Job opportunities
-
కెనడా కొలువులు కష్టమే
ఒట్టావా: మెరుగైన ఉద్యోగావకాశాల కోసం కెనడా వలస వెళ్లాలనుకునే భారతీయ నిపుణులకు కొత్త సవాళ్లు ఎదురు కానున్నాయి. కెనడా తన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఇమిగ్రేషన్ విధానంలో భారీ మార్పులు ప్రకటించింది. పర్మినెంట్ ఇమిగ్రేషన్ ప్రోగ్రాంకు అభ్యర్థి అర్హతను పర్యవేక్షించే కీలకమైన కాంప్రెహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టం (సీఆర్ఎస్)లో మార్పులు చేశారు. కెనడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం అభ్యర్థులు ఇకపై ఉద్యోగ ఆఫర్‌పై అదనపు పాయింట్లు పొందరు. ఈ మార్పులన్నీ 2025 నుంచి అమల్లోకి వస్తాయి. అప్పటికే పూల్‌లో ఉన్న ఉద్యోగార్థులతో పాటు అందులోకి కొత్తగా ప్రవేశించే అభ్యర్థులందరికీ ఇది వర్తిస్తుందని కెనడా ప్రకటించింది. మోసాలను తగ్గించడానికే తాజా చర్యలపై కెనడా ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడారు. తమ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిపుణులైన ప్రతిభావంతులను శాశ్వత నివాసులుగా కెనడా వచ్చేలా ప్రోత్సహిస్తూనే మోసాలను తగ్గించడమే వాటి లక్ష్యమని తెలిపారు. ‘‘వలసలు కెనడా విజయానికి మూలస్తంభంగా ఉన్నాయి. సమర్థులు, తెలివైన వారిని కెనడాకు స్వాగతించడానికి కట్టుబడి ఉన్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉద్యోగాలు, గృహాలతో పాటు వారి అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది’’అన్నారు. ప్రభావం ఎవరిపై?: జాబ్ ఆఫర్‌పై అదనపు సీఆర్ఎస్ పాయింట్లను తొలగించడం వల్ల ప్రస్తుతం కెనడాలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారిపై ప్రభావం పడుతుంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టం ద్వారా శాశ్వత నివాసాన్ని కోరుకునే వారిపైనా ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. ఇప్పటికే శాశ్వత నివాసం (పీఆర్) కోసం దరఖాస్తు చే సుకోవడానికి ఆహ్వానించిన అభ్యర్థులను మా త్రం కొత్త నిబంధనలు ప్రభావితం చేయవు. ప్రస్తుతం ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్సీసీ) కింద పీఆర్ కోసం దరఖాస్తు సమరి్పంచిన వారికీ వర్తించవు. ఫ్లాగ్పోలింగ్పై నిషేధం: కెనడాలోని తాత్కా లిక నివాసితులు ఇకపై దేశం వీడి మళ్లీ తిరిగి రా వడానికి కూడా ఇకపై అనుమతి ఉండదు. ఇమిగ్రేషన్ స్థితిని మార్చడానికి సరిహద్దు వద్ద నిర్వహించే ఫ్లాగ్పోలింగ్ను కెనడా నిషేధించింది. ఇమిగ్రేషన్ పత్రా ల రద్దు, సవరణకు సంబంధిత అధికారులకు అధికారమిచ్చారు. ఈ మార్పులు కూడా 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఏమిటీ ‘ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ’? ఇది ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రాం. కెనడాలోని పలు సంస్థలు స్థానికంగా సరైన అభ్యర్థి దొరక్కపోతే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటారు. ఈ లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎస్ఎంఐఏ) ఆధారంగా ఉద్యోగం పొంది శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే ఐటీ ఉద్యోగులకు అదనపు పాయింట్లు అందుతాయి. సీఎస్ఆర్ స్కోర్‌లో అదనంగా 50 నుంచి 200 పాయింట్లు పొందుతారు. ఈ విధానంలో అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని పూల్‌లోకి ప్రవేశించవచ్చు. రౌండ్లలో ఎక్కువ పాయింట్లు సాధించిన వారిని కెనడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. దరఖాస్తు అందాక శాశ్వత నివాసం (పీఆర్) ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కొత్త మార్పుల ప్రకారం ఇకపై ఈ అదనపు పాయింట్లుండవు. వయసు, విద్య, భాషా నైపుణ్యం, ఇతర ప్రమాణాల ఆధారంగా మాత్రమే మూల్యాంకనం చేస్తారు. అంటే అభ్యర్థుల మధ్య పోటీ పెరుగుతుంది. -
రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్‌లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్‌పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్‌లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సౌర విద్యుత్ 44 శాతం.. భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.లక్ష ఈ–బస్‌లు అవసరం.. ఎలక్ట్రిక్ బస్‌ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్‌లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్‌లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు. -
అప్డేట్ అవ్వాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులే కాదు.. బీటెక్ చదివి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారికీ కొన్ని అత్యాధునిక సాంకేతిక కోర్సులు చేయడం అని వార్యమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకొస్తున్న నేపథ్యంలో ఉద్యోగావకా శాలు మెరుగుపరుచుకునేందుకు, ఉన్న ఉద్యో గాన్ని కాపాడుకునేందుకు ఈ దిశగా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ప్రముఖ యూనివర్సిటీలు కూడా వాటిని ప్రవేశ పెట్టా ల్సిన, డిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్రాస్ ఐఐటీ విద్యార్థులు జరిపిన సర్వే ప్రకారం 52 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు ఏదో ఒక ఆన్లైన్ కోర్సు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతు న్నారు. టెక్ ఉద్యోగులు ఏకంగా 72 శాతం మంది ఆన్లైన్ కోర్సుల బాట పడుతున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సమయం చిక్కినప్పుడల్లా కొత్త టెక్నాలజీ కోర్సులను నేర్చుకుంటున్నారు. అప్పుడే భవిష్యత్తులో ఏఐతో వచ్చే పోటీని తట్టుకోగలమని భావిస్తున్నారు.ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 8% మంది స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా వాళ్లంతా ఇంజనీరింగ్‌తో సంబంధం లేని సాధారణ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. చాలామందికి పరిశ్రమలకు అవస రమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండటం లేదని మద్రాస్ ఐఐటీ పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు కొత్త కోర్సులు చేస్తే తప్ప ఇంజనీరింగ్ తర్వాత ఉపాధి దొరక డం కష్టంగా ఉంది. ఐటీ ఉద్యోగుల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. కొన్నేళ్ల క్రితం సంస్థలో చేరిన ఉద్యోగికి ఇప్పుడొస్తున్న ఏఐ టెక్నాలజీపై పెద్దగా పట్టు ఉండటం లేదు. ఏఐ టెక్నాలజీ అర్హత గల వాళ్ళు సంస్థలో ఉద్యోగులుగా వస్తుండటం, యాంత్రీకరణ నేపథ్యంలో అన్ని పనులు ఏఐ టెక్నాలజీనే చేయడంతో ఆ టెక్నాలజీ లోపించిన ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.అందుబాటులో ఎన్నో ఆన్లైన్ కోర్సులుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో రెండేళ్లలో ఐటీ సెక్టార్‌ను సమూలంగా మార్చబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఆ రంగంలో నిపు ణుల కొరతను దృష్టిలో ఉంచుకుని, ఇంజనీరింగ్‌లో నాణ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రము ఖ సంస్థలు ఎన్నో కోర్సులను అందుబాటు లోకి తెచ్చాయి. వీటికి ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి మంచి స్పందన కన్పిస్తోంది. » ఐఐటీ హైదరాబాద్ ఏఐ అండ్ ఎంఎల్, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు మెరుగు పరిచే కోర్సులను అందిస్తోంది. » మద్రాస్ ఐఐటీ బీఎస్సీ డేటా సైన్స్... నాలుగేళ్ల బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అందిస్తోంది. » ఐఐటీ బాంబేలో డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెర్నింగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఉన్నాయి.» ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏఐ–ఎంఎల్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, సేఫ్టీ ఇన్ కామన్ ఇండస్ట్రీస్, సేఫ్టీ అండ్ ది లా, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్ వంటి కోర్సులు అందిస్తోంది. నైపుణ్యం పెంచే కోర్సులకు ప్రణాళిక విద్యార్థుల్లో తగిన నైపుణ్యం పెంచేలా ఆన్లైన్ కోర్సులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా మద్రాస్ ఐఐటీతో ఇటీవల చర్చలు జరిపాం. ఇంజనీరింగ్‌లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురు
ఐటీ రంగంలో 2025లో 15–20 శాతం మేర అధిక నియామకాలు నమోదవుతాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయ ఆరు నెల్లలో ఈ రంగంలో కదలిక వచ్చిందని, దీంతో 2025లో ఈ పరిశ్రమలోని పలు విభాగాల్లో నియామకాలు ఆశావహంగా ఉంటాయని తెలిపింది.కీలక నైపుణ్యాలు కలిగిన.. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలైటిక్స్, క్లౌడ్ టెక్నాలజీలకి డిమాండ్ 30–35 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. డిమాండ్‌లో పెరుగుదల కేవలం ఈ నైపుణ్యాలకు మాత్రమే పరిమితం కాదని, టెక్నాలజీ నైపుణ్యాలను పెంచుకోవడంపైనా దృష్టి సారించాలని పేర్కొంది.మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తమ మానవవనరులను అవసరమైన నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వడంపై కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించింది. పెద్ద కంపెనీలకు ఇప్పటికీ క్యాంపస్ నియామకాలు ప్రాధాన్యంగా కొనసాగుతాయని, 2024–25 ద్వీతీయ ఆరు నెలల్లో ఇవి చురుగ్గా నియామకాలు చేపట్టొచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌తో మాకు పోలికేంటి.. గూగుల్ సీఈవో కామెంట్స్ఏఐ, ఎంఎల్, డేటా అనలైటిక్స్, పైథాన్, క్లౌడ్ టెక్నాలజీలకు నెలకొన్న అధిక డిమాండ్ 2025లో ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు పెరిగేందుకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు), తయారీ, బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్ కంపెనీలు సైతం 30–35 శాతం అధికంగా ఐటీ నిపుణులను తీసుకోవచ్చని అంచనా వేసింది. -
సహకార రంగంలో 11 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: దేశ సహకార రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. 2030 నాటికి నేరుగా 5.5 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది. అదే విధంగా మరో 5.6 కోట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. ఈ వివరాలను మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘ప్రైమస్ పార్ట్నర్స్’ వెల్లడించింది. ‘భారత సహకార విప్లవం’ పేరుతో సహకార రంగంపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.భారత కోపరేటివ్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దదంటూ.. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సహకార సొసైటీల్లో 30 శాతం మనదగ్గరే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘భారత్ 2030 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అలా చూస్తే సహకార రంగం ఆశావాదానికి, సామర్థ్యానికి ఆధారంగా కనిపిస్తోంది’’అని ఈ నివేదిక పేర్కొంది. సహకార రంగానికి ఉన్న అపార సామర్థ్యాలను ఆర్థిక వృద్ధికి, సామాజిక సమానత్వానికి, సమ్మిళితాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కేవలం ఒక విభాగం కాదంటూ, సమాజ పురోగతికి, శ్రేయస్సుకు శక్తిమంతమైన చోదకంగా నిలుస్తుందని పేర్కొంది.ఉపాధికి చిరునామా: ‘‘ఉపాధి కల్పనలో సహకార రంగం వాటా 2016–17 నాటికి 13.3 శాతానికి చేరింది. 2007–08 నాటికి ఈ రంగంలో 12 లక్షలుగా ఉన్న ఉపాధి అవకాశాలు, 2016–17 నాటికి 58 లక్షలకు చేరాయి. 18.9 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. 2030 నాటికి కోపరేటివ్‌లు 5.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనున్నాయి. 5.6 కోట్ల మందికి స్వయం ఉపాధి లభించనుంది’’అని ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈ రంగం కల్పించే స్వయం ఉపాధి అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించింది.‘‘2006–07 నాటికి సహకార రంగం 1.54 కోట్ల మందికి స్వయం ఉపాధి కల్పించగా, 2018 నాటికి ఇది 3 కోట్లకు విస్తరించింది. స్వయం ఉపాధికి కోపరేటివ్‌లు మూలస్తంభాలు. ఏటా 5–6 శాతం చొప్పున పెరిగినా 2030 నాటికి 5.6 కోట్ల మేర స్వయం ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఏర్పడనున్నాయి’’అని వివరించింది. 2030 నాటికి జీడీపీకి 3–5 శాతం వాటాను సమకూరుస్తుందని అంచనా వేసింది.ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కూడా కలిపి చూస్తే జీడీపీలో 10 శాతంగా ఉంటుందని తెలిపింది. సహకార రంగాన్ని ఆధునికీకరించడంతోపాటు విధానాల క్రమబద్ధీకరణ, సహకార ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు దిశగా 2021లోనే కేంద్ర సహకార శాఖ పలు చర్యలు ప్రకటించడం గమనార్హం. 29 కోట్ల సభ్యులతో 8.5 లక్షల కోపరేటివ్‌లు స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్యయుతంగా నడిచేందుకు వీలుగా వాటికి నిధుల సా యంఅందించి, సొం తంగా నిల దొక్కుకునేలా చూడాలని నివేదిక సూచించింది. -
ఫైబర్ టెక్‌లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్‌సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు. -
భారతీయుల చూపు ఆ్రస్టేలియా వైపు!
సాక్షి, హైదరాబాద్: ఖలిస్తానీ వేర్పాటువాదుల కారణంగా ఇటీవల కెనడాతో భారత్ సంబంధాలు దెబ్బతినటంతో ఆ దేశానికి ఉద్యోగాల కోసం, ఉన్నత విద్యకోసం వెళ్లాలని భావించిన భారతీయులు పునరాలోచనలో పడ్డారు. కెనడాలో ఉద్యోగావకాశాలు కూడా తగ్గిపోవటంతో మరో సురక్షితమైన, అపార అవకాశాలు ఉన్న దేశం కోసం చూస్తున్నారు. అలాంటివారికి ఇప్పుడు ఆస్ట్రేలియా అవకాశాల గనిలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగార్థులకు తమ దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ కమిషన్ కమిషనర్ విక్ సింగ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా’లో పాల్గొనేందుకు వచ్చిన సింగ్.. ఆ్రస్టేలియాలో ఇక్కడి విద్యార్థులకు ఉన్న అవకాశాల గురించి ‘సాక్షి’కి వివరించారు. పోస్ట్ స్టడీ వర్క్ చేసుకునే వీలు.. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ వర్క్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా వీసా జారీ చేస్తున్నామని విక్ సింగ్ చెప్పారు. వేరే దేశాలవారికి రెండున్నరేళ్ల పాటు పనిచేసుకునే వీలు కల్పిస్తుండగా, భారతీయ విద్యార్థులకు అదనంగా మరో ఏడాది పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. ఇరు దేశాల మధ్య ఎక్టా ద్వైపాక్షిక ఒప్పందం నేపథ్యంలో ఈ అవకాశం ఇచ్చామని తెలిపారు. చదువుకునే సమయంలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని గుర్తుచేశారు. పర్యాటకులకు కూడా అద్భుతమైన అనుభూతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఎన్నెన్నో అవకాశాలు.. ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు తమ ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించేందుకు సానుకూలంగా ఉందని విక్ సింగ్ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత అద్భుతమైన ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ‘సైన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, బిజినెస్, హెల్త్ రంగాలతోపాటు క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి వినూత్న కోర్సులు చదివేందుకు భారతీయ విద్యార్థులు ఆ్రస్టేలియాకు వస్తుంటారు. మా దేశంలోని 43 యూనివర్సిటీల్లో దాదాపు సగం వరకు వరల్డ్ టాప్ 200 జాబితాలో ఉన్నాయి. టాప్ 100 జాబితాలో 9, టాప్ 20 జాబితాలో మూడు ఆస్ట్రేలియా వర్సిటీలు ఉన్నాయి. నవకల్పనల్లో (ఇన్నోవేషన్) ఆస్ట్రేలియా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మనమంతా వాడుతున్న వైఫైని ఆస్ట్రేలియాలోనే కనిపెట్టారు. ఆస్ట్రేలియా వర్సిటీల్లో చదివిన విద్యార్థులకు ప్రపంచంలో ఎక్కడైనా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మా దేశంలో స్కూల్ స్థాయి నుంచే ఏఐని వినియోగిస్తున్నాం’అని వివరించారు. -
నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సంయుక్తంగా ఎస్ఎమ్ కేర్, హాలో లాంగ్వేజ్ సంస్థలతో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన నర్సింగ్ అభ్యర్థులకు ఉచితంగా జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వనున్నట్టు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ వివరించారు. ఆరు నెలల్లో ఏ1, ఏ 2, బీ1, బీ2 దశల్లో శిక్షణ ఇచ్చి, బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి జర్మనీలోని ఆస్పత్రుల్లో ఎస్ఎం కేర్ సంస్థ ద్వారా నియమిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు విమాన టికెట్లు, వీసా, డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతో పాటు రెండు సంవత్సరాల కనీస అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులని వివరించారు. -
ఎన్సీఎస్ పోర్టల్‌లో అమెజాన్ జాబ్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగావకాశాల వివరాలు ఇక నుంచి నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో దర్శనమీయనున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో అమెజాన్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదైన అభ్యర్థులు అమెజాన్ చేపడుతున్న నియామకాల వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవచ్చు.మోడల్ కెరీర్ సెంటర్స్ వద్ద జాబ్ ఫెయిర్స్ సైతం కంపెనీ నిర్వహించనుంది. ఇందుకు మంత్రిత్వ శాఖ సాయం చేయనుంది. ఇలా ఒప్పందం చేసుకున్న తొలి ఈ–కామర్స్ కంపెనీ తామేనని అమెజాన్ తెలిపింది. ఎస్సీఎస్ పోర్టల్‌లో ప్రస్తుతం 60 లక్షల పైచిలుకు ఉద్యోగార్థులు, 33.5 లక్షల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రతిభను పెంపొందించడంలో అమెజాన్ నిబద్ధత దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుందని విశ్వసిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మండావియా అన్నారు. -
కాంబోడియా సైబర్ కేసులో కీలక అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కాంబోడియాలో అత్యధిక వేతనాలతో కొలువులు ఆశగాచూపి.. అక్కడకు వచి్చన యువకులను సైబర్ నేర ముఠాలకు అప్పగిస్తున్న ఓ కీలక వ్యక్తిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతానికి చెందిన నిందితురాలు ప్రియాంక శివకుమార్ సిద్దును అరెస్టు చేసినట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు.. అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ, సాయి ప్రసాద్‌ల నుంచి ముంబైకి చెందిన ప్రియాంక ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున కమీషన్ తీసుకుని కాంబోడియా పంపింది. అక్కడ చైనా సైబర్ ముఠాలు తమతో బలవంతంగా సైబర్ నేరాలు చేయించారని, మానసికంగా, శారీరకంగానూ హింసించినట్టు భారత్‌కు తిరిగి వచి్చన ఇద్దరు బాధితులు టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశారు. దీనిపై టీజీసీఎస్బీ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాంబోడియాకు అమాయకులను తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న 30 ఏళ్ల ప్రియాంకను అరెస్టు చేశారు. సైబర్ ముఠాల నుంచి కమీషన్.. ప్రియాంక తొలుత మాక్స్వెల్ అనే ఓవర్సీస్ జాబ్ ప్రాసెసింగ్ ఏజెన్సీలో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. తర్వాత ఆ ఏజెన్సీ మూతపడడంతో ఎలాంటి అనుమతులు లేకుండా తానే స్వయంగా ఓ ఏజెన్సీని ప్రారంభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు తెరతీసింది. ముంబైలో ఇదే విధంగా ఏజెన్సీ నడుపుతున్న నారాయణ అనే వ్యక్తి ఇచి్చన సమాచారంతో ప్రియాంక కాంబోడియాకు వెళ్లి అక్కడ చైనా కంపెనీ ఝాన్జీ ఎండీ జితేందర్‌సింగ్‌ను కలిసింది. సైబర్ నేరాలు చేసేందుకు మనుషులను తనకు అప్పగిస్తే ఒక్కొక్కరికి 500 యూఎస్ డాలర్లు కమీషన్ ఇచ్చేలా వారితో ఒప్పందం చేసుకుంది. తొలుత ఇద్దరినికాంబోడియాకు పంపింది. అది విజయవంతం కావడంతో సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో కాంబోడియాలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని పెద్దఎత్తున ప్రకటనలు ఇచి్చంది. అవి నమ్మిన అమాయకులను కాంబోడియా చైనా సైబర్ క్రైం ముఠాల వద్దకు ప్రియాంక పంపినట్టు టీజీసీఎస్బీ అధికారులు గుర్తించారు. ఇలా కాంబోడియాకు వెళ్లిన అమాయకులను అక్కడి చైనా సైబర్ క్రైం ముఠాలకు అప్పగిస్తున్నారు. సైబర్ నేరాలు చేసేలా బాధితులను సదరు ముఠాలు మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నాయి. ఈ ముఠా నుంచి అతికష్టం మీద తప్పించుకుని తిరిగి వచి్చన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో టీజీసీఎస్బీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఇచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. -
నిరుద్యోగ భారత్
సాక్షి, హైదరాబాద్: ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగిత శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. గత మే నెలలో 6.3 శాతం ఉండగా, జూన్ నాటికి 9.2 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే..గ్రామీణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత శాతంగా అధికంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో డిమాండ్ తగ్గడంతో అక్కడ పనులు చేసుకునేవారిలో నిరుద్యోగం పెరిగింది.అదే సమయంలో ఆర్థిక రంగం దిగజారడం, ఇతర అంశాల కారణంగా పట్టణాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ వచ్చినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో నిరుద్యోగశాతం 6.3 ఉండగా, జూన్‌లో 9.3కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో చూస్తే...మే నెలలో 8.6 ఉండగా, జూన్ నాటికి 8.9 శాతానికి పెరిగింది. ⇒ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా రెండుచోట్లా మహిళల్లోనే నిరుద్యోగమనేది ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ⇒ దేశవ్యాప్తంగా మహిళల విషయానికొస్తే... పట్టణ ప్రాంతాల్లో 21.36, గ్రామీణ ప్రాంతాల్లో 17.1 శాతం నిరుద్యోగులు ఉన్నారు. ⇒ పురుషుల విషయంలో నిరుద్యోగిత శాతం పట్టణ ప్రాంతాల్లో 8.9, గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతంగా ఉంది. ⇒ 2023 జూన్‌లో నిరుగ్యోగ శాతం 8.5 ఉండగా, ఈ ఏడాది ఇదే సమయానికి 9.2 శాతానికి పెరిగింది. ⇒ కన్జూమర్ పిరమిడ్స్ హోస్‌హోల్డ్ సర్వేలోని గణాంకాల ప్రాతిపదికగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఆయా వివరాలు వెల్లడించింది.జనవరి–మార్చి మధ్యలో 6.7 శాతం... పీఎల్ఎఫ్ఎస్ సర్వేదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యలో 6.7గా నిరుద్యోగశాతం ఉన్నట్టుగా పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) పేర్కొంది. 2013లో 5.42 శాతమున్న నిరుద్యోగ శాతం, కరోనా పరిస్థితుల కారణంగా 2020లో 8 శాతానికి, ఆ తర్వాత 2021లో 5.98 శాతానికి తగ్గి, 2022లో 7.33 శాతానికి, 2023లో 8.4 శాతానికి, 2024లో తొలి ఆరునెలల్లో 6.7 శాతానికి (జూన్‌లో 9.2 శాతానికి) చేరుకున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.15–29 ఏజ్ గ్రూప్ నిరుద్యోగంలో మూడోప్లేస్ దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అత్యధిక నిరుద్యోగ శాతమున్న రాష్ట్రంగా కేరళ నిలవగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో ఈ ఏజ్ గ్రూప్ నిరుద్యోగుల్లో టాప్‌ఫైవ్ రాష్ట్రాలు కేరళ 31.8 శాతం, జమ్మూ,కశ్మీర్ 28.2, తెలంగాణ 26.1, రాజస్థాన్న్ 24, ఒడిశాలో 23.3 శాతం ఉన్నట్టు వెల్లడైంది.దేశవ్యాప్తంగా ఈ ఏజ్‌గ్రూప్‌లో మొత్తంగా నిరుద్యోగిత శాతం జనవరి–మార్చి మధ్యలో 17 శాతంగా (అంతకు ముందు అక్టోబర్–డిసెంబర్ల మధ్యలో పోల్చితే 16.5 శాతం నుంచి) ఉంది. ఇక ఏజ్ గ్రూపుల వారీగా చూస్తే (అన్ని వయసుల వారిలో నిరుద్యోగ శాతం) నిరుద్యోగిత శాతం 6.7 శాతంగా ఉంది.నిరుద్యోగానికి ప్రధాన కారణాలు...⇒ అధిక జనాభా⇒ తక్కువ స్థాయిలో చదువు, నైపుణ్యాల కొరత (ఒకేషనల్ స్కిల్స్)⇒ప్రైవేట్‌రంగ పెట్టుబడులు తగ్గిపోవడం⇒వ్యవసాయరంగంలో తక్కువ ఉత్పాదకత ⇒చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు, ప్రభుత్వ సహాయం కొరవడటం⇒మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిరంగాల్లో పురోగతి సరిగ్గా లేకపోవడం⇒అనియత రంగం (ఇన్ఫార్మల్ సెక్టార్) ఆధిపత్యం⇒ కాలేజీల్లో చదివే చదువు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరం పెరగడంమహిళల్లో అత్యధిక నిరుద్యోగ శాతంలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్ఈ ఏడాది జనవరి–మార్చి నెలల మధ్యలో వివిధ వయసుల వారీగా నిరుద్యోగిత శాతంపై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేçషన్ (ఎంఎస్‌పీఐ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో ఇవి వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళల్లో అత్యధిక నిరుద్యోగుల శాతంలో తెలంగాణ 38.4 శాతంతో నాలుగో స్థానంలో నిలిచినట్టు ఈ సర్వే వెల్లడించింది. మహిళల్లో అత్యధికంగా నిరుద్యోగులు అంటే 48.6 శాతంతో జమ్మూ కశ్మీర్ మొదటిస్థానంలో నిలవగా...కేరళ 46.6 శాతంతో రెండోస్థానంలో, ఉత్తరాఖండ్ 39.4 శాతంతో మూడోస్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ 35.9 శాతంతో ఐదో స్థానంలో నిలిచాయి. ⇒ పురుషుల్లో అత్యధిక నిరుద్యోగిత శాతమున్న రాష్ట్రంగా 24.3 శాతంతో కేరళ మొదటి స్థానంలో, బిహార్ 21.2 శాతంతో రెండోస్థానం, ఒడిశా, రాజస్తాన్‌లు 20.6 శాతంతో మూడో స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 19.6 శాతంతో నాలుగోస్థానంలో నిలిచాయి.ఏ అంశాల ప్రాతిపదికన...⇒16 ఏళ్లు పైబడినవారు పరిగణనలోకి⇒ నెలలో నాలుగువారాలపాటు పనిచేసేందుకు అందుబాటులో ఉండేవారు⇒ఈ కాలంలో ఉపాధి కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారు⇒ ఉపాధి కోల్పోయి మళ్లీ పనికోసం చురుగ్గా వెతుకుతున్నవారు.నిరుద్యోగుల శాతం లెక్కింపు ఇలా...నిరుద్యోగిత శాతం = నిరుద్యోగుల సంఖ్య/ఉద్యోగులు, ఉపాధి పొందిన సంఖ్య + నిరుద్యోగుల సంఖ్య -
ఈ–కామర్స్, బీఎఫ్ఎస్ఐ, హాస్పిటాలిటీలదే జోరు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో విభిన్నరంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగైనట్టుగా వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోల్చితే మొదటి 4 నెలల్లో 31 శాతం జాబ్ పోస్టింగ్స్ పెరిగినట్టు వెల్లడైంది. ఉద్యోగ అవకాశాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా ఆర్థికరంగం తిరిగి పుంజుకోవడంతోపాటు, జాబ్ సెక్టార్ల పురోగతితో జాబ్ మార్కెట్ పుంజుకుంటున్నదని జాబ్స్ అండ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అప్నా.కో తాజా అధ్యయనం వెల్లడించింది. ⇒ ఈ–కామర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్విసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హాస్పిటాలిటీలదే జోరు అని అప్నా.కో నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఈ–కామర్స్ 21 శాతం, బీఎఫ్ఎస్ఐ 17 శాతం, హాస్పిటాలిటీ రంగాల్లో 13 శాతం మేర ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు తెలిపింది. ⇒ సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బ్రాండ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ డొమైన్లలో వృత్తి నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా పేర్కొంది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఈ రంగాల్లో 23 శాతం వృద్ధి నమోదైనట్టుగా, ఆయా రంగాల్లో జాబ్ పోస్టింగ్‌ల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ముందువరుసలో నిలుస్తున్నట్టుగా తెలిపింది. ⇒ లక్నవూ, కోయంబత్తూరు, గ్వాలియర్ వంటి రెండో, మూడో శ్రేణి నగరాల్లో నూ డిజిటలైషన్ అమలు చేస్తుండడంతో ఆయా నగరాల్లోనూ జాబ్పోస్టింగ్స్ పెరుగుతున్నాయని చెప్పింది. ⇒ తమ కంపెనీకి సంబంధించినంత వరకు చూసినా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కొత్తగా ఉద్యోగార్థుల (ఫ్రెష్ అప్లికెంట్స్) నుంచి ‘జాబ్అప్లికేషన్లు’21 శాతం పెరిగినట్టు, వారిలో మహిళలే 18 శాతం ఉన్నట్టుగా ఈ సంస్థ తెలిపింది. గతేడాదితో పోల్చితే 2024లో జనవరి–ఏప్రిల్ల మధ్య జాబ్ అప్లికేషన్స్ 15 శాతం పెరుగుదల నమోదైనట్టు (1.7 కోట్లు పెరుగుదల) అప్నా.కో ఈ నివేదికలో పేర్కొంది. -
Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!
400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్ ఓటర్స్‌లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్‌సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఉచితాలు అనుచితాలే...! కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్‌లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్‌కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి రోహిత్ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! ఔత్సాహిక జర్నలిస్టు...సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్ ఠాకూర్ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్ చెప్పుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్‌లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్‌లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్‌ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్‌గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్‌కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్‌పై నాకున్న ప్యాషన్‌ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్‌లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
ఆధ్యాత్మిక పర్యాటకంతో ఉపాధి
ముంబై: ఆధ్యాత్మిక పర్యాటకంతో వచ్చే 4–5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సరీ్వసెస్ తెలిపింది. భారత్‌లో ఈ రంగం 2023–30 మధ్య ఏటా 16 శాతం వృద్ధి చెందుతుందని సంస్థ సీఈవో సచిన్ అలుగ్ ఒక అంచనాగా చెప్పారు. ‘దేశీయ టూరిజంలో ఆధ్యాత్మిక పర్యాట కం వాటా ఏకంగా 60 శాతముంది. 2028 నాటికి ఈ విభాగం 60 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగలదు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగ అవకాశాలకు కొత్త వేదికలను సృష్టిస్తుంది. కోవిడ్ మహ మ్మారి తర్వాత యాత్రలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021–22లో ఆధ్యాత్మిక చందాలు 14 శాతం అధికం అయ్యాయి. అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామ్ మందిర్‌తో ఆధ్యాత్మిక పర్యాటకానికి జోష్ నింపనుంది. ఒక్క రామ్ మందిర్ రాక కారణంగా వంటవారు, ఫ్రంట్ డెస్క్ మేనేజర్, హౌజ్‌కీపింగ్, టూర్ గైడ్స్ వంటి సుమారు 25,000 జాబ్స్ కొత్తగా రానున్నాయి. ఆహార సేవలు, కంజ్యూమర్ గూడ్స్, ఆతిథ్యం, రవాణా, మతపర ఉత్పత్తులు, చేతివృత్తులు, వ్రస్తాలు, సరుకు రవాణా, గిడ్డంగులు, ప్యాకింగ్ తదితర విభాగాల్లో కొత్తగా వ్యాపార అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకులకు ప్రత్యేకంగా సేవలందించే కొత్త సంస్థల సంఖ్యలో 6–8 శాతం పెరుగుదల అంచనా వేస్తున్నాము’ అని వివరించారు. -
4 ఏళ్లలో భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది. -
నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు!
పండుగ సీజన్ అనగానే వ్యాపారాలు పెరుగుతాయని అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తాయి. ఇందులో భాగంగానే ‘మీషో’ (Meesho) దాదాపు 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈకామ్ ఎక్స్‌ప్రెస్, డీటీడీసీ, ఎలాస్టిక్ రన్, లోడ్‌షేర్, డెలివరీ, షాడోఫ్యాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వంటి మరిన్ని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కొలాబరేషన్ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించాలని మీషో భావిస్తోంది. ఇందులో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు టైర్ 3, 4 ప్రాంతాల్లో రానున్నట్లు సమాచారం. పండుగ సీజన్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఫుల్ఫిల్మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్ష్ సీఎక్స్ఓ సౌరభ్ పాండే అన్నారు. ఇదీ చదవండి: గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫిదా అవుతున్న నెటిజన్లు! మీషో సెల్లర్స్ పండుగ సీజన్లో 3 లక్షల మందికి పైగా సీజనల్ వర్కర్స్‌ను నియమించుకుంటారు. మీషో 80 శాతం మంది విక్రేతలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి, ఫ్యాషన్ యాక్ససరీస్, పండుగ అలంకరణ వంటి కొత్త కేటగిరీలను వెంచర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెరిగిన డిమాండ్‌ను ఆర్గనైజ్ చేయడానికి మీషో అదనపు స్లోరేజ్ స్పేస్ అద్దెకు తీసుకోవడంపై ద్రుష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం పండుగ నియామకాలు గిగ్ జాబ్‌లలో గణనీయమైన వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు టీమ్‌లీజ్ తెలిపింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ వంటి టైర్-1 నగరాలతోపాటు టైర్ 3 నగరాల్లో కార్యకలాపాలను మరింత పెంచడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఇప్పటికే వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తన సప్లై చైన్‌లో 1,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్‌కు ముందు, పండుగ సీజన్లో కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి ఫ్లిప్‌కార్ట్ తన పాన్-ఇండియా సప్లై చెయిన్‌లో మిలియన్ల కొద్దీ సీజనల్ ఉద్యోగాలను నియమించుకోవాలని చూస్తోంది. -
Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్‌గార్ మేళాలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. కోట్లాది కొత్త కొలువులు దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు. వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్ రక్షకులు’గా అభివరి్ణంచారు. -
పనిమంతులకు ‘పండుగే’.. హైదరాబాద్, విజయవాడల్లో డిమాండ్
► పండుగల సీజన్ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. – లోహిత్ భాటియా, ప్రెసిడెంట్–వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్, క్వెస్ సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న పండుగల సీజన్ వివిధ రంగాల్లో అవకాశాలకు తలుపులు తెరుస్తూ ఉద్యోగార్థుల్లో నయాజోష్ ను నింపుతోంది. ఈ నెలాఖరులో ‘రక్షాబంధన్’తో మొదలై కొత్త ఏడాది, ఆపై కాలం వరకు సుదీర్ఘ ఫెస్టివల్ సీజన్ జోరు కొనసాగనుంది. ఈ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని... వివిధ వర్గాల వినియోగదారుల పండుగ మూడ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు, సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వివిధ రంగాల్లో సేవలందించే ఉద్యోగులకు కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్టుగా పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఇదీ అధ్యయనం..: రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని గడిచిన ఏప్రిల్ నుంచి ఈనెల ఆగస్టు వరకు స్టాఫ్ డిమాండ్ 23 శాతం పెరిగినట్టుగా ప్రముఖ బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడర్ సంస్థ క్వెస్ తాజా పరిశీలనలో వెల్లడైంది. ఈ కాలంలోనే 32 వేల ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడడంతో పాటు ఏడాది చివర్లో పండుగల సీజన్ ముగిసే దాకా ఈ– కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్ తదితరాల్లో ప్రతీనెల 5 వేల చొప్పున ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, టెలికం తదితర రంగాలు, విభాగాల్లో అవకాశాలు పెరిగినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్–ఆగస్టు మధ్యకాలంతో పోల్చితే ఈ ఏడాది అదే కాలంలో ‘మాన్యుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్ సెగ్మెంట్’లో 245 శాతం మేర వృత్తినిపుణుల డిమాండ్ పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. రిక్రూట్మెంట్ విషయానికొస్తే...దసరా, దీపావళి పండుగల సందర్భంగా అత్యధికంగా వాహనాల కొనుగోలుకు మొగ్గు నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ ముందంజలో (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా) ఉంది. ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా... బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ (బీఎఫ్ఎస్ఐ)కి సంబంధించి మ్యాన్‌పవర్ కోసం 27 శాతం డిమాండ్, టెలికాం రంగంలో 14 శాతం డిమాండ్ పెరిగినట్టు తెలిపింది. హైదరాబాద్ సహా మెట్రోలు, విజయవాడల్లో డిమాండ్ ఈ పండుగల సీజన్ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల సేవలు, నూతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో, తదనుగుణంగా అవసరమైన ‘మ్యాన్‌పవర్’అందించడంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోనగరాలతో పాటు నోయిడా, పుణె నగరాలు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నట్టు క్వెస్ పరిశీలన వెల్లడించింది. వీటికి ఏమాత్రం వెనకబడకుండా విజయవాడ, కోయంబత్తూరు, జంషెడ్పూర్, రాంఛీ వంటి నగరాల్లోని వివిధరంగాలకు చెందిన వర్క్‌ఫోర్స్‌కు మంచి ఉద్యోగ అవకాశాలున్నట్టు తెలిపింది. ఏ ఉద్యోగాలకు డిమాండ్ అధికం అంటే.. ప్రొడక్షన్ ట్రైనీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్ బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ–కామర్స్, లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో దాదాపు మూడులక్షల దాకా ఉద్యోగులకు అవకాశాలు కల్పించే అంచనాలతో ముందువరసలో నిలుస్తోంది. ఇందులో భాగంగానే వేర్‌హౌస్, డెలివరీ ఆపరేషన్స్ వంటివి కూడా అంతర్భాగంగా ఉంటాయి. పండుగల సీజన్ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. –లోహిత్ భాటియా, ప్రెసిడెంట్–వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్, క్వెస్ -
ఐటీ కొలువులకు ‘వింగ్స్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా విశాఖపట్నం భాసిల్లుతోంది. త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా కూడా ప్రత్యేకతను సంతరించుకోనున్న విశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ హబ్‌గా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీచ్ ఐటీ కాన్సెప్్టని ప్రమోట్ చేస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు విశాఖ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో ఐటీ సంస్థల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సహకారంతో విశాఖలో జాబ్ ఫెయిర్ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జూలై 21, 22 తేదీల్లో గ్రూప్ స్నాప్ ఫెస్ట్–2023 పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు హాజరుకానున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్, వెబ్‌సైట్‌ని విశాఖలో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీస్ (ఎపిటా), వి ఇన్ఫో టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో దిగ్గజ సంస్థల కార్యకలాపాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 300కి పైగా ఐటీ కంపెనీలుండగా.. ఇందులో 80 శాతం వరకు విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 28న దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. డెవలప్మెంట్ సెంటర్‌ని ప్రారంభించనుంది. ఇదే బాటలో టాటా కన్సల్టెన్సీ సర్వి సెస్ (టీసీఎస్), విప్రో కూడా పయనించనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్‌కు, ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలకు మధ్య బాండింగ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తోంది. ఎపిటా, రాష్ట్ర ఐటీ విభాగం సహకారంతో వి ఇన్ఫో టెక్నాలజీస్ ఆధ్వర్యంలో గ్రూప్ స్నాప్ ఫెస్ట్–2023ని నిర్వహించనుంది. ఐటీ, ఐటీ అనుబంధ రంగ కంపెనీలకే కాకుండా.. ఫార్మా సంస్థలు, స్టార్టప్ సంస్థలకు ఏ విధమైన నైపుణ్యాలున్న మానవ వనరులు అవసరం?.. ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఎలాంటి కోర్సులు చేయాలి? టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవాలి వంటి అంశాలను గ్రాడ్యుయేట్స్‌తో పాటు 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ‘స్ప్రెడ్ యువర్ వింగ్స్’ అనే పేరుతో రెండు రోజుల పాటు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన యువత నుంచి సీవీలు తీసుకొని.. అక్కడే ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఎంపికైనవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్ ఫెయిర్‌కు టెక్ మహీంద్ర, టీసీఎస్, ఎల్ అండ్ టీ, కాన్సెంట్రిక్స్, కాండ్యుయెంట్, చెగ్, డబ్ల్యూఎన్ఎస్, సెయింట్, పాత్రా, ఫ్లూయెంట్‌గ్రిడ్, పల్సస్ వంటి 40 వరకూ ఐటీ, అనుబంధ కంపెనీలు, పైజర్, అరబిందో వంటి 10 ఫార్మా సంస్థలు, 54 యూనివర్సిటీలు, కళాశాలలతో పాటు 10 స్టార్టప్ కంపెనీలు హాజరు కానున్నాయి. విశాఖ ఐటీలో అపార అవకాశాలు.. విశాఖ ఐటీలో అపార అవకాశాలున్నాయి. కానీ.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలన్న అంశంపై గ్రాడ్యుయేట్స్‌కు సందేహాలున్నాయి. ఐటీ సంస్థలకు కూడా మానవవనరుల కొరత ఉంది. వాటిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నాం. విశాఖ నగరంలో ఉన్న ఐటీ కంపెనీల గురించి అందరికీ తెలియజేయడం ఒక లక్ష్యం కాగా.. వాటిలో ఉపాధి అవకాశాలను ఇక్కడి యువతకు కల్పించడాన్ని మరో లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి సంస్థ 15 నిమిషాల పాటు విద్యార్థులతో అనుసంధానమవుతుంది. తమ సంస్థ గురించి తెలియజేయడమే కాకుండా.. అందులో ఉద్యోగం సాధించేందుకు ఎలాంటి అర్హతలు కావాలో అవగాహన కల్పిస్తాయి. ప్రభుత్వం బీచ్ ఐటీ విధానం తీసుకొచ్చాక విశాఖలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. – సాయికుమార్, సీఈవో, వి ఇన్ఫో టెక్నాలజీస్ -
యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
గుణదల(విజయవాడ తూర్పు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా యూజీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) కోర్సుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు దేశ, విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన యూజీ ఆనర్స్ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ఉన్న త విద్యా మండలి మార్గదర్శకాల ప్రకారం యూజీ ఆనర్స్ కోర్సుపై ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పెద్ద ఎత్తున విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యావేత్తలు, మేధావులు వివరిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్య అభ్యసించవచ్చని, విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెబుతున్నారు. దీంతో యూజీ ఆనర్స్‌పై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోంది. కోర్సులు ఇలా... బీఏ ఆనర్స్ : హిస్టరీ, టూరిజం మేనేజ్మెంట్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ ఇంగ్లిష్, స్పెషల్ తెలుగు ఒక మేజర్ సబ్జెక్ట్‌గా ఉంటాయి. ఈ కోర్సులోనే మైనర్ సబ్జెక్టులుగా సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఉంటాయి. బీఎస్సీ ఆనర్స్: కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్, నానో టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, బోటనీ, హారి్టక ల్చర్, జువాలజీ, అగ్రికల్చర్, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. మైనర్ సబ్జెక్టులుగా ఫుడ్ టెక్నాలజీతోపాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు ఆధారంగా మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. బి.కాం ఆనర్స్: బి.కాం జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బీబీఏ జనరల్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, అకౌంట్స్ అండ్ టాక్సెస్ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. యూజీ ఆనర్స్ మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. రెండో ఏడాది పూర్తి చేసిన వారికి డిప్లొమా వస్తుంది. మూడేళ్లు పూర్తి చేస్తే డిగ్రీ, నాలుగో ఏడాది ఉత్తీర్ణులైతే ఆనర్స్ పట్టా పొందుతారు. నాలుగేళ్లు ఆనర్స్ పూర్తి చేసిన తర్వాత పీజీ ఏడాది చదివితే నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విద్యా విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. యువత ఉన్నత భవిష్యత్తుకు నూతన కోర్సులు బంగారు బాటలు వేస్తాయి. – డాక్టర్ భాగ్యలక్ష్మి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, విజయవాడ -
పాలిటెక్నిక్‌తో.. కొలువు పక్కా!
విశాఖ విద్య: పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం వేసే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. పదో తరగతి తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు అభ్యసిస్తే చాలు మంచి ఉద్యోగావకాశాలు తలుపు తడుతున్నాయి. అంతేకాకుండా డిప్లొమా పూర్తి చేశాక ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్ సెకండియర్‌లో చేరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు చదివేవారికి సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023–24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 వేల మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 250కి పైగా కాలేజీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్–2023లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఇటీవలే పూర్తయింది. విద్యార్థులు కళాశాలల్లో చేరికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోరుకున్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్ ఎంచుకునేలా సాంకేతిక విద్యాశాఖాధికారులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ నెల 12 నుంచి సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటిని ఈ నెల 24 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్‌తో దండిగా అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. పారిశ్రామికీకరణతో భవిష్యత్తులో సాంకేతిక కోర్సులు చేసిన వారికి దండిగా ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. మూడేళ్లలోనే చేతికొచ్చే డిప్లొమా సర్టిఫికెట్తో ఉపాధి లేదా ఉద్యోగం పొందే వీలు ఉండటం.. అలాగే ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్‌లో సెకండియర్‌లో చేరే అవకాశం ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల బలోపేతం దిశగా.. పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెరగడంతో అధికారులు ప్రభుత్వ కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ అయ్యేలా దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అర్హులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇస్తుండటంతో గతంలో మూత పడిన కాలేజీలను సైతం ప్రైవేట్ యాజమాన్యాలు మళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమాణాలు లేని కళాశాలల్లో విద్యార్థులు చేరకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవగాహన సదస్సుల్లో భాగంగా కాలేజీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలపై వివరిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివి.. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సైతం సదస్సులకు ఆహ్వానించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు.. ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన వసతులున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అవగాహన సదస్సుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. – డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, అధ్యక్షుడు, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ అసోసియేషన్, విశాఖపట్నం -
భారీగా ఉపాధి అవకాశాలు.. ఎక్కడో తెలుసా?
ముంబై: 5జీ టెక్నాలజీ రాకతో ఉద్యోగాలకు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశీ టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాల్లో ఉద్యోగాల కల్పన, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ తదితర అంశాలపరంగా 5జీ టెక్నాలజీ సానుకూల ప్రభావం చూపనుంది. స్టాఫింగ్ సేవల కంపెనీ టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. (ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి? ) ఉద్యోగాల కల్పన, వ్యవస్థ మీద 5జీ ప్రభావాలపై నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 247 పైచిలుకు సంస్థలు అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందింది. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద టెలికం రంగానికి రూ. 12,000 కోట్లు కేటాయించడం, ఇందులో 25 శాతం మొత్తాన్ని కొత్తగా ఉద్యోగాల కల్పన కోసం పక్కన పెట్టడం తదితర అంశాలు ఉపాధి కల్పన, నైపుణ్యాల్లో శిక్షణ విషయంలో సానుకూల ప్రభావం చూపగలవని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఈవో (స్టాఫింగ్ విభాగం), కార్తీక్ నారాయణ్ తెలిపారు. 5జీ సామర్ధ్యాలను పూర్తిగా వెలికితీసేందుకు, అసాధారణ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించేందుకు, నవకల్పనలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► 5జీతో బీఎఫ్ఎస్ఐ రంగంపై 60 శాతం మేర, విద్య (48 శాతం), గేమింగ్ (48 శాతం), రిటైల్ .. ఈ–కామర్స్ 46 శాతం మేర సానుకూల ప్రభావం పడనుంది. ► 5జీ వినియోగం ప్రారంభించిన తొలి ఏడాదిలో భారీగా ఉద్యోగాల కల్పన జరగగలదని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► టెల్కోలు 5జీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడం, నెట్వర్క్ భద్రతను పెంచుకోవడం మొదలైన అంశాల వల్ల స్పెషలైజ్డ్ ఉద్యోగాల్లో నియామకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో టెక్నికల్ కంటెంట్ రైటర్లు, నెట్వర్కింగ్ ఇంజినీర్లు, ఏఐ/ఎంఎల్ నిపఉణులు, యూఎక్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజినీర్లు, సైబర్‌సెక్యూరిటీ స్పెషలిస్టులు, డేటా సైన్స్ .. అనలిటికల్ నిపుణులు మొదలైన వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం టెలికం పరిశ్రమలో డిమాండ్–సరఫరా మధ్య 28 శాతం మేర వ్యత్యాసం ఉంది. దీంతో సమగ్ర స్థాయిలో అత్యవసరంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించాల్సి ఉంటోంది. ఇదీ చదవండి: అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా? -
ఇంటర్నెట్ బిజినెస్‌లో అత్యధిక ఉద్యోగావకాశాలు
సాక్షి, అమరావతి: దేశంలో ఇంటర్నెట్ బిజినెస్ రంగం వేగంగా విస్తరిస్తోందని, ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉంటాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్– 2023 వెల్లడించింది. భారతదేశంలో ప్రస్తుతం 74.9 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్య 90 కోట్లకు చేరుతుందని రిపోర్ట్ స్పష్టం చేసింది. అత్యంత వేగంగా ఈ రంగం విస్తరిస్తోందని, భారతదేశం డిజిటల్ దిగ్గజంగా స్థిరపడేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇంజినీరింగ్, తయారీ రంగంలో పెట్టుబడులపై దృష్టి సారిస్తోందని, ఫార్మాస్యూటికల్ రంగం కూడా గణనీయంగా విస్తరిస్తోందని, ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఉపాధి అర్హతలో మహిళలే ముందు గత ఆరేళ్లుగా ఉపాధి అర్హత గల యువతలో మహిళలే అత్యధికంగా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. 2017లో ఉపాధి అర్హతగల మహిళా వనరులు 40.88 శాతం ఉంటే 2023లో అది 52.80 శాతానికి పెరిగింది. దేశం వ్యాప్తంగా ఉపాధి అర్హత కలిగిన మహిళా వనరులుండటం విద్యలో భారతదేశం సాధించిన విజయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్ వ్యాఖ్యానించింది. దేశంలో అత్యధిక ఉపాధి నైపుణ్యాలు ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువ దేశంలో గత ఆరేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అంచనావేసింది. 2017లో 40.44 శాతమే ఉద్యోగావకాశాలుండగా ఈ ఏడాది 50.3 శాతం మేరకు అది పెరిగాయని రిపోర్ట్ పేర్కొంది. కోవిడ్ సంక్షోభం కారణంగా మూడేళ్లు అంటే 2020 నుంచి 2022 వరకు దేశంలో ఉద్యోగావకాశాలు 46 శాతానికే పరిమితమయ్యాయి. గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఎక్కువగా కల్పించిన రంగాలు.. 2017 – ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్, మినరల్స్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఆటోమోటివ్స్. 2018 – బ్యాంకింగ్,ఫైనాన్స్, సర్వీస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్. 2019 – బీఎఫ్ఎస్ఐ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, మాన్యుఫ్యాక్చరింగ్. 2020 – బీఎఫ్ఎస్ఐ, ఐటీ, 2021 – బీఎఫ్ఎస్ఐ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఐటీ, ఇంటర్నెట్ బిజినెస్. 2022 – ఇంటర్నెట్ బిజినెస్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఐటీ, ఫార్మా -
మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం
(సాక్షి, అమరావతి): ఉద్యోగాల్లేవని ఒకరోజు... అప్పులు తెచ్చేస్తున్నారంటూ మరో రోజు... ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ ఇంకోరోజు!!. వార్త ఏదైనా అబద్ధమే అజెండా. రామోజీరావుకు నిజాలతో పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ఎవరు తప్పుబట్టినా... ‘ఈనాడు’ దృష్టిలో వాళ్లు ప్రముఖులు.. నిపుణులు.. సామాజికవేత్తలు!. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవంటూ సోమవారం పతాక శీర్షికలో వండిన కథనం ఈ కోవలోనిదే. వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో భాగమే. ఉద్యోగాలు, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తాలూకు వాస్తవాలివిగో... ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోని టాప్–5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం. ఈ మాట చెప్పింది వేరెవరో కాదు. రెండు నెలల కిందట మార్చిలో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఇండియా–2023 స్కిల్ నివేదిక’. ఇది... వాస్తవం. కానీ ‘ఈనాడు’ ఏం చెబుతోందంటే... రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు యువత వెళ్లిపోతున్నారని, దీంతో ఊళ్లలో వృద్దులే మిగులుతారని. అది కూడా సామాజిక వేత్తలు అంటున్నారని!!. అసలేంటి చెరుకూరి రామోజీరావు కడుపుమంట? ఇక్కడి పిల్లలు విదేశాలకు వెళ్లకూడదా? అక్కడ చదవకూడదా? ఉద్యోగాలు చేయకూడదా? ఏం! గతంలో ఆంధ్రప్రదేశ్ యువత విదేశాలకు వెళ్లలేదా? పై చదువుల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లటమనేది ఇప్పుడు మొదలైందేమీ కాదుకదా? అలాగే ఇతర రాష్ట్రాల నుంచీ అవసరాన్ని బట్టి మెరుగైన వేతనాల కోసం ఇక్కడకు తగిన నైపుణ్యాలున్న వారు వస్తున్నారు కదా!!. ఇంతటి సహజమైన ప్రక్రియకు రాజకీయాలు అంటగట్టి ఇప్పటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ‘ఈనాడు’కు ఇంకా దిగజారడానికి ఏమైనా ఉందా? కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన ఇండియా– 2023 స్కిల్ రిపోర్ట్‌లో దేశంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాల్గో స్థానంలో ఉందంటేనే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు ఇదే నివేదికలో... రాష్ట్రంలో సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు అద్భుతంగా మెరుగయ్యాయని కేంద్రం ప్రశంసించింది. వీటివల్ల 2022 సంవత్సరంలో అత్యధిక వృద్ధి సాధించినట్లు స్పష్టం చేసింది. ఈ వాస్తవాలను వదిలేసి బురద జల్లుతున్న ‘ఈనాడు’కు చంద్రబాబు సిండ్రోమ్ ముదిరిపోయిందన్నది పచ్చి నిజం. ఏపీలో 22 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం ఉందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం... 18 నుంచి 21 సంవత్సరాలు, 26 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉపాధి వనరులు కలిగిన రాష్ట్రాల్లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఇక్కడ అత్యధికంగా 93.50 మంది అభ్యర్ధులు ఇంటర్న్‌షిప్‌లు పొందుతుండగా... ఇంటర్న్‌షిప్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ది నెంబర్–1 స్థానం. ‘‘నైపుణ్యం లేని ఉద్యోగాలకన్నా ఏదైనా టాలెంట్ పూల్ ద్వారా ఉద్యోగాలను పొందాలని యువత కోరుకుంటోంది. రాబోయే సంవత్సరాల్లో టాలెంట్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ల విషయంలో ఏపీ ముందుంటుంది. బీఈ, బీటెక్, ఐటీఐ, ఎంఎస్సీ, బీసీఏ రంగాల్లో అత్యధిక అర్హత కలిగిన టాలెంట్ యువత స్కోరు 60 శాతం పైనే ఉంది.’’ అని నివేదిక తెలిపింది. ఇంకా ప్లేస్మెంట్లలో 2.6 లక్షలు, అంతకన్నా ఎక్కువగా వేతనాలు అందే రాష్ట్రాలోఏపీ మొదటి స్థానంలో ఉంది. చంద్రబాబు నాయుడి హయాంలో ప్లేస్మెంట్లు 37 వేలు మాత్రమే ఉంటే అదే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో 2021–22లో ప్లేస్మెంట్లు 85 వేలకు చేరాయి. పైపెచ్చు రాష్రంలో చంద్రబాబు హయాంలో 2018–19లో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా... ఇపుడది 4.2 శాతానికి తగ్గినట్లు స్వయంగా కేంద్ర కార్మికమంత్రిత్వ శాఖ ప్రకటించింది. బీఈఎల్ నూతన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించిన దృశ్యం (ఫైల్) హెచ్ఎస్బీసీ వెళ్లిపోయిందెప్పుడు రామోజీ? ఈ వాస్తవాలను విస్మరించిన ‘ఈనాడు’... ఎప్పుడో 2015లోనే దేశం వీడి వెళ్లిపోయిన హెచ్ఎస్బీసీని పట్టుకుని ఇప్పుడే వెళ్లిపోయిందంటూ అబద్దాలను వండేసింది. ఇక ఇన్ఫోసిస్, బీఈఎల్, అమెజాన్ డీసీ, డిక్సన్, డబ్లు్యఎన్ఎస్, ర్యాండ్‌స్టాడ్ వంటి దిగ్గజ సంస్థలు వచ్చి రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నా... వాటికి ప్రస్తావిస్తే ఒట్టు. పైపెచ్చు కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు!!. 2015లోనే హెచ్ఎస్బీసీ తన వ్యాపార వ్యూహంలో భాగంగా దేశంలో కార్యకలాపాలను మూసేసుకుని వెళ్లిపోతే ఇప్పుడే కొత్తగా విశాఖ నుంచి హెచ్ఎస్బీసి వెళ్లిపోయిందని... అది కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వల్లేనని ‘ఈనాడు’ రాసిందంటే జగన్ సర్కారుపై ఎంత కక్షతో వ్యవహరిస్తున్నదో అర్థంకాక మానదు. పెట్టుబడుల హబ్‌గా మారుతున్న ఏపీ ప్రైవేటు రంగంలో అత్యధిక ఉద్యోగాలిచ్చే సామర్థ్యం ఉన్న ఎంఎస్ఎంఈ రంగంలోనే... గడిచిన నాలుగేళ్ల రూ.24 వేల కోట్ల పెట్టుబడులతో పాటు 12.60 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. నిజానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) సమయానికిస్తేనే ఇవి బతికి బట్టకడతాయని బాబుకు తెలిసినా వీటిని పట్టించుకోలేదు. ఇన్సెంటివ్‌లను గాలికొదిలేశారు. బాబు నిర్లక్ష్యంతో దారుణంగా చితికిపోయిన ఈ రంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చి... ప్రోత్సాహకాలను సమయానికి ఇవ్వడమే కాకుండా... అలా ఇచ్చేందుకు పటిష్ఠమైన వ్యవస్థను తీసుకొచ్చింది. అందుకే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. ఇక భారీ పరిశ్రమల్లోనైతే 85 వేల మందికి ఉపాధి లభించింది. ఐటీ రంగంలో చంద్రబాబు హయాంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు, 14వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ ఈ నాలుగేళ్లలో జగన్ సార«థ్యంలో ఈ రంగంలో రూ.5,700 కోట్ల పెట్టుబడులు, 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ గణాంకాలన్నీ ఏ సామాజిక వేత్తలో, వైఎస్సార్సీపీ అభిమానులో చెబుతున్నవి కాదు. గణాంకాలన్నీ మదించి... కేంద్ర ప్రభుత్వం నివేదించినవి. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ... విప్లవం ప్రైవేట్ రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో సైతం గతంలో ఎన్నడూ లేనన్ని ఉద్యోగాలను ఈ ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల మంది ఉన్నారు. కానీ వైఎస్ జగన్ పాలనా పగ్గాలు చేపట్టాక ఈ సంఖ్య 6 లక్షలు దాటింది. అంటే... ఉన్న ఉద్యోగాల్లో 50 శాతాన్ని అదనంగా... అది కూడా ప్రభుత్వ రంగంలో ఈ నాలుగేళ్లలోనే సాధ్యం చేసి చూపించారు. వీరికి తోడు మూడు లక్షలకు పైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అవకాశాలొచ్చాయి. మరి ఇవన్నీ ఎవరికిచ్చారు రామోజీ? ఈ రాష్ట్ర యువతకే కదా? వేరే దేశంలోని యువతకు కాదు కదా? ఎందుకీ దిగజారుడు రాతలు!!. నిత్యం ఏదో ఒకరకంగా బురద జల్లేటపుడు... కనీసం ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలి కదా? చంద్రబాబుపై ఉన్న ప్రేమతో ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీస్తున్నామనే స్పృహ లేదెందుకు? ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే సుమారు 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలివ్వటం... వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 49 వేల మందికి ఉద్యోగాలు కల్పించటం... 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం... ఇదంతా ఈ ప్రభుత్వం రాసిన కొత్త చరిత్ర కాదా? దీన్ని మీ పత్రిక సాయంతో దాచేయగలరా? పారిశ్రామికులు ఏమంటున్నారో తెలియదా? ఈ దేశంలో నెంబర్–1 గ్రూపుగా వెలుగొందుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నుంచి స్టీల్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్, కరణ్ అదానీ, సెంచురీ ప్లై భజాంకా, శ్రీ సిమెంట్ బంగూర్... ఇలా దిగ్గజాలంతా ఇటీవలి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు (జీఐఎస్) వేదికపై ఆంధ్రప్రదేశ్‌కు తామిస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. ఇక్కడి నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళుతున్నారని సభాముఖంగా చెప్పారు. మరి ఇవన్నీ మీకు కనిపించవా రామోజీ? దిగ్గజ పారిశ్రామిక వేత్తలంతా ఇంతలా ప్రశంసిస్తుంటే పరిశ్రమలు రావటం లేదని, ఉద్యోగాలు లేవని ఎందుకీ దౌర్భాగ్యపు రాతలు? రామోజీరావు రాస్తున్నట్టుగా ఇక్కడ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం లేకపోతే... పరిశ్రమలు తాము సంతోషంగా ఉన్నామని చెప్పకపోతే... సులభతర వాణిజ్య విధానాన్ని అవలంబించే రాష్ట్రాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గత మూడేళ్లుగా ఏపీ ఎందుకు నెంబర్–1గా నిలుస్తుంది? దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కని ఈ హోదా మన రాష్ట్రానికే ఎందుకు దక్కుతోంది? అర నిమిషంలో తనను ముఖ్యమంత్రి ఒప్పించారంటూ... 6 నెలల్లో ఆలోచన నుంచి అనుమతులన్నీ వచ్చి, భూ కేటాయింపు పూర్తయి శంకుస్థాపన చేయగలిగామని సాక్షాత్తూ టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ ప్రశంసించారు. ఆయన తన కుమారుడి బయో ఇథనాల్ ప్లాంటు ‘అస్సాగో’కు ఏపీనే ఎంచుకున్నారు. ఏపీలో పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని చెప్పింది ఏకంగా ఐటీసీ సీఈఓ సంజీవ్ పురి. ఏపీలో అతిపెద్ద స్పైసెస్ ప్రాసెస్ ప్లాంట్‌ను ఇటీవలే ఆయన ప్రారంభించారు. ఇక ఆదిత్యబిర్లా గ్రూపు వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేసిన రెండు నెలలకే తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభించింది. తమ గ్రూపు సంస్థలకు ఏపీ కీలకమని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉందని ఆ గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాయే చెప్పారు. ‘రావాలి జగన్... కావాలి జగన్’ అనే నినాదం ఇప్పుడు ‘జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’ అనేట్లుగా మారిందనేది డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ ప్రశంస. ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తి కేంద్రానికి కొప్పర్తి ఈఎంసీలో భూమి పూజ చేశారాయన. ఇక రూ.600 కోట్లు పెట్టుబడి పెడదామనుకున్నామని, దాన్నిపుడు రూ.2,600 కోట్లకు పెంచుతున్నామని చెప్పింది సాక్షాత్తూ సెంచురీ ప్లైవుడ్ చైర్మన్ సజ్జన్ భజాంక. తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నా... రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయనే చెప్పారు. తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంటు ప్లాంట్లున్న శ్రీసిమెంట్... తొలిసారి ఏపీలో అడుగుపెడదామని నిర్ణయించుకున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శ్రీసిమెంట్ ఎండీ హరిమోహన్ బంగూర్ కలిశాకే. గుంటూరులో రూ.1,500 కోట్లతో ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించింది కంపెనీ. మరి ఒక్క కంపెనీ కూడా రాలేదని... ఇప్పటికే ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయని విష ప్రచారమెందుకు? 3 కారిడార్లు ఇక్కడే... తాజాగా విశాఖపట్నంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్‌తో పాటు విజయవాడ, తిరుపతి, అనంతపురాల్లో ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కుల ద్వారా లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. దేశ వ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చెందుతుంటే.. అందులో మూడు కారిడార్లు అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 50 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ పారిశ్రామికవేత్తలకు కావాల్సిన మౌలిక వసతులన్నిటినీ కల్పిస్తోంది. రాష్ట్రంలో తిరుపతిలో రెండు, శ్రీసిటీ, కొప్పర్తిల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఇవీ.. ‘ఈనాడు’ చెప్పని వాస్తవాలు. నాలుగేళ్లలో నాలుగు పోర్టులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు మరో నాలుగు పోర్టుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట వేశారు ముఖ్యమంత్రి జగన్. దీని ద్వారా ఆయా పోర్టులు ఏర్పాటవుతున్న ప్రాంతాల్లోని స్థితిగతులు సమూలంగా మారబోతున్నాయి. వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. వీటితో పాటు 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. విమానాశ్రయాలను చూసుకున్నా ఇటీవలే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికీ అనుమతులు అన్నీ మంజూరయి శంకుస్థాపన రాయి పడింది. కర్నూలు, కడప విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చి విమానాల రాకపోకలు పెరుగుతున్నాయి. ఇక బల్క్ డ్రగ్ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశంలో బల్క్ డ్రగ్ పార్క్ సాధించిన ఘనత మన రాష్ట్రానికే దక్కింది. 2022వ సంవత్సరంలో అత్యధికంగా పెట్టబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇవన్నీ చెబుతున్నది కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ విభాగమైన డీపీఐటీ నివేదికలే. కాకపోతే చంద్రబాబు మైకంలో కొట్టుకుంటున్న ‘ఈనాడు’కు గానీ... ఎల్లో వైరస్ సోకిన రామోజీరావుకు గానీ... ఇవేవీ కనిపించవు. జనానికి వాస్తవాలు తెలుస్తున్నాయని, గతంలో మాదిరి తాము చెప్పిందే జనానికి తెలిసే రోజులు పోయాయనే స్పృహ ‘ఈనాడు’కు లేకపోవటమే ఎల్లో ముఠా దౌర్భాగ్యం. -
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్‌ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్‌ఫామ్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్‌కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
పాలిటెక్నిక్ కోర్సులకు ‘కొత్త’ ఊపు
విశాఖ విద్య: ఒకప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉండేది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి కొలువు గ్యారెంటీగా దక్కేది. ఈ మూడేళ్ల కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందొచ్చు. అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలు క్రమంగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. జీఐఎస్ ఒప్పందాలతో నయా జోష్ విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్)లో ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పెద్దఎత్తున నెలకొల్పే పరిశ్రమలకు మానవ వనరుల అవసరం దృష్ట్యా, మూడేళ్ల కాల వ్యవధి గల పాలిటెక్నిక్ కోర్సులపై అందరి దృష్టి పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిం చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త కోర్సులకు రూపకల్పన ఎనర్జీ, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజ, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో వీటి విస్తరణకు అనువైన పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులైన యువతను అందించేందుకు వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిదశలో నాలుగుచోట్ల ఈ నేపథ్యంలో.. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కెమికల్ సుగర్ టెక్నాలజీ స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్టీ ఇంటిగ్రేటెడ్), సత్యవేడులో మెకానికల్ ఇంజనీరింగ్ స్థానంలో మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, గన్నవరంలో కొత్తగా కంప్యూటర్ సైన్సు, గుంటూరులో గార్మెంట్ టెక్నాలజీ స్థానంలో డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అనుమతిచ్చారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే వీటిలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు సరికొత్త కోర్సుల రూపకల్పన చేసేలా సాంకేతిక విద్యాశాఖ ముందుకెళ్తోంది. 84 కాలేజీలు.. 17వేల సీట్లు.. 28 రకాల కోర్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 84 కాలేజీలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలో 17వేల వరకు సీట్లున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, 3డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్టైల్ వంటి 28 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కాలేజీల బలోపేతంపై సాంకేతిక విద్యాశాఖ కార్యాచరణలోకి దిగింది. కొత్త కోర్సులు అవసరం ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తోంది. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సుల ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులు అవసరం. క్యాడ్ కామ్, పవర్ సిస్టమ్, ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు తీసుకొస్తే ఎంతో మేలు. – డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌పీటీఓ) అధ్యక్షులు పాలిటెక్నిక్ కాలేజీలకు మంచిరోజులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేలా సకల సౌకర్యాలున్నాయి. కొత్త కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీలకు మంచి రోజులొస్తున్నాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. – జీవీవీ సత్యనారాయణమూర్తి, పాలీసెట్ కనీ్వనర్, ఉమ్మడి విశాఖ జిల్లా క్యాంపస్ కొలువు కొట్టా మాది విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం. తండ్రి గోదాములో కలాసీగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటిదగ్గర మిషన్ కుడుతుంది. సత్వర ఉపాధి కోసమని పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ కోర్సు ఎంచుకున్నాను. క్యాంపస్ సెలక్షన్స్‌లో టాటా ప్రాజెక్టులో ఏడాదికి రూ.3.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. – ఈతకోట సియోన్, విశాఖపట్నం -
గణితంలో గర్వించేలా! స్కిల్ టాలెంట్ లో ఏపీ అదరహో
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ప్రతిభ కలిగిన యువతతో 65.58 శాతం స్కోరు సాధించింది. ఇక ఆంగ్లం, గణితం నైపుణ్యాల్లో అగ్రశ్రేణిలో నిలిచింది. ఇండియా స్కిల్ నివేదిక 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. 2022లో ఏపీ అత్యధిక వృద్ధి సాధించినట్లు నివేదికలో పేర్కొంది. అందులో ముఖ్యాంశాలు ఇవీ.. ♦ అత్యధికంగా ఉపాధి కల్పించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (72.7 శాతం) మొదటి స్థానంలో ఉండగా 69.8 శాతంతో మహారాష్ట రెండో స్థానంలో ఉంది. 68.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో నిలవగా 65.58 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, కర్నాటక వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. ♦ ఏపీలో యువత ఉపాధి అవకాశాలను పెంపొందించేలా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎం కేవీవై ద్వారా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. ♦ ఆంగ్లం, గణితంలో చక్కటి నైపుణ్యాలున్న తొలి ఐదు రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చోటు సాధించింది. గణితంలో మంచి నైపుణ్యం ఉన్న యువత లభ్యతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లీషు ప్రావీణ్యం కలిగిన యువత లభ్యత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ♦ ఆంధ్రప్రదేశ్‌లో 22 – 25 ఏళ్ల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం ఉంది. ♦ మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పించే వనరులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా, ఢిల్లీలో పురుషులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన వనరులున్నాయి. రానున్న సంవత్సరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, కేరళలో ఉపాధి అవకాశాలు మరిన్ని పెరుగుతాయి. ♦ ఘజియాబాద్, తిరుపతి, కర్నూలు, మంగుళూరు తదితర పది నగరాల్లో నైపుణ్యం కలిగిన మహిళా కార్మిక వనరులు అందుబాటులో ఉన్నాయి. ♦ న్యూమరికల్ స్కిల్స్ అత్యధికంగా ఉన్న నగరాల్లో చిత్తూరు, అమలాపురం ఉన్నాయి, ♦ ఆంగ్ల భాషతోపాటు బిజినెస్ కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న నగరాల్లో ముంబై, తిరుపతి, పుణే ముందు వరుసలో ఉన్నాయి. -
వొడా–ఐడియా యాప్‌తో మహిళలకు ఉద్యోగావకాశాలు
ముంబై: జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ అప్నాతో కలిసి తమ యాప్ ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) తెలిపింది. దీని ద్వారా టీచర్ల నుంచి టెలీకాలర్లు, రిసెప్షనిస్టుల వరకూ వేల సంఖ్యలో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే, టెలీ–కాలర్లు కాద ల్చుకునే మహిళలకు రూ. 5,000 డిస్కౌంటుతో ప్లేస్మెంట్ గ్యారంటీ శిక్షణ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తున్నామని వివరించింది. అటు ఎన్గురుతో కలిసి 50 శాతం డిస్కౌంటుతో ఇంగ్లీష్ శిక్షణా కోర్సులనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు మార్చి 14 వరకూ వీఐ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. -
ఎయిరిండియాకు అపార అవకాశాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు అపార అవకాశాలున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. వెరసి ఎయిరిండియా గ్రూప్‌ను అంతర్జాతీయ దిగ్గజంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో విస్తారాను కంపెనీతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు విలేకరుల వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఇదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిరేషియా ఇండియా)లను సైతం కంపెనీలో విలీనం చేసే కార్యాచరణకు ఇప్పటికే తెరతీసినట్లు తెలియజేశారు. ఎయిరిండియా గతంలో ఎన్నడూచూడని భారీ వృద్ధిని అందుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నెల 14న ఎయిరిండియా 70 వైడ్‌బాడీ మోడల్సహా 470 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు విల్సన్ తెలియజేశారు. వీటిలో ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను పొందనుంది. ఎయిరిండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. -
నాన్ టెక్.. ఉద్యోగాలు భర్తీలో బెస్ట్
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇటీవల తొలగించాయి. మరికొన్ని కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్కీలు భయంభయంగా కాలం వెళ్లదీసే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నాన్–టెక్ రంగాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన దేశంలో కరోనా కష్టకాలం అనంతరం నాన్–టెక్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏకంగా 30శాతానికి పైగా ఉద్యోగాలు పెరిగినట్లు ప్రముఖ గ్లోబల్ జాబ్‌సైట్ ఇండీడ్ ఇటీవల తెలిపింది. నిర్మాణ, ఆర్కిటెక్చర్, ఇతర నాన్ టెక్ రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021, 2022 సంవత్సరాల్లో డిసెంబర్ నెలల్లో వెలువడిన ఉద్యోగ ప్రకటనలపై ‘ఇండీడ్’ నిర్వహించిన అధ్యయనంలో 2021తో పోలిస్తే 2022లో నాన్–టెక్ రంగాల్లో ఉద్యోగాల భర్తీ పెరిగినట్లు తేలింది. ఈ మేరకు ‘ఇండీడ్’ సంస్థ తమ అధ్యయనంలో గుర్తించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ‘ఇండీడ్’ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు ► ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి 30.8 శాతంపెరుగుదల నమోదైంది. డెంటిస్ట్, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగాలు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. ► అనంతరం ఆహార సేవల రంగంలో 8.8 శాతం, నిర్మాణ రంగంలో 8.3 శాతం, ఆర్కిటెక్చర్ 7.2, విద్యా రంగంలో 7.1, మార్కెటింగ్ రంగంలో 6.1 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ► కరోనా కాలంలో నిర్మాణ, మార్కెటింగ్ వంటి రంగాల్లో కార్యకలాపాలు మందగించి ఉద్యోగులను తొలగించారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన అనంతరం నిర్మాణ, మార్కెటింగ్ రంగాల్లో మునుపటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ► నాన్–టెక్ రంగాల్లో నియామకాల్లో బెంగళూరు నగరం 16.5 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ముంబై (8.23 శాతం), పూణే (6.33 శాతం), చెన్నై (6.1శాతం) ఉన్నాయి. అహ్మదాబాద్, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, మొహాలీ వంటి టైర్–2 నగరాలు 6.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. -
ఇండియా అవుతోంది‘డిజిటల్’
సాక్షి, అమరావతి: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజటలైజేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని స్పష్టంచేసింది. ‘భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు’ పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా 10 కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాల్లో డిజటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్‌లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మూడో తరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది. స్వయం ఉపాధి కోవిడ్ లాక్‌డౌన్‌తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. 2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్ తర్వాత దేశీయ యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే ‘గిగ్’ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే, ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యానికి గురైతే సెలవులు, ఎర్న్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఆ నివేదిక పేర్కొంది. -
వేగవంత అభివృద్ధి ఉపాధిని సృష్టిస్తోంది
న్యూఢిల్లీ: మౌలిక, అనుబంధ రంగాల్లో వడివడిగా అభివృద్ధి అడుగులు పడుతుండటం వల్లే దేశంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 71,426 మందికి శుక్రవారం నియామక పత్రాలను ప్రధాని మోదీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందజేశారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఎంపికైన సిబ్బందితో మోదీ కొద్దిసేపు మాట్లాడారు. ‘ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత, వేగం తెస్తూ కచ్చితమైన కాలవధితో రిక్రూట్మెంట్ చేస్తున్నాం. కొత్తగా వేలాది మందికి ఉద్యోగాలతో కొనసాగుతున్న ఈ రోజ్‌గార్ మేళానే మా ప్రభుత్వ పనితీరుకు చక్కని నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. విధిలో బాధ్యతగా మెలగండి నూతన ఉద్యోగాల్లో కొలువుదీరే సిబ్బందిని ఉద్దేశించి మోదీ కొన్ని సూచనలు చేశారు. ‘ వ్యాపారి తన వినియోగదారుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. ఇదే మంత్రం మీ మదిలో ప్రతిధ్వనించాలి. ప్రజాసేవకు అంకితం కావాలి. కార్యనిర్వహణలో పౌరుడి సేవే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ప్రజాసేవే ముఖ్యం’ అని సూచించారు. ‘ప్రతీ గ్రామం భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగస్వామి అయిననాడు అక్కడ ఉపాధి కల్పన ఎక్కువ అవుతుంది. టెక్నాలజీని అంతగా అర్థంచేసుకోలేని వారు ఉండేచోట వారికి ఆన్లైన్ సేవలు అందిస్తూ కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతుంది. ఇలాంటి కొత్త వ్యాపారాలు చేసేందుకు రెండో శ్రేణి, మూడో శ్రేణి పట్టణాలు అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునే నిరుద్యోగ యువతకు నూతన గుర్తింపును తీసుకొస్తున్నాయి’ అని అన్నారు. ‘భవిష్యత్తులో దేశంలో వివిధ రంగాల్లో మరింతగా ఉపాధి కల్పనకు రోజ్‌గార్ మేళా ఒక ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే యువతకు సరైన ఉపాధి అవకాశాలు దక్కాలి’ అని ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
ఉపాధిపై ఫోకస్.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల శిక్షణతో నైపుణ్యాలకు పదును
సాక్షి, అమరావతి: వివిధ పథకాల ద్వారా పిల్లల చదువులు సాఫీగా సాగేలా సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెట్టడం ద్వారా ఉద్యోగావకాశాలు పెంపొందించేలా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసేలా జగనన్న విద్యా దీవెన, వసతి.. భోజనాల నిమిత్తం జగనన్న వసతి దీవెనతోపాటు ఇతర పథకాల ద్వారా తల్లిదండ్రులపై భారం పడకుండా చదువులకు తోడ్పాటు అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేసి ప్రమాణాలు పెంచేందుకు కరిక్యులమ్‌లో మార్పులు చేసింది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సుల పాఠ్య ప్రణాళికలను బలోపేతం చేసింది. ఇతర డిగ్రీ కోర్సుల్లో పాఠ్యాంశాలను సవరించడంతో పాటు 30 శాతం నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టింది. నాలుగేళ్ల ఆనర్ డిగ్రీ కోర్సులను తెచ్చి 10 నెలల ఇంటర్న్‌షిప్ అమలు చేస్తుండడంతో మంచి ఫలితాలకు మార్గం ఏర్పడింది. విద్యార్థులకు 2 నెలల కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టులను తప్పనిసరి చేశారు. దీనివల్ల విద్యార్థుల్లో సామాజిక చైతన్యంతో ఆత్మస్థైర్యం పెరిగింది. అన్ని కాలేజీల్లో బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును తప్పనిసరి చేశారు. దీనికి అనుగుణంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు రూపొందించి అందించారు. తద్వారా తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి విద్యార్థులను సాఫీగా మార్చేందుకు సులువైంది. 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు, 67 బ్యాచులర్ వొకేషనల్ డిగ్రీ ప్రోగ్రాములకు తోడు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా విద్యార్థులకు అదనపు నైపుణ్యాలకు వీలుగా పలు ఆన్లైన్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. దేశంలో తొలిసారిగా క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసింది. అన్ని కాలేజీల్లోనూ తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా చూడడంతో పాటు తగిన బోధనా సిబ్బంది ఉండేలా పర్యవేక్షణకు వీలైంది. మరోపక్క అన్ని కాలేజీలకు న్యాక్, ఎన్బీఏ వంటి గుర్తింపు ఉండేలా మార్గదర్శనం చేస్తోంది. పలువురు నిపుణులతో తొలిసారిగా ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడం, నైపుణ్యాలు పెంచే లక్ష్యంతో 553 ఎంటర్ ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్లను యూనివర్సిటీలు, కాలేజీల్లో ఏర్పాటు చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 1.62 లక్షల మందికి వివిధ కోర్సుల్లో రూ.32 కోట్లతో ఉచిత శిక్షణ అందించారు. ఇంటర్న్‌షిప్‌తో సత్ఫలితాలు ఉన్నత విద్యలో ఇంజనీరింగ్‌తోపాటు నాన్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో నాలుగేళ్ల ఆనర్ డిగ్రీని ప్రవేశపెట్టి ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రెగ్యులర్ కోర్సులతోపాటు విద్యార్థులలో నైపుణ్యాల పెంపునకు మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్ çవంటి సంస్థలు సహా 20 కంపెనీల ద్వారా విద్యార్థులకు అప్ స్కిల్లింగ్ శిక్షణ అందిస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో మానవ వనరులను తీర్చిదిద్దడంతో అనేక కంపెనీలు మన విద్యార్థుల వైపు దృష్టి సారిస్తున్నాయి. గత మూడేళ్లుగా పెరుగుతున్న ప్లేస్మెంట్ల సంఖ్య ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ఉన్నత విద్యామండలి గణాంకాల ప్రకారం 2018–19లో ప్లేస్మెంట్ల సంఖ్య 37 వేలు ఉండగా 2021–22లో ఏకంగా 85 వేలకు పెరిగింది. దీన్ని 1.20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని కృషి చేస్తున్నారు. మంచి ప్యాకేజీలతో కొలువులు నైపుణ్యాలకు తగినట్లుగా ఆయా కంపెనీలు మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2018–19లో రాష్ట్రంలో సగటు ప్యాకేజీ రూ.2.50 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం రూ.5 లక్షలకు పైగా పెరిగింది. గరిష్ట ప్యాకేజీలో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అందుకుంటున్న విద్యార్థులు సైతం ఉన్నారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ తదితర సంస్థలు విద్యార్థులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. పరిశ్రమలతో కాలేజీల అనుసంధానం డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం అన్ని కళాశాలలను పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించింది. ఇందుకు ఉన్నత విద్యామండలి ద్వారా ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 2.5 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ కోర్సులు చేస్తూనే.. విద్యార్థులు రెగ్యులర్ కోర్సులు చేస్తూనే అదనపు నైపుణ్యాలను సంతరించుకునేలా ఉచిత ఆన్లైన్ శిక్షణలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్సు లాంటి సంస్థల ద్వారా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఈ కోర్సుల్లో 2.15 లక్షల మందికి ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా భారీ స్పందనతో 2,45,700కి చేరుకుంది. మరికొన్ని సంస్థలతో ఒప్పందాలు ఏఐసీటీఈ, నాస్కామ్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్, ఒరాకిల్, పాలో ఆల్టో నెట్వర్క్, యూఐపాత్, స్మార్ట్ బ్రిడ్జ్, ఎడ్యుస్కిల్స్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌ప్రెస్, ఎన్ఐఐటీ ఫౌండేషన్, క్యూస్గ్రూప్, నాంది ఫౌండేషన్, క్వెస్ గ్రూప్, టీమ్ లీజ్, ది హిందూ, రైస్, లాంచ్ ప్యాడ్, సైలర్ అకాడమీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సంస్థల ఉచిత నైపుణ్య కోర్సులతో పాటు ఇతర సర్టిఫికేషన్ కోర్సులు అందనున్నాయి. ఇవే కాకుండా ఐబీఎం, సిస్కో, అడోబ్, గూగుల్, బోర్డు ఇన్ఫినిటీ, ఇన్ఫోసిస్ సంస్థలతోనూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒప్పందాలు చేసుకోనుంది. సాంకేతికను అందిపుచ్చుకునేలా.. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి అధునాతన సాంకేతిక అంశాల్లో విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. సేల్స్‌ఫోర్స్ డెవలపర్, సేల్స్‌ఫోర్స్ అడ్మిన్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఫుల్ స్టాక్ (డాట్ నెట్), ఫుల్ స్టాక్ (పైథాన్), హెచ్ఆర్, బీఎఫ్ఎస్ఐ ఎనలిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్, మెడికల్ స్క్రైబ్, వీఎం వేర్, గూగుల్ ఆండ్రాయిడ్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, నెట్ వర్కింగ్, క్లౌడ్ నెట్వర్కింగ్, డేటా ఎనలిటిక్స్, ఏఐ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాయి. ముందు వరుసలో రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా రెగ్యులర్ కోర్సులలో ఇంటర్న్‌షిప్‌తో పాటు ఆన్లైన్ వర్చువల్ సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నాం. దాదాపు 1.50 లక్షల మందికి సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహించిన ఘనత దేశంలో ఏపీకే దక్కుతోంది. 2.5 లక్షల మందికి రెగ్యులర్ ఇంటర్న్‌షిప్‌లను అందించడంలోనూ మన రాష్ట్రం ముందు వరసలో ఉంది. వచ్చే రెండు మూడేళ్లలో డిగ్రీ విద్యార్థులలో 60 శాతానికి పైగా ఉద్యోగావశాలు పొందేలా చూడాలన్నది లక్ష్యం. ఈ ఏడాది రూ.40 లక్షల ప్యాకేజీ వచ్చిన విద్యార్థులు 100 మందికి పైగా ఉన్నారు. ఇక రూ.25 లక్షలు, రూ.30 లక్షలు వచ్చిన విద్యార్థులు చాలా మందే ఉన్నారు. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
టెలికం ఉద్యోగాలు పెరిగాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం, 5జీ విభాగంలో ఉద్యోగ ప్రకటనలు సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో 33.7 శాతం పెరిగాయని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ‘5జీ సేవల కోసం భారత్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 5జీ నిర్దిష్ట సాంకేతికత, సేవలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు ఇప్పటికే నియామకాలను ప్రారంభించాయి. తదుపరితరం నూతన టెలికం సాంకేతికతను వేగంగా స్వీకరించేందుకు వ్యాపార సంస్థలు ఎదురు చూస్తున్నందున రాబోయే కొద్ది త్రైమాసికాల్లో ఈ విభాగంలో నియామకాల్లో పెరుగుదలను చూడవచ్చు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలను రూపొందించగల, నెట్వర్క్ నిర్మాణాలను బలోపేతం చేయగల నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరమని దీనినిబట్టి అవగతమవుతోంది. అభివృద్ధి చెందిన టెలికమ్యూనికేషన్ రంగానికి అనుగుణంగా ఉద్యోగార్ధులు, పరిశ్రమ సైబర్ సెక్యూరిటీ నిపుణుల బలమైన సమూహాన్ని సృష్టించాలి’ అని నివేదిక వివరించింది. ఉద్యోగ ప్రకటనలు కస్టమర్ సర్వీస్ ప్రతినిధుల కోసం 13.91, ఆపరేషన్స్ అసోసియేట్స్ 8.22 శాతం అధికం అయ్యాయి. 2019 ఆగస్ట్ నుంచి 2022 ఆగస్ట్ మధ్య సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల కోసం ప్రకటనలు 81 శాతం దూసుకెళ్లాయి. -
బీజేపీతోనే గుజరాత్ వికాసం: మోదీ
భావ్‌నగర్: దేశంలోనే అతిపొడవైన తీర ప్రాంతమున్న గుజరాత్ అభివృద్ధి కోసం దశాబ్దాలపాటు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం గత 20 ఏళ్లుగా నిజాయతీతో ప్రయత్నాలు చేసి రాష్ట్రం అభివృద్ధికి బాటలు పరిచిందని పేర్కొన్నారు. ప్రచార ఆర్భాటాలకు డబ్బు వృథా చేయకుండా తీర ప్రాంతం వెంబడి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టిందని ఆయన అన్నారు. ఫలితంగా లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడూ నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. భావ్‌నగర్, బొటాడ్, అమ్రేలీ జిల్లాల్లో గురువారం రూ.6 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన సందర్భంగా భావ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ టెర్మినల్, బ్రౌన్‌ఫీల్డ్ పోర్ట్ అభివృద్ధి, కార్గో కంటెయినర్ ఉత్పత్తి విభాగం తదితరాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సమయంలో ప్రధాని మోదీ రూ.29 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. -
పరిశ్రమలకు బెస్ట్.. ఏపీ
విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘గ్రీన్ ఎనర్జీ’పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. రాయలసీమ ప్రాంతం ఇందుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం రూ.72,188 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ రైతులు గ్రూపుగా ముందుకొస్తే వారి పొలాల్లో విండ్, సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏటా ఎకరానికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం లీజు చెల్లిస్తుంది. తద్వారా రైతులకు నికర ఆదాయంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా అడుగులు వేస్తూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోందన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్‌కో సిమెంట్స్’ కర్మాగారాన్ని బుధవారం ఆయన ప్రజల సమక్షంలో బజర్ నొక్కి ప్రారంభించారు. అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్‌కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని.. ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని.. రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తొలిదశలో వెయ్యి మందికి ఉద్యోగాలు ► మన ప్రాంతంలో రామ్‌కో సిమెంట్‌ను స్థాపించిన వెంకట్రామరాజా అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు. రూ.2,500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంటులో తొలి దశలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. పనులు వేగంగా పూర్తి చేసింది. ► గొప్ప మార్పునకు ఈ ఫ్యాక్టరీ నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు దీనికంటే మరొక ఉదాహరణ అవసరం లేదు. ఎమ్మెల్యే, కలెక్టర్ నుంచి నా వరకు అందరి సహకారంతో ఎలాంటి జాప్యం జరగకుండా 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేశారు. ► 1961లో రామ్‌కో సిమెంట్స్ ప్రస్థానం మొదలైంది. రోజుకు 200 టన్నులు అంటే ఏటా 0.4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలు పెట్టిన ప్లాంటు ఈ రోజు 20 మిలియన్ టన్నుల సామర్థ్యం దాకా అడుగులు వేసింది. ప్రతిచోటా వీరి యూనిట్లు బాగా పని చేస్తున్నాయి. 5 చోట్ల ఉత్పత్తి యూనిట్లు.. మరికొన్ని చోట్ల గ్రైండింగ్ యూనిట్లు.. మొత్తం 11 యూనిట్లు ఉన్నాయి. అన్నిచోట్ల సామర్థ్యాన్ని పెంచుతూ పోతున్నారు. ఇక్కడ ప్రారంభమైన ప్లాంట్‌కు ఇకపై కూడా మనందరి సహకారం అందిస్తే త్వరితగతిన మరింత అభివృద్ధి, విస్తరణకు దోహద పడుతుంది. ► కొద్ది రోజుల కిందట గ్రీన్కో 5,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజ్‌తో చేపట్టిన రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటుకు పునాది రాయి వేశాను. ఈ ప్రాజెక్టు వల్ల కర్నూలు జిల్లాలో 2,600 ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ సహకారం బావుందని వాళ్లే చెబుతున్నారు.. ► ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఇది చాలా కీలకం. ఈ మధ్య కాలంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. పరిశ్రమల నిర్వాహకులతో ఇక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు తీసుకుని మార్కులు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న సహాయం, ప్రోత్సాహకాలు కలిపి పరిశ్రమలకు రాష్ట్రం బాగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ► మన రాష్ట్రం, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు గురించి, చేయి పట్టుకుని నడిపిస్తున్న తీరు గురించి పారిశ్రామికవేత్తలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మనకు మొదటి స్థానం వచ్చింది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగింది. 2021–22లో దేశంలో అత్యధిక గ్రోత్‌రేట్ 11.43 శాతంతో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇది గొప్ప మార్పునకు అవకాశం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మనమంతా మద్దతు ఇస్తున్నాం కాబట్టే ఇంతగా మంచి జరుగుతోంది. రూ.1000 కోట్లతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ► రాష్ట్రంలో ఇటీవలే రూ.1000 కోట్లతో గ్రాసిమ్ ఇండస్ట్రీని ప్రారంభించాం. దీనిని కుమార మంగళం బిర్లా ఏర్పాటు చేశారు. 1,150 ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అపాచీ ఫ్యాక్టరీని రూ.700 కోట్లతో చిత్తూరు, పులివెందులలో చేపట్టాం. ► దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడితో టీసీఎల్ ప్యానల్ ఉత్పత్తి చేపడుతోంది. 3,100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖలో ఏటీసీ టైర్స్ దాదాపు రూ.2,200 కోట్ల పెట్టబడితో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేశాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ లేదా పోర్టు ► ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉన్నాయి. ఈ మూడేళ్లలో మరో నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడు) నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకొస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్, పోర్టు ఉండేలా.. తద్వారా ఎగుమతులు పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ► 2021–22లో రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీన్ని రాబోయే ఐదేళ్లలో రూ. 3.40 లక్షల కోట్లకు పెంచేలా లక్ష్యంగా నిర్దేశించుకుని అడుగులు వేగంగా వేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లు.. వైజాగ్–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరును అభివృద్ధి చేస్తున్నాం. ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ పార్క్, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, తిరుపతిలో మరో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే మన పిల్లలకు ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యే పరిస్థితి వస్తుంది. మరిన్ని పరిశ్రమలు మన రాష్ట్రం వైపే చూసే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. పారిశ్రామికవేత్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం. పూర్తి సహకారం అందిస్తాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, అంజాద్ బాషా, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గుంగుల ప్రభాకర్‌రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ పాల్గొన్నారు. భూమికి లీజు.. పిల్లలకు ఉద్యోగాలు గ్రీన్ డోసాల్, ఆర్సిలర్ మిట్టల్, అరవిందో, అదానీ వాళ్లకు రూ.72,188 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం. 3–4 ఏళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తయితే 20 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు.. రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేల చొప్పున లీజు ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 30.. 50.. ఎన్ని ఏళ్లయినా ఏటా లీజు డబ్బులు ఇస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం. ఈ మేరకు అగ్రిమెంట్లు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఒక ప్రాంతంలో కనీసం 1,500 నుంచి 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా అందుబాటులో ఉండేలా చూస్తే.. రైతులు, గ్రామాలు ముందుకొస్తే ఆ భూముల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు చేపడతాం. తద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరింత అభివృద్ధి చేస్తాం ఇక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు పూర్తిగా సహకరించారు. వేగంగా పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ సహకారంతో ప్లాంటును మరింత అభివృద్ధి చేస్తాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో మా వంతుగా సహకారం అందిస్తాం. – వెంకట్రామ రాజా, రామ్‌కో ఎండీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్.. పారిశ్రామికంగా రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తోంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలు ఎలాంటి వాతావరణంలో నడుస్తున్నాయో చెప్పేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో మనం ప్రథమ స్థానంలో ఉండటమే నిదర్శనం. ఏపీ ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ రాష్ట్రంగా ఉంది. సముద్రతీరం, జాతీయ రహదారులు, పోర్టుల కనెక్టివిటీ లాంటి అంశాలు పరిశ్రమల రాక, అభివృద్ధికి దోహదపడుతున్నాయి. వీటన్నిటికీ తోడు గొప్ప ముఖ్యమంత్రి అండగా ఉండటం మన అదృష్టం. అనకాపల్లి నియోజకవర్గంలో కూడా రామ్‌కో ప్లాంటు ఉంది. ఇక్కడ మూడో ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావడం పట్ల ఆనందంగా ఉంది. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి -
3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
సాక్షి అమరావతి: ఏపీలోని 3.5 లక్షల మంది విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి తమ ఇంటర్న్‌షిప్‌లను ప్రారంభిస్తారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి తెలిపారు. మండలి కార్యాలయంలో లింక్డ్ఇన్ ద్వారా చేకూరే ప్రయోజనాలపై మంగళవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలి అభివృద్ధి చేసిన లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ప్లాట్‌ఫారమ్ గురించి వివరిస్తూ.. ఇప్పటికే 9 లక్షల మంది విద్యార్థులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇక నుంచి ఎల్‌ఎంఎస్‌లో ఉద్యోగావకాశాలు కనిపిస్తాయని చెప్పారు. లింక్డ్ఇన్ ఇండియా హెడ్ సబాకరీం మాట్లాడుతూ.. ఏపీలో చాలా టాలెంట్ పూల్ ఉందని.. రాష్ట్రంలో విద్యార్థుల అవకాశాలు పెంచడానికి, యజమానులను ఆకర్షించడానికి లింక్డ్ఇన్ సహాయపడుతుందని చెప్పారు. లింక్డ్ఇన్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ మాట్లాడుతూ.. లింక్డ్ఇన్ లెర్నింగ్ సొల్యూషన్స్ నుండి విద్యార్థులు ప్రతివారం 60 కోర్సులు నేర్చుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీనాథ్ దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పట్టభద్రులకు కొలువులే కొలువులు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఈ ఏడాది రెండో అర్ధభాగం(జూలై–డిసెంబర్ మధ్యకాలం)లో కొత్త పట్టభద్రుల (ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్)కు 59 శాతం కంపెనీ లు, పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీమ్‌లీజ్ ఎడ్టెక్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించి న ‘కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్’పేర్కొంది. ఇది ఈ ఏడాది తొలి అర్ధభాగంకన్నా 12% అధి కంగా ఉండనుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 865 కంపెనీలు, 18 పరిశ్రమలు, 14 ప్రదేశాల్లో అందుబాటులోకి రానున్న ఉద్యోగ అవకాశాలను విశ్లేషిస్తూ నివేదికను రూపొందించినట్లు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. అత్యధికంగా ఐటీ రంగం 65% మంది ఫ్రెషర్లను తీసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తుండగా ఈ– కామర్స్ రంగం 48%, టెలికమ్యూనికేషన్స్ రంగం 47% మంది కొత్త పట్టభద్రులకు ఉద్యో గాలివ్వాలని భావిస్తున్నట్లు నివేదిక వివరించింది. అవకాశాలు పెరిగాయి... దేశంలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల కల్పన గణనీయంగా మెరుగైంది. విద్యారంగం, పరిశ్రమల మధ్య సమన్వయం వల్ల నవతరం మంచి నైపుణ్యాలతో బయటకు వస్తోంది – శంతనూ రూజ్, సీఈవో, వ్యవస్థాపకుడు టీమ్‌లీజ్ ఎడ్టెక్ -
240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలల్లో డిప్యుటేషన్‌పై అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరితోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించామన్నారు. ఉన్నత విద్యతోపాటు ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని శనివారం భాస్కరరావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. వీటిలో రూ.391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ.14.5 కోట్ల చొప్పున త్వరలో మంజూరు కానున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాగా 124 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాడు– నేడు కింద భవనాల ఆధునికీకరణకు రూ.271 కోట్లు విడుదల కావాల్సి ఉందని భాస్కరరావు తెలిపారు. కొత్తగా వస్తున్న ఆరు డిగ్రీ కళాశాలల్లో ఒక్కో దానిలో 24 మంది అధ్యాపకులు, మరో 10 ఇతర పోస్టులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆరు కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి రూ.1.67 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విధానంలో భాగంగా కొత్తగా 54 కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. కళాశాలల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు. డిగ్రీతోపాటు పలు ఉపాధి కోర్సులు డిగ్రీ కోర్సులతోపాటు విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పలు కోర్సులను జోడించామని భాస్కరరావు తెలిపారు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్లో 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్.ఐ.విజయబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చదువు పూర్తవగానే ఉద్యోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న కాలంలో ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగావకాశాలను (ప్లేస్‌మెంట్స్) అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తన కాలేజీ చదువులు ముగించి బయటకు వస్తూనే ఉద్యోగావకాశాలకు అనుగుణమైన పూర్తి నైపుణ్యాలను కలిగి ఉండేలా, ప్రపంచంలో ఇతరులతో పోటీపడి అవకాశాలను దక్కించుకునేలా రాష్ట్ర విద్యార్థులను సిద్ధం చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందులో భాగంగా విద్యార్థులకు వర్చ్యువల్ శిక్షణకు సంబంధించి బుధవారం విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో సేల్స్ ఫోర్స్ సంస్థతో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 3.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 1.62 లక్షల మందికి సర్టిఫికెట్ కోర్సులలో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఫ్యూచర్ స్కిల్స్, నాస్కామ్ తదితర సంస్థల ద్వారా వేలాది మందికి వివిధ నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత సేల్స్ ఫోర్స్ సంస్థ ద్వారా 70 వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు ఉచితంగా అందుబాటులో రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న భయాలు ఉన్నా, దానివల్ల దేశ యువతకు ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయని వివరించారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, వైస్ చైర్మన్ రామ్మోహనరావు, ఫ్యూచర్ స్కిల్స్ హెడ్ నవనీత్ సమయార్, ప్రతినిధులు శ్రీదేవి, సతీష్, సేల్స్ ఫోర్స్ ఎండీ సంకేత్, ట్రయిల్ హెడ్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ విలియమ్ సిమ్ పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో రూ.కోటి టోపీ
కృష్ణరాజపురం: దావణగెరె జిల్లాలోని జగళూరు తాలూకా విద్యాశాఖ బసవనగౌడ పాటిల్, అతని సోదరుడు బళ్లారి వెంకటరెడ్డిలు ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.2 కోట్లు వసూలు చేసి మోసగించారని బెంగళూరు కృష్ణరాజపురానికి చెందిన వ్యాపారి నాగేంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్మూర్తినగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వీరు పరిచయం అయ్యారని, తమకు చాలామంది ప్రభుత్వ అధికారులు తెలుసని చెప్పారన్నారు. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని అడిగితే ఇద్దరూ కలిసి రూ.1.02 కోట్లు తీసుకున్నారని, ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని బాధితుడు తెలిపాడు. (చదవండి: ప్రపంచ శాంతి కోసం యోగా.. మైసూర్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు) -
ఎడ్యుకేషన్‌లోన్ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
విదేశాల్లో చదువుకుని, కెరీర్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్. బీటెక్ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్‌లోని మాంట్పెల్లియర్ బిజినెస్ స్కూల్లో ఎంఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్సుకు పాక్షికంగా స్కాలర్ షిప్ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది. వచ్చిన స్కాలర్షిప్ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు. రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్మైకెరీర్ అనే కెరీర్ కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్ గ్లోబల్ లీడర్ సుష్మాశర్మ తెలిపారు. బ్యాంకును గుర్తించడం.. విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్బీఎఫ్సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చింది. కావాల్సినంత రుణం.. విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండీ రాజేష్ వర్మ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు.. రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్ లేదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్‌తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్‌ప్లేస్ అయిన విమేక్స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ ఆర్ కృష్ణ తెలిపారు. పేపర్ వర్క్ కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్ (33) యూఎస్‌లోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్ తెలిపారు. తాకట్టు.. దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్ ఫండ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అధిక వ్యయాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి. రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి.. సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే యూఎస్ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి. ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్ ఫైనాన్సింగ్ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు. స్కాలర్షిప్ ‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్షిప్ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడంలో సాయపడే జ్ఞాన్‌ధన్, విమేక్ సొల్యూషన్స్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. క్రెడిట్ స్కోరు విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి. డాక్యుమెంట్లు విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్షిప్ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్మెంట్ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చూడాలి రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్ రూట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు. -
శ‘బాష్’ హైదరాబాద్.. 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్న జర్మనీ సంస్థ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తమ సాఫ్ట్వేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ, జర్మనీకి చెందిన ‘బాష్’ ప్రకటించింది. దీని ద్వారా హైదరాబాద్ కేంద్రంగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు కంపెనీ సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘బాష్’ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందిన తీరును వివరించారు. మొబిలిటీ, ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్, గృహోపకరణాల రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా ‘బాష్’కు పేరున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ గుర్తు చేశారు. వందేళ్ల క్రితం భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించిన బాష్.. 25 ఏళ్ల క్రితం బెంగళూరు కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు మొదలు పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుకూల విధానాలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ నగరంలో ‘బాష్’ అడుగుపెట్టడం గొప్ప విషయమని అన్నారు. కాగా, హైదరాబాద్‌లో తమ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ‘బాష్’ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. కేటీఆర్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాష్ కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం, సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉపాధ్యక్షులు సుందర రామన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
గుడ్‌న్యూస్! టెక్ మహీంద్రాలో ఈ ఏడాది 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం బలపడి రూ. 1,378 కోట్లను అధిగమించింది. సరఫరా సవాళ్ల కారణంగా లాభాలు పరిమితమైనట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 11,450 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 15.9 శాతం నుంచి 14.8 శాతానికి నీరసించాయి. క్యూ3లో ఆదాయాలు మెరుగుపడినప్పటికీ సరఫరా సమస్యలు లాభదాయకతకు అడ్డుపడినట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి తెలియజేశారు. ప్రధానంగా కొత్త ఉద్యోగాలు, వేతన పెంపు, ప్రయాణ ఆంక్షల నడుమ సబ్‌కాంట్రాక్టులు వంటి అంశాలు దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. 10,000 మందికి చాన్స్ అంచనాలకు అనుగుణంగా క్యూ3లో 15 శాతం స్థాయిలో మార్జిన్లను సాధించినట్లు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ప్రస్తావించారు. గతంతో పోలిస్తే ఈ కాలంలో మానవ వనరుల అంశంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదని తెలియజేశారు. తాజాగా చేర్చుకున్న 3,800 మంది ఉద్యోగులతో కలిపి సిబ్బంది సంఖ్య 1.45 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు చోటు కల్పించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో మరో 15,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. తాజా సమీక్షా కాలంలో ఉద్యోగ వలసల(ఎట్రిషన్) రేటు రెట్టింపై 24 శాతాన్ని తాకినట్లు వెల్లడించారు. చదవండి:హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు -
రాబోయే రోజుల్లో ఈ రంగాల్లో భారీ ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది టెక్నాలజీ ఆధారిత రంగాల్లో నియామకాలు జోరుగా ఉంటాయని మాన్స్టర్.కామ్ నివేదిక తెలిపింది. ‘ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో నియామకాల డిమాండ్ పెరుగుతుంది. వేగవంతమైన సాంకేతికతను స్వీకరించడంతో ఏఐ, మెషీన్ లెర్నింగ్ పాత్ర 2022లో వృద్ధి చెందుతుంది. నూతన సాధారణ స్థితికి అనుగుణంగా కంపెనీలు సంస్థాగత వ్యూహాలు, లక్ష్యాలను మార్చుకున్నప్పుడు సాంకేతికతను స్వీకరించడం మళ్లీ రెట్టింపు అయింది. ఉద్యోగాల మార్పు, ఉపాధి సంక్షోభం నేపథ్యంలో నిపుణులైన మానవ వనరుల కోసం వేట పెరగడంతో నైపుణ్యం పెంచుకునే ప్రక్రియ కొత్త స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో ప్రతిభను నిలుపుకోవడంలో ఉద్యోగి సౌలభ్యం కీలకం. మార్కెట్లో ఉన్న భారీ డిమాండ్‌తో ఉద్యోగులు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి తలుపులు తెరుస్తోంది. మూడవ అతిపెద్ద మార్కెట్‌గా.. ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో పెట్టుబడులు వచ్చే రెండేళ్లు ఏటా 33.49 శాతం అధికం అవుతాయి. చాట్‌బోట్స్ వినియోగం పెరుగుతుంది. వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఫిన్‌టెక్ రంగం 2025 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని అంచనా. 2022లో ఐటీ పరిశ్రమ ఏడు శాతం వృద్ధి చెందుతుంది. 2021–22 ద్వితీయార్థం 4,50,000 మంది స్థూల ఉద్యోగుల చేరికను చూసే అవకాశం ఉంది. బిగ్ డేటా అనలిటిక్స్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉండొచ్చు. ఫిన్‌టెక్, రిటైల్, ఈ–కామర్స్, సోషల్ కామర్స్‌లో సేల్స్ నిపుణుల అవసరం అధికం కానుంది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకే ఉత్సాహం చూపుతుండడంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో చిన్న కార్యాలయాల ఏర్పాటు లేదా కో–వర్కింగ్ స్పేస్‌ను వినియోగించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. ఫ్రెషర్ల కోసం నియామకాలు గడిచిన మూడు నెలల్లో పెరిగాయి. ఈ ఏడాది ఇవి మరింత అధికం కానున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి: బెంగళూరుకి ఝలక్ ! నియామకాల్లో హైదరాబాద్ టాప్ -
ఆంధ్రప్రదేశ్ టూరిజం.. ‘స్టార్’డమ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగం ‘స్టార్’ స్టేటస్ సంతరించుకుంటోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో సుమారు రూ.2,600 కోట్లతో పది ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఆతిథ్య రంగంలో దిగ్గజ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మెగా టూరిజం ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయి. నూతన టూరిజం పాలసీ 2020–2025 ప్రకారం పెట్టుబడిదారులకు ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తోంది. సంబంధిత ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి సిద్ధంగా ఉన్నవి వెంటనే నిర్మాణ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వం ఇటీవల వేర్వేరు ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఒబెరాయ్.. ఐదు ప్రదేశాల్లో ఒబెరాయ్ హోటళ్ల గ్రూప్ రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్లతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించనుంది. అన్నవరం, పిచ్చుకలంక, పేరూరు, గండికోట, హార్సిలీహిల్స్ ప్రాంతాల్లో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. హార్సిలీ హిల్స్‌లో సింగిల్ ఫేజ్‌లో నిర్మాణం పూర్తి కానుంది. లగ్జరీ సూట్లు, ఓపెన్ లాన్లు, పార్టీ ఏరియా, ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు, 24 గంటలు అందుబాటులో అంతర్జాతీయ రుచులతో కాఫీ షాప్‌లు, కాన్ఫరెన్స్, బాంకెట్ హాల్, బార్, ఈత కొలను, ఫిట్నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పా ఇతర సౌకర్యాలు వీటిలో అందుబాటులో ఉంటాయి. పెనుకొండలో ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ.వంద కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 288 గదులతో యాత్రి నివాస్ (అతిథి గదులు), 2 వేల సీట్ల సామర్థ్యంతో యాంపీ థియేటర్, కృష్ణలీలల థీమ్ పార్క్, 1,000 సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్, 108 పడకలతో ధర్మశాల డార్మిటరీలు అందుబాటులోకి రానున్నాయి. మ్యూజియం, ఆయుర్వేద వెల్నెస్ సెంటర్, సంస్కృతి భవన్, హెరిటేజ్ క్రాఫ్ట్ సెంటర్, ఐకానిక్ టవర్, చిన్నారులకు వినోద కేంద్రం, 600 కార్లకు పార్కింగ్ సదుపాయం, ప్రసాదం, ఫుడ్ కోర్టులు నిర్మించనున్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి ఉపాధి లభించనుంది. పెనుకొండలో మూడేళ్ల భవన నిర్మాణ వ్యవధితో పాటు 33 ఏళ్ల లీజుకు అనుమతించారు. నాలుగు చోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు హయత్, తాజ్ గ్రూప్‌ల భాగస్వామ్యంతో నాలుగు ప్రాంతాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించనున్నారు. హయత్ సంస్థ విశాఖపట్నం శిల్పారామం పరిసరాల్లో రూ.200 కోట్లతో మూడు ఎకరాల్లో 200 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో ఐదు నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. తిరుపతిలోని శిల్పారామం ప్రాంతంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో 225 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ 5,100 మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి. విజయవాడలో రూ.92.61 కోట్లతో 81 గదులు, రెండు బాంకెట్ హాల్స్‌తో నాలుగు నక్షత్రాల హోటల్ రానుంది. ఇక తాజ్ వరుణ్ గ్రూప్ విశాఖపట్నంలో రూ.722 కోట్లతో 260 గదుల ఐదు నక్షత్రాల హోటల్, 90 సర్వీస్ అపార్ట్మెంట్స్, 12,750 చదరపు అడుగుల్లో కన్వెన్షన్ సెంటర్, 2,500 సీటింగ్ సామర్థ్యంతో టెక్నాలజీ స్పేస్‌ను నిర్మిస్తుంది. ఇందులో ఐదు రెస్టారెంట్లు, షాపులు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒలింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ 15 వేల ఉద్యోగవకాశాలు దక్కనున్నాయి. రాయితీలు ఇలా.. పీపీపీ కింద అభివృద్ధి చేసే స్థలాల లీజు అద్దెను మార్కెట్ విలువలో ఒక శాతంగా నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంచనున్నారు. భూ బదలాయింపు చార్జీలను మినహాయించారు. స్టాంపు డ్యూటీ మొత్తాన్ని, ఐదేళ్ల పాటు వంద శాతం ఎస్జీఎస్టీని పూర్తిగా రీయింబర్స్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒబెరాయ్ సంస్థ ప్రాజెక్టులకు నాలుగేళ్ల నిర్మాణ కాలంతో పాటు 90 ఏళ్ల లీజును నిర్ణయించారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఏడు నక్షత్రాల హోటళ్లు, లగ్జరీ విల్లాల విద్యుత్ వినియోగంలో యూనిట్‌కు రూ.2 చొప్పున, ఐదు నక్షత్రాల హోటళ్లు, సర్వీసు ఆపార్ట్‌మెంట్స్, కన్వెన్షన్ సెంటర్ల ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్ల పాటు రీయింబర్స్మెంట్ కల్పిస్తారు. ఆయా ప్రాజెక్టుల విలువను బట్టి ఏటా గరిష్ట వినియోగంపై పరిమితి విధించారు. పెట్టుబడిదారులకు సులభంగా.. సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. పాత పాలసీ కంటే మెరుగ్గా పెట్టుబడిదారులకు రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రీ స్టేటస్ కల్పించాం. అందుకే అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. మెగా టూరిజం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపడతాం. పెట్టుబడిదారులకు ఎక్కడా సమస్య లేకుండా నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయిస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన విద్య అభ్యసిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఎలాగో డిగ్రీ పూర్తి చేశామనుకుంటే చాలదని స్పష్టమవుతోంది. ఏదో ఒక అంశంలో నైపుణ్యం కలిగిన వారు కూడా ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకుంటూ సాంకేతిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాన్ని అవరుచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించేందుకు అన్ని స్థాయిల్లోనూ కసరత్తు జరుగుతోంది. డిగ్రీ స్థాయి నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ వృత్తి విద్య కోర్సుల్లోనూ కొనసాగుతోంది. ఏటా కుప్పలు తెప్పలుగా.. ఏటా కుప్పలు తెప్పలుగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన వారు ఉద్యోగాల వేటలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేలు, లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చేసిన వారికి కూడా ఉపాధి ఆమడ దూరంలోనే ఉంటోంది. ఏదో ఒక డిగ్రీలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల్లో దాదాపుగా సగం మందికి ఉపాధి లభించక పోవడం విస్మయం కలిగించే అంశమే అయినా వాస్తవం. 2020–21 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 1,34,763 మంది గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు. ఇదే సంవత్సరంలో 85 వేల వరకు విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేశారు. అయితే ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 46,539 మాత్రమే. అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నా, నైపుణ్యం ఆశించిన మేర లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఇటీవల ఓ అధ్యయనంలో తేల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక మండళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్యను అందించడం ఇప్పుడు అనివార్యమైంది. ఇంజనీరింగ్ విద్యకు అదనపు సాంకేతికత ఈ ఏడాది ఇంజనీరింగ్ విద్యకు మరింత సాంకేతికత జోడిస్తున్నారు. నాస్కామ్తో కలిసి ఇటీవల జేఎన్టీయూహెచ్ ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. రాబోయే కాలంలో ఏ తరహా సాంకేతికత పరిశ్రమలకు అవసరమో గుర్తించారు. దాన్ని ఇంజనీరింగ్ స్థాయి నుంచే విద్యార్థులకు బోధించడం ఇందులో ప్రత్యేకత. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు ఇందులో భాగస్వామ్యమవుతాయి. ఆ కంపెనీలే అవసరమైన సాఫ్ట్వేర్ లాంగ్వేజీని ఇంజనీరింగ్ విద్యార్థులకు అందిస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్ కోర్సుల్లో అంతర్జాతీయ మార్పులను ఎప్పటికప్పుడు ఈ సంస్థలు విద్యార్థుల ముందుకు తెస్తాయి. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు సైతం ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు ఓ వాహనం డిజైన్‌లో ముందుగా ఉపయోగించేది సాఫ్ట్వేర్. దాని సామర్థ్య పరీక్షలన్నీ కంప్యూటర్‌పైనే రూపొందిస్తారు. అదే విధంగా సివిల్‌లో నిర్మాణ రంగం మొత్తం సాఫ్ట్‌వేర్‌పైనే ఆధారపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ భాషతో కూడిన ప్రత్యేక ప్యాకేజీలు నాస్కామ్ విద్యార్థులకు అందిస్తుంది. అంతిమంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రణాళికల్లో మార్పులు సంప్రదాయ డిగ్రీ కోర్సులను మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఇటీవల ఓ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రయోగాత్మకంగా బీఏ హానర్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. తరగతి విద్య తక్కువ, క్షేత్రస్థాయిలో, ప్రాజెక్టు వర్క్ ఎక్కువగా ఉండేలా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తోంది. దేశవిదేశాల్లోని ఆర్థిక విధానాలను ఆర్థికశాస్త్ర అధ్యయనంలో జోడిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను రూపొందించే శక్తి సామర్థ్యాలు పెంపొందించేలా కోర్సుల్లో మార్పులు ఉండబోతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు డిగ్రీ కోర్సుల్లోనూ సాంకేతిక విద్యకు పెద్ద పీట వేస్తున్నారు. బీఎస్సీ డేటా సైన్స్‌ను కంప్యూటర్ ఇంజనీరింగ్‌తో సత్సమానంగా తీర్చిదిద్దేలా పాఠ్యాంశాలు రూపొందించారు. బీకాం విద్యార్థి కేవలం సబ్జెక్టుకే పరిమితం కాకుండా విద్యార్థి దశలోనే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం సాధించేందుకు అవసరమైన బోధన మెళకువలను ప్రవేశ పెడుతున్నారు. బీఏ కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ వైపు మళ్ళేందుకు వీలుగా కొన్ని రకాల సాఫ్ట్వేర్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది గొప్ప మార్పు స్కిల్ డెవలప్మెంట్తో కూడిన విద్య నేటి తరానికి అవసరం. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిగ్రీ విద్యార్థిని కూడా ఉపాధి వేటలో ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేయాలన్నది లక్ష్యం. ఇంజనీరింగ్ విద్యార్థి కూడా మరింత నాణ్యమైన విద్యను సొంతం చేసుకునేలా ఆలోచనలు చేస్తున్నాం. తద్వారా వీరు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సొంతం చేసుకునే వీలుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి చేస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
-
అమెజాన్ భారీ నియామకాలు
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది భారత్‌లో 8,000 మందిని కొత్తగా నియమించుకోనుంది. కార్పొరేట్, టెక్నాలజీ, కస్టమర్ సరీ్వస్, ఆపరేషన్స్ విభాగాల్లో హైదరాబాద్‌సహా మొత్తం 35 నగరాల్లో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2025 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలన్నది లక్ష్యమని అమెజాన్ హెచ్ఆర్ లీడర్ దీప్తి వర్మ తెలిపారు. ఇప్పటికే దేశంలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్టు చెప్పారు. మహమ్మారి కాలంలో మూడు లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు. -
క్రిప్టోకరెన్సీ.. భారీగా ఉద్యోగావకాశాలు
క్రిప్టోకరెన్సీల లావాదేవీలపై ప్రభుత్వం, నియంత్రణ సంస్థల వైఖరి ఎలా ఉన్నప్పటికీ.. దేశీయంగా వీటి ట్రేడింగ్, మైనింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలు పెద్ద సంఖ్యలో నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. వీటికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం కావడంతో ఎక్కువగా తత్సంబంధ అంశాల్లో పరిజ్ఞానమున్న ఇంజనీర్లకు డిమాండ్ ఉంటోంది. బ్లాక్‌చెయిన్ డెవలపర్, బ్యాక్ఎండ్ డెవలపర్, క్రిప్టో ఇంజినీర్లు మొదలైన వారికోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. వీరితో పాటు ప్రోడక్ట్ డెవలప్మెంట్, మార్కెటింగ్ సిబ్బంది నియామకాలు కూడా మొదలైనట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. సాంప్రదాయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలతో పోలిస్తే క్రిప్టో ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు కనీసం 25–30 శాతం అధికంగా ఉంటుండటంతో.. ఇంజినీర్లు వీటిపై ఆసక్తి చూపుతున్నట్లు వివరించాయి. దేశీయంగా క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు వార్షికంగా రూ. 9.5 లక్షల నుంచి ఉంటున్నాయి. రెండేళ్ల దాకా అనుభవం ఉన్నవారికి దాదాపు రూ. 22 లక్షల దాకా ప్యాకేజీ ఉంటోంది. ఇక సాలిడిటీ వంటి వినూత్న టెక్నాలజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్నవారికైతే ఏకంగా రూ. 45 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీ ఉంటోంది. ఇతర ఉద్యోగాలకు సంబంధించి మార్కెటింగ్, ప్రోడక్ట్ డెవలపర్లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఉదాహరణకు, అమెరికాలో లిస్టయిన కాయిన్‌బేస్ అనే భారీ క్రిప్టో ఎక్సే్చంజీ ప్లాట్‌ఫాం పెద్దయెత్తున నియామకాలు చేపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నట్లు కంపెనీ భారత విభాగ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ గుప్తా ఇటీవల వెల్లడించారు. వచ్చే ఏడాది.. రెండేళ్ల వ్యవధిలో భారత్‌లో పూర్తి స్థాయి హబ్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 2012లో ప్రారంభమైన కాయిన్‌బేస్ ప్లాట్‌ఫాంపై బిట్‌కాయిన్, ఎథీరియం, లైట్‌కాయిన్ వంటి పలు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ జరుగుతోంది. భిన్నమైన నైపుణ్యాలు.. ఇతర టెక్నాలజీ ప్లాట్‌ఫాంలతో పోలిస్తే క్రిప్టో రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు భిన్నంగా ఉంటాయి. ఇవి మార్కెట్లో నేర్చుకోవడానికి అంత సులువుగా లభించవు. క్రిప్టో రంగానికి బ్లాక్‌చెయిన్ సాంకేతికతలో సుశిక్షితులైన ఇంజినీర్లు అవసరమవుతారు. కోడ్‌ను వేగవంతంగా రూపొందించడం, వినియోగంలోకి తేవడంతో పాటు కోడ్ భద్రతపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి వినియోగంలోకి తెచ్చాక సొల్యూషన్స్‌లో మార్పులు చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు కాబట్టి ఏ కాస్త తప్పిదం జరిగినా అటు యూజర్లు, ఇటు ప్లాట్‌ఫాంలు భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కనుక హ్యాకింగ్ దాడులనూ సమర్ధంగా తట్టుకునేలా ప్లాట్‌ఫాంలు సురక్షితంగా ఉండాలి. హ్యాకింగ్ జరిగితే సెకన్లలో కోట్ల డబ్బు తుడిచిపెట్టుకుపోతుంది. దీనికి కోడర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంతటి రిస్కీ వ్యవహారం కాబట్టి కోడర్లకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. సందిగ్ధంలో ఉద్యోగార్థులు.. జీతభత్యాలు ఆకర్షణీయంగా ఉన్నా, క్రిప్టో సంస్థలపై నియంత్రణపరంగా స్పష్టత లేకపోవడంతో వీటిలో చేరడానికి ఉద్యోగార్థులు వెనుకాడుతున్నారు. క్రిప్టో కరెన్సీకి తాను అనుకూలమా లేక ప్రతికూలమా అన్న దానిపై రిజర్వ్ బ్యాంక్ ఇప్పటిదాకా స్పష్టతనివ్వలేదు. ఈ అనిశ్చితితో హైరింగ్‌పైనా ప్రభావం పడుతోంది. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియని క్రిప్టో రంగంలోని సంస్థల్లో చేరడానికి చాలా మంది ఇష్టపడటం లేదని క్రిప్టో ఎక్సే్చంజీ నిర్వాహకులు అంటున్నారు. ఉద్యోగార్థులు చేరాలనుకున్నా వారి కుటుంబాల ఆందోళన వల్ల సదరు అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక కోర్సులు... అర్హులైన ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్న వారు, మైనింగ్ చేస్తున్నవారిని కూడా రిక్రూట్ చేసుకునేందుకు క్రిప్టో సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైతే వారు రిఫ్రెషర్ కోర్సులు నేర్చుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రత్యక్షంగా ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చే అనుభవమనేది ఇతరత్రా విద్యాసంస్థల్లో నేర్చుకున్న దానికి మించి ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. క్రిప్టో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా ప్రత్యేక కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని ఎంఐటీ మీడియా ల్యాబ్ .. క్రిపోకరెన్సీలపై ఆరు వారాల స్వల్పకాలిక ఆన్లైన్ కోర్సు అందిస్తోంది. గెట్స్మార్టర్ అనే డిజిటల్ ఎడ్యుకేషన్ కంపెనీ భాగస్వామ్యంతో అందించే ఈ కోర్సు ఫీజు రూ. 1.93 లక్షలుగా ఉంది. ఇటీవలే సింప్లీలియర్ అనే అంతర్జాతీయ డిజిటల్ నైపుణ్యాల సంస్థ .. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై నాలుగు నెలల ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం అందించేందుకు ఐఐటీ కాన్పూర్‌తో జట్టు కట్టింది. నిపుణుల కొరత... మధ్యవర్తి ప్రమేయం లేకుండా రెండు వర్గాలు క్రిప్టో లావాదేవీలు నిర్వహించడానికి ఉపయోగపడే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను స్మార్ట్ కాంట్రాక్టులుగా వ్యవహరిస్తారు. కొన్ని ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందిన వారికి డిమాండ్ అధికంగా ఉంటోంది. ఉదాహరణకు బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫాంలలో స్మార్ట్ కాంట్రాక్టులను అమలు చేసేందుకు ఉపయోగించే సాలిడిటీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఇది 2014లో తెరపైకి వచ్చింది. ఈ లాంగ్వేజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్న వారు కూడా వార్షికంగా రూ. 45 లక్షల దాకా వేతనం అందుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సుశిక్షితులైన వారి కొరత తీవ్రంగా ఉండటంతో ఎంతైనా ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉంటున్నాయి. బ్లాక్‌చెయిన్ ఇంజినీర్లకు నెలకు రూ. 1.45 లక్షల దాకా వేతనం ఇచ్చి తీసుకునేందుకు యునోకాయిన్ వంటి సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ నిపుణులు దొరకడం లేదు. దీంతో ప్రతిభావంతులైన ఇంజనీర్లను నియమించుకుని, వారికి శిక్షణనిచ్చుకోవాల్సి వస్తోంది. కాయిన్‌బేస్ వంటి పెద్ద సంస్థలు నియామకాలను గానీ చేపడితే.. పరిస్థితులు మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దీనివల్ల మరింత మంది శిక్షణ పొంది, నిపుణుల కొరత కొంత తీరవచ్చని పేర్కొన్నారు. కేవలం ఇంజినీర్లే కాకుండా క్రిప్టో ఎక్సే్చంజీల్లో ఇతరత్రా సిబ్బంది అవసరం కూడా ఉంటోంది. -
చలో యూకే.. పోస్ట్ స్టడీ వర్క్ ఇక.. ఓకే!
యూకేలో ఉన్నత విద్య.. మన దేశ విద్యార్థులకు.. టాప్–4 డెస్టినేషన్! అకడమిక్‌గా పలు వెసులుబాట్లు ఉండటంతో.. మన విద్యార్థులు యూకే వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా యూకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త విధానంతో.. బ్యాచిలర్ నుంచి పీహెచ్డీ వరకు..ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించొచ్చు. ఉద్యోగం దొరికితే.. ఆ దేశంలోనే స్థిరపడొచ్చు. ఇంతకీ.. ఆ కొత్త విధానం ఏంటి? అంటే.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా!! ఈ విధానం ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానంతో.. భారత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఈ నేపథ్యంలో.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధి విధానాలు.. భారత విద్యార్థులకు ప్రయోజనాలు.. పోస్ట్ స్టడీ వర్క్ గరిష్ట సమయం తదితర అంశాలపై విశ్లేషణ... అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం ఇటీవల గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు రెండేళ్లు, పీహెచ్డీ విద్యార్థులు మూడేళ్లుపాటు పోస్ట్ స్టడీ వర్క్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా మంజూరైతే.. ఆఫర్ లెటర్ లేకపోయినా.. అక్కడే ఉండి ఉద్యోగానేష్వణ చేయొచ్చు. ఉద్యోగం లభిస్తే గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి ముగిశాక.. ఇతర వర్క్ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు గ్రాడ్యుయేట్ వీసాతో ఉద్యోగం పొంది.. రెండేళ్లు, లేదా మూడేళ్ల వ్యవధి పూర్తయ్యాక.. స్కిల్డ్ వర్కర్ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. స్కిల్డ్ వర్కర్ వీసా మంజూరైతే.. సదరు అభ్యర్థులు మరింత కాలం యూకేలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. గ్రాడ్యుయేట్ వీసాకు అర్హతలు ► జూలై 1, 2021 నుంచి గ్రాడ్యుయేట్ రూట్ వీసా అమల్లోకి వచ్చింది. ► ఈ వీసా పొందేందుకు యూకే ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలు పేర్కొంది. ► గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే నాటికి యూకేలో ఉండాలి. ► ప్రస్తుతం స్టూడెంట్ వీసా లేదా చదువుల కోసం ఇచ్చే టైర్–4 జనరల్ వీసా కలిగుండాలి. ► యూకే విద్యా విధానం నిబంధనల ప్రకారం–నిర్దేశించిన కనీస కాలపరిమితితో ఆయా కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ► కనీసం 12 నెలల వ్యవధిలోని కోర్సులను స్టూడెంట్ వీసా లేదా, టైర్–4 జనరల్ వీసా ద్వారా చదివుండాలి. స్టూడెంట్ వీసా ముగిసే లోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకొని.. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం పొందాలనుకునే విద్యార్థులు.. తమ స్టూడెంట్ వీసా లేదా టైర్–4 జనరల్ వీసా కాలపరిమితి ముగిసేలోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిబంధన కల్పిస్తున్న మరో ముఖ్యమైన వెసులుబాటు.. విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్లు పొందకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా పొందేందుకు వీలుగా తాము కోర్సులు పూర్తిచేసుకున్న యూకే ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ‘ఆన్లైన్’ విద్యార్థులకూ.. అవకాశం కరోనా కారణంగా యూకే యూనివర్సిటీల్లో ఆన్లైన్ విధానంలో కోర్సులు చదివిన విద్యార్థులు కూడా గ్రాడ్యుయేట్ వీసా విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా పరిస్థితుల్లో 2020 నుంచి లాక్డౌన్, విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దాంతో విద్యా సంస్థలు ఆన్లైన్లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించి... బోధన సాగించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈ వెసులుబాటు కల్పించారు. ఫలితంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితితో స్టూడెంట్ వీసా లేదా టైర్–4 వీసా కలిగి.. జనవరి 24, 2020 నుంచి సెప్టెంబర్ 27, 2021లోపు యూకే ఇన్స్టిట్యూట్లలో యూకే వెలుపలే ఉంటూ.. ఆన్లైన్ విధానంలో కోర్సులు అభ్యసించిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ► గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లో పూర్తి చేయాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. ► పాస్ట్ పోర్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, స్కాలర్షిప్ లేదా స్పాన్సర్షిప్ ప్రొవైడర్ నుంచి ధ్రువీకరణ పత్రం, కోర్సు ప్రవేశ సమయంలో ఇచ్చే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్(సీఏఎస్) రిఫరెన్స్ నెంబర్, బయో మెట్రికల్ రెసిడెన్స్ పర్మిట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ► పీహెచ్డీ విద్యార్థుల విషయంలో అకడమిక్ టెక్నాలజీ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికెట్ కూడా అవసరం. ఎనిమిది వారాల్లో నిర్ణయం ఆన్లైన్లో గ్రాడ్యుయేట్ వీసా దరఖాస్తును పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకునేందుకు గరిష్టంగా ఎనిమిది వారాల సమయం పడుతుందని యూకే ఇమిగ్రేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తుకు ఆమోదం లభిస్తే ఈ–మెయిల్ లేదా యూకే ఇమిగ్రేషన్ పోర్టల్‌లో దానికి సంబంధించిన ధ్రువీకరణను తెలుసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసాతో ప్రయోజనాలు ► కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం లభిస్తుంది. ► ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. ► స్వయం ఉపాధి పొందొచ్చు. స్వచ్ఛంద సేవకు అవకాశం ఉంటుంది. ► గ్రాడ్యుయేట్ వీసా కాల పరిమితి సమయంలో యూకే నుంచి స్వదేశానికి లేదా ఇతర దేశాలకు వెళ్లి, మళ్లీ యూకేకు తిరిగిరావచ్చు. నిపుణుల కొరతే కారణం ► యూకేలో పలు రంగాల్లో నిపుణులైన మానవ వనరుల కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం తాజాగా గ్రాడ్యుయేట్ రూట్ వీసాను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ► ప్రస్తుతం యూకేలో హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో నిపుణుల కొరత కనిపిస్తోంది. ► 2030 నాటికి ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం కూడా తాజా గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం తేవడానికి మరో కారణంగా చెబుతున్నారు. భారత విద్యార్థులకు ప్రయోజనం గ్రాడ్యుయేట్ రూట్ వీసాతో భారత విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. గత నాలుగైదేళ్లుగా యూకేకు వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తాజా విధానంతో వేల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. ఈ వీసా కాల పరిమితి సమయంలో అక్కడే ఉండి ఉద్యోగం సాధించి.. అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ కూడా పొందొచ్చు. యూకేలో విద్యార్థులు యూకేలో విద్య కోసం గత నాలుగేళ్లుగా భారత్ నుంచి వెళుతున్న విద్యార్థుల సంఖ్య వివరాలు.. » 2016 – 11,328 » 2017 – 14,435 » 2018 – 19,505 » 2019 – 34,540 » 2020 – 49,884 గ్రాడ్యుయేట్ రూట్ వీసా.. ముఖ్యాంశాలు ► జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం. ► బ్యాచిలర్, పీజీ విద్యార్థులు రెండేళ్లు; పీహెచ్డీ అభ్యర్థులు మూడేళ్లు అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించొచ్చు. ► 2020, 2021లో యూకేలోని వర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం. ► కోవిడ్ నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ విధానంలో అభ్యసించిన వారు కూడా అర్హులే. ► ఉద్యోగం సొంతం చేసుకున్నాక.. వర్క్ వీసాకు బదిలీ చేసుకునే వీలుంటుంది. ► కోర్సుల సర్టిఫికెట్లు రాకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. ఎంతో సానుకూల అంశం యూకే తాజా నిర్ణయం.. భారత విద్యార్థులకు ఎంతో సానుకూల అంశంగా చెప్పొచ్చు. యూకేలోని విదేశీ విద్యార్థుల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంటోంది. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. గ్రాడ్యుయేట్ వీసా ద్వారా భారత విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రయోజనం పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం విదేశీయులకు ఇచ్చే వీసాల విషయంలోనూ.. దాదాపు యాభై శాతం వీసాలు మన దేశానికి చెందిన వారికే లభిస్తున్నాయి. – జె.పుష్పనాథన్, డైరెక్టర్ (సౌత్ ఇండియా), బ్రిటిష్ కౌన్సిల్ -
పీడబ్ల్యూసీ రూ.1,600 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ పీడబ్ల్యూసీ భారత్‌లో వచ్చే అయిదేళ్లలో రూ.1,600 కోట్ల వరకు పెట్టుబడి చేయనున్నట్టు బుధవారం ప్రకటించింది. అదనంగా 10,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించింది. ఈ కాలంలో క్యాంపస్‌ల ద్వారా నియామకాలను అయిదురెట్లకుపైగా పెంచనున్నట్టు వివరించింది. డిజిటల్, క్లౌడ్, సైబర్, అనలిటిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగాల్లో ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది. న్యూ ఈక్వేషన్ పేరుతో నూతన వ్యాపార వ్యూహాన్ని ప్రకటించిన సందర్భంగా సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. మారుతున్న పోకడలు, వేలాది క్లయింట్లు, భాగస్వాములతో సంప్రదింపుల తదనంతరం ఈ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు వివరించింది. ‘భారతదేశం బలమైన ఆర్థిక మూల సిద్ధాంతాలను కలిగి ఉంది. జనాభా రూపంలో భారీ ప్రయోజనాలు, ఆవిష్కరణను పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. మా కొత్త వ్యూహం సంస్థకు, ఖాతాదారులకు, దేశ ఆర్థికాభివృద్ధిని మరింతగా పెంచడానికి.. అలాగే దేశీయ మార్కెట్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, సమాజానికి ఎక్కువ అవకాశాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది’ అని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ సంజీవ్ క్రిషన్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో సంస్థకు 15,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఉద్యోగులు, భాగస్వాముల నైపుణ్య శిక్షణకు ఆదాయంలో కనీసం 1 శాతం వెచ్చిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 155 దేశాల్లో సంస్థ విస్తరించింది. 2,84,000ల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. -
ఇన్ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఆంద్రప్రధేశ్లోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక కారిడార్ వంటి భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇన్‌క్యాప్ రూపొందించిన సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. త్వరలో విమానాశ్రయ నిర్మాణ దిశగా అడుగులు పడనున్నాయి. అలాగే రాష్ట్రంలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ), నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టులకు నోడల్ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఇన్‌క్యాప్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ సేవలకు బిడ్లు.. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు, వాటి అమలును పర్యవేక్షించడానికి కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పవన మూర్తి సాక్షికి తెలిపారు. ఆసక్తిగల సంస్థలు ఆగస్టు 25లోగా బిడ్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ లీడర్, ఫైనాన్స్, టెక్నికల్ అంశాల విషయంలో కన్సల్టెన్సీ సేవలు అందించాలి. ‘పైలెట్ శిక్షణ’కూ బిడ్లు కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సాంకేతిక నివేదికను తయారు చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి ఇన్‌క్యాప్ బిడ్లను ఆహ్వానించింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టును దృష్టిలో పెట్టుకొని కర్నూలు చుట్టుపక్కల ఏపీఐఐసీ పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో పైలెట్ శిక్షణతో పాటు ఇతర అవకాశాలను పరిశీలించి టెక్నో ఫీజబిలిటీ స్టడీ రిపోర్ట్ (టీఎఫ్ఆర్)ను ఇన్‌క్యాప్ తయారు చేస్తోంది. దేశీయ విమానయాన రగంలో వస్తున్న మార్పులు, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు, ఈ శిక్షణ కేంద్రం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలతో నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు ఆగస్టు 18లోగా ఈ మెయిల్ ద్వారా బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఇన్‌క్యాప్ కోరింది. -
డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లు.. పేరు నమోదు చేసుకుంటే చాలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ అవకాశాలు ఇకపై మీ వద్దకే రాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాభవం కోల్పోయిన ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు నింపుతోంది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లను మోడల్ కెరీర్ సెంటర్లుగా మారుస్తోంది. అన్ని కేంద్రాలను అనుసంధానం చేస్తూ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వీటికి గ్రామ, వార్డు సచివాలయాలను అనుసంధానం చేస్తోంది. తద్వారా సచివాలయాల్లోనే పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ విషయాన్ని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.లావణ్య వేణి ‘సాక్షి’కి తెలిపారు. నిరుద్యోగులు వారి గ్రామాల నుంచే.. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు, జాబ్ మేళాలు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా డిజిటల్ ఎక్స్చేంజ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్న వివరాలు ఆయా జిల్లాలకే పరిమితమయ్యేవని పేర్కొన్నారు. ఇప్పుడు అన్ని జిల్లాల డేటాను.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెరీర్ సర్వీస్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. రెండు దశల్లో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని లావణ్య వేణి తెలిపారు. మెసేజ్‌లతో ఎప్పటికప్పుడు సమాచారం.. తొలి దశ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను ఆగస్టు15 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లావణ్య వేణి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 23 ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాల్లో ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న అరుంధతి సాఫ్ట్వేర్ స్థానంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన నూతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి.. అన్ని కేంద్రాలను అనుసంధానిస్తామని చెప్పారు. వచ్చే 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సమాచారాన్ని కేంద్రానికి చెందిన కెరీర్ సర్వీస్ పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియ కూడా జరుగుతోందన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరు నమోదు చేసుకున్న వారికి.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగ అవకాశాలు సమాచారం మెసేజ్‌ల రూపంలో ఎప్పటికప్పుడు వస్తుందన్నారు. జాబ్ మేళాలు, జాబ్ ఫెయిర్స్, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక సమాచారాలు కూడా తెలియజేస్తామని చెప్పారు. సర్టిఫికేట్స్ అప్‌గ్రేడ్ తదితరాలను సచివాలయాల నుంచే చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండో దశలో పరిశ్రమలు, కంపెనీలతో.. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు లావణ్య తెలిపారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖలతో పాటు విద్యా సంస్థలు, ఇతర శిక్షణ సంస్థలతో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను అనుసంధానం చేయనున్నామని వివరించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తెలిపే ‘ఓవర్సీస్ మ్యాన్‌పవర్’ పోర్టల్‌తో కూడా దీనిని అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కంపెనీలు ఏటా రిక్రూట్మెంట్ కేలండర్‌తో పాటు ఏటా చేపట్టిన నియామకాల వివరాలను ఆన్లైన్ ద్వారా తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏ రంగంలో అధికంగా ఉన్నాయన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. రెండో దశ పనులు నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు లావణ్య తెలిపారు. -
ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి: టీమ్‌లీజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలను సడలించడం, వ్యాపార కార్యకలాపాలు, అమ్మకాలను పెంచడంపై దృష్టి సారించడంతో ఫ్రెషర్ల నియామకంపై సానుకూల ప్రభావం చూపుతోందని టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. 661 చిన్న, మధ్య, భారీ కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ‘ప్రస్తుత త్రైమాసికంలో ఫ్రెషర్లను నియమించే ఉద్దేశం 7 శాతం పెరిగింది. జూనియర్ స్థాయి సిబ్బందిని చేర్చుకునే అంశం కూడా సానుకూల పథంలో ఉంది. జూలై–సెప్టెంబరులో పెద్ద ఎత్తున నియామకాలు ఉండే అవకాశం ఉంది. చాలా పరిశ్రమలు సెకండ్ వేవ్ ప్రభావాన్ని అధిగమించి, వృద్ధి దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. జీఎస్టీ వసూళ్లు, ఈ–వే బిల్లులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, విద్యుత్ డిమాండ్, రైళ్ల ద్వారా సరుకు రవాణా, పెట్రోల్ వినియోగం వంటివి సెకండ్ వేవ్ ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభించాయని సూచిస్తున్నాయి. ఈ అంశాలతో నియామక సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది’ అని వివరించింది. ప్రధానంగా ఐటీ రంగంలో నియామకాల జోరు ఉంటుందని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
నిరుద్యోగుల పాలిట ‘సిరి’ సిటీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రజల సంక్షేమం కోసం పరితపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన అది. రాళ్లు, రప్పలతో కూడిన భూముల్లో.. వర్షాధారిత వ్యవసాయంతో ప్రజలు అత్యంత దుర్భర జీవనం సాగించిన ప్రాంతమది. వారి జీవితాలను, ఆ ప్రాంతాన్ని మెరుగుపర్చాలనే సంకల్పం ఆ మహా నాయకుడిలో మొగ్గ తొడిగింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడతాయని భావించిన ఆయన ‘సెజ్’ (స్పెషల్ ఎకనమిక్ జోన్) ఏర్పాటు చేశారు. ఇప్పుడది ఇంతింతై.. ఒటుడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందుతోంది. చిత్తూరు జిల్లాకు మణిహారంగా నిలుస్తోంది. పారిశ్రామక వాడగా మొదలై.. పారిశ్రామిక నగరంగా వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల పరిధిలో 14 గ్రామాల మధ్య శ్రీసిటీని ఆగస్టు 8, 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతం 5 0వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరో ఐదేళ్లలో 1.50 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. పారిశ్రామిక వాడగా మొదలైన శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకుంది. సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకుని వర్క్, లైవ్, లెర్న్, ప్లే అనే విధానంలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందుతోంది. ఇందులో ట్రిపుల్ ఐటీ, డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయి. నాలుగు లేన్ల రహదారులు వచ్చి చేరాయి. 3 లక్షల మంది నివసించేందుకు వీలుగా భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కన్జర్వేషన్ పద్ధతిలో భూగర్భ జలాలను పెంపొందించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా చెరువులు నిర్మించారు. కాలువల ద్వారా ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరేలా లింక్ చానల్స్ నిర్మించారు. తద్వారా భూగర్భ జలాలు 4 మీటర్లు పెరిగాయి. శ్రీసిటీలో అన్ని పరిశ్రమలకు శుద్ధి చేసిన నాణ్యమైన నీరు సరఫరా చేస్తూనే.. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత, వ్యర్ధ జలాలను శుద్ధి చేసి ఉద్యాన వనాలను పెంచుతున్నారు. 50 ఎకరాల్లో ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. సెజ్ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటారు. ఫలితంగా కాలుష్య రహిత ప్రాంతం ఇక్కడ ఆవిష్కృతమైంది. సెకనుకు 3 సెల్ఫోన్ల తయారీ శ్రీసిటీ మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లల్లో ప్రతి సెకనుకు 3 సెల్ఫోన్ల చొప్పున నిమిషానికి 180 తయారవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సిమెన్స్ సంస్థ సంయుక్తంగా శ్రీసిటీలో టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పి నిరుద్యోగులను నిష్ణాతుల్ని చేస్తున్నారు. ఇలా రెండేళ్లలో 5వేల మందిని తీర్చిదిద్దారు. శిక్షణ తర్వాత ఉద్యోగం చూపించే లక్ష్యంతో ట్రైనింగ్ ఇస్తుండటం విశేషం. ఇక్కడ 27 దేశాలకు చెందిన 185 కంపెనీలకు వివిధ ఉత్పత్తులను విదేశీ సామర్థ్యంతో చేపడుతున్నారు. ఇస్రో, నాసా పరిశోధన సంస్థల రాకెట్ ప్రయోగంలో వినియోగించే లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంక్స్, ఇసుజి వాహనాలు, సిద్ధార్థ లాజిస్టిక్స్, రఫేల్ యుద్ధ విమానాల ల్యాండింగ్ సీలింగ్ నిర్మాణం ఇక్కడే తయారవుతున్నాయి. డ్రగ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు సైతం ఇక్కడే చేస్తున్నారు. మహిళలకూ ఆర్థిక స్వావలంబన శ్రీసిటీ సెజ్ కారణంగా ఎందరో మహిళలు ఆర్థికంగా లాభపడ్డారు. దశాబ్ద కాలంలో అక్షరాస్యత అత్యంత వేగంగా పుంజుకుంది. పుష్కర కాలంలోనే ఇక్కడి పౌరుల సగటు ఆదాయం 200 శాతం పెరిగింది. ప్రతి కుటుంబంలో ఉద్యోగులు ఉన్నారు. పూరి గుడిసెల స్థానంలో అందమైన ఇళ్లు వెలిశాయి. శ్రీసిటీ పరిధిలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ వేలాది మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 50 శాతం మంది మహిళలే ఉండటం మరో విజయం. ఫాక్స్గాన్ సెల్ఫోన్ల తయారీ కంపెనీలో దాదాపు 15 వేల మంది మహిళలు ఉద్యోగులున్నారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలకు కూడా స్కిల్ డెవలప్మెంట్, డీఆర్డీఏ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి సెల్‌ఫోన్ ఉత్పత్తి ఉద్యోగాల్లో నియమించారు. ఎంఐ, ఆపిల్, నోకియా, ఒన్ ప్లస్ ఫోన్లు ఇక్కడ తయారై ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. తాజాగా శుక్రవారం కోవిడ్ బాధితులకు రూ.20 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల ఆక్సిజన్‌ను శ్రీసిటీ విరాళంగా అందించింది. -
కోలుకుంటున్న మెట్రో నగరాలు..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి మెట్రో నగరాలు క్రమంగా కోలుకుంటున్నాయి. కరోనా క్రీనీడ నుంచి బయటపడుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతి ఉన్న గత నెలలతో పోల్చితే అక్టోబర్‌లో మెట్రోనగరాల్లో జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అవకాశాలు సంబంధిత కార్యకలాపాలు (హైరింగ్ యాక్టివిటీస్) ఐదు శాతానికిపైగా పెరిగినట్టు జాబ్ పోర్టల్ ‘స్కై కీ’(ఎస్సీఐ కేఈవై) తాజా నివేదికలో వెల్లడైంది. పండుగల సీజన్‌తోపాటు కోవిడ్ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నా భారత్‌లోని మెట్రో నగరాల్లో హైరింగ్ యాక్టివిటీస్, జాబ్ పోస్టింగ్‌లు సెపె్టంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో 5.55 శాతం పెరిగినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశంలోని వివిధ రంగాలు నెమ్మదిగా పట్టాలెక్కి కరోనాకు పూర్వస్థితిని చేరుకునే దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైరింగ్ యాక్టివిటీస్ ఏ నెలకు ఆ నెలకు పెరుగుతూ వస్తున్నట్టు, రాబోయే నెలల్లో ఇది మరింత పుంజుకోనున్నట్టు ‘స్కై కీ’సహ వ్యవస్థాపకుడు అక్షయ్ శర్మ స్పష్టం చేశారు. పుంజుకుంటున్న ఐటీ రంగం కోవిడ్ మహమ్మారి కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం మరింత పుంజుకుంటోంది. ఈ రంగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జాబ్ పోస్టింగ్‌లు పెరుగుతున్నాయి. సుదీర్ఘ లాక్డౌన్ విధింపు కారణంగా ఐటీ సెక్టార్‌తోపాటు దాదాపుగా అన్ని రంగాల్లో ‘వర్క్ ఫ్రం హోం’ పనివిధానాన్ని ప్రవేశపెట్టడం కూడా ఐటీ, దాని ఆధారిత సేవల రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రధానంగా టెలికం సెక్టార్లో హైరింగ్ యాక్టివిటీస్ పెరగడానికి ఇంటి నుంచి పనిచేసే పద్ధతి దోహదపడినట్టు ఈ రిపోర్ట్ తెలిపింది. సేల్స్, స్ప్రింగ్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్స్, ఆటోమేషన్ టెస్టింగ్, మైక్రో సర్వీసెస్‌లలో జాబ్ పోస్టింగ్స్ అవకాశాలు వృద్ధి చెందినట్టు ఈ నివేదిక వెల్లడించింది. (చదవండి: నిరుద్యోగ యువతకు ఊరట..) ముందంజలోని రంగాలు ఇవే... రంగాలవారీగా చూస్తే వివిధ రంగాలకు సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్లలో హైరింగ్ యాక్టివిటీస్ గణనీయంగా పెరిగాయి. ఈ కామర్స్, ఫార్మాసూటికల్స్, ప్యాకేజింగ్, టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్, కన్సల్టింగ్, ఐటీ సర్వీసెస్, రెన్యువబుల్ ఎనర్జీ, హాస్పాటాలిటీతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగాలు ఉద్యోగ అవకాశాల కల్పన, హైరింగ్ యాక్టివిటీస్‌లో అగ్రభాగాన ఉన్నట్టుగా ‘స్కై కీ’నివేదిక స్పష్టం చేసింది. -
ఉపాధికి పండుగ సీజన్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ–కామర్స్ కంపెనీలు, డెలివరీ సేవల సంస్థలు గణనీయంగా తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష పైచిలుకు సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, రవాణా భాగస్వామ్య సంస్థలు, ప్యాకేజింగ్ వెండార్లు, డెలివరీ భాగస్వాములు, అమెజాన్ ఫ్లెక్స్ పార్ట్నర్స్, హౌస్‌కీపింగ్ ఏజెన్సీల ద్వారా పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగినట్లు తెలిపింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిపై పెట్టుబడులు కొనసాగించడం ద్వారా 2025 నాటికి భారత్‌లో 10 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యసాధనకు ఇవి తోడ్పడనున్నాయని అమెజాన్ తెలిపింది. ‘ఈ పండుగ సీజన్లో దేశం నలుమూలలా ఉన్న కస్టమర్లకు అత్యంత వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను చేర్చడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం‘ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. డెల్హివెరీలో ఇలా... సరఫరా సేవల సంస్థ డెల్హివెరీ కూడా వచ్చే కొద్ది వారాల్లో వివిధ విభాగాల్లో 15,000 పైచిలుకు సీజనల్ సిబ్బందిని తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్లో దాదాపు 6.5–7.5 కోట్ల ప్యాకేజీలను హ్యాండిల్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 100% అధికమని వివరించింది. ‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. గడిచిన ఏడాది కాలంలో బిలాస్పూర్, బెంగళూరు, భివండి వంటి ప్రాంతాల్లో మెగా ట్రక్ టెర్మినల్స్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే 18–24 నెలల్లో విస్తరణపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం‘ అని డెల్హివెరీ ఎండీ సందీప్ బరాసియా వెల్లడించారు. మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు : రెడ్‌సీర్ ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ సంస్థల ద్వారా దాదాపు మూడు లక్షల పైచిలుకు ఉపాధి అవకాశాల కల్పన జరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. వీటిలో 30 శాతం ఉద్యోగాలు లాజిస్టిక్స్ సంస్థల్లో ఉండనున్నాయి. ఈ పండుగ సీజన్లో ఆన్లైన్లో అమ్ముడయ్యే ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 7 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుందని రెడ్‌సీర్ అంచనా. గతేడాది ఇది 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్ మొదలైన ఉత్పత్తులకు గణనీయంగా డిమండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అభివర్ణించారు. మంగళవారం కరీంనగర్లో అర్బన్ మిషన్ భగీరథ కింద రూ.110 కోట్లతో చేపట్టిన ‘ప్రతిరోజూ తాగునీటి సరఫరా’పథకాన్ని, ఎల్ఎండీ సమీపంలో నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నైపుణ్యం ఒకరి సొత్తు కాదని ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతో నైపుణ్యం ఉన్న మేధావులు వస్తున్నారని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాస్తా ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారడంతో నైపుణ్యం గల వారందరికీ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వరంగల్‌లో ఐటీ సెంటర్‌ను ప్రారంభించామని, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ టవర్‌కు కరీంనగర్ కేంద్ర స్థానం అయిందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు రూ.56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవని, ప్రసుత్తం రూ.1.28 లక్షల కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లో విద్యను అభ్యసిస్తున్న వారు ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకు వలస పోకుండా, స్థానికంగా ఐటీ ఉద్యోగాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ చుట్టు పక్కన ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఇక్కడి ఐటీ టవర్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన నైపుణ్యాన్ని మార్చుకుంటూ వెళ్లాలని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తే వారికి ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్లో మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు. కాగా, కరీంనగర్ ఐటీ సెంటర్లో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్ ఐటీ కంపెనీలో 432 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగా.. వారికి మంగళవారం నియామక పత్రా లు కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కేబుల్ బ్రిడ్జిని పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
కెనడాలో భారీగా ఉద్యోగ నియామకాలు: సర్వే
ఒటావో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బతో అన్ని దేశాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కెనడాలో మాత్రం త్వరలో 7లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నానోస్ రీసెర్చ్ సర్వే తెలిపింది. అయితే కరోనా దెబ్బతో 30 శాతం ఉద్యోగాలు కోల్పోయారని, ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో కంపెనీలు తిరిగి ఉద్యోగులను నియమించుకుంటున్నాయని సర్వే తెలిపింది. కరోనా కారణంగా కెనడాలో 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, అందులో ప్రస్తుతం 30 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశముందని నివేదిక తెలిపింది. ఈ సర్వేను జూన్ 28నుంచి జులై 2 తేదీల్లో నిర్వహించారు. మరోవైపు కెనడాలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని, త్వరలోనే కొత్త వారికి ఉద్యోగాలు లభించే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
వైద్య సేవల్లో ముందుండే.. పారామెడికల్!
పారామెడికల్ సిబ్బంది.. రోగ నిర్థారణలో, చికిత్సలో, వ్యాధిని తగ్గించి రోగికి ఉపశమనం కల్పించడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. ఈసీజీ, స్కానింగ్‌లు, రక్త పరీక్షలు వంటి అనేక రకాలపరీక్షలు నిర్వహించి డాక్టర్లకు రిపోర్టులు ఇస్తారు. తద్వారా వ్యాధి నిర్థారణలో వైద్యులకు సహాయపడతారు. సంబంధిత పారామెడికల్ కోర్సులను పూర్తిచేయడం ద్వారా ఆయానైపుణ్యాలు సొంతం చేసుకుంటారు. వాస్తవానికి ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీహెచ్ఎంఎస్/ నర్సింగ్/ బీవీఎస్సీ/ఫార్మసీ/ఆయూష్ కోర్సులను లక్ష్యాలుగా చేసుకుంటారు. వీటితోపాటు ‘పారామెడికల్ కోర్సుల’నూఎంపికచేసుకోవచ్చు. తద్వారా తక్షణం ఉపాధికి మార్గం వేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్నఅభ్యర్థులకు అందుబాటులో ఉన్న పారామెడికల్కోర్సుల గురించి తెలుసుకుందాం... పారా మెడికల్ కోర్సులు పారామెడికల్‌కు సంబంధించి డిగ్రీ స్థాయి కోర్సులు » డిప్లొమా కోర్సులు » సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ స్థాయి పారామెడికల్ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, ఓటీటీ (ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ)లో బీఎస్సీ; డయాలసిస్ టెక్నాలజీలో బీఎస్సీ; ఎంఎల్టీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)లో బీఎస్సీ; ఎక్స్–రే టెక్నాలజీలో బీఎస్సీ; రేడియోగ్రఫీలో బీఎస్సీ; మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో బీఎస్సీ; మెడికల్ రికార్డ్ టెక్నాలజీలో బీఏఎస్ఎల్పీ; ఆప్తాల్మిక్ టెక్నాలజీలో బీఎస్సీ; బీఎస్సీ ఆడియాలజీ; స్పీచ్ థెరపీలో బీఎస్సీ; ఆప్టోమెట్రీలో బీఎస్సీ; అనస్తీషియా టెక్నాలజీలో బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ♦ పైన పేర్కొన్న పలు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల కాల వ్యవధి 3 ఏళ్లు. వీటిల్లో కొన్ని కోర్సుల కాల వ్యవధి 4 ఏళ్లుగా ఉంది. ♦ అర్హత: బయాలజీ సబ్జెక్టుతో 10+2 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ స్థాయి పారామెడికల్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పారామెడికల్ డిప్లొమా కోర్సులు ఫిజియోథెరపీలో డిప్లొమా, ఆక్యుపేషనల్ థెరపీలో డిప్లొమా, డాట్(డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ), డయాలసిస్ టెక్నాలజీలో డిప్లొమా; డీఎంఎల్టీ(డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), ఎక్స్–రే టెక్నాలజీలో డిప్లొమా, రేడియోగ్రఫీలో డిప్లొమా, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ నర్సింగ్ కేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఆప్తాల్మిక్ టెక్నాలజీలో డిప్లొమా, డీహెచ్ఎల్ఎస్ (డిప్లొమా ఇన్ హియరింగ్ అండ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్), అనస్తీషియా టెక్నాలజీలో డిప్లొమా, డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్, గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో డిప్లొమా, కమ్యూనిటీ హెల్త్‌కేర్‌లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ♦ పారామెడికల్ డిప్లొమా కోర్సుల కాల వ్యవధి ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల మధ్య ఉంటుంది. ♦ అర్హత: డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి, ఇంటర్ చదివిన విద్యార్థులు అర్హులు. సర్టిఫికేట్ పారామెడికల్ కోర్సులు ఎక్స్–రే టెక్నీషియన్లో సర్టిఫికేట్, ల్యాబ్ అసిస్టెంట్/టెక్నీషియన్లో సర్టిఫికేట్, డెంటల్ అసిస్టెంట్‌లో సర్టిఫికేట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌లో సర్టిఫికేట్, నర్సింగ్ కేర్ అసిస్టెంట్‌లో సర్టిఫికేట్, ఈసీజీ, సీటీ స్కాన్ టెక్నీషియన్లలో సర్టిఫికేట్, డయాలసిస్ టెక్నీషియన్లో సర్టిఫికేట్, గృహ ఆధారిత ఆరోగ్య సంరక్షణలో సర్టిఫికేట్, గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో సర్టిఫికేట్,హెచ్ఐవీ, కుటుంబ విద్యలో సర్టిఫికేట్, న్యూట్రీషన్, పిల్లల సంరక్షణలో సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ∙సర్టిఫికేట్ పారామెడికల్ కోర్సుల కాల వ్యవధి 6నెలల నుంచి 2 ఏళ్ల మధ్య ఉంటుంది. వీటికి కనీస అర్హత పదో తరగతి. ప్రవేశాలు బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, నిమ్స్, ఆయా రాష్ట్రీయ, కేంద్రీయ యూనివర్సిటీలు ప్రతిఏటా విడుదల చేసే నోటిఫికేషన్లకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా తమకు నచ్చిన పారామెడికల్ కోర్సుల్లో చేరే వీలుంది. పలు పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్హతలో సాధించిన మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. వేతనాలు పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కెరీర్ ప్రారంభ దశలో.. పారామెడికల్ టెక్నీషియన్లుగా పనిచేయాలి. వారికి జీతం సుమారు రూ.5,000 నుంచి రూ.8,000 ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేస్తే జీతం రూ.8000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా నెలవారీ జీతం రూ. 30,000 వరకు ఉండవచ్చు. ఉపాధి మార్గాలు ♦ ఈ కోర్సులు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు, ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమైన సంస్థలలో ఉద్యోగాలు పొందవచ్చు. ♦ పారామెడికల్ కోర్సులు చేసినవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. దేశంలోనే కాకుండా..యూఎస్ఎ, యూఎఈ, యూకె, కెనడా వంటి విదేశాలలో కూడా డిమాండ్ పెరుగుతోంది. నర్సింగ్ హోమ్, హాస్పిటల్, క్లినిక్‌లు, ఆరోగ్య విభాగాల్లో ఉద్యోగాలతోపాటు సొంతంగా క్లినిక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. -
ఫిన్‌టెక్ సంస్థల్లో భారీగాఉద్యోగావకాశాలు
ఫైనాన్షియల్ టెక్నాలజీ.. సంక్షిప్తంగా ఫిన్‌టెక్! ఇది ఇటీవల కాలంలో ఎంతో సుపరిచితంగా మారింది. నేటి డిజిటల్ యుగంలో ఫిన్‌టెక్ సంస్థల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. లోన్స్ మొదలు మ్యూచువల్ ఫండ్స్ వరకు.. డిజిటల్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించుకునేలా.. వినియోగదారులకు సేవలం దిస్తున్నాయి ఫిన్‌టెక్ సంస్థలు!దాంతో ఫిన్‌టెక్ రంగం ఇప్పుడు యువతకు సరికొత్త కెరీర్‌గా వేదికగా నిలుస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ నుంచి టెక్నికల్,ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థుల వరకు.. వారి అర్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది ఫిన్‌టెక్ రంగం!ఈ నేపథ్యంలో.... ఫిన్‌టెక్ ఉద్యోగాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం... డిజిటల్ యుగం.. ఏ రంగంలో చూసినా.. టెక్నాలజీ ఆధారిత సేవలు. ప్రధానంగా స్మార్ట్ఫోన్స్తో.. వ్యక్తులు తమకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కాలు కదపకుండా చక్కబెట్టుకునే అవకాశం లభిస్తోంది. రుణాలు తీసుకోవడం మొదలు.. బీమా చెల్లింపులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఇలా అన్నిరకాల సేవలు స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో జరిగిపోతున్నాయి. ఇదంతా సాధ్యమయ్యేలా చేస్తున్నాయి ఫిన్‌టెక్ సంస్థలు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తరహా సేవలు అందించడంలో ముందుంటున్నాయి. యాప్స్ ఆధారంగా.. ఒకే విండో ఫిన్‌టెక్ సంస్థలు అందించే సేవలు అధికంగా మొబైల్ యాప్స్ రూపంలో∙ఉంటున్నాయి. ఉదాహరణకు ఇన్సూరెన్స్ పేమెంట్స్, అసెట్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన పలు రకాల సేవలను ఫిన్‌టెక్ సంస్థలు యాప్స్ ఆధారంగా వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన మొబైల్ వ్యాలెట్లు, ఆన్లైన్ పీర్ టు పీర్ లెండింగ్ వంటివి ఫిన్‌టెక్ సేవల పరిధిలోకే వస్తాయి. మిలియన్ డాలర్ల రంగం దేశంలో ఐదారేళ్ల క్రితమే ఫిన్‌టెక్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రంగం ఏటేటా శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఫిన్‌టెక్ రంగం ఈ ఏడాది 1520 మిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2023 నాటికి ఈ విలువ 2,580 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రధానంగా డిజిటల్ పేమెంట్స్, ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్, పర్సనల్ ఫైనాన్స్, ఆల్టర్నేటివ్ లెండింగ్‌ల విభాగాల్లో ఫిన్‌టెక్ సంస్థల సేవలు విస్తరిస్తున్నాయి. వినియోగదారులు ఫిన్‌టెక్ సేవల వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. గతేడాది డిజిటల్ పేమెంట్స్ విభాగంలో∙513.84 మిలియన్ల మంది ఫిన్‌టెక్ సంస్థల ద్వారా సేవలు పొందారు. వీరిసంఖ్య 2023 నాటికి 625.53 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఫిన్‌టెక్ సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలోపెట్టుకొని కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు రెండున్నర వేలకు పైగా సంస్థలు ఫిన్‌టెక్ విభాగంలో సేవలందిస్తున్నాయి. ఆయా సంస్థలకు నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. రెండు లక్షల ఉద్యోగాలు రానున్న రెండేళ్లలో ఫిన్‌టెక్ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ రంగంలో లభించే ఉద్యోగాల వివరాలు... » కస్టమర్ ఎక్విజిషన్ » ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ » బిగ్‌డేటా అనలిటిక్స్ » అప్లికేషన్ డెవలప్మెంట్ » ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ » సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ » హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ » యూఐ/యూఎక్స్ డిజైనర్ » ప్రొడక్ట్ మేనేజర్ » ప్రొడక్ట్ ఇంజనీర్ » సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ » సోషల్ మీడియా మేనేజర్స్ ఫిన్‌టెక్ సేవలు ఫిన్‌టెక్ సంస్థలు ప్రధానంగా ఆరు విభాగాల్లో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. అవి.. –డిజిటల్ లెండింగ్, –పేమెంట్ సర్వీసెస్, –సేవింగ్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, –రెమిటెన్సెస్, –పాయింట్ ఆఫ్ సేల్, –ఇన్సూరెన్స్. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ సర్వీసెస్‌కు విపరీతమైన ప్రాధాన్యం కనిపిస్తోంది. గత ఏడాది ఫిన్‌టెక్ రంగంలో 20శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని.. కేవలం నగరాలు, పట్టణాలే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆల్టర్నేటివ్ లెండింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్సూర్ టెక్ పేరుతో ఫిన్‌టెక్ సంస్థలు తమ సేవలను ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు డెలాయిట్ సర్వేలో తేలింది. ఉద్యోగ విభాగాలు నాస్కామ్, మ్యాన్‌పవర్ గ్రూప్, డెలాయిట్ వంటి సంస్థలు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం– ఫిన్‌టెక్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్న ముఖ్యమైన విభాగాలు.. » సాఫ్ట్వేర్ –51 శాతం, » సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ 16 శాతం » కోర్ ఫైనాన్స్–11శాతం » ప్లానింగ్ అండ్ కన్సల్టింగ్–4 శాతం » టాప్ మేనేజ్మెంట్ –4 శాతం. ఇటీవల కాలంలో ఫిన్‌టెక్ స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ప్రకటించిన 2020–21 బడ్జెట్లో సైతం ఫిన్‌టెక్ సంస్థలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉంది. స్టార్టప్స్ ఫిన్‌టెక్ సంస్థల్లో సగటున 150 నుంచి 200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫిన్‌టెక్ స్టార్టప్‌ల్లో ఒక్కో సంస్థలో కనీసం పది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఫిన్‌టెక్ రంగంలో పరోక్ష ఉపాధి అవకాశాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి సంస్థలో కోర్ విభాగంలో ఒక కొలువుకు కొనసాగింపుగా అయిదు ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంటే.. ఒక ప్రొడక్ట్ డిజైన్ స్థాయిలో ఒక నిపుణుడు ఉంటే.. ఆ తర్వాత దాన్ని వినియోగదారులకు చేర్చే వరకు ఐదు మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది. ప్రోత్సాహకాలు ఫిన్‌టెక్ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా దోహదం చేస్తున్నాయి. పేమెంట్ బ్యాంక్స్‌కు అనుమతి ఇవ్వడం.. పేటీఎం, ఎయిర్టెల్ వంటి సంస్థలు పేమెంట్ బ్యాంక్స్‌ను ఏర్పాటు చేసి.. డిజిటల్ సేవలు అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ మొబైల్ ఆధారిత బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం కూడా ఫిన్‌టెక్ రంగంలో ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తోంది. అర్హతలు ఇంజనీరింగ్, టెక్నికల్ డిగ్రీలతోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కోర్సులు పూర్తిచేసుకుంటే.. ఫిన్‌టెక్ రంగంలో కొలువులు దక్కించుకోవచ్చు. అదే విధంగా డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, రోబోటిక్స్ వంటి అంశాలను అకడమిక్ స్థాయిలోనే అభ్యసిస్తే మెరుగైన అవకాశాలు లభిస్తాయి. మరోవైపు సంప్రదాయ డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులు కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలు ఫిన్‌టెక్ సంస్థల్లో కొలువులు ఖాయం చేసుకోవాలంటే.. ప్రస్తుతం అవసరమవుతున్న ప్రధాన నైపుణ్యాలు.. » ఐఓఎస్ డెవలప్మెంట్ » ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ » సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్(ఎస్ఆర్ఈ) » ఫుల్‌స్టాక్ డెవలప్మెంట్ నాలెడ్జ్ » అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్(ఏపీఐ) » బ్లాక్‌చైన్ టెక్నాలజీ. వీటిని పెంపొందిం చుకోవడానికి అభ్యర్థులు అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వేతనాలు ఆకర్షణీయం ఫిన్‌టెక్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కోర్ టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో.. ఏఐ ఇంజనీర్స్, డిజైనర్స్‌కు రూ.50వేల వరకు వేతనం లభిస్తోంది. ఇక యాప్ డెవలపర్స్, ఎస్ఈఓ, ఎస్ఈఎం విభాగాల్లో రూ.30వేల వరకు వేతనం ఖాయం. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో పనిచేసే వారికి రూ.20 వేల నెల వేతనం అందుతోంది. ఉద్యోగాన్వేషణ ప్రస్తుతం ఫిన్‌టెక్ సంస్థల్లో నియామకాలు కొనసాగుతున్నాయి. కానీ.. వీటి గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండట్లేదు. ఫిన్‌టెక్ కంపెనీల్లో ఉద్యోగాన్వేషణకు అనువైన సాధనం.. జాబ్ పోర్టల్స్. జాబ్ పోర్టల్స్‌లో తమకు ఆసక్తి ఉన్న విభాగంలోని ఫిన్‌టెక్ సంస్థల్లో ఉద్యోగాల గురించి తెలుసుకోవచ్చు. ఫిన్‌టెక్.. ముఖ్యాంశాలు ♦ రెండేళ్లలో దాదాపు రెండు లక్షల కొత్త ఉద్యోగాలు. ♦ ఏఐ, ఎంఎల్ నిపుణులు, యాప్ డెవలపర్స్‌కు డిమాండ్. ♦ అంతేస్థాయిలో ఎస్ఈఎం, ఎస్ఈఓలకు అవకాశాలు. ♦ నెలకు రూ. 20 వేల నుంచి రూ. 70 వేల వరకు వేతనం. ♦ ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు రెండున్నర వేల ఫిన్‌టెక్ సంస్థలు. -
షాకింగ్ : కొత్త కొలువులు కొన్నే..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో 2020 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాల సంఖ్య పడిపోతుందని ఎస్బీఐ పరిశోధన నివేదిక అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 89.7 లక్షల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి రాగా 2020లో ఆ సంఖ్య కంటే 16 లక్షలకు పైగా ఉద్యోగాలు తక్కువగా జనరేట్ అవుతాయని ఎస్బీఐ పరిశోధనా నివేదిక ఎకోరాప్ వెల్లడించింది. రూ 15,000లోపు వేతనాలు కలిగిన ఉద్యోగ నియామకాలపై ఈపీఎఫ్ఓ గణాంకాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందింది. ఈ గణాంకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రయివేటు ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు పొందుపరచలేదు. 2004 నుంచి ఈ ఉద్యోగాలు ఎన్పీఎస్కు బదలాయించడంతో ఈపీఎఫ్ఓ డేటా వీటిని కవర్ చేయలేదు. మరోవైపు ప్రస్తుత ధోరణుల ప్రకారం ఎన్పీఎస్ విభాగంలోనూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 2020 ఆర్థిక సంవత్సరంలో గతంతో పోలిస్తే 39,000 ఉద్యోగాలు తక్కువగానే సృష్టించే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. అసోమ్, బిహార్, రాజస్ధాన్, ఒడిషా, యూపీలకు వలసలు వెళ్లిన కార్మికులు తమ ఇళ్లకు చేరవేసే మొత్తాలు (రెమిటెన్స్‌లు) గణనీయంగా తగ్గాయనే గణాంకాలనూ ఈ నివేదిక ప్రస్తావించింది. దివాళా ప్రక్రియలో కేసుల పరిష్కారంలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా ఆయా కంపెనీలు తమ కాంట్రాక్టు కార్మికుల సంఖ్యలో కోతవిధించడం కూడా కొలువులు తగ్గిపోతున్న పరిస్థితికి కారణమని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. దేశంలో పేదలు, ఇతరులకు గత కొన్నేళ్లుగా వలస వెళ్లడం ప్రధాన జీవన వనరుగా మారుతున్న పరిస్థితి ప్రతిబింబిస్తోందని పేర్కొంది. అసంతులిత వృద్ధి ఫలితంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాల ప్రజలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు వలస వెళ్లడం అధికమవుతోంది. ఆయా రాష్ట్రాలకు వలస వెళ్లిన ప్రజలు, కార్మికులు తమ స్వస్ధలాలకు డబ్బు చేరవేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారని నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనంతో వాణిజ్య సంస్థలు, కార్మికులు రుణాలపై అధికంగా ఆధారపడే పరిస్థితి ఎదురై ఆర్థిక వ్యవస్థ మరింత ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఈ నివేదిక విధాన నిర్ణేతలను హెచ్చరించింది. -
4లక్షల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్ రంగం వాటా 50 బిలియన్ డాలర్లు ఉండగా, 2030 నాటికి వంద బిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు, నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముంబాయిలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ (ఐపీఏ) ప్రతినిధులతో పాటు ఫార్మా రంగ ప్రముఖులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఫార్మాస్యూటికల్, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వెల్లడించడంతో పాటు, ఐపీఏ కార్యవర్గ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సిరిసిల్ల అపరెల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరిస్తూ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ షాపర్స్‌స్టాప్ ఎంవోయూపై సంతకాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా సిరిసిల్ల అపరెల్ పార్కులో వందలమంది మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందం అనంతరం ముంబయిలోని వస్త్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కేటీఆర్ చర్చలు జరిపారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ప్రత్యేకతలను వారికి వివరించారు. టెక్స్టైల్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల ప్రత్యేకతలతో పాటు, ఆ రంగంలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగిన ఈ భేటీల్లో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్.. పాతబస్తీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ చెప్పిందన్న ఒక ప్రశ్నకు సమాధానంగా.. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నీటి కొరత చాలా తక్కువగా ఉంద ని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరా బాద్‌కి నీటి సరఫరా సమస్య తలెత్తదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిం చామని, చార్మినార్, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తు న్నామన్నారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతా ల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా 50 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై సీఎం నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజ న్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ హిందూ–ముస్లిం కమ్యూనల్ కార్డుని వాడుతుం దని, దీన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఒకరు అడిగిన ప్రశ్నకు.. ప్రజలను విభజించే ఎలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైనవారు తెలంగాణ ప్రజలు అని కేటీఆర్ బదులిచ్చారు. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైందని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సల్వకాలమే అవి సక్సెస్.. హైదరాబాద్‌లో శాంతియుత ధర్నాలకు అనుమతు ల విషయాన్ని అడగ్గా, కొద్దిరోజుల సమయంలోనే ఆర్ఎస్ఎస్, ఎంఐఎం లాంటి సంస్థలు తమ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలో 45 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఐదు త్రైమాసికాల్లో వరుసగా తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి స్వల్పకాలం మాత్రమే సక్సెస్ అవుతాయని, అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి వంటి కఠిన ప్రశ్నలకు కచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నేత ఆయనే.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమ 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుపై తమకు అవసరమైన క్షేత్రస్థాయి సమాచారం వస్తుందని కేటీఆర్ అన్నారు. 2009లో రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని ‘టెన్ ఇయర్ చాలెంజ్’అంటూ స్పందించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్లనే తనకు మంత్రి పదవి దక్కిందన్న కేటీఆర్, మంత్రి పదవి కన్నా తనకు పార్టీ పదవే విలువైందని తెలిపారు. తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు సీఎం కేసీఆరే అని చెప్పారు. 2019 లో అన్ని జిల్లా పరిషత్ లను గెలుచు కోవడం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిందన్నారు. పాతబస్తీకి మెట్రో.. గచ్చిబౌలికి బీఆర్టీఎస్! హైదరాబాద్‌లో బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందన్నారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్ రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామన్నా రు. ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ పూర్తయిం దని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయ న్నారు. 111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని చెప్పారు. చేనేతకు పెద్ద ఫ్యాన్.. సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి నేరుగా స్పందన తెలుస్తుందని, తన పైన మర్యాద పూర్వకమైన మీమ్‌లు (హాస్యపూరిత చిత్రాలు) వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికే దాదాపు మంత్రులంతా సోషల్ మీడియా లో చురుగ్గా భాగస్వాములయ్యారన్నారు. చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం విద్య పట్టణ గ్రామీణ మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. జనవరిలో వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్ నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, మున్సిపల్ అధికా రుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవస రాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్ యార్డులు, వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు. ఇంకా వెతుకుతున్నా.. తన కూతురితో ఉన్న ఫొటోపై ఓ నెటిజన్ కోరిక మేరకు కేటీఆర్ స్పందించారు. నా కూతురు వేగం గా ఎదుగుతోందని ఉప్పొంగిపోయారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అభినందించారు. డీజీపీ, హైదరాబాద్ సీపీకి శుభా కాంక్షలు తెలిపారు. కుటుంబాన్ని, వృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటారన్న నెటిజన్ ప్రశ్నకు.. ‘ఇంకా వెతుకుతున్నా’అని సమాధానమిచ్చారు. జగన్ పాలన.. మంచి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల పాలనపైన స్పందించిన కేటీఆర్.. ‘ఒక మంచి ప్రారంభం’అని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సరైందో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందన్న కామెం ట్లు చేసిన పలువురు, ఆంధ్ర రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం, ఆ దిశగా తెలం గాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపినం దుకు సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది పూర్తయ్యేవి ఇవే..! అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్ తీసుకొస్తామని.. ఇప్పటికే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొ చ్చాయని కేటీఆర్ చెప్పారు. 2020లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ లో రెండో దశ టీహబ్–టీవర్క్స్ 2020 మొదటి అర్ధసంవత్సరంలో, జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా అనేక ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసు కుంటున్నాయని, ఇందులో భాగంగా తెలం గాణ ప్రభుత్వం కూడా ఇన్నొవేషన్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తోందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2019లో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరక్కపోతుండటంతో ఇంకా చాలా రంగాల సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయని, ఈ విభాగంలో నిపుణులకు అపార అవకాశాలు ఉన్నాయని ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం ఏఐ ఉద్యోగుల సంఖ్య గతేడాది 40,000గా ఉండగా.. 2019లో 72,000కు చేరింది. ఏఐ ప్రాజెక్టులపై పనిచేసే కంపెనీల సంఖ్య గతేడాది సుమారు 1,000 దాకా ఉండగా.. ఈ ఏడాది మూడు రెట్లు పెరిగి 3,000కు చేరింది. వ్యాపారాలు, డేటా నిర్వహణకు కంపెనీలు పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తుండటం పెరుగుతోందని గ్రేట్ లెర్నింగ్ తెలిపింది. ఏఐ నిపుణుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఇది డిమాండ్‌కు తగ్గ స్థాయిలో ఉండటం లేదని పేర్కొంది. దీంతో వివిధ సంస్థల్లో ఏఐ సంబంధ ఉద్యోగాలు 2,500 పైగా ఖాళీగా ఉన్నాయని వివరించింది. ఫ్రెషర్స్ మొదలుకుని మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్స్ దాకా దేశీయంగా పలు సంస్థల్లోని ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో ప్రొఫెషనల్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. 415 మిలియన్ డాలర్లకు ఏఐ పరిశ్రమ.. గ్రేట్ లెర్నింగ్ అధ్యయనం ప్రకారం.. దేశీ ఏఐ పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 415 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2,950 కోట్లు) చేరింది. 2018లో ఇది 230 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,600 కోట్లు)గా ఉంది. దేశీయంగా ఏఐ నిపుణుల సగటు అనుభవం 7.2 సంవత్సరాలుగా ఉంటోంది. 29 శాతం మంది ఏఐ ప్రొఫెషనల్స్‌కు పదేళ్ల పైగా అనుభవం ఉంది. ఈ విభాగంలో చేరిన ఫ్రెషర్స్ సంఖ్య గతేడాది 3,700గా ఉండగా.. ఇది ప్రస్తుతం 60 శాతం వృద్ధి చెంది 6,000కు పెరిగింది. ‘రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాం. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో ఏఐ కెరియర్ల వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి‘ అని గ్రేట్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు హరి కృష్ణన్ నాయర్ చెప్పారు. బెంగళూరు టాప్.. ఏఐ నిపుణులు ఎక్కువగా బెంగళూరును ఎంచుకుంటున్నారు. బెంగళూరులో ఏఐ ఉద్యోగాల కల్పన గతేడాది 13,000 స్థాయిలో ఉండగా.. 2019లో 23,000 పైగా నమోదైంది. సుమారు 8,000 ఉద్యోగాలతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ (17,000), ముంబై (9,000) రెండు.. మూడు స్థానాల్లో నిల్చాయి. అనుభవం, నైపుణ్యాలను బట్టి ఏఐ నిపుణులకు సగటు జీతభత్యాలు రూ. 14.7 లక్షలుగా ఉంటోంది. ముంబైలో ప్రొఫెషనల్స్ అత్యధికంగా వార్షికంగా రూ. 17 లక్షల ప్యాకేజీ అందుకుంటుండగా, చెన్నైలో అత్యంత తక్కువగా రూ. 10.8 లక్షల స్థాయిలో ప్యాకేజీ ఉంటోంది. 39 శాతం మంది ఏఐ నిపుణులు .. భారీ సంస్థల్లోనూ, 29 శాతం మంది మధ్య స్థాయి సంస్థల్లోనూ, 32 శాతం మంది స్టార్టప్ సంస్థల్లోనూ సేవలు అందిస్తున్నారు. మహిళా ఏఐ నిపుణుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. -
నిరుద్యోగ యువతకు ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగాల కోత, ప్రబలుతున్న నిరుద్యోగం ఆర్థిక మందగమనంపై భయాలను పెంచుతుంటే తాజాగా వెలువడిన ప్రభుత్వ గణాంకాలు కొంత ఊరట ఇచ్చాయి. ఈ ఏడాది జనవరి -మార్చిలో పట్టణ నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దిగివచ్చింది. అంతకుముందు ఏడాది ఏప్రిల్-జూన్‌లో నిరుద్యోగ రేటు 9.8 శాతంగా నమోదైంది. అయితే 2018లో జనవరి-మార్చి కాలంలో నిరుద్యోగ రేటు వివరాలు ఈ గణాంకాల్లో లేకపోవడం గమనార్హం. గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జనవరి-మార్చి 2019 కాలానికి త్రైమాసిక బులెటిన్‌లో పట్టణ ఉపాధి, ప్రామాణికాలపై అంచనాలతో ఈ గణాంకాలు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగ రేటు 8.7 శాతం ఉండగా గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 9 శాతంగా నమోదైంది. ఇక మహిళల్లో నిరుద్యోగ రేటు 11.6 శాతం కాగా గత ఏడాది 12.8 శాతంగా నమోదవడం గమనార్హం. కాగా, 2017-18లో 45 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా నమోదవడంతో మోదీ సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
సారూ.. ఉపాధి కల్పించరూ..?
సాక్షి, శ్రీకాకుళం : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఐటీడీఏలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌లో పలువురు గిరిజనులు ఐటీడీఏ పరిపాలనాధికారి ఎల్.ఆనందరావుకు పెద్దమడికాలనీ, సీతంపేట, గడిగుడ్డిలకు చెందిన జన్నివాడు, జ్యోతి, సోమేశ్వర్రావు వినతిపత్రాలు సమర్పించారు. జీతం ఇప్పించాలని లబ్బకు చెందిన కీర్తి, విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయాలని నందిగాంకు చెందిన గున్నయ్య కోరారు. స్టాఫ్‌నర్స్ ఉద్యోగం ఇప్పించాలని దీనబందుపురానికి చెందిన తేజమ్మ పేర్కొన్నారు. ఆరో తరగతిలో చదివేందుకు సీటు ఇప్పించాలని కొత్తగూడకు చెందిన సౌందర్య విన్నవించారు. తిత్లీ నష్ట పరిహారం అందజేయాలని జాడుపల్లికి చెందిన పారమ్మ, గాసన్న వినతిపత్రం అందించారు. గ్రావిటేషన్ ఫ్లో మంజూరు చేయాలని గోటిగూడ గ్రామానికి చెందిన మోహన్‌రావు, ఆటో కొనుగోలుకు రుణం ఇప్పించాలని వజ్జాయిగూడకు చెందిన చంద్రరావు కోరారు. కొత్త పంచాయతీ భవనం నిర్మించాలని ఇరపాడుకు చెందిన రామారావు, తాగునీటి సదుపాయం కల్పించాలని కన్నయ్యగూడకు చెందిన దుర్గారావు విన్నవించారు. బోరు మంజూరు చేయాలని సూదిరాయగూడకు చెందిన ఎండయ్య, యూనిఫాం కుట్టేందుకు అనుమతి ఇప్పించాలని పెద్దూరుకు చెందిన పార్వతీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీఆర్టీ పోస్టు ఇప్పించాలని టెక్కలికి చెందిన ధనలక్ష్మి, పూనుపేటకు చెందిన రోహిణి పేర్కొన్నారు. నాటుకోళ్ల ఫారం పెట్టేందుకు రుణం ఇప్పించాలని ఉల్లిమానుగూడకు చెందిన సుంకయ్య, ఆశ వర్కర్ పోస్టు ఇప్పించాలని వి.కుమారి తెలిపారు. జలసిరి బోరు మంజూరు చేయాలని మనుమకొండకు చెందిన అన్నయ్య, రక్షణగోడ ఇప్పించాలని దీనబంధుపురానికి చెందిన లక్ష్మణరావు కోరారు. డీ పట్టాలు ఇప్పించాలని చిన్నబగ్గ కాలనీకి చెందిన కృష్ణారావు, మొబైల్ దుకాణం పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని భరణికోటకు చెందిన వినోద్ విన్నవించారు. చెరువు పనులు చేయించాలని సందిమానుగూడకు చెందిన బి.కూర్మారావు, బొండి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు పాఠశాల తెరిపించాలని వినతిపత్రం అందజేశారు. దర్బార్‌లో ఈఈ మురళీ, డైజీ, హౌసింగ్ ఏఈ సంగమేషు తదితరులు పాల్గొన్నారు. -
‘జెట్’ సిబ్బందికి కొత్త రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘బిల్లులు పేరుకుపోతున్నాయి. మా పిల్లల పాఠశాలల, కాలేజీల ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఇక ఈఎంఐలు సరేసరి. మా పరిస్థితి భయానకంగా ఉంది. మా సహచరుల్లో కొంత మంది ఇప్పటికే 40 శాతం తక్కువ జీతాలకు ఇతర ఉద్యోగాలు వెతుక్కున్నారు’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ జెట్ ఎయిర్వేస్ పైలట్ మీడియాతో వాపోయారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రైవేట్ జెట్ ఎయిర్వేస్ను తాత్కాలికంగా మూసివేయడంతో అందులో పనిచేసే వివిధ కేటగిరీలకు చెందిన దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు ఈ పరిస్థితి ఏర్పడింది. కొంత మంది సిబ్బంది 40 శాతం తక్కువకు ఇతర ఉద్యోగాల్లో చేరిపోయారని చెబుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉద్యోగాలు దొరకడమే విశేషం. అంతకన్నా విశేషం ఏమిటంటే, జెట్ ఎయిర్వేస్ సిబ్బంది దుస్థితి గురించి తెలిసి అనేక స్టార్టప్, కార్పొరేట్ కంపెనీలే కాకుండా ప్రత్యర్థి ఎయిర్వేస్ కంపెనీలు కూడా వారిని పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నాయి. చెన్నైలో ఉంటున్న ఓ చిన్నపాటి పుస్తకాల పబ్లిషర్ తన వద్ద రెండు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, రోడ్డున పడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు ఇవ్వాలని అనుకుంటున్నానని, తదుపరి వివరాలకు తనను సంప్రతించాల్సిందిగా మొట్టమొదట ట్వీట్ చేశారు. దాంతో స్టార్టప్‌లతో సహా పలు కార్పొరేట్ కంపెనీలు, పలు సంస్థల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తాను పదిమంది జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తానని, వారు పీజీ చేసి పౌర సంబంధాల్లో ఉద్యోగం చేయడానికి వీలుగా వడ్డీరహిత రుణాలను కూడా ఇస్తానంటూ ఒకరు, తమది ఎక్స్‌ప్రెస్ ఇన్ ఇండియా డాట్‌కామ్ అని, ఇప్పటికే ఓ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉందంటే అది తమకు లాభించే అంశంగా పరిగణిస్తున్నామని, జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులయితే వారికి కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామంటూ మరొకరు ఆఫర్ ఇచ్చారు. ఇలా ఉద్యోగాలు ఆఫర్ చేసిన వారిలో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉదాహరణకు జెట్ మాజీ ఉద్యోగి అమిత్ బీ వధ్వానీ ముంబైలో ‘సాయి ఎస్టేట్ కన్సల్టెంట్స్’ నడుపుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు, అమ్మకాలు, కొనుగోళ్ల ఆడిట్ లెక్కలు, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, పబ్లిక్ రిలేషన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తానంటూ ఆయన ఆఫర్ ఇచ్చారు. ఇక క్యూర్‌ఫిట్, బౌన్స్, స్టేఎబోడ్ అనే స్టార్టప్ కంపెనీల్లో 150 ఉద్యోగాలను జెట్ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చారు. అమెరికాలోని ‘వియ్ వర్క్ డాట్ కామ్’ కూడా ఆఫర్ ఇచ్చింది. మంచి అనుభవం ఉన్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను ప్రభుత్వ పౌర విమానయానంలోకి తీసుకుంటామని కేంద్ర పౌరవిమాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఏప్రిల్ 21వ తేదీన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటారో, లేదో తెలియదుగానీ, ఆయన హామీకి స్పందించిన ‘స్పైస్‌జెట్ ఎయిర్వేస్’ జెట్ ఎయిర్వేస్కు చెందిన వెయ్యి మంది సిబ్బంది వరకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చింది. ఇంతగా మానవత్వం పరిమళిస్తుందంటే అది సోషల్ మీడియా పుణ్యమేనని చెప్పాలి! -
న్యాయ్‌తో ఆర్థిక వ్యవస్థ పరుగులు
బిలాస్పూర్/భిలాయ్: తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ‘న్యాయ్’ పథకం ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్, ఉక్కునగరం భిలాయ్‌ల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ పాల్గొన్నారు. ‘ఇంజిన్‌ను స్టార్ట్ చేయడంలో పెట్రోల్ ఉపయోగపడినట్లే ‘న్యాయ్’ అమలుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ఉత్పత్తి యూనిట్లను పునరుద్ధరిస్తాం. దాంతోపాటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి’ అని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద మహిళ బ్యాంకు అకౌంట్లో ఏడాదికి రూ.72 వేలు జమ చేస్తామన్నారు. రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు రైతులు డిమాండ్ చేసిన ప్రతిసారీ పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో అచ్చేదిన్ నినాదం వినిపించగా ఈసారి కాపలాదారే దొంగ(చౌకీదార్ చోర్ హై)అని ప్రజలు అంటున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. ‘అమలు చేసేవైతేనే వాగ్దానం చేస్తా, మీరు ఎంతగా ఒత్తిడి తెచ్చినా రూ.15 లక్షలను మాత్రం మీ అకౌంట్లలో జమ చేయలేను’ అని బీజేపీ 2014 ఎన్నికల హామీని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా అన్నారు. -
50 లక్షల ఉద్యోగాలు ఆవిరి
బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016–18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే ఉద్యోగావకాశాల క్షీణతకు పెద్ద నోట్ల రద్దుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్ 2016 నుంచే ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం అని పేర్కొంది. ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)–2019 పేరిట బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ–సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016–18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు. ఈ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారితోపాటు యువకులే అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇదేకాలంలో తక్కువ విద్యార్హత గల వారు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు ఆ స్థాయిలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గాయని తెలిపింది. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలను సృష్టించేందుకు కొన్ని పరిష్కార మార్గాలను నివేదికలో తాము సూచించామని అన్నారు. ‘మేము సూచించిన పరిష్కార మార్గాలు ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతోపాటు దేశంలోని అందరికీ సమానమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని బలంగా నమ్ముతున్నాం’అని పేర్కొన్నారు. పరిష్కార మార్గాలు.. ► దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. ► స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపై 6 శాతం, వైద్యంపై 3 శాతం అదనంగా ఖర్చు పెట్టగలిగితే సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించింది. అలాగే దీని ద్వారా అత్యంత నాణ్యమైన ప్రజా సేవలను అందించవచ్చని పేర్కొంది. ► భారతీయ తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
హైదరాబాద్‌కు మరో 15 విదేశీ దిగ్గజాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఐఓటీ వంటి కొత్త టెక్నాలజీలు ఐటీ రంగం రూపాన్ని మార్చేస్తుండటంతో ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్‌ను ఇందుకు వేదిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 10 విదేశీ దిగ్గజాలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ‘‘ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఖరారు కాకుండా వెల్లడించకూడదన్న (నాన్ డిస్‌క్లోజన్) నిబంధనల కారణంగా వాటి పేర్లను వెల్లడించలేం. కాకపోతే వీటిద్వారా రూ.15వేల కోట్ల పెట్టుబడులు, 75వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’’ అని ఐటీ విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 150కిపైగా భారీ, మధ్య తరహా కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేశాయని, టీ హబ్ ఏర్పాటుతో భారీగా స్టార్టప్‌లు వచ్చాయని చెప్పారాయన. కాగా అమెరికాకు చెందిన రెండు ఫాస్ట్‌ఫుడ్ కంపెనీలు ఇక్కడ అతిపెద్ద టెక్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు కూడా విశ్వసనీయంగా తెలిసింది. వీటితో పాటు అంతర్జాతీయంగా పేరొందిన ఆటోమొబైల్ కంపెనీ తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేయనుంది. మరోవంక కొరియాకు చెందిన కార్ల విడిభాగాల తయారీ సంస్థ హ్యూందాయ్ మొబిస్ భారీ క్యాంపస్‌ను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్టు సెప్టెంబరులో ప్రకటించింది. 20 ఎకరాల్లో రానున్న ఈ ఫెసిలిటీ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఐటీలో 4.75 లక్షల మంది... తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో 2018 జూన్ నాటికి 4.75 లక్షల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో గడిచిన ఏడాదిలో చేరినవారు 43,417 మంది. గత నాలుగేళ్లలో ఐటీలో దాదాపు 1.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలొచ్చాయనేది సంబంధిత వర్గాల మాట. ఇక ఐటీ ఎగుమతులు 2013–14లో రూ.52,258 కోట్లుంటే, నాలుగేళ్లలో రూ.93,442 కోట్లకు ఎగిశాయి. నాస్కాం గణాంకాల ప్రకారం ఐటీ ఎగుమతులు దేశంలో సగటు 7–9% నమోదైతే.. తెలంగాణలో ఇది 9.32 శాతం. 2020 నాటికి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లు దాటుతాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. టీఎస్ ఐపాస్‌తోనే: కేటీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యంగా రాష్ట్రాన్ని మార్చామని కేటీఆర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు భౌగోళిక సానుకూలతలున్నాయి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో టీఎస్ ఐపాస్ వంటి వినూత్న పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను తీసుకురావడం దీనికి తోడయింది. దీంతో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులొచ్చాయి. మున్ముందు కూడా ఈ అనుకూల వాతావరణాన్ని కొనసాగిస్తాం. మరిన్ని పెట్టుబడులను రప్పించి ఉద్యోగావకాశాలు పెంచుతాం. రానున్న సంవత్సరాల్లో తెలంగాణ మరింత వేగంగా పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న నమ్మకం నాకుంది’ అని చెప్పారాయన. -
చిన్నవయసులో శిఖరాలకు
ముప్పై ఏళ్ల బోత్సువానా దేశపు యువతి బొగోలో జాయ్ కెనెవెండో రెండురోజులుగా సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు! ఏప్రిల్ 1న కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొగ్వీస్తీ మసీసీ ఆ సమావేశంలో యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఆ వెంటనే కెనెవెండోని ‘పెట్టుబడులు, వాణిజ్యం, పరిశ్రమల’ శాఖ మంత్రిగా నియమించారు. తన హామీని నెరవేర్చడానికి దేశ అధ్యక్షుడు మొట్టమొదట పెట్టిన అతి పెద్ద ‘పెట్టుబడి’ కెనెవెండోనేనని ఆయనపైనా, ఆమె పైన ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం చిన్నవయసు కారణంగా కెనెవెండో ఆఫ్రికా ఖండాన్ని ఆకర్షించలేదు. మెగ్వీస్తీకి ముందున్న అధ్యక్షుడు అయాన్ ఖమా రెండేళ్ల క్రితమే కెనెవెండోనో పార్లమెంటు సభ్యురాలిగా నియమించారు. అంతకుముందు ఆమె ఘనా దేశపు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖలో ‘ట్రేడ్ ఎకనమిస్ట్’గా చేశారు. యువతకు అచ్చమైన ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన కెనెవెండో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు; మహిళలు, యువజనుల సాధికారత అనే అంశాలపై పట్టున్న యువతి. ‘మొలాయా క్గ్వోసీ’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ మహిళా నాయకత్వ, మార్గనిర్దేశక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుంటుంది. 2011లో మిషెల్ ఒబామా ఆతిథ్యంతో జరిగిన ‘ఆఫ్రికన్ ఉమన్ లీడర్స్ ఫోరమ్’ నుంచి స్ఫూర్తి పొంది ఆ సంస్థను నెలకొల్పారు. 2009లో జరిగిన ఐక్యరాజ్యసమితి 64వ అత్యున్నతస్థాయి ప్రతినిధుల సమావేశానికి ఆఫ్రికా దేశాల తరఫున హాజరైన ఇద్దరు ప్రతినిధులలో ఒకరిగా ఇరవై ఏళ్ల వయసులోనే కెనెవెండో హాజరయ్యారు! యు.కె.లోని ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో ఎమ్మెస్సీ చేశారు. 2012లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘చీవినింగ్ స్కాలర్షిప్’ పొందారు. కెనెవెండోకు ప్రయాణాలంటే ఇష్టం. యోగా చేస్తారు. పుస్తకాలు చదువుతారు. మంచి ఫ్రెండు, మనసుకు హాయినిగొల్పే శీతల పానీయం పక్కనే ఉంటే జీవితం ఉత్సాహంగా ఉంటుందని కెనెవెండో అంటారు. -
హైదరాబాద్‌లో అడోబ్ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా కొనసాగుతున్న హైదరాబాద్‌లో మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏర్పాటు కానుంది. ప్రముఖ ఐటీ సంస్థ అడోబ్ తమ కార్యాలయాన్ని హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా ఐటీ దిగ్గజం అడోబ్ చైర్మన్, సీఈఓ శంతన్ నారాయణ్‌తో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అడోబ్ కార్యాలయాన్ని నెలకొల్పాల్సిందిగా కేటీఆర్ కోరారు. 2015, మే నెలలో శాన్ఫ్రాన్సిస్కో నగరంలో శంతన్ నారాయణ్‌తో తొలిసారి సమావేశమైన కేటీఆర్, తర్వాత పలుమార్లు ఆయన్ను కలిశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో అడోబ్ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా కోరిన విషయాన్ని ఐటీ కాంగ్రెస్ సమావేశంలో గుర్తుచేశారు. దీనికి స్పందించిన శంతన్ నారాయణ్ అడోబ్ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానమిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే అడోబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పుతామని తెలిపారు. గత మూడున్నరేళ్లలో హైదరాబాద్‌లో ఐటీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని, నూతన టెక్నాలజీపై ఇక్కడ సుశిక్షితులైన యువతరం అందుబాటులో ఉందని శంతన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే అడోబ్ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, సంస్థ విస్తరణ వంటి అంశాలపై సంస్థ తరఫున ఒక ప్రకటన చేస్తామని వివరించారు. ఈ నిర్ణయం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అడోబ్ సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు వినూత్న టెక్నాలజీలపై ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. అడోబ్ నిర్ణయంతో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వీలుకలుగుతుందని అన్నారు. -
ఉద్యోగం రావాలంటే పది చిట్కాలు
న్యూఢిల్లీ: యూనివర్శిటీల్లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా అగమ్యగోచరంగాను, ఆందోళనగానూ ఉంటుంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి గుండెలో దడ మొదలవుతుంది. నేటి పోటీ ప్రపంచంలో నిలబడి ఉద్యోగాన్ని సంపాదించగలనా? నాకున్న అర్హతలు అందుకు సరిపోతాయా? ఇంటర్వ్యూదాకా నెట్టుకు రాగలనా ? వచ్చినా, ఎంతో మంది అనుభవజ్ఞులను వదిలేసి ఆ ఉద్యోగం నన్ను వరిస్తుందా?... ఇలా పరిపరి విధాల ఆందోళనకరమైన ఆలోచనలు మెదుడులో సుడులు తిరిగడం సాధారణమే. ఇలాంటి వారి కోసం అడ్వర్టయిజింగ్ విభాగంలో 20 ఏళ్ల అనుభవం కలిగి వెయ్యి మందికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించిన (వారిలో ఎక్కువ మంది కొత్తవారే) ‘మార్కెటింగ్ ఫింగర్ఫేంట్’ వ్యవస్థాపకులు ఎడ్ మిట్జెన్ పది చిట్కాలు చెబుతున్నారు. 1. తొందరగా ఉద్యోగం రాకపోతే నిరుత్సాహం వద్దు.... ఉద్యోగావకాశాలు రావడంలో చాలా జాప్యం జరగవచ్చు. కొందరికి రెండు, మూడు నెలల్లో ఉద్యోగం దొరికితే మరికొందరికి ఏడాది వరకు ఉద్యోగం దొరక్కపోవచ్చు. అలాంటి వారు అయ్యో నాకు ఉద్యోగం రావడం లేదే...అనుకుంటూ నిరుత్సాహ పడవద్దు. అలాంటి వారికి నేను చెప్పేదొకటే, మీ ముందు 40 ఏళ్లపాటు పనిచేయాల్సిన జీవితం ఉంది. అలాంటప్పుడు ఉద్యోగం కోసం ఎందుకు తొందరపడతారు. నిరుత్సాహపడకుండా నిరీక్షించండి! 2. ఇంటర్వ్యూలో పోతే కంగారు పడొద్దు.... ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లడం, యాజమాన్యం తిరస్కరించడం. ఆల్ ఇన్ ది గేమ్. మూడు, నాలుగు ఇంటర్వ్యూలో మంచిగా రాణించకపోయినా, తిరస్కరణకు గురైనా కంగారు పడొద్దు. మరో ఇంటర్వ్యూ కోసం శక్తివంచన లేకుండా కషి చేస్తూ వెళ్లాలి. మనం ఎంపిక కావాల్సిన ఇంటర్వ్యూ మన కోసం ఎక్కడో నిరీక్షిస్తూనే ఉంటుంది. 3. ఉద్యోగం మీద కాదు, ఇడస్ట్రీ మీద దృష్టి పెట్టాలి... కొత్త వారకి తాము కలలుగంటున్న ఉద్యోగం, దానికి ఆశించిన స్థాయి వేతనం దొరకడం అంత ఈజీ కాదు. అందుకని చేయాల్సిన ఉద్యోగం కోసం కన్నా ఫలానా పరిశ్రమలోకి ప్రవేశించడం ఎలా అన్న అంశంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఓ కంపెనీలోకి ప్రవేశించడం కోసం దిగువస్థాయి ఉద్యోగమైన అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత టాలెంట్‌ను నిరూపించుకోవడం ద్వారా పైస్థాయికి ఎదగవచ్చు. 4. తొలి దృష్టి డబ్బుపై ఉండకూడదు.... అమెరికా లాంటి విదేశాల్లో అధిక ఫీజులు చెల్లించి చదువుకున్న వారు త్వరగా ఉద్యోగంలో చేరిపోవాలని చూస్తారు. రావాల్సిన అవకాశాలను వెతుక్కోకుండా అవసరార్థం బార్టెండింగ్, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లలో చేరిపోతారు. దాని వల్ల మంచి అవకాశాలను వెతుక్కోవడంలో జాప్యం జరగవచ్చు. అత్యవసరంగా డబ్బులున్నవారు వీకెండ్ ఉద్యోగాలు చేయవచ్చుగానీ అసలు దృష్టి మాత్రం అర్హతలకు తగిన ఉద్యోగాలపై ఉండాలి. 5. అవసరమైన రీసెర్చ్.... ఇంటర్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది సరైన హోం వర్క్ లేకుండానే వస్తున్నారు. అంటే తాము ఇంటర్వ్యూకు హాజరవుతున్న కంపెనీ గురించి, ఆ కంపెనీ ఉత్పత్తుల గురించి. ఆ కంపెనీ క్లైంట్ల గురించి, మార్కెటింగ్ గురించి ఏం తెలుసుకోకుండా వస్తున్నారు. అభ్యర్థులు వీటన్నింటి గురించి తెలసుకోవడంతోపాటు కంపెనీ ఇచ్చే పత్రికా ప్రకటనల గురించి కూడా తెలసుకొని రావాలి. 6. జీతభత్యాల గురించి అడగొద్దు! కొంత మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు రాగానే జీతభత్యాల గురించి, కంపెనీ నుంచి వచ్చే ఇతర బెనిఫిట్ల గురించి వెంటనే అడుగుతారు. దానివల్ల తప్పుడు సందేశం వెళుతుంది. అన్నింటికన్నా ఉద్యోగమే పరమావధిగా చెప్పుకోవాలి. కొంతమేరకు సెలక్షన్ అయిపోతేనే కంపెనీయే జీతభత్యాల ప్రస్థావన తీసుకొస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. 7. ఆత్మవిశ్వాసం ముఖ్యం ఆ ఉద్యోగం తనకే వస్తదన్న ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సానుకూల దక్ఫథంతో ప్రవర్తించాలి. ఆ ఉద్యోగం తనకే వస్తుందన్న గౌరవంగానీ, గడసరితనంగానీ చూపరాదు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు మీతో కరచాలనం చేస్తున్నప్పుడు మీ కళ్లలోకి సూటిగా చూస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పసిగట్టడం కోసమే అలా చూస్తారు. 8. మీరు ఇంటర్వ్యూ దశకు వచ్చారంటే... మీరు ఇంటర్వ్యూ దశకు వచ్చారంటేనే కంపెనీకి మీరే సరైన వ్యక్తని, మీకు ఉద్యోగం ఇవ్వడం కోసమే ఇంటర్వ్యూచేసే వ్యక్తి వచ్చారని అర్థం చేసుకోవాలి. మీకే ఉద్యోగం వస్తుందన్న విశ్వాసంతో ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. తెలియని ప్రశ్నలుంటే నిజాయితీగా అందుకు నిజాయితీగానే చెప్పాలి. అవసరమైతే మరిన్ని వివరాలు కోరాలి. నీతోపాటు ఇంటర్వ్యూలకు వచ్చిన ఇతర అభ్యర్థుల అర్హతలను చూసి ఆందోళన చెందవద్దు. ఉద్యోగం నీవు ఎలా చేయగలవో సూటిగా చెబితే చాలు. 9. మాట సాయం తీసుకోవచ్చు.... ఓ కంపెనీకి రోజు ఐదు నుంచి పది రిస్యూమ్స్ రావచ్చు. ప్రతి రోజు వాటిని క్షుణ్నంగా పరిశీలించి చూసే అవకాశం యాజమాన్యంకు ఉండదు. కనుక తెల్సిన వారి మాట సాయం తీసుకోవచ్చు. కంపెనీలో ఎవరైనా తెల్సింటే వారి మాట మీద రిస్యూమ్లను పరిశీలించే అవకాశం, ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. 10. ఉద్యోగం పట్ల అభిరుచిని చూపాలి. ఆ ఉద్యోగం చేయడం తన అభిరుచిగా చెప్పుకోవాలి. అందుకు కారణాలుంటే వివరించాలి. ఇంటర్వ్యూకు రావడమే ఓ థ్రిల్లింగ్ ఉందన్నట్లు ప్రవర్తించాలి. ఉద్యోగం వచ్చినా, రాకపోయినా ఇంటర్వ్యూకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపాలి. లిఖితపూర్వకంగా తెలియజేయడం మంచిది. -
హోదాతో ఎక్కువ రాయితీలు రావు
* తప్పులు చేస్తే ఇప్పుడు జనం నోరు తెరవరు.. * ఎన్నికల్లో జడ్జిమెంట్ ఇస్తారు: టీడీపీ వర్క్‌షాపులో చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్కువ రాయితీలు వస్తాయనే రీతిలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రతి ప్రయోజనాన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలో 1.47 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వల్ల 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లైందన్నారు. గురువారం మూడో రోజు నిర్వహించిన టీడీపీ నాయకత్వ-సాధికారత వర్క్‌షాపు ప్రారంభ ఉపన్యాసం చేసిన చంద్రబాబు.. సాయంత్రం ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులుగా తప్పులు చేస్తే జనం ఇప్పుడు నోరు తెరవరు.. కానీ ఎన్నికల్లో సెలైంట్‌గా జడ్జిమెంట్ ఇస్తారు జాగ్రత్త అంటూ పార్టీ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఆశించిన సేవలు అందకపోతే సహించరని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల్లో 80 శాతం సంతృప్తి, రాజకీయ ఏకీకరణ 80 శాతం, నాయకుల పనితీరు పట్ల 80 శాతం అనుకూలత రావాలన్నారు. పాలనలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువైందనే అభిప్రాయం ప్రజల్లో కలిగించవద్దని కోరారు. రాజకీయనేత నైపుణ్యాలు, ఆర్థిక వేత్త నైపుణ్యాలు వేర్వేరు కాబట్టే గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌కు పొలిటికల్ ఇమేజీ రాలేదన్నారు. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాలుంటే గత ఎన్నికల్లో ఒక్క చోట మాత్రమే గెలిచామన్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం వారికి చేసిన ప్రయోజనాలు వివరించి పార్టీకి దగ్గరయ్యేలా చూడాలని కోరారు. గోదావరిని పెన్నాకు కూడా అనుసంధానం చేసి సోమశిల వరకు నీటిని తీసుకెళ్తామన్నారు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌లో బాబు ప్రసంగిస్తారు. సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. -
‘ఫార్మశీ’లో ఉపాధి అవకాశాలు పుష్కలం
ఎచ్చెర్ల: ఫార్మశీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్కలి డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎ.లావణ్య అన్నారు. చిలకపాలెం సమీపంలోని శివానీ ఇ ంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రపంచ ఫార్మశీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా బోధన ప్రయోగాత్మకంగా ఉండాలన్నారు. పరిశోధనాత్మక విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విదేశాల్లో ఫార్మశిస్టులకు వైద్యులతో సమాన గుర్తింపు ఉందని, రోగానికి అవసరమైన మందులు సూచించేది ఫార్మశిస్టులేనని చెప్పారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి విభాగం అధికారులు షేకత్దత్, రమాకేపాల్, ఇంజినీరింగ్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జీవీ రమేష్‌బాబు, ఫార్మశీ పిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, నరేంద్రకుమార్ పాల్గొన్నారు. -
జర్నలిస్టులు కావాలి...
-
అపోలో హెల్త్‌కేర్‌లో ఉద్యోగ అవకాశాలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లాలోని నిరుద్యోగ యువతులకు అపోలో హోం, హెల్త్‌కేర్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఈనెల 23వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.వెంకట రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం ఉద్యోగాలకు 20-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని, ఈ ఉద్యోగానికి వేతనం రూ. 12-15 వేల మధ్య ఉంటుం దని పేర్కొన్నారు. జీఎన్ఎం ఉద్యోగానికి 20-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని, వేతనం రూ. 14,500 నుంచి రూ. 17,000 వరకు ఉంటుందని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులైన వారికి వయస్సు 20-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. వేతనం రూ. 15,500-19,000 వరకు ఉంటుందన్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ, లోకల్ ట్రాన్స్‌పోర్టు, ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈనెల 23వ తేదీన పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయం ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు అర్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 99859 95900 నెంబరును సంప్రదించాలన్నారు.