
గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్ సంస్థ టీమ్‌లీజ్ తన నివేదికలో వెల్లడించింది.
2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్‌లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.
అన్ఎర్త్‌ఇన్‌సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.
ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!
2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్‌లీజ్ సర్వేలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment