
74 శాతానికి చేరిన నియామక ఉద్దేశ్యం
టీప్‌డెక్ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం
టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ కెరీర్ అవుట్‌లుక్ వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫ్రెషర్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం కంపెనీల్లో 74 శాతానికి చేరినట్టు టీమ్‌లీజ్ ఎడ్యుటెక్‌కు చెందిన కెరీర్ అవుట్‌లుక్ సర్వే నివేదిక వెల్లడించింది. రాబోయే నెలలకు సంబంధించి వ్యాపార విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా ఐటీ రంగం కోలుకోవడం ఫ్రెషర్లకు మరిన్ని అవకాశాలను తెచి్చపెట్టనున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల కాలానికి నివేదికను విడుదల చేసింది.
డీప్‌టెక్ ఉద్యోగాలైన రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సర్టిఫైడ్ రోబోటిక్ ఇంజనీర్ కోర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, ఏఐ అప్లికేషన్లలో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లకు డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది. ఈ సర్వేలో 649 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కొన్ని రంగాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో నియామకాలకు సంబంధించి బలమైన ధోరణిని వ్యక్తం చేశాయి. ఈ–కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌ల్లో ఫ్రెషర్ల నియామక ధోరణి 61 శాతం నుంచి 70 శాతానికి పెరిగింది. తయారీలో 52 శాతం నుంచి 66 శాతానికి, ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాలో 59 శాతం నుంచి 69 శాతానికి పెరిగింది.
ఐటీ రంగంలో జోష్
‘‘ఐటీ రంగం చెప్పుకోతగ్గ మేర కోలుకుంది. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకాల ఉద్దేశ్యం 2024 ద్వితీయ 6 నెలల కాలంలో ఉన్న 45% నుంచి, 2025 మొదటి 6 నెలల కాలానికి 59 శాతానికి పెరిగింది. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగంలోనూ ఇది 47% నుంచి 52 శాతానికి పెరిగింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. విద్యుత్, ఇంధన రంగం, మార్కెటింగ్ అండ్ అడ్వరై్టజింగ్ సైతం బలమైన వృద్ధిని చూపించినట్టు తెలిపింది.
భౌగోళికంగా చూస్తే బెంగళూరు 78%, ముంబై 65%, ఢిల్లీ ఎన్‌సీఆర్ 61%, చెన్నై 57% చొప్పున తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొంది. క్లినికల్ బయోఇన్ఫర్మాటిక్స్ అసోసియేట్, రోబోటిక్స్ సిస్టమ్ ఇంజనీర్, సస్టెయి నబులిటీ అలనిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వర్ధ మాన కెరీర్ మార్గాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. సమకాలీన వ్యాపార అవకాశాల దృష్ట్యా కంపెనీలు ముఖ్యంగా రోబో టిక్ ప్రాసెస్ ఆటోమేషన్, పెర్‌ఫార్మెన్స్ మార్కెటింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ రిస్క్ అనలైసిస్ నైపుణ్యాలున్న వారి కోసం చూస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment