95శాతం కొత్త విద్యార్థులు వర్జిన్ అట! | Unique IIT-B survey finds 95 percent freshers are virgin | Sakshi
Sakshi News home page

95శాతం కొత్త విద్యార్థులు వర్జిన్ అట!

Published Wed, May 4 2016 12:00 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

95శాతం కొత్త విద్యార్థులు వర్జిన్ అట!

95శాతం కొత్త విద్యార్థులు వర్జిన్ అట!

ముంబై : ఏదైనా క్యాంపస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థుల గురించి అందరూ ఏమి తెలుసుకుంటారు. ఎంతమంది విద్యార్థులు ఈ బ్యాచ్ కు ఎంపికయ్యారు. వాళ్లలో ఎంతమంది అమ్మాయిలు..ఎంతమంది అబ్బాయిలు. వారి అలవాట్లు, అభిరుచులు ఏమిటో.. మామూలుగా తెలుసుకుంటుంటారు. కానీ ఐఐటీ బొంబాయి క్యాంపస్ లో కొత్త విద్యార్థులపైన సర్వే చేపట్టారట. ఆ సర్వేలో  ఎంతమంది వర్జిన్, ఎంతమంది కాదో కూడా తెలుసుకున్నారట. 95 శాతం మంది విద్యార్థులు ఎలాంటి సెక్సువల్ సంబంధంలో లేరని,  5 శాతం మంది మాత్రం అలాంటి సంబంధాలు కలిగి ఉన్నారని సర్వేలో తేలింది.

కొత్తగా క్యాంపస్ లోకి అడుగుపెట్టిన విద్యార్థుల గురించి హర్వర్డ్ క్రిమ్ సన్ చేపట్టిన సర్వే ద్వారా స్పూర్తి పొంది, కొత్తగా క్యాంపస్ లోకి అడుగుపెట్టిన విద్యార్థుల బ్యాచ్ లో వైవిధ్యాన్ని అభినందించడానికి ఈ సర్వేను ఐఐటీ-బొంబాయ్స్ న్యూస్ పేపర్ చేపట్టింది. కొత్త విద్యార్థుల అభిరుచులు, అలవాట్లపై ఐఐటీ-బొంబాయి క్యాంపస్ మొదటిసారి ఈ సర్వే నిర్వహించింది.

ఐఐటీ క్యాంపస్ లో చేరకముందు విద్యార్థులకు రాజకీయాలపై ఉన్న అభిప్రాయమేమిటి, మత విశ్వాసాలు కలిగి ఉన్నారా, పోస్ట్ గ్రాడ్ ప్రణాళికలు ఏమిటి వంటి వివిధ అంశాలపై ఈ సర్వే నిర్వహించింది. 75 శాతం మంది హోమో సెక్సువల్ వివాహాలకు, హోమో సెక్సువాలిటీకి సౌకర్యవంతంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. రాజకీయ అభిప్రాయాల పరంగా చాలా మంది విద్యార్తులు మధ్యస్తంగా ఉదారంగా ఉన్నారని ఈ సర్వే పేర్కొంది.

ఇన్ స్టిట్యూట్ డెమోగ్రాఫిక్ ను మంచిగా అర్థంచేసుకోవడమే ఈ సర్వే లక్ష్యమని, ఇన్ స్టిట్యూట్ పరంగా ఎలా వృద్ది చెందుతున్నాం, ఎలాంటి విద్యార్థులను తాము సమాజానికి అందిస్తున్నామో తెలుసుకోవడం కోసమే ఈ సర్వే చేపట్టామని ఐఐటీ-బొంబాయ్స్ ఇన్సైట్ చీఫ్ ఎడిటర్ శ్రేయేస్ మీనన్ తెలిపారు. 60శాతం మంది అసలు మత విశ్వాసాలు నమ్మరని, 30 శాతం మంది కొంత నమ్మకం కలిగి ఉన్నారని సర్వేలో తేలినట్టు ఆయన చెప్పారు.

మొదటి సెమిస్టర్ సగం గడిచాక, సర్వేలో పాల్గొన్న ప్రతిఒక్కరూ రోజుకు 1.6 గంటలు ఫేస్ బుక్ పై గడుపుతున్నామని చెప్పినట్టు తెలిపారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లపై దాదాపు 1.5 గంటలు ఉంటున్నారని తేలినట్టు చెప్పారు. రోజుకు సగటున 1.4 గంటలు విద్యార్థులు చదువుకు కేటాయిస్తున్నట్టు సర్వే పేర్కొంది. సెప్టెంబర్ నుంచి దీర్ఘకాలం పాటు చేపట్టిన ఈ సర్వే ఫలితాలను ఇన్సైట్ మంగళవారం విడుదల చేసింది.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement