సుందర్‌ పిచాయ్‌పై గూగుల్‌ మాజీ ఉద్యోగి ఘాటు వ్యాఖ్యలు | ex google employee slams CEO Sundar Picha iLacks visionary leadership | Sakshi
Sakshi News home page

సుందర్‌ పిచాయ్‌పై గూగుల్‌ మాజీ ఉద్యోగి ఘాటు వ్యాఖ్యలు

Published Sat, Nov 25 2023 1:39 PM | Last Updated on Sat, Nov 25 2023 1:47 PM

ex google employee slams CEO Sundar Picha iLacks visionary leadership - Sakshi

గూగుల్‌ మాజీ ఉద్యోగి ఒకరు అల్పాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై ఘాటు విమర్శలు చేయడం  చర్చకు తెరతీసింది.. దార్శనిక నాయకత్వం లేకపోవడమే కంపెనీ క్షీణతకు దారి తీసిందని విమర్శించారు. విజనరీ  లేని లీడర్‌షిప్‌, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ అంటూ సుందర్‌ పిచాయ్‌పై అసంతప్తి వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌లు  సిబ్బంది మధ్య పారదర్శకతను గూగుల్ నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు.  ఒకపుడు సంస్థ కోసం, వినియోగదారుల ప్రయోజనాలకు తీసుకునే నిర్ణయాల కాస్త ఇపుడు ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో వారి ప్రయోజనాలుగా మారిపోయాయంటూ ధ్వజమెత్తారు. 

గూగుల్‌ పాతికేళ్ల ప్రస్థానంలో 18 ఏళ్లు పనిచేసిన తాను ఈ నెలలో కంపనీకి రాజీనామా చేసినట్టు  ఇయాన్‌ హిక్సన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా తన బ్లాగ్‌పోస్ట్‌లో సుందర్‌ పిచాయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.  సంస్థలో భారీగా ఉద్యోగులు తొలగింపు,  నైతిక ప్రమాణాలు,  కల్చర్‌ లాంటి అంశాలను తన  పోస్ట్‌లో ప్రస్తావించారు.  విజనరీ లేని పిచాయ్‌ నాయకత్వంలో గూగుల్‌ సంస్కృతి క్షీణించి  పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు  చేశారు.

కంపెనీలో చేరిన తొలి రోజులు బావుండేవని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని పేర్కొన్నారు. సంస్థలో కీలక ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బందితో నిజాయితీగా, పారదర్శకంగా ఉండేవారు.  ప్రతిష్టాత్మక ప్రయోగాలకు  ప్రోత్సాహమిచ్చేవాంటూ రాసుకొచ్చారు. తొలి తొమ్మిదేళ్లు Googleలో HTMLలోనూ, చివరి  తొమ్మిదేళ్లు గూగుల్‌లో యాప్‌లను అభివృద్ధి చేసే ప్లాట్‌ఫారమ్  ఫ్లట్టర్‌లో పని చేశానంటూ  జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

కానీ ఇపుడు గూగుల్‌లో కంపెనీ విజన్ ఏమిటో వివరించే  చెప్పగలిగే వాళ్లెవరైనా ఉన్నారా అనే సందేహాన్ని కూడా ఆయన వెలిబుచ్చారు. నైతికత అంతంత మాత్రంగానే ఉందన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని థెరపిస్ట్‌లతో మాట్లాడితే, వారు తమ Google క్లయిట్లందరూ అసంతృప్తిగా ఉన్నారనే విషయం అర్థమవుందని రాసుకొచ్చారు. ఈ సమస్యంతా పిచాయ్‌ విజనరీ లేని లీడర్‌షిప్‌ కారణంగానే ఉత్పన్నమైందనీ, అసలు ఆయనకు  ప్రారంభ  గూగుల్‌ ప్రమాణాలను పాటించడంపై ఏ మాత్రం ఆసక్తి లేదంటూ ధ్వజమెత్తారు. ఇది అసమర్థమైన మిడిల్ మేనేజ్‌మెంట్  వ్యాప్తికి  దారితీసిందన్నారు.  ఈ సందర్భంగా ఫ్లట్టర్, డార్ట్, ఫైర్‌బేస్ వంటి ప్రాజెక్టులను కవర్ చేసే విభాగాన్ని నిర్వహిస్తున్న జీనైన్ బ్యాంక్స్‌పై  మండిపడ్డారు.

అయినా  కంపెనీ వృద్ధిపై ఆశాభావాన్ని వ్యక్తం చేసిన హిక్సన్‌, నాయకత్వ స్థాయిలో కొంత 'షేక్-అప్' అవసరమని సూచించారు. దీర్ఘకాలిక, స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారాన్ని అప్పగిస్తే, కంపెనీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుదని వ్యాఖ్యానించారు. అయితే  హిక్సన్‌  వ్యాఖ్యలపై గూగుల్‌  ఇంకా  ఎలాంటి వ్యాఖ్యలు చేయ లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement