హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రెషర్ల నియామకానికి కంపెనీలు సై అంటున్నాయి. టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ కెరీర్ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం.. 2022 జూలై–డిసెంబర్‌లో ఫ్రెషర్లను చేర్చుకునేందుకు 59 శాతం కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ ఏడాది జనవరి–జూన్‌తో పోలిస్తే ఇది 12 శాతం అధికం కావడం విశేషం.
ఐటీలో 65 శాతం, ఈ-కామర్స్ 48, టెలికమ్యూనికేషన్స్‌లో 47 శాతం సంస్థలు ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఐటీలో లక్ష మంది ఫ్రెషర్ల నియామకాలు ఉండే అవకాశం ఉంది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్స్ నియామకాల చుట్టూ ఉన్న సెంటిమెంట్ భారతదేశంలో గణనీయంగా మెరుగుపడుతోంది. ఎక్కువ కంపెనీలు ఫ్రెషర్స్‌ను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా దేశంలోని యువత ఉపాధి సామర్థ్యం విలువతో కూడిన మార్పుకు గురైందనడానికి ఈ ధోరణి నిదర్శనం. ఒక ఏడాదిలోనే ఫ్రెషర్స్ హైరింగ్ సెంటిమెంట్ 42 శాతం పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇది వేగంగా అధికం అవుతుంది. 14 ప్రాంతాల్లోని 18 రంగాలకు చెందిన 865 కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికవెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment