TeamLease survey
-
విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలు
ముంబై: విద్యుత్, ఇంధన రంగాల్లో ఈ ఏడాది నియామకాలు సానుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య) ఈ రంగాల్లో నియామకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 9 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్’ నివేదిక తెలిపింది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల (నెట్ జీరో) లక్ష్యం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తాయని ఈ నివేదిక పేర్కొంది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన రంగం గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. 23 రంగాలకు చెందిన 1,417 కంపెనీల ప్రతినిధులను అడిగి టీమ్‌లీజ్ ఈ నివేదికను రూపొందించింది. ఢిల్లీలో అధికం ఇంధన, విద్యుత్ రంగాల్లో ప్రస్తుత ఉపాధి అవకాశాల పరంగా ఢిల్లీ 56 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరు 53 శాతం, ముంబై 52 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాల పరంగా జైపూర్ 14 శాతంతో ముందుంది. బెంగళూరు, చెన్నై, వదోదర 13 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెట్రోల్లో వృద్ధి అవకాశాలను గుర్తు చేస్తూనే, ద్వితీయ శ్రేణి పట్టణాలు కొత్త అవకాశాలు వేదికగా నిలుస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలు, పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ఆర్థిక వృద్ధికి మద్దతు.. ‘‘విద్యుత్, ఇంధన రంగాల్లో 9 శాతం మేర ఉపాధి అవకాశాల విస్తరణ అన్నది పర్యావరణ అనుకూల భవిష్యత్ దిశగా స్పష్టమైన మార్గాన్ని సూచిస్తోంది. 62 శాతం పరిశ్రమ ప్రతినిధులు తమ సిబ్బందిని పెంచుకుంటున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ 4.0, క్రమానుగతంగా కర్బన రహితంగా మారాలన్న లక్ష్యాలు విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దుతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ తెలిపారు. విద్యుత్, ఇంధన రంగాల్లో ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టీమ్‌లీజ్ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం వృద్ధి అవకాశాల గుర్తించి ప్రస్తావించారు. ఆ తర్వాత సేల్స్ (అమ్మకాలు) విభాగంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహన మౌలిక వసతులు, ప్రీమియమైజేషన్ (ఖరీదైన ఉత్పత్తుల వినియోగం) ధోరణితో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయని ఈ నివేదిక తెలిపింది. -
TeamLease: మహిళా టెకీలకు డిమాండ్
ముంబై: వచ్చే మూడేళ్లలో (2027 నాటికి) టెక్‌యేతర వ్యాపారాల్లో మహిళా టెకీల పాత్ర దాదాపు పాతిక శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ ధోరణి అన్ని స్థాయుల్లో (ఫ్రెషర్లు, జూనియర్, మిడ్–సీనియర్, లీడర్షిప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్) ఉండనుంది. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో నాన్–టెక్ పరిశ్రమల్లో టెక్నాలజీ విధులు నిర్వర్తిస్తున్న మహిళల సంఖ్య 19.4 లక్షలుగా ఉండగా ఇది 2027 నాటికి 24.3 శాతం పెరిగి 24.1 లక్షలకు చేరనుంది. నాన్–టెక్ రంగాల్లో పని చేస్తున్న మొత్తం మహిళా సిబ్బందిలో 0.5 శాతం మంది మాత్రమే టెక్ ఉద్యోగ విధుల్లో ఉన్నారని, ఈ విభాగంలో వారి వాటా మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. టెక్నాలజీలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుండటం, మహిళల ఆధారిత కార్యక్రమాలు జరుగుతుండటం వంటి అంశాల ఊ తంతో ఈ ఏడాది మహిళా టెకీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రాల వారీగా చూస్తే రాబోయే నెలల్లో మహిళల నియామకాలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లో అధికంగా ఉండనున్నాయి. చెన్నై, పుణె, నాసిక్, కోయంబత్తూర్, కోచి, ఔరంగాబాద్, వదోదర వంటి నగరాల్లో హైరింగ్ ఎక్కువగా ఉంది. -
ఈ కామర్స్‌లో కొలువుల పండుగ
హైదరాబాద్: నిరుద్యోగులకు కొలువుల పండుగ రానుంది. పండుగల విక్రయాలకు ముందు ఈ కామర్స్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు చోటు చేసుకోనున్నాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ తగ్గింపులు, ఆఫర్లతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. దీంతో ఏడాది పండుగల సీజన్ సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు ఈ కామర్స్ సంస్థలు నెట్వర్క్ బలోపేతంపై దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కామర్స్ రంగంలో తాత్కాలిక ఉద్యోగాలు పెద్ద ఎత్తున రానున్నాయని నియామక సేవలు అందించే టీమ్‌లీజ్ సరీ్వసెస్ సంస్థ తెలిపింది. పరిశ్రమలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ఈ అంచనాకు వచి్చంది. కేవలం దక్షిణాదిలోనే 4 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 7,00,000 తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 30 శాతం చొప్పున కొలువులు ఏర్పడతాయని తెలిపింది. పండుగల సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర టైర్–1 పట్టణాల్లో నియామకాలు పెద్ద ఎత్తున ఉంటాయని, కోయంబత్తూర్, కోచి, మైసూర్ తదితర ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం నియామకాలు విస్తరించొచ్చని అంచనా వేసింది. వేర్‌హౌస్ కార్యకలాపాల్లో (గోదాములు) 30 శాతం, డెలివరీ విభాగంలో 60 శాతం, కాల్‌సెంటర్ కార్యకలాపాల కోసం 10 శాతం నియామకాలు ఉంటాయని పేర్కొంది. ‘‘గడిచిన త్రైమాసికం నుంచి ప్రముఖ ఈకామర్స్ సంస్థలు పండుగల సీజన్‌కు సంబంధించి ఆశావహ ప్రణాళికలను ప్రకటించాయి. వినియోగదారులు భారీగా ఉండడం, భారత్‌లో తయారీని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తుండడం, ఎఫ్‌డీఐ, డిజిటైజేషన్ తదితర చర్యలు దేశంలో తాత్కాలిక కారి్మకుల పని వ్యవస్థను అధికంగా ప్రభావితం చేస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సరీ్వసెస్ బిజినెస్ హెడ్ బాలసుబ్రమణియన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తాత్కాలిక కారి్మకులు దేశవ్యాప్తంగా 25 శాతం మేర పెరుగుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో అయితే ఇది 30 శాతంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష సీజనల్ ఉద్యోగాలు రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను అనుగుణంగా తాము సరఫరా వ్యవస్థలో లక్ష తాత్కాలిక (సీజనల్) ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ హబ్‌లలో ఈ నియామకాలు చేపట్టనుంది. స్థానిక కిరాణా డెలివరీ భాగస్వాములు, మహిళలు, వికలాంగులను సైతం నియమించుకోనున్నట్టు తెలిపింది. తద్వారా వైవిధ్యమైన సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ‘‘బిగ్ బిలియన్ డేస్ (డిస్కౌంట్ సేల్) నిజంగా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ కామర్స్‌లో ఉండే మంచి గురించి లక్షలాది మంది కస్టమర్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ మంది మొదటిసారి కస్టమర్లే ఉంటున్నారు’’అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రి తెలిపారు. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయాలు చేపడుతుంటుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఉండే సంక్లిష్టతలు, స్థాయికి అనుగుణంగా తాము సామర్థ్యాన్ని, నిల్వ స్థాయి, సారి్టంగ్, ప్యాకేజింగ్, మానవవనరులను, డెలివరీ భాగస్వాములను పెంచుకోవాల్సి ఉంటుందని బద్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 40 శాతానికి పైగా షిప్మెంట్లను స్థానిక కిరాణా భాగస్వాములతో డెలివరీ చేసే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. -
భారీగా ఉపాధి అవకాశాలు.. ఎక్కడో తెలుసా?
ముంబై: 5జీ టెక్నాలజీ రాకతో ఉద్యోగాలకు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశీ టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాల్లో ఉద్యోగాల కల్పన, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ తదితర అంశాలపరంగా 5జీ టెక్నాలజీ సానుకూల ప్రభావం చూపనుంది. స్టాఫింగ్ సేవల కంపెనీ టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. (ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి? ) ఉద్యోగాల కల్పన, వ్యవస్థ మీద 5జీ ప్రభావాలపై నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 247 పైచిలుకు సంస్థలు అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందింది. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద టెలికం రంగానికి రూ. 12,000 కోట్లు కేటాయించడం, ఇందులో 25 శాతం మొత్తాన్ని కొత్తగా ఉద్యోగాల కల్పన కోసం పక్కన పెట్టడం తదితర అంశాలు ఉపాధి కల్పన, నైపుణ్యాల్లో శిక్షణ విషయంలో సానుకూల ప్రభావం చూపగలవని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఈవో (స్టాఫింగ్ విభాగం), కార్తీక్ నారాయణ్ తెలిపారు. 5జీ సామర్ధ్యాలను పూర్తిగా వెలికితీసేందుకు, అసాధారణ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించేందుకు, నవకల్పనలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► 5జీతో బీఎఫ్ఎస్ఐ రంగంపై 60 శాతం మేర, విద్య (48 శాతం), గేమింగ్ (48 శాతం), రిటైల్ .. ఈ–కామర్స్ 46 శాతం మేర సానుకూల ప్రభావం పడనుంది. ► 5జీ వినియోగం ప్రారంభించిన తొలి ఏడాదిలో భారీగా ఉద్యోగాల కల్పన జరగగలదని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► టెల్కోలు 5జీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడం, నెట్వర్క్ భద్రతను పెంచుకోవడం మొదలైన అంశాల వల్ల స్పెషలైజ్డ్ ఉద్యోగాల్లో నియామకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో టెక్నికల్ కంటెంట్ రైటర్లు, నెట్వర్కింగ్ ఇంజినీర్లు, ఏఐ/ఎంఎల్ నిపఉణులు, యూఎక్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజినీర్లు, సైబర్‌సెక్యూరిటీ స్పెషలిస్టులు, డేటా సైన్స్ .. అనలిటికల్ నిపుణులు మొదలైన వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం టెలికం పరిశ్రమలో డిమాండ్–సరఫరా మధ్య 28 శాతం మేర వ్యత్యాసం ఉంది. దీంతో సమగ్ర స్థాయిలో అత్యవసరంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించాల్సి ఉంటోంది. ఇదీ చదవండి: అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా? -
అప్రెంటిస్ జాబ్స్‌కు అనువుగా ఐటీ హబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, సాంకేతిక పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలు అప్రెంటీస్‌ల నియామకం విషయంలో అత్యంత ఆశాజనక ప్రదేశాలుగా అవతరించాయి. టీమ్‌లీజ్ అప్రెంటిస్‌షిప్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. 14 నగరాల్లో 24 రంగాలకు చెందిన 597 కంపెనీలు ఇందులో పాలుపంచుకున్నాయి. 2022 జూలై–డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో అప్రెంటీస్‌ల నియామకాల కోసం ఆసక్తి 77 నుంచి 79 శాతానికి పెరిగింది. సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ కంపెనీల్లో 83 శాతం అప్రెంటీస్‌ల నియామకాలను అధికం చేయాలని భావిస్తున్నాయి. ఢిల్లీ కంపెనీల్లో 82 శాతం, బెంగళూరులో 80, చెన్నై 81, ముంబై 77 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. మెట్రోయేతర నగరాలైన కోయంబత్తూరు 79 శాతం, నాగ్‌పూర్ 76, పుణే 76, అహ్మదాబాద్ 70 శాతం కంపెనీలు ఉత్సాహం కనబరిచాయి. వారి ప్రమేయమూ ఎక్కువే.. అప్రెంటీస్‌ల ప్రమేయం రంగాల వారీగా చూస్తే ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 90 శాతం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 88, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ 74 శాతం ఉంది. అప్రెంటీస్లను పెంచుకోవాలని ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 94 శాతం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 93, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీల్లో 85 శాతం ఆసక్తిగా ఉన్నాయి. 2023లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో నిరంతర వృద్ధితో దేశంలో అప్రెంటిస్‌షిప్ పట్ల ఆశాజనక దృక్పథాన్ని చూస్తాం’ అని నివేదిక వివరించింది. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా వేతనంతో కూడిన ఉద్యోగంతోపాటు శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్‌లు తమ పని గంటలలో కొంత సమయాన్ని తరగతి గది ఆధారిత అభ్యాసాన్ని కళాశాల, విశ్వవిద్యాలయం లేదా కంపెనీలో పూర్తి చేయాల్సి ఉంటుంది. పుష్కల అవకాశాలు.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు నగరాలు ఐటీ, సాంకేతిక పరిశ్రమలకు కేంద్రాలుగా, ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నప్పుడు.. పరిశ్రమ నిర్దిష్ట నైపుణ్యాలు, జ్ఞానాన్ని పొందేందుకు అప్రెంటీస్లకు పుష్కల అవకాశాలను అందిస్తాయని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుమిత్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాలు కంపెనీ యజమానులు, అప్రెంటీస్లకు విజయవంతమైన పరిష్కారంగా ఉద్భవించాయి. నిరుద్యోగాన్ని తగ్గించడం, జీవనోపాధిని మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా సామాజికంగా సాధికారత వైపు నడుపుతున్నారు. వ్యాపారాల ఉత్పాదకత, ఆవిష్కరణలు, పోటీతత్వాన్ని ఆర్థికంగా పెంచుతున్నారు’ అని అన్నారు. -
టెక్నాలజీయేతర రంగాల్లో టెకీలకు డిమాండ్
ముంబై: టెక్నాలజీయేతర రంగాల్లో సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. 2027–28 నాటికి 6 పరిశ్రమలు 10 లక్షల మందికి పైగా టెకీలను నియమించుకోనున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టెక్నాలజీయేతర రంగాలైన బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా).. కన్సల్టింగ్, కమ్యూనికేషన్ మీడియా, రిటైల్, లైఫ్ సైన్సెస్.. హెల్త్‌కేర్ తదితర రంగాల సంస్థలు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 లక్షల మంది టెక్ నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ రంగాల్లో 7 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రమేయం ఉంటోంది. 5జీ సేవలు ప్రారంభం కావడం, డిజిటల్ చెల్లింపుల వృద్ధి, కొత్త తరం వ్యాపారాల వస్తుండటం, ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం పెరుగుతుండటం, డిజిటల్ పరివర్తన మొదలైన పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో టెక్నాలజీయేతర రంగాల్లోనూ టెకీలకు డిమాండ్ ఏర్పడుతోంది‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ తెలిపారు. నిపుణుల కొరత.. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ నిపుణుల లభ్యత ఆ స్థాయిలో లేకపోవడం పరిశ్రమలకు పెద్ద సవాలుగా ఉంటోందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ (స్పెషలైజ్డ్ స్టాఫింగ్ విభాగం) మునీరా లోలివాలా తెలిపారు. టెకీలను నియమించుకోవడంతో పాటు సిబ్బందిలో సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడంపైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తద్వారా నిర్వహణ వ్యవస్థను నైపుణ్యాల ఆధారితమైనదిగా తీర్చిదిద్దుకునేందుకు పటిష్టమైన పునాది వేసుకోవచ్చని మునీరా వివరించారు. ‘ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెక్నాలజీయేతర రంగాల్లో ఇప్పటికీ నియామకాలనేవి పర్మనెంట్ ఉద్యోగాల ప్రాతిపదికన ఉండటం లేదు. 54 శాతం సంస్థలు మాత్రమే పర్మనెంట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఏకంగా 30 శాతం సంస్థల్లో నియామకాలు రకరకాల కాంట్రాక్టుల రూపంలో ఉంటున్నాయి‘ అని ఆమె పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ప్రాంతం, వేతనాలపరంగా చూస్తే బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్ మెరుగ్గా ఉంటున్నాయి. బెంగళూరులో టెకీల్లో 27 శాతం మందికి, హైదరాబాద్‌లో 16 శాతం, ఢిల్లీ.. పుణెల్లో 13 శాతం మందికి అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి. -
క్యూ1లో హైరింగ్ అప్
ముంబై: అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సర్వీసులు, తయారీ రంగాల కంపెనీలు మాత్రం నియామకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023–24 క్యూ1లో ఇది 10 శాతం అధికంగా ఉండగలదని అంచనాలు నెలకొన్నాయి. అయితే, 2022–23 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 4 శాతం తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్ సర్వీసెస్‌కి చెందిన ఉపాధి అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 14 రంగాలకు చెందిన 809 చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలపై చేసిన సర్వే ఆధారంగా టీమ్‌లీజ్ దీన్ని రూపొందించింది. ఇందులో పాల్గొన్న 64 శాతం మంది యజమానులు తమ సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. నివేదిక ప్రకారం సర్వీస్, తయారీ రంగాల్లో క్యూ1లో ప్రధానంగా ఎంట్రీ, జూనియర్ స్థాయి నియామకాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీసుల్లో ఇవి వరుసగా 73 శాతం, 71 శాతంగా ఉండగా .. తయారీలో 49 శాతం, 55 శాతంగా ఉన్నాయి. మధ్య స్థాయి ఉద్యోగాలకు సంబంధించి సర్వీసుల్లో 54 శాతంగాను, తయారీలో 32 శాతంగాను ఉన్నాయి. అత్యధికంగా సర్వీస్ రంగంలో.. తయారీ విభాగంతో పోలిస్తే సర్వీసుల రంగంలో హైరింగ్‌కు ఎక్కువగా ఆస్కారం ఉంది. సేవా రంగం విషయానికొస్తే ఇది టెలికమ్యూనికేషన్స్‌లో 96%, ఆర్థిక సర్వీసులు (93%), ఈ–కామర్స్.. అనుబంధ స్టార్టప్‌లు (89%), రిటైల్ (87%), విద్యా సర్వీసుల్లో 83%గా ఉంది. తయారీ రంగంలో హెల్త్‌కేర్ .. ఫార్మాలో 91 శాతంగా, ఎఫ్ఎంసీజీలో 89 శాతంగా, ఎలక్ట్రిక్ వాహనాలు.. మౌలిక సదుపాయాల కల్పనలో 73 శాతంగా ఉంది. -
భారత్‌లో యాపిల్.. 3లక్షల మందికి ఉద్యోగాలు
చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు కష్టాలు మొదలయ్యాయి. తయారీ, సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో తన తయారీ ఉత్పత్తుల్ని చైనా నుంచి వెలుపలికి మార్చాలని తయారీ దారులకు యాపిల్ సంస్థ సమాచారం ఇచ్చింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు దృష్టి పెట్టింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రెండో కంపెనీగా ఉన్న యాపిల్ నిర్ణయంతో తయారీ సంస్థలు భారత్‌లో తయారీ యూనిట్ల నెలకొల్పేందుకు సిద్ధమయ్యాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపిన యాపిల్.. 2024 ఆర్ధిక సంవత్సరం నాటి కల్లా 1,20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందంటూ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ సర్వీస్ ఎకనమిక్స్ టైమ్స్‌కు తెలిపింది. అందులో 40 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనుండగా.. ఆర్ధిక సంవత్సరం 2026 నాటికి 3 లక్షల మందిని విధుల్లోకి తీసుకోనుంది. వారిలో లక్షమంది ప్రత్యక్షంగా, 2 లక్షల మంది పరోక్షంగా లబ్ధపొందనున్నారు. ఈ సందర్భంగా 36 నెలల్లో ప్లాంట్లు, ఫ్యాక్టరీల ఏర్పాటుతో మరో లక్షమందిని యాపిల్ నియమించుకోనుందని టీమ్ లీజ్ సీఈవో కార్తిక్ నారాయణ్ వెల్లడించారు. ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన గత వారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ..యాపిల్ సంస్థ కర్ణాటక కేంద్రంగా 300 ఎకరాల్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను స్థాపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో లక్షల మందికి యాపిల్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రణాళికల్ని సిద్ధం చేయడంతో.. యాపిల్ త్వరలో చైనాకు గుడ్‌బై చెప్పి భారత్‌కు తరలించే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. చదవండి👉 ‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు! -
గేమింగ్‌లో భారీ ఉద్యోగాలు
ముంబై: గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించొచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ తెలిపింది. ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. 20–30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ‘గేమింగ్–రేపటి బ్లాక్ బస్టర్’పేరుతో టీమ్‌లీజ్ డిజిటల్ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రత్యక్షంగా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 30 శాతం ఉద్యోగాలు ప్రోగ్రామర్లు, డెవలపర్ల రూపంలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ రంగంలో గేమ్ డెవలపర్లు, యూనిటీ డెవలపర్లు, గేమ్స్ టెస్ట్ ఇంజనీర్లు, క్యూఏ హెడ్లు, యానిమేటర్లు, మోషన్ గ్రాఫిక్ డిజైనర్లు, వర్చువల్ రియాలిటీ డిజైనర్లు, వీఎఫ్ఎక్స్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. అధిక వేతనం.. ఈ రంగంలో అత్యధికంగా గేమ్ ప్రొడ్యూసర్లకు రూ.10 లక్షల వార్షిక వేతనం ఉంటే.. గేమ్ డిజైనర్లకు 6.5 లక్షలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ.5.5 లక్షలు, గేమ్ డెవలపర్లు రూ.5.25 లక్షలు, క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్లకు రూ.5.11 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీలున్నాయి. ‘‘గేమింగ్ పరిశ్రమ తదుపరి ఉదయించే రంగం. యూజర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా రానున్నాయి. తరచూ నియంత్రణపరమైన నిబంధనల మార్పు రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి ఉపాధినిస్తుంది. 2026 నాటికి 2.5 రెట్లు వృద్ధి చెందుతుంది’’అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. 2026 నాటికి గేమింగ్ పరిశ్రమ రూ.38,097 కోట్లకు చేరుతుందని టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఆదాయం పరంగా భారత్ గేమింగ్ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆరో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఈ విపణి విలువ రూ.17,24,800 కోట్లుగా ఉంది. -
తయారీలో అధిక నియామకాలు
ముంబై: తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయి. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు చెప్పాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. తయారీ, సేవల రంగ కంపెనీల్లో నియామకాల పట్ల ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే, ఇది 70 శాతం దాటుతుందని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా తర్వాత అంతర్జాతీయంగా ఉపాధి కల్పన 2.7 శాతం మేర కోలుకుంది. ఇది 2022 ద్వితీయ ఆరు నెలల కాలానికి బలంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ధోరణి కంపెనీల్లో, ముఖ్యంగా తయారీలో ఎంతో బలంగా ఉంది. పరిశ్రమల్లో ఆశావాదం పుంజుకోవడం, పండుగల సందర్భంగా వినియోగ డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్రోత్సాహకాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్ భట్ తెలిపారు. ప్రోత్సహకాలు కీలకం.. ‘‘ఉపాధి అవకాశాలను పెంచేందుకు, పర్యాటకం, ఏవియేషన్, నిర్మాణ రంగం, గృహ నిర్మాణానికి నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ఉద్దీపనల ప్యాకేజీ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడంలో సాయంగా నిలుస్తోంది’’అని టీమ్‌లీజ్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లోని 311 తయారీ కంపెనీలను టీమ్‌లీజ్ సర్వే చేసింది. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని తయారీ కంపెనీల్లో 91 శాతం నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని కంపెనీల్లో ఇది 69 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 39 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని కంపెనీల్లో 21 శాతం మేర నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ఈ పట్టణాల్లో మెరుగు.. ముంబైలో అత్యధికంగా 93 శాతం కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నాయి. ఆ తర్వాత బెంగళూరులో 90 శాతం, చెన్నైలో 83 శాతం, ఢిల్లీలో 79 శాతం, పుణెలో 67 శాతం, హైదరాబాద్‌లో 61 శాతం, అహ్మదాబాద్‌లో 61 శాతం మేర కంపెనీలు నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. బెంగళూరులో ఎఫ్ఎంసీజీ.. ముంబైలో తయారీ, ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చెన్నైలో ఆగ్రోకెమికల్స్ కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో ఉపాధి కల్పించనున్నాయి. -
ఆటో సంస్థలకు నిబంధనల భారం
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ కంపెనీలు పాటించాల్సిన చట్టాలు, నిబంధనలు అనేకానేకం ఉంటాయి. అయితే, ఆయా కంపెనీల మేనేజ్మెంట్లోని కీలక హోదాల్లో ఉన్న వారికి (కేఎంపీ)వీటిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. టీమ్‌లీజ్ రెగ్‌టెక్ నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఆటోమొబైల్ పరిశ్రమ పాటించాల్సిన నిబంధనలను సరళతరం చేయాల్సిన ఆవశ్యకతపై రెగ్‌టెక్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం చిన్నపాటి వాహనాల తయారీ సంస్థ ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలంటే వన్‌టైమ్, ఏటా పాటించాల్సిన నిబంధనలు కనీసం 900 పైచిలుకు ఉంటున్నాయి. వన్‌టైమ్ అంశాలైన రిజిస్ట్రేషన్లు, అనుమతుల్లాంటివి పక్కన పెడితే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కింద పాటించాల్సిన నిబంధనలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందల కొద్దీ చట్టాలు, నిబంధనలను తెలుసుకుని, పాటించడంపై కేఎంపీల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది. అనేకానేక నిబంధనలు, తేదీలు, డాక్యుమెంటేషన్ మొదలైనవన్నీ పాటించడం కష్టతరమవుతోంది. ఫలితంగా అనూహ్యంగా షోకాజ్ నోటీసులు అందుకోవడం, పెనాల్టీలు కట్టడం, లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య కాలంలో 34 ఆటోమొబైల్ కంపెనీలపై రెగ్‌టెక్ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో తాము పాటించడంలో విఫలమైన కీలక నిబంధన కనీసం ఒక్కటైనా ఉంటుందని 95 శాతం మంది కేఎంపీలు తెలిపారు. అలాగే జరిమానాలు కట్టాల్సి వచ్చిందని 92 శాతం మంది వెల్లడించారు. నియంత్రణపరమైన నిబంధనల అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం సవాలుగా ఉంటోందని 52 శాతం మంది తెలిపారు. -
ఫ్రెషర్ల నియమాకాలపై కంపెనీల్లో సానుకూలత
ముంబై: ఫ్రెషర్లకు ఉపాధి కల్పించే విషయంలో కంపెనీల్లో సానుకూల ధోరణి 61 శాతానికి పెరిగింది. టెక్నాలజీ, డిజిటల్ సేవలకు డిమాండ్‌తో సంస్థలు మరింత మంది ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ కెరీర్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దీంతో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలు గతేడాది జూన్–డిసెంబర్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలానికి మూడు రెట్లు అధికంగా ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయ భాగం ఆరంభంలో నిపుణులను ఆకర్షించడం ప్రముఖ కంపెనీలు, వ్యాపారవేత్తలకు ప్రాధాన్య అంశంగా మారినట్టు తెలిపింది. 865 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలపై టీమ్‌లీజ్ ఈ సర్వే నిర్వహించింది. ఐటీ 34 శాతం, ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లు 23 శాతం, టెలీ కమ్యూనికేషన్స్ 22 శాతం, ఇంజనీరింగ్ రంగం 20 శాతం మేర గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ద్వీతీయ ఆరు నెలల కాలంలో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాల పరంగా.. బెంగళూరు 25 శాతం, ముంబై 19 శాతం, ఢిల్లీ 18 శాతం వృద్ధిని చూపించనునన్నట్టు అంచనా వేసింది. -
మళ్లీ ఐటీలోకి వచ్చేది లేదు..
న్యూఢిల్లీ: వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకోవడం ఐటీ రంగంలో చాలా కష్టంగా మారుతోంది. గత రెండేళ్లుగా ఇది మరింత తీవ్రమవుతోంది. ప్రొఫెష నల్స్‌లో చాలా మంది భవిష్యత్తులో ఈ రంగానికి తిరిగి రావద్దు అని భావిస్తుండటమే ఇందుకు కార ణం. ఐటీ రంగానికి నియామకాల సర్వీసులు అందించే టీమ్‌లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగుల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. వారు ఉద్యోగ నిబంధనల్లో సరళత్వం, కెరియర్లో వృద్ధి అవకాశాలు, ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలు మొదలైన వాటి ఆధారంగా తమ కెరియర్లను మదింపు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో రెండంకెల స్థాయిలో 25 శాతం మేర అట్రిషన్ నమోదవుతోంది. 100 మంది పైగా నిపుణులు, ఐటీ రంగానికి సంబంధించిన వారితో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా టీమ్‌లీజ్ ఈ నివేదిక రూపొందించింది. ‘గత దశాబ్దకాలంలో దేశీ ఐటీ రంగం గణనీయంగా విస్తరించింది. అత్యంత వేగంగా 15.5 శాతం మేర వృద్ధితో 227 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. 2022 ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా 5.5 లక్షల ఉద్యోగాలను కల్పించింది‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. మారుతున్న ట్రెండ్.. : అయితే, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఐటీ నియామకాల ధోరణిలో పెను మార్పులు వచ్చా యి. వ్యాపారాలకు కీలకమైన ప్రతిభావంతులను అట్టే పెట్టుకోవడం ఐటీ కంపెనీలకు గత రెండేళ్లుగా కష్టంగా మారుతోంది. సర్వే ప్రకారం 57 శాతం మంది ప్రొఫెషనల్స్ భవిష్యత్తులో ఐటీ సర్వీసుల రంగానికి తిరిగి వచ్చే యోచన లేదని తెలిపారు. జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలు ఎలాగూ ఉండేవే అయినా ఉద్యోగాలు మారడంలో కొత్త సంస్థల అంతర్గత విధానాలు కూడా ఉద్యోగులకు ఆకర్షణీయంగా ఉంటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో పని, వ్యక్తిగత జీవితం గురించి ఉద్యోగుల అభిప్రాయాల్లో వస్తున్న మార్పులను కూడా దృష్టి లో పెట్టుకుని కంపెనీలు తమ విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటోందని తెలిపింది. ఉద్యోగులు, వారి అభ్యున్నతి లక్ష్యంగా కంపెనీల నియామక ప్రణళికలు వ్యూహాత్మకంగా ఉండాలని పేర్కొంది. -
ఫ్రెషర్లకు గుడ్ లక్: ఐటీలో లక్ష జాబ్స్,అంతేనా...ఇంకా చాలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రెషర్ల నియామకానికి కంపెనీలు సై అంటున్నాయి. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. 2022 జూలై–డిసెంబర్లో ఫ్రెషర్లను చేర్చుకునేందుకు 59 శాతం కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ ఏడాది జనవరి–జూన్‌తో పోలిస్తే ఇది 12 శాతం అధికం కావడం విశేషం. ఐటీలో 65 శాతం, ఈ-కామర్స్ 48, టెలికమ్యూనికేషన్స్‌లో 47 శాతం సంస్థలు ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఐటీలో లక్ష మంది ఫ్రెషర్ల నియామకాలు ఉండే అవకాశం ఉంది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్స్ నియామకాల చుట్టూ ఉన్న సెంటిమెంట్ భారతదేశంలో గణనీయంగా మెరుగుపడుతోంది. ఎక్కువ కంపెనీలు ఫ్రెషర్స్‌ను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా దేశంలోని యువత ఉపాధి సామర్థ్యం విలువతో కూడిన మార్పుకు గురైందనడానికి ఈ ధోరణి నిదర్శనం. ఒక ఏడాదిలోనే ఫ్రెషర్స్ హైరింగ్ సెంటిమెంట్ 42 శాతం పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇది వేగంగా అధికం అవుతుంది. 14 ప్రాంతాల్లోని 18 రంగాలకు చెందిన 865 కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికవెల్లడైంది. -
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్, భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఉపాధి కల్పన ఊపందుకోనున్నట్లు టీమ్‌లీజ్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ నివేదిక అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉద్యోగ నియామకాల్లో 61 శాతం వృద్ధి నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. ఇందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) దోహదపడనున్నట్లు తెలియజేసింది. పీఎల్ఐకింద పబ్లిక్ పెట్టుబడులు పెరగనుండటంతో క్యూ2లో భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నట్లు టీమ్‌లీజ్ నిర్వహించిన సర్వేలో కంపెనీలు వెల్లడించాయి. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నమోదైన 54 శాతంతో పోలిస్తే ఉపాధి కల్పనకు పెరిగిన ఆసక్తి 7 శాతం అధికమని టీమ్‌లీజ్ తెలియజేసింది. నగరాల స్పీడ్ త్రైమాసికవారీగా చూస్తే రానున్న కాలం(క్యూ2)లో మెట్రోలు, టైర్–1 నగరాలలో ఉద్యోగ కల్పన ఆసక్తి 6 శాతం పుంజుకుని 89 శాతానికి చేరినట్లు నివేదిక తెలియజేసింది. ఇక టైర్–2 నగరాలలో మరింత అధికంగా 7 శాతం బలపడి ఉపాధి కల్పనాసక్తి 62 శాతాన్ని తాకింది. టైర్–3 పట్టణాలలో ఇది 3 శాతం పెరిగి 37 శాతమయ్యింది. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి నామమాత్ర వృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టికి 2 శాతమే ఆసక్తి కనబడింది. ఈ సర్వేకు టీమ్‌లీజ్ 14 నగరాలు, పట్టణాల నుంచి 23 రంగాలను పరిగణించింది. 900 చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలను ఎంపిక చేసుకుంది. సర్వీసులు భేష్ ఉపాధి కల్పనకు సై అంటున్న సర్వీసుల రంగంలో బెంగళూరు(97 శాతం), ముంబై(81 శాతం), ఢిల్లీ(68 శాతం) ముందు నిలిచాయి. ఇక తయారీ రంగంలో అయితే ఢిల్లీ(72 శాతం), ముంబై(59 శాతం), చెన్నై(55 శాతం) జాబితాలో చోటు సాధించాయి. పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పనకు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు టీమ్‌లీజ్ సహవ్యవస్థాపకుడు రితుపర్ణ చక్రవర్తి తెలియజేశారు. పీఎల్ఐ పథకంలో భాగంగా పబ్లిక్ పెట్టుబడులు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.65 లక్షల కోట్ల ముందస్తు సహాయక ప్యాకేజీ.. పర్యాటకం, విమానయానం, హౌసింగ్ తదితర పలు రంగాలకు మద్దతివ్వనున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఉద్యోగావకాశాల పట్ల సానుకూల థృక్పథం నెలకొన్నట్లు వివరించారు. రానున్న త్రైమాసికాలలోనూ హైరింగ్ సెంటిమెంటు 70 శాతం మార్క్‌ను దాటగలదని అంచనా వేశారు. మహమ్మారితో చెక్ కోవిడ్–19 కేసులు పెరగడం, లేదా ఆంక్షల అమలుతో కొన్ని సంస్థలు అప్పుడప్పుడూ ఉపాధి కల్పనను నిలిపి వేస్తున్నట్లు చక్రవర్తి తెలియజేశారు. అయితే మొత్తంగా ఇందుకు అనుకూల వాతావరణమే ప్రస్తుతం నెలకొని ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. పరిమాణంరీత్యా చూస్తే చిన్న సంస్థలు అత్యధికంగా 47 శాతం(6 శాతం ప్లస్), మధ్యతరహా, భారీ కంపెనీలు 69 శాతం(4 శాతం అప్) హైరింగ్‌కు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మధ్య, సీనియర్ స్థాయిలతో పోలిస్తే ప్రారంభస్థాయి ఉపాధి కల్పన వేగమందుకోగా.. తదుపరి జూనియర్ స్థాయికి డిమాండ్ ఉన్నట్లు తెలియజేసింది. మార్కెటింగ్ విభాగంలో ఉపాధి కల్పనాసక్తి 10 శాతం పెరిగి 63 శాతానికి, ఐటీలో 8 శాతం పుంజుకుని 90 శాతానికి చేరింది. -
నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!
2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలలో దాదాపు 1.2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. ఈ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటైజేషన్ వేగం పెరిగిపోవడంతో పాటు కరోనా మహమ్మారి వ్యాప్తి భయాలు తగ్గడంతో ఉద్యోగ నియామకాల సంఖ్య పెరుగుతుందని నివేదిక తెలిపింది. టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. అధిక నైపుణ్యం & ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి శాతం మొత్తం ఉద్యోగాలలో దాదాపు 17 శాతం ఉండనుంది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 750 మందికి పైగా యజమానులు/నాయకులను సర్వే, ఇంటర్వ్యూ చేసిన టీమ్ లీజ్ 'ప్రొఫెషనల్ స్టాఫింగ్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఈ నివేదిక రూపొందించింది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల ఇండస్ట్రీ విప్లవం అనేది 4.0 దశకు చేరుకున్నది అని కంపెనీ యజమానుల అభిప్రాయం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు టీమ్ లీజ్ డిజిటల్ హెడ్ సునీల్ అన్నారు. "మొత్తం మీద, ఈ 3 రంగాలు కలిసి సృష్టించే ఉద్యోగ అవకాశాలలో 2527 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ 45,65,000 నుంచి 2026 నాటికి 90,00,000(అంచనా) కంటే ఎక్కువ ఉంటుంది" అని సునీల్ అన్నారు. కన్జర్వేటివ్ అంచనాల ప్రకారం.. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ మార్కెట్ పరిమాణంలో దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ రంగాలు మొత్తం కలిసి భారతదేశం మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 8.7 శాతం(సుమారు 42 మిలియన్ల మందికి) ఉపాధి కల్పిస్తున్నారు. 2026 నాటికి ఈ సంఖ్య మరో 54 మిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా. కాంట్రాక్ట్ సిబ్బంది వాటా మొత్తం ఉపాధిలో 10 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. ఇది 2026 నాటికి మొత్తం ఉపాధిలో 24 శాతం ఉంటుందని భావిస్తున్నారు. (చదవండి: ఎలన్‌మస్క్ సంచలన నిర్ణయం..! సోషల్ మీడియాపై గురి..!) -
ఫ్రెషర్లవైపే కంపెనీల మొగ్గు.. మార్చిదాకా నియామకాల జోరు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జనవరి–మార్చిలో నియామకాల జోరు ఉంటుందని టీమ్‌లీజ్ వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాలపై కఠినమైన ఆంక్షలు లేనట్టయితే కార్పొరేట్ కంపెనీల నియామకాల్లో గణనీయమైన వృద్ధి ఉంటుందని తెలిపింది. 21 రంగాల వారీగా 14 నగరాల్లోని 829 చిన్న, మధ్య, భారీ స్థాయి కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందిన టీమ్‌లీజ్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ ప్రకారం.. నియామకాలు చేపట్టాలన్న కంపెనీల ఆలోచన ప్రస్తుత త్రైమాసికంలో 9 శాతం పాయింట్ల వరకు పెరగవచ్చు. కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుండి నియామక ఉద్దేశంలో నమోదయ్యే అత్యధిక వృద్ధి ఇదే. సమీక్షించిన 21 రంగాల్లో ఏడు 10 శాతంపైగా పాయింట్లు సాధించే అవకాశం ఉంది. 17 రంగాలు 5 శాతంపైగా పాయింట్లను దక్కించుకోనున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 రంగాలు రికవరీని ప్రదర్శిస్తాయి. ఐటీ కంపెనీలే ముందంజ.. మహమ్మారి కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలను ఎదుర్కోవడానికి మెరుగైన సామర్థ్య వినియోగం, ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదల, అధికమవుతున్న ఎగుమతులు.. వెరశి ఉద్యోగాల జోరును వేగవంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఐటీ పనితీరు, సాంకేతికత అనుసంధాన సంస్థలు ఉద్యోగ కల్పనలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. 89 శాతం ఐటీ కంపెనీలు నిపుణులను చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. విద్యా రంగంలో 80 శాతం, ఆరోగ్య, ఫార్మా 71, ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్స్‌లో 69 శాతం కంపెనీలు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సుముఖంగా ఉన్నాయి. తదుపరి లాక్డౌన్లు విధించకపోతే ఇతర రంగాలు సైతం నియామకాలను చేపడతాయి. ఇదే సరైన సమయం.. నిపుణులైన మానవ వనరులకు ఇది సరైన సమయం. ప్రస్తుత త్రైమాసికంలో 2–5 సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్ స్థాయి నిపుణులకు బదులుగా ఫ్రెషర్లను నియమించుకోవడంపై కంపెనీలు దృష్టి సారించనున్నాయి. జూనియర్ టాలెంట్‌ను రిక్రూట్ చేసుకోవడానికి 46 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చిలో అట్రిషన్ వేగంగా పెరగనుంది. ఐటీ, విద్య సేవలు, హెల్త్‌కేర్, ఫార్మా, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ రంగాల్లో 8 శాతంపైగా అట్రిషన్ నమోదు కానుంది. అన్ని రంగాలు క్రితం త్రైమాసికంలో కంటే అధిక అట్రిషన్ రేట్లను కలిగి ఉండనున్నాయి. ఉద్యోగి దృక్పథం, పని విధానంలో మార్పు దీనికి కారణాలు అని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి: సీఎంఎస్ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు -
2021లో ఈ-కామర్స్ రంగాల్లో భారీగా పెరిగిన నియామకాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2021) ఈ-కామర్స్, అనుబంధ రంగాల్లో ఉద్యోగ నియామకాలు 28 శాతం పెరిగాయి. ఎకానమీ రికవరీ, వేగవంతమైన టీకాల ప్రక్రియ వంటి అంశాల దన్నుతో ఈ సెగ్మెంట్లో రిక్రూట్మెంట్ వచ్చే ఏడాది మరింతగా పుంజుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ఈ-కామర్స్ రంగం 2020లో 8 శాతం, 2021లో 30 శాతం మేర వృద్ధి చెందింది. 2024 నాటికి ఇది 111 బిలియన్ డాలర్లకు, 2026 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ విభాగం..ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉద్యోగావకాశాలకు ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ–కామర్స్, అనుబంధ రంగాల్లో (ఈ-కామర్స్, ఆన్లైన్లో నిత్యావసర సరుకులు మొదలైనవి) ఈ ఏడాది ఉద్యోగావకాశాలు 28 శాతం మేర పెరిగినట్లు టీమ్‌లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ థామస్ తెలిపారు. వచ్చే ఏడాది 32 శాతం వరకూ అప్.. ఈ–కామర్స్, స్టార్టప్‌లలో 2022లో కొత్తగా మరిన్ని ఉద్యోగాల కల్పన జరగగలదని, నియాకాల వృద్ధి 32 శాతం వరకూ నమోదు కావచ్చని థామస్ పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థ నిర్వహణ, వేర్‌హౌస్‌లో వివిధ ఉద్యోగాలు, సపోర్టు సేవలు, కస్టమర్ సర్వీస్ నిర్వహణ తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొందని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా ఈ-కామర్స్ విస్తరిస్తుండటంతో కేవలం ప్రథమ శ్రేణి నగరాల్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నుంచి నాలుగో శ్రేణి ప్రాంతాల వరకూ అన్ని చోట్ల హైరింగ్ జోరు అందుకుందని నివేదిక పేర్కొంది. ఈ రంగాల్లో వేతనాల పెంపు సగటున 20–30 శాతం స్థాయిలో ఉంటోందని, చాలా కంపెనీలు అటెండెన్స్ విధానాలను సడలించడం, అదనంగా సిక్ లీవులు ఇవ్వడం మొదలైన రూపాల్లో ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయని తెలిపింది. ఈ-కామర్స్, టెక్ స్టార్టప్‌లకు వచ్చే ఏడాది మరింత ఆశావహంగా ఉండగలదని అయితే ఆయా విభాగాలు వృద్ధి చెందడానికి మరిన్ని సంస్కరణలు, ఆర్థిక సహా యం అవసరమవుతాయని వివరించింది. ఉత్పత్తు లు, సర్వీసుల విభాగాల్లో కొత్త వ్యాపార విధానాల ను రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం కూడా గుర్తించి, తగు తోడ్పాటు ఇవ్వాలని నివేదిక తెలిపింది. (చదవండి: బీమా కంపెనీల ఆఫర్.. పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు!) -
జోరందుకున్న కార్మికుల నియామకం
సాక్షి, ముంబై: వేగంగా కొనసాగుతున్న టీకాల కార్యక్రమం.. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న అశావహ అంచనాల మధ్య.. 70 శాతం సంస్థలు కార్మికుల నియామకాలను (బ్లూకాలర్ వర్కర్స్) ఇప్పటికే ప్రారంభించాయి. ఓఎల్ఎక్స్ సంస్థ ఓఎల్ఎక్స్ పీపుల్ సర్వే పేరుతో ఒక సర్వే నిర్వహించి వివరాలను విడుదల చేసింది. ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వేలో 150 కంపెనీల అధిపతులు పాల్గొని అభిప్రాయాలు తెలియజేశారు. (షాపింగ్ మాల్స్‌కు కరోనా సెకండ్ వేవ్ షాక్!) సర్వే ఫలితాలు.. రెండో ఎడిషన్ సర్వేలో భాగంగా 16 శాతం కంపెనీలు తాము కార్మికుల నియామకాలను నూరు శాతం ప్రారంభించినట్టు చెప్పగా.. మరో 54 శాతం కంపెనీలు తాము 50 శాతం మేరే కార్మికులను నియమించుకుంటున్నట్టు వెల్లడించాయి. కరోనా కేసులు తిరిగి పెరిగిపోతున్న నేపథ్యంలో మెజారిటీ కాంట్రాక్టు పనివారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. నైపుణ్య మానవవనరుల పరంగా సవాళ్లను ఎదుర్కోవడం లేదని 60 శాతం కంపెనీలు తెలిపాయి. సర్వేలో పాల్గొన్న ప్రతీ ఇద్దరిలో ఒకరు ఏడాదిలోపే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశావహంతో ఉన్నారు. 36 శాతం మంది మాత్రం అనిశ్చితిని వ్యక్తం చేస్తూ ఆర్థిక వ్యవస్థ నిదానంగా కోలుకోవచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. తమ వ్యాపారాలు చక్కగా నడుస్తున్నాయంటూ 60 శాతం మంది చెప్పారు. 2021 చివరికి గానీ తమ వ్యాపారాలు సాధారణ స్థితికి చేరుకోవని 24 శాతం చెప్పారు. ఈకామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో నియామకాలు పూర్తి స్థాయికి చేరుకోగా.. ఎఫ్ఎంసీజీ, బీఎఫ్ఎస్ఐ, తయారీ, ఐటీలోనూ డిమాండ్ నెలకొంది. ఉద్యోగుల సంక్షేమ విషయానికొస్తే.. 52 శాతం సంస్థలు పీఎఫ్, గ్రాట్యుటీ ప్రయోజనాలను అందిస్తుంటే, 44 శాతం సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్‌ను సైతం ఆఫర్ చేస్తున్నాయి. మరో 33 శాతం సంస్థలు కార్మికుల్లో నైపుణ్యాల పెంపునకు పెట్టుబడులపై ఆసక్తితో ఉన్నాయి. (భారీగా పెరిగిన మొబైల్ మాల్వేర్ దాడులు) 7 శాతం పెరగొచ్చు: జూన్ త్రైమాసికంపై టీమ్‌లీజ్ అంచనా ఉద్యోగ నియామకాలు ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 7 శాతం వరకు పెరగొచ్చని (జనవరి–మార్చితో పోలిస్తే) టీమ్‌లీజ్ ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ నివేదిక తెలియజేసింది. మరింత లాక్డౌన్లు లేకుండా, పని ప్రదేశాల్లో నిబంధనలను విధించకుండా ఉంటేనే ఈ మేరకు వృద్ధి ఉంటుందని నివేదికలో అంచనా వేసింది. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, విద్యా సేవలు, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, ఐటీ రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 21 రంగాలను సమీక్షించగా.. 8 రంగాలు ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను నియమించుకునే ఉద్దేశంతో ఉన్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. 712 చిన్న, మధ్య, భారీ స్థాయి కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. కాగా, ఈ ఏడాది మార్చిలో ఉద్యోగాల భర్తీ ఫిబ్రవరి నెలతో పోలిస్తే 2 శాతం తగ్గినట్టు మాన్స్టర్ డాట్ కామ్ తన నివేదికలో తెలిపింది. (ఈ–కామర్స్‌కు కరోనా జోష్..!) -
భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి స్టార్టప్ సంస్థలు డెలివరీ విభాగాన్ని విస్తరించటంపై దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరుకునేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో కస్టమర్లను సొంతం చేసుకునేందుకు సరఫరా వ్యవస్థపై ఇవి దృష్టి పెట్టాయి. స్విగ్గీ, గ్రోఫర్స్, మిల్క్‌బాస్కెట్, షాడోఫాక్స్ తమ డెలివరీ ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేసుకోనున్నాయి. ఇక అమెజాన్, బిగ్‌బాస్కెట్ ఈ విషయంలో ఇంకా దూకుడు కనబరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 51,500 డెలివరీ ఏజెంట్ల అవసరం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా. ఏడాది చివరికి ఇది 1,21,600కు పెరుగుతుందని టీమ్‌లీజ్ సహ వ్యవస్థాపకుడు రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. మరో హెచ్ఆర్ సంస్థ రాండ్‌స్టాండ్ ఇండియా సైతం తొలి ఆరునెలల కాలంలో 50వేల వరకు డెలివరీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. విస్తరణపై భారీగానే ఖర్చు ప్రముఖ డెలివరీ సంస్థలు పెద్ద ఎత్తున నిధులను ఇప్పటికే సమీకరించగా, ఇందులో గణనీయమైన వాటాను డెలివరీ సామర్థ్యాల విస్తరణకే ఖర్చు చేయనున్నట్లు రాండ్‌స్టాండ్ ఇండియా ఎండీ పౌల్ డుపియస్ చెప్పారు. ‘‘మెట్రోల వెలుపలికీ విస్తరించాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కార్యకలాపాల విస్తరణే ఉద్యోగుల నియామకాల పెరుగుదలకు కారణం’’ అని డుపియస్ వివరించారు. గ్రోసరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్... సాఫ్ట్ బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా గత నెలలో 60 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ నిధులతో ప్రస్తుత 3,000 డెలివరీ బృందాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఈ సంస్థ హెచ్ఆర్ విభాగం హెడ్ అంకుష్ అరోరా చెప్పారు. బిగ్‌బాస్కెట్ కూడా మరో 150 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనుంది. తద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 4,000–5,000 మంది డెలివరీ సిబ్బందిని నియమించుకోనుంది. ప్రస్తుత వ్యాపారంలో వృద్ధితోపాటు నూతన వ్యాపార అవకాశాల ఫలితమే ఇదని గ్రోఫర్స్ హెచ్ఆర్ జీఎం తనుజా తివారి చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ డెలివరీ విభాగం విస్తరణపై పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్ సైతం స్పష్టం చేసింది. అండమాన్స్‌లోని హావ్లాక్ ఐలాండ్, అసోంలోని మజూలి ఐలాండ్‌కు సైతం తాము డెలివరీ చేస్తున్నట్టు పేర్కొంది. జోమాటో జోరు... ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు గతేడాది సెప్టెంబర్ నాటికి 38 పట్టణాల్లో 74,000 మంది డెలివరీ భాగస్వాములుండగా, వీరి సంఖ్యను 213 పట్టణాల్లో 1,80,000కు పెంచుకుంది. మరో ఫుడ్ డెలివరీ స్విగ్గీ సైతం వచ్చే ఏడాదికి డెలివరీ భాగస్వాముల సంఖ్యను 1,25,000కు పెంచుకోనున్నట్టు తెలిపింది. షాడోఫాక్స్‌కు ప్రస్తుతం 12,000 మంది డెలివరీ ఏజెంట్లుండగా, వచ్చే ఏడాది ఇదే సమయానికి 25,000కు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో అభిషేక్ బన్సాల్ తెలిపారు. మిల్క్ బాస్కెట్‌కు 1,500 మంది డెలివరీ బృందం ఉండగా, ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసుకోవాలనుకుంటోంది. -
ప్రసూతి చట్టంతో భారీగా ఉద్యోగాలు గోవింద
న్యూఢిల్లీ : దేశంలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి ప్రయోజనాలను పెంచుతూ.. వారిని కెరీర్ పరంగా మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్త ప్రసూతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం వల్ల ఇప్పటికే ఆడవాళ్లకు అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగవకాశాలు మరింత సన్నగిల్లినట్టు తెలిసింది. కొత్త ప్రసూతి చట్టం వల్ల మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని, చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు మహిళలను నియమించుకోవడం తగ్గించాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ తన అధ్యయనంలో వెల్లడించింది. మార్చి 2019 వరకు 10 రంగాలలో 11 లక్షల నుంచి 18 లక్షల మంది మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు ఈ అధ్యయనం అంచనావేసింది. ఒకవేళ అన్ని రంగాలను తీసుకుంటే, ఉద్యోగం కోల్పోయిన వారి సంఖ్య కోటి నుంచి 1.2 కోట్ల వరకు ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇది భారత్‌కు బ్యాడ్‌న్యూస్ అని పేర్కొంది. అంతేకాక వర్క్‌ఫోర్స్‌లో మహిళల షేర్ 24 శాతానికి పడిపోయిందని కూడా తెలిపింది. ఒకవేళ మహిళా ఉద్యోగుల స్థాయి దేశంలో ఎక్కువగా ఉంటే, దేశ జీడీపీకి 700 బిలియన్ డాలర్లకు పైగా అదనపు సంపద చేకూరుతుందని మెక్నిన్సే అండ్ కో అంచనావేసింది. ఏవియేషన్, ఐటీ, ఐటీ సంబంధిత సర్వీసులు, రియల్ ఎస్టేట్, విద్యా, ఈ-కామర్స్, తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసులు, రిటైల్, టూరిజం రంగాలలో 300 ఎంప్లాయిర్స్పై ఈ సర్వేను టీమ్‌లీజ్ సర్వీసెస్ నిర్వహించింది. ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబాల్లో మహిళలు, బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేయడం లేదని, ఒకవేళ భర్త వేతనం తగ్గిపోతే, అప్పుడు ఉద్యోగం వైపు మొగ్గు చూపుతున్నారని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. 2004 నుంచి 2 కోట్ల మంది మహిళలు తమ ఉద్యోగాలను వదులుకున్నట్టు తెలిపింది. వర్క్ఫోర్స్ల్లో మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రసూతి చట్టాన్ని సవరించింది. 12 వారాలుగా ఉన్న ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచింది. కానీ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో పనిచేస్తూ ఉంటాయని, ఒకవేళ ఈ కంపెనీల్లో ఐదుగురు మహిళా ఉద్యోగులుంటే, వారి కనుక ప్రసూతి చట్టం కింద 28 వారాల పాటు సెలవు తీసుకుంటే, ఇక సంస్థ నడపడం కష్టతరమవుతుందని తెలిసింది. దీంతో ఈ కంపెనీలు మహిళలను నియమించుకోవడానికి నిరాసక్తి చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది. భారత్ లాంటి దేశంలో ఇప్పటికే గర్భవతి అవడాన్ని కెరీర్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. తల్లులైనందున పదోన్నతులు కోల్పోయిన వారు ఉన్నారు. కొత్తగా తల్లులవుతున్న వారు పనిచేసే చోట వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల ఇంటర్వ్యూల సందర్భాల్లోనే పెళ్లి, పిల్లలకు సంబంధించిన ప్రణాళికలను తెలసుకుంటున్నాయి. ఉద్యోగాల్లో చేరిన కొన్నేళ్లవరకు పెళ్లి చేసుకోకూడదని, పెళ్లి చేసుకున్నా పిల్లలు కనకూడదనే షరతులు విధిస్తున్న కంపెనీలు కూడా లేకపోలేదు. -
ఈ ప్రాంతం వారికే జాబ్ లాస్ రిస్క్ ఎక్కువ
న్యూఢిల్లీ : ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీలు ఇటీవల కాలంలో ఉద్యోగులుపై ఎడాపెడా వేటువేస్తూ తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి వంకగా ఉద్యోగి పనితీరును పరిగణలోకి తీసుకుంటున్నాయి. అయితే ఉద్యోగాల కోతకు కంపెనీల ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగిపనితీరు మాత్రమే కాదంట. పనిచేసే ప్రాంతం కూడా కీలకమైనదిగా తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇండస్ట్రిలో ఉద్యోగులు పనిచేసే ప్రాంతం బట్టి కూడా వేటు పడుతుందని తెలిసింది. ఇతర టైర్ 1 సిటీలతో పోలిస్తే ఢిల్లీలో పనిచేసే వారికి జాబ్ లాస్ రిస్క్ ఎక్కువగా ఉందని టీమ్ లీజ్ సర్వే వెల్లడించింది. ఢిల్లీ తర్వాత జాబ్ ఎక్కువగా పోయే అవకాశం బెంగళూరు, హైదరాబాద్ లోనే ఉందట. పుణేలో తక్కువ జాబ్ లాస్ రిస్క్ ఉందని టైమ్ లీజ్ తెలిపింది. ముంబై, అహ్మదాబాద్, చండీఘర్, చెన్నై, కోల్ కత్తా ప్రాంతాల్లో పరిస్థితి మధ్యస్థాయిగా ఉందని వెల్లడైంది. ఎకనామిక్టైమ్స్.కామ్ భాగస్వామ్యంతో టీమ్ లీజ్ దేశంలో ఉపాధి పరిస్థితిని రూపొందించింది. అంతేకాక ఉద్యోగాలు పోయే అవకాశాలు పరిశ్రమ, పరిశ్రమకు భిన్నంగా ఉన్నాయని, ఇండస్ట్రియల్ మానుఫ్రాక్ట్ర్చరింగ్, అలైడ్ సెక్టార్ లలో ఈ ఉద్యోగాల కోత ఎక్కువగా ఉంటుందని వివరించింది. వాటి తర్వాత కన్ స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, బీపీఓ, ఐటీ సర్వీసుల్లో జాబ్ లాస్ రిస్క్ ఎక్కువగా ఉందని పేర్కొంది. టెలికాం, హెల్త్ కేర్ రంగాల్లో పనిచేసే వారు ఉద్యోగాల కోతపై ఆందోళన చెందాల్సినవసరం లేదని చెప్పింది. ఈ రెండు రంగాలు జాబ్ లాస్ రిస్క్ ఇండెక్స్ దిగువస్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది.