ఐటీ రంగంలో 2025లో 15–20 శాతం మేర అధిక నియామకాలు నమోదవుతాయని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయ ఆరు నెల్లలో ఈ రంగంలో కదలిక వచ్చిందని, దీంతో 2025లో ఈ పరిశ్రమలోని పలు విభాగాల్లో నియామకాలు ఆశావహంగా ఉంటాయని తెలిపింది.
కీలక నైపుణ్యాలు కలిగిన.. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలైటిక్స్, క్లౌడ్ టెక్నాలజీలకి డిమాండ్ 30–35 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. డిమాండ్‌లో పెరుగుదల కేవలం ఈ నైపుణ్యాలకు మాత్రమే పరిమితం కాదని, టెక్నాలజీ నైపుణ్యాలను పెంచుకోవడంపైనా దృష్టి సారించాలని పేర్కొంది.
మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తమ మానవవనరులను అవసరమైన నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వడంపై కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించింది. పెద్ద కంపెనీలకు ఇప్పటికీ క్యాంపస్ నియామకాలు ప్రాధాన్యంగా కొనసాగుతాయని, 2024–25 ద్వీతీయ ఆరు నెలల్లో ఇవి చురుగ్గా నియామకాలు చేపట్టొచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌తో మాకు పోలికేంటి.. గూగుల్ సీఈవో కామెంట్స్
ఏఐ, ఎంఎల్, డేటా అనలైటిక్స్, పైథాన్, క్లౌడ్ టెక్నాలజీలకు నెలకొన్న అధిక డిమాండ్ 2025లో ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు పెరిగేందుకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు), తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్ కంపెనీలు సైతం 30–35 శాతం అధికంగా ఐటీ నిపుణులను తీసుకోవచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment