మన పాలక ప్రభుత్వాలు ప్రస్తుతం పెట్టుబడుల కోసం ఆరాటపడుతున్నాయి. సకల సౌకర్యాలను కల్పిస్తామని దేశదేశాల పెట్టుబడిదారులకు పోటీపడి మరీ హామీలిస్తు న్నాయి. పెట్టుబడులు పెరిగితే ఉద్యోగావకాశాలు పెరు గుతాయని దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నాయి. పెట్టుబ డులకు భారత్ ఎర్రతివాచీ పరిచిందని మోదీ పలికిన ఆహ్వానానికి ప్రపంచ పెట్టుబడిదారులు ఉప్పొంగిపో యారు. కానీ, వందమంది చేయాల్సిన పనిని ఒకే ఒక సాంకేతిక యంత్ర పరికరంతో పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఎన్ని పెట్టుబడులు వస్తే ఎంతమంది నిరు ద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నది ఎవరూ స్పష్టం చేయటం లేదు.
1947 నుంచి 1989 వరకు కేంద్రప్రభుత్వాలు 232 ప్రభుత్వరంగ సంస్థల వృద్ధి వికాసం కోసం రూ.85,564 కోట్ల పెట్టుబడులను కేటాయించాయి. కానీ 1991 నుంచి ప్రపంచీకరణ పేరిట నూతన సంస్కరణల వైపు వేగంగా అడుగులు వేశాయి. ప్రభుత్వరంగ సంస్థల నుం చి పెట్టుబడుల ఉపసంహరణ మొదలుపెట్టి తమ సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి.
ఉదాహరణకు 2002 మార్చిలో 3 మిలియన్ టన్ను ల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని అధిగమించటానికి 17,026 మంది ప్రభుత్వ ఉద్యోగులను విశాఖ ఉక్కు కర్మాగారం వినియోగించింది. కానీ, 2005లో 6.3 మిలి యన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి విస్తరణకు 34 వేల మంది ఉద్యోగులకు అవకాశం ఇవ్వవలసి ఉండగా సాంకేతిక యంత్రాల వినియోగంతో కేవలం 18,328 మంది ప్రభు త్వ ఉద్యోగుల్ని వినియోగించింది. విడిభాగాల తయారీ, ఇతర అనుబంధ పరిశ్రమల్లో కాంట్రాక్టు పద్ధతిని అమలు చేశారు. దీంతో తాత్కాలిక ఒప్పంద కార్మికులు నేడు పది వేలకు చేరుకున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగికి వర్తించే వేతన ఒప్పందాలు ఏవీ వారికి వర్తించవు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడికి చేతికందే నెలజీతం కేవలం రూ.6,122లు మాత్రమే. ఇక అసంఘ టితరంగాల్లో రోజువారీ కూలీలుగా పనిచేసే శ్రామికుల జీతభత్యాల గురించి చెప్పే పనిలేదు. ఎవరు ఆధికారం లోకి వచ్చినా ప్రైవేటీకరణ విధానాలకు అందరూ దాసో హులేనని బీజేపీ రుజువు చేసింది. విదేశీ పెట్టుబడులకు ఎర్రతివాచీ పరిచిన రోజునే బీజేపీ జాతీయవాదంలో డొల్లతనముందని తేటతెల్లమైంది. పెట్టుబడులు పెరిగితే ఉద్యోగావకాశాలు పెరగవని, ఎంత త్వరగా గ్రహిస్తే శ్రామికవర్గానికి అంత మంచిది.
కొప్పోలు పరంధామయ్య, ప్రధాన కార్యదర్శి, యూనియన్ ఆఫ్ స్టీల్ ఎంప్లాయీస్, విశాఖ స్టీల్ ప్లాంట్
పెట్టుబడులతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయా?
Published Tue, Jan 20 2015 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement