధన వంటి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయని చెప్పారు. -
9 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారినుంచి కోలుకుని లాభాల బాట పడుతున్న ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఊరటనిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హెచ్‌సీఎల్ టెక్ నిలిచింది. దశలవారీగా వివిధ స్థాయిల్లో ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సీ విజయ్ కుమార్ తెలిపారు. అలాగే 9 వేల మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వెల్లడించింది. ఆదాయాలు, నికర లాభాలు రెండింటిలో పెరుగుదల కారణంగా మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులకు జీతం పెంపును ప్రకటించింది. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన హెచ్‌సీఎల్ ఈ రానున్న ఆరు నెలల కాలంలో 9వేల మందిని తీసుకుంటామని తెలిపింది. అలాగే తమ వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. ఆట్రిషన్ (ఉద్యోగుల వలస) 12.2 శాతంగా నమోదయింది. గత ఏడాది భారత్‌లోని సిబ్బందికి 6 శాతం వేతనాలు, విదేశాల్లోని సిబ్బందికి 2.5 శాతం వేతనాలు పెంచింది. మరోవైపు గత నెలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఐటీసీని దాటి 10వ స్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. కాగా హెచ్‌సీఎల్ లో 1,53,085 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’ పరీక్ష..
న్యూఢిల్లీ: యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఎంత మక్కువో మనందరికి తెలిసిందే. అయితే టాప్ కాలేజీలలో మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటారు. కొన్న కాలేజీలలో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉండవు. అలా ప్రతిభ గల విద్యార్థుల కోసం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగాలకు అర్హత కల్పించే నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్, (ఎన్‌క్యూటీ)ను 2018 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. తాజాగా 2020 సంవత్సరం ఎన్‌క్యూటీ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు కంపెనీలు ఆశించే కాగ్నిటివ్ ఎబిలిటీస్‌ను ఎన్‌క్యూటీ ఎగ్జామ్‌లో పరీక్షించనున్నారు. అయితే అభర్థి ప్రతిభను గుర్తించే విధంగా తమ పరీక్ష ఉంటుందని, పరీక్షలో మెరుగైన స్కోర్ సాధిస్తే టాప్ కంపెనీలో ఉద్యోగం గ్యారెంటీ అని టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి తెలిపారు. మరోవైపు టాప్ కంపెనీలు అభ్యర్థుల నియామకాలకు తమ పరీక్ష స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు వెంగుస్వామి పేర్కొన్నారు. బీటెక్, బీఎస్సీ, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు లేక ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి, ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారు ఎన్‌క్యూటీ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ నియామకాల కోసం రెండు సంవత్సరాల వరకు ఎన్‌క్యూటీ పరీక్ష స్కోర్‌ను కంపెనీలు అనుమతిస్తాయి. (చదవండి: టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు) -
హెచ్‌సీఎల్ టెక్‌లో 15 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15వేల మంది ఫ్రెషర్ల నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్ టెక్ కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, బలమైన డిమాండ్, వృద్ధి అంచనాల నేపథ్యంలో ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాల కల్పనకు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో హెచ్‌సీఎల్ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దృష్టి పెట్టింది. గత ఏడాది 9వేలమందిని ఎంపిక చేసుకున్న సంస్థ ఈ ఏడాది అదనంగా మరో 6 వేల మందిని చేర్చుకోనుంది. ఇతర టెక్ కంపెనీల మాదిరిగానే, హెచ్‌సీఎల్ కూడా తన నియామకాలను వర్చువల్‌గా చేపట్టనుంది. అయితే కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా క్యాంపస్‌లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉందని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సుమారు 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్టు తెలిపింది. వృద్ధి, ఖాళీలను పూరించే పక్రియలో భాగంగా ఈ నియామకాలు ఉండనున్నాయి. అయితే ఈ ఏడాది కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని హెచ్ఆర్ హెడ్ వీవీ అప్పారావు తెలిపారు కాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జూన్ 2020 త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 31.7 శాతం పెరిగి 2,925 కోట్ల రూపాయలను నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 8.6 శాతం పెరిగి 17,841 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 16,425 కోట్లు. ఈ త్రైమాసికంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆదాయం ప్రభావితమైనప్పటికీ బలమైన డిమాండ్ పరిస్థితులున్నట్టు ఫలితాల సందర్భంగా కంపెనీ సీఈఓ సీ విజయకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) శుభవార్త అందించింది. పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఏకంగా 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని ప్రకటించింది. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభ మధ్య జూన్ క్వార్టర్లో కంపెనీ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇండియాలో 40 వేలమంది లేదా 35-45 వేల మధ్య అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీసీఎస్ గ్లోబల్ హెచ్ఆర్డీ హెడ్ మిలింద్ లక్కాడ్ వెల్లడించారు. వీరిలో 87శాతం మంది తమ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలలోయాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు. వారానికి 8 నుంచి 11 వేల మందిని ఆన్లైన్ ద్వారా ఎంపిక చేయనున్నట్టు వివరించారు. ఫ్రెషర్లతోపాటు అనుభవం కలిగిన ప్రొఫెషనల్స్‌ను కీలక ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని లక్కాడ్ తెలిపారు. అయితే దేశీయంగా గత ఏడాది మాదిరిగానే 40వేల మందిని ఎంపిక చేయనున్న టీసీఎస్ అమెరికాలో నియామకాలను మాత్రం దాదాపు రెట్టింపు చేయనుంది. హెచ్1బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. అలాగే అమెరికాలో టాప్ 1 బిజినెస్ స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనుంది. కాగా టీసీఎస్ 2014 నుంచి 20 వేల మందికి పైగా అమెరికన్లను టీసీఎస్ నియమించుకుంది. -
టెకీలకు క్యాప్ జెమిని శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని కరోనా సంక్షోభ కాలంలో టెకీలకు శుభవార్త అందించింది. ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగ నియామకాలను కొనగిస్తామని చెప్పింది. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా, క్యాంపస్ ఆఫర్ల ద్వారా సుమారు 8వేల మందిని రిక్రూట్ చేసుకుంటామని బుధవారం తెలిపింది. వివిధ క్యాంపస్‌లతో 8000 కంటే ఎక్కువ ఎల్ఓఐలు ఉన్నాయని, ఇంజనీరింగ్ పరీక్షలపై కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున, పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రెషర్ల నియామకాలు ప్రారంభమవుతాయని చెప్పింది. తమ ప్లాన్లు, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా నియామకాలను కొనసాగిస్తామని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డి చెప్పారు. డిజిటల్, క్లౌడ్, డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారించి ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని సీఈవో తెలిపారు. క్యూ 1 లో 6000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నామనీ వారిలో సుమారు 4వేల మంది నిపుణులు, 2వేల మంది ఫ్రెషర్లున్నారని చెప్పారు. అలాగే క్యూ 2 లో 4వేల మందిని నియమించుకున్నామన్నారు. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా పరీక్షలు ఆలస్యం అయినా ఈ సంవత్సరం కళాశాల గ్రాడ్యుయేట్లకు ఇచ్చే అన్ని క్యాంపస్ ఆఫర్లను గౌరవిస్తామని ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని చెప్పారు. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) సంస్థలో ప్రస్తుతం10-15ఏళ్ల అనుభవం ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు మేనేజర్లు, అర్టిటెక్ట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు వివరించారు. కంపెనీ ఫ్రాన్స్‌కు చెందినది అయినా తమ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులు భారతీయులేనని ఆయన వెల్లడించారు. కాగా ఫ్రెంచ్ ఐటి మేజర్ క్యాప్ జెమినికీ ప్రపంచంలో 270,000 మంది ఉద్యోగులుండగా, వీరిలో సగం 125,000 మంది ఇండియన్లున్నారు. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) చదవండి : పెట్రోలు పంపులు నిండిపోయాయి: నిల్వ ఎలా? -
ఫ్రెషర్స్‌కు టీసీఎస్ గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ ఉద్యోగార్ధులుకు గుడ్ న్యూస్. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐటీ ఫ్రెషర్స్‌కు ఈ శుభవార్త అందించింది. లేటెస్ట్ నైపుణ్యాలున్న ఫ్రెష్ ఇంజనీర్లకు చెల్లించే ప్యాకేజీని రెట్టింపు చేసింది. డిజిటల్ రంగంలో నైపుణ్యాలు కలిగిన టెకీలకు ఇకపై టీసీఎస్ వార్షిక ప్రాతిపదిక 6.5 లక్షల రూపాయల జీతాన్ని చెల్లించనుంది. ఐటీ పరిశ్రమలో భారతీయ ఇంజనీర్ల ఎంట్రీ స్థాయి జీతం సంవత్సరానికి సుమారు 3.5 లక్షల రూపాయలు మాత్రమే. టీసీఎస్‌లో ఉద్యోగం పొందాలనుకునే ఇంజనీర్లు ఆన్లైన్ పరీక్షను పాస్ కావాల్సి ఉంటుంది. సంస్థలో నియామక ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసిన టీసీఎస్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా నేషనల్ క్వాలిఫైయర్ టెస్టును ప్రారంభించింది. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సంపాదించిన అనంతరం వీడియో లేదా ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మరోవైపు టీసీఎస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఐఆన్(iON )పరీక్ష కోసం నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 24 రాష్ట్రాల్లోని వంద నగరాలనుంచి 2లక్షల 80వేలమంది దరఖాస్తు చేసుకున్నారట. మెషీన్‌లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ప్లాట్‌ఫాంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన తాము ఇప్పటికే వెయ్యిమందిని ఎంపకి చేశామని వెల్లడించిన సంస్థ ప్రతినిధి అజయ్ ముఖర్జీ ప్రకటించారు. అయితే ఇంకా ఎంతమందిని నియమించుకోనున్నారనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉండవచ్చని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్‌ను వెనక్కి నెట్టిన టీసీఎస్ ఈ రేసులో టాప్ కంపెనీగా నిలిచింది. 8 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను దాటేసింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ కంపెనీగా టీసీఎస్ అవతరించింది. ఆగస్టు 23న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును అధిగమించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
భారీగా ఉద్యోగ ఆఫర్లు: టీసీఎస్
బెంగళూరు : ఐటీ ఇండస్ట్రీలో ఓ వైపు నియామకాలు తగ్గిపోతూ ఉండగా... టెక్ దిగ్గజం టీసీఎస్ మాత్రం భారీగా ప్రెష్ గ్రాడ్యుయేట్లను తన కంపెనీలో చేర్చుకుంటోంది. ప్రెష్ గ్రాడ్యుయేట్లకు ఈ ఏడాది 20 వేల ఉద్యోగ ఆఫర్లు ఇచ్చామని, నాన్-ప్రెషర్లకు మరో 4000 జాబ్ ఆఫర్లు అందించామని టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఈ ఆఫర్లు అందుకున్న వారిలో 70 శాతం మంది కంపెనీలో చేరతారని అంచనావేస్తున్నామన్నారు. ఇంతకుముందు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిందన్నారు. జనవరి-ఫిబ్రవరి కాలంలో ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించినట్టు టీసీఎస్ గ్లోబల్ హ్యుమన్ రిసోర్సస్ అధినేత, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజోయేంద్ర ముఖర్జీ చెప్పారు. గతేడాది కూడా ఇన్నే ఆఫర్ లెటర్లను ఫ్రెషర్లకు ఇచ్చామని తెలిపారు. అయితే 2015లో కంపెనీ 40వేల ఆఫర్ లెటర్లను అందించింది. ఆ తర్వాత ఏడాది ఈ సంఖ్య 35 వేలకు పడిపోయింది. ఆటోమేషన్ కారణంతో ప్రస్తుతం ఐటీ రంగంలో నియామకాలు పడిపోతున్నప్పటికీ, ఈ ఆటోమేషనే కొత్త ఉద్యోగవకాశాలను కల్పిస్తుందని ముఖర్జీ చెప్పారు. కంపెనీలో ఉన్న ప్రస్తుత ఉద్యోగులకు కూడా భారీ ఎత్తున్న రీస్కిలింగ్ డ్రైవ్ చేపట్టామని, దీంతో కంపెనీ అవసరాల బట్టి జాబ్ రోల్స్‌ను కూడా మార్చుకునే అవకాశముందన్నారు. టీసీఎస్ ఇప్పటికే 3,95,000 మంది ఉద్యోగుల్లో 2,10,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చింది. ఈ రీస్కిలింగ్ డ్రైవ్, కంపెనీ మార్జిన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ముఖర్జీ చెప్పారు. గత కొన్నేళ్లుగా రీస్కిలింగ్ ప్రొగ్రామ్స్ చేపట్టడానికి తమ దగ్గర అవసరమైనంత పెట్టుబడులు ఉన్నాయని, బయట నుంచి తీసుకోవడం కంటే రీస్కిలింగ్ చేపట్టడమే మంచిదని తెలిపారు. డాలర్-రూపాయి మారకం విలువలో నెలకొన్న అనిశ్చితితోనే తమ ఆపరేటింగ్ మార్జిన్లు పడిపోయినట్టు ముఖర్జీ చెప్పారు. -
ఐటీ సంస్థల చలో క్యాంపస్!
బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల్లో మళ్లీ ఫ్రెషర్స్ నియామకాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య స్థాయి కంపెనీలైన మైండ్‌ట్రీ, జెన్సర్, హెక్సావేర్ తదితర సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఒక్కో సంస్థ సుమారు వెయ్యి మంది దాకా ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నాయి. మైండ్‌ట్రీ గత ఆర్థిక సంవత్సరంలో 1,285 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. ఈ సారి సంఖ్య అంతకు మించి ఉండగలదని మైండ్‌ట్రీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. గతేడాది 1,000 మంది దాకా ఫ్రెషర్స్‌ను తీసుకున్న జెన్సర్.. ఈ ఏడాది అదే స్థాయిలో లేదా అంతకు మించి రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. తామూ క్యాంపస్ నియామకాలను పెంచుకుంటున్నట్లు, ఇప్పటికే 500 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు హెక్సావేర్ వర్గాలు తెలిపాయి. పెద్ద కంపెనీలు మాత్రం అంతగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ వైపు చూడటం లేదు. అవసరానికి తగ్గట్లుగా వివిధ విభాగాల్లో అల్లుకుపోగలిగే చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలే ఫ్రెషర్స్‌పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. దీంతో గతంలో అంత కాకపోయినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మళ్లీ ఫ్రెషర్స్ నియామకాలు ఉంటున్నాయని మైండ్‌ట్రీ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ ఖన్నా తెలిపారు. 2014–15 స్థాయితో పోలిస్తే 60–70% హైరింగ్ ఉంటోందని చెప్పారు. డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి ... మధ్య స్థాయి ఐటీ కంపెనీల ఆదాయాల్లో సగటున 40 శాతం వాటా డిజిటల్ వ్యాపారం నుంచే ఉంటోంది. దీంతో అవిæప్రధానంగా డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర డిజిటల్ కోర్సుల్లో సర్టిఫికేషన్ ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇది గుర్తించిన కాలే జీలు.. డిజిటల్ నైపుణ్యాలపై పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నివేదిక ప్రకారం మధ్య స్థాయి ఐటీ సంస్థల్లో 33–35 శాతం సిబ్బంది డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందిన వారు ఉంటున్నారు. అదే చిన్న స్థాయి కంపెనీల్లోనైతే ఇది 38 శాతంగా ఉంటోంది. మరోవైపు, ఐటీ కంపెనీలు సిబ్బంది వినియోగ స్థాయిని కూడా క్రమంగా పెంచుకుంటున్నాయి. దీంతో బెంచ్ సిబ్బంది సంఖ్య 18 శాతానికి తగ్గింది. వనరుల వినియోగం అయిదు శాతం మేర పెరిగింది. దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ విలువ 167 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7–9 % వృద్ధి చెందగలదని అంచనా. ఇది 10–12% ఉంటుందని 2016–17లో నాస్కామ్ అంచనా వేసినప్పటికీ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో వాటిని సవరించక తప్పలేదు. ఐటీ రంగంలో సుమారు 4,00,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. కొన్నాళ్లుగా ఉద్యోగాల కల్పన వృద్ధి మాత్రం మందగించింది. గతేడాది ఐటీ లో నికరంగా లక్ష మంది సిబ్బంది తోడైనట్లు అంచనా. -
ఫ్రెషర్సా... ఎక్స్పీరియన్స్ ఎంత?
సాక్షి, హైదరాబాద్ : ఐటీ.. బీపీవో(బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్).. కేపీవో(నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్) రంగాలకు గత కొన్నేళ్లుగా కొంగుబంగారంగా మారింది హైదరాబాద్ మహానగరం. అయితే ఇప్పుడు హైటెక్ సిటీలో పరిస్థితి మారిందట. ఏడాదిగా ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఐటీ కొలువుల్లో ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడయ్యింది. ఇక ఐటీ కొలువుల్లో వృద్ధి పరంగా చూసినా గ్రేటర్ హైదరాబాద్ ఐదో స్థానానికే పరిమితమైంది. ఐటీ కొలువుల్లో వృద్ధి పరంగా ఫ్రెషర్స్‌కు 40 శాతం కొలువుల బూమ్‌తో కోల్‌కతా నంబర్‌వన్ స్థానంలో నిలిచినట్లు ప్రముఖ వెబ్సైట్ నౌక్రీ.కామ్ తాజా సర్వేలో వెల్లడయ్యింది. రెండో స్థానంలో నిలిచిన చెన్నైలో 15 శాతం.. మూడో స్థానం దక్కించుకున్న ఢిల్లీలో ఏడు శాతం.. నాలుగో స్థానంలో ఉన్న బెంగళూరులో ఐదు శాతం.. ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 4 శాతం ఐటీ కొలువుల్లో వృద్ధి నమోదైనట్టు ఈ సర్వే పేర్కొంది. 2016 నుంచి 2017 డిసెంబర్ వరకూ వివిధ మెట్రో నగరాల్లో ఫ్రెషర్స్‌కు ఐటీ కొలువుల పెరుగుదలపై ఈ సర్వే చేసింది. కొలువుల్లో మందగమనం బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు 1,200 సాఫ్ట్వేర్ కంపెనీల బ్రాంచీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలా పాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతు న్నారు. ఆయా కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఏటా ఆశించిన మేరకు అమలు కాకపోవడం.. కొత్త ప్రాజెక్టులు చేజిక్కకపోవడం.. అంతర్జాతీ యంగా మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపో వడం తదితర కారణాలతో కొలువుల్లో మంద గమనం నమోదైనట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏటా ఈ రంగంలో స్థూలంగా 2 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడించా రు. ఐటీ రంగంతో పోలిస్తే గ్రేటర్ పరిధిలో ఏడాదిగా ఆటోమొబైల్ రంగంలో 31 శాతం, బీమా(ఇన్సూరెన్స్)రంగంలో 21 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్లు నౌక్రీ.కామ్ సర్వేలో తేలింది. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో నిర్మించ తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నాలు గేళ్లుగా సాకారం కాకపోవడం ఈ రంగం వృద్ధికి ప్రతిబంధకంగా మారిందని ఐటీ నిపు ణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం నూత నంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, టీఎస్ఐపాస్తో ఐటీ రంగంతోపాటు పారిశ్రా మిక రంగాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నా యని, త్వరలో ఆయా రంగాల్లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. అనుభవానికే పెద్దపీట.. మహానగరం పరిధిలో సుమారు వందకుపైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో పట్టభద్రులైన ఇంజ నీర్ల (ఫ్రెషర్స్) కంటే మూడేళ్లపాటు ఐటీ రంగంలో అనుభవం గడించిన నిపుణులైన వారికే కొలువుల ఆఫర్స్ వెల్లువెత్తు తున్నాయని ఈ సర్వేలో తేలింది. వీరికి వేతనాలు కూడా ఆశించిన మేర దక్కుతున్నట్లు వెల్లడైంది. నగరానికి తరలివస్తున్న ప్రముఖ కంపెనీలు గ్రేటర్ పరిధిలో గతేడాది 45 బహుళ జాతి, సాఫ్ట్వేర్ కంపెనీలు కొలువయ్యాయి. లక్ష మందికి ఉపాధి లభించింది. నూతన ఐటీ, హార్డ్‌వేర్, యానిమేషన్ పాలసీ, టీఎస్ఐపాస్ రాకతో ఆయా రంగాల ప్రముఖ కంపెనీలు నగరానికి తరలివస్తున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే ఐటీ ఎగుమతుల వృద్ధి నగరంలోనే అధికం. – జయేశ్ రంజన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి మందగమనం తాత్కాలికమే.. ఫ్రెషర్స్‌కు ఓపెనింగ్స్ విషయంలో మందగమనం తాత్కాలికమే. గ్రేటర్లో నూతన కంపెనీల కార్యకలా పాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. సమీప భవిష్య త్లో ఆయా కంపెనీల్లో ఫ్రెషర్స్‌కు బోలెడన్ని అవకాశాలు దక్కుతాయి. ఫ్రెషర్స్‌కు సాఫ్ట్ స్కిల్క్స్లో శిక్షణ ఇచ్చే విషయంలో ఇంజనీరింగ్ కళాశాలలు అవసరమైన చర్యలు తీసుకుంటే ఐటీ రంగం పురోగమిస్తుంది. – రమేశ్ లోకనాథన్, హైసియా మాజీ అధ్యక్షుడు కొన్నేళ్లుగా గ్రేటర్ ఐటీ ఎగుమతుల్లో పెరుగుదల (రూ.కోట్లలో).. సంవత్సరం ఎగుమతులు 2013–14 57,258 2014–15 65,235 2015–16 75,070 2016–17 85,470 2017–18(అంచనా) 95,500 2020కి (అంచనా) 1,20,000 -
ఫ్రెషర్స్ వేతన ప్యాకేజీపై సర్వే ఏం చెప్పిందంటే.....
కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారి(ఫ్రెషర్స్) వేతన ప్యాకేజీ గతేడాది కంటే 2016లో భారీగా పెరిగిందట. వార్షిక వేతనం కింద ఆరు లక్షల కంటే ఎక్కువ వేతన ప్యాకేజీనే చాలా ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని, ఈ వృద్ధి 85 శాతం ఉందని తాజా సర్వేలు తేల్చాయి. ఉద్యోగ అంచనా సంస్థ యాస్పైరింగ్ మైండ్స్, ఫ్రెషర్ జాబ్స్ పోర్టల్ మ్యామ్క్యాట్.కామ్ ద్వారా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఉద్యోగులకు(0 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉన్న) ఆఫర్ చేసే వేతనాలు వార్షికంగా రూ.1-30 లక్షల మధ్యలో ఉంటాయని, వాటిలో చాలా వేతనాలు వార్షికంగా రూ.2-3 లక్షల రేంజ్‌లోనే ఉంటాయని సర్వే పేర్కొంది. అయితే వేతన ప్యాకేజీ రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఆఫర్ చేసే ఉద్యోగాలు 2015 నుంచి 85 శాతం పెరిగాయని తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6వేల ఉద్యోగాల్లో పోస్ట్ అయిన 40 లక్షల జాబ్ అప్లికేషన్లపై ఈ సర్వే నిర్వహించారు. ఎక్కువగా డిమాండ్ ఉన్న జాబ్ రోల్ సాప్ట్వేర్ అప్లికేషన్స్ అని, దీనికి సుమారు 38 శాతం జాబ్ అప్లికేషన్లు నమోదైనట్టు ఈ సర్వే పేర్కొంది. ఫ్రెషర్స్‌లో రెండో టాప్ జాబ్ మార్కెటింగ్, సేల్స్ అని వెల్లడైంది. మార్కెటింగ్‌లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువగా పాపులర్ జాబ్‌గా ఉందని తెలిసింది. డేటా అనాలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్లకు యేటికేటికి 30 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందట. టెక్నికల్ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ డెవలపర్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో డిజిటల్ మార్కెటింగ్‌లు అత్యంత ప్రాముఖ్యమైన జాబ్ కేటగిరీల్లో అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయని యాస్పైరింగ్ మైండ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హిమాన్షు అగర్వాల్ చెప్పారు. -
95శాతం కొత్త విద్యార్థులు వర్జిన్ అట!
ముంబై : ఏదైనా క్యాంపస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థుల గురించి అందరూ ఏమి తెలుసుకుంటారు. ఎంతమంది విద్యార్థులు ఈ బ్యాచ్ కు ఎంపికయ్యారు. వాళ్లలో ఎంతమంది అమ్మాయిలు..ఎంతమంది అబ్బాయిలు. వారి అలవాట్లు, అభిరుచులు ఏమిటో.. మామూలుగా తెలుసుకుంటుంటారు. కానీ ఐఐటీ బొంబాయి క్యాంపస్ లో కొత్త విద్యార్థులపైన సర్వే చేపట్టారట. ఆ సర్వేలో ఎంతమంది వర్జిన్, ఎంతమంది కాదో కూడా తెలుసుకున్నారట. 95 శాతం మంది విద్యార్థులు ఎలాంటి సెక్సువల్ సంబంధంలో లేరని, 5 శాతం మంది మాత్రం అలాంటి సంబంధాలు కలిగి ఉన్నారని సర్వేలో తేలింది. కొత్తగా క్యాంపస్ లోకి అడుగుపెట్టిన విద్యార్థుల గురించి హర్వర్డ్ క్రిమ్ సన్ చేపట్టిన సర్వే ద్వారా స్పూర్తి పొంది, కొత్తగా క్యాంపస్ లోకి అడుగుపెట్టిన విద్యార్థుల బ్యాచ్ లో వైవిధ్యాన్ని అభినందించడానికి ఈ సర్వేను ఐఐటీ-బొంబాయ్స్ న్యూస్ పేపర్ చేపట్టింది. కొత్త విద్యార్థుల అభిరుచులు, అలవాట్లపై ఐఐటీ-బొంబాయి క్యాంపస్ మొదటిసారి ఈ సర్వే నిర్వహించింది. ఐఐటీ క్యాంపస్ లో చేరకముందు విద్యార్థులకు రాజకీయాలపై ఉన్న అభిప్రాయమేమిటి, మత విశ్వాసాలు కలిగి ఉన్నారా, పోస్ట్ గ్రాడ్ ప్రణాళికలు ఏమిటి వంటి వివిధ అంశాలపై ఈ సర్వే నిర్వహించింది. 75 శాతం మంది హోమో సెక్సువల్ వివాహాలకు, హోమో సెక్సువాలిటీకి సౌకర్యవంతంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. రాజకీయ అభిప్రాయాల పరంగా చాలా మంది విద్యార్తులు మధ్యస్తంగా ఉదారంగా ఉన్నారని ఈ సర్వే పేర్కొంది. ఇన్ స్టిట్యూట్ డెమోగ్రాఫిక్ ను మంచిగా అర్థంచేసుకోవడమే ఈ సర్వే లక్ష్యమని, ఇన్ స్టిట్యూట్ పరంగా ఎలా వృద్ది చెందుతున్నాం, ఎలాంటి విద్యార్థులను తాము సమాజానికి అందిస్తున్నామో తెలుసుకోవడం కోసమే ఈ సర్వే చేపట్టామని ఐఐటీ-బొంబాయ్స్ ఇన్సైట్ చీఫ్ ఎడిటర్ శ్రేయేస్ మీనన్ తెలిపారు. 60శాతం మంది అసలు మత విశ్వాసాలు నమ్మరని, 30 శాతం మంది కొంత నమ్మకం కలిగి ఉన్నారని సర్వేలో తేలినట్టు ఆయన చెప్పారు. మొదటి సెమిస్టర్ సగం గడిచాక, సర్వేలో పాల్గొన్న ప్రతిఒక్కరూ రోజుకు 1.6 గంటలు ఫేస్ బుక్ పై గడుపుతున్నామని చెప్పినట్టు తెలిపారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లపై దాదాపు 1.5 గంటలు ఉంటున్నారని తేలినట్టు చెప్పారు. రోజుకు సగటున 1.4 గంటలు విద్యార్థులు చదువుకు కేటాయిస్తున్నట్టు సర్వే పేర్కొంది. సెప్టెంబర్ నుంచి దీర్ఘకాలం పాటు చేపట్టిన ఈ సర్వే ఫలితాలను ఇన్సైట్ మంగళవారం విడుదల చేసింది. -
ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు ఏమైంది?
బెంగళూరు: ప్రతి ఏడాది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కుప్పలు తెప్పలుగా విద్యార్థులు బయటికి వస్తున్నారు. ఐటిరంగంలో మురిపిస్తున్న జీతాలు, సౌకర్యాల నేపథ్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అయితే ఆశించినట్టుగా వీరికి మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయా అంటే...లేదనే చెప్పాలి. హ్యూమన్ రిసోర్స్ అధికారుల వెల్లడించిన డేటా ఇదే స్పష్టం చేస్తోంది. ఇన్ఫోసిస్ , టీసీఎస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల పరిస్థతిపై పెదవి విరిస్తోందీ డాటా. ఇంజనీరింగ్ చదివిన వారికి సరిగ్గా ఉద్యోగాలు దొరకపోగా, కొత్తగా ఐటీ స్పేస్ లోకి ఎంపికయ్యే ఉద్యోగులకూ అసలు జీతాలు పెరగడం లేదట. రూ.16,000 కోట్ల (160బిలియన్ డాలర్ల) పరిశ్రమ కలిగిన ఐటీ ఇండస్ట్రీ, ఈ రెండు అంశాల్లో తీవ్ర నిరాశ పరుస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. టాప్ కంపెనీలుగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు చాలా ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి వేతనాలు పెంచడంలో అంత శ్రద్ధ తీసుకోవడం లేదని, అసలు వేతనాలను సవరించడం లేదని హ్యుమన్ రిసోర్స్ అధికారుల డేటా చెబుతోంది.గత మార్జిన్లను కాపాడుకోవడానికీ, పెరుగుతున్న ధరలను, కరెన్సీ మార్పులను సరిచూసుకోవడంపైనే ఈ కంపెనీలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయని పేర్కొంటోంది. గతేడాది వరకూ కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి మార్జినల్ వేతనాలను పెంచిన అమెరికా కంపెనీలు కాగ్నిజెంట్, టీసీఎస్ లు, ఈ ఏడాది కొత్త ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి సవరణ చేయకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతేడాది కాగ్రిజెంట్ కంపెనీ రూ.3.05 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు ప్రెషర్లకు జీతాలు పెంచింది. టీసీఎస్ కూడా రూ.3.18లక్షల నుంచి రూ.3.30 లక్షలు పెంచింది.జీతాలు పెంచకుండా అలానే అంటిపెట్టి ఉంచడం వల్ల సీనియర్ ఇంజనీర్లు, మిడ్ లెవల్ మేనేజర్లపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణులై వస్తుండడంతోనే, ఐటీ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంటున్నారు.కాలేజీల్లో గ్రాడ్యుయేట్లగా ఉత్తీర్ణత సాధించే ప్రతి ఐదుమంది ఇంజనీర్లకు ఒక్కటే జాబ్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది భారత్ నుంచి పది లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తుంటే, వారికి కేవలం రెండు నుంచి మూడు లక్షల జాబ్ లు మాత్రమే ఉన్నాయని నాస్కామ్ సర్వే వెల్లడించింది.పదేళ్ల క్రితం డిమాండ్, సప్లై సమానంగా ఉండేదని, ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తే, అన్ని ఉద్యోగాలు ఉండేవని సర్వే తెలిపింది. దీంతో ఉద్యోగాల కొరతే ఏర్పడలేదని పేర్కొంది.