ముంబై: 5జీ టెక్నాలజీ రాకతో ఉద్యోగాలకు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశీ టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాల్లో ఉద్యోగాల కల్పన, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ తదితర అంశాలపరంగా 5జీ టెక్నాలజీ సానుకూల ప్రభావం చూపనుంది. స్టాఫింగ్ సేవల కంపెనీ టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. (ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్‌ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి? )
ఉద్యోగాల కల్పన, వ్యవస్థ మీద 5జీ ప్రభావాలపై నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 247 పైచిలుకు సంస్థలు అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందింది. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద టెలికం రంగానికి రూ. 12,000 కోట్లు కేటాయించడం, ఇందులో 25 శాతం మొత్తాన్ని కొత్తగా ఉద్యోగాల కల్పన కోసం పక్కన పెట్టడం తదితర అంశాలు ఉపాధి కల్పన, నైపుణ్యాల్లో శిక్షణ విషయంలో సానుకూల ప్రభావం చూపగలవని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఈవో (స్టాఫింగ్ విభాగం), కార్తీక్ నారాయణ్ తెలిపారు. 5జీ సామర్ధ్యాలను పూర్తిగా వెలికితీసేందుకు, అసాధారణ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించేందుకు, నవకల్పనలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు..
► 5జీతో బీఎఫ్‌ఎస్‌ఐ రంగంపై 60 శాతం మేర, విద్య (48 శాతం), గేమింగ్ (48 శాతం), రిటైల్ .. ఈ–కామర్స్ 46 శాతం మేర సానుకూల ప్రభావం పడనుంది.
► 5జీ వినియోగం ప్రారంభించిన తొలి ఏడాదిలో భారీగా ఉద్యోగాల కల్పన జరగగలదని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు.
► టెల్కోలు 5జీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడం, నెట్‌వర్క్ భద్రతను పెంచుకోవడం మొదలైన అంశాల వల్ల స్పెషలైజ్డ్ ఉద్యోగాల్లో నియామకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో టెక్నికల్ కంటెంట్ రైటర్లు, నెట్‌వర్కింగ్ ఇంజినీర్లు, ఏఐ/ఎంఎల్ నిపఉణులు, యూఎక్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజినీర్లు, సైబర్‌సెక్యూరిటీ స్పెషలిస్టులు, డేటా సైన్స్ .. అనలిటికల్ నిపుణులు మొదలైన వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం టెలికం పరిశ్రమలో డిమాండ్–సరఫరా మధ్య 28 శాతం మేర వ్యత్యాసం ఉంది. దీంతో సమగ్ర స్థాయిలో అత్యవసరంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించాల్సి ఉంటోంది.
ఇదీ చదవండి: అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment