it job
-
గూగుల్ టెకీ వింత అనుభవం.. ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా?
ఉద్యోగం కోసం ఏదైనా సంస్థకు దరఖాస్తు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో తిరస్కరిస్తూ ఉంటారు. తగిన అర్హతలు, అనుభవం లేకపోవడం వంటివి సాధారణంగా ఆ కారణాల్లో ఉంటాయి. అయితే తనకు ఎదురైన అసాధారణ అనుభవం గురించి ఓ గూగుల్ టెకీ సోషల్ మీడియాలో షేర్ చేయగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన అనూ శర్మ గతంలో ఓ స్టార్టప్ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా రిజెక్ట్ చేశారు. అయితే ఇందుకు ఆ కంపెనీ చెప్పిన కారణమే విడ్డూరంగా అనిపించింది. "మీ రెజ్యూమ్ని సమీక్షించిన తర్వాత, మీ అర్హతలు ఉద్యోగ అవసరాలను మించి ఉన్నట్లు మేము గ్రహించాం. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎక్కువ రోజులు పని చేయలేరని, చేరిన కొద్దిరోజులకే వెళ్లిపోతారని మా అనుభవం సూచిస్తోంది" అంటూ తిరస్కరణకు కారణాన్ని రిజెక్షన్ లెటర్లో రిక్రూటర్ వివరించారు.ఇదీ చదవండి: అమెజాన్ ఉద్యోగులకు కొత్త పాలసీ.. తేల్చిచెప్పేసిన సీఈవోమంచి అర్హతలు ఉన్నందుకు కూడా తిరస్కరిస్తారని తనకు తెలియదంటూ రిజెక్షన్ లెటర్ స్క్రీన్ షాట్‌ను అనూ శర్మ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. ఇది యూజర్లలో విస్తృత చర్చకు దారితీసింది. తామూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు కామెంట్లు చేశారు. తాను ఉన్నత ర్యాంకింగ్ ఉన్న కాలేజీ నుంచి వచ్చినందుకు రిజెక్ట్ చేశారని ఓ యూజర్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో మంచి అర్హతలను రిక్రూటర్ అభినందించడం మంచి విషయమని మరికొందరు అభిప్రాయపడ్డారు.Didn't know you could be rejected for being too good 🥲 pic.twitter.com/mbo5fbqEP3— Anu Sharma (@O_Anu_O) October 17, 2024 -
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్‌ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్‌లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్‌లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్ ట్రెండ్‌ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
నీటి పాట్లు.. పెళ్లికి అగచాట్లు
బనశంకరి: బెంగళూరు నగరంలో వేసవి నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. అలాగే యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితునికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని సోమవారం ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు. ఇందుకు నీటి సమస్యే కారణమని చెప్పాడు. తన పోస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేశాడు. రాహుల్‌గాంధీ గారు.. దయచేసి మీరు బెంగళూరులో నీటి సమస్యను పరిష్కరించాలి. ఐటీ ఉద్యోగం చేస్తున్న నా స్నేహితుడు వధువు కోసం ఎంతగానో గాలించినా ప్రయోజనం లేదు. ఐటీ సిటీలో నీటి సమస్య వల్ల అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోవడం లేదని నా స్నేహితుడు బాధపడినట్లు తెలిపాడు. మొత్తం మీద ఈ ఎండాకాలం సిలికాన్ సిటీకి చుక్కలు చూపిస్తోంది. గత నెలరోజుల నుంచి బెంగళూరులో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. నీటి బొట్టుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం, బెంగళూరు జలమండలి శ్రమిస్తున్నాయి. లక్ష బోర్లు ఎండిపోయాయి. నగరంలో 257 ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. -
ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్
కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెట్టి ఆర్థికమాంద్యంలోకి నెట్టివేసింది. ఈ ప్రభావం చాలామంది జీవితాల మీద పడింది. ఇప్పటికి కూడా కొన్నిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం తట్టుకోలేక తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఒకవైపు చదువు కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు సమస్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయి అగచాట్లు పడుతున్నారు. కెనడాలో ఉంటున్న ఒక భారతీయుడు ఉద్యోగం కోల్పోయి ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత, యూట్యూబ్ ఛానెల్ కలిగి ఉన్న టెకీ తన టెస్లాను డ్రైవ్ చేస్తూ నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనీష్ మావెలిక్కర తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో.. తాను ఐటీ ఉద్యోగం కోల్పోయినట్లు, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కున్నట్లు.. ఇందులో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరైనట్లు, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదని వెల్లడించాడు. ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే! ఉద్యోగం వచ్చే వరకు పార్ట్ టైమ్ ఉద్యోగంగా కిరాణా సామాగ్రిని ఇంటింటికి డెలివరీ చేస్తున్నట్లు కూడా వీడియోలో తెలిపాడు. ప్రతి రోజూ తన పని తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని, తన టెస్లా కారుని ఉబెర్‌తో నడుపుతున్నట్లు స్పష్టం చేసాడు. ఒకవేళా ఉద్యోగం లభించకపోతే తన టెస్లా కారుని రోజంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణగా వివరించాడు. -
ఐటి ఉద్యోగులకు గుడ్ న్యూస్ హైదరాబాద్ లో 1000 ఉద్యోగాలు
-
ఐటీ దెబ్బ.. భారత్‌లో పరిస్థితి ఏంటి?
అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. పెద్ద ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాదిమందికి అకస్మాత్తుగా ఉద్వాసన పలికారు. అదే భారతీయ కంపెనీల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇతరులతో పోలిస్తే మన కంపెనీలు కొంచెం మెరుగ్గా ఉండటం కారణం కావచ్చు. కానీ ఒక్క విషయమైతే స్పష్టం. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా సృష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా... భారతీయ కంపెనీలు చేస్తున్న పనుల్లోనే కొత్త మార్గాలను అన్వేషించాయి. ఒకరు సృజనాత్మక సృష్టి చేసేవారైతే, ఇంకొకరు వాటిని అమలు చేసేవారు. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు. ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, మెటా (ఫేస్బుక్), మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు గడచిన కొన్ని నెలల్లో ఒక్కొక్కటీ పదివేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచం మొత్తమ్మీద ఈ లేఆఫ్‌లు పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. మరోవైపు భారతీయ ఐటీ దిగ్గజాలు మాత్రం కొత్త ఉద్యోగులను తీసుకునే వేగాన్ని తగ్గించడం ద్వారా పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఇదే సమయంలో అమెరికన్ టెక్ కంపెనీల లేఆఫ్‌ల కారణంగా భారతీయ కంపెనీల్లో ‘అట్రి షన్ ’ (ఉద్యోగులు బయటికి వెళ్లిపోవడం) కూడా తగ్గింది. కరోనా మొదలైన సమయంలో ఈ అట్రిషన్ ప్రమాదకర స్థాయికి చేరు కున్న విషయం తెలిసిందే. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి భారీ భారతీయ కంపెనీలు ఐటీ సర్వీసుల రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఉత్పత్తుల ఆధారిత కంపెనీలూ కొన్ని ఉన్నా వీటిల్లో అత్యధికం ఈమధ్య కాలంలో మొదలైనవనే చెప్పాలి. ఒక రకంగా స్టార్టప్‌ల లాంటివన్నమాట. కరోనా ఉధృతి దిగివస్తున్న క్రమంలో అటు స్టార్టప్‌లు, ఇటు పెద్ద టెక్ కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొ న్నాయి. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందన్న వార్తలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం ఈ రెండు వర్గాల వారికి గోరుచుట్టుపై రోకటి పోటు చందమైంది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వడం మొదలైంది. వ్యాపారం తగ్గిపోవడం, పెట్టుబడులు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో లాభా లను కాపాడుకునేందుకు ఈ చర్యలు అనివార్యమయ్యాయి. మారిన అంచనాలు.. పరిస్థితులు బాగున్న కాలంలో టెక్ కంపెనీల్లో వృద్ధి బాగా నమోదైంది. ఫలితంగా ఆయా కంపెనీలు క్లౌడ్ సర్వీసులు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు అంచనాలు మారిపోవడంతో మళ్లీ గతంలో మాదిరిగా పనులు చేసే ప్రయత్నం జరుగుతోంది. సరుకుల రవా ణాకు డ్రోన్ల వాడకం మొదలుకొని, గాలి బుడగల ద్వారా మూల మూలకూ ఇంటర్నెట్ అందించడం వంటి పలు ప్రాజెక్టులు అప్పట్లో గొప్ప ఆవిష్కరణలుగా అనిపించాయి, కానీ ఇప్పుడు అవి పెద్దగా పట్టించుకోని స్థితికి చేరాయి. సిలికాన్ వ్యాలీ కేంద్రబిందువు అని చెప్పుకునే శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతంలోనే గత ఏడాది 80 వేల ఉద్యో గాలకు కోత పడిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. పెద్ద కంపెనీల్లో ఆపిల్, అమెజాన్ ఇప్పటికీ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. కాకపోతే గతం కంటే తక్కువగా. ఈ కంపెనీలిప్పుడు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఇదే పనిలో ఉంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 2023 ఏడాది తన సామర్థ్యం పెంచుకునే సంవత్సరమని ప్రకటించింది. నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు గానూ కంపెనీ నిర్మాణంలోని మధ్య పొరలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. భారత్‌లో పరిస్థితి ఏమిటి? భారత్‌లో సిలికాన్ వ్యాలీ కేంద్రంగా బెంగళూరును చెప్పుకోవచ్చు. గత మూడు నెలల్లో అతిపెద్ద ఐటీ కంపెనీలు ఏడింటిలో సుమారు ఐదు వేల మందికి ఉద్వాసన పలికారు. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌లో 2022 చివరినాటికి మునుపటి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు (నియామకాల నుంచి లేఆఫ్‌లు తీసేయగా) ఉండగా... టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీల్లో మాత్రం ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఈ ఏడు కంపెనీలు కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు సంపాదించుకుంటున్నాయి. కానీ నైపుణ్యానికి చెల్లిస్తున్న మొత్తాలను నియంత్రించుకుంటూ, లాభాలను గరిష్ఠ స్థాయిలో ఉంచే ప్రయత్నం జరుగుతోంది. కరోనా వచ్చిన తొలి నాళ్లతో పోలిస్తే ఈ వైఖరి పూర్తిగా భిన్నం. అట్రిషన్ నియంత్రణకు, వ్యాపారాన్ని కాపాడుకునేందుకు అప్పట్లో కొత్త ఉద్యోగుల నియామ కాలు ఎడాపెడా జరిగాయి. పోటీ కంపెనీలు ఉద్యోగులను ఎగరేసుకు పోతే కొండంత ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేమన్న ఆలోచనతో అప్పట్లో అలా జరిగింది. నైపుణ్యమున్న ఉద్యోగులకు, ఇండస్ట్రీ అవసరాలకు మధ్య అంతరం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ఈ తేడా ఈ ఏడాది పది శాతం వరకూ ఉంటుందని అంచనా. ఈ ఏడాది రెండో సగంలో ఉద్యో గుల నియామకాలూ పూర్వస్థితికి చేరుకుంటాయని కంపెనీలు ఆశా భావంతో ఉన్నాయి. తేడాకు కారణాలివీ... ఉద్యోగుల నియామకాలు, ఉద్వాసనల విషయంలో అమెరికా, భారతీయ కంపెనీల మధ్య కనిపిస్తున్న స్పష్టమైన తేడాకు కారణా లేమిటో చూద్దాం. కరోనా ప్రపంచాన్ని చుట్టేసిన సందర్భంలో కంపెనీలన్నీ డిజిటల్ మార్గం పట్టే ప్రయత్నం మొదలుపెట్టాయి. క్లౌడ్ సర్వీసులకు ప్రాధాన్యమేర్పడింది. అందివచ్చిన కొత్త అవ కాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రతి కంపెనీ ఆశిం చింది. కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైపోయి... అట్టడుగు వర్గాల నుంచి కూడా టెక్నాలజీ కోసం డిమాండ్ ఏర్పడటంతో కంపెనీలు కూడా తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీ సర్వీసులకు విపరీతమైన డిమాండ్ రావడంతో నియా మకాలు జోరందుకున్నాయి. దీని ఫలితంగా ఆట్రిషన్ సమస్య పుట్టుకురావడం, ఆ క్రమంలోనే ఉద్యోగుల వేతన ఖర్చులు పెర గడం జరిగిపోయింది. రెండేళ్ల తరువాత కోవిడ్ తగ్గుముఖం పట్టడం మొదలైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేశాయి. దీంతో మాంద్యం వచ్చేస్తుందన్న ఆందోళన మొదలైంది. చేతిలో ఉన్న నగదును కాపాడు కునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు టెక్నాలజీ రంగానికి కేటాయించిన నిధులకు కోత పెట్టాయి. ఇదే సమయంలో డిజిటల్ టెక్నాల జీలకు డిమాండ్ కూడా తగ్గిపోవడంతో వీటిని అభివృద్ధి చేసే కంపె నీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిస్థితుల్లో ఒక్క విషయమైతే స్పష్టం. భారతీయ సాఫ్ట్వేర్ దిగ్గజాలు పాశ్చాత్య కంపెనీల మాదిరిగా పూర్తిగా సృజ నాత్మక ఆలోచనలకు బదులు ముందుగానే నిర్ణయించిన పనులు చేయడంలోనే నిమగ్నమయ్యాయి. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా సృష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా, భారతీయ కంపెనీలు చేసే పనుల్లోనే కొత్త కొత్త మార్గాలను అన్వేషించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే– ఒకరు సృజనాత్మక సృష్టి చేసే వారైతే, ఇంకొకరు వాటిని అమలు చేసేవారన్నమాట. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు. ఈ తేడా కారణంగానే భారతీయ కంపెనీల్లో పెద్ద స్థాయిలో లేఆఫ్‌లు లేకుండా పోయాయి. మంచి హోదా, వేతనం కోసం యువత ఇప్పుడు పెద్ద టెక్ కంపెనీ స్టార్టప్‌ల వైపు చూడాలి. ఓ మోస్తరు వేతనంతో స్థిరంగా ఉండాలని అనుకుంటే మాత్రం అమలు చేసేవారి వద్ద పనిచేయడం మేలు. అదన్న మాట అమెరికా, భారత కంపెనీల మధ్య తేడా! వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శృతి యూట్యూబ్ ఛానల్‌కు కోటిమంది సబ్స్క్రైబర్స్
చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే అమ్మాయి... ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టుగా బీటెక్ చదివి, తర్వాత పెళ్లి చేసుకుని భర్తతో అమెరికాలో స్థిరపడింది శృతి అర్జున్ ఆనంద్. యూఎస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తూ.. ఖాళీ సమయంలో తనకు తెలిసిన ఫ్యాషన్ వీడియోలను సరదాగా తీసి ఓ రోజు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలకు మంచి స్పందన లభించడంతో తన ఐటీ జాబ్‌ను వదిలేసి, తనలో దాగున్న నైపుణ్యాలను వెలికితీసి పూర్తిగా యూట్యూబ్ వీడియోలపై దృష్టి పెట్టింది. ఫలితం... పాపులర్ యూ ట్యూబర్‌గా ఎదిగింది. క్రియేటివ్ కంటెంట్, ఫన్నీ వీడియోలు, ఫ్యాషన్ బ్లాగర్‌గా వివిధ రకాల ఛానళ్లు నడుపుతూ సక్సెస్‌పుల్ సోషల్ స్టార్ అనిపించుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శృతి. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక ప్రదేశం ఝాన్సీలో 1985లో పుట్టిన శృతి తన అన్నయ్య అంకూర్ ఆనంద్‌తో అక్కడే పెరిగింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసి, బుందేల్‌ఖండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. తరువాత 2009లో అర్జున్ సాహును వివాహం చేసుకుని భర్తతో అమెరికాలో స్థిరపడింది. వీరికి అనాయ ఆనంద్ అనే పాప ఉంది. అమెరికాలో ఉన్నప్పుడే.. భర్తతో అమెరికా వెళ్లిన శృతి ఓ ఐటీ కంపెనీలో టెక్నికల్ ఇంజినీర్‌గా పనిచే సేది. అయితే ఉద్యోగం దొరకక ముందు శృతి వర్కింగ్ విసా కోసం కొన్ని రోజులు ఎదురు చూసింది. ఈ సమయంలో ఆమె విభిన్న రకాలు గా తన జుట్టును దువ్వుకునేది. ఈ క్రమంలోనే రకరకాల హెయిర్ స్టైల్స్ ప్రయత్నించి వాటన్నింటి వీడియోలు తీసుకునేది. 2010లో ఒకరోజు సరదాగా తన హెయిర్‌స్టైల్స్ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోకు మంచి స్పందన రావడంతో రకరకాల వీడియోలు అప్లోడ్ చేయడమే పనిగా పెట్టుకుంది. శృతి అర్జున్ ఆనంద్ ఛానల్.. అమెరికాలో టెక్నికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నప్పుడు గుర్గావ్లో స్టీరియా ఇండియా లిమిటెడ్‌లో ప్రోగ్రామర్‌గా ఉద్యోగం దొరకడంతో ఇండియా వచ్చి జాబ్‌లో చేరింది. అయితే కుటుంబం మొత్తం నోయిడాలో ఉండడంతో రోజూ అక్కడి నుంచి గుర్గావ్కి వెళ్లాల్సి రావడం, దానికితోడు యూట్యూబ్‌లో వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో.. కొద్దిరోజుల తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని యూట్యూబ్‌కు కేటాయించింది. 2011లో ‘శృతి అర్జున్ ఆనంద్’ పేరిట యూ ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. తొలినాళ్లల్లో శృతికి యూట్యూబ్ ఛానల్ నడపడం కాస్త కష్టంగా ఉండేది. దీంతో తన భర్త అర్జున్ శృతికి సాయం చేసేందుకు ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వచ్చాడు. ఒకపక్క శృతికి వీడియోలు తీయడంలో సాయం చేస్తూనే తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. ఇలా కుటుంబం మొత్తం యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తూ బిజీ అయిపోయారు. చర్మం, జుట్టు సంరక్షణకు వంటింటి చిట్కాలు, మేకప్ మెలకువలు, పట్టణ, గ్రామీణ తల్లులు, కూతుర్ల మధ్య వ్యత్యాసం, పేద, గొప్ప కుటుంబాల కల్చర్‌పై రూపొందించిన ఫన్నీ వీడియోలను శృతి ఎక్కువగా తన ఛానల్లో అప్లోడ్ చేసేది. ఆమె వీడియోలలో ‘మోడ్రన్ మామ్ వర్సెస్ దేశీ మామ్,యూజ్ దీజ్ ట్రిక్స్ టు అప్లై పర్ఫెక్ట్ వింగ్ ఐలైనర్స్ ఆన్ బోత్ ఐస్’ వంటివి బాగా ఆదరణ పొందాయి. ప్రముఖ బ్రాండ్లకు పనిచేయడంతోపాటు, పాపులర్ యూట్యూబర్ ప్రజక్త కోలి వంటి వారితో కలిసి శృతి పనిచేస్తోంది. శృతి అర్జున్ ఆనంద్ డిజిటల్ మీడియా, శృతి మేకప్ అండ్ బ్యూటీ ప్రైవేట్ లిమిటెడ్‌లను సొంతగా నిర్వహిస్తోంది. దీంతో ఆమె 2016లో ఇండియా టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబర్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. శృతి ఛానల్‌కు దాదాపు కోటిమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. -
ఐటీ జాబ్ పోయిందా? మీకో గుడ్‌న్యూస్
ఉద్యోగం కోల్పోయిన టెకీలకు నిజంగా ఇది శుభవార్తే ఐటీ రంగంలోనెలకొన్ని సంక్షోభం, అమెరికా వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్ వేర్ నిపుణుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఇలాంటి వారికోసం బెంగళూరుకుచెందిన సింప్లీలెర్న్ అనే ఆన్లైన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపెనీ ఇలాంటి వారికి ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది. భారతీయ ఐటీ రంగం పలు రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇండస్ట్రీ పలుసార్లు నిరంతరాయంగా ఉద్యోగాల కోత ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, వివిధ సంస్థలచే భారీగా ఉద్యోగాల తొలగింపు నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉద్యోగాలను కోల్పోయిన ఐటి ఉద్యోగులకు సహాయపడటానికి "బౌన్స్ బ్యాక్" స్కాలర్షిప్లను అందిస్తోంది. బాధిత ఐటీ నిపుణులకు సంబంధిత కోర్సులు , శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందించనుంది. తద్వారా తమని తాము రీ స్కిల్ చేసుకునేందుకు సహాయం చేస్తుంది. భారతీయ పౌరులకు మాత్రమే లభించే ఈ స్కాలర్ షిప్ లో ఆధునిక టెక్నాలజీలలో ఉచిత శిక్షణ ఇచ్చి, భవిష్యత్ ఉద్యోగాలు కోసం సిద్ధం చేస్తాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, పెద్ద డేటా మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి కోరిన డొమైన్స్‌లో అత్యుత్తమ కోర్సుల్లో ట్రైనింగ్ ఉచితం అయితే దీనికోసం దరఖాస్తు చేసుకునే నాటి 60 రోజుల లోపు ఉద్యోగాన్ని కోల్పోయిన వారై అయి వుండాలి. అలాగే ఒక అభ్యర్థి ఒక్క కోర్సును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. బౌన్స్ బ్యాక్ స్కాలర్షిప్ పరిధిలో రూ. 8,999 నుండి రూ. 20వేల విలువైన కోర్సులను ఉచితంగా అందించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 31 కి ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఆటోమేషన్, ఆధునిక టెక్నాలజీ తదితర అంశాల కారణంగా సంస్థల వ్యాపారం, ఉద్యోగాల ఎంపిక వ్యూహాలను అనివార్యంగా మార్చుకోవాల్సి వస్తోందని , ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్హులైన అభ్యర్థులను ఆదు కోవడమే తమ లక్ష్యమని సింప్లీలెర్న్ సీఈవో కృష్ణకుమార్ చెప్పారు. -
పూణేలో తెలుగు టెకీ ఆత్మహత్య
పూణే: ఐటీ ఉద్యోగానికి భద్రత లేదంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల టెకీ పూణేలో బలవన్మరణం చెందాడు. బుధవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన గోపికృష్ణ దుర్గాప్రసాద్(25) బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గా ప్రసాద్ గతంలో సాప్ట్వేర్ ఇంజనీరుగా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేశారు. మూడు రోజుల క్రితం పూణే నగరానికి వచ్చి ఓ ఐటీ కంపెనీలో విధుల్లో చేరారు. పూణే నగరంలోని విమాననగర్‌లోని ఓ హోటల్ లో బస చేశారు. బుధవారం రాత్రి ఉద్యోగం గురించి బెంగపడిన దుర్గాప్రసాద్.. ఐటీ ఉద్యోగంలో భద్రత లేదనే ఆవేదనతో చేతి మణికట్టుపై బ్లేడుతో 25 చోట్ల కోసుకున్నాడు. అనంతరం హోటల్ టెర్రస్ మీదకు వెళ్లి భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘ఐటిలో ఉద్యోగ భద్రత లేదు. నేను నా కుటుంబం గురించి చాలా బాధపడుతున్నాను’’ అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని పూణే పోలీసులు చెప్పారు. సాప్ట్వేర్ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పూణేలోని సాప్ట్వేర్ ఇంజనీర్లు ఐటీ కంపెనీల నిర్వాకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు యూనియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దుర్గాప్రసాద్ చాలా మంచి యువకుడని, ఎలాంటి చెడు అలవాట్లు లేని వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువు వెంకటమూర్తి ప్రశ్నించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్నివారి బంధువులకు అప్పగించారు. అంత్యక్రియల కోసం దుర్గాప్రసాద్ మృతదేహాన్ని కృష్ణాజిల్లాకు తరలించారు. -
నాన్నా! డబ్బంటే క్రెడిట్ కార్డు కాదు..
కార్లు, ఫోన్లు ఆస్తులనుకోకు తనయుడికి ఓ తండ్రి సలహా రాజేశ్‌కు ఐటీ ఉద్యోగి. బ్యాంకు ఖాతా తెరవటం ఆలస్యం కావటంతో మొదటి నెల జీతం చెక్కు రూపంలో ఇచ్చింది యాజమాన్యం. ఆ చెక్కు తెచ్చి తండ్రికి చూపించాడు రాజేశ్. అది చూస్తూ... ఆయన రాజేశ్‌కు ఏం చెప్పాడో తెలుసా? బాబూ!! డబ్బంటే ఇదే. నీ దగ్గరున్న క్రెడిట్ కార్డులు కాదు. నీ ఖర్చనేది ఈ డబ్బును బట్టే ఉండాలి తప్ప నీ క్రెడిట్ లిమిట్‌ను బట్టి కాదు. నెల తిరిగేసరికల్లా నువ్వు ఈజీగా ఎంత తిరిగి చెల్లించగలవో... అంత పరిమితినే వాడు. కార్లు, టీవీలు, ఫోన్లు, ఏసీలు వగైరాలన్నీ ఆస్తులేనని అంతా చెబుతుంటారు. అది నిజం కాదు. అవి అప్పులే. కారణమేంటంటే అవి తరిగిపోతుంటాయి. వాటిని ఉపయోగించడానికి కూడా నీకు డబ్బు కావాలి. అలాంటి నకిలీ ఆస్తుల్ని అట్టే పోగేసుకోకు. చేతిలో డబ్బుల్లేవని ఇబ్బంది పడకుండా, నీ డబ్బులెక్కడున్నాయో నీకు తెలిసేలా... ఎప్పుడూ ఇన్వెస్ట్మెంట్లని, బీమాని విడిగా చెయ్యి. ఇన్వెస్ట్మెంట్గా కూడా పనికొచ్చే బీమా పాలసీని కొనకపోవటమే మంచిది. అప్పు చేయటమంటే... నువ్వు భవిష్యత్తులో సంపాదించబోయే డబ్బుని కూడా ఇప్పుడే ఖర్చుచేయటం. అందుకని జాగ్రత్త. నిజంగా అవసరమొచ్చి అప్పు తీసుకోవాలనుకుంటే... తగిన మొత్తాన్ని, తగిన వడ్డీకి మాత్రమే తీసుకో. ఏ పొదుపైనా సరే. త్వరగా ఆరంభించు. దాన్ని మానకుండా కొనసాగించు. షేర్లు, డిపాజిట్లు, ఆస్తులు, బంగారం ఏదైనా సరే... కాలాన్ని బట్టే పెరుగుతాయి. కాలమే ముఖ్యం. పన్ను తగ్గించుకోవటం ముఖ్యమే. అందుకోసమని డబ్బంతా తీసుకెళ్లి రాబడి రానిచోట పెట్టుబడి పెట్టడం సరికాదు. అయినా పన్ను పొదుపు కోసం మార్చి దాకా ఆగొద్దు. ఏప్రిల్‌లోనే మొదలుపెట్టు. జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్... ఇలా ఏది ఎంచుకున్నా సరళంగా ఉండే పాలసీని తీసుకో. సంక్లిష్టంగా పదిరకాలు కలిసి ఉండేవి ఎక్కువ లాభాన్నిస్తాయని అనుకోవద్దు. షేర్లు కొంటావా? అది మార్కెట్ నిపుణులకు వదిలెయ్. కారు డ్రైవింగ్ వచ్చు కాబట్టి రేసుల్లోనూ నడిపేస్తానంటే కుదరదుగా! అందుకని మ్యూచ్‌వల్ ఫండ్స్ లాంటివి ఎంచుకుంటే మంచిది. రంగురంగుల ప్రకటనలు, అందమైన వాగ్దానాలు ఎప్పుడూ నమ్మొద్దు. పర్సనల్ ఫైనాన్స్ మరీ కష్టమైందేమీ కాదు. నువ్వు స్కూల్లో చదివిన మిగతా సబ్జెక్టుల్లాంటిదే. అందుకని డబ్బు ఖర్చు చేసే ముందు... దాన్నెలా ఖర్చు చేయాలో తెలుసుకోవటానికి కొంత సమయం ఖర్చబెట్టు. ఆల్ ది బెస్ట్. చూశారుగా... ఇవి రాజేశ్‌కి వాళ్ల నాన్న చెప్పి ఉండొచ్చు. కానీ మనందరికీ కూడా పనికొచ్చేవే.