
గత కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న టెక్ రంగంలో మళ్ళీ లేఆప్స్ అలజడి మొదలైంది. గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులపైన, డైరెక్టర్లపైన, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది.
గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఇప్పుడు 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు.. సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటిని గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?
గూగుల్ కంపెనీ 20 శాతం మరింత శక్తివంతంగా మారాలని సుందర్ పిచాయ్ 2022లోనే ఆకాక్షించారు. ఆ తరువాత ఏడాది 12,000 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించారు. కాగా ఇప్పుడు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంత మందిని తొలగిస్తారు అనే విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment