ఉద్యోగం కోసం ఏదైనా సంస్థకు దరఖాస్తు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో తిరస్కరిస్తూ ఉంటారు. తగిన అర్హతలు, అనుభవం లేకపోవడం వంటివి సాధారణంగా ఆ కారణాల్లో ఉంటాయి. అయితే తనకు ఎదురైన అసాధారణ అనుభవం గురించి ఓ గూగుల్ టెకీ సోషల్ మీడియాలో షేర్ చేయగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన అనూ శర్మ గతంలో ఓ స్టార్టప్ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా రిజెక్ట్ చేశారు. అయితే ఇందుకు ఆ కంపెనీ చెప్పిన కారణమే విడ్డూరంగా అనిపించింది. "మీ రెజ్యూమ్‌ని సమీక్షించిన తర్వాత, మీ అర్హతలు ఉద్యోగ అవసరాలను మించి ఉన్నట్లు మేము గ్రహించాం. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎక్కువ రోజులు పని చేయలేరని, చేరిన కొద్దిరోజులకే వెళ్లిపోతారని మా అనుభవం సూచిస్తోంది" అంటూ తిరస్కరణకు కారణాన్ని రిజెక్షన్ లెటర్‌లో రిక్రూటర్ వివరించారు.
ఇదీ చదవండి: అమెజాన్ ఉద్యోగులకు కొత్త పాలసీ.. తేల్చిచెప్పేసిన సీఈవో
మంచి అర్హతలు ఉన్నందుకు కూడా తిరస్కరిస్తారని తనకు తెలియదంటూ రిజెక్షన్ లెటర్ స్క్రీన్ షాట్‌ను అనూ శర్మ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. ఇది యూజర్లలో విస్తృత చర్చకు దారితీసింది. తామూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు కామెంట్లు చేశారు. తాను ఉన్నత ర్యాంకింగ్ ఉన్న కాలేజీ నుంచి వచ్చినందుకు రిజెక్ట్ చేశారని ఓ యూజర్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో మంచి అర్హతలను రిక్రూటర్ అభినందించడం మంచి విషయమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
Didn't know you could be rejected for being too good 🥲 pic.twitter.com/mbo5fbqEP3
— Anu Sharma (@O_Anu_O) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment