గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ 'టీసీఎస్' కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్‌మెంట్స్ ఉంటాయని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు.
వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ అన్నారు. అంతే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం. సుమారు ఏడాది తరువాత కంపెనీ నియమాలను గురించి వెల్లడించింది. కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు.
ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీలు పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు.. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.
ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకు
వారానికి ఐదు రోజులు
కరోనా తరువాత ఉద్యోగులందరూ ఆఫీసు నుంచే పనిచేయాలని, వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్ కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి.. కంపెనీ ప్రోత్సాహకాలతో ముడిపెట్టింది. కార్యాలయ సంస్కృతిని బలోపేతం చేయడానికి, సహకారాన్ని మెరుగుపరచడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment