ఒటావో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బతో అన్ని దేశాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కెనడాలో మాత్రం త్వరలో 7లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నానోస్ రీసెర్చ్ సర్వే తెలిపింది. అయితే కరోనా దెబ్బతో 30 శాతం ఉద్యోగాలు కోల్పోయారని, ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో కంపెనీలు తిరిగి ఉద్యోగులను నియమించుకుంటున్నాయని సర్వే తెలిపింది.
కరోనా కారణంగా కెనడాలో 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, అందులో ప్రస్తుతం 30 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశముందని నివేదిక తెలిపింది. ఈ సర్వేను జూన్ 28నుంచి జులై 2 తేదీల్లో నిర్వహించారు. మరోవైపు కెనడాలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని, త్వరలోనే కొత్త వారికి ఉద్యోగాలు లభించే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment