google employee
-
గూగుల్ టెకీ వింత అనుభవం.. ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా?
ఉద్యోగం కోసం ఏదైనా సంస్థకు దరఖాస్తు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో తిరస్కరిస్తూ ఉంటారు. తగిన అర్హతలు, అనుభవం లేకపోవడం వంటివి సాధారణంగా ఆ కారణాల్లో ఉంటాయి. అయితే తనకు ఎదురైన అసాధారణ అనుభవం గురించి ఓ గూగుల్ టెకీ సోషల్ మీడియాలో షేర్ చేయగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన అనూ శర్మ గతంలో ఓ స్టార్టప్ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా రిజెక్ట్ చేశారు. అయితే ఇందుకు ఆ కంపెనీ చెప్పిన కారణమే విడ్డూరంగా అనిపించింది. "మీ రెజ్యూమ్ని సమీక్షించిన తర్వాత, మీ అర్హతలు ఉద్యోగ అవసరాలను మించి ఉన్నట్లు మేము గ్రహించాం. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎక్కువ రోజులు పని చేయలేరని, చేరిన కొద్దిరోజులకే వెళ్లిపోతారని మా అనుభవం సూచిస్తోంది" అంటూ తిరస్కరణకు కారణాన్ని రిజెక్షన్ లెటర్లో రిక్రూటర్ వివరించారు.ఇదీ చదవండి: అమెజాన్ ఉద్యోగులకు కొత్త పాలసీ.. తేల్చిచెప్పేసిన సీఈవోమంచి అర్హతలు ఉన్నందుకు కూడా తిరస్కరిస్తారని తనకు తెలియదంటూ రిజెక్షన్ లెటర్ స్క్రీన్ షాట్‌ను అనూ శర్మ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. ఇది యూజర్లలో విస్తృత చర్చకు దారితీసింది. తామూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు కామెంట్లు చేశారు. తాను ఉన్నత ర్యాంకింగ్ ఉన్న కాలేజీ నుంచి వచ్చినందుకు రిజెక్ట్ చేశారని ఓ యూజర్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో మంచి అర్హతలను రిక్రూటర్ అభినందించడం మంచి విషయమని మరికొందరు అభిప్రాయపడ్డారు.Didn't know you could be rejected for being too good 🥲 pic.twitter.com/mbo5fbqEP3— Anu Sharma (@O_Anu_O) October 17, 2024 -
ప్రముఖ టెక్ కంపెనీలో తొలగింపులు, బదిలీలు
Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్‌లతో గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్‌లలో గూగుల్ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు. -
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్‌ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్‌లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్‌లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్ ట్రెండ్‌ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
Google software engineer : ఏ డే ఇన్ మై లైఫ్...
గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సలోని రక్హోలియా ‘ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ గూగుల్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం నుంచి గూగుల్ ఆఫీసులోకి అడుగు పెట్టడం, చెక్ అప్డేట్స్, బ్రేక్ ఫాస్ట్, ప్లాన్ ఫర్ ది డే అండ్ వర్క్, గెట్ సమ్ వాటర్ అండ్ స్నాక్స్, కోడ్ అండ్ అటెండింగ్ మీటింగ్స్, కొద్ది సమయం పుస్తకం చదవడం, టేబుల్ టెన్నిస్ ఆడడం, వర్క్ చేస్తూ స్నాక్స్, కాఫీ ఆస్వాదించడం. వర్క్కోడ్, డిజైన్, డిస్కస్, మ్యూజిక్ రూమ్‌లో కొద్దిసేపు గడపడం, జిమ్‌లో కొద్దిసేపు ఎక్సర్సైజ్, కోడింగ్ సెషన్లు, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లడం...ఇలాంటి దృశ్యాలెన్నో ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆఫీస్ జిమ్‌లో క్విక్ వర్కవుట్ సెషన్లాంటి వెల్–టైమ్డ్ బ్రేక్స్‌ను ఈ వీడియో హైలెట్ చేస్తుంది. -
గూగుల్ నాకందుకే ప్రమోషన్ ఇవ్వలేదు: మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు
Google employee: వివక్షపూరితమైన పని సంస్కృతిపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న టెక్ దిగ్గజం గూగుల్‌పై ఒక మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోణలు చేశారు. తన శరీర రంగు తెలుపు అయినందుకే గూగుల్ తనకు ప్రమోషన్ తిరస్కరించినట్లు ఆరోపించారు. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో మూడు సంవత్సరాలు పనిచేసిన షాన్ మాగైర్.. 2019లో ప్రమోషన్ ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి వైదొలిగారు. "తెల్లవాడిగా ఉన్నందుకు నాకు ప్రమోషన్ రాదన్నారు. ఆ కథేంటో పబ్లిక్‌గా చెప్పమంటారా?" అంటూ మాగైర్ గతేడాది డిసెంబర్లో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు. గూగుల్ తన ఏఐ చాట్‌బాట్ జెమిని పనితీరుతో జాతి వివక్ష విమర్శలకు దారితీసిన తర్వాత గూగుల్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి మాగైర్ తాజాగా వివరించారు. తాను తెల్లగా ఉన్నందుకు ప్రమోషన్ నిరాకరించిన కంపెనీగా గూగుల్‌ని మాగ్యురే పేర్కొన్నాడు. తాను అత్యధిక పనితీరు కనబరుస్తున్న వ్యక్తులలో ఒకడిని అయినప్పటికీ తనను ప్రమోట్ చేయలేనని అతని సూపర్వైజర్ చెప్పినట్లు మాగైర్ పేర్కొన్నాడు. ‘నాకు వేరే కోటా ఉంది.. నేను ఈ విషయం నీకు చెప్పనక్కరలేదు. ఇది తెలిస్తే నన్ను తొలగిస్తారు’ అతని బాస్ స్పష్టంగా చెప్పినట్లు వివరించాడు. అయితే ఈ ఆరోపణలను గూగుల్ ప్రతినిధి ఖండించారు. “వ్యవస్థాపకులు, బోర్డు.. సిబ్బంది విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. షాన్ ప్రతిభావంతుడైన ఇన్వెస్టర్. సెక్వోయాలో అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే గూగుల్ అతని ప్రమోషన్, కెరీర్ పురోగతికి సంబంధించిన జాతి లేదా లింగ బేధాలను పరిగణనలోకి తీసుకోలేదు” అని ఆ ప్రతినిధి చెప్పారు. మాగైర్ 2016 నుంచి 2019 మధ్య గూగుల్‌లో పని చేశారు. ప్రస్తుతం ఆయన సెక్వోయా క్యాపిటల్‌లో భాగస్వామిగా ఉన్నారు. -
షాకింగ్ లేఆఫ్.. ఇంతకంటే దారుణమైన తొలగింపు ఉంటుందా?
Google shocking layoff: టెక్ పరిశ్రమలో ఇప్పుడు తొలగింపులు సాధారణంగా మారిపోతున్నాయి. అయితే గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్‌ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గూగుల్ తనను ఎంత దారుణంగా తొలగించిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ముందు యాక్సెస్ పోయింది.. తర్వాత మెసేజ్ జెమిని ఏఐ మోడల్ అల్గారిథమ్‌లపై పని చేసే తనను గూగుల్ తొలగించిన క్రమాన్ని అలెక్స్ కోహెన్ అనే ఉద్యోగి ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో షేర్ చేసిన పోస్ట్‌లో వివరించారు. "గూగుల్ నన్ను ఈ రోజు తొలగించిందని పంచుకోవడం విచారంగా ఉంది. జెమిని కోసం అల్గారిథమ్‌ల రూపకల్పనకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న నాకు ఈరోజు ఉన్నట్టుండి హ్యాంగ్అవుట్స్, గూగుల్ డ్రైవ్‌కు యాక్సెస్ పోయింది. ఆ తర్వాత నన్ను తొలగించినట్లు మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది" అని అలెక్స్ కోహెన్ వాపోయాడు. అయితే తాను 12 నెలల తొలగింపు పరిహారాన్ని (సుమారు రూ.22 కోట్లు ) అందుకుంటున్నానని, ఇది చేతికందిన తర్వాత తాను తదుపరి ఏమి చేయాలో నిర్ణయించుకుంటానని అలెక్స్ కోహెన్ తెలియజేశారు. అయితే గత 5 నెలల్లో ఎల్ఎల్ఎంల గురించి, ఏఐ గురించి ఎంతో నేర్చుకున్నానని, ఆ ప్రయాణం బాగుందని రాసుకొచ్చారు. కాగా ఇంతకుముందు గూగుల్ ఒకప్పుడు ఏఐ విభాగంతో ప్రత్యక్ష ప్రమేయం లేని 'సెర్చ్ టీమ్'లో భాగమైన ఒక ఉద్యోగికి జీతంలో 300 శాతం పెంపును అందించిందని పర్ప్లెక్సిటీ ఏఐ సీఈవో అరవింద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ "కఠినమైన ఎంపికలు" చేయాల్సిన అవసరం ఉన్నందున మరిన్ని ఉద్యోగాల కోతలు ఉంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. Sad to share that I was laid off from Google today. I was in charge of making the algorithms for Gemini as woke as possible. After complaints on Twitter surfaced today, I suddenly lost access to Hangouts and Google Drive, and my manager (he/him), texted me to let me know that i… — Alex Cohen (@anothercohen) February 22, 2024 -
సుందర్ పిచాయ్‌పై గూగుల్ మాజీ ఉద్యోగి ఘాటు వ్యాఖ్యలు
గూగుల్ మాజీ ఉద్యోగి ఒకరు అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఘాటు విమర్శలు చేయడం చర్చకు తెరతీసింది.. దార్శనిక నాయకత్వం లేకపోవడమే కంపెనీ క్షీణతకు దారి తీసిందని విమర్శించారు. విజనరీ లేని లీడర్షిప్, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ అంటూ సుందర్ పిచాయ్‌పై అసంతప్తి వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బంది మధ్య పారదర్శకతను గూగుల్ నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకపుడు సంస్థ కోసం, వినియోగదారుల ప్రయోజనాలకు తీసుకునే నిర్ణయాల కాస్త ఇపుడు ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో వారి ప్రయోజనాలుగా మారిపోయాయంటూ ధ్వజమెత్తారు. గూగుల్ పాతికేళ్ల ప్రస్థానంలో 18 ఏళ్లు పనిచేసిన తాను ఈ నెలలో కంపనీకి రాజీనామా చేసినట్టు ఇయాన్ హిక్సన్ ప్రకటించారు. ఈ సందర్భంగా తన బ్లాగ్‌పోస్ట్‌లో సుందర్ పిచాయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంస్థలో భారీగా ఉద్యోగులు తొలగింపు, నైతిక ప్రమాణాలు, కల్చర్ లాంటి అంశాలను తన పోస్ట్‌లో ప్రస్తావించారు. విజనరీ లేని పిచాయ్ నాయకత్వంలో గూగుల్ సంస్కృతి క్షీణించి పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో చేరిన తొలి రోజులు బావుండేవని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని పేర్కొన్నారు. సంస్థలో కీలక ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బందితో నిజాయితీగా, పారదర్శకంగా ఉండేవారు. ప్రతిష్టాత్మక ప్రయోగాలకు ప్రోత్సాహమిచ్చేవాంటూ రాసుకొచ్చారు. తొలి తొమ్మిదేళ్లు Googleలో HTMLలోనూ, చివరి తొమ్మిదేళ్లు గూగుల్‌లో యాప్‌లను అభివృద్ధి చేసే ప్లాట్‌ఫారమ్ ఫ్లట్టర్లో పని చేశానంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కానీ ఇపుడు గూగుల్‌లో కంపెనీ విజన్ ఏమిటో వివరించే చెప్పగలిగే వాళ్లెవరైనా ఉన్నారా అనే సందేహాన్ని కూడా ఆయన వెలిబుచ్చారు. నైతికత అంతంత మాత్రంగానే ఉందన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని థెరపిస్ట్‌లతో మాట్లాడితే, వారు తమ Google క్లయిట్లందరూ అసంతృప్తిగా ఉన్నారనే విషయం అర్థమవుందని రాసుకొచ్చారు. ఈ సమస్యంతా పిచాయ్ విజనరీ లేని లీడర్షిప్ కారణంగానే ఉత్పన్నమైందనీ, అసలు ఆయనకు ప్రారంభ గూగుల్ ప్రమాణాలను పాటించడంపై ఏ మాత్రం ఆసక్తి లేదంటూ ధ్వజమెత్తారు. ఇది అసమర్థమైన మిడిల్ మేనేజ్మెంట్ వ్యాప్తికి దారితీసిందన్నారు. ఈ సందర్భంగా ఫ్లట్టర్, డార్ట్, ఫైర్‌బేస్ వంటి ప్రాజెక్టులను కవర్ చేసే విభాగాన్ని నిర్వహిస్తున్న జీనైన్ బ్యాంక్స్‌పై మండిపడ్డారు. అయినా కంపెనీ వృద్ధిపై ఆశాభావాన్ని వ్యక్తం చేసిన హిక్సన్, నాయకత్వ స్థాయిలో కొంత 'షేక్-అప్' అవసరమని సూచించారు. దీర్ఘకాలిక, స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారాన్ని అప్పగిస్తే, కంపెనీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుదని వ్యాఖ్యానించారు. అయితే హిక్సన్ వ్యాఖ్యలపై గూగుల్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయ లేదు. -
35 ఏళ్లలోపు రిటైర్.. చేతిలో రూ. 41 కోట్లు.. ఈ గూగుల్ ఉద్యోగి ప్లాన్ తెలిస్తే..!
Google employee plan: సాధారణంగా యువత ఆలోచనలు ఇలా ఉంటాయి.. మంచి కంపెనీలో జాబ్ చేయాలి.. వృద్ధాప్యం వరకూ ఉద్యోగం చేసి బాగా సంపాదించాలి.. కుటుంబాలను సెటిల్ చేసి ఏ 60 ఏళ్లకో రిటైర్ కావాలి అనుకుంటారు. కానీ ఆ యువకుడు మాత్రం 35 ఏళ్లకే రిటైర్ కావాలనుకుంటున్నాడు. అతని ప్లానింగ్ తెలిస్తే అదిరిపోతారు. గూగుల్ (Google)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల ఇతాన్ నున్లీ (Ethan Nguonly).. వీలైనంత తొందరంగా అంటే 35 ఏళ్లలోపే రిటైర్ కావాలనుకుంటున్నాడు. ఆ లోపు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 41 కోట్లు) సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎన్‌బీసీ నివేదించింది. ఇదీ చదవండి: వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు! ఆర్థిక భద్రత వైపు నున్లీ ప్రయాణం చిన్నతనం నుంచే ప్రారంభమైంది. తీర ప్రాంతంలో పెరిగిన నున్లీకి పెట్టుబడి ఆవశ్యకతను తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుండేవారు. పొదుపు ఖాతాలో డబ్బు దాచుకోవడం కంటే పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్పేవారు. చిన్నతనం నుంచే ఆర్థిక పాఠాలు నేర్పించడంతో అతని ఆర్థిక దృక్పథాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. రెండేళ్లలోనే ఉన్నత విద్యాభ్యాసం ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనే నున్లీ దృఢ సంకల్పం కేవలం రెండేళ్లలోనే బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తన కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసేలా చేసింది. అదే సమయంలో అతను పూర్తి సమయం ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఇన్ఫర్మేషన్, డేటా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు. గూగుల్‌లో పని చేయాలనే నున్లీ ఆకాంక్ష 2021 డిసెంబర్లో నిజమైంది. ఈ టెక్ దిగ్గజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. బోనస్‌లు, స్టాక్ యూనిట్లతో కలిపుకొని నున్లీ మొత్తం వార్షిక ఆదాయం సుమారు 1,94,000 డాలర్లు (దాదాపు రూ. 1.60 కోట్లు). విస్తృతంగా పెట్టుబడులు చిన్న వయసులోనే రిటైర్ కావాలన్న తన ఆశయం కోసం నున్లీ శ్రద్ధగా పెట్టుబడి పెడుతున్నాడు. వివిధ రిటైర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లలో దాదాపు 1,35,000 డాలర్లు (దాదాపు రూ. 1.11 కోట్లు) ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాడు. తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో ఆస్తులను సంపాదించి రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టాడు. బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులతో కలిసి జీవించిన నున్లీ క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నియమావళికి కట్టుబడి 60,000 డాలర్లను పొదుపు చేయగలిగాడు.ఈ ఆర్థిక క్రమశిక్షణ ఫ్లోరిడాలోని రివర్‌వ్యూలో అతని మొదటి పెట్టుబడి ఆస్తిని పొందేందుకు దోహదపడింది. రాష్ట్రం వెలుపల రెంటల్ ప్రాపర్టీలను నిర్వహించడంలో సవాళ్లు ఎదురైనప్పటికీ, నున్లీ అంకితభావం ఫలించింది. తద్వారా అతను రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరపడేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత నున్లీ కాలిఫోర్నియాలోని లా పాల్మాలో మొదటి ఇంటిని కొన్నాడు. నున్లీ ఆర్థిక ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడుల కోసమే కేటాయించాడు. ఇలా ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో అధిక పెట్టుబడుల సంకల్పం సవాలుగా మారినప్పటికీ, నున్లీ తన టేక్-హోమ్ పేలో 35 శాతాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎదురుదెబ్బలే పాఠాలు పెట్టుబడులతో దూసుకెళ్తున్న నున్లీకి ఎదురుదెబ్బలూ తగిలాయి. 2021లో క్రిప్టోకరెన్సీలో మార్జిన్లో భారీగా పెట్టుబడి పెట్టినప్పుడు సుమారు 80,000 డాలర్లు నష్టపోయాడు. అయితే ఈ అనుభవం ఒక విలువైన పాఠంగా పనిచేసింది. దీర్ఘకాలిక పెట్టుబడులపై, ప్రత్యేకించి ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్లపై మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని అనుసరించేలా ప్రేరేపించింది. -
Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్ ఉద్యోగిని ఆవేదన!
టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా తొలగించిన వారిలో కింది స్థాయి ఉద్యోగి నుంచి మేనేజర్ స్థాయి వరకు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. ఇటీవల తొలగింపునకు గురైన ఓ ఉద్యోగిని తన ఆవేదనను లింక్డ్ఇన్లో రాసుకొచ్చారు. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఆకృతి వాలియా.. గూగుల్ క్లౌడ్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఈ మధ్యనే ఆమె సంస్థలో ఐదో వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు. గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్స్‌లో ఆమె కూడా ఉద్యోగం కోల్పోయారు. తాను ఇంకో పది నిమిషాల్లో మీటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా తన కంప్యూటర్లో ‘యాక్సిస్ డినైడ్’ అని కనిపించడంతో ఆమె నిర్ఘాంతపోయారు. మొదట్లో నమ్మలేకపోయిన ఆమె తర్వాత విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గూగుల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో ఉద్యోగం తన కలలన్నింటినీ సాకారం చేసిందని, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి కంపెనీ తనకు సహాయపడిందని వివరించారు. (ఇదీ చదవండి: సూపర్ ఉంది కార్! విడుదలకు ముందే రోడ్డెక్కిన కియా ఈవీ9) అయితే తాను ఉద్యోగాన్ని కోల్పోవడాన్ని తన ఆరేళ్ల కూతురుకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను దీని బయట పడి ముందుకు వెళ్లగలను. అయితే ప్రస్తుతం అమ్మా నువ్వు ఎందుకు వర్క్ చేయడం లేదని నా చిన్నారి పాప అడిగితే వివరించడం చాలా నాకు చాలా కష్టతరమైనది’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. -
గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన గూగుల్ ఉద్యోగి
గర్ల్‌ఫ్రెండ్‌ను బయటికి తీసుకెళ్లినప్పుడు, పరువు పోకుండా ఖర్చులన్నీ తామే పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు చాలామంది అబ్బాయిలు. ఈ కోవలోనే ఆలోచించాడు ఓ గూగుల్ ఉద్యోగి. కానీ తన జేబులో డబ్బులు లేకపోవడంతో, ఏం చేయాలో తెలియక దొంగతనానికి పాల్పడ్డాడు. గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం దొంగగా మారిని ఈ గూగుల్ ఉద్యోగి చిట్టచివరికి కటకటాల పాలయ్యాడు. గర్విత్ సాహ్ని అనే 24 ఏళ్ల ఇంజనీర్. అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్ దిగ్గజం గూగుల్‌లో పనిచేస్తున్నాడు. ఇతను హర్యానా అంబాలా జిల్లాకు చెందిన వాడు. సెప్టెంబర్ 11న ఐబీఎం మల్టినేషనల్ టెక్నాలజీ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ అనంతరం తాజ్ ప్యాలెస్‌లో మీడియాతో సమావేశమైంది. ఆ కాన్ఫరెన్స్ సందర్భంగా దివ్యాని జైన్ అనే ఉద్యోగిని హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి రూ.10వేల దొంగలించబడ్డాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, హోటల్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. ఆ కెమెరా ఫుటేజీల్లో, నిందితుడు క్యాబ్‌లో హోటల్ రూమ్‌కు వచ్చినట్టు తెలిసింది. దాని నెంబర్ ద్వారా క్యాబ్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను, మొబైల్ నెంబర్‌ను గుర్తించారు. అయితే నిందితుడు అప్పటికే తన మొబైల్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. కానీ పోలీసులు అతని కొత్త మొబైల్ నెంబర్‌ను కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత అతని ఇంట్లోనే గర్విత్ సాహ్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ సందర్భంగా ఆర్థికంగా తాను చాలా నష్టాల్లో ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం మనీ కూడా లేవని సాహ్ని చెప్పాడు. అతని నుంచి రూ.3000ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. -
గర్ల్‌ఫ్రెండ్ కోసం గూగుల్ ఉద్యోగి..
సాక్షి, న్యూఢిల్లీ : గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం సెర్చ్ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో ఇంజనీర్‌గా పనిచేసే గర్విత్ సాహ్ని అనే యువకుడు చోరీకి పాల్పడ్డాడు. హర్యానాలోని అంబాలా జిల్లాకు చెందిన సాహ్ని గత నెల 11న ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌లో ఐబీఎం నిర్వహించిన ఓ సెమినార్లో పాల్గొన్నాడు. ఈ సమావేశానికి హాజరైన దేవయాని జైన్ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ10,000లు గల్లంతయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, ఆహ్వానితుల జాబితా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు క్యాబ్‌లో వచ్చినట్టు హోటల్ బయట ఏర్పాటైన కెమెరాల్లో రికార్డైంది. క్యాబ్ రిజిస్ర్టేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ల ద్వారా క్యాబ్‌ను ఎవరు బుక్ చేశారనేది పోలీసులు ఆరా తీశారు. నిందితుడు ఫోన్ స్విచాఫ్ చేయగా, కొత్త మొబైల్ నెంబర్‌ను గుర్తించిన పోలీసులు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో గర్ల్‌ఫ్రెండ్ ఖర్చులు భరించేందుకే తాను దొంగతనానికి పాల్పడ్డానని పోలీసుల విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. చోరీ సొమ్ములో రూ 3000ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
గూగుల్ ఉద్యోగిపై దాడి: డబ్బు దోపిడీ
హైదరాబాద్: ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న గూగుల్ సంస్థ ఉద్యోగిపై ఐదుగురు దొంగలు దాడి చేసి డబ్బు దోచుకున్నారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... శ్రీనగర్‌కాలనీలో నివసించే వినయ్‌భాస్కర్ గూగుల్ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వినయ్‌భాస్కర్ తన సోదరుడు సుధాకర్‌తో కలిసి ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. ఫిలింనగర్ నోవా ఆసుపత్రి వద్ద ఐదుగురు దుండగులు వారిని ఆపారు. ఇద్దరిపై దాడి చేసి జేబులో ఉన్న డబ్బు లాక్కొన్నారు. తన వద్ద వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయని వినయ్‌భాస్కర్ చెప్పగా... ఇంతే ఉన్నాయా? అంటూ ఆయనపై దాడి చేశారు. తీవ్రగాయాలకు గురైన వినయ్‌భాస్కర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.